
గతేడాది విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన చిన్న సినిమా లపతా లేడీస్. అమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ పలు అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటింది. అంతేకాకుండా భారత్ నుంచి ఆస్కార్ ఎంట్రీ దక్కించుకుంది. కానీ నామినేషన్స్‌లో మాత్రం చోటు దక్కించుకోలేకపోయింది.
అయితే తాజాగా ఈ సినిమాపై నెట్టింట విమర్శలు వస్తున్నాయి. ఈ సినిమాను 2019లో వచ్చిన అరబిక్ చిత్రం నుంచి కాపీ కొట్టారని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. 2019 అరబిక్ చిత్రం బుర్ఖా సిటీ షార్ట్ ఫిల్మ్ కాన్సెప్ట్‌ను కాపీ చేశారని నెట్టింట ఆరోపిస్తున్నారు. ఆ సినిమాలోని ఓ సీన్.. లపతా లేడీస్‌లోని పోలీస్ స్టేషన్ సన్నివేశం ఓకేలాగా ఉన్నాయని ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అయితే గతంలోనూ లపతా లేడీస్‌పై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. తాను తొలిసారిగా దర్శకత్వం వహించిన ఘున్‌ఘట్ కే పాట్ ఖోల్ (1999)మూవీతో లపతా లేడీస్‌కు పోలికలు ఉన్నాయని అనంత్ మహదేవన్ ఆరోపించారు. రైల్వే స్టేషన్‌లో వధువులు మారిపోవడం సీన్‌ను తన చిత్రంలో నుంచి కాపీ కొట్టారని అన్నారు.
కాగా.. లపతా లేడీస్ చిత్రాన్ని జియో స్టూడియోస్ బ్యానర్‌లో తెరకెక్కించారు. అమీర్ ఖాన్ లగాన్ (2001)చిత్రానికి సహాయ దర్శకురాలిగా పనిచేసిన కిరణ్ రావు తన కెరీర్ దర్శకత్వం వహించిన రెండో చిత్రం కావడం విశేషం. 2011లో తన ధోబీ ఘాట్ అనే సినిమాతో దర్శకురాలిగా ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రంలో నితాన్షి గోయెల్, ప్రతిభా రంతా, రవి కిషన్, స్పర్ష్ శ్రీవాస్తవ, ఛాయా కదమ్ కీలక పాత్రల్లో నటించారు. మార్చి 1, 2024న థియేటర్లలో విడుదలైన లపతా లేడీస్.. 2001లో ఓ రైలు ప్రయాణంలో అనుకోకుండా మారిన ఇద్దరు వధువుల కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రాన్ని అమీర్ ఖాన్ నిర్మించారు.
It’s intriguing that Lapata Ladies has drawn comparisons to Burqa City given the striking similarities in themes and narrative structure. If Rao’s film indeed mirrors key aspects of Burqa City, it raises valid questions about originality and the fine line between inspiration and…
— Sumit Arora (@kingsumitarora) April 1, 2025