![Kiran Rao Funday with Ex Husband Aamir Khan and Son Azad](/styles/webp/s3/article_images/2024/07/1/aamir%3Dkiran.jpg.webp?itok=ob-gZR1S)
భార్యాభర్తలు విడాకులు తీసుకున్నాక ఒకరి ముఖం మరొకరు చూడటానికే ఇష్టపడరు. అలాంటిది సన్నిహితంగా మెదులుతారా? సమస్యే లేదు! కానీ బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్, దర్శకురాలు కిరణ్‌రావు మాత్రం విడిపోయినా సరే దంపతుల్లా కలిసి షికార్లకు, హాలీడే ట్రిప్పులకు వెళ్తున్నారు. వీళ్లను చూసిన వారెవరూ డివోర్స్‌డ్ కపుల్ అనుకోనే అనుకోరు.
![](/sites/default/files/inline-images/kiran-rao.jpg)
వీరిద్దరూ తమ కుమారుడు ఆజాద్‌తో కలిసి జూన్ 30న బయటకు వెళ్లారు. సండేను ఫండేగా ఎంజాయ్ చేసిన వీళ్లు రావ్- ఖాన్ హాలీడే అని రాసుకొచ్చారు. ఫ్రెండ్స్‌తో కలిసి ఓ ఫోటోల కూడా దిగారు. ఇకపోతే ఆమిర్ ఖాన్ ఇటీవలే తన తల్లి జీనత్ హుస్సేన్ 90వ బర్త్‌డే గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశాడు.
ఈ పుట్టినరోజు వేడుకలు స్పెషల్‌గా ఉండాలని బంధువులు, జీనత్ స్నేహితుల ఇంటికి వెళ్లి మరీ సెలబ్రేషన్స్‌కు ఆహ్వానించాడు. అలా జీనత్ బర్త్‌డే కాస్తా ఆత్మీయ సమ్మేళనంగా మారింది. ఈ వేడుకల్లో ఆమిర్ ఇద్దరు మాజీ భార్యలు కిరణ్ రావు, రీనా దత్తా కూడా ఉన్నారు.
చదవండి: ఈ కుర్రాడ్ని గుర్తుపట్టారా? ప్రముఖ నిర్మాత అల్లుడు, టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్
Comments
Please login to add a commentAdd a comment