కరోనా సమయంలో జనజీవనం స్తంభించిపోయింది. ఎంతోమంది బతుకులు ఆగమయ్యాయి. ఉద్యోగాలు ఊడిపోయాయి. రేపనేది ఉంటుందా? లేదా? అన్న సందిగ్ధం.. అంతటా విషాదం.. ఆ పరిస్థితుల్లో తనకు సినిమాలు మానేయాలన్న ఆలోచన వచ్చిందంటున్నాడు బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్.
కరోనా సమయంలో..
అతడి మాజీ భార్య కిరణ్ రావు తెరకెక్కించిన లాపతా లేడీస్ ఆస్కార్ కోసం ‘బెస్ట్ ఫారిన్ ఫిల్మ్’ కేటగిరీలో మన దేశం నుంచి అఫిషియల్ ఎంట్రీగా వెళ్లనుంది. లాపతా లేడీస్‌ను లాస్ట్ లేడీస్‌గా మార్చేసి.. అమెరికాలో ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంలో ఆమిర్ ఖాన్ తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడాడు. 'కరోనా సమయంలో పని లేక ఇంట్లోనే కుటుంబసభ్యులతో ఎక్కువ సమయం గడిపాను.
భావోద్వేగానికి లోనయ్యా..
ఇంతకాలం బిజీగా ఉండి రిలేషన్‌షిప్స్‌కు సరైన సమయం కేటాయించలేదేమో అనిపించింది. ఒకరకంగా చెప్పాలంటే చాలా బాధపడ్డాను, భావోద్వేగానికి గురయ్యాను. ఇక సినిమాలు ఆపేద్దామనుకున్నాను. అప్పుడు కిరణ్.. మరోసారి ఆలోచించుకోమని చెప్పింది. సినిమాలు లేకుండా నేను ఉండలేననే విషయాన్ని అర్థమయ్యేలా చెప్పింది. దీంతో తిరిగి సినిమాల్లో నటించడానికి సిద్ధమయ్యా' అని ఆమిర్ చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment