
ప్రేమకు వయసుతో పని లేదని నిరూపించాడు బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ (Aamir Khan). 60 ఏళ్ల వయసులో తాను డేటింగ్‌లో ఉన్నానని నిర్మొహమాటంగా మీడియాకు వెల్లడించాడు. గౌరీ స్ప్రాట్ (Gauri Spratt)తో ప్రేమలో ఏడాదికాలంగా ప్రేమలో ఉన్నానని తన బర్త్ సందర్భంగా వెల్లడించాడు. ఆమె కోసం ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీని కూడా నియమించి తనపై ప్రేమను చాటుకున్నాడు.
వైరల్‌గా మారిన వీడియో
అయితే ఆమిర్‌కు గతంలో రెండు పెళ్లిళ్లయిన విషయం తెలిసిందే! రీనా దత్తా (Reena Dutta), కిరణ్ రావు (Kiran Rao)లను పెళ్లి చేసుకోగా ఇద్దరికీ విడాకులిచ్చేశాడు. అలా అని వారితో శత్రుత్వమేమీ పెంచుకోలేదు. భార్యాభర్తలుగా విడిపోయినా స్నేహితుల్లా మాత్రం ఇప్పటికీ ఒకరికొకరు తోడుగా ఉంటారు. ఫిబ్రవరి నెలలో మాజీ భార్యలతో ఆమిర్ ఓ ఫంక్షన్‌కు వెళ్లాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
అందరూ ఒకేచోట..
క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) - సఫా మీర్జాల 9వ పెళ్లి రోజుకు ఆమిర్ వెళ్లి సర్‌ప్రైజ్ ఇచ్చాడు. మాజీ భార్యలతో పాటు ప్రేయసి గౌరీని కూడా తీసుకెళ్లాడు. ఈ వీడియోను ఇర్ఫాన్ తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అందులో ఆమిర్ మాజీ భార్యలు, ప్రియురాలు ఒకేచోట సంతోషంగా నవ్వుతూ కనిపించారు. ఇంత మోడ్రన్ ఫ్యామిలీని ఎక్కడా చూడలేదంటున్నారు నెటిజన్లు.
సినిమా
ఆమిర్ ఖాన్ విషయానికి వస్తే.. ప్రస్తుతం సితారే జమీన్ పర్ మూవీ చేస్తున్నాడు. ఇది 2007లో వచ్చిన తారే జమీన్ పర్ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. అలాగే తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారత్ సినిమాలో కూడా భాగం కానున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment