ఈ కుర్రాడ్ని గుర్తుపట్టారా? ప్రముఖ నిర్మాత అల్లుడు, టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్! Kalki 2898 AD Director Nag Ashwin Rare Old Photo With Vijay Devarakonda | Sakshi
Sakshi News home page

Guess The Person: మూడో సినిమాకే పాన్ ఇండియా రికార్డులు.. ఇప్పుడిలా అప్పుడలా

Published Mon, Jul 1 2024 2:31 PM | Last Updated on Mon, Jul 1 2024 5:33 PM

Kalki 2898 AD Director Nag Ashwin Rare Old Photo With Vijay Devarakonda

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త టాలెంట్ వస్తూనే ఉంటుంది. కొత్త ఆలోచనలతో సరికొత్త మూవీస్ చేస్తూ అబ్బురపరుస్తుంటారు. అలా కొన్నేళ్ల క్రితం వచ్చిన ఓ కుర్రాడు జస్ట్ రెండే సినిమాలతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. లేటెస్ట్‌గా ఇతడి పేరు మరోసారి మార్మోగిపోతోంది. మరి హింట్స్ ఇచ్చాం కదా ఈ కుర్రాడెవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?

పైన ఫొటోలో ముగ్గురు కుర్రాళ్లున్నారు. వీళ్లలో ఓవైపు చివరలో ఉంది విజయ్ దేవరకొండ అని తెలుస్తోంది. మరో చివర ఉన్నది ఎవరంటే టక్కున చెప్పడం కష్టం. అతడి పేరు నాగ్ అశ్విన్. తాజాగా థియేటర్లలో సెన్సేషన్ సృష్టిస్తున్న 'కల్కి' మూవీ తీసింది ఇతడే. డాక్టర్స్ ఫ్యామిలీలో పుట్టిన ఇతడు.. రకరకాల ఉద్యోగాలు చేశాడు. కానీ ఓ షార్ట్ ఫిల్మ్ మాత్రం ఇతడి కెరీర్‌తో పాటు జీవితాన్నే మార్చేసింది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 24 మూవీస్.. ఆ నాలుగు స్పెషల్)

నాగ్ అశ్విన్ డైరెక్టర్ కాకముందు ఓ షార్ట్ ఫిల్మ్ తీశాడు. ఇది చూసిన నిర్మాత అశ్వనీదత్ కుమార్తెలు. పిలిచి సినిమా ఛాన్స్ ఇచ్చారు. తొలుత ఒకటి అనుకున్నారు. కానీ చివరకొచ్చేసరికి 'ఎవడే సుబ్రహ్మణ్యం' బయటకొచ్చింది. ఈ మూవీతోనే విజయ్ దేవరకొండ నటుడిగా పూర్తిస్థాయిలో పరిచయమయ్యాడు. దీని తర్వాత 'మహానటి'తో సావిత్రి జీవితాన్ని తెరపై ఆవిష్కరించి నాగ్ అద్భుతం చేశాడు.

ఇక తనతో సినిమా తీసిన ప్రియాంక దత్‌నే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అలా నిర్మాత అశ్వనీదత్‌కి నాగ్ అశ్విన్ అల్లుడైపోయాడు. వీళ్ల కాంబినేషన్‌లోనే ఈ మధ్య వచ్చిన 'కల్కి' మూవీ ఎలాంటి అద్భుతాలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాగ్ అశ్విన్ పాన్ ఇండియా సెన్సేషన్ అయిపోయాడు. తాజాగా ఇతడి పాత ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది చూసి తొలుత గుర్తుపట్టలేకపోయారు. ఎందుకంటే అంత డిఫరెంట్‌గా ఉన్నాడు మరి!

(ఇదీ చదవండి: రొమాన్స్ అంటే మీరనుకునేది కాదు: మృణాల్ ఠాకుర్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement