Irfan Pathan
-
రోహిత్, కోహ్లి పరుగుల వరద పారించడం ఖాయం: ఇర్ఫాన్ పఠాన్
టీమిండియా స్టార్లు రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లి(Virat Kohli)ని ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెస్టుల్లో విఫలమైనా ఈ దిగ్గజ బ్యాటర్లు వన్డే ఫార్మాట్లో(ODI Format) సత్తా చాటుతారని విశ్వాసం వ్యక్తం చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో వీరిద్దరు మరోసారి పరుగుల వరద పారించడం ఖాయమని పేర్కొన్నాడు.రోహిత్‌తో పోలిస్తే కోహ్లి కాస్త నయంకాగా భారత సారథి రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి టెస్టు ఫార్మాట్లో నిరాశపరుస్తున్న విషయం తెలిసిందే. స్వదేశంలో న్యూజిలాండ్‌తో.. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ఈ ఇద్దరు విఫలమయ్యారు. అయితే, రోహిత్‌తో పోలిస్తే కోహ్లి కాస్త నయం. పెర్త్టెస్టులో కనీసం శతకం బాదాడు.దేశవాళీ క్రికెట్ బాటకానీ ఆ తర్వాత మరోసారి చేతులెత్తేశాడు. అయితే, అన్నింటికంటే కూడా ఈ ఇద్దరు సీనియర్ బ్యాటర్లు షాట్ల ఎంపికలో నిర్లక్ష్యంగా వ్యవహరించి వికెట్ పారేసుకోవడం విమర్శలకు తావిచ్చింది. ఈ నేపథ్యంలో రోహిత్- కోహ్లి కచ్చితంగా దేశవాళీ క్రికెట్లో ఆడితేనే పునర్వైభవం పొందే అవకాశం ఉంటుందని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు.ఈ క్రమంలో రోహిత్ శర్మ ముంబై తరఫున రంజీ ట్రోఫీ రెండో దశ బరిలో దిగగా.. కోహ్లి మాత్రం మెడ నొప్పి కారణంగా ఢిల్లీ జట్టుకు దూరంగా ఉన్నాడు. ఇక రోహిత్ రంజీల్లోనూ తన పేలవ ఫామ్‌ను కొనసాగించాడు. జమ్ము కశ్మీర్‌తో మ్యాచ్‌లో భాగంగా తొలి ఇన్నింగ్స్‌లో మూడు పరుగులకే అవుటైన ఈ కుడిచేతి వాటం బ్యాటర్... రెండో ఇన్నింగ్స్‌లో 28 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.ఇక ‘విరాహిత్’ ద్వయం తదుపరి ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ సందర్భంగా.. దాదాపు ఆరు నెలల విరామం తర్వాత వీరు యాభై ఓవర్ల ఫార్మాట్ బరిలో దిగనున్నారు. అనంతరం.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నమెంట్లో భాగమవుతారు. అయితే, వీరిద్దరి తాజా వరుస వైఫల్యాల నేపథ్యంలో మెగా టోర్నీలో ఏమేరకు రాణిస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.వైట్‌బాల్ క్రికెట్లో అదరగొడతారుఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ.. ‘‘త్వరలోనే రోహిత్- కోహ్లి వైట్‌బాల్ క్రికెట్లో పరుగులు తీయడం మొదలుపెడతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. టెస్టు క్రికెట్ భిన్నమైంది.అవుట్ ఆఫ్ స్టంప్ దిశగా వెళ్తున్న బంతులను ఆడాలనే ప్రయత్నంలో విరాట్ సఫలం కాలేకపోయాడు. మరోవైపు.. రోహిత్ కూడా మునుపటి లయను అందుకోలేకపోయాడు. అయితే, వీరిద్దరికి వన్డే ఫార్మాట్ అంటే ఎంతో ఇష్టం. కాబట్టి కచ్చితంగా తిరిగి పుంజుకుంటారు’’ అని పేర్కొన్నాడు.మొక్కుబడిగా వద్దు!ఇక టీమిండియా ప్రధాన ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్లో ఆడటం గురించి ప్రస్తావన రాగా.. ‘‘ఏదో షో ఆఫ్ చేయడానికి మాత్రం రెండు మ్యాచ్‌లు ఆడేసి వెళ్లిపోతే ఎటువంటి ప్రయోజనం ఉండదు. వీలు దొరికినప్పుడల్లా.. తరచుగా క్రికెట్ ఆడుతూ ఉంటేనే ఫామ్‌లో ఉంటారు.యువ ఆటగాళ్లకు రోహిత్ శర్మ- విరాట్ కోహ్లిలతో పోటీ అంటే మంచి మజా ఉంటుంది. వాళ్లకు బౌలింగ్ చేయాలనే ఉద్దేశంతో మరింత ఎక్కువగా కష్టపడతారు. అంతిమంగా ఇది భారత క్రికెట్ ఉజ్వల భవిష్యత్తుకు దోహదం చేస్తుంది’’ అని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు.చదవండి: Ind vs Eng: ‘అదృష్టం వల్లే గెలిచారు’... జోఫ్రా ఆర్చర్‌పై ఫ్యాన్స్ ఆగ్రహం -
‘నితీశ్ రెడ్డికి చాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు ఇవ్వాల్సిందే’
భారత క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం చర్చంతా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy 2025) గురించే!.. ఈ మెగా టోర్నీలో పాల్గొనబోయే టీమిండియాలో ఎవరెవరికి చోటు దక్కుతుందన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నిజానికి ఈ ఐసీసీ ఈవెంట్లో పాల్గొనే ప్రాథమిక జట్లను ప్రకటించడానికి సోమవారమే(జనవరి 13) ఆఖరి తేదీ అయినా.. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ).. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)ని మరింత గడువు కోరింది.ఇందుకు ఐసీసీ నుంచి సానుకూల స్పందన రాగా.. జనవరి 18 లేదా 19న చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనబోయే భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్, భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇద్దరూ కలిసి ఈ మెగా టోర్నీకి తమ జట్టును ఎంచుకున్నారు.కెప్టెన్‌కు నో ఛాన్స్!టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav)కు ఈ వన్డే ఫార్మాట్ జట్టులో గావస్కర్, పఠాన్ చోటివ్వలేదు. అయితే, అనూహ్యంగా ‘అన్క్యాప్డ్’ ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డిని మాత్రం తమ టీమ్‌లో చేర్చారు. ఈ విషయం గురించి స్టార్ స్పోర్ట్స్ షోలో గావస్కర్ మాట్లాడుతూ.. ‘‘ఇటీవలి కాలంలో వన్డేల్లో ఎవరు అదరగొట్టారో వారిని మాత్రమే నేను ఎంచుకుంటాను. వన్డే ప్రపంచకప్-2023లో కేఎల్ రాహుల్ అద్భుతంగా రాణించాడు.సంజూను ఎలా కాదనగలం?ఇక శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు. అతడు కూడా ప్రపంచకప్ టోర్నీలో మునుపెన్నడూ లేనివిధంగా దుమ్ములేపాడు. కాబట్టి తనకు సెలక్టర్లు మద్దతుగా నిలవాలి. గత కొన్ని నెలలుగా అతడు జాతీయ జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నాడు. ఫామ్‌లో ఉన్నా సరే అతడికి సెలక్టర్ల నుంచి పిలుపురావడం లేదు.నా అభిప్రాయం ప్రకారం వీరిద్దరికి కచ్చితంగా చాంపియన్స్ ట్రోఫీలో ఆడే జట్టులో చోటివ్వాలి. నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్, ఐదో స్థానంలో కేఎల్ రాహుల్‌ను ఆడించాలి. ఆరో స్థానంలో రిషభ్ పంత్ ఆడాలి. ఇక సంజూ శాంసన్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్(టీ20)లో వరుస శతకాలు సాధించాడు. అలాంటి ఆటగాడిని మనం ఎలా విస్మరించగలం?’’ అని పేర్కొన్నాడు.నితీశ్ రెడ్డికి చోటు ఇవ్వాల్సిందేఇక ఇర్ఫాన్ పఠాన్ ఇందుకు బదులిస్తూ.. ‘‘మీరు చెప్పింది బాగుంది. ఇక ఎనిమిదో స్థానంలో రవీంద్ర జడేజా బ్యాటింగ్ చేస్తే బాగుంటుంది. ఇక జట్టులో సమతూకం ఉండాలంటే.. బౌలింగ్ ఆప్షన్లు కూడా చూసుకోవాలి. జట్టులో కచ్చితంగా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌కు ఒక బ్యాకప్ ఆప్షన్ ఉండాలి. నితీశ్ కుమార్ రెడ్డి రూపంలో మనకు అద్భుతమైన ఆటగాడు అందుబాటులో ఉన్నాడు.ఆస్ట్రేలియా గడ్డపై సత్తా చాటడం అంటే మామూలు విషయం కాదు. ఎక్కువ మందికి సాధ్యం కాని ఘనతను సెంచరీ ద్వారా అతడు సాధించాడు’’ అని పేర్కొన్నాడు.కాగా నితీశ్ కుమార్ రెడ్డి ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా ఇటీవల ఆస్ట్రేలియాతో మెల్బోర్న్ టెస్టులో శతకంతో ఆకట్టుకున్నాడు.ఇక ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ తప్పకుండా తుదిజట్టులో ఉంటారని అంచనా వేసిన ఇర్ఫాన్ పఠాన్.. బుమ్రా గాయం త్వరగా నయమైపోవాలని ఆకాంక్షించాడు. కాగా ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆరంభం కానుంది. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను పాకిస్తాన్‌కు పంపేందుకు బీసీసీఐ తిరస్కరించగా.. హైబ్రిడ్ విధానంలో భారత్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. తటస్థ వేదికైన దుబాయ్‌లో ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో రోహిత్ సేన తమ ప్రయాణం ఆరంభించనుంది.సునిల్ గావస్కర్- ఇర్ఫాన్ పఠాన్ చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఎంచుకున్న భారత జట్టురోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, శుబ్‌మన్ గిల్, సంజూ శాంసన్, మహ్మద్ సిరాజ్, నితీశ్ కుమార్ రెడ్డి.చదవండి: CT 2025: వరల్డ్‌కప్‌లో మా ఇద్దరిది కీలక పాత్ర.. ఈసారీ: శ్రేయస్ అయ్యర్ -
నితీశ్ రెడ్డి ఆ స్థానంలో బ్యాటింగ్ చేశాడంటే.. తిరుగే ఉండదు!
టీమిండియా యువ సంచలనం నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy)పై భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్(Irfan Pathan) ప్రశంసలు కురిపించాడు. ఆస్ట్రేలియా గడ్డపై అరంగేట్రం చేసే అవకాశం రావడమే గొప్ప అనుకుంటే.. తన ఆట తీరుతో అతడు అద్భుతాలు చేశాడని కొనియాడాడు. కాగా ఐపీఎల్-2024 ద్వారా వెలుగులోకి వచ్చిన ఆంధ్ర క్రికెటర్ నితీశ్ రెడ్డి.బంగ్లాతో సిరీస్ సందర్భంగా..సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున సత్తా చాటిన ఈ విశాఖపట్నం కుర్రాడు.. ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకున్నాడు. ఈ క్రమంలో జాతీయ జట్టు సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన 21 ఏళ్ల నితీశ్ రెడ్డి.. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. అయితే, తనకున్న అరుదైన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండ్ నైపుణ్యాల కారణంగా అనతికాలంలోనే టెస్టు జట్టుకూ ఎంపికయ్యాడు. ఏకంగా ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) సిరీస్ ఆడే జట్టులో చోటు దక్కించుకున్నాడు నితీశ్ రెడ్డి. అంతేకాదు తుదిజట్టులోనూ స్థానం సంపాదించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. పెర్త్‌లో జరిగిన తొలి మ్యాచ్ సందర్భంగా టెస్టుల్లో అడుగుపెట్టాడు. టీమిండియా కష్టాల్లో కూరుకుపోయిన సమయంలో బ్యాట్ ఝులిపించి సత్తా చాటాడు.మెల్బోర్న్లో గుర్తుండిపోయే శతకంఇక మెల్బోర్న్లో జరిగిన నాలుగో టెస్టు సందర్భంగా నితీశ్ రెడ్డి ఏకంగా శతకంతో చెలరేగాడు. రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లి విఫలమైన చోట.. 114 పరుగులతో దుమ్ములేపి.. తన అంతర్జాతీయ కెరీర్లో తొలి సెంచరీ నమోదు చేసుకున్నాడు. ఈ క్రమంలో నితీశ్ రెడ్డి ఆట తీరుపై ప్రశంసలు వెల్లువెత్తాయి. టీమిండియాకు దొరికిన మరో ఆణిముత్యం అంటూ సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు అతడి నైపుణ్యాలను కొనియాడారు.కాగా ఆసీస్‌తో ఐదు టెస్టుల్లో కలిపి తొమ్మిది ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన నితీశ్ రెడ్డి.. 298 పరుగులు చేశాడు. అదే విధంగా ఐదు వికెట్లు పడగొట్టాడు. అయితే, నితీశ్ రెడ్డి ఈ సిరీస్‌లో ఎక్కువగా ఎనిమిదో స్థానంలోనే బ్యాటింగ్ చేశాడు. ఈ నేపథ్యంలో మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ.. ‘‘ఆస్ట్రేలియాలో అరంగేట్రం చేయడం మామూలు విషయం కాదు.ఆరో స్థానంలో బ్యాటింగ్ చేశాడంటే.. తిరుగే ఉండదు!మనలో చాలా మంది నితీశ్ రెడ్డి సెంచరీ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. నిజానికి.. అతడు సిరీస్ ఆసాంతం 40 పరుగుల మార్కును అందుకున్నాడు. ఏదేమైనా.. అతడు శతకం బాదిన తర్వాత.. చాలా మంది.. టీమిండియాకు ఎనిమిది లేదంటే ఏడో స్థానంలో బ్యాటింగ్ చేసే ఆల్‌రౌండర్ దొరికాడని సంతోషపడ్డారు.నిజానికి ఒకవేళ ఆరో స్థానంలో గనుక అతడిని ఆడిస్తే ఫలితాలు ఇంకా అద్భుతంగా ఉంటాయి. అతడికి ఆ సత్తా ఉంది. టీమిండియా విధ్వంసకర ఆటగాడిగా అతడు ఎదగగలడు. దీర్ఘకాలం పాటు ఆరో నంబర్ బ్యాటర్‌గా సేవలు అందించగల యువ క్రికెటర్ అతడు’’ అని పేర్కొన్నాడు.ఐదో బౌలర్‌గానూఅదే విధంగా.. విదేశీ గడ్డపై పేస్ దళంలో ఐదో బౌలర్‌గానూ నితీశ్ రెడ్డి రాణించగలడని ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. ‘‘తొలి మూడు ఇన్నింగ్స్‌లో నితీశ్ రెడ్డి బౌలర్‌గా విఫలమయ్యాడు. అయినప్పటికీ.. ఆస్ట్రేలియా గడ్డ మీద అతడి బౌలింగ్ ప్రదర్శన సంతృప్తికరంగానే ఉంది. బౌలింగ్ నైపుణ్యాలకు ఇంకాస్త మెరుగులు దిద్దుకుంటే.. ఐదో బౌలర్‌గా అతడు అందుబాటులో ఉండగలడు’’ అని పేర్కొన్నాడు.చదవండి: ఆసీస్‌తో టెస్టుల్లో అతడిని ఆడించాల్సింది.. ద్రవిడ్ ఉన్నంత వరకు.. : భజ్జీ -
భేష్.. ప్రాణం పెట్టి మరీ ఆడాడు: పంత్‌పై ప్రశంసలు
టీమిండియా స్టార్ రిషభ్ పంత్‌పై భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసలు కురిపించాడు. ప్రాణం పెట్టి మరీ సిడ్నీ టెస్టులో జట్టును పటిష్ట స్థితిలో నిలిపేందుకు కృషి చేశాడని కొనియాడాడు. పదునైన బంతులు శరీరానికి గాయం చేస్తున్నా పట్టుదలగా నిలబడ్డ తీరు ప్రశంసనీయమని పేర్కొన్నాడు.చావో రేవోకాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో భాగంగా ఆస్ట్రేలియాతో టీమిండియా ఐదు టెస్టులు ఆడుతోంది. ఈ సిరీస్‌లో ఇప్పటికే 1-2తో వెనుకబడి ఉన్న భారత్.. చావో రేవో తేల్చుకునేందుకు సిడ్నీ వేదికగా శుక్రవారం ఆఖరిదైన ఐదో టెస్టు మొదలుపెట్టింది.ప్రఖ్యాత సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) సారథ్యంలో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది. అయితే, ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి భారత బ్యాటర్లు త్వరత్వరగానే పెవిలియన్ చేరారు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్(10), కేఎల్ రాహుల్(4) పూర్తిగా విఫలం కాగా.. శుబ్‌మన్ గిల్(20) ఫర్వాలేదనిపించాడు.;పంత్ పోరాటంఅయితే, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లి(17) మాత్రం మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ క్రమంలో వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్(Rishabh Pant).. రవీంద్ర జడేజాతో కలిసి పోరాడే ప్రయత్నం చేశాడు. ఆసీస్ బౌలర్ల నుంచి దూసుకువస్తున్న బంతుల కారణంగా శరీరానికి గాయాలవుతున్నా.. పట్టుదలగా నిలబడ్డాడు. మొత్తంగా 98 బంతులు ఎదుర్కొన్న పంత్ మూడు ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 40 పరుగులు చేశాడు.అయితే, దురదృష్టవశాత్తూ స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో కమిన్స్‌కు క్యాచ్ ఇవ్వడంతో పంత్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. మిగిలిన వాళ్లలో జడ్డూ 26 పరుగులు చేయగా.. నితీశ్ రెడ్డి డకౌట్ అయ్యాడు. వాషింగ్టన్ సుందర్ 14, ప్రసిద్ కృష్ణ 3, కెప్టెన్ బుమ్రా 22, సిరాజ్ 3* పరుగులు చేశారు. ఫలితంగా టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకు ఆలౌట్ అయింది.అనంతరం ఆసీస్ బ్యాటింగ్‌కు దిగి ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి కేవలం తొమ్మిది పరుగులు చేసింది. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ.. పంత్ పోరాట పటిమను ప్రశంసించాడు. ప్రాణాన్ని పణంగా పెట్టి మరీ ఆడాడు‘‘రిషభ్ పంత్ ఆట గురించి మనం చాలానే మాట్లాడేశాం. అయితే, ఐదో టెస్టులో మాత్రం అతడి అద్భుత, కీలకమైన ఇన్నింగ్స్‌ను కొనియాడకతప్పదు. అలాంటి పరిస్థితుల్లో అంతసేపు బ్యాటింగ్ చేయడం సులువుకాదు. భారత బ్యాటర్లలో ఒక్కరూ కనీసం 30 పరుగుల మార్కును చేరుకోలేదు. పంత్ ఒక్కడు మాత్రం 40 రన్స్‌తో టాప్ స్కోరర్ అయ్యాడు. పదే పదే బంతులు అతడి శరీరానికి తగిలాయి.అయినా.. సరే పంత్ వెనక్కి తగ్గలేదు. తన ప్రాణాన్ని పణంగా పెట్టి మరీ ఇన్నింగ్స్ ఆడాడు. ఇప్పటికే అతడిపై మానసికంగా ఒత్తిడి ఉంది. ఈ రోజు మ్యాచ్‌లో శరీరం కూడా గాయపడింది. అయినా అద్బుతంగా పోరాడాడు. అత్యద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు’’ అని ఇర్ఫాన్ పఠాన్ కొనియాడాడు. రోహిత్ దూరంకాగా ఆసీస్‌తో తొలి నాలుగు టెస్టుల్లో పంత్ నిరాశపరిచాడు. కుదురుకుంటాడనుకున్న సమయంలో నిర్లక్ష్యపు రీతిలో వికెట్ పారేసుకుని విమర్శలు మూటగట్టుకున్నాడు. అయితే, సిడ్నీ టెస్టులో మాత్రం అద్భుత పోరాటం కనబరిచాడు. ఈ మ్యాచ్‌కు విశ్రాంతి పేరిట రోహిత్ శర్మ దూరంగా ఉండగా.. బుమ్రా సారథ్యం వహిస్తున్నాడు.చదవండి: CT 2025: వన్డే కెప్టెన్‌గా రోహిత్ అవుట్!.. టీమిండియా కొత్త సారథిగా అతడే! -
సిగ్గుపడాలి!.. భారత్‌కు ఇలాంటి ఆటగాడు అవసరమా?: ఇర్ఫాన్ పఠాన్
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి(Virat Kohli)ని ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్(Irfan Pathan) ఘాటు విమర్శలు చేశాడు. గత ఐదేళ్లుగా టెస్టుల్లో ఈ ఢిల్లీ బ్యాటర్ పూర్తిగా నిరాశపరుస్తున్నాడని.. అతడికి బదులు యువ ఆటగాడిని జట్టులోకి తీసుకున్నా బాగుండేదని పేర్కొన్నాడు. కోహ్లి సగటున సాధిస్తున్న పరుగులు చూస్తుంటే.. ఇప్పడిప్పుడే జట్టులోకి వచ్చిన యంగ్ ప్లేయర్లను తలపిస్తున్నాడని విమర్శించాడు.ఆ సెంచరీ మినహా..శతకాల వీరుడు, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి గత కొన్నేళ్లుగా టెస్టుల్లో స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy)తో బిజీగా ఉన్న కోహ్లి.. పెర్త్ టెస్టులో శతకం మినహా మిగిలిన మూడు టెస్టుల్లో విఫలమయ్యాడు. కంగారూ గడ్డపై గొప్ప చరిత్ర ఉన్న ఈ రన్‌మెషీన్ ఈసారి మాత్రం పూర్తిగా తేలిపోతున్నాడు.ఇప్పటి వరకు ఆసీస్‌తో జరిగిన నాలుగు టెస్టుల్లో కోహ్లి వరుసగా 5, 100(నాటౌట్), 7, 11, 3, 36, 5 పరుగులు చేశాడు. ఇక ఆసీస్‌తో సిరీస్‌లో భారత్ 1-2తో వెనుకబడటంతో.. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి జట్టుకు భారంగా మారాడనే విమర్శలు ఎదుర్కొంటున్నాడు కోహ్లి.భారత క్రికెట్‌కు ఇలాంటి ఆటగాడు అవసరమా?ఈ నేపథ్యంలో మాజీ ఆల్‌రౌండర్, కామెంటేటర్ ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికి ఐదేళ్లు గడిచాయి. ఇలాంటి గొప్ప ఆటగాడి సగటు మరీ 28కి పడిపోతే ఎలా?.. భారత క్రికెట్‌కు ఇలాంటి ఆటగాడు తగునా?ఆ గణాంకాలు చూసి నిజంగా సిగ్గుపడాల్సిందేతమ అత్యుత్తమ ఆటగాడి బ్యాటింగ్ సగటు 28కి దగ్గరగా ఉండటం సబబేనా?.. కచ్చితంగా కానేకాదు. జట్టుకు ఇంతకంటే గొప్పగా ఆడే బ్యాటర్ అవసరం ఉంది. అక్టోబరు 2024 నుంచి అతడి బ్యాటింగ్ సగటు మరీ 21గా ఉంది. టీమిండియాకు ఇలాంటి వాళ్లు అవసరం లేదు.యువ ఆటగాడు కూడా సగటున 21 పరుగులు చేయగలడు. విరాట్ నుంచి మనం కోరుకునేది ఇది కాదు కదా!.. ఓ ఆటగాడి కెరీర్లో సగటు 50 కంటే తక్కువగా ఉందంటే.. ఆ గణాంకాలు చూసి నిజంగా సిగ్గుపడాల్సిందే’’ అని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు.పదే పదే అదే తప్పు.. తెలివైన వారు అలా చేయరు!కాగా 2020 నుంచి 2024 వరకు కోహ్లి 38 టెస్టుల్లో కలిపి సగటున 31.32తో 2005 పరుగులు మాత్రమే చేశాడు. గత ఏడు టెస్టుల్లో కోహ్లి మరీ దారుణంగా 260 పరుగులకే పరిమితమయ్యాడు. సగటు 21.67. ఇక ఆసీస్‌తో టెస్టుల్లో ఒకే తరహాలో కోహ్లి అవుట్ కావడం పట్ల కూడా ఇర్ఫాన్ పఠాన్ విమర్శలు చేశాడు.ఆఫ్ స్టంప్ దిశగా వెళ్తున్న బంతుల్ని ఆడే క్రమంలో ఓసారి విఫలమైనా.. పదే పదే అదే తప్పు పునరావృతం చేశాడని పఠాన్ విమర్శించాడు. తెలివైన ఆటగాళ్లు ఇలా ఒకే రకమైన తప్పులు చేయరంటూ పరోక్షంగా కోహ్లికి చురకలు అంటించాడు. కాగా ఆసీస్- భారత్ మధ్య సిడ్నీలో ఐదో టెస్టు(జనవరి 3-7) జరుగనుంది. రోహిత్ పరిస్థితి మరీ దారుణంఈ మ్యాచ్‌లో రాణిస్తేనే కోహ్లి టెస్టు భవితవ్యం బాగుంటుంది. లేదంటే.. రిటైర్మెంట్ ప్రకటించి.. యువ ఆటగాళ్లకు న్యాయం చేయాలనే డిమాండ్లు మరింత ఎక్కువవుతాయి. కోహ్లి పరిస్థితి ఇలా ఉంటే.. రోహిత్ శర్మ మరీ దారుణంగా ఆడుతూ.. పెద్ద ఎత్తున విమర్శల పాలవుతున్నాడు. వెంటనే అతడు టెస్టులకు గుడ్‌బై చెప్పాలంటూ సూచనలు, సలహాలు ఎక్కువయ్యాయి.చదవండి: Rohit On Pant Batting: నిర్లక్ష్యపు షాట్లతో భారీ మూల్యం.. అతడికి నేనేం చెప్పగలను -
లబుషేన్‌కు రోహిత్ వార్నింగ్ ఇచ్చినా.. అంపైర్లు పట్టించుకోరా?
బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా బ్యాటర్ల తీరుపై టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్, మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిచ్ మధ్య పరిగెత్తడం సరికాదని చెబుతున్నా.. పదే పదే అదే తప్పు పునరావృతం చేశారని మండిపడ్డారు. అంపైర్లు కూడా ఆసీస్ బ్యాటర్లను చూసీ చూడనట్లు వదిలేయడం సరికాదని అసంతృప్తి వ్యక్తం చేశారు.బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో భాగంగా భారత్- ఆసీస్ మధ్య గురువారం నాలుగో టెస్టు మొదలైంది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలిరోజు కంగారూ జట్టు పైచేయి సాధించింది. 86 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టానికి 311 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది.అరంగేట్రంలోనే హాఫ్ సెంచరీతోఓపెనర్లలో అరంగేట్ర ఆటగాడు సామ్ కొన్‌స్టాస్(60), ఉస్మాన్ ఖవాజా(57) అర్ధ శతకాలతో మెరవగా.. వన్‌డౌన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్(72) కూడా రాణించాడు. మిగతా వాళ్లలో అలెక్స్ క్యారీ(31) ఫర్వాలేదనిపించగా.. స్టీవ్ స్మిత్ గురువారం ఆట పూర్తయ్యేసరికి 68 పరుగులతో క్రీజులో ఉన్నాడు.లబుషేన్‌కు రోహిత్ వార్నింగ్ఇక భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా మూడు, ఆకాశ్ దీప్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. కాగా పరుగులు తీసే సమయంలో లబుషేన్(Marnus Labuschagne) పిచ్ మధ్యగా పరిగెత్తగా.. టీమిండియా కెప్టెన్ రోహిత్ అతడిని హెచ్చరించాడు. కామెంటేటర్లు సునిల్ గావస్కర్, ఇర్ఫాన్ పఠాన్ ఈ విషయం గురించి చర్చిస్తూ ఆసీస్ బ్యాటర్ల తీరును తప్పుబట్టారు.అంపైర్లు ఏం చేస్తున్నారు?‘‘పిచ్ మధ్య పరిగెత్త వద్దని మార్నస్ లబుషేన్‌కు రోహిత్ శర్మ చెప్పాడు. అయినా.. మధ్య స్ట్రిప్ గుండా ఎందుకు పరిగెత్తాలి?’’ అని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు. ఇందుకు గావస్కర్ స్పందిస్తూ.. ‘‘సామ్ కొన్‌స్టాస్(Sam Konstas) కూడా ఇలాగే చేశాడు. అయినా.. అతడిని ఎవరూ హెచ్చరించలేదు’’ అని అన్నాడు.ఈ క్రమంలో ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ.. ‘‘నిజానికి ఇది అంపైర్ల పని’’ అని పేర్కొనగా.. ‘‘అవును అంపైర్లు అలా చూస్తూ ఊరుకున్నారు. రోహిత్- లబుషేన్‌తో మాట్లాడుతుంటే.. జస్ట్ అలా చూస్తూ ఉండిపోయారంతే.. ఎందుకలా ఉన్నారో నాకైతే అర్థం కాలేదు’’ అని గావస్కర్ అన్నాడు. వీరి సంభాషణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.చదవండి: ఆసీస్‌తో బాక్సింగ్ డే టెస్టు: వ్యూహం మార్చిన టీమిండియా!.. అందుకే గిల్‌పై వేటు🗣 #RohitSharma gets disappointed, warns #Labuschagne for running on the pitch during the #BoxingDayTest 🧐#AUSvINDOnStar 👉 4th Test, Day 1 LIVE NOW! | #ToughestRivalry #BorderGavaskarTrophy pic.twitter.com/iNGMjtGXXQ— Star Sports (@StarSportsIndia) December 26, 2024 -
'వేలంలో అతడికి రూ. 25 కోట్లు పైనే.. స్టార్క్ రికార్డు బద్దలవ్వాల్సిందే'
ఐపీఎల్-2025 సీజన్ మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో సౌథీ అరేబియాలోని జెడ్డా నగరంలో జరగనుంది. ఇందుకు అన్నిరకాల ఏర్పాట్లు బీసీసీఐ చేస్తోంది. ఈ మెగా వేలంలో మొత్తం 574 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. భారత్ నుంచి రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ వంటి స్టార్ క్రికెటర్లు సైతం ఉన్నారు.దీంతో ఫ్యాన్స్ కూడా ఈ వేలం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ క్యాష్ రిచ్ మెగా వేలానికి ముందు రిషబ్ పంత్‌పై భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పంత్ నిలుస్తాడని పఠాన్ జోస్యం చెప్పాడు. కాగా గతేడాది జరిగిన ఐపీఎల్-2024 మినీ వేలంలో స్టార్క్‌ను రూ.24.75 కోట్లకు భారీ ధరకు కేకేఆర్ కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక అమ్ముడుపోయిన ఆటగాడిగా స్టార్క్ నిలిచాడు. కానీ ఇప్పుడు అతడి రికార్డు డేంజర్లో ఉందని, పంత్ కచ్చితంగా బ్రేక్ చేస్తాడని పఠాన్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు.విడిచిపెట్టిన ఢిల్లీ..ఇక ఈ మెగా వేలానికి ముందు పంత్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకోలేదు. దీంతో పంత్ వేలంలో తన పేరును రూ.2 కోట్ల కనీస ధరగా నమోదు చేసుకున్నాడు. పంత్ తన రీ ఎంట్రీలో అదరగొడుతుండడంతో వేలంలో అతడిపై కాసుల వర్షం కురిసే అవకాశముంది.అతడి కోసం పంజాబ్ కింగ్స్, కేకేఆర్ పోటీ పడే ఛాన్స్ ఉన్నట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. 2016లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన రిషబ్.. ఎనిమిది సీజన్ల పాటు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఇప్పుడు తొలిసారి అతడిని వేలంలోకి ఢిల్లీ ఫ్రాంచైజీ విడిచిపెట్టింది. దీంతో అందరి కళ్లు పంత్‌పైనే ఉన్నాయి.చదవండి: న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్‌పై నిషేధం.. -
దంచికొట్టిన పఠాన్ బ్రదర్స్.. అయినా..!
లెజెండ్స్ లీగ్ క్రికెట్లో భాగంగా ఇవాళ (అక్టోబర్ 12) జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో సదరన్ సూపర్ స్టార్స్, కోణార్క్ సూర్యాస్ ఒడిశా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో సదరన్ సూపర్ స్టార్స్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.దంచికొట్టిన పఠాన్ బ్రదర్స్తొలుత బ్యాటింగ్ చేసిన కోణార్క్ సూర్యాస్ పఠాన్ సోదరులు చెలరేగి ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఇర్ఫాన్ పఠాన్ 47 బంతుల్లో 62, యూసఫ్ పఠాన్ 21 బంతుల్లో 43 పరుగులు చేసి కోణార్క్ సూర్యాస్కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. కోణార్క్ సూర్యాస్ ఇన్నింగ్స్‌లో పఠాన్ బ్రదర్స్‌తో పాటు రిచర్డ్ లెవి మాత్రమే రెండంకెల స్కోర్ (22) చేశాడు. మిగతావారంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. సదరన్ స్టార్స్ బౌలర్లలో హమిద్, రజాక్, సుబోత్ భాటి, కేదార్ జాదవ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.అనంతరం 149 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సదరన్ స్టార్స్.. హమిల్టన్ మసకద్జ (67), పవన్ నేగి (40 నాటౌట్) సత్తా చాటడంతో 17.2 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. సదరన్ స్టార్స్ ఇన్నింగ్స్‌లో మార్టిన్ గప్తిల్ 4, శ్రీవట్స్ గోస్వామి 23, చిరాగ్ గాంధీ 7 పరుగులు చేశారు. కోణార్క్ సూర్యాస్ బౌలర్లలో దివేశ్ పథానియా, వినయ్ కుమార్, అప్పన్న తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో పఠాన్ సోదరులు మెరుపు ఇన్నింగ్స్‌లతో రాణించినా కోణార్క్ సూర్యాస్కు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్‌లో గెలుపుతో సదరన్ స్టార్స్ ఫైనల్‌కు చేరుకుంది.చదవండి: T20 World Cup 2024: శ్రీలంకపై న్యూజిలాండ్ ఘన విజయం -
గాయకుడు అద్నానీ ఇంట ఇర్ఫాన్ పఠాన్‌కి భారీ విందు..!
ప్రముఖ సంగీత విద్యాంసుడు, గాయకుడు అద్నాని ఇంట మాజీ భారత క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, అతని భార్య సఫా మీర్జాకి భారీగా విందు ఇచ్చారు. ఆ విందులోని వంటకాల జాబితా వింటే వామ్మో అనాల్సిందే!. అంతలా విందు ఏర్పాటు చేశారు గాయకుడు అద్నాని, ఆయన భార్య రోయా సమీఖాన్. ఈ విషయాన్ని ఇర్ఫాన్ పఠాన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఆ విందులో డజనుకు పైగా రకరకాల రెసిపీలు ఉన్నాయంటూ వాటి వివరాలను కూడా వెల్లడించాడు. పాయా నుంచి మసాలాలు, క్రీము కొల్లాజెన్‌తో తయారు చేసిన మటన్ సూప్, సీక్ కబాబ్‌లు తోపాటు తమ కుటుంబ మూలాలను ప్రతిబింబించే మాంసాహారాలకు రెసిపీలు ఆ కూడా ఉన్నాయి. అలాగే ఉత్తర భారతీయ వంటకాలకు సంబంధించిన నాన్లు, కడాయి మటన్, బటర్ చికెన్, చనా, లసూని పాలక్‌లు తదితర రెసీపీలు కూడా ఉన్నాయి. తాను ఇలాంటి భారీ విందు కోసం అని ముందు రోజు ఏమి తినకుండా ఉంటానని చెబుతున్నాడు ఇర్ఫాన్. ఈ చక్కటి డిన్నర్లో మనసుకి హత్తుకునే సంభాషణలు, నోటికి రుచికరమైన ఆహారంతో చక్కగా సాగిపోతుంది కాలం అంటూ ఇన్స్టాగ్రాం పోస్ట్‌లో రాసుకొచ్చాడు ఇర్ఫాన్. గతంలో అద్నాన్ సమీ కూడా తనకు వండటం అంటే ఎంతో ఇష్టం చెప్పారు. ముఖ్యంగా పాయా, బిర్యానీ, పపఉలు వంటి వంటకాలు చేయడం ఇష్టమని చెప్పారు కూడా. ఈ ఇద్దరు స్నేహితులు వీడియోలో ఈ రుచికరమైన వంటకాలు ఎలా చేతితో తయారు చేశారో వివరిస్తూ జోక్‌లు వేసుకుంటూ కనిపించారుడ. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. (చదవండి: అక్షయ్ కుమార్ పేరెంటింగ్ స్టైల్!..తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సినవి..!) -
బౌలర్లను ఉతికారేసిన యువరాజ్.. సిక్సర్ల వర్షం! వీడియో
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీ రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా ఛాంపియన్లను ఇండియా ఛాంపియన్స్ 86 పరుగుల తేడాతో చిత్తు చేసింది. నార్తాంప్టన్ వేదికగా జరిగిన ఈ సెమీస్ పోరులో ఇండియా ఛాంపియన్స్ కెప్టెన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.ఆసీస్ బౌలర్లను యువీ ఊచకోత కోశాడు. యువరాజ్ కేవలం 28 బంతుల్లో 59 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి. అతడి ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు సింగ్ ఈజ్ కింగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది ఆసీస్ అంటే అంత కసి ఎందుకన్న అంటూ పోస్ట్‌లు చేస్తున్నారు. గతంలో కూడా ఐసీసీ నాకౌట్స్ మ్యాచ్‌ల్లో ఆసీస్‌పై యువీ అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడాడు. 2000లో ఆసీస్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో 84 పరుగులు చేసిన యువీ.. 2007 టీ20 వరల్డ్‌కప్ సెమీపైనల్లో కంగరూలపై హాఫ్ సెంచరీతో విరుచుకు పడ్డాడు. 2011 క్వార్టర్ ఫైనల్, 2014 టీ20 వరల్డ్‌కప్‌లో ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో ఈ సిక్సర్ల వీరుడు హాఫ్ సెంచరీలతో మెరిశాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన 6 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం 255 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 168 పరుగులకే పరిమితమైంది. ఈ విజయంతో భారత్ ఫైనల్లో అడుగుపెట్టింది. శనివారం జరగనున్న ఫైనల్లో దాయాది పాకిస్తాన్‌తో భారత్ తాడోపేడో తెల్చుకోనుంది. 2000, 2007, 2011 and now 2024 🚀Yuvi keeps his date with the Aussies in the Knockouts! 👊🏽#WCLonFanCode @YUVSTRONG12 pic.twitter.com/tjqtJJhnH4— FanCode (@FanCode) July 12, 2024 -
ఇర్ఫాన్ పఠాన్ విధ్వంసం.. 19 బంతుల్లో హాఫ్ సెంచరీ! వీడియో వైరల్
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టోర్నీలో ఫైనల్ బెర్త్‌ను ఇండియా ఛాంపియన్స్ ఖారారు చేసుకుంది. శుక్రవారం ఆస్ట్రేలియా ఛాంపియన్స్‌తో జరిగిన సెమీఫైనల్లో 86 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్‌లో భారత ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ విధ్వంసం సృష్టించాడు. ఆసీస్ బౌలర్లను పఠాన్ ఊచకోత కోశాడు. ఏడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పఠాన్ బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 19 బంతుల్లోనే పఠాన్ తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 19 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 50 పరుగులు చేసి పఠాన్ ఔటయ్యాడు. ఇర్ఫాన్ పఠాన్‌తో పాటు రాబిన్ ఉతప్ప(65), యూసఫ్ పఠాన్(51), యువరాజ్ సింగ్(59) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. వీరినలుగురి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం 255 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 168 పరుగులకే పరిమితమైంది. ఆసీస్ బ్యాటర్లలో టిమ్ పైన్(40) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. ఇక శనివారం జరగనున్న ఫైనల్లో దాయాది పాకిస్తాన్‌తో భారత్ తలపడనుంది. -
యువరాజ్ మెరుపులు.. పఠాన్ బ్రదర్స్ ఊచకోత! ఫైనల్‌కు చేరిన భారత్
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టోర్నీ ఫైనల్లో ఇండియా ఛాంపియన్స్ అడుగుపెట్టింది. శుక్రవారం నార్తాంప్టన్ వేదికగా జరిగిన సెకెండ్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియా ఛాంపియన్స్‌ను 86 పరుగుల తేడాతో ఓడించిన భారత జట్టు.. తమ ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది.ఈ సెమీస్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా 6 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో రాబిన్ ఉతప్ప( 35 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 65) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ యువరాజ్ సింగ్(28 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 58 పరుగులు), యూసఫ్ పఠాన్(23 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 51 పరుగులు), ఇర్ఫాన్ పఠాన్(19 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 50) అద్భుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగారు.ఆసీస్ బౌలర్లలో సిడిల్ 4 వికెట్లు పడగొట్టగా.. కౌల్టర్‌నైల్, దోహర్టీ తలా వికెట్ సాధించారు. అనంతరం 255 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 168 పరుగులకే పరిమితమైంది. ఆసీస్ బ్యాటర్లలో టిమ్ పైన్(40) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. భారత బౌలర్లలో కులకర్ణి, పవన్ నేగి తలా రెండు వికెట్లు పడగొట్టగా.. హార్భజన్, ఇర్ఫాన్, శుక్లా తలా వికెట్ సాధించారు. ఇక శనివారం జరగనున్న ఫైనల్లో దాయాది పాకిస్తాన్‌తో భారత్ తాడోపేడో తెల్చుకోనుంది. -
అన్నపై అసహనం వ్యక్తం చేసిన ఇర్ఫాన్ పఠాన్
రామ లక్షణుల్లా కలిసి మెలిసి ఉండే పఠాన్ సోదరులు వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీ సందర్భంగా మాటా మాటా అనుకున్నారు. రనౌట్ విషయంలో ఇద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే కొద్ది సేపటికే అది సమసిపోయింది. అన్మదమ్ములిద్దరు మ్యాచ్ అనంతరం మైదానంలో కలియతిరిగారు. వివరాల్లోకి వెళితే.. దక్షిణాఫ్రికా ఛాంపియన్స్‌తో నిన్న (జులై 10) జరిగిన మ్యాచ్‌లో భారత ఛాంపియన్స్ గెలిచే స్థితిలో ఉండింది. భారత్ గెలుపుకు చివరి రెండు ఓవర్లలో 21 పరుగులు చేయాల్సి ఉండింది. క్రీజ్‌లో ఇర్ఫాన్ పఠాన్ (34), యూసఫ్ పఠాన్ (36) ఉన్నారు. వీరిద్దరు క్రీజ్‌లో ఉండగా.. భారత్ గెలుపు ఖాయమని అంతా అనుకున్నారు. A heated moment between Pathan brothers at WCL.India Champions needed 21 runs in the last 12 balls to qualify for Semi Finals. pic.twitter.com/hgIbhCtGFq— Mufaddal Vohra (@mufaddal_vohra) July 11, 2024అయితే 18వ ఓవర్ చివరి బంతికి ఇర్ఫాన్ భారీ షాట్‌కు ప్రయత్నించి, అది విఫలం కావడంతో రెండు పరుగులు తీయాలని ప్రయత్నించాడు. రెండో పరుగుకు ప్రయత్నించే క్రమంలో పఠాన్ సోదరుల మధ్య సమన్వయం లోపించడంతో ఇర్ఫాన్ రనౌటయ్యాడు. ఇందుకు కోపోద్రిక్తుడైన ఇర్ఫాన్.. అన్న యూసఫ్ పఠాన్‌పై అసహనం వ్యక్తం చేసి గట్టిగా అరిచాడు. ఇందుకు యూసఫ్‌కు కూడా ప్రతిగా స్పందించాడు. అన్నదమ్ముల మధ్య హీటెడ్ ఆర్గుమెంట్కు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఛాంపియన్స్.. సౌతాఫ్రికా ఛాంప్స్ చేతిలో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడినా సెమీస్‌కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. స్నైమ్యాన్ (73), రిచర్డ్ లెవి (60) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. హర్బజన్ సింగ్ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. సౌతాఫ్రికా బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు మాత్రమే చేయగలిగింది. యూసఫ్ పఠాన్ (54 నాటౌట్), ఇర్ఫాన్ పఠాన్ (35) భారత్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. కాగా, ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలిచినా సెమీస్‌కు క్వాలిఫై కాలేకపోయింది. మెరుగైన రన్‌రేట్ కారణంగా భారత్ సెమీస్‌కు చేరింది. ఆస్ట్రేలియా, పాకిస్తాన్, వెస్టిండీస్, భారత్ సెమీస్‌కు చేరగా.. సౌతాఫ్రికా, ఇంగ్లండ్ ఇంటిబాట పట్టాయి. -
యువరాజ్ మళ్లీ ఫెయిల్.. సెమీఫైనల్లో టీమిండియా
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టోర్నీలో ఇండియా ఛాంపియన్స్ వరుసగా మూడో ఓటమి చవిచూసింది. బుధవారం నార్తాంప్టన్ వేదికగా దక్షిణాఫ్రికా ఛాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 54 పరుగుల తేడాతో ఇండియా ఓటమి పాలైంది. 210 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 156 పరుగులకే పరిమితమైంది. భారత బ్యాటర్లలో యూసఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్ ఆఖరిలో మెరుపులు మెరిపించినప్పటకి జట్టును మాత్రం గెలిపించలేకపోయారు. యూసఫ్ పఠాన్(44 బంతుల్లో54, 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఇర్ఫాన్(21 బంతుల్లో 35, 4 ఫోర్లు, ఒక సిక్స్) పోరాడనప్పటకి అప్పటికే మ్యాచ్ భారత్ చేదాటిపోయింది. కెప్టెన్ యువరాజ్ సింగ్(5) మరోసారి ఫెయిల్ అయ్యాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఫిలిండర్ రెండు వికెట్లు పడగొట్టగా.. చార్ల్ లాంగెవెల్డ్ట్, తహీర్,స్నైమెన్ తలా వికెట్ సాధించారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సఫారీ బ్యాటర్లలో స్నైమెన్(73) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. లివీ(25 బంతుల్లో 60, 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపులు మెరిపించాడు. భారత బౌలర్లలో హర్భజన్ సింగ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. కులకర్ణి, వినయ్‌కుమార్, యూసఫ్ తలా వికెట్ సాధించారు.సెమీస్‌లో భారత్..ఇక ఈ మ్యాచ్‌లో ఓటమి పాలైనప్పటికి సెమీఫైనల్లో భారత్ అడుగుపెట్టింది. పాయింట్ల పట్టకలో నాలుగో స్ధానంలో భారత్ నిలిచి సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఈ టోర్నీలో చెరో రెండు విజయాలు సాధించిన భారత్, దక్షిణాఫ్రికా జట్లు పాయింట్ల పరంగా సమంగా నిలిచాయి. అయితే దక్షిణాఫ్రికా(-1.340) రన్‌రేట్ కంటే భారత్(-1.267)రన్‌రేట్ మెరుగ్గా ఉండడంతో సెమీస్‌కు యువీ సేన ఆర్హత సాధించింది. జూలై 12న నార్తాంప్టన్ వేదికగా ఆస్ట్రేలియా ఛాంపియన్స్ భారత్ తలపడనుంది. -
Ind vs Afg: అతడు వద్దు.. కోహ్లి విషయంలో అలా చేయొద్దు!
టీ20 ప్రపంచకప్-2024 సూపర్-8 సమరానికి టీమిండియా సిద్ధమైంది. వెస్టిండీస్‌లోని బార్బడోస్ వేదికగా అఫ్గనిస్తాన్‌తో గురువారం తమ తొలి మ్యాచ్ ఆడనుంది.ఇందుకోసం రోహిత్ సేన ఇప్పటికే పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. లీగ్ దశలో న్యూయార్క్ పిచ్‌పై పరుగులు రాబట్టేందుకు ఆపసోపాలు పడ్డ బ్యాటర్లు.. బ్రిడ్జ్‌టౌన్ పిచ్‌పై బ్యాట్ ఝులిపించాలని పట్టుదలగా ఉన్నారు.ఈ క్రమంలో ఇప్పటికే నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తూ.. స్కిల్ సెషన్స్‌ను సద్వినియోగం చేసుకున్నారు టీమిండియా స్టార్లు. ఇక విండీస్ పిచ్‌లు స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉంది కాబట్టి.. టీమిండియా తుదిజట్టు ఎలా ఉండబోతున్నది ఆసక్తికరంగా మారింది.అమెరికాలో ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లతో బరిలోకి దిగిన రోహిత్ సేన.. వెస్టిండీస్‌లో ఓ పేసర్‌పై వేటు వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా.. ఓపెనింగ్ జోడీని మారిస్తే ఎలా ఉంటుందన్న అంశం మీద కూడా చర్చ జరుగుతోంది.కోహ్లి విషయంలో ప్రయోగాలు వద్దుఈ నేపథ్యంలో టీమిండియా మాజీ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మకు జోడీగా విరాట్ కోహ్లి మాత్రమే ఉండాలని పేర్కొన్నాడు. కీలక మ్యాచ్‌లలో ఒత్తిడిని అధిగమించగల కోహ్లి.. అఫ్గన్‌తో పోరులోనూ ఓపెనర్‌గానే రావాలని ఆకాంక్షించాడు.న్యూయార్క్‌లో పరిస్థితులు వేరని.. విండీస్ పిచ్‌లపై కోహ్లి కచ్చితంగా బ్యాట్‌తో మ్యాజిక్ చేస్తాడని ఇర్ఫాన్ పఠాన్ ధీమా వ్యక్తం చేశాడు. కోహ్లి ప్రత్యేకమైన నైపుణ్యాలున్న ఆటగాడని.. అతడి విషయంలో ప్రయోగాలు అనవసరం అని పఠాన్ అభిప్రాయపడ్డాడు.అదే విధంగా.. అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో మహ్మద్ సిరాజ్‌ను తప్పించి.. అతడి స్థానంలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను ఆడించాలని ఇర్ఫాన్ పఠాన్ సూచించాడు. పేస్ దళంలో నాయకుడు జస్ప్రీత్ బుమ్రాతో పాటు అర్ష్‌దీప్ సింగ్ ఉంటే ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నాడు.అఫ్గనిస్తాన్‌తో సూపర్-8 మ్యాచ్‌కు ఇర్ఫాన్ పఠాన్ ఎంచుకున్న భారత జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.చదవండి: -
రోహిత్, కోహ్లి, సూర్య వంటి వాళ్ల వల్ల నష్టం!
టీ20 ప్రపంచకప్-2024 నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టుకు ప్రస్తుతం ఆల్‌రౌండర్ల అవసరం ఎక్కువగా ఉందని పేర్కొన్నాడు.తానే గనుక కోచ్ అయి ఉంటే ప్రతీ బ్యాటర్.. కచ్చితంగా కొన్ని ఓవర్లపాటైనా బౌలింగ్ చేయాలనే నిబంధన ప్రవేశపెట్టేవాడని ఇర్ఫాన్ పఠాన్ తెలిపాడు. 2007 టీ20, 2011 వరల్డ్‌కప్ ఈవెంట్లలో టీమిండియా ఇలాగే విజయాలు సాధించిందని పేర్కొన్నాడు.సచిన్ టెండుల్కర్, యువరాజ్ సింగ్, సురేశ్ రైనా తదితరులు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ తమ వంతు పాత్ర పోషించారని ఇర్ఫాన్ పఠాన్ గుర్తుచేశాడు. కాగా ప్రపంచకప్-2024లో జూన్ 5న టీమిండియా ఐర్లాండ్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.ఈ నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పు జరుగుతున్న తరుణంలో ఇర్ఫాన్ పఠాన్ స్టార్ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘నేనే గనుక టీమిండియా కోచ్ అయితే.. ప్రతి బ్యాటర్ కూడా జట్టుకు అవసరమైన సమయంలో బౌలింగ్ చేయగలిగే స్థితిలో ఉండాలనే రూల్ పెడతా.ఇంగ్లండ్ జట్టులో లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, విల్ జాక్స్ తదితరులు బౌలింగ్ కూడా చేస్తారు. ఫ్రంట్‌లైన్ బౌలర్లతో పాటు వాళ్లు కూడా రాణిస్తారు.కానీ మన జట్టు పరిస్థితి అలా కాదు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్ వంటి ప్యూర్ బ్యాటర్లు అస్సలు బౌలింగ్ చేయరు. కాబట్టి మిగతా వాళ్లతో పోలిస్తే మన జట్టు వెనుకబడినట్లే.ఈ ముగ్గురిలో ఒక్కరు బౌలింగ్ చేసినా జట్టుకు ఉపయోగకరంగా ఉంటుంది. అలాంటపుడు తుదిజట్టు కూర్పులో మనకు ఎక్కువ ఆప్షన్స్ కనిపిస్తాయి’’ అని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు. నలుగురు ఫ్రంట్‌లైన్ బౌలర్లతో పాటు అక్షర్ పటేల్, శివం దూబే, హార్దిక్ పాండ్యా వంటి వారిలో ఒకరు పూర్తిస్థాయిలో బౌలింగ్ చేస్తే జట్టుకు ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నాడు.వరల్డ్‌కప్-2024: టీమిండియారోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.. రిజర్వ్ ప్లేయర్లు: శుబ్‌మన్ గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్.చదవండి: Babar Azam: దమ్ముంటే వరల్డ్‌కప్ గెలవండి: బాబర్‌కు పాక్ మాజీ బ్యాటర్ సవాల్ -
'పూర్తి సీజన్‌కు అందుబాటులో ఉండే రండి.. లేదంటే వద్దు'
టీ20 వరల్డ్‌కప్-2024కు సమయం దగ్గరపడుతుండడంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తమ జట్టు ఆటగాళ్లను ఐపీఎల్-2024 నుంచి వెనక్కి పిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ జాస్ బట్లర్ (రాజస్థాన్ రాయల్స్), ఫిల్ సాల్ట్ (కోల్‌కతా నైట్ రైడర్స్), విల్ జాక్స్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు), రీస్ టోప్లీ (ఆర్సీబీ) సామ్ కుర్రాన్ (పంజాబ్ కింగ్స్) స్వదేశానికి పయనమయ్యారు.టీ20 వరల్డ్‌కప్-2024 సన్నహాకాల్లో భాగంగా ఇంగ్లండ్ జట్టు మే 22 నుంచి నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ సిరీస్‌కు ముందు తమ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలనే ఉద్దేశ్యంతో 10 రోజుల ముందే స్వదేశానికి రావాలని తమ ఆటగాళ్లను ఈసీబీ ఆదేశించింది. అయితే ప్లే ఆఫ్స్‌కు ముందు స్టార్ ప్లేయర్లు ఈ ఏడాది సీజన్ నుంచి వైదొలగడం ఆ జట్లకు పెద్ద ఎదరుదెబ్బగానే చెప్పుకోవాలి. బుధవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ జట్టులో బట్లర్ లేని స్పష్టంగా కన్పించింది. మరోవైపు ఆర్సీబీ ప్లే ఆఫ్స్ రేసులో నిలబడాలంటే మే 17న సీఎస్కేతో డూ ఆర్‌డై మ్యాచ్‌లో తలపడనుంది. గత కొన్ని మ్యాచ్‌ల నుంచి ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న విల్ జాక్స్.. సీఎస్కేతో మ్యాచ్‌కు దూరం కావడం కచ్చితంగా ఆర్సీబీపై ప్రభావం చూపిస్తోంది. ఈ నేపథ్యంలో సీజన్ పూర్తికాకుండానే మధ్యలోనే వైదొలుగుతున్న విదేశీ ఆటగాళ్లపై మాజీ భారత ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ మండిపడ్డాడు. ‘‘ఉంటే పూర్తి సీజన్‌కి అందుబాటులో ఉండండి లేదా అసలు రావద్దు!’’ అంటూ ఎక్స్ వేదికగా పఠాన్ ఫైరయ్యాడు. -
ధోని గురించి నిజాలు ఇవే! మాజీ క్రికెటర్లకు కౌంటర్
పంజాబ్ కింగ్స్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ మహేంద్ర సింగ్ ధోని తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు రావడంపై క్రీడా వర్గాల్లో చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ విషయంలో మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ తదితరులు ధోని నిర్ణయాన్ని తప్పుబడుతూ ఘాటు విమర్శలు చేశారు.జట్టుకు అవసరమైనపుడు ధోని బ్యాటింగ్ చేయడానికి సుముఖంగా లేనపుడు తుదిజట్టు నుంచి కూడా తప్పుకోవాలంటూ భజ్జీ వ్యాఖ్యానించాడు. ధోని ఇలాంటి తప్పు చేస్తాడని అసలు ఊహించలేదంటూ కామెంట్ చేశాడు. అతడికి బదులు జట్టులో మరో అదనపు పేసర్‌ను తీసుకోవాలని సూచించాడు.మరోవైపు.. ఇర్ఫాన్ పఠాన్ సైతం.. 42 ఏళ్ల పైబడినా బ్యాటింగ్ చేయగల సత్తా ధోనికి ఉందని.. జట్టు ప్రయోజనాల దృష్ట్యా కనీసం 4-5 ఓవర్ల పాటు తలా క్రీజులో ఉండాలని సలహా ఇచ్చాడు.ఇదిలా ఉంటే.. పంజాబ్‌తో అంతకు ముందు మ్యాచ్‌లోనూ ధోని డారిల్ మిచెల్‌తో కలిసి పరుగు తీసేందుకు వెనుకాడగా.. అదృష్టవశాత్తూ అతడు రనౌట్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అయితే, ఆ మ్యాచ్‌లో సీఎస్కే ఓడిపోగా.. ధోని తీరుపై విమర్శలు వచ్చాయి.ఈ రెండు సందర్భాల్లోనూ ధోనిని తప్పుబట్టిన వాళ్లకు అతడి అభిమానులు చురకలు అంటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ధోని ఇలా చేయడానికి ఇదే కారణమంటూ ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది.మోకాలి గాయం కారణంగా ఇబ్బంది పడుతున్న ధోని.. వికెట్ కీపర్‌గా సేవలు అందించే క్రమంలో ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయకుండా ఉండాలని నిర్ణయించుకున్నాడన్నది దాని సారాంశం.ఇందుకు సంబంధించి సీఎస్కే వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘మేము మా ద్వితీయ శ్రేణి జట్టుతోనే ఎక్కువగా ఆడుతున్నాం. ధోనిని విమర్శించే వాళ్లకు అతడు చేస్తున్న త్యాగాల గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారు.జట్టు కోసం అతడు ఎంతగానో పరితపిస్తాడు. మోకాలి నొప్పి వేధిస్తున్నా అవసరమైనపుడు బ్యాటింగ్ చేస్తున్నాడు’’ అని పేర్కొన్నాయి. కాగా ఐపీఎల్-2024లో కెప్టెన్సీ పగ్గాలను రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించిన ధోని.. ఆటగాడిగా కొనసాగుతున్నాడు.ఇప్పటికే అదనపు వికెట్ కీపర్ డెవాన్ కాన్వే జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలో ధోనినే కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంది. అయితే, మోకాలి నొప్పి తీవ్రం కాకుండా చూసుకునేందుకే బ్యాటింగ్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు సమాచారం. కాగా ఈ సీజన్లో సీఎస్కే ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్‌లలో సీఎస్కే ఆరు గెలిచి పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. మిగిలిన మూడు మ్యాచ్‌లలో గెలిచి ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టాలని పట్టుదలగా ఉంది. -
ధోని తీరుపై విమర్శలు.. ఊహించలేదంటూ ఘాటు వ్యాఖ్యలు
పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ మహేంద్ర సింగ్ ధోని వ్యవహరించిన తీరును అభిమానులను ఆశ్చర్యపరిచింది. ధోని వంటి దిగ్గజ ఆటగాడి నుంచి ఇలాంటి ప్రవర్తన ఊహించలేదంటూ ఫ్యాన్స్‌తో పాటు ఇర్ఫాన్ పఠాన్ వంటి మాజీ క్రికెటర్లు పెదవి విరుస్తున్నారు.అసలేం జరిగిందంటే.. ఐపీఎల్-2024లో భాగంగా చెన్నై బుధవారం పంజాబ్ కింగ్స్‌తో తలపడిన విషయం తెలిసిందే. చెపాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ .. చెన్నైని తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి చెన్నై జట్టు 162 పరుగులు చేసింది. అయితే, పంజాబ్ అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. కేవలం మూడు వికెట్లు కోల్పోయి 17.5 ఓవర్లలోనే టార్గెట్ పూర్తి చేసి.. ఏడు వికెట్ల తేడాతో చెన్నైని చిత్తు చేసింది.ఇదిలా ఉంటే.. చెన్నై ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో హైడ్రామా చోటు చేసుకుంది. ఆ సమయంలో... ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు ధోనికి.. ఎనిమిదో నంబర్ బ్యాటర్ డారిల్ మిచెల్ మరో ఎండ్ నుంచి సహకారం అందించాడు.అనూహ్య రీతిలో మిచెల్‌ను వెనక్కి పంపిఅయితే, చివరి ఓవర్ మూడో బంతికి అర్ష్‌దీప్ బౌలింగ్‌లో ధోని షాట్ ఆడటానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. అయితే, సింగిల్‌కు ఆస్కారం ఉన్న నేపథ్యంలో డారిల్ మిచెల్ పరుగు తీసి ధోని ఉన్న ఎండ్‌కు చేరుకున్నాడు.కానీ సింగిల్ తీసేందకు సిద్ధంగా లేని ధోని అనూహ్య రీతిలో మిచెల్‌ను వెనక్కి పంపించాడు. దీంతో వేగంగా కదిలిన మిచెల్ ఎట్టకేలకు సరైన సమయంలో క్రీజులోకి చేరుకోవడంతో రనౌట్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.ఆ తర్వాతి బంతికి సిక్స్ కొట్టిన ధోని.. ఆఖరి బంతికి రనౌట్‌గా వెనుదిరిగాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఘాటుగా స్పందించాడు.ధోని అలా చేయడం సరికాదు‘‘ఎంఎస్ ధోనికి భారీ అభిమాన గణం ఉందన్న విషయం గురించే అందరూ మాట్లాడుకుంటారు. అతడు కొట్టిన సిక్స్ గురించి కూడా మాట్లాడతారు. కానీ.. టీమ్ గేమ్‌లో ధోని ఇలా సింగిల్‌కు నిరాకరించకుండా ఉండాల్సింది.ఎదుట ఉన్న వ్యక్తి కూడా అంతర్జాతీయ స్థాయి ఆటగాడే. అతడు ఒకవేళ బౌలర్ అయి ఉంటే ధోని చేసిన పని సబబుగానే ఉండేది. కానీ... రవీంద్ర జడేజా, డారిల్ మిచెల్ లాంటి ఆటగాళ్లు ఉన్నపుడు అలా చేయడం సరికాదు’’ అని ఇర్ఫాన్ పఠాన్ ధోని చర్యను తప్పుబట్టాడు.చదవండి: గిల్ విఫలమైనా చోటు.. అతడికి అన్యాయం: బీసీసీఐపై మండిపడ్డ దిగ్గజం MS Dhoni denied to run 👀Daryl Mitchell literally ran 2 Runs 😅Next Ball, MS hits a huge SIX 👏If this has been done by Virat Kohli or Rohit Sharma, then people start calling them Selfish 😳What's your take on this 🤔 #CSKvPBKS #CSKvsPBKS #SRHvsRR pic.twitter.com/ElvrInMDaI— Richard Kettleborough (@RichKettle07) May 2, 2024 -
టీ20 వరల్డ్‌కప్ జట్టులో దినేష్ కార్తీక్..? అతడికి అంత సీన్ లేదు!
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్ బ్యాటర్, భారత వెటరన్ దినేష్ కార్తీక్ అదరగొడుతున్నాడు. లేటు వయస్సులో ఖతర్నాక్ ఇన్నింగ్స్‌లతో కార్తీక్ దుమ్మలేపుతున్నాడు. ఆఖరిలో బ్యాటింగ్‌కు వచ్చి మెరుపులు మెరిపిస్తున్నాడు. గత సీజన్లో నిరాశపరిచిన కార్తీక్ ..ప్రస్తుత సీజన్లో మాత్రం పూర్తి భిన్నంగా కన్పిస్తున్నాడు. సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కార్తీక్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 288 పరుగుల భారీ లక్ష్య చేధనలో డీకే అద్బుతమైన పోరాట పటిమ కనబరిచాడు. ఓ దశలో మ్యాచ్‌ను ఫినిష్ చేసేలా కన్పించిన కార్తీక్.. ఆఖరికి నటరాజన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. దినేష్ కేవలం 35 బంతుల్లోనే 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 83 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా ఈ ఏడాది సీజన్లో 7 మ్యాచ్‌లు ఆడిన కార్తీక్ 226 పరుగులు చేశాడు. ఈ క్రమంలో కార్తీక్‌కు టీ20 వరల్డ్‌కప్ 2024 భారత జట్టులో చోటు ఇవ్వాలని చాలా మంది మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఈ జాబితాలోకి భారత మాజీ క్రికెటర్ అంబటి రాయడు చేరాడు. డీకేను టీ20 వరల్డ్‌కప్‌లో ఆడించాలని రాయడు అన్నాడు. "కార్తీక్ తన కెరీర్లో ఎక్కువగా ఎంఎస్ ధోనితో పోటీపడ్డాడు. ధోని కెప్టెన్‌గా, రెగ్యూలర్ వికెట్ కీపర్‌గా జట్టులో ఉండడంతో కార్తీకు పెద్దగా ఆడే అవకాశాలు రాలేదు. అయితే డీకే ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతడికి తన కెరీర్లో చివరిసారిగా వరల్డ్‌కప్‌లో ఆడే అవకాశం దక్కుతుందని నేను భావిస్తున్నానను. అతడికి ఛాన్స్ ఇస్తే టీమిండియాకు మ్యాచ్ విన్నర్‌గా మారే అవకాశముంది. అంతేకాకుండా భారత్‌కు వరల్డ్‌కప్‌ను అందించి, తన కెరీర్‌ను ఘనంగా ముగించిడానికి కార్తీక్‌కు కూడా ఇది మంచి అవకాశం. కాబట్టి డికేనే వరల్డ్‌కప్‌కు ఎంపిక చేయాలని సెలక్టర్లను కోరుతున్నానని" రాయడు స్టార్‌స్పోర్ట్స్ షోలో పేర్కొన్నాడు. ఇక ఇదే షోలో పాల్గోన్న భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్.. రాయడు అభిప్రాయాన్ని వ్యతిరేకించాడు. పఠాన్ నవ్వుతూ ఐపీఎల్ వేరు, వరల్డ్‌కప్ వేరు అంటూ పేర్కొన్నాడు. అంతేకాకుండా వరల్డ్‌కప్ వంటి టోర్నీల్లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉండదని, కచ్చితంగా తీవ్రమైన ఒత్తడి ఉంటుందని పఠాన్ చెప్పుకొచ్చాడు. -
RCB: ఫామ్‌లో ఉన్నా అతడిని ఎందుకు ఆడించలేదు?
రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కూర్పు గురించి టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మహిపాల్ లామ్రోర్‌కు తుదిజట్టులో చోటు కల్పించకపోవడాన్ని తప్పుబట్టాడు. కాగా ఐపీఎల్-2024లో భాగంగా శనివారం రాజస్తాన్‌తో తలపడ్డ ఆర్సీబీకి భంగపాటు తప్పలేదు. జైపూర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. తద్వారా ఈ సీజన్లో నాలుగో ఓటమి నమోదు చేసింది. స్టార్ ఓపెనర్ విరాట్ కోహ్లి అజేయ శతకం(113)తో వృథాగా పోగా.. జోస్ బట్లర్ సెంచరీ(100- నాటౌట్) రాజస్తాన్‌ను గెలిపించింది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ ద్వారా ఆర్సీబీ బ్యాటర్ సౌరవ్ చౌహాన్ ఐపీఎల్లో అడుగుపెట్టాడు. అయితే అరంగేట్రంలో ఈ గుజరాత్ ఆటగాడు ప్రభావం చూపలేకపోయాడు. #ICYMI Local lad and our brilliant leggie, Himanshu 🔁 Saurav#PlayBold #ನಮ್ಮRCB #IPL2024 #RRvRCB pic.twitter.com/05BczWmHJh — Royal Challengers Bengaluru (@RCBTweets) April 6, 2024 సౌరవ్ అరంగేట్రంలో ఇలా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి మొత్తంగా ఆరు బంతులు ఎదుర్కొని కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే చేసిన లెఫ్టాండర్ సౌరవ్.. యజువేంద్ర చహల్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. మరోవైపు.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా నామినేట్ చేసిన మహిపాల్ లామ్రోర్ సేవలను ఉపయోగించుకోలేకపోయింది ఆర్సీబీ. 4⃣ wins in 4⃣ matches for the @rajasthanroyals 🩷 And with that victory, the move to the 🔝 of the Points Table 😎💪 Scorecard ▶️ https://t.co/IqTifedScU#TATAIPL | #RRvRCB pic.twitter.com/cwrUr2vmJN — IndianPremierLeague (@IPL) April 6, 2024 ఫామ్‌లో ఉన్నా అతడిని ఎందుకు ఆడించలేదు? ఈ విషయంపై స్పందించిన ఇర్ఫాన్ పఠాన్ ఆర్సీబీ వ్యూహాలపై పెదవి విరిచాడు. ‘‘ దేశవాళీ క్రికెట్లో మహిపాల్ లామ్రోర్ ఈ పిచ్‌పై ఎన్నో మ్యాచ్‌లు ఆడాడు. కానీ ఈరోజు అతడికి ఆర్సీబీ తుదిజట్టులో చోటు కల్పించలేదు. అతడు ఫామ్‌లోనే ఉన్నాడు కూడా! అయినా ఇలా ఎందుకు చేశారో తెలియదు. భారత కోచ్‌లు కూడా ఐపీఎల్ విషయాల్లో కాస్త జోక్యం చేసుకుంటే.. ఇలాంటి ప్రాథమిక తప్పిదాలు జరగవు. ప్రతిభ ఉన్నవాళ్లకు అవకాశాలు సన్నగిల్లుతున్నాయన్న దానికి ఇది కేవలం ఒక్క ఉదాహరణ మాత్రమే’’ అని ఇర్ఫాన్ పఠాన్ ఎక్స్ వేదికగా తన అభిప్రాయం పంచుకున్నాడు. ధనాధన్ ఇన్నింగ్స్ ఆడిన లామ్రోర్ కాగా రాజస్తాన్‌లోని నాగౌర్‌కు చెందిన లెఫ్టాండ్ బ్యాటర్ మహిపాల్ లామ్రోర్ ఐపీఎల్లో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇప్పటి వరకు క్యాష్ రిచ్ లీగ్‌లో 32 మ్యాచ్‌లు ఆడిన ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్.. 452 పరుగులు చేశాడు. లెఫ్టార్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ అయిన అతడు ఒక వికెట్ కూడా తీశాడు. ఇక ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆర్సీబీ సాధించిన ఒకే ఒక్క విజయం(పంజాబ్‌పై)లోనూ లామ్రోర్ కీలక పాత్ర పోషించాడు. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో కేవలం 8 బంతుల్లోనే 17 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇక లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో 13 బంతుల్లోనే 33 రన్స్ చేశాడు. రాజస్తాన్ వర్సెస్ ఆర్సీబీ స్కోర్లు: ►వేదిక: జైపూర్.. సవాయి మాన్సింగ్ స్టేడియం ►టాస్: రాజస్తాన్.. బౌలింగ్ ►ఆర్సీబీ స్కోరు: 183/3 (20) ►రాజస్తాన్ స్కోరు: 189/4 (19.1) ►ఫలితం: ఆరు వికెట్ల తేడాతో ఆర్సీబీపై రాజస్తాన్ గెలుపు ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: జోస్ బట్లర్(రాజస్తాన్). చదవండి: Virat Kohli: స్లో ఇన్నింగ్స్ అంటూ సెటైర్లు.. కోహ్లి స్పందన ఇదే -
'అతడొక సూపర్ స్టార్.. టీ20 వరల్డ్‌కప్‌లో ఆడాల్సిందే'
ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో శివమ్ దూబే మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే ప్రత్యర్ధి బౌలర్లపై దూబే విరుచుకుపడ్డాడు. తన ట్రేడ్ మార్క్ షాట్లతో దూబే అలరించాడు. స్పిన్నర్లను దూబే టార్గెట్ చేశాడు. కేవలం 24 బంతుల్లో 4 సిక్స్‌లు , 2 ఫోర్లతో 45 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ నేపథ్యంలో దూబేపై భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. దూబే అద్బుతమైన బ్యాటింగ్ స్కిల్స్ కలిగి ఉన్నాడని పఠాన్ కొనియాడు. "నేనే సెలక్టర్ అయితే శివమ్ దూబేను కచ్చితంగా టీ20 వరల్డ్‌కప్‌నకు ఎంపిక చేస్తాను. అతడికి అద్బుతమైన పవర్ హిట్టింగ్ స్కిల్స్ ఉన్నాయి. అంతే కాకుండా స్పిన్నర్లను చీల్చి చెండాడతున్నాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే స్పిన్నర్లను ఎటాక్ చేస్తున్నాడు. ఈ ఏడాది సీజన్లో కాకుండా గత ఏడాది సీజన్లో కూడా దూబే స్పిన్నర్లకు అద్బుతంగా ఆడాడు. అటువంటి ఆటగాడు జట్టుకు అందుబాటులో ఉన్నప్పుడు ఎందుకు ఎంపికచేయరు? అతడి ఆటను సెలక్టర్లు చూస్తున్నరని నేను భావిస్తున్నాను. కాబట్టి టీ20 వరల్డ్‌కప్ జట్టులో చోటు ఇవ్వండి. దూబే స్పిన్నర్లను మాత్రం కాదు ఫాస్ట్ బౌలర్లకు కూడా అద్బుతంగా ఆడుతాడు. అతడు ముంబై నుండి వచ్చాడని మర్చిపోవద్దు. ముంబైలో పిచ్‌లు ఎక్కువగా బౌన్స్ అవుతాయి. కాబట్టి అతడు పేసర్లను కూడా సమర్ధవంతంగా ఎదుర్కోగలడని" స్టార్ స్పోర్ట్స్ షోలో పఠాన్ పేర్కొన్నాడు. -
T20 వరల్డ్‌కప్‌కు భారత జట్టు ఇదే!.. ఎవరూ ఊహించని ప్లేయర్‌కు ఛాన్స్!?
టీ20 వరల్డ్‌కప్-2024కు అమెరికా, వెస్టిండీస్‌లు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. జూన్ 1 నుంచి ఈ మెగా టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఈసారి ఈ పొట్టి ప్రపంచకప్‌లో ఏకంగా 20 జట్లు తలపడనున్నాయి. 20 జట్లు ఐదు గ్రూప్‌లుగా విడిపోయి.. లీగ్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. మొత్తంగా 55 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇక భారత్ తమ తొలి మ్యాచ్‌లో జూన్ 5న న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్‌తో తలపడనుంది. అనంతరం జూన్ 9 చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో టీమిండియా అమీతుమీ తెల్చుకోనుంది. ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్లంతా ఐపీఎల్లో బీజీబీజీగా ఉన్నారు. ఈ పొట్టి ప్రపంచకప్‌కు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఏప్రిల్ చివరి వారంలో ఎంపిక చేసే ఛాన్స్ ఉంది. కాగా ఈవెంట్ కోసం టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సెలక్టర్లు కంటే ముందే భారత జట్టును ఎంపిక చేశాడు. 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఇర్ఫాన్ ఎంపిక చేశాడు. ఈ జట్టులో అనూహ్యంగా లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ మొహ్సిన్ ఖాన్‌ను పఠాన్ చోటిచ్చాడు. ఇర్ఫాన్ తన ఎంపిక చేసిన జట్టులో స్పెషలిస్టు బ్యాటర్లుగా రోహిత్ శర్మ, శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్‌లకు అవకాశమిచ్చాడు. అదే విధంగా వికెట్ కీపర్ల కోటాలో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, జితేష్ శర్మలను పఠాన్ ఎంపిక చేశాడు. ఇక ఆల్‌రౌండర్ల కోటాలో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలకు చోటు దక్కింది. స్పెషలిష్ట్ స్పిన్నర్లగా కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్‌లను ఇర్ఫాన్ ఎంచుకున్నాడు. అదే విధంగా ఫాస్ట్ బౌలర్లగా సిరాజ్, బుమ్రాను ఎంపిక చేసిన ఇర్ఫాన్.. మూడో సీమర్‌గా మొహ్సిన్ ఖాన్‌ను తన జట్టులోకి తీసుకున్నాడు. పఠాన్ ఎంపిక చేసిన జట్టు ఇదే: రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, జితేష్ శర్మ, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, సిరాజ్, బుమ్రా, మొహ్సిన్ ఖాన్ -
IPL 2024: ఆర్సీబీ, సన్‌రైజర్స్ కాదు.. ప్లే ఆఫ్స్‌కు చేరే జట్లు ఇవే?
ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ లీగైన ఐపీఎల్ 2024 సీజన్‌కు మరో రెండు గంటల్లో తెరలేవనుంది. చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనున్న మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్ షురూ కానుంది. ఈ క్రమంలో ఈ ఏడాది ప్లే ఆఫ్స్‌కు చేరే నాలుగు జట్లను భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అంచనా వేశాడు. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్‌తో పాటు కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు ప్లే ఆఫ్స్ చేరుతాయని తెలిపాడు. "ప్రస్తుత జట్ల బలాలు, బలహీనతలను చూస్తే ఆ నాలుగు జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశముంది. అందులో మొదటిది ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్ చాలా బలంగా కన్పిస్తోంది. ఆ తర్వాత రెండో జట్టు చెన్నై సూపర్ కింగ్స్. సీఎస్కేకు చాలా మంది స్టార్ ఆటగాళ్లు దూరంగా ఉన్నప్పటికి ఆ జట్టు మాత్రం ఎలాగైనా ముందుడగు వేస్తోంది. డెవాన్ కాన్వే గాయం కారణంగా దూరమయ్యాడు. దీపక్ చాహర్ గాయం నుంచి కోలుకుని తిరిగివచ్చాడు. ఏదమైనప్పటికి ధోనీ చరిష్మాతో ముందుకు సాగుతోంది. ఎంఎస్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నప్పటికీ తన అనుభవంతో జట్టును ముందుకు నడిపిస్తాడు. ఇక మూడో జట్టు లక్నో సూపర్ జెయింట్స్. ఈ సారి లక్నో కూడా చాలా పటిష్టంగా కన్పిస్తోంది. రాహుల్ గాయం నుంచి కోలుకుని రావడం ఆ జట్టుకు కలిసిస్తోంది. చివరగా నాలుగో జట్టుగా కేకేఆర్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించే ఛాన్స్ ఉంది. కేకేఆర్‌లో కూడా రస్సెల్, మంచి పవర్ హిట్టర్లు ఉన్నారని" స్టార్‌స్పోర్ట్స్ షోలో పఠాన్ పేర్కొన్నాడు. కాగా ఇర్ఫాన్ తన ఎంచుకున్న జట్లలో ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ పేర్లు లేకపోవడం గమనార్హం. -
'చెన్నై, ముంబై, సన్‌రైజర్స్ కాదు.. ఈ సారి ఐపీఎల్ టైటిల్ ఆ జట్టుదే'
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఈ జట్టుకు ఐపీఎల్లో ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ జట్టు ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవకపోయినప్పటికీ అభిమానులు మాత్రం తమ ఆరాధ్య జట్టును ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఐపీఎల్ సీజన్ ఆరంభానికి ముందు నుంచే ఈ సారి కప్ మనదే అంటూ సందడి చేస్తూంటారు. ఇప్పుడు ఐపీఎల్-2024కు సమయం ఆసన్నం కావడంతో ఆర్సీబీ ఫ్యాన్స్ సందడి మొదలైంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్-2024 ఛాంపియన్స్‌గా ఆర్సీబీ నిలుస్తుందని పఠాన్ జోస్యం చెప్పాడు. టైటిల్ గెలుచుకునే అన్ని రకాల అర్హతలు ఆర్సీబీకి ఉన్నాయని పఠాన్ తెలిపాడు. "ఈ ఏడాది ఆర్సీబీ అద్భుతమైన జట్టుతో బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్ పరంగా బెంగళూరు పటిష్టంగా ఉంది. జట్టులో మంచి ఫినిషర్లు ఉన్నారు. బెంగళూరు జట్టు బ్యాటింగ్ లైనప్ ఆఖరివరకు బలంగా ఉంది. గత సీజన్లలో ఆర్సీబీ బ్యాటింగ్ ఎప్పుడూ అంత పటిష్టంగా లేదు. అయితే బౌలింగ్‌ను దృష్టిలో పెట్టుకుని చాలా మంది ఆర్సీబీని టైటిల్ ఫేవరేట్‌గా ఎంచుకోరు. కానీ ఈసారి బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా కన్పిస్తోంది. చిన్నస్వామి వంటి ప్లాట్ పిచ్‌లపై ఎక్స్‌ప్రెస్ పేస్‌తో బౌలింగ్ చేసే ఫాస్ట్ బౌలర్లు ఆర్సీబీ జట్టులో ఉన్నారు. కాబట్టి ఈసారి ఆర్సీబీ టైటిల్ నెగ్గుతుందని భావిస్తున్నాని" స్టార్ స్పోర్ట్స్ గేమ్ షోలో పఠాన్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2024 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ఆర్సీబీ జట్లు తలపడనున్నాయి. -
అతడు తప్పు చేయలేదు.. అలాంటపుడు శిక్ష ఎందుకు?
స్టార్ క్రికెటర్లు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లను వార్షిక కాంట్రాక్టు జాబితా నుంచి తొలగించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో బీసీసీఐని కొంతమంది సమర్థిస్తుంటే.. మరికొంత మంది మాజీ క్రికెటర్లు మాత్రం తప్పుబడుతున్నారు. కాగా సెంట్రల్ కాంట్రాక్టు కలిగి ఉన్న క్రికెటర్లందరూ బోర్డు ఆదేశాలకు అనుగుణంగా తప్పక దేశవాళీ క్రికెట్లో ఆడాలని బీసీసీఐ పేర్కొన్న సంగతి తెలిసిందే. కోచ్, కెప్టెన్, సెలక్టర్ల సూచనల మేరకు ఎవరైతే దేశవాళీ క్రికెట్ ఆడాల్సి ఉంటుందో నిర్ణయిస్తామని తెలిపింది. ముఖ్యంగా ఫిట్‌గా ఉన్న యువ ఆటగాళ్లు బోర్డు సూచించినపుడు తప్పక డొమెస్టిక్ క్రికెట్ ఆడాలని ఆటగాళ్లను ఆదేశించింది. అయితే, అయ్యర్, ఇషాన్ ఈ నిబంధనలు ఉల్లంఘించారనే వార్తల నడుమ.. వారిద్దరి సెంట్రల్ కాంట్రాక్టు రద్దు చేయడం ఇందుకు బలాన్నిచ్చింది. ఈ నేపథ్యంలో మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్.. శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లకు అండగా నిలబడ్డాడు. వారికి మద్దతుగా నిలుస్తూ.. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వంటి వాళ్లకు మాత్రం ఈ నిబంధనల నుంచి ఎలా మినహాయింపు ఇస్తారని ప్రశ్నించాడు. ఈ క్రమంలో మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా స్పందిస్తూ.. ‘‘హార్దిక్ పాండ్యా విషయాన్ని సంక్లిష్టం చేయాల్సిన అవసరం లేదు. అతడు ఎన్నో ఏళ్లుగా రెడ్ బాల్ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. కాబట్టి ఈ నిబంధన విషయంలో అతడి గురించిన ప్రస్తావనే అనవసరం. అతడు టెస్టు సిరీస్‌లకు అందుబాటులోనే ఉండటం లేదు. అలాంటపుడు అతడిని ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడమని చెప్పడంలో అర్థమే లేదు. నాలుగు రోజుల మ్యాచ్‌కు ఓ ఆటగాడి శరీరం సహకరించనపుడు. గాయాల బారిన పడే ప్రమాదం ఉందనీ తెలిసినపుడు అలాంటి వ్యక్తిని ఎవరూ కూడా ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడమని ఆదేశించరు. ఒకవేళ తను టెస్టు ఆడేందుకు పూర్తి ఫిట్‌గా ఉంటే.. తను టీమిండియాకు ఆడటం మానేసి.. ప్రమోషన్ షూట్లలో పాల్గొంటే అప్పుడు తనది తప్పని చెప్పవచ్చు. కానీ ప్రస్తుతం అతడు ఇలాంటి తప్పులేమీ చేయలేదు. కాబట్టి బీసీసీఐకి అతడిని శిక్షించాల్సిన అవసరం లేదు’’ అని పేర్కొన్నాడు. చదవండి: Shreyas Iyer: సెమీస్ తుదిజట్టులో అయ్యర్.. రహానే కీలక వ్యాఖ్యలు -
హార్దిక్‌కు రూల్స్ వర్తించవా.. పాపం ఇషాన్, శ్రేయస్: మండిపడ్డ ఇర్ఫాన్
వార్షిక క్రాంటాక్టుల విషయంలో భారత క్రికెట్ నియంత్రణ అనుసరించిన తీరుపై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ విస్మయం వ్యక్తం చేశాడు. ఏ నిబంధనైనా టీమిండియా ఆటగాళ్లందరికీ ఒకేలా ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. భారత జట్టు అనుకున్న లక్ష్యాలు సాధించేందుకు ఇలాంటి పోకడలు నష్టం చేకూరుస్తాయని పఠాన్ ఘాటు విమర్శలు చేశాడు. కాగా 2023-24 ఏడాదికి గానూ ప్రకటించిన వార్షిక కాంట్రాక్టుల విషయంలో టీమిండియా మిడిలార్డర్ స్టార్ శ్రేయస్ అయ్యర్, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ పేర్లు గల్లంతైన విషయం తెలిసిందే. రంజీ టోర్నీలో ఆడాలన్న బోర్డు ఆదేశాలు బేఖాతరు చేశారన్న కారణంగానే వీళ్లిద్దరికి మొండిచేయి చూపారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ బీసీసీఐ తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. ‘‘శ్రేయస్, ఇషాన్ ఇద్దరూ ప్రతిభావంతులైన క్రికెటర్లే. తిరిగి పుంజుకుని రెట్టించిన ఉత్సాహంతో వాళ్లిద్దరు కమ్‌బ్యాక్ ఇస్తారనే అనుకుంటున్నా. హార్దిక్ పాండ్యా లాంటి ఆటగాళ్లు టెస్టు క్రికెట్ ఆడకూడదు అనుకున్నపుడు.. కనీసం దేశవాళీ పరిమిత ఓవర్ల క్రికెట్లోనైనా వాళ్లను ఆడించాలి కదా? జాతీయ జట్టుకు దూరమైనపుడు వాళ్లు కూడా దేశవాళీ బరిలో దిగాలి కదా? ఒకవేళ ఈ నిబంధన అందరికీ వర్తింపజేయకుంటే.. భారత క్రికెట్ అనుకున్న లక్ష్యాలను ఎన్నటికీ సాధించలేదు’’ అని ఎక్స్ వేదికగా ఇర్ఫాన్ పఠాన్ మండిపడ్డాడు. కాగా గతేడాది వన్డే వరల్డ్‌కప్-2023 సందర్భంగా గాయపడ్డ పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. మళ్లీ టీమిండియా తరఫున ఇంతవరకు రీఎంట్రీ ఇవ్వలేదు. అయితే, ఐపీఎల్-2024 బరిలో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా బరిలోకి దిగేందుకు జిమ్‌లో చెమటోడుస్తున్నాడు. మరోవైపు.. శ్రేయస్ అయ్యర్ రంజీ సెమీస్‌లో ముంబై తరఫున ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. తమిళనాడుతో ముంబై ఆడబోయే ఈ మ్యాచ్‌కు ఎంపిక చేసిన జట్టులో అతడికి చోటు దక్కింది. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. చదవండి: BCCI Annual Players Contract List: పూర్తి వివరాలు.. విశేషాలు They are talented cricketers, both Shreyas and Ishan. Hoping they bounce back and come back stronger. If players like Hardik don’t want to play red ball cricket, should he and others like him participate in white-ball domestic cricket when they aren’t on national duty? If this… — Irfan Pathan (@IrfanPathan) February 29, 2024 -
అచ్చం దాదా మాదిరే.. మరో గంగూలీ అవుతాడు!
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌పై భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసలు కురిపించాడు. యశస్వి బ్యాటింగ్ తీరు చూస్తే తనకు సౌరవ్ గంగూలీ గుర్తుకువస్తాడని తెలిపాడు. దాదా మాదిరే ఆఫ్ సైడ్ ఆడటంలో ఈ ముంబై బ్యాటర్ దిట్ట అంటూ కొనియాడాడు. కాగా వెస్టిండీస్ గడ్డపై శతకంతో అంతర్జాతీయ క్రికెట్‌ను మొదలుపెట్టిన యశస్వి జైస్వాల్.. ఇటీవలే తొలి డబుల్ సెంచరీ బాదాడు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా వైజాగ్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో ద్విశతకంతో చెలరేగి.. జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. తదుపరి రాజ్‌కోట్ వేదికగా ఫిబ్రవరి 15 నుంచి మొదలుకానున్న మూడో టెస్టుకు యశస్వి జైస్వాల్ సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ స్టార్ స్పోర్ట్స్ షోలో యశస్వి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈ సిరీస్‌లో నేను ఎవరి ఆట కోసమైనా ఎదురుచూస్తున్నానంటే అది యశస్వి జైస్వాల్ మాత్రమే! ఐపీఎల్లో అతడు ఎలా ఆడతాడో మనమంతా చూశాం. అత్యద్భుతమైన ఆటగాడు. దాదా మాదిరే ఆఫ్ సైడ్ గేమ్ చితక్కొడతాడు. నిజానికి తనను ఆఫ్ సైడ్ రారాజు అని పిలవొచ్చు. ఒకవేళ వచ్చే పదేళ్ల పాటు అతడు జట్టులో కొనసాగితే.. తప్పకుండా దాదా మాదిరే ప్రభావం చూపగలడు. మనం ఇప్పుడు దాదా గురించి మాట్లాడుకుంటున్నట్లుగానే యశస్వి గురించి కూడా మాట్లాడుకోవడం ఖాయం. అంతర్జాతీయ క్రికెట్లో ద్విశతకం బాది తన సత్తా ఏమిటో యశస్వి మరోసారి నిరూపించుకున్నాడు. మున్ముందు కూడా మరింత మెరుగ్గా ఆడతాడు’’ అని ఇర్ఫాన్ పఠాన్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా 22 ఏళ్ల లెఫ్టాండ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ టీమిండియా తరఫున ఇప్పటి వరకు ఆరు టెస్టులాడి 637 పరుగులు, 17 టీ20లలో 502 పరుగులు సాధించాడు. టెస్టు ఫార్మాట్లో టీమిండియా మొదటి ప్రాధాన్య ఓపెనర్‌గా.. కెప్టెన్ రోహిత్ శర్మ జోడీగా కొనసాగుతున్నాడు. చదవండి: IPL 2024- SRH: తెలివైన నిర్ణయం.. సన్‌రైజర్స్ కెప్టెన్‌గా అతడే! -
సచిన్, యువరాజ్ మెరుపులు.. సిక్సర్‌తో గెలిపించిన ఇర్ఫాన్ పఠాన్
సచిన్ టెండూల్కర్‌తో పాటు భారత్, ఇతర దేశాలకు చెందిన క్రికెట్ దిగ్గజాలు మరోసారి బరిలోకి దిగారు. మధుసూదన్ సాయి గ్లోబల్ హ్యుమానిటేరియన్ మిషన్ ఆధ్వర్యంలో జరిగిన 'వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ' కప్‌లో వీరంతా రెండు టీమ్‌లుగా విడిపోయి ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడారు. ఈ మ్యాచ్ ద్వారా సేకరించబడే డబ్బును మధుసూదన్ సాయి గ్లోబల్ మిషన్ వారు నిరుపేదల కోసం వినియోగిస్తారు. Sachin Ramesh Tendulkar is Back Guys 🔥🐐pic.twitter.com/170aFmQQ9Q — Arun Vijay (@AVinthehousee) January 18, 2024 ఐక్యత యొక్క శక్తిని, మానవత్వం యొక్క బలాన్ని, సామాజిక బాధ్యత యొక్క భావాన్ని వెదజల్లడానికి ఈ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహిస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు. Sachin Tendulkar rolling his arms after a long time and got a wicket.pic.twitter.com/4WiqVlCsZu— Mufaddal Vohra (@mufaddal_vohra) January 18, 2024 మ్యాచ్ విషయానికొస్తే.. కర్ణాటకలోని ముద్దెనహళ్లిలో జరిగిన ఈ మ్యాచ్‌లో సచిన్ కెప్టెన్సీలోని వన్ వరల్డ్, యువరాజ్ సింగ్ నాయకత్వంలోని వన్ ఫ్యామిలీ జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన వన్ ఫ్యామిలీ.. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. Watching Sachin Tendulkar play live for the first time and he has taken a wicket in his 2nd over. 🐐 - 50 years old, he still got it. #OWOFCup pic.twitter.com/MWSglJHdqO — Johns. (@CricCrazyJohns) January 18, 2024 ఇంగ్లండ్ ఆటగాడు డారెన్ మ్యాడీ (51) అర్ధసెంచరీతో రాణించగా.. లంక మాజీ వికెట్‌కీపర్ కలువితరణ 22, టీమిండియా మాజీ ఆటగాళ్లు యూసఫ్ పఠాన్ 38, యువరాజ్ సింగ్ 23 పరుగులు చేశారు. వన్ వరల్డ్ బౌలర్లలో హర్భజన్ సింగ్ 2 వికెట్లు పడగొట్టగా.. సచిన్, ఆర్పీ సింగ్, అశోక్ దిండా, మాంటీ పనేసర్ తలో వికెట్ దక్కించుకున్నారు. అన్న బౌలింగ్‌లో సిక్సర్ కొట్టి గెలిపించిన ఇర్ఫాన్ పఠాన్ 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వన్ వరల్డ్.. అల్విరో పీటర్సన్ (74), సచిన్ టెండూల్కర్ (27), నమన్ ఓఝా (25), ఉపుల్ తరంగ (29) రాణించడంతో 19.5 ఓవర్లలో విజయతీరాలకు చేరింది. యూసఫ్ పఠాన్ బౌలింగ్‌లో అతని సోదరుడు ఇర్ఫాన్ పఠాన్ ఆఖరి ఓవర్ ఐదో బంతికి సిక్సర్ బాది తన జట్టును గెలిపించాడు. One World needed 3 in 2 balls: Irfan Pathan smashed a six against Yusuf Pathan, after that Irfan hugged Yusuf. pic.twitter.com/1QPPfcVkNG — Mufaddal Vohra (@mufaddal_vohra) January 18, 2024 వన్ ఫ్యామిలీ బౌలర్లలో చమింద వాస్ 3 వికెట్లు పడగొట్టగా.. ముత్తయ్య మురళీథరన్, యువరాజ్ సింగ్, జేసన్ క్రేజా తలో వికెట్ దక్కించుకున్నారు. చాలాకాలం తర్వాత క్రికెట్ దిగ్గజాలు బరిలోకి దిగడం చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ మ్యాచ్‌కు సంబంధించిన పోస్ట్‌లు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. Sachin's Team Won the match 💙💥 pic.twitter.com/T4cRvUmMsO — 𝑺𝒉𝒆𝒃𝒂𝒔 (@Shebas_10dulkar) January 18, 2024 -
‘మనం వద్దని మాల్దీవులు ఓటేసింది.. ఇకపై అక్కడికి వెళ్తారా? లేదా..’
Cricket Stars Fume Over Maldives Row: భారత ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన మాల్దీవుల మంత్రులను టీమిండియా మాజీ క్రికెటర్లు తప్పుబడుతున్నారు. భారతీయులను తక్కువ చేసేలా మాట్లాడటం తగదని హితవు పలుకుతున్నారు. గతంలో ఎన్నోసార్లు మాల్దీవుల పర్యటనకు వెళ్లామని.. కానీ ఇకపై అలాంటి పరిస్థితులు ఉండబోవని స్పష్టం చేస్తున్నారు. భారతదేశంలో ఎన్నో సుందరమైన ప్రదేశాలు ఉన్నాయని.. ఇకపై వాటిపైనే మనమంతా దృష్టి సారించాలని పిలుపునిస్తున్నారు. భారత పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేలా తమ వంతు సహకారం అందిస్తామంటూ ఎక్స్ వేదికగా ప్రధాని మోదీకి మద్దతు తెలుపుతున్నారు. మోదీ ఫొటోలు వైరల్.. మాల్దీవుల మంత్రుల నోటి దురుసు కాగా ప్రధాని మోదీ.. కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్‌లో ఇటీవల పర్యటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో లక్షద్వీప్‌ను పర్యాటక ధామంగా మార్చాలంటూ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పలువురు నెటిజన్లు మాల్దీవులతో లక్షద్వీప్‌ను పోలుస్తూ ప్రధాని మోదీ ఫొటోలను నెట్టింట వైరల్ చేశారు. ఈ నేపథ్యంలో మాల్దీవుల మంత్రులు మోదీని కించపరిచే విధంగా తోలుబొమ్మ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. భారత్‌లో బీచ్‌లు, హోటల్ గదులు శుభ్రంగా ఉండవని.. అలాంటి దేశంతో తమకు పోలికేంటని వివాదాస్పద రీతిలో కామెంట్లు చేశారు. దీంతో బాయ్‌కాట్ మాల్దీవ్స్, #ExploreIndianIslands ట్రెండ్ చేస్తున్నారు భారత నెటిజన్లు. మన పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలి ఈ నేపథ్యంలో మాజీ ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్, ఆకాశ్ చోప్రా, మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్, మాజీ బ్యాటర్ సురేశ్ రైనా తదితరులు స్పందించారు. ఈ మేరకు సెహ్వాగ్.. ‘‘ఉడుపి, పాండిలోని పారడైజ్ బీచ్, అండమాన్‌లోని నీల్, హవెలాక్‌తో పాటు దేశంలో ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి. ఇంతవరకు మనం చూడని చక్కటి బీచ్‌లు కూడా చాలా ఉన్నాయి. మన ప్రధాని పట్ల మాల్దీవుల మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేసిన తీరును అందరూ గమనించాలి. ఇకపై అవసరమైన చోట్ల మౌలిక సదుపాయాలు మరింత అభివృద్ధి చేసి మన పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసి.. ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసుకోవాలి’’ అని పేర్కొన్నాడు. Whether it be the beautiful beaches of Udupi , Paradise Beach in Pondi, Neil and Havelock in Andaman, and many other beautiful beaches throughout our country, there are so many unexplored places in Bharat which have so much potential with some infrastructure support. Bharat is… pic.twitter.com/w8EheuIEUD — Virender Sehwag (@virendersehwag) January 7, 2024 ఇక ఇర్ఫాన్ పఠాన్.. ‘‘నాకు 15 ఏళ్ల వయసు ఉన్నపటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల్లో పర్యటించాను. ఇండియన్ హోటల్స్‌లో లభించిన ఆతిథ్యం మరెక్కడా లభించదు. మన దేశంలో ఉన్నన్ని పర్యాటక ప్రాంతాలు మరెక్కడా లేవు. మనం ప్రతి దేశ సంస్కృతిని గౌరవిస్తాం. కానీ.. నా మాతృదేశం గురించి, ఇక్కడి ఆతిథ్యం గురించి ఇలాంటి ప్రతికూల వ్యాఖ్యలు వినడం ఎంతో బాధిస్తోంది’’ అని మాల్దీవుల మంత్రులకు చురకలు అంటించాడు. Having traveled the world since I was 15, every new country I visit reinforces my belief in the exceptional service offered by Indian hotels and tourism. While respecting each country's culture, it's disheartening to hear negative remarks about my homeland's extraordinary… — Irfan Pathan (@IrfanPathan) January 7, 2024 మనం వద్దని మాల్దీవులు ఓటేసింది.. ఇక వెళ్లాలా లేదా? అదే విధంగా ఆకాశ్ చోప్రా స్పందిస్తూ.. ‘‘ఇండియా వద్దని మాల్దీవులు ఓటేసింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలో.. వెళ్లవద్దో అన్న అంశంలో భారతీయులు తెలివిగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. నా కుటుంబం అయితే, ఇలాగే చేస్తుంది. జై హింద్’’ అని పేర్కొన్నాడు. ‘India Out’ was a part of the manifesto. Maldives voted for it. Now, it’s up to us, Indians, to choose wisely. I know that my family will. Jai Hind 🇮🇳 — Aakash Chopra (@cricketaakash) January 6, 2024 కాగా మోదీపై అనుచిత వ్యాఖ్యల కారణంగా ఇప్పటికే చాలా మంది భారత ప్రముఖులు మాల్దీవుల పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. పర్యాటకమే ఆయువుపట్టుగా ఉనికిని చాటుకుంటున్న తమకు.. తాజా పరిణామాలు భారీ నష్టం చేకూరుస్తాయని పసిగట్టిన మాల్దీవుల ప్రభుత్వం.. ఇప్పటికే సదరు మంత్రులపై వేటు వేసింది. -
సౌతాఫ్రికాతో రెండో టెస్టు: మార్పులు సూచించిన ఇర్ఫాన్ పఠాన్
South Africa vs India, 2nd Test: సౌతాఫ్రికాతో రెండో టెస్టు నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పుపై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్థానాన్ని ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతో భర్తీ చేయాలని సూచించాడు. జడ్డూ గనుక ఫిట్‌గా ఉంటే కేప్‌టౌన్ మ్యాచ్‌లో అతడిని తప్పక ఆడించాలని మేనేజ్మెంట్కు విజ్ఞప్తి చేశాడు. అదే విధంగా యువ పేసర్ ప్రసిద్ కృష్ణ విషయంలో పునరాలోచన చేయాలని పఠాన్ సూచించాడు. కాగా సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా దారుణ పరాజయం మూటగట్టుకున్న విషయం తెలిసిందే. బాక్సింగ్ డే టెస్టులో ఆతిథ్య సౌతాఫ్రికా చేతిలో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో సిరీస్‌ను డ్రా చేసుకోవాలంటే రెండో మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన స్థితిలో నిలిచింది. ఒకవేళ ఈ మ్యాచ్‌లోనూ గనుక ఓడితే.. మరోసారి సఫారీ గడ్డపై టీమిండియాకు భంగపాటు తప్పదు. అందుకే.. గత మ్యాచ్ తాలుకు తప్పిదాలు పునరావృతం కాకుండా.. లోపాలు సరిచేసుకుని బరిలోకి దిగేందుకు రోహిత్ సేన సిద్ధమవుతోంది. జడ్డూ వస్తే ప్రయోజనకరంగా ఉంటుంది ఈ నేపథ్యంలో జట్టు కూర్పు గురించి భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘రవీంద్ర జడేజా ఫిట్నెస్ సాధిస్తే అతడిని కచ్చితంగా తుదిజట్టులోకి తీసుకోవాలి. గత మ్యాచ్‌లో అశ్విన్ బాగానే బౌలింగ్ చేశాడు. కానీ.. బ్యాటింగ్ ఆర్డర్లో ఏడో స్థానంలో రాణించగల జడేజా సేవలను ఇండియా కోల్పోయింది. కాబట్టి అతడు జట్టులోకి వస్తే ఉపయోగకరంగా ఉంటుంది. ఇక బౌలింగ్ దళం విషయంలో రోహిత్ శర్మ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగితే బాగానే ఉంటుంది. ఒకవేళ ఏదైనా మార్పు చేయాలనుకుంటే ప్రసిద్ కృష్ణ స్థానంలో ముకేశ్ కుమార్‌ను తీసుకురావాల్సి ఉంటుంది. ప్రసిద్ కృష్ణను ఆడిస్తే.. అయితే, నెట్స్‌లో ప్రసిద్ కృష్ణ బౌలింగ్ బాగానే అనిపిస్తే.. అతడి విషయంలో ధీమా ఉంటే రెండో టెస్టులోనూ ఆడించవచ్చు’’ అని ఇర్ఫాన్ పఠాన్ ఇండియా టుడేతో పేర్కొన్నాడు. కాగా టీమిండియా- సౌతాఫ్రికా మధ్య బుధవారం నుంచి కేప్‌టౌన్ వేదికగా రెండో టెస్టు ఆరంభం కానుంది. ఇదిలా ఉంటే.. సెంచూరియన్ టెస్టు ద్వారా అరంగేట్రం చేసిన ప్రసిద్ కృష్ణ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఇరవై ఓవర్ల బౌలింగ్‌లో మొత్తంగా 93 పరుగులు ఇచ్చి కేవలం ఒక వికెట్ తీయగలిగాడు. చదవండి: IND vs SA: సౌతాఫ్రికాతో రెండో టెస్టు.. టీమిండియాను భయపెడుతున్న రికార్డులు! -
Ind vs SA: ఇద్దరు పెద్దన్నలు.. రెండు టెస్టులు గెలిస్తే చాలు!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఉద్దేశించి మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత క్రికెట్ చరిత్రలో సారథిగా తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకునే అరుదైన అవకాశం ముంగిట హిట్‌మ్యాన్ నిలిచాడని పేర్కొన్నాడు. సౌతాఫ్రికా పర్యటనలో ఓపెనర్‌గా, కెప్టెన్‌గా రాణిస్తే గొప్ప నాయకుడిగా నీరజనాలు అందుకుంటాడని ఇర్ఫాన్ చెప్పుకొచ్చాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి తర్వాత రోహిత్ శర్మ సెలవులు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా బాక్సింగ్ డే టెస్టుతో పునరాగమనం చేయనున్నాడు. ఇక సఫారీ గడ్డపై ఇంత వరకు టీమిండియా కెప్టెన్లు ఎవరూ కూడా టెస్టు సిరీస్ గెలిచిన దాఖలాలు లేవు. మేటి టెస్టు సారథిగా పేరొందిన విరాట్ కోహ్లికి కూడా సంప్రదాయ క్రికెట్లో ప్రొటిస్ జట్టు పైచేయి సాధించడం సాధ్యం కాలేదు. పరిమిత ఓవర్ల కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన తర్వాత 2021-22 టూర్లో కోహ్లి సారథ్యంలో భారత్ ఆరంభ టెస్టు గెలిచి ఆశలు రేకెత్తించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే ఈ మ్యాచ్ తర్వాత కోహ్లి అనూహ్యంగా టెస్టు సారథ్యానికి గుడ్‌బై చెప్పడంతో కేఎల్ రాహుల్ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే, మిగిలిన రెండు టెస్టుల్లో టీమిండియాకు ఓటమే ఎదురైంది. 2-1తో మరోసారి సౌతాఫ్రికాకు ట్రోఫీని సమర్పించుకుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత టూర్ రోహిత్ శర్మకు సవాలుగా నిలవడంతో పాటు తనను తాను నిరూపించుకునే అవకాశాన్నీ ఇచ్చింది. ఈ విషయం గురించి ఇర్ఫాన్ పఠాన్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘రోహిత్ శర్మ గనుక సౌతాఫ్రికా గడ్డపై సఫారీలను చిత్తు చేయగలిగితే.. భారత క్రికెట్ కెప్టెన్ల జాబితాలో శిఖరాగ్రాన నిలిచే అవకాశం ఉంటుంది. సారథిగా రెండంటే.. రెండు మ్యాచ్‌లు గెలిస్తే చాలు అతడు చరిత్ర పుటల్లో నిలిచిపోతాడు. ఓపెనర్‌గా, కెప్టెన్‌గా రోహిత్ రాణిస్తే ఇదేమీ అసాధ్యం కాదు. కొత్తబంతిపై షైనింగ్ పోయేంత వరకు హిట్‌మ్యాన్ క్రీజులో ఉంటే.. మిగతా బ్యాటర్ల పని సులువవుతుంది. ఇంగ్లండ్ పర్యటనలో రోహిత్ అద్భుతంగా ఆడాడు. అదే ప్యాషన్‌తో సౌతాఫ్రికాలో ఆడితే వీలైనన్ని ఎక్కువ పరుగులు రాబట్టగలడు. టీమిండియాకు ప్రస్తుతం ఇద్దరు పెద్దన్నలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఉన్నారు. వారి ప్రదర్శనపైనే సిరీస్ గెలుస్తామా లేదా అన్న విషయాలు ఆధారపడి ఉంటాయి’’ అని అభిప్రాయపడ్డాడు. సౌతాఫ్రికా గడ్డపై టీమిండియా టెస్టు సిరీస్ గెలవాలని ఇర్ఫాన్ పఠాన్ ఈ సందర్భంగా ఆకాంక్షించాడు. -
రోహిత్ శర్మ ఇకపై టెస్టు కెప్టెన్ మాత్రమే!
టీమిండియాకు మూడు ఫార్మాట్లలో వేర్వేరు కెప్టెన్లు ఉండటం పట్ల తనకు సదభిప్రాయం లేదని మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. పని ఒత్తిడిని తగ్గించే క్రమంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం మంచిదే అయినా.. భవిష్యత్తులో ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో ఊహించలేమన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటన నేపథ్యంలో జట్ల ఎంపిక విధానం చూస్తే.. రోహిత్ శర్మను ఇకపై పరిమిత ఓవర్ల క్రికెట్లో పూర్తిస్థాయి కెప్టెన్‌గా చూసే అవకాశం లేదని ఇర్ఫాన్ అభిప్రాయపడ్డాడు. అతడు కేవలం టెస్టులకు పరిమితం అవుతాడని పేర్కొన్నాడు. కాగా సౌతాఫ్రికా టూర్లో భాగంగా.. టీమిండియా టీ20, వన్డే, టెస్టు సిరీస్‌లు ఆడనుంది. ఇందుకోసం ఇప్పటికే మూడు వేర్వేరు జట్లను ప్రకటించిన బీసీసీఐ.. టీ20 పగ్గాలను సూర్యకుమార్ యాదవ్, వన్డే కెప్టెన్సీని కేఎల్ రాహుల్‌కు అప్పగించింది. ఇక రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ టెస్టు సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ నేపథ్యంలో పరిమిత ఓవర్ల క్రికెట్‌కు రోహిత్ పూర్తిగా దూరం కానున్నాడనే వార్తకు మరింత బలం చేకూరింది. ఇదిలా ఉంటే.. గతంలో ఎన్నడూ లేని విధంగా తరచూ టీమిండియా కెప్టెన్లు మారుతూ (తాత్కాలికంగా)ఉండటంపై మాజీ క్రికెటర్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఇర్ఫాన్ పఠాన్ ఈ విషయంపై స్పందిస్తూ.. ‘‘భవిష్యత్తులో ఈ సంప్రదాయం కొనసాగే అవకాశం ఉంది. అయితే, నాకు ఇలాంటి పరిణామం పెద్దగా ఇష్టం లేదు. భారత జట్టుకు ఒక్కో ఫార్మాట్లో ఒక్కో కెప్టెన్ ఉంటారనే ప్రచారం జరుగుతోంది. పని ఒత్తిడి భారాన్ని తగ్గించే క్రమంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సహజం. అందుకే సౌతాఫ్రికా పర్యటనకు మూడు వేర్వేరు జట్లు, ముగ్గురు కెప్టెన్లను నియమించారు. దీనిని బట్టి రోహిత్ శర్మ ఇకపై పరిమిత ఓవర్ల క్రికెట్లో కనిపించడని స్పష్టమైంది. అతడిని టెస్టు జట్టు కెప్టెన్‌గా మాత్రమే చూడగలం. భవిష్యత్తులో ఇది వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు కోచ్‌ల నియామకానికి కూడా దారితీస్తుంది. ఇలాంటి సంప్రదాయం మన జట్టులో కొనసాగకూడదనే అనుకుంటున్నా’’ అని జియో సినిమా షోలో ఇర్ఫాన్ పఠాన్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. వేర్వేరు కెప్టెన్లు, వేర్వేరు కోచ్‌లు ఉండటం దీర్ఘకాలంలో పెద్దగా ప్రయోజనాలు చేకూర్చదని అభిప్రాయపడ్డాడు. -
ఇర్ఫాన్‌తో ప్రేమ.. గంభీర్ మిస్డ్కాల్స్ ఇచ్చేవాడు: నటి సంచలన వ్యాఖ్యలు
Payal Ghosh Viral Comments On Irfan Pathan- Gautam Gambhir: టీమిండియా మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, గౌతం గంభీర్‌లను ఉద్దేశించి నటి పాయల్ ఘోష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇర్ఫాన్‌తో తను ప్రేమలో ఉన్నపుడు.. గంభీర్ తనకు తరచూ మిస్డ్ కాల్స్ ఇస్తూ ఉండేవాడంటూ క్రీడావర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారారు. ఊసరవెళ్లి వంటి బడా సినిమాలో మంచు మనోజ్ హీరోగా నటించిన ‘ప్రయాణం’ సినిమాతో చలనచిత్ర రంగంలో అడుగుపెట్టిన కలకత్తా బ్యూటీ పాయల్ ఘోష్. ఆ తర్వాత తెలుగులో జూ. ఎన్టీఆర్ ‘ఊసరవెళ్లి’ వంటి పలు చిత్రాల్లో అదృష్టం పరీక్షించుకున్నారు ఈ బెంగాలీ నటి. తర్వాత బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టారు. అయితే, సినిమాల కంటే సంచలన వ్యాఖ్యలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నామె. బాలీవుడ్ దర్శకుడిపై ఆరోపణలు గతంలో.. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనపై లైంగిక దాడి చేశాడని ఆరోపించిన ఆమె.. అప్పట్లో ఓ సూసైడ్ నోట్ షేర్ చేసి తన అభిమానులను ఆందోళనకు గురిచేశారు. ఇక క్యాస్టింగ్ కౌచ్ గురించి తరచుగా మాట్లాడే పాయల్ ఘోష్.. వన్డే ప్రపంచకప్-2023 నుంచి క్రికెటర్ల గురించి తన సోషల్ మీడియా అకౌంట్లలో ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. షమీ ‘ఇంగ్లిష్’ గురించి సెటైర్లు భారత్ వేదికగా వరల్డ్‌కప్-2023లో ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న టీమిండియా పేసర్ మహ్మద్ షమీ గురించి పాయల్ అప్పట్లో ఎక్స్‌లో ట్వీట్ చేశారు. మ్యాచ్ అనంతరం షమీ కేవలం హిందీలో మాత్రమే మాట్లాడటాన్ని ఉద్దేశించి.. ‘‘షమీ నువ్వు నీ ఇంగ్లిష్ పరిజ్ఞానాన్ని మెరుగుపరచుకో.. నేను నిన్ను పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాను’’ అని పాయల్ వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఇర్ఫాన్‌తో ప్రేమలో ఉన్నపుడు గంభీర్ అలా దీంతో షమీ ఫ్యాన్స్ ఆమెపై ఫైర్ అయ్యారు. తాజాగా మరో ఇద్దరు మాజీ క్రికెటర్ స్టార్లను ఉద్దేశిస్తూ పాయల్ చేసిన పోస్టులు సంచలనంగా మారాయి. ‘‘గౌతం గంభీర్ గారు నాకు తరచూ మిస్డ్కాల్స్ ఇచ్చేవారు. ఈ విషయం ఇర్ఫాన్ పఠాన్‌కు బాగా తెలుసు. ఎందుకంటే అతడు నా ఫోన్ కాల్స్ మొత్తం చెక్ చేసేవాడు. హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా ఉన్నపుడే ఈ విషయాన్ని యూసఫ్ భాయ్(ఇర్ఫాన్ అన్న), హార్దిక్, కృనాల్ పాండ్యా సమక్షంలో అతడే స్వయంగా నాకు చెప్పాడు. పుణెలో బరోడా జట్టు దేశవాళీ మ్యాచ్ జరుగుతున్నపుడు ఇర్ఫాన్‌ను కలవడానికి వెళ్లినపుడు.. అతడు నా ఫోన్ చెక్ చేసినట్లు తెలిపాడు. ఇర్ఫాన్‌ని తప్ప ఎవరినీ ప్రేమించలేదు అయితే, మా బ్రేకప్ జరిగిన తర్వాత నేను అనారోగ్యం పాలయ్యాను. ఐదేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్నాను. నేను ప్రేమించిన ఏకైక వ్యక్తి అతడే.. ఇర్ఫాన్ తర్వాత నేనెవరినీ ప్రేమించలేదు’’ అని పాయల్ ఘోష్ శుక్రవారం వరుస ట్వీట్లు చేశారు. ఈ సందర్భంగా ఇర్ఫాన్ పఠాన్‌తో దిగిన సెల్ఫీని ఆమె షేర్ చేశారు. అటెన్షన్ సీకర్ అంటూ ట్రోల్స్ కాగా పాయల్ వ్యాఖ్యలపై అటు ఇర్ఫాన్ పఠాన్ గానీ.. ఇటు గంభీర్ గానీ ఇంతవరకు స్పందించలేదు. అయితే, వారి అభిమానులు మాత్రం.. ‘‘కేవలం వార్తల్లో నిలవడానికి మాత్రమే.. అందరి చూపును తన వైపునకు తిప్పుకొనేందుకే ఆమె ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు’’ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా పాయల్ ఘోష్ జూ.ఎన్టీఆర్, అతడి అభిమానులను.. దక్షిణాది ప్రేక్షకులను ఎల్లప్పుడూ ప్రశంసిస్తూ పోస్టులు పెడుతూ ఉంటారు. చదవండి: తొలిసారి భారత జట్టులోకి.. యువ సంచలనంపై అశ్విన్ ప్రశంసలు Gautam Gambhir mujhe regularly miscall dete the , yeh Irfan ko bohot achhi ta rah pata tha , woh mera sab calls check karta tha .. woh yeh baat mere Samna Yusuf bhai, Hardik Aur Krunal Pandya ko bhi bataya tha jab main irfan ko Pune mein Milne gayi thi.. Domestic match tha… — Payal Ghoshॐ (@iampayalghosh) December 1, 2023 After we broke up … I fell ill .. I couldn’t work for years… but he was the only guy whom I loved… after that I never loved anybody 🥲 pic.twitter.com/vKRYWJl0Ti — Payal Ghoshॐ (@iampayalghosh) December 1, 2023 -
విరుచుకుపడిన ఇర్ఫాన్ పఠాన్.. 19 బంతుల్లోనే 9 సిక్సర్ల సాయంతో..!
లెజెండ్ లీగ్ క్రికెట్ రెండో ఎడిషన్ మెరుపులతో ప్రారంభమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇండియా క్యాపిటల్స్, గత సీజన్ రన్నరప్ భిల్వారా కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు సుడిగాలి ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డారు. ఫలితంగా భారీ స్కోర్లు నమోదయ్యాయి. రాణించిన గంభీర్.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా క్యాపిటల్స్.. గౌతమ్ గంభీర్ (35 బంతుల్లో 63; 8 ఫోర్లు, సిక్స్), కిర్క్ ఎడ్వర్డ్స్ (31 బంతుల్లో 59; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), బెన్ డంక్ (16 బంతుల్లో 37; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆష్లే నర్స్ (20 బంతుల్లో 34; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), థీరన్ (3 బంతుల్లో 13 నాటౌట్; 2 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌లో హషీమ్ ఆమ్లా (3), రికార్డో పావెల్ (0) లాంటి స్టార్లు విఫలమయ్యారు. భిల్వారా బౌలర్లలో అనురీత్ సింగ్ 4, రాహుల్ శర్మ 2, జెసల్ కారియా, ఇర్ఫాన్ పఠాన్ తలో వికెట్ పడగొట్టారు. ఇర్ఫాన్ పఠాన్ చెడుగుడు.. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన భిల్వారా కింగ్స్.. సోలొమోన్ మైర్ (40 బంతుల్లో 70; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇర్ఫాన్ పఠాన్ (19 బంతుల్లో 65 నాటౌట్; ఫోర్, 9 సిక్సర్లు) అర్ధశతకాలతో విరుచుకుపడటంతో 19.2 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. కింగ్స్ ఇన్నింగ్స్‌లో రాబిన్ బిస్త్ (20 బంతుల్లో 30; 3 ఫోర్లు, సిక్స్), యూసఫ్ పఠాన్్ (6 బంతుల్లో 16; 2 ఫోర్లు, సిక్స్), క్రిస్టఫర్ బామ్వెల్ (12 బంతుల్లో 22; 2 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరుగా రాణించారు. క్యాపిటల్స్ బౌలర్లలో ఇసురు ఉడాన 2, రస్టీ థీరన్ 2, ప్రవీణ్ తాంబే ఓ వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో భిల్వారా కింగ్స్ గత ఎడిషన్ ఫైనల్లో క్యాపిటల్స్ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. -
ఇర్ఫాన్ పఠాన్ బర్త్ డే స్పెషల్ (ఫోటోలు)
-
WC 2023: వంద శాతం ఫిట్‌గా లేకున్నా సరే అతడిని తీసుకురండి.. లేదంటే!
ICC ODI WC 2023 Eng Vs Afg: వన్డే వరల్డ్‌కప్-2023లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఇంగ్లండ్ అనుకున్న రీతిలో రాణించలేకపోతోంది. ఆరంభ మ్యాచ్‌లోనే న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడిన బట్లర్ బృందం.. తమ తదుపరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించి గాడిలో పడ్డట్లు కనిపించింది. కానీ.. మూడో మ్యాచ్‌కు వచ్చేసరికి కథ తలకిందులైంది. తమ వన్డే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అనూహ్య రీతిలో అఫ్గనిస్తాన్ ముందు తలవంచింది. ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా సమిష్టి వైఫల్యంతో 69 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. సొంతగడ్డపై హాట్ ఫేవరెట్ టీమిండియా, గత ఎడిషన్ రన్నరప్ న్యూజిలాండ్ హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న వేళ మాజీ చాంపియన్ ఇంగ్లండ్ ఆడిన మూడు మ్యాచ్‌లలో రెండు ఓడి పరాభవం మూటగట్టుకుంది. అతడు లేనిలోటు స్పష్టంగా కనిపించింది కాగా ఇంగ్లండ్ ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ 2019 వరల్డ్‌కప్ హీరో ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఇంగ్లండ్ మేనేజ్మెంట్కు కీలక సూచనలు చేశాడు. వంద శాతం ఫిట్‌గా లేకున్నా సరే ‘‘బెన్ స్టోక్స్ 99 శాతం ఫిట్‌గా ఉన్నా సరే అతడిని తుదిజట్టులోకి తీసుకోండి. మీకు అతడి అవసరం ఎంతగానో ఉంది. తన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకునే కదా వెనక్కి పిలిపించారు. ఒకవేళ ఇంగ్లండ్ గనుక తదుపరి మ్యాచ్ ఓడిపోతే.. తిరిగి పుంజుకోవడం చాలా కష్టం. గతంలో జరిగినట్లే ప్రతిసారి జరుగుతుందని అనుకోవడం పొరపాటే అవుతుంది’’ అని పఠాన్ పేర్కొన్నాడు. ప్రతిసారీ అలాగే జరుగదు అదే విధంగా... ‘‘2019 ప్రపంచకప్ టోర్నీలో ఇంగ్లండ్.. శ్రీలంక, పాకిస్తాన్‌తో పాటు మరో జట్టుతో మ్యాచ్‌లోనూ ఓటమి పాలైంది. వరుస పరాజయాల నుంచి కోలుకుని ఏకంగా చాంపియన్‌గా అవతరించింది. అయితే, ప్రతిసారి ఇలాగే జరగదు కదా!’’ అంటూ ఇంగ్లండ్ తమ లోపాలు సరిదిద్దుకోవాల్సిన ఆవశ్యకతను ఇర్ఫాన్ పఠాన్ నొక్కివక్కాణించాడు. కాగా ప్రపంచకప్-2023 టోర్నీ ఆడాలన్న మేనేజ్మెంట్ విజ్ఞప్తి మేరకు ఆల్‌రౌండర్ స్టోక్స్ తన వన్డే రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, గాయం కారణంగా అతడు తొలి మూడు మ్యాచ్‌లకూ అందుబాటులో ఉండలేకపోయాడు. అనుభవజ్ఞుడైన ఆటగాడు ఇలా జట్టుకు దూరం కావడం ఇంగ్లండ్ ఫలితాలను ప్రభావితం చేసిందనడంలో సందేహం లేదు. చదవండి: Ind vs Pak: ఎదుటి వాళ్లను అన్నపుడు నవ్వి.. మనల్ని అంటే ఏడ్చి గగ్గోలు పెట్టడం ఎందుకు? View this post on Instagram A post shared by ICC (@icc) -
కోలీవుడ్‌ను నమ్మి క్లీన్ బోల్డ్ అయిన 5 మంది స్టార్ క్రికెట్ ఆటగాళ్లు
కొందరు భారత్ ప్రముఖ క్రికెటర్లు సినిమా రంగంలో రానించాలనే కోరికతో తమిళ చిత్రసీమలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవాలని కలలు కంటూ.. తొలి సినిమాతోనే క్లీన్ బౌల్డ్ కావడమే కాకుండా సినిమా పరిశ్రమలోకి వచ్చినంత వేగంగానే చెన్నై వదిలి వెళ్లిపోయారు. అలాంటి ఐదుగురు సెలబ్రిటీల గురించి చూద్దాం. భారత్‌లో క్రికెట్‌కు అభిమానుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా తమిళనాడులో క్రికెటర్లకు ఉన్న ప్రాధాన్యతను తెలుసుకుని కొందరు క్రికెటర్లు తమిళ చిత్రసీమలోకి హీరోలుగా అడుగుపెట్టినా.. విజయావకాశాలను అందిపుచ్చుకోలేకపోయారు. (ఇదీ చదవండి: లారెన్స్ తన కూతురిని దాస్తున్నాడా? ఆయనకు అంత పెద్ద కూతురు ఉందా?) తమిళ సినీ పరిశ్రమలో కనిపించిన ఐదుగురు క్రికెట్ సెలబ్రిటీలకు కొంతమేరకు నష్టం తెచ్చింది. కానీ అందరికంటే భారత మాజీ కెప్టెన్ ధోనీనే ఎక్కువగా నష్టపోయాడని చెప్పవచ్చు. మరోవైపు సినిమాల్లో నటించి సక్సెస్ కాకపోవడంతో ఆ క్రికెటర్లకు అవకాశాలు రాలేదు. కొన్ని నెలల క్రితం విడుదలైన ఎల్జీఎం అనే చిత్రాన్ని క్రికెటర్ ధోనీ నిర్మించాడు. ఎనిమిది కోట్ల వ్యయంతో రూపొందిన ఈ చిత్రంలో హరీష్ కళ్యాణ్ హీరోగా నటించగా ఇవానా హీరోయిన్గా నటించింది. నదియా, యోగిబాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఇటీవల విడుదలై మిశ్రమ సమీక్షలను అందుకుంది. అలాగే, ఇప్పటి వరకు ఈ చిత్రాన్ని OTTకి విక్రయించడానికి ధోని కష్టపడుతున్నట్లు వార్తలు వచ్చాయి. అదే విధంగా ఈ సినిమా వల్ల ధోని సంస్థ నష్టపోయింది. మొదటి ప్రొడక్షన్ LGM ఫ్లాప్ కావడంతో, ధోని తన తదుపరి చిత్రం గురించి ఆలోచిస్తాడా? అనేది కూడా పెద్ద ప్రశ్నగా మారింది. నటులుగా అరంగేట్రం చేసిన క్రికెట్ దిగ్గజాలు ఈ జాబితాలో క్రికెటర్ సదాగోపన్ రమేష్ మొదటి స్థానంలో ఉన్నాడు. 1999 సెప్టెంబరులో అతను వన్డే క్రికెట్లో మొదటి బంతికే వికెట్ తీసిన తొలి భారతీయ క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. కానీ ఆయన కేవలం 19 టెస్ట్ మ్యాచ్‌లతో పాటు 24 వన్డేలు మాత్రమే ఆడారు. 2011లో దర్శకుడు యువరాజ్ దయాళన్ దర్శకత్వంలో 'బొట్ట బొట్టి' తమిళ చిత్రంలో హీరోగా నటించాడు. ఈ చిత్రం ఒక చిన్న గ్రామంలో క్రికెట్ మ్యాచ్ చుట్టూ కేంద్రీకృతమై, హాస్య కథాంశం ఆధారంగా రూపొందించబడింది. ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోవడంతో ఆదిలోనే సినీ పరిశ్రమకు దూరమయ్యాడు. అతని తర్వాత నటుడు హర్భజన్ సింగ్ ఇటీవలే 'ఫ్రెండ్షిప్' సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అదే విధంగా, ప్రముఖ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా కోలీవుడ్‌లో నటించాడు. చియాన్ విక్రమ్ నటించిన 'కోబ్రా' చిత్రంలో పోలీసు అధికారి పాత్రను పోషించాడు. సినిమాలో అతని పాత్ర ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ 'కోబ్రా' సినిమా ఘోర పరాజయం అయింది. దీంతో ఇర్ఫాన్ పఠాన్ కూడా సినిమాల నుంచి కనిపించకుండా పోయాడు. అతని తర్వాత క్రికెటర్ శ్రీశాంత్ కూడా గత సంవత్సరం విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన 'కథు వాకిల్ దౌ కాదల్'లో చిన్న పాత్రలో నటించాడు. ఈ సినిమాలో ఆయన నటించిన సన్నివేశాలను ఎక్కువగా కట్ చేయడంతో ఆయన పాత్రకు స్కోప్ లేకుండా పోయింది. అలా ఆయన కూడా మరోసారి తమిళ చిత్రసీమలో అడుగుపెట్టలేదు. (ఇదీ చదవండి: విశాల్ 'మార్క్ ఆంటోనీ' సినిమాపై బ్యాన్ విధించిన కోర్టు) సినిమా అంటే తెలుగు ప్రేక్షకలకు చాలా మక్కువ.. అందుకే భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా జైలర్,జవాన్,విక్రమ్ వంటి సినిమాలకు టాలీవుడ్లో భారీగా కలెక్షన్స్ వచ్చాయి. అలా ధోనీ నిర్మించిన మొదటి సినిమా టాలీవుడ్ నుంచి అయి ఉండుంటే కచ్చితంగా విజయవంతం అయి ఉండేదని పలువురు అభిప్రాయ పడ్డారు. ధోనీ తన LGM ప్రొడక్షన్ నుంచి తర్వాత నిర్మించబోయే సినిమా తెలుగు నుంచే ఉంటుందని వార్తలు వస్తున్నాయి. -
హార్దిక్ స్వార్థం! దారుణంగా ట్రోల్ చేసిన ఇర్ఫాన్ పఠాన్.. ట్వీట్ వైరల్
West Indies vs India, 3rd T20I: వెస్టిండీస్‌తో మూడో టీ20లో టీమిండియా విజయం నేపథ్యంలో మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. పరోక్షంగా హార్దిక్ పాండ్యాను ఉద్దేశించే పఠాన్ ఇలా ఘాటు వ్యాఖ్యలు చేశాడంటూ అభిమానులు చర్చించుకున్నాడు. పనిలో పనిగా.. ఓవరాక్షన్ పాండ్యాకు మంచి కౌంటర్ ఇచ్చావంటూ ఇర్ఫాన్ పఠాన్‌ను ప్రశంసిస్తున్నారు. పరాజయాల నుంచి తేరుకుని విండీస్ పర్యటనలో భాగంగా హార్దిక్ సేనకు తొలి రెండు టీ20లలో పరాభవం ఎదురైన విషయం తెలిసిందే. ట్రినిడాడ్‌లో 4 పరుగుల స్వల్ప తేడాతో వెస్టిండీస్ చేతిలో ఓడిన టీమిండియా.. గయనా మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. అదే వేదికపై జరిగిన కీలక మ్యాచ్‌లో మాత్రం సత్తా చాటింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్ గెలుపు ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాండ్యా బృందం 7 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. మంగళవారం నాటి మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బౌలింగ్ చేసిన భారత జట్టు.. కరేబియన్లను 159 పరుగులకు కట్టడి చేసింది. సూర్య, తిలక్ కష్టపడి.. అయితే, లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే తడబాటుకు లోనైంది. అరంగేట్ర ఓపెనర్ యశస్వి జైశ్వాల్ ఒక్క పరుగుకే పెవిలియన్ చేరగా.. శుబ్‌మన్ గిల్(6) సైతం పూర్తిగా నిరాశపరిచాడు. ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్(83) జట్టును ఆదుకునే బాధ్యతనెత్తికెత్తుకున్నాడు. యువ సంచలనం తిలక్ వర్మ(49- నాటౌట్) అద్బుతంగా ఆడుతూ అతడికి అండగా నిలిచాడు. వీరిద్దరు కలిసి కష్టాల్లో ఉన్న జట్టును గట్టెక్కించి విజయానికి చేరువ చేయగా.. సూర్య అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా(20- నాటౌట్) సిక్సర్ బాది లాంఛనం పూర్తి చేశాడు. పాపం తిలక్ వర్మ.. అయితే, అప్పటికి తిలక్ వర్మ 49 పరుగుల వద్ద ఉన్నాడు. ఇంకా పదమూడు బంతులు మిగిలే ఉన్నాయి. ఇలాంటి సమయంలో సూర్యకు అండగా నిలిచి.. క్లిష్ట సమయంలో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన తిలక్‌కు హార్దిక్ స్టైక్ ఇచ్చి ఉంటే బాగుండేది. అదే జరిగితే ఈ హైదరాబాదీ స్టార్ కెరీర్ ఆరంభంలోనే వరుసగా రెండు అర్ధ శతకాలు బాదిన బ్యాటర్‌గా నిలిచేవాడు. కానీ.. హార్దిక్ ఇలా మ్యాచ్ పూర్తి చేయడం అభిమానులతో పాటు టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా వంటి వాళ్లకు కూడా రుచించలేదు. టీమిండియా అభిమానులైతే.. ‘‘ఇంత స్వార్థం పనికిరాదు. కోహ్లి విషయంలో ధోని ఏం చేశాడో గుర్తుందా?’’ అంటూ సోషల్ మీడియాలో పాండ్యాను ఏకిపారేస్తున్నారు. మీరు కష్టపడండి.. నేను మాత్రం ఈ క్రమంలో ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ మరింత ఆసక్తికరంగా మారింది. ‘‘కష్టంగా ఉన్న పని మీరు చేయండి.. సులభంగా ఉన్న పని నేను చూసుకుంటా. ఇలాంటివి వినీ వినీ..’’ అంటూ తన వ్యాఖ్యలను అసంపూర్తిగా వదిలేశాడు. దీంతో.. ఇర్ఫాన్.. హార్దిక్‌ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశాడని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. సిరీస్ ఆరంభం నుంచి కెప్టెన్‌గా ఓవరాక్షన్ చేస్తున్న పాండ్యా.. ఇప్పుడిలా స్వార్థంగా ప్రవర్తించడం ఎవరికీ నచ్చడం లేదంటూ చురకలు అంటిస్తున్నారు. చదవండి: ఇంతలో ఎంత మార్పు.. ఐపీఎల్లో పులిలా, దేశానికి ఆడేప్పుడు పిల్లిలా..! Mushkil kaam aap karo, Asaan kaam mein Kar leta hoo. Suna suna Sa lagta hai… — Irfan Pathan (@IrfanPathan) August 9, 2023 -
సరిపోని టిమ్ సీఫర్ట్ మెరుపులు.. ఇర్ఫాన్ పఠాన్ ఊచకోత
జింబాబ్వే వేదికగా జరుగుతున్న జిమ్ ఆఫ్రో టీ10 లీగ్‌లో డర్బన్ ఖలందర్స్‌కు ఆడుతున్న న్యూజిలాండ్ ప్లేయర్ టిమ్ సీఫర్ట్ విధ్వంసం సృష్టించాడు. 31 బంతుల్లో 4 ఫోర్లు, 6 భారీ సిక్సర్ల సాయంతో అజేయమైన 71 పరుగులు చేశాడు. కేవలం 18 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన సీఫర్ట్‌కు నిక్ వెల్చ్ (9 బంతుల్లో 22 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు) తోడవ్వడంతో డర్బన్ ఖలందర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. ఖలందర్స్ ఇన్నింగ్స్‌లో హజ్రతుల్లా జజాయ్ (3), ఆండ్రీ ఫ్లెచర్ (2) విఫలం కాగా.. ఆసిఫ్ అలీ (18; 2 సిక్సర్లు) కాసేపు అలరించాడు. హరారే బౌలర్లలో మహ్మద్ నబీ 2 వికెట్లు పడగొట్టగా.. సమిత్ పటేల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. Irfan Pathan rolling back the 🕰️ for some Sunday entertainment! #ZimAfroT10 #CricketsFastestFormat #T10League #DQvHH pic.twitter.com/OV44qCpSeG — ZimAfroT10 (@ZimAfroT10) July 23, 2023 అనంతరం 127 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హరారే హరికేన్స్.. కొండంత లక్ష్యాన్ని చూసి ఏమాత్రం వెరవక ఖలందర్స్‌కు ధీటైన సమాధానం ఇచ్చింది. ఆ జట్టు మరో 2 బంతులు మిగిలుండగానే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్ రెగిస్ చకబ్వా (22 బంతుల్లో 44 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగిపోగా.. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ విశ్వరూపం ప్రదర్శించాడు. వీరికి డొనవన్ ఫెరియెరా (16; 2 సిక్సర్లు), మహ్మద్ నబీ (19; 2 ఫోర్లు, సిక్స్) సహకరించారు. హరారే ఇన్నింగ్స్‌లో రాబిన్ ఉతప్ప (1), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (2) విఫలమయ్యారు. ఖలందర్స్ బౌలర్లలో మహ్మద్ అమీర్ 2, బ్రాడ్ ఈవాన్స్, జార్జ్ లిండే, టెండాయ్ చటారా తలో వికెట్ పడగొట్టారు. Seifert Storm in Harare! 🌪️#ZimAfroT10 #CricketsFastestFormat #T10League #DQvHH pic.twitter.com/DvxQ84T4hr — ZimAfroT10 (@ZimAfroT10) July 23, 2023 -
రాణించిన ఉతప్ప.. నిరాశపరిచిన పఠాన్ సోదరులు
జింబాబ్వే వేదికగా జరుగుతున్న జిమ్ ఆఫ్రో టీ10 లీగ్‌లో భారత వెటరన్ ఆటగాళ్లు నామమాత్రపు ప్రదర్శనలకే పరిమితమవుతున్నారు. ఈ లీగ్‌లో మొత్తం ఆరుగురు భారత వెటరన్లు పాల్గొంటుండగా.. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయలేకపోయారు. నిన్న (జులై 22) జరిగిన మ్యాచ్‌ల్లో కేప్‌టౌన్ కెప్టెన్ పార్థివ్ పటేల్ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి ఘోరంగా విఫలం కాగా.. హరారే ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ బ్యాటింగ్ (4), బౌలింగ్ (1-0-21-0) విభాగాల్లో దారుణంగా నిరాశపరిచాడు. భారత ఆటగాళ్లలో హరారే ఆటగాడు రాబిన్ ఉతప్ప (31) ఒక్కడే పర్వాలేదనిపించాడు. కేప్ హరారే హరికేన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టౌన్ సాంప్ ఆర్మీ.. రహ్మానుల్లా గుర్భాజ్ (25) ఓ మోస్తరు స్కోర్ చేయడంతో నిర్ణీత 10 ఓవర్లలో 112/7 స్కోర్ చేయగా.. హరారే హరికేన్స్ నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి 97/6 స్కోర్ చేసి 15 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. డర్బన్ ఖలందర్స్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో జోబర్గ్ బఫెలోస్ ఆటగాడు, భారత మాజీ ఆల్‌రౌండర్ యూసఫ్ పఠాన్ సైతం తేలిపోయాడు. అతను 8 బంతులు ఎదుర్కొని కేవలం 4 పరుగులు మాత్రమే చేశాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జోబర్గ్ బఫెలోస్.. టామ్ బాంటన్ (55 నాటౌట్) చెలరేగడంతో నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేయగా.. డర్బన్ ఖలందర్స్మరో 5 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. హజ్రతుల్లా జజాయ్ (41 నాటౌట్) డర్బన్ను గెలిపించాడు. నిన్ననే జరిగిన మరో మ్యాచ్‌లో కేప్‌టౌన్ సాంప్ ఆర్మీ.. బులవాయో బ్రేవ్స్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బ్రేవ్స్.. బెన్ మెక్‌డెర్మాట్ (27) రాణించడంతో 10 ఓవర్లలో 86 పరుగులు చేయగా.. 21 బంతుల్లో 43 పరుగులు చేసిన మరుమాని సాంప్ ఆర్మీని గెలిపించాడు. కాగా, జింబాబ్వే-ఆఫ్రో టీ10 లీగ్‌లో భారత ఆటగాళ్లు పార్థివ్ పటేల్, స్టువర్ట్ బిన్నీ (కేప్‌టౌన్ సాంప్ ఆర్మీ), రాబిన్ ఉతప్ప, ఇర్ఫాన్ పఠాన్, శ్రీశాంత్ (హరారే హరికేన్స్), యూసఫ్ పఠాన్ (జోబర్గ్ బఫెలోస్) పాల్గొంటున్న విషయం తెలిసిందే. -
అదే జరిగితే CSK గెలిచేదే కాదు..!
-
సీఎస్కేకు ఫైనల్లో అడ్వాంటేజ్ అంటూ ట్వీట్! నీకెందుకంత అక్కసు? మరి ముంబై అయితే..
IPL 2023 Winner CSK: టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్‌పై చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు మండిపడుతున్నారు. సీఎస్కేపై అంత అక్కసు ఎందుకు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ చెన్నై స్థానంలో ముంబై ఇండియన్స్ ఉంటే ఇలాగే మాట్లాడేవాడివా అంటూ ట్రోల్ చేస్తున్నారు. సొంత రాష్ట్ర జట్టుపై అభిమానం ఉండటంలో తప్పులేదని.. కానీ అది ఇతరులను తక్కువ చేసే విధంగా మాత్రం ఉండకూడదంటూ హితవు పలుకుతున్నారు. కాగా ఐపీఎల్-2023 విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ అవతరించిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రిజర్వ్ డే మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి ఐదోసారి ట్రోఫీని ముద్దాడింది ధోని సేన. డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం 5 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసి పదహారో ఎడిషన్ చాంపియన్‌గా అవతరించింది. ఒక్కొక్కరికి మూడు ఓవర్లు నిజానికి మే 28(ఆదివారం)న జరగాల్సిన ఈ మ్యాచ్ ఎడతెరిపిలేని వర్షం కారణంగా మరుసటి రోజుకు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే, సోమవారం కూడా వరుణుడు అడ్డు తగలడంతో లక్ష్య ఛేదనలో మ్యాచ్‌ను 15 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 214 పరుగుల భారీ స్కోరు చేయగా.. చెన్నై విజయసమీకరణాన్ని 15 ఓవర్లలో 171 పరుగులుగా నిర్దేశించారు అంపైర్లు. అదే విధంగా ఒక్కో బౌలర్ కేవలం 3 ఓవర్ల్ బౌల్ చేసేందుకు అనుమతినిచ్చారు. జడ్డూ విన్నింగ్ షాట్ ఈ క్రమంలో టార్గెట్ ఛేదనలో భాగంగా సీఎస్కే ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(26), డెవాన్ కాన్వే (47) శుభారంభం అందించగా.. శివం దూబే(32- నాటౌట్), అజింక్య రహానే (27), అంబటి రాయుడు (8 బంతుల్లో 19) తలా ఓ చెయ్యి వేశారు. ఆఖరి రెండు బంతుల్లో చెన్నై గెలుపునకు 10 పరుగుల అవసరమైన వేళ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వరుసగా 6,4 బాది చిరస్మరణీయ విజయం అందించాడు. దీంతో క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో ఐదోసారి ట్రోఫీ గెలిచిన జట్టుగా ముంబై ఇండియన్స్‌తో చెన్నై సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో సీఎస్కేతో పాటు ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. మ్యాచ్ ముగిసి రోజులు గడుస్తున్నా.. సోషల్ మీడియాలో సందడి కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఇర్ఫాన్ పఠాన్ చేసిన ట్వీట్ ఫ్యాన్స్‌కు ఆగ్రహం తెప్పించింది. ఇంతకీ అతడేమన్నాడంటే.. సీఎస్కేకు అడ్వాంటేజ్‌గా మారింది ‘‘వర్షం కారణంగా కుదించిన మ్యాచ్‌లో సీఎస్కే షమీ బౌలింగ్‌లో బ్యాటింగ్ మొదలెట్టింది. నాలుగు ఓవర్ల రెగ్యులర్ కోటాలో రషీద్, మోహిత్ ఒక్కో ఓవర్ కోల్పోవాల్సి వచ్చింది. లీగ్ టాప్ వికెట్ టేకర్లలో ముగ్గురు 18 బంతులు వేసేందుకే పరిమితమయ్యారు. అందులో ఇద్దరు వికెట్లు తీయలేకపోయారు. అది సీఎస్కేకు ప్రయోజనం చేకూర్చింది’’ అని ఇర్ఫాన్ పఠాన్ మంగళవారం ట్విటర్లో పేర్కొన్నాడు. ఇందుకు స్పందించిన నెటిజన్లు.. ‘‘షమీ/రషీద్, మోహిత్ కలిసి 3 ఓవర్లలో 54 బంతులు వేశారు. సీఎస్కే 108 పరుగులు సాధించింది. ఒకవేళ వాళ్లు పూర్తిస్థాయిలో బౌలింగ్ చేసినా 145 పరుగులు చేసేది. మ్యాచ్ 20 ఓవర్లపాటు జరిగినా సీఎస్కే 19వ ఓవర్లోనే లక్ష్యాన్ని ఛేదించేది. మనకు అసలు ఈ ఉత్కంఠ రేపే మ్యాచ్ చూసే అవకాశమే వచ్చేది కాదు. అయినా, నీకెందుకు అంత అక్కసు ఇర్ఫాన్ పఠాన్’’ అని ఏకిపారేస్తున్నారు. కాగా గుజరాత్‌కు చెందిన ఇర్ఫాన్ 2003లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. 2012లో భారత్ తరఫున తన చివరి మ్యాచ్ ఆడాడు. ప్రస్తుతం కామెంటేటర్‌గా కొనసాగుతున్నాడు. చదవండి: అది చాలా పెద్ద తప్పు.. అంబటి రాయుడుకి అన్యాయం చేశారు: కుంబ్లే In the curtailed shortened final, of Shami/Rashid & Mohit - 3 overs of 54b they bowled CSK scored 109 runs. So if they had bowled csk would have scored 145 runs leaving only 71 to score of remaining 8. That means if we had a full game, we could have ended the game in 19 overs… — Prabhu (@Cricprabhu) May 30, 2023 Happy Tears 🥹#CHAMPION5 #WhistlePodu #Yellove 🦁pic.twitter.com/jf05fszEDA — Chennai Super Kings (@ChennaiIPL) May 30, 2023 -
ధోనిని అలా చూడలేకపోయా.. నా హృదయం ముక్కలైంది! వైరల్ వీడియో
IPL 2023 CSK Vs DC: ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో బ్యాట్ ఝులిపించిన చెన్నై సారథి మహేంద్ర సింగ్ ధోని తన అభిమానులకు కావాల్సినంత వినోదం పంచాడు. జట్టు తక్కువ స్కోరుకే పరిమితయ్యే ప్రమాదం పొంచి ఉన్న వేళ తానున్నానంటూ మరోసారి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. ఆరు వికెట్ల నష్టానికి సీఎస్కే 126 పరుగులే చేసిన తరుణంలో క్రీజులోకి వచ్చాడు ధోని. క్రీజులోకి రాగానే 17వ ఓవర్ రెండో బంతికి అంబటి రాయుడును ఖలీల్ అహ్మద్ అవుట్ చేయడంతో ధోని మైదానంలో అడుగుపెట్టాడు. తర్వాతి రెండు బంతుల వరకు ఒక్క పరుగు కూడా రాబట్టలేకపోయిన తలా.. మూడో బంతికి సింగిల్ తీశాడు. దీంతో స్ట్రైక్ తీసుకున్న రవీంద్ర జడేజా మరో సింగిల్‌తో ఓవర్ ముగించాడు. ఆ తర్వాతి ఓవర్లో జడ్డూ ఒక్కడే 11 పరుగులు స్కోరు చేశాడు. ఈ క్రమంలో 19 ఓవర్ వేసిన ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో మూడో బంతికి ధోని సిక్సర్ బాది తన పవరేంటో చూపించాడు. అలా తెరపడింది ఆ మరుసటి బంతికి ఫోర్ కొట్టిన తలా.. తర్వాత రెండు పరుగులు రాబట్టి.. నెక్ట్స్ బాల్‌కు మరో సిక్స్‌తో చెలరేగాడు. ధోని మెరుపులతో పందొమ్మిదో ఓవర్లో సీఎస్కే 21 పరుగులు రాబట్టగలిగింది. అయితే, ఆఖరి ఓవర్ రెండో బంతికి జడ్డూను అవుట్ చేసిన మిచెల్ మార్ష్.. ఐదో బంతికి ధోనిని కూడా పెవిలియన్‌కు పంపాడు. దీంతో ధోని ఇన్నింగ్స్‌కు తెరపడింది. అయితే, ఆఖర్లో ధోని మెరుపుల కారణంగా 167 పరుగులు స్కోర్ చేసిన సీఎస్కే.. బౌలర్ల విజృంభణతో లక్ష్యాన్ని కాపాడుకుని 27 పరుగులతో జయభేరి మోగించింది. దీంతో చెపాక్‌లో సంబరాలు అంబరాన్నంటాయి. ఇక ఈ మ్యాచ్ మొత్తానికి ధోని ఇన్నింగ్స్ హైలైట్‌గా నిలిచిందనడంలో సందేహం లేదు. ధోనిని అలా చూడలేకపోయా ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్, కామెంటేటర్ ఇర్ఫాన్ పఠాన్ ధోనిని ఉద్దేశించి భావోద్వేగ ట్వీట్ చేశాడు. ‘‘వికెట్ల మధ్య ధోని అలా కుంటుతూ పరిగెత్తడం చూసి నా హృదయం ముక్కలైంది. నిజానికి తనను ఎప్పుడూ వేగానికి మారుపేరైన చిరుతలా చూసేవాళ్లం కదా’’ అని పఠాన్ ఉద్వేగానికి లోనయ్యాడు. ఇక మ్యాచ్ అనంతరం ధోనిని ఆత్మీయంగా హత్తుకున్న ఫొటోలు పంచుకున్న ఇర్ఫాన్ పఠాన్ పాత జ్ఞాపకాలు గుర్తుకువస్తున్నాయంటూ ట్వీట్ చేశాడు. కాగా ధోని మోకాలి నొప్పితో బాధపడుతున్నట్లు సీఎస్కే హెడ్‌కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ గతంలో వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పఠాన్.. ధోని ఇన్నింగ్స్‌ను ఉద్దేశించి ఈ మేరకు ట్వీట్ చేశాడు. చదవండి: జట్టుకు పట్టిన దరిద్రం అన్నారు.. ఇప్పుడెమో చుక్కలు చూపిస్తున్నాడు! సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన అంబటి రాయుడు Seeing Dhoni limping thru running between the wickets breaks my heart. Have seen him run like a cheetah. — Irfan Pathan (@IrfanPathan) May 10, 2023 Jaha se chorte hai wahi se fir se shuru hoti hai Hamari dosti. Never been a time where we met and didn’t remember our good old days. Some funny memories comes back to the life every time we meet. @msdhoni @ChennaiIPL #leader #friend pic.twitter.com/R2XkrLUrEq — Irfan Pathan (@IrfanPathan) May 11, 2023 DO NOT MISS! When @msdhoni cut loose! 💪 💪 Follow the match ▶️ https://t.co/soUtpXQjCX#TATAIPL | #CSKvDC | @ChennaiIPL pic.twitter.com/kduRZ94eEk — IndianPremierLeague (@IPL) May 10, 2023 -
కనీసం ఒక్క మ్యాచ్‌లోనైనా నిరూపించుకున్నాడా? మరీ దారుణంగా.. ఇప్పటికైనా
IPL 2023- Dinesh Karthik: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ దినేశ్ కార్తిక్ ఆట తీరును టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ విమర్శించాడు. ఐపీఎల్-2023లో ఇప్పటి వరకు ఆడిన మ్యాచ్‌లలో కనీసం ఒక్కదాంట్లో కూడా స్థాయికి తగ్గట్లు రాణించలేదని పెదవి విరిచాడు. జట్టు తనపై ఆధారపడొచ్చనే భరోసా ఇవ్వలేకపోయాడంటూ విమర్శలు గుప్పించాడు. అప్పుడు అదుర్స్. .. గత సీజన్లో ఆర్సీబీ ఫినిషర్‌గా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించి.. ఐపీఎల్ ప్రదర్శన ద్వారా భారత జట్టులో పునరాగమనం చేశాడు వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్. కానీ పదహారో ఎడిషన్‌లో సీన్ రివర్స్ అయింది. గతేడాది ఐపీఎల్లో 16 ఇన్నింగ్స్‌లలో 330 పరుగులు చేసిన డీకే.. ఈ ఏడాది ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్‌లలో సాధించినవి కేవలం 83 పరుగులు. ఇప్పుడేమో తుస్ ఈ గణాంకాలను బట్టి దినేశ్ కార్తిక్ ప్రదర్శన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గతేడాది ఆర్సీబీకి బలంగా ఉన్న డీకే ఈసారి మాత్రం అంచనాలు అందుకోలేకపోతున్నాడు. ఒక్క మ్యాచ్‌లో కూడా తనదైన ముద్ర వేయలేకపోయాడు. మరోవైపు ఆర్సీబీ భారమంతా విరాట్ కోహ్లి, గ్లెన్ మాక్స్వెల్, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ మీదే పడుతోంది. కేజీఎఫ్‌పైనే భారం ప్రతిసారీ ఈ ముగ్గురిపైనే ఆధారపడటంతో వీరిలో ఒక్కరు విఫలమైనా ఆర్సీబీ విజయాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘కేజీఎఫ్ (కోహ్లి, గ్లెన్, ఫాఫ్) గనుక ఒకవేళ స్థాయికి తగ్గట్లు రాణించలేని పరిస్థితుల్లో ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలో ఆర్సీబీ యాజమాన్యం ప్రణాళికలు రచించుకోవాలి. వాళ్లు గనుక విఫలమై జట్టు కష్టాల్లో కూరుకుపోతే బాధ్యతను నెత్తినవేసుకోగల ఆటగాళ్లను తయారుచేసుకోవాలి. ఆ ప్లేయర్ దినేశ్ కార్తికా లేదంటే మహిపాల్ లామ్రోరా అన్న విషయాన్ని పక్కనపెడితే.. ఆర్సీబీ మిడిలార్డర్ మాత్రం పూర్తి బలహీనంగా ఉంది. ఇప్పటికైనా కళ్లు తెరవకపోతే ముఖ్యంగా కార్తిక్ గత ఎనిమిది మ్యాచ్‌లలో కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా జట్టు తనపై ఆధారపడొచ్చు అనే భరోసాను ఇవ్వలేకపోయాడు. మేనేజ్మెంట్ కచ్చితంగా ఈ బ్యాటింగ్ లోపాలను సరిచేసుకోవాలి’’ అని సూచించాడు. లేనిపక్షంలో భారీ మూల్యం తప్పదంటూ ఇర్ఫాన్ హెచ్చరికలు జారీ చేశాడు. కాగా గత మ్యాచ్‌లో సొంతమైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమిపాలైన ఆర్సీబీ.. మే 1న లక్నోలో సూపర్ జెయింట్స్‌తో పోటీకి సిద్ధమైంది. ఈ క్రమంలో గాయపడిన డేవిడ్ విల్లే స్థానంలో కేదార్ జాదవ్‌ను జట్టులోకి తీసుకున్నట్లు ప్రకటించింది. చదవండి: Viral: మిస్టర్ కూల్‌కు ఆగ్రహం! నీకసలు బుద్ధుందా? జట్టులో నుంచి తీసిపారేయండి! MI Vs RR: గ్రహణం వీడింది..! అతడు భవిష్యత్ సూపర్‌స్టార్.. నో డౌట్! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ధోని బాగా ఆడాలి.. కానీ ముంబై గెలవాలి! గెలుస్తుంది కూడా! అంతలేదు..
IPL 2023- MI Vs CSK Winner Prediction: గతేడాది ఐపీఎల్లో చెత్త ప్రదర్శనతో భారీ ఎత్తున విమర్శలు మూటగట్టుకున్నాయి మాజీ చాంపియన్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్. ఐదుసార్లు ట్రోఫీ గెలిచిన ముంబై 14కు మ్యాచ్‌లకు గానూ కేవలం నాలుగే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఇక రోహిత్ సేన దారుణ వైఫల్యం సంగతి ఇలా ఉంటే.. ధోని సారథ్యంలో నాలుగుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన సీఎస్కే పరిస్థితి కూడా అంతే చెత్తగా ఉంది. తొలుత టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు చెన్నై పగ్గాలు అప్పగించగా.. వరుస ఓటముల నేపథ్యంలో అతడు మధ్యలోనే తప్పుకొన్నాడు. దీంతో మళ్లీ మహేంద్ర సింగ్ ధోనినే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ముంబైలాగే నాలుగు మ్యాచ్‌లే గెలిచినా కాస్త మెరుగైన రన్‌రేటుతో తొమ్మిదో స్థానంలో నిలిచింది సీఎస్కే. పంతం నీదా- నాదా సై అంటున్న ముంబై, సీఎస్కే ఈ క్రమంలో ఐపీఎల్-2023 ఆరంభ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిన ధోని సేన.. సొంత మైదానం చెపాక్‌లో మాత్రం సత్తా చాటింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో విజయం సాధించి గెలుపు బోణీ కొట్టింది. ఇదిలా ఉంటే ముంబై ఇండియన్స్ చెన్నై మాదిరే ఓటమితో ఈ సీజన్‌ను ఆరంభించింది. బెంగళూరులో ఆర్సీబీతో మ్యాచ్‌లో 8 వికెట్ల భారీ తేడాతో పరాజయం పాలైంది. ఈ క్రమంలో ముంబై- సీఎస్కే మధ్య శనివారం(ఏప్రిల్ 8) నాటి పోరు ఆసక్తికరంగా మారింది. ధోని సేన మరో గెలుపు నమోదు చేస్తుందా? లేదంటే ముంబై సొంతగడ్డపై పైచేయి సాధిస్తుందా అన్న విషయంపై చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ధోని బాగా ఆడాలి.. కానీ ముంబై గెలవాలి బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ షోలో పఠాన్ మాట్లాడుతూ.. ‘‘ముంబైలో ఉన్న క్రికెట్ అభిమానులు.. ఎంఎస్ ధోని తన అద్భుత ప్రదర్శనతో తమకు వినోదం పంచాలని ఆశిస్తారు. అయితే, అదే సమయంలో ముంబై ఇండియన్స్‌ను విజయం వరించాలని కోరుకుంటారు. ఏదేమైనా సొంతమైదానంలో ముంబై ఇండియన్స్‌ను ఓడించడం అంత సులువేమీ కాదు. గతంలో వాంఖడేలో సీఎస్కే, ముంబై జట్ల మధ్య 10 మ్యాచ్‌లు జరిగితే అందులో ఏడుసార్లు ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ముంబైదే విజయం.. అంతలేదు సీఎస్కేను ఓడించాలంటే గణాంకాలను బట్టి చూస్తే చెన్నైపై ముంబై కచ్చితంగా గెలిచి తీరుందని స్పష్టమవుతోంది. ముంబై ఖాతాలో రెండు పాయింట్లు చేరడం ఖాయం’’ అని అంచనా వేశాడు. ఇక యూసఫ్ సోదరుడు, టీమిండియా మాజీ ప్లేయర్ ఇర్ఫాన్ పఠాన్ సైతం సొంతమైదానంలో ఆడుతున్నందున రోహిత్ సేనకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అభిప్రాయపడ్డాడు. ఇదిలా ఉంటే టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ మాత్రం.. ‘‘సొంతగడ్డపై ముంబై బలం రెట్టింపు అవుతుందనడంలో సందేహం లేదు. కానీ.. ఏ గ్రౌండ్‌లోనైనా సీఎస్కేను ఓడించాలంటే చెమటోడ్చక తప్పదు’’ అని చెప్పుకొచ్చాడు. చదవండి: రూ. 13 కోట్లు పెట్టారు కదా! ఇలాగే ఉంటది.. కానీ పాపం: భారత మాజీ క్రికెటర్ సీఎస్కేతో మ్యాచ్.. సచిన్ కొడుకు ఐపీఎల్ ఎంట్రీ! -
అస్సలు ఊహించలేదు.. అందరి అంచనాలు తలకిందులు చేశాడు: మాజీ ప్లేయర్
IPL 2022- KKR vs RCB: ఐపీఎల్-2023లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు తొలి విజయం అందించిన ‘లార్డ్’ శార్దూల్ ఠాకూర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. జట్టు కష్టాల్లో కూరుకుపోయిన వేళ ఈ పేస్ ఆల్‌రౌండర్ తన అద్భుత ఇన్నింగ్స్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చి వేశాడంటూ కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణా కొనియాడాడు. ఇక టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సైతం శార్దూల్ నుంచి ఇలాంటి బ్యాటింగ్ ప్రదర్శన అస్సలు ఊహించలేదంటూ ఆకాశానికెత్తాడు. కాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో గురువారం జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 81 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈడెన్ గార్డెన్స్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ టాపార్డర్‌లో ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్(57) మిగతా వాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు. చుక్కలు చూపించిన శార్దూల్ ఈ క్రమంలో ఐదో స్థానంలో వచ్చిన రింకూ సింగ్(46), ఏడో స్థానంలో వచ్చిన శార్దూల్ ఠాకూర్ అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. శార్దూల్ 29 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 68 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ నేపథ్యంలో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేకేఆర్ 204 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన ఆర్సీబీ 123 పరుగులకే చాపచుట్టేసింది. కేకేఆర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 4 వికెట్లు పడగొట్టగా.. సునిల్ నరైన్ రెండు, సూయశ్ శర్మ మూడు వికెట్లతో మెరిశారు. బ్యాటింగ్‌లో అదరగొట్టి శార్దూల్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. రసెల్ లాంటి వాళ్ల నుంచి ఇలాంటివి ఊహిస్తాం.. కానీ ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ షోలో ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ.. ‘‘కఠిన పరిస్థితుల్లో శార్దూల్ ఠాకూర్ ఆడిన ఇన్నింగ్స్ ప్రశంసనీయం. కేకేఆర్ టాపార్డర్, స్టార్ బ్యాటర్లు డగౌట్లో కూర్చున్న వేళ మైదానంలోకి దిగిన శార్దూల్ ప్రత్యర్థి జట్టు బౌలర్లకు ధీటుగా బదులిచ్చాడు. మ్యాచ్ స్వరూపాన్నే మార్చివేశాడు. ఊహించని రీతిలో శార్దూల్ నిజానికి ఆండ్రీ రసెల్, నితీశ్ రాణా, మన్దీప్ సింగ్ నుంచి ఇలాంటి ఇన్నింగ్స్ ఊహిస్తాం. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ శార్దూల్ చెలరేగిన తీరు అద్బుతం. శార్దూల్ 30-35 పరుగులు చేస్తే ఎక్కువని భావిస్తాం. అలాంటిది అతడు ఎవరూ ఊహించని రీతిలో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. నమ్మకం నిలబెట్టుకున్నాడు టీ20లలో అతడికి ఇదే అత్యధిక స్కోరనుకుంటా. తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. వికెట్లు తీస్తాడని.. ఆరు.. ఏడో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడని కేకేఆర్ అతడిని కొనుగోలు చేసింది. తనను ఎంపిక చేసి వారు తప్పు చేయలేదని శార్దూల్ నిరూపించుకున్నాడు’’ అని ఇర్ఫాన్ పఠాన్.. శార్దూల్ ఠాకూర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. కాగా కేకేఆర్ తమ తదుపరి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఏప్రిల్ 9న తలపడనుంది. చదవండి: ఎందుకు వస్తున్నాడో తెలియదు.. చెత్త బ్యాటింగ్! ప్రతీసారి ఇంతే గిల్, రాహుల్ కాదు.. అతడే టీమిండియా కెప్టెన్ అవుతాడు! జట్టులో ప్లేసే దిక్కు లేదు Lord Shardul Thakur show. Unbelievable hitting against RCB bowlers.pic.twitter.com/yY0qeQGhhC — Mufaddal Vohra (@mufaddal_vohra) April 6, 2023 -
మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కోచ్ కన్నుమూత
మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కోచ్.. బరోడా మాజీ రంజీ ఆటగాడు నారాయణ్ రావు సాథమ్(73) కన్నుమూశారు. ఆదివారం ఆయన గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు దృవీకరించారు. 1970,80వ దశకంలో బరోడా తరపున దేశవాలీ క్రికెట్లో బెస్ట్ ఆల్రౌండర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక దులీప్ ట్రోఫీలో భాగంగా వెస్ట్‌జోన్‌కు ఆడుతున్న సమయంలో సునీల్ గావస్కర్, అశోక్ మన్కడ్, అజిత్ వాడేకర్‌లతో కలిసి డ్రెస్సింగ్‌రూమ్ షేర్ చేసుకున్నాడు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత కోచ్‌గా మారిన నారాయణ్ సాథమ్ ఎంతో మంది క్రికెటర్లను వెలుగులోకి తెచ్చాడు. అలా వచ్చినవారే కిరణ్ మోరే, మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్లు. కాగా నారాయణ్ సాథమ్ మృతిపై మాజీ క్రికెటర్ కిరణ్ మోరే ఎమోషన్ అయ్యాడు. ట్విటర్ వేదికగా కిరణ్ మోరే స్పందించాడు. ''నా జీవితంలో ఈరోజు చాలా దుర్దినం. నా మెంటార్, కోచ్, గురువు నారాయణ్ రావు సాథమ్ కన్నుమూశారు. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి ఆయనే కారణం. నా గురువును చాలా మిస్సవుతున్నా.. బరోడా జట్టుకు ఇది పెద్ద నష్టం అని చెప్పుకోవాలి'' అంటూ ట్వీట్ చేశాడు. తన ఫస్ట్‌క్లాస్ కెరీర్లో నారాయణ్ సాథమ్ 84 మ్యాచ్‌లాడి 3119 పరుగులతో పాటు 193 వికెట్లు పడగొట్టాడు. Today is a very sad day for me personally. My mentor, coach and Guru, Narayan Rao Satham, has passed away. What I have achieved till today was all because of him. I am going to miss him and this is a big loss for Baroda #cricket #OmShanti pic.twitter.com/wG6rdrC4Nu — Kiran More (@JockMore) February 12, 2023 చదవండి: మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడిన ఫకర్ జమాన్ ప్రపంచానికి తెలియని ఆసీస్ క్రికెటర్ల ప్రేమకథ -
WC 2023: ప్రపంచకప్ జట్టులో శార్దూల్‌కు చోటు ఖాయం! అంతలేదు..
India vs New Zealand- Shardul Thakur: ‘‘శార్దూల్.. అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. లోపాలు సవరించుకుంటూ పట్టువదలని విక్రమార్కుడిలా ముందుకు సాగుతూనే ఉంటాడు. తను బంతిని పెద్దగా స్వింగ్ చేయలేడని మనం భావించినప్పుడల్లా మనల్ని ఆశ్చర్యపరుస్తూ వికెట్లు తీస్తూనే ఉంటాడు. తను ప్రతిసారి గంటకు 140కిలోమీటర్లకు పైగా వేగంతో బౌలింగ్ చేయకపోవచ్చు. కానీ.. అతడు నంబర్ 1గా ఎదుగుతాడు’’ అని టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. భారత పేస్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. రాణించిన శార్దూల్ ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో శార్దూల్ మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. హైదరాబాద్‌లో జరిగిన మొదటి వన్డేలో 7.2 ఓవర్లలో 54 పరుగులు ఇచ్చిన రెండు వికెట్లు తీసిన అతడు.. 3 పరుగులు చేయగలిగాడు. రాయ్‌పూర్ వన్డేలో 6 ఓవర్లలో 26 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఆఖరిదైన ఇండోర్ మ్యాచ్‌లో 17 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 25 పరుగులతో సత్తా చాటిన శార్దూల్.. 6 ఓవర్లలో 45 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. చోటు ఖాయం ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ మ్యాచ్ పాయింట్ సందర్భంగా.. వన్డే ప్రపంచకప్ జట్టు గురించి ప్రస్తావనకు రాగా ఇర్ఫాన్ పఠాన్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కివీస్‌తో ఫైనల్ వన్డేలో శార్దూల్ ప్రదర్శనపై స్పందిస్తూ.. వరల్డ్‌కప్ జట్టులో ఫాస్ట్‌బౌలర్ల విభాగంలో అతడికి కచ్చితంగా చోటు దక్కుతుందని అంచనా వేశాడు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేయగల శార్దూల్ మిగతా వాళ్లకంటే ఓ అడుగు ముందే ఉంటాడని చెప్పుకొచ్చాడు. అంతలేదన్న మంజ్రేకర్ అయితే, మరో మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ మాత్రం ఇర్ఫాన్ అభిప్రాయంతో ఏకీభవించలేదు. ప్రపంచకప్ జట్టులో శార్దూల్‌కు స్థానం దక్కుతుందని తాను భావించడం లేదన్నాడు. ‘‘మెగా టోర్నీకి ఇంకా చాలా సమయం ఉంది. జట్టులో హార్దిక్ పాండ్యా ఉన్నాడు. తనూ పేస్ ఆల్‌రౌండరే. కాబట్టి శార్దూల్‌కు చోటు కష్టమే. పేసర్ల విభాగంలోనూ అతడు గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని మంజ్రేకర్ పేర్కొన్నాడు. చదవండి: ICC T20 World Cup: ప్రపంచకప్ సెమీ ఫైనల్లో టీమిండియా.. కివీస్‌తో పోరుకు సై IPL: ఆల్‌టైం జట్టులో ఏబీడీకి చోటివ్వని టీమిండియా లెజెండ్! కానీ.. -
హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేస్తారా? బీసీసీఐకి వార్నింగ్ ఇచ్చిన ఇర్ఫాన్ పఠాన్
భారత జట్టు టీ20 కెప్టెన్‌గా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను నియమించడానికి బీసీసీఐ సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. కాగా స్వదేశంలో శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్‌కు రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కావడంతో టీమిండియా కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా వ్యవహారించనున్నాడు. ఇప్పటికే పలు టీ20 సిరీస్‌లో భారత కెప్టెన్‌గా వ్యవహారించిన హార్దిక్ జట్టుకు అద్భుతమైన విజయాలు అందించాడు. అదే విధంగా ఐపీఎల్ అరంగేట్ర సీజన్లోనే గుజరాత్ టైటాన్స్‌కు టైటిల్‌ను అందించాడు. ఈ క్రమంలోనే పొట్టి ఫార్మాట్లో టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు పాండ్యాకు అప్పజెప్పాలని బీసీసీఐ భావిస్తుంది. ఇక ఇది ఇలా ఉండగా.. హార్దిక్‌కు భారత జట్టు పగ్గాలు అప్పజెప్పాలని చాలా మంది మాజీ క్రికెటర్లు సూచిస్తుంటే.. టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ మాత్రం కాస్త భిన్నంగా స్పందించాడు. హార్దిక్ కెప్టెన్సీ పరంగా రాణిస్తున్నప్పటికీ, పూర్తి స్థాయి బాధ్యతలు అప్పజెప్పేముందు కాస్త ఆలోచించాలని సెలెక్టర్లను పఠాన్ హెచ్చరించాడు. "హార్దిక్‌కు అద్భుతమైన కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. అతడు తన కెప్టెన్సీతో అందరిని అకట్టుకున్నాడు. ఐపీఎల్లో కూడా గుజరాత్ టైటాన్స్‌కు సారథిగా టైటిల్‌ను అందించాడు. అతడి కమ్యూనికేషన్ చాలా బాగుంది. ఫీల్డ్‌లో చాలా చురుకుగా ఉంటాడు. అయితే హార్దిక్‌ను దీర్ఘకాలిక కెప్టెన్‌గా నియమించాలని అనుకుంటే మాత్రం అతని ఫిట్‌నెస్‌పై చాలా దృష్టిసారించాల్సి ఉంటుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఫిట్నెస్ చాలా కీలకం కానుంది" అని స్టార్ స్పోర్ట్స్ షోలో పఠాన్ పేర్కొన్నాడు. చదవండి: Ind Vs SL 2023: శ్రీలంకతో టీమిండియా సిరీస్‌లు.. పూర్తి షెడ్యూల్, జట్లు, ఇతర వివరాలు -
అన్న త్యాగంతో కోటీశ్వరుడయ్యాడు! వాళ్లిద్దరితో కలిసి ఆడతానంటూ
IPL 2023 Auction- Vivrant Sharma- Sunrisers Hyderabad: ‘‘మా నాన్నను చాలా మిస్ అవుతున్నా. ఆయన ఎక్కడున్నా ఇప్పుడు నా సక్సెస్ చూసి సంతోషిస్తూ ఉంటారు. నిజానికి ఇదంతా మా అన్నయ్య త్యాగం వల్లే సాధ్యమైంది. తనే లేకుంటే నేను ఇప్పుడు ఈ స్థితిలో ఉండేవాడినే కాదు. నాన్న చనిపోయిన తర్వాత నేను క్రికెట్ కొనసాగించగలనా లేదోననే సందేహాలు చుట్టుముట్టాయి. ఆ సమయంలో నా సోదరుడు విక్రాంత్ కుటుంబ బాధ్యతలు భుజాన వేసుకున్నాడు. మాకున్న వ్యాపారం ఇప్పుడు తనే చూసుకుంటున్నాడు. నిజానికి తను కూడా క్రికెటర్‌గా ఎదగాలని కలలు కన్నాడు. కానీ కుటుంబం కోసం, నా కోసం త్యాగం చేశాడు. తన కలను ఇలా నా రూపంలో నెరవేర్చుకుంటున్నాడు’’ అని జమ్మూ కశ్మీర్ బ్యాటర్ వివ్రాంత్ శర్మ భావోద్వేగానికి లోనయ్యాడు. కోటీశ్వరుడయ్యాడు ఐపీఎల్ మినీ వేలం-2023లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో పోటీ పడి మరీ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ లెఫ్టాండ్ బ్యాటర్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 20 లక్షల కనీస ధరతో ఆక్షన్‌లోకి వచ్చిన అతడి కోసం ఏకంగా 2.6 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. దీంతో వివ్రాంత్ పంట పండినట్లయింది. కాగా వివ్రాంత్ తండ్రి సుశాంత్ కిడ్నీ సంబంధిత వ్యాధితో కన్నుమూయగా.. ఇంటికి పెద్ద కుమారుడైన 26 ఏళ్ల విక్రాంత్ కుటుంబ బాధ్యతలు చేపట్టాడు. తమ్ముడిని క్రికెట్ కొనసాగించేలా ప్రోత్సహించాడు. కాగా విక్రాంత్ కూడా యూనివర్సిటీ లెవల్ పేసర్ కావడం విశేషం. ఇక ఐపీఎల్ ఫ్రాంఛైజీ తన కోసం ఇంత మొత్తం ఖర్చు చేస్తుందని ఊహించలేదన్న వివ్రాంత్.. తనతో పాటు తన కుటుంబ సభ్యులు సంతోషంలో మునిగిపోయారంటూ పీటీఐతో వ్యాఖ్యానించాడు. ఆయన ప్రోత్సహించారు అదే విధంగా టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. ‘‘రంజీ ట్రోఫీ ఆడుతున్న సమయంలో ఆయనతో నేను మాట్లాడాను. నాలో ఉన్న ప్రతిభను గుర్తించి నన్ను ప్రోత్సహించారు. విలువైన సలహాలు ఇచ్చారు’’ అని వివ్రాంత్ శర్మ చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పటికే సన్‌రైజర్స్‌కు ఆడుతున్న కశ్మీర్ ఆటగాళ్లు ఉమ్రాన్ మాలిక్, అబ్దుల్ సమద్‌తో తనకు స్నేహం ఉందన్న వివ్రాంత్.. అవకాశం వస్తే వాళ్లతో కలిసి ఐపీఎల్‌నూ కనిపిస్తానంటూ సంతోషం వ్యక్తం చేశాడు. కాగా విజయ్ హజారే ట్రోఫీలో ఉత్తరాఖండ్‌తో మ్యాచ్‌లో 124 బంతుల్లో 154 పరుగులు చేసిన వివ్రాంత్ ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు. చదవండి: Ind Vs Ban: ఆ క్యాచ్ పడితే నీ ఆట ముగిసేది.. భారత్ 89కే ఆలౌట్ అయ్యేది! దిమ్మతిరిగేలా అశ్విన్ కౌంటర్ IND vs SL: శ్రీలంకతో టీ20 సిరీస్.. భారత కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా! విధ్వంసకర ఓపెనర్ రీ ఎంట్రీ -
SRH: విలియమ్సన్ స్థానాన్ని భర్తీ చేసేది, సన్‌రైజర్స్ కెప్టెన్ కూడా అతడే!
IPL Mini Auction 2023- Sunrisers Hyderabad: ఐపీఎల్ మినీ వేలం-2023కి సమయం దగ్గరపడింది. కొచ్చి వేదికగా శుక్రవారం(డిసెంబరు 23)న ఈ కార్యక్రమం జరుగనుంది. ఈ నేపథ్యంలో ఫ్రాంఛైజీలు ఆటగాళ్ల కొనుగోలు అంశంపై ప్రణాళికలు సిద్ధం చేసుకునే పనిలో ఉన్నాయి. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనింగ్ స్థానం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కాగా న్యూజిలాండ్ స్టార్ కేన్ విలియమ్సన్ సారథ్యంలోని సన్‌రైజర్స్ జట్టు గతేడాది దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. ఆడిన 14 మ్యాచ్‌లకు గానూ ఆరింట మాత్రమే గెలిచి.. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. దీంతో కేన్ మామ కోసం గతంలో 14 కోట్ల భారీ పెట్టిన ఎస్ఆర్హెచ్ యాజమాన్యం మినీ వేలానికి ముందు అతడితో బంధం తెంచుకుంది. మయాంక్ అగర్వాల్ కేన్ మామ స్థానాన్ని భర్తీ చేసేది అతడే ఈ నేపథ్యంలో విలియమ్సన్ స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాడు ఇతడేనంటూ ఇర్ఫాన్ పఠాన్ టీమిండియా క్రికెటర్ పేరును సూచించాడు. స్టార్ స్పోర్ట్స్ గేమ్ ప్లాన్ షోలో అతడు మాట్లాడుతూ.. ‘‘ఎస్ఆర్హెచ్ మయాంక్ అగర్వాల్‌ను కొనుగోలు చేస్తుందని అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్లకు.. దూకుడుగా ఆడగల ఓపెనర్ అవసరం ఎంతగానో ఉంది. అంతేకాదు గతంలో కెప్టెన్‌గా వ్యవహరించిన కేన్ విలియమ్సన్ కూడా ఇప్పుడు లేడు. అనుభవజ్ఞుడైన, ఓపెనింగ్ బ్యాటర్ కేన్ సేవలను ఎస్ఆర్హెచ్ కచ్చితంగా మిస్సవుతుంది. కాబట్టి కేన్ స్థానంలో మయాంక్ అగర్వాల్‌ను తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. ఓపెనర్‌గా తను దూకుడు ప్రదర్శించగలడు. జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్స్ ఆడగలడు. బహుశా వాళ్లు అతడిని తమ కెప్టెన్‌గా చేసే ఆలోచనలో కూడా ఉన్నారేమో!’’ అని చెప్పుకొచ్చాడు. కాగా గత సీజన్లో పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన మయాంక్ ప్రస్తుతం కోటి రూపాయల కనీస ధరతో తన పేరును నమోదు చేసుకున్నాడు. ఇక సారథిగా నియమించిన సమయంలో మయాంక్ కోసం పంజాబ్ 14 కోట్లు వెచ్చించగా.. ఈసారి అతడు ఎంత ధరకు అమ్ముడుపోతాడనే విషయం ఆసక్తికరంగా మారింది. ఒకవేళ నిజంగానే సన్‌రైజర్స్ మయాంక్‌ను కొనుగోలు చేస్తే ఓపెనింగ్ స్థానానికి చక్కటి ఆప్షన్ దొరుకుతుంది. చదవండి: IPL 2023 Mini Auction Players List: వేలంలో 405 మంది ఆటగాళ్లు.. షార్ట్‌లిస్ట్ చేసిన ఫ్రాంచైజీలు IPL Mini Auction: వేలంలో 991 మంది క్రికెటర్లు! పాపం.. టీమిండియా ఆటగాళ్లు.. కనీసం 2 కోట్లు కూడా! వచ్చీ రాగానే మొదలెట్టేశాడు.. సూర్యకుమార్ ఊచకోత కొనసాగింపు -
కెప్టెన్ మార్పు వద్దు.. ఇలా చేస్తే టీమిండియాకు తిరుగే ఉండదు..!
టీ20 వరల్డ్‌కప్-2022లో టీమిండియా వైఫల్యం చెందడంతో జట్టు ప్రక్షాళణకు సమయం ఆసన్నమైందని, కెప్టెన్ సహా సీనియర్లందరికీ ఉద్వాసన పలికాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో మాజీలు, అభిమానులు, విశ్లేషకులు ఎవరికి తోచిన విధంగా వారు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా ఇదే అంశంపై టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా స్పందించాడు. కెప్టెన్‌ను, సీనియర్లను తప్పించి ఉన్నపలంగా జట్టులో మార్పులు చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. ఇలా చేయడం వల్ల జట్టుకు చాలా నష్టం జరుగుతుందని హెచ్చరించాడు. కెప్టెన్‌ను మార్చాలనే చెత్త ప్రతిపాదనలను బీసీసీఐ అస్సలు పరిగణలోకి తీసుకోకూడదని, రోహిత్ టీమిండియా పగ్గాలు చేపట్టి ఓ సంవత్సరం కూడా కాలేదని, ఇంతలోనే కెప్టెన్ మార్పు తొందరపాటు నిర్ణయం అవుతుందని బీసీసీఐకి సూచించాడు. ఈ అంశాన్ని బీసీసీఐ పూర్తిగా పక్కకు పెట్టి, జట్టులో మార్పులపై ఫోకస్ పెట్టాలని కోరాడు. జట్టులో మార్పులపై అతనే ఫోర్ పాయింట్ ఎజెండాను రూపొందించాడు. Indian cricket going forward 1) Openers playing freely, At least one of them. 2) Wrist spinner (wicket taker ) is must. 3) Tear away fast bowler. 4) please don’t think changing captaincy will give us changed result. It’s the approach what needs to change. — Irfan Pathan (@IrfanPathan) November 15, 2022 మున్ముందు టీమిండియా సక్సెస్ సాధించాలంటే.. మొదటగా ఓపెనర్లు ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడాలి, ముఖ్యంగా ఓపెనర్లలో ఒకరు ధాటిగా బ్యాటింగ్ చేయాలి. తుది జట్టులో వికెట్ టేకింగ్ రిస్ట్ స్పిన్నర్ తప్పక ఉండేలా చూసుకోవాలి కాస్తో కూస్తో బ్యాటింగ్ చేయగల నాణ్యమైన ఫాస్ట్ బౌలర్ తుది జట్టులో ఉండేలా ప్లాన్ చేసుకోవాలి ఇప్పటికిప్పుడు కెప్టెన్‌ను మార్చాలనే ఆలోచనను పూర్తిగా విరమించుకోవాలని పై పేర్కొన్నవన్నీ అమలు చేయగలిగితే టీమిండియాకు తిరుగే ఉండదని ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు అతను ట్విటర్ వేదికగా తన అభిప్రాయాలను షేర్ చేసుకున్నాడు. కాగా, టీమిండియాకు ఇద్దరు కెప్టెన్లు ఉండాలని ఇర్ఫాన్ పఠాన్ ఇటీవలే ఓ స్టేట్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. 2024 టీ20 వరల్డ్‌కప్ నేపథ్యంలో బీసీసీఐ.. హార్ధిక్‌ను కెప్టెన్‌గా పరిగణిస్తే, అతనితో పాటు మరో స్టాండ్ బై కెప్టెన్‌ను కూడా తయారు చేసుకోవాలని సూచించాడు. తరుచూ గాయాల బారిన పడే హార్ధిక్‌ను కెప్టెన్‌గా చేస్తే.. కీలక టోర్నీలకు ముందు అతను గాయపడితే, అది జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతుందని, అందుకే ఇప్పటి నుంచే ఇద్దరు కెప్టెన్లను లైన్లో పెట్టుకుంటే మంచిదని అభిప్రాయపడ్డాడు. చదవండి: WC 2024: నేనే చీఫ్ సెలక్టర్ అయితే ఇలా చేస్తా! ఒకరు కాదు ఇద్దరు కెప్టెన్లు! -
WC 2024: నేనే చీఫ్ సెలక్టర్ అయితే ఇలా చేస్తా! ఒకరు కాదు ఇద్దరు కెప్టెన్లు!
T20 World Cup 2024- Team India Captain: భారీ అంచనాల నడుమ టీ20 ప్రపంచకప్-2022 బరిలోకి దిగిన టీమిండియా సెమీస్‌లోనే ఇంటి బాటపట్టి అభిమానులను నిరాశపరిచింది. రెండో సెమీ ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించి విమర్శలు మూటగట్టుకుంది. పటిష్టమైన జట్టుగా నంబర్ 1 ర్యాంకులో కొనసాగుతున్న భారత్‌కు ఇలాంటి పరాభవం ఎదురుకావడాన్ని ఫ్యాన్స్ సహా మాజీ ఆటగాళ్లు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో వచ్చే టీ20 వరల్డ్‌కప్ నాటికి సంసిద్ధం కావాల్సిన ఆవశ్యకత, జట్టు కూర్పు గురించి పలువురు సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా కెప్టెన్సీ మార్పు అంశం గురించి బీసీసీఐ సీరియస్‌గా ఆలోచించాలని సూచిస్తున్నారు. రోహిత్ శర్మను పొట్టి ఫార్మాట్ సారథ్య బాధ్యతల నుంచి తప్పించి కొత్త నాయకుడిని సిద్ధం చేయాలని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. స్టార్ స్పోర్ట్స్ షో మ్యాచ్ పాయింట్లో ఈ మేరకు చిక్కా మాట్లాడాడు. శ్రీకాంత్- ఇర్ఫాన్ పఠాన్ నేనే గనుక సెలక్షన్ కమిటీ చైర్మన్ అయితే ‘‘ఒకవేళ నేనే గనుక సెలక్షన్ కమిటీ చైర్మన్ అయితే 2024 వరల్డ్‌కప్ నాటికి హార్దిక్ పాండ్యా పూర్తిస్థాయి కెప్టెన్‌గా ఉండేలా చేస్తాను. ఈరోజు నుంచే జట్టు పునర్నిర్మాణంపై దృష్టి సారిస్తా. న్యూజిలాండ్ పర్యటన నుంచి సన్నాహకాలు మొదలుపెడతా. నిజానికి ప్రపంచకప్ టోర్నీకి రెండేళ్ల ముందు నుంచే అన్ని రకాలుగా జట్టును సిద్ధం చేసుకోవడం ఉత్తమం కదా! ఇందుకోసం ఎంతటి కఠిన నిర్ణయాలైనా తీసుకోవాలి. ఏడాది పాటు ప్రయోగాలు చేయండి. దీంతో 2023 నాటికి ఓ అవగాహన వస్తుంది’’ అని మాజీ చీఫ్ సెలక్టర్ శ్రీకాంత్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ప్రపంచకప్‌లు ఎలా గెలిచామనుకుంటున్నారు ఇక జట్టులో ఆల్‌రౌండర్ల ప్రాధాన్యం గురించి వివరిస్తూ.. ‘‘1983, 2011, 2007లో ప్రపంచకప్‌లు ఎలా గెలిచామనుకుంటున్నారు! జట్టులో ఫాస్ట్‌బాల్ ఆల్‌రౌండర్లు ఉండాలి. గతంలో ఉన్నారు కూడా! వాళ్లతో పాటు సెమీ ఆల్‌రౌండర్లు కూడా అవసరం. మనకు ఒక్క హుడా సరిపోడు.. చాలా మంది కావాలి’’అని ఈ మాజీ సారథి అన్నాడు. ఒకరు కాదు ఇద్దరు కావాలి ఇక శ్రీకాంత్ అభిప్రాయంపై స్పందించిన ఇర్ఫాన్ పఠాన్.. ‘‘హార్దిక్ పాండ్యా ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్.. తనకు గాయాల బెడద కూడా ఎక్కువే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ వరల్డ్‌కప్ టోర్నీ ఆరంభానికి ముందే మీ ఈ నాయకుడు గాయపడితే పరిస్థితి ఏంటి? కాబట్టి ఒక్కడు కాదు ఇద్దరు సారథులు కావాలి. ఒకరు అందుబాటులో లేకపోయినా వాళ్ల స్థానాన్ని భర్తీ చేయగల సమర్థుడు సిద్ధంగా ఉండాలి. అందుకోసం మరో కెప్టెన్‌ను కూడా సిద్దం చేసుకోవాలి. అలాగే ఓపెనింగ్ జోడీలకు కూడా సరైన ప్రత్యామ్నాయాలు వెదకాలి’’ అని పేర్కొన్నాడు. చదవండి: Pak Vs Eng: ఓటమి బాధలో ఉన్న పాకిస్తాన్‌కు మరో భారీ షాక్! ‘ఆర్నెళ్ల పాటు..!’ India tour of New Zealand: టీమిండియా న్యూజిలాండ్ పర్యటన.. పూర్తి షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్, ఇతర వివరాలు -
152/0 VS 170/0: మీకు మాకు ఇదే తేడా.. పాక్ ప్రధానికి ఇర్ఫాన్ పఠాన్ స్ట్రాంగ్ కౌంటర్
టీ20 వరల్డ్‌కప్-2022 సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో టీమిండియా దారుణ పరాభవం నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన వివాదాస్పద ట్వీట్‌పై (152/0 VS 170/0) తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. ఫైనల్‌కు చేరామన్న మదంతో కొట్టుకుంటున్న పాక్ ప్రధానికి.. ఇర్ఫాన్ పఠాన్ తనదైన శైలిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. పాక్ ప్రధాని మరోసారి వంకర బుద్ధి చాటుకున్నారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. So, this Sunday, it’s: 152/0 vs 170/0 🇵🇰 🇬🇧 #T20WorldCup — Shehbaz Sharif (@CMShehbaz) November 10, 2022 మీకు మాకు ఇదే తేడా.. మేము గెలిచినా, ప్రత్యర్ధి గెలిచినా మేము సంతోషిస్తాం, కానీ మీరు ఇతరుల ఓటమితో రాక్షసానందం పొందుతున్నారు.. ఇకనైనా ఇలాంటి పరువు పోగొట్టుకునే పనులు మానుకుని, సొంత దేశంలో సమస్యలపై దృష్టి పెట్టండి అంటూ ఓ రేంజ్లో చురలకలంటిస్తూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. పాక్ ప్రధానికి భారత్ అభిమానులు ఇచ్చిన కౌంటర్లతో పోలిస్తే, ఇర్ఫాన్ ఇచ్చిన ఈ కౌంటర్ మరింత స్ట్రాంగ్‌గా ఉంది. Aap mein or hum mein fark yehi hai. Hum apni khushi se khush or aap dusre ke taklif se. Is liye khud ke mulk ko behtar karne pe dhyan nahi hai. — Irfan Pathan (@IrfanPathan) November 12, 2022 దీంతో ఇర్ఫాన్ చేసిన కౌంటర్ అటాక్‌పై భారత అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంచిగా బుద్ధి చెప్పావంటూ ఇర్ఫాన్‌ను మెచ్చుకుంటున్నారు. వంకర బుద్ధి గల వ్యక్తులు నిజంగానే ఇతరుల బాధను ఎగతాలి చేస్తూ రాక్షసానందం పొందుతారంటూ ఇర్ఫాన్ కౌంటర్ ట్వీట్‌కు మద్దతు పలుకుతున్నారు. పాక్ ప్రధానిని ఇన్ స్వింగింగ్ యార్కర్‌తో క్లీన్ బౌల్డ్ చేసి భలే బుద్ధి చెప్పావంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, టీ20 వరల్డ్‌కప్-2022 సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో, టీ20 వరల్డ్‌కప్-2021 గ్రూప్ దశలో పాకిస్తాన్ చేతిలో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా ప్రత్యర్ధులు చేసిన స్కోర్లను (152/0 VS 170/0) ప్రస్తావిస్తూ.. ఈ ఆదివారం 152/0 VS 170/0 అంటూ పాక్ ప్రధాని తన స్థాయి దిగజార్చుకునే ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌పై భారత అభిమానులు, మాజీలు తగు రీతిలో ఇప్పటికీ కౌంటర్లిస్తూనే ఉన్నారు. ఏదో అదృష్టం కలిసొచ్చి ఫైనల్ దాకా చేరిన మీకు ఇంత పొగరు పనికిరాదంటూ చురకలంటిస్తున్నారు. చదవండి: టీమిండియా ఓటమిపై పాక్ ప్రధాని ట్వీట్ వైరల్.. కౌంటర్ ఇస్తున్న ఫ్యాన్స్ -
రిటైరయ్యాక కూడా ఇరగదీశారు.. అప్పుడూ ఇలానే, కానీ..!
ఇటీవల జరిగిన రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్, లెజెండ్స్ లీగ్ క్రికెట్లో సత్తా చాటి, రిటైరైనా తగ్గేదేలే అని యువ క్రికెటర్లకు సందేశం పంపిన టీమిండియా మాజీ ఆల్‌రౌండర్లు, సోదరులు ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్లు ఆ రెండు సిరీస్‌ల్లో తమతమ అనుభవాలను సోషల్‌మీడియా వేదికగా పంచుకున్నారు. రోడ్ సేఫ్టీ సిరీస్, లెజెండ్స్ లీగ్‌లు ఒకే సమయంలో షెడ్యూలైనప్పటికీ పఠాన్ సోదరులు రెండిటిలోనూ పాల్గొని తమ జట్లను గెలిపించారు. 13 ఫ్లయిట్లు, 17 మ్యాచ్‌లు, 2 ఫైనళ్లు అంటూ ఇర్ఫాన్ పఠాన్.. తన సోదరుడు యూసఫ్‌ను ట్యాగ్ చేస్తూ ఫేస్బుక్ వేదికగా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్‌కు కృతజ్ఞతలు చెప్పాడు. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2022లో సచిన్ కెప్టెన్సీలో ఇండియా లెజెండ్స్ తరఫున ఆడిన యూసఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్.. లెజెండ్స్ లీగ్ క్రికెట్ సీజన్-2లో బిల్వారా కింగ్స్ జట్టు తరఫున ఆడారు. ఈ జట్టుకు ఇర్ఫాన్ పఠాన్ కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ ఫైనల్లో ఇండియా లెజెండ్స్ జట్టు ఫైనల్లో శ్రీలంక లెజెండ్స్‌ను మట్టికరిపించి వరుసగా రెండో సీజన్లోనూ ఛాంపియన్‌గా నిలువగా.. లెజెండ్స్ లీగ్ ఫైనల్లో గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని ఇండియా క్యాపిటల్స్ చేతిలో బిల్వారా కింగ్స్ ఓటమిపాలైంది. ఈ రెండు టోర్నీల్లో యూసఫ్ పఠాన్ మొత్తం 14 మ్యాచ్‌ల్లో 341 పరుగులు చేసి, బౌలింగ్‌లో 10 వికెట్లు తీశాడు. ఇందులో ఐదు 30+ స్కోర్లు ఉన్నాయి. ఇక తమ్ముడు ఇర్ఫాన్ పఠాన్ విషయానికొస్తే.. ఇర్ఫాన్ ఈ రెండు టోర్నీల్లో కలిపి 12 ఇన్నింగ్స్‌ల్లో 227 పరుగులు చేశాడు. ఇందులో రెండు 30+ స్కోర్లు ఉన్నాయి. అలాగే ఇర్ఫాన్ బౌలింగ్‌లో 2 వికెట్లు కూడా తీశాడు. ఈ రెండు టోర్నీల్లో యూసఫ్ పఠాన్ 27 సిక్సర్లు, 22 ఫోర్లు బాదగా.. ఇర్ఫాన్ పఠాన్ 11 ఫోర్లు, 18 సిక్సర్లు కొట్టాడు. ఇదిలా ఉంటే, పఠాన్ సోదరులు గతంతో అంతర్జాతీయ స్థాయిలో మంచి ప్రదర్శనే చేసినప్పటికీ వివిధ కారణాల చేత సరైన అవకాశాలు రాక వారి కెరీర్లు అర్థంతరంగా ముగిశాయి. ఇర్ఫాన్ 27 ఏళ్ల వయసులో ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడి.. దాదాపు పదేళ్ల పాటు జట్టులో చోటు కోసం నిరీక్షించి చివరకు రిటైర్మెంట్ ప్రకటించాడు. టెస్ట్‌ల్లో టీమిండియా తరఫున హ్యాట్రిక్ తీసిన తొలి ఫాస్ట్ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కిన ఇర్ఫాన్ పఠాన్.. 2007 వరల్డ్ కప్ ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు, అలాగే తానాడిన చివరి వన్డేలో ఐదు వికెట్లు తీశాడు. యూసఫ్ పఠాన్ విషయానికొస్తే ఇతనిది దాదాపు తమ్ముడి పరిస్థితే. కీలక మ్యాచ్‌ల్లో భారీ సిక్సర్లు బాది ఒంటి చేత్తో మ్యాచ్‌లు గెలిపించిన యూసఫ్‌కు కూడా సరైన అవకాశాలు రాక కెరీర్‌ను అర్ధంతరంగా ముగించాడు. -
విధ్వంసం సృష్టించిన టేలర్.. లెజెండ్స్ లీగ్ ఛాంపియన్స్‌గా గంభీర్ సేన
లెజెండ్స్ లీగ్ క్రికెట్-2022 ఛాంపియన్స్‌గా గౌతం గంభీర్ సారథ్యంలోని ఇండియా క్యాపిటిల్స్ నిలిచింది. బుధవారం జైపూర్ వేదికగా భిల్వారా కింగ్స్‌తో జరిగిన ఫైనల్లో 104 పరుగుల తేడాతో ఇండియా క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. ఇండియా క్యాపిటిల్స్ టైటిల్ కైవసం చేసుకోవడంలో ఆ జట్టు ఆటగాళ్లు రాస్ టేలర్, మిచెల్ జాన్సన్ కీలక పాత్ర పోషించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా.. 21 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో రాస్ టేలర్, జాన్సన్ అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో జట్టును అదుకున్నారు. వీరిద్దరూ కలిసి ఐదో వికెట్‌కు 126 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. టేలర్ 41 బంతుల్లో 82 , జాన్సెన్ 35 బంతుల్లో 62 పరుగులు సాధించారు. కాగా టేలర్ ఇన్నింగ్స్‌లో 4 పోర్లు, 8 సిక్స్‌లు ఉండటం గమానార్హం. ఇక అఖరిలో నర్స్(19 బంతుల్లో 42) మెరుపులు మెరిపించడంతో ఇండియా క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది. భిల్వారా కింగ్స్ బౌలర్లలో రాహుల్ శర్మ నాలుగు వికెట్లు పడగొట్టగా.. పనేసర్ రెండు, బ్రెస్నెన్ ఒక్క వికెట్ సాధించారు. అనంతరం 212 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భిల్వారా కింగ్స్.. 18.2 ఓవర్లలో 107 పరుగులకు కుప్పకూలింది. భిల్వారా బ్యాటర్లలో షేన్ వాట్సన్ 27 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇండియా క్యాపిటల్స్ బౌలర్లలో పంకజ్ సింగ్, ప్రవీణ్ తాంబే, పవన్ సయాల్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. జాన్సెన్, ప్లంకెట్, భాటియా చెరో వికెట్ సాధించారు. Time for #legendary Celebrations! 🥳@CapitalsIndia#BossLogonKaGame #LLCT20 #LegendsLeagueCricket pic.twitter.com/XBFMJtj6Zf — Legends League Cricket (@llct20) October 5, 2022 చదవండి: T20 World Cup 2022: ఆస్ట్రేలియాకు బయలు దేరిన టీమిండియా.. ఫోటోలు వైరల్ -
మీ నాన్న వల్లే గెలిచాం.. బుడ్డోడిని ముద్దు చేసిన సచిన్.. వీడియో వైరల్
Road Safety World Series T20 2022 - India Legends vs Sri Lanka Legends In Final: రోడ్‌సేఫ్టీ వరల్డ్ సిరీస్-2022 సెమీ ఫైనల్లో భాగంగా అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్. ఈ టీ20 లీగ్‌లో ఇండియా లెజెండ్స్ తరఫున బరిలోకి దిగిన ఇర్ఫాన్.. కీలక మ్యాచ్‌లో రాణించి జట్టును ఫైనల్లో చేర్చడంలో తన వంతు సాయం చేశాడు. ఓపెనర్ నమన్ ఓజా 90 పరుగులతో అజేయంగా నిలవగా.. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఇర్ఫాన్ పఠాన్ ఆఖర్లో మెరుపులు మెరిపించాడు. 12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 308కి పైగా స్ట్రైక్‌రేటుతో 37 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు. వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా సచిన్ టెండుల్కర్ సారథ్యంలోని ఇండియా లెజెండ్స్ మరో నాలుగు బంతులు ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. మీ నాన్న వల్లే గెలిచాం! 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా లెజెండ్స్‌పై గెలుపొంది ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో సచిన్.. ఇర్ఫాన్ చిన్నారి కుమారుడు ఇమ్రాన్‌తో సరదాగా ముచ్చటిస్తూ.. ‘‘మేము ఈరోజు మ్యాచ్ ఎలా గెలిచామో తెలుసా? ఆయనెవరో తెలుసు కదా! ఆయన టప్ టప్మని సిక్స్‌లు కొట్టాడు. అలా మేము గెలిచాం’’ అంటూ బుడ్డోడిని ముద్దు చేశాడు. ఈ వీడియో సచిన్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. లెజెండ్ .. చిన్న పిల్లలతో కూడా బాగా కలిసిపోతారు. ముద్దు చేయడంలో ముందుంటారు అని సరదాగా కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇమ్రాన్‌కు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ బాగానే ఉంది. అతడికి 90వేల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇక శనివారం రాయ్‌పూర్ వేదికగా శ్రీలంక లెజెండ్స్‌తో ఫైనల్లో తలపడేందుకు ఇండియా లెజెండ్స్ సిద్ధమవుతోంది. View this post on Instagram A post shared by Imran Pathan (@imrankpathan_official) చదవండి: Ind Vs SA: అతడొక అద్భుతం.. టీమిండియాకు మరో జహీర్ ఖాన్ దొరికేశాడు: పాక్ మాజీ క్రికెటర్ -
చెలరేగిన నమన్ ఓజా, ఇర్ఫాన్ పఠాన్.. ఫైనల్లో ఇండియా లెజెండ్స్
రోడ్‌సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2022లో ఇండియా లెజెండ్స్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఆస్ట్రేలియా లెజెండ్స్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇండియా లెజెండ్స్ ఓపెనర్ నమన్ ఓజా (90 పరుగులు నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగా.. ఆఖర్లో ఇర్ఫాన్ పఠాన్ (37 పరుగులు నాటౌట్) మెరుపులు మెరిపించాడు. వాస్తవానికి బుధవారమే ఈ మ్యాచ్ పూర్తవ్వాల్సింది. కానీ ఆస్ట్రేలియా లెజెండ్స్ ఇన్నింగ్స్ సమయంలో వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలిగింది. వర్షం ఎంతకు తెరిపినివ్వకపోవడంతో ఆటను గురువారం కూడా కంటిన్యూ చేశారు. బుధవారం వర్షం అంతరాయం కలిగించే సమయానికి 17 ఓవర్లలో ఆస్ట్రేలియా 5 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. కాగా గురువారం ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా మరో 3 ఓవర్లు ఆడింది. మొత్తం 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. బెన్ డక్ 46 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. చివర్లో కామెరున్ వైట్ 30, బ్రాడ్ హడిన్ 12 పరుగులు చేశారు. అనంతరం 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా లెజెండ్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. 10 పరుగులు చేసిన టెండూల్కర్ రీయర్డన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన సురేశ్ రైనా(11) కూడా విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో యువరాజ్ సింగ్(18)తో కలిసి నమన్ ఓజా(62 బంతుల్లో 90 నాటౌట్, 7 ఫోర్లు, 5 సిక్సర్లు) ఇన్నింగ్స్‌ను నడిపించాడు. యువీ, బిన్నీ, యూసఫ్ పఠాన్లు వెనుదిరగడంతో ఇండియా లెజెండ్స్ కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన ఇర్ఫాన్ పఠాన్( 12 బంతుల్లో 37 నాటౌట్, 2 ఫోర్లు) మెరుపులు మెరిపించగా.. నమన్ ఓజా చెలరేగాడు. 10 పరుగుల దూరంలో సెంచరీ దూరమైనప్పటికి నమన్ ఓజా మాత్రం ఆకట్టుకున్నాడు. ఈ ఇద్దరు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి 19.2 ఓవర్లలో జట్టును విజయతీరాలకు చేర్చారు. ఇక శ్రీలంక లెజెండ్స్, వెస్టిండీస్ లెజెండ్స్ మధ్య సెమీఫైనల్-2 మ్యాచ్ విజేతతో ఇండియా లెజెండ్స్ ఫైనల్ ఆడనుంది. ఇక ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 1న(శనివారం) జరగనుంది. Naman Ojha and Irfan Pathan guided India Legends towards a comfortable win against Australia Legends 🇮🇳🙌🏻#rsws #indialegends pic.twitter.com/qXrgq5MFH6 — Sportskeeda (@Sportskeeda) September 29, 2022 చదవండి: సెంచరీతో చెలరేగిన విండీస్ హిట్టర్.. ఫైనల్లో జమైకా తలైవాస్ సురేష్ రైనా స్టన్నింగ్ క్యాచ్.. చూసి తీరాల్సిందే! -
LLC 2022: దంచికొట్టిన బ్యాటర్లు.. భిల్వారా కింగ్స్ ఘన విజయం! సెహ్వాగ్ సేనకు పరాభవం
Legends League Cricket 2022- Gujarat Giants vs Bhilwara Kings: లెజెండ్స్ లీగ్ క్రికెట్-2022 టోర్నీలో భాగంగా గుజరాత్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో భిల్వారా కింగ్స్ ఘన విజయం సాధించింది. వీరేంద్ర సెహ్వాగ్ సేనపై ఇర్ఫాన్ పఠాన్ బృందం ఏకంగా 57 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా పఠాన్ సారథ్యంలోని భిల్వారా కింగ్స్ జట్టు రెండో విజయాన్ని నమోదు చేసింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. దంచికొట్టిన కింగ్స్ బ్యాటర్లు! ఒడిశాలోని కటక్‌లోని బారాబతి స్టేడియం వేదికగా ఇరు జట్ల మధ్య మంగళవారం మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన గుజరాత్ జెయింట్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అయితే, జెయింట్స్ బౌలర్లు భిల్వారా కింగ్స్ బ్యాటర్లను ఏమాత్రం కట్టడి చేయలేకపోయారు. కింగ్స్ ఓపెనర్లు మోర్నీ వాన్ విక్ అర్ధ శతకం(28 బంతుల్లోనే 50 పరుగులు) సాధించగా.. విలియం పోర్టర్‌ఫీల్డ్ 33 బంతుల్లో 64 పరుగులతో చెలరేగాడు. ఇక వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ ఇర్ఫాన్ పఠాన్ 34 పరుగులతో రాణించగా.. జేసల్ కారియా 29 బంతుల్లోనే 43 పరుగులు రాబట్టాడు. ఆఖర్లో యూసఫ్ పఠాన్ మెరుపులు (5 బంతుల్లో రెండు సిక్సర్ల సాయంతో 14 పరుగులు) మెరిపించగా.. రాజేశ్ బిష్ణోయి రెండు బంతుల్లో రెండు సిక్సర్లు కొట్టి 12 పరుగులు సాధించాడు. ఇలా బ్యాటర్లంతా రెచ్చిపోవడంతో భిల్వారా కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగులు స్కోరు చేసింది. చేతులెత్తేసిన జెయింట్స్ బ్యాటర్లు! గేల్, సెహ్వాగ్ కూడా విఫలం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జెయింట్స్ ఆదిలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. కెవిన్ ఒ బ్రెయిన్ 2, క్రిస్ గేల్ 15 పరుగులకే నిష్క్రమించారు. కెప్టెన్ సెహ్వాగ్ 20 బంతుల్లో 27 పరుగులు చేశాడు. ఇక కింగ్స్ బౌలర్ల ధాటికి మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేయగా.. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన యశ్పాల్ 29 బంతుల్లో 57 పరుగులు చేశాడు. ఆఖర్లో రియాద్, కేపీ అప్పన్న కాసేపు పోరాడినా.. అప్పటికే పరిస్థితి చేజారడంతో 165 పరుగులకే సెహ్వాగ్ సేన కథ ముగిసింది. 57 పరుగుల తేడాతో భిల్వారా కింగ్స్ జయకేతనం ఎగురవేసింది. ఇక కింగ్స్ బౌలర్లలో శ్రీశాంత్‌కు అత్యధికంగా మూడు వికెట్లు దక్కాయి. జేసల్ కారియా, ఫిడెల్ ఎడ్వర్డ్స్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. టినో బెస్ట్ ఒకటి, దినేశ్ ఒకటి, మాంటీ పనేసర్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. కింగ్స్ భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించిన విలియం పోర్టర్‌ఫీల్డ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. చదవండి: Ind Vs SA 1st T20: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్.. సొంతగడ్డపై ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవని భారత్! వరణుడు కరుణిస్తేనే! Irfan Pathan: 'ధోని వల్లే కెరీర్ నాశనమైంది'.. ఇర్ఫాన్ పఠాన్ అదిరిపోయే రిప్లై -
'ధోని వల్లే కెరీర్ నాశనమైంది'.. ఇర్ఫాన్ పఠాన్ అదిరిపోయే రిప్లై
స్వింగ్ బౌలర్‌గా టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన ఇర్ఫాన్ పఠాన్ అనతి కాలంలోనే స్టార్ బౌలర్‌గా గుర్తింపు పొందాడు. సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలోనే పఠాన్ ఎక్కువగా వెలుగులోకి వచ్చాడు. టి20 వరల్డ్‌కప్ 2007 ఫైనల్లో పాకిస్తాన్‌పై మూడు వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన ఇర్ఫాన్ పఠాన్ టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. అయితే బౌలర్‌గా జట్టులోకి వచ్చిన పఠాన్‌ను బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌గా మార్చాలని టీమిండియా ప్రయోగాలు చేసింది. ఆరంభంలో ఇది సూపర్ సక్సెస్ అయింది. వన్‌డౌన్‌లో, మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు వచ్చిన పఠాన్ సెంచరీతో పాటు అర్థ సెంచరీల మోత మోగించాడు. కపిల్ దేవ్ లాంటి మరో నాణ్యమైన ఆల్‌రౌండర్ మనకు దొరికాడని అనుకునేలోపే పఠాన్ కెరీర్ క్రమంగా మసకబారుతూ వచ్చింది. ఇక ధోని టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాకా ఇర్ఫాన్ పఠాన్‌కు జట్టులో అవకాశాలు తగ్గిపోయాయి. వాస్తవానికి ఇక్కడ ధోని చేసిందేం లేదు. ఇర్ఫాన్ పఠాన్ ఫామ్ కోల్పోవడం వల్ల జట్టుకు దూరమవుతూ వచ్చాడు. ధోని కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత యువ జట్టును తయారు కావాలని భావించాడు. ఈ నేపథ్యంలోనే వీరేంద్ర సెహ్వాగ్, అజిత్ అగార్కర్, హర్భజన్ సింగ్, యూసఫ్ పఠాన్లు మెల్లిమెల్లిగా జట్టుకు దూరమయ్యారు. వీరి బాటలోనే ఇర్ఫాన్ పఠాన్ కూడా వెళ్లాల్సి వచ్చింది.ఇక పఠాన్ తాను ఆడిన ఆఖరి వన్డేలో 5 వికెట్లు తీసినప్పటికి 2012 తర్వాత భారత జట్టులో చోటు దక్కలేదు. 27 ఏళ్ల వయసులో చివరిగా భారత జట్టుకి ఆడిన ఇర్ఫాన్ పఠాన్, దాదాపు 8 ఏళ్లు ఎదురుచూసి 2020లో రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం లెజెండ్స్ లీగ్ క్రికెట్లో అదరగొడుతున్న ఇర్ఫాన్ పఠాన్ గురించి ఓ క్రికెట్ ఫ్యాన్ చేసిన ట్వీట్ హాట్ టాపిక్ అయ్యింది. ఇర్ఫాన్ పఠాన్ కెరీర్ నాశనమవ్వడానికి ధోని కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశాడు. ''ఈ లీగుల్లో ఇర్ఫాన్ పఠాన్ చూసిన ప్రతీసారీ నాకు ఎంఎస్ (ధోనీ), ఆయన మేనేజ్మెంట్పై మరింత ద్వేషం పెరుగుతుంది. ఇలాంటి ప్లేయర్ తన 29 ఏళ్ల వయసులో చివరి వైట్ బాల్ ఆడాడంటే నమ్మశక్యంగా లేదు. నెం.7 ప్లేస్‌లో పఠాన్ పర్ఫెక్ట్ ప్లేయర్. ఏ టీమ్ అయినా ఇలాంటి ప్లేయర్ కావాలని కోరుకుంటుంది. కానీ ఇండియా మాత్రం జడ్డూని ఆడించింది. చివరికి బిన్నీ కూడా'' అంటూ ట్వీట్ చేశాడు. అయితే అభిమాని ట్వీట్‌పై స్పందించిన ఇర్ఫాన్ పఠాన్ చాలా హుందాగా స్పందించాడు. ‘దయచేసి ఎవ్వరిని నిందించొద్దు.. కానీ నీ ప్రేమకు థ్యాంక్యూ’ అంటూ కామెంట్ చేశాడు. కాగా అభిమానికి పఠాన్ హుందాతనంతో సమాధానం ఇవ్వడంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కాగా టీమిండియా తరుపున 29 టెస్టులు ఆడిన ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్ తర్వాత టెస్టుల్లో హ్యాట్రిక్ తీసిన భారత బౌలర్‌గా రికార్డులకెక్కాడు. పాకిస్తాన్‌పై టెస్టుల్లో హ్యాట్రిక్ తీసిన ఇర్ఫాన్ పఠాన్.. తన కెరీర్లో 100 టెస్టు వికెట్ల ఘనతను సాధించాడు. టీమిండియా తరపున 120 వన్డేలు ఆడిన ఇర్ఫాన్ పఠాన్ 173 వికెట్లు తీయడమే కాకుండా 1544 పరుగులు చేశాడు. 24 టీ20 మ్యాచుల్లో 28 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్‌గా 300 అంతర్జాతీయ వికెట్లు తీసిన ఇర్ఫాన్ పఠాన్.. బ్యాటుతోను అదరగొట్టాడు. తన ఖాతాలో 12 హాఫ్ సెంచరీలు, టెస్టుల్లో ఒక సెంచరీ ఉంది. ఇక లెజెండ్స్ లీగ్ క్రికెట్లో ఆడుతున్న ఇర్ఫాన్ పఠాన్ ప్రస్తుతం బిల్వారా కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. Don’t blame any one. Thank you for love ❤️ — Irfan Pathan (@IrfanPathan) September 27, 2022 చదవండి: 'చీటింగ్ చేసేవాడితో ఆడలేను.. అందుకే తప్పుకున్నా' స్టార్ క్రికెటర్ కోసం ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించిన పోలీసులు -
'శ్రీశాంత్ బంతిని పట్టుకోలేదు.. ప్రపంచకప్‌ను పట్టుకున్నాడు'
సరిగ్గా 15 ఏళ్ల క్రితం.. ఇదే రోజున టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. 2007లో ఐసీసీ నిర్వహించిన తొలి టీ20 ప్రపంచకప్‌ను భారత జట్టు కైవసం చేసుకుంది. జోహన్స్ బర్గ్ వేదికగా జరిగిన ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి టీ20 ప్రపంచకప్‌ను ధోని సేన ముద్దాడింది. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ లాంటి దిగ్గజ ఆటగాళ్లు లేకుండా.. అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగిన భారత్ అందరి అంచనాలను తారుమారు చేస్తూ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. కాగా 2007 టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా సాధించిన చారిత్రాత్మక విజయాన్ని మరోసారి గుర్తుచేసుకునేందుకు స్టార్ స్పోర్ట్స్" ది రీయూనియన్ ఆఫ్ 07" అనే షోను నిర్వహించింది. ఈ షోలో తొలి పొట్టి ప్రపంచకప్‌ను గెలుచుకున్న భారత జట్టులో సభ్యులుగా ఉన్న ఆటగాళ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీ20 ప్రపంచకప్‌లో తమ మధుర జ్ణాపకాలను గుర్తు చేసుకున్నారు. శ్రీశాంత్ బంతిని పట్టుకోలేదు.. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడూతూ.. 2007 టీ20 ప్రపంచకప్ సమయంలో సోషల్ మీడియా లేదు. కానీ ఫైనల్లో పటిష్టంగా ఉన్న పాకిస్తాన్‌తో తలపడడం అంత సులభం కాదని అంతా చర్చించుకున్నారు. నిజంగానే ఫైనల్లో మాపై తీవ్రమైన ఒత్తిడి ఉంది. ఫైనల్లో నా నాలుగు ఓవర్లు కోటా పూర్తి చేసిన తర్వాత నేను చాలా అలసిపోయాను. నా కెరీర్లో ఎప్పుడూ ఇంత అలసిపోలేదు. ఆ సమయంలో నాకు కొంచెం కూడా ఓపిక లేదు. ఇక ఈ మ్యాచ్‌లో శ్రీశాంత్ బంతిని పట్టుకోలేదు, అతడు ప్రపంచకప్‌ను పట్టుకున్నాడు’’అని పేర్కొన్నాడు. రోహిత్ ఇన్నింగ్స్ చాలా కీలకం ఇక రోహిత్ శర్మ ఇన్నింగ్స్ కోసం ఆర్పీ సింగ్ మాట్లాడూతూ.. రోహిత్ అడిన ఇన్నింగ్స్ చాలా కీలకంగా మారింది. మేము 18 ఓవర్లలో 130 పరుగులు సాధించాము. ఆ సమయంలో రోహిత్ అఖరి రెండు ఓవర్లలో 27 పరుగులు సాధించడంతో.. మా స్కోర్ బోర్డ్ 157 పరుగులకు చేరింది. దీంతో 158 పరుగులు చేధించడం పాక్ కష్టంగా మారిందిని అతడు తెలిపాడు. కాగా పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్లో రోహిత్ శర్మ 16 బంతుల్లో 30 పరుగులు సాధించాడు. చదవండి: IND VS AUS: రోహిత్ ఆ షాట్లు ఆడడంలో ఇబ్బంది పడుతున్నాడు: సునీల్ గవాస్కర్ -
జింబాబ్వే బ్యాటర్ల విధ్వంసం.. ఇండియా క్యాపిటల్స్ ఘన విజయం
లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022లో ఇండియా క్యాపిటల్స్ మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. బుధవారం రాత్రి బిల్వారా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా క్యాపిటల్స్ 78 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 198 పరుగులు భారీ స్కోరు చేసింది. జింబాబ్వే ఆటగాడు సొలొమన్ మైర్ (38 బంతుల్లో 82 పరుగులు, 7 ఫోర్లు, ఆరు సిక్సర్లు) విధ్వంసం సృష్టించగా.. మరో జింబాబ్వే బ్యాటర్ మసకద్జా 30 బంతుల్లో 48 పరుగులు చేశాడు. వికెట్ కీపర్ దినేశ్ రామ్‌దిన్ 20 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. బిల్వారా కింగ్స్ బౌలర్లలో యూసఫ్ పఠాన్ మూడు వికెట్లు తీయగా.. బెస్ట్, టిమ్ బ్రెస్నన్ చెరొక వికెట్ తీశారు. అనంతరం 199 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బిల్వారా కింగ్స్ 19.2 ఓవర్లలో 120 పరుగులకే ఆలౌట్ అయింది. తన్మయ్ శ్రీవాత్సవ 27 పరుగులు నాటౌట్ టాప్ స్కోరర్ కాగా.. నమన్ ఓజా 20 పరుగులు చేశాడు. ఇండియా క్యాపిటల్స్ బౌలర్ల కట్టుదిట్టమైన బంతులతో బిల్వారా కింగ్స్ బ్యాటర్లు పరుగులు చేయడానికి నానా తంటాలు పడ్డారు. ఇండియా క్యాపిటల్స్ బౌలర్లలో రజత్ బాటియా, ప్రవీణ్ తాంబే, పంకజ్ సింగ్‌లు తలా రెండు వికెట్లు తీశారు. -
కైఫ్ అర్ధ శతకం వృథా! పఠాన్ సూపర్ ఇన్నింగ్స్! ఉత్కంఠ పోరులో భిల్వార కింగ్స్ గెలుపు
Legends League Cricket 2022- Manipal Tigers vs Bhilwara Kings: లెజెండ్స్ లీగ్ క్రికెట్-2022లో భాగంగా మణిపాల్ టైగర్స్‌తో మ్యాచ్‌లో భిల్వార కింగ్స్ విజయం సాధించింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. చివరి ఓవర్లో వరుసగా సిక్స్, 0, ఫోర్, ఫోర్ బాది టినో బెస్ట్ జట్టు విజయాన్ని ఖరారు చేశాడు. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ సేన గెలుపుతో ఈ టోర్నీని ఆరంభించింది. కాగా లక్నో వేదికగా ఆదివారం(సెప్టెంబరు 18) మణిపాల్ టైగర్స్- భిల్వార కింగ్స్ మధ్య జరిగింది. చెలరేగిన ఫిడెల్! ఇందులో టాస్ గెలిచిన భిల్వార కింగ్స్ కెప్టెన్ ఇర్ఫాన్ పఠాన్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆరంభంలోనే.. ప్రత్యర్థి జట్టు ఓపెనర్ రవికాంత్ శుక్లా వికెట్ తీసి జట్టుకు శుభారంభం అందించాడు. ఆ తర్వాత ఫిడెల్ ఎడ్వర్డ్స్(విండీస్ బౌలర్) వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టి.. మణిపాల్ టైగర్స్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. కైఫ్ అర్ధ సెంచరీ! అయినా గానీ! ఇక నాలుగు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి హర్భజన్ బృందం కష్టాల్లో కూరుకుపోయిన వేళ మహ్మద్ కైఫ్ అద్భుత ఇన్నింగ్స్‌తో రాణించాడు. 59 బంతుల్లో 73 పరుగులు సాధించాడు. తద్వారా మణిపాల్ టైగర్స్ గౌరవప్రదమైన స్కోరు(ఏడు వికెట్ల నష్టానికి 153 పరుగులు) చేయడంలో కీలక పాత్ర పోషించాడు. యూసఫ్ పఠాన్ సూపర్ ఇన్నింగ్స్! టినో మెరుపులు లక్ష్య ఛేదనకు దిగిన భిల్వార కింగ్స్ సైతం ఆదిలోనే ఓపెనర్లు నమన్ ఓజా(6 పరుగులు), విలియమ్ పోర్టర్‌ఫీల్డ్( 4 పరుగులు) వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన యూసఫ్ పఠాన్ 28 బంతుల్లోనే 44 పరుగులు సాధించి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఆఖర్లో కెప్టెన్ ఇర్ఫాన్ పఠాన్ 15, టినో బెస్ట్ 15 పరుగులతో రాణించడంతో 19.4 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి భిల్వారా కింగ్స్ టార్గెట్‌ను ఛేదించింది. ఇక మణిపాల్ టైగర్స్ బ్యాటర్లకు చుక్కలు చూపించిన ఫిడెల్ ఎడ్వర్డ్(నాలుగు వికెట్లు) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఇదిలా ఉంటే.. లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో భాగంగా ఇండియా క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. చదవండి: యువీ సిక్స్ సిక్సర్ల విధ్వంసానికి 15 ఏళ్లు.. స్పెషల్ పార్ట్నర్తో కలిసి! వైరల్ T20 WC: యువ పేసర్‌పై రోహిత్ ప్రశంసలు.. అందుకే వాళ్లంతా ఇంట్లో కూర్చుని ఉన్నా! -
పఠాన్ బ్రదర్స్ విధ్వంసం.. ఇండియా మహారాజాస్ ఘన విజయం
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా లెజెండ్స్ లీగ్ క్రికెట్లో భాగంగా బీసీసీఐ ఇండియా మహారాజాస్, వరల్డ్ జెయింట్స్ మధ్య ఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహించింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఇండియా మహారాజాస్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది. పంకజ్ సింగ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. బ్యాటింగ్‌లో తన్మయ్ శ్రీవాత్సవ, యూసఫ్ పఠాన్లు హాఫ్ సెంచరీలతో చెలరేగి జట్టుకు విజయాన్ని అందించారు. మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన వరల్డ్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. కెవిన్ ఒబ్రెయిన్ 52, దినేశ్ రామ్‌దిన్(42 పరుగులు నాటౌట్), తిసార పెరీరా 23 పరుగులతో రాణించారు. ఇండియా మహారాజాస్ బౌలింగ్‌లో పంకజ్ సింగ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. హర్భజన్ సింగ్, మహ్మద్ కైఫ్, జోగిందర్ శర్మ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా మహారాజాస్ 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. వీరేంద్ర సెహ్వాగ్ 4 పరుగులు చేసి నిరాశ పరచగా.. తన్మయ్ శ్రీవాత్సవ 39 బంతుల్లో 54 పరుగులు చేశాడు. చివర్లో పఠాన్ బ్రదర్స్.. యూసఫ్ పఠాన్ 35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 50 నాటౌట్, ఇర్ఫాన్ పఠాన్ 9 బంతుల్లో 3 సిక్సర్లతో 20 పరుగులు చేసి జట్టును గెలిపించారు. వరల్డ్ జెయింట్స్ బౌలింగ్‌లో టిమ్ బ్రెస్నన్ 3 వికెట్లు తీయగా.. ఫిడెల్ ఎడ్వర్డ్స్ ఒక వికెట్ తీశాడు. చదవండి: ఫెదరర్ ఆస్తి విలువ ఎంతో తెలుసా? -
పాక్‌తో తలపడాల్సిన టీమిండియా ఇదే.. యంగ్ ప్లేయర్‌కు నో ఛాన్స్..!
IND VS PAK T20 World Cup: త్వరలో ప్రారంభంకానున్న టీ20 వరల్డ్‌కప్ కోసం మాజీలు, విశ్లేషకులు తమతమ ఫేవరెట్ జట్లను ప్రకటిస్తున్న వేళ.. టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ సైతం మెగా టోర్నీలో పాక్‌తో తలపడాల్సిన (అక్టోబర్ 23న) భారత తుది జట్టును ఎంపిక చేశాడు. తన ఫేవరెట్ టీమ్ ఎంపికలో ఆచితూచి అడుగులు వేసిన పఠాన్... ఎటువంటి సంచలన ఎంపికలకు తావివ్వకుండా అన్ని విభాగల్లో పటిష్టమైన భారత జట్టును సెలెక్ట్ చేశాడు. అయితే పాక్‌తో ఆడబోయే పఠాన్ డ్రీమ్ ఎలెవెన్‌లో యువ ఆటగాడు రిషబ్ పంత్‌కు చోటు దక్కకపోవడం ఒకింత ఆశ్చర్యాన్ని కల్పించి. ఎప్పుడు పంత్‌కు మద్దతుగా నిలబడే అతనే పంత్‌కు తన తుది జట్టులో ఛాన్స్ ఇవ్వకపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తన డ్రీమ్ ఎలెవెన్‌లో రోహిత్, కేఎల్ రాహుల్‌లను ఓపెనర్లుగా ఎంపిక చేసిన పఠాన్.. మూడో స్థానంలో విరాట్ కోహ్లి, నాలుగో ప్లేస్‌లో సూర్యకుమార్ యాదవ్, ఐదో స్థానంలో దీపక్ హుడా, ఆరో స్థానంలో హార్దిక్ పాండ్యా, ఏడో స్థానంలో దినేష్ కార్తీక్, ఎనిమిదో స్థానంలో చహల్, తొమ్మిది, పది, పదకొండు స్థానాల్లో బుమ్రా, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్‌లను ఎంచుకున్నాడు. పఠాన్ టీమిండియా వికెట్‌కీపర్ స్థానం కోసం పంత్‌ను కాదని డీకేకే ఓటు వేశాడు. అలాగే స్పెషలిస్ట్ స్పిన్నర్ కోటాలో అశ్విన్ కంటే చహల్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ ఇర్ఫాన్ తన ఫేవరెట్ వరల్డ్ కప్ జట్టును (పాక్‌తో మ్యాచ్‌కు) ప్రకటించాడు. కాగా, ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ 16 నుంచి టీ20 వరల్డ్‌కప్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీలో టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో పాక్‌తో తలపడనుంది. ఈ టోర్నీ కోసం ఎంపిక చేసిన 15 మంది సభ్యుల బందానికి రోహిత్ శర్మ నాయకుడిగా, కేఎల్ రాహుల్ ఉప నాయకుడిగా వ్వవహరించనున్నారు. టీ20 వరల్డ్ కప్ 2022లో పాల్గొనే భారత జట్టు ఇదే.. రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, హార్ధిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యజ్వేంద్ర చహాల్, అక్షర్ పటేల్, జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్ స్టాండ్ బై ప్లేయర్లు: మహ్మద్ షమీ, శ్రేయస్ అయ్యర్, రవి భిష్ణోయ్, దీపక్ చాహార్ -
'మ్యాచ్‌లో సిక్సర్లు లేవు.. పార్టీలో మాత్రం ఇరగదీశాడు'
రోడ్‌సేఫ్టీ వరల్డ్ సిరీస్ కోసం టీమిండియా దిగ్గజాలంతా ఒకే చోట చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరల్డ్ సిరీస్‌లో మ్యాచ్‌లు ఆడుతూ బిజీగా ఉన్న ఈ క్రికెటర్లంతా మరోసారి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడంపై అభిమానులు తెగ సంతోషపడిపోతున్నారు. సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్ , ఇర్ఫాన్ పఠాన్, సురేశ్ రైనా సహా మరికొంత మంది రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో ఆడుతున్నారు. కాగా సౌతాఫ్రికా లెజెండ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా లెజెండ్స్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో పార్టీ మూడ్ లోకి వచ్చిన డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేశాడు. మ్యాచ్‌లో సిక్సర్లు కొట్టడంలో విఫలమైన యువరాజ్ పార్టీలో మాత్రం తనదైన డ్యాన్స్‌తో హైలైట్‌గా మారాడు. పాత పాటలు వింటూ పలు డ్యాన్స్ మూమెంట్స్‌తో అలరించాడు. కాగా యువీ డ్యాన్స్‌పై ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. ''యువరాజ్ సింగ్‌లో మాకు అత్యంత ఖరీదైన చీర్లీడర్ కనిపిస్తున్నాడు. నిజంగా ఇది అద్భుతమైన రాత్రి. సూపర్‌గా ఎంజాయ్ చేశాం. చాలాకాలం తర్వాత ఒక సిరీస్ కోసం మేమంతా కలవడం సంతోషంగా అనిపిస్తోంది'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక శనివారం సౌతాఫ్రికా లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 61 పరుగుల తేడాతో ఇండియా లెజెండ్స్ విజయ భేరి మోగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా లెజెండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. ఇండియా బ్యాటర్లలో ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ విధ్వంసం సృష్టించాడు. కేవలం 42 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లుతో 82 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అనంతరం 218 పరుగులతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా లెజెండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 156 పరుగులకే పరిమితమైంది. Having fun with two legendary singers 🎤 @IrfanPathan @ImRaina 🎶 and of course the legend of legends @sachin_rt 👑 @munafpa99881129 @ManpreetGony @pragyanojha #roadsafetyworldseries #indialegends pic.twitter.com/wjP31UcYVZ — Yuvraj Singh (@YUVSTRONG12) September 12, 2022 చదవండి: Mohammed Siraj: తెలివైన బంతితో బోల్తా కొట్టించాడు.. వీడియో వైరల్ -
అర్ష్‌దీప్ బంగారం.. అతడిని నిందించడం ఆపండి: భారత మాజీ స్పిన్నర్
Asia Cup 2022 Ind Vs Pak- Arshdeep Singh Drops Catch: టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌కు భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మద్దతుగా నిలిచాడు. ఉద్దేశపూర్వకంగా ఎవరూ క్యాచ్‌ను వదిలేయరని.. అర్ష్‌దీప్‌ను విమర్శించడం మానుకోవాలని సూచించాడు. పాకిస్తాన్ మెరుగ్గా ఆడిన విషయాన్ని గమనించాలని.. అంతేతప్ప భారత జట్టుపై అవమానకర రీతిలో వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికాడు. ఆసియా కప్-2022 టీ20 టోర్నీ సూపర్-4 తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో భారత్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. బౌలర్ల వైఫల్యం కారణంగా 181 పరుగుల స్కోరును కాపాడుకోలేకపోయింది. ముఖ్యంగా ఆఖర్లో రవి బిష్ణోయి, భువనేశ్వర్ కుమార్ భారీగా పరుగులు ఇవ్వడం.. కీలక సమయంలో అర్ష్‌దీప్ క్యాచ్ నేలపాలు చేయడం పాక్‌కు కలిసి వచ్చింది. దీంతో ఐదు వికెట్ల తేడాతో గెలుపు పాక్ సొంతమైంది. విమర్శల వర్షం.. అండగా భజ్జీ ఈ నేపథ్యంలో టీమిండియా ఓటమికి ప్రధాన కారణం అర్ష్‌దీప్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చాయి. ఇందుకు ట్విటర్ వేదికగా స్పందించిన హర్భజన్ సింగ్.. విమర్శకుల తీరుపై మండిపడ్డాడు. ఈ మేరకు.. ‘‘అర్ష్‌దీప్ సింగ్‌ను నిందించడం ఆపండి. కావాలని ఎవరూ క్యాచ్ వదిలేయరు. భారత జట్టులో ఉన్న యువ ఆటగాళ్లను చూసి మనం గర్వించాలి. నిజానికి ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ మెరుగ్గా ఆడింది. కానీ అందుకు అర్ష్నున, మన జట్టును తప్పుబడుతూ వారిని అవమానించేలా మాట్లాడటం సిగ్గుచేటు. అర్ష్ బంగారం’’ అని భజ్జీ ట్వీట్ చేశాడు. ఇర్ఫాన్ పఠాన్, కోహ్లి సైతం ఇక టీమిండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ సైతం అర్స్దీప్కు అండగా నిలిచాడు. ఇలాంటి పరిస్థితుల్లో ధైర్యంగా ఉండాలని సూచించాడు. అదే విధంగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సైతం మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారని.. ఒత్తిడి ఉన్నపుడు ఇలాంటివన్నీ సహజమని అర్ష్‌దీప్‌నకు మద్దతుగా నిలిచాడు. కట్టుదిట్టంగానే బౌలింగ్.. కానీ కాగా పాక్‌తో మ్యాచ్‌లో మొత్తంగా 3.5 ఓవర్లు బౌలింగ్ చేసిన అర్ష్‌దీప్ 27 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. తన వల్ల లైఫ్ పొందిన అసిఫ్ అలీని అవుట్ చేశాడు. రవి బిష్ణోయి మినహా మిగతా బౌలర్లతో పోలిస్తే ఈ మ్యాచ్‌లో ఈ యువ ఫాస్ట్‌బౌలర్ మెరుగైన ఎకానమీతో బౌలింగ్ చేశాడు. కానీ అసలైన క్యాచ్ జారవిడవడం వల్ల విమర్శల పాలవుతున్నాడు. చదవండి: Virat Kohli: ధోని తప్ప ఒక్కరూ మెసేజ్ చేయలేదు.. టీవీలో వాగినంత మాత్రాన: కోహ్లి ఘాటు వ్యాఖ్యలు Asia Cup 2022 - Ind Vs Pak: పంత్‌పై కోపంతో ఊగిపోయిన రోహిత్ శర్మ.. ఎందుకంటే..? Stop criticising young @arshdeepsinghh No one drop the catch purposely..we are proud of our 🇮🇳 boys .. Pakistan played better.. shame on such people who r putting our own guys down by saying cheap things on this platform bout arsh and team.. Arsh is GOLD🇮🇳 — Harbhajan Turbanator (@harbhajan_singh) September 4, 2022 Arshdeep is a strong character. Stay that way boy. @arshdeepsinghh — Irfan Pathan (@IrfanPathan) September 4, 2022 -
కెప్టెన్లుగా ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్
సెప్టెంబర్ 16 నుంచి ప్రారంభం కానున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ రెండో ఎడిషన్‌కు సంబంధించి కెప్టెన్ల ఎంపిక ప్రక్రియ ముగిసింది. ఈ సీజన్లో పాల్గొనబోయే నాలుగు జట్లు తమ సారధుల పేర్లను ప్రకటించాయి. తొలుత ఇండియా క్యాపిటల్స్ (గౌతమ్ గంభీర్) జట్టు, ఆతర్వాత గుజరాత్ జెయింట్స్ (వీరేంద్ర సెహ్వాగ్) జట్టు తమ కెప్టెన్ల పేర్లను ప్రకటించగా.. తాజాగా మణిపాల్ టైగర్స్, బిల్వారా కింగ్స్ ఫ్రాంచైజీలు తమ సారధుల పేర్లు వెల్లడించాయి. మణిపాల్ గ్రూప్ యాజమాన్యం చేజిక్కించుకున్న మణిపాల్ టైగర్స్.. టీమిండియా మాజీ స్పిన్నర్, ప్రస్తుత రాజ్యసభ ఎంపీ హర్భజన్ సింగ్‌ను తమ కెప్టెన్‌గా ఎంపిక చేసుకున్నట్లు ప్రకటించగా, ఎల్ఎన్జే బిల్వారా గ్రూప్ ఆధ్వర్యంలోని బిల్వారా కింగ్స్ టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్‌ను తమ నాయకుడిగా ఖరారు చేసుకున్నట్లు వెల్లడించింది. తమను సారథులుగా ఎంపిక చేయడం పట్ల భజ్జీ, ఇర్ఫాన్‌లు ఆనందం వ్యక్తం చేశారు. తమ ఎంపికకు 100 శాతం న్యాయం చేసేందుకు సర్వశక్తులా ప్రయత్నిస్తామని అన్నారు. ఈ సందర్భంగా వారిరువురు తమతమ యాజమాన్యాలకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, లీగ్‌కు సంబంధించి ఆటగాళ్ల ఎంపిక జరగాల్సి ఉంది. మరో రెండు, మూడు రోజుల్లో ఈ తంతు కూడా పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు నిర్వహకులు ప్రకటించారు. ఈనెల 16 నుంచి ప్రారంభం కాబోయే ఎల్ఎల్సీ సీజన్-2 ఐదు వేదికలపై (కోల్‌కతా, లక్నో, న్యూఢిల్లీ, కటక్, జోధ్‌పూర్) 22 రోజుల పాటు (అక్టోబర్ 8 వరకు) సాగనుంది. లీగ్‌లో భాగంగా మొత్తం 16 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల్లో (భారత్‌కు స్వాతంత్రం వచ్చి 75 వసంతాలు పూర్తైన సందర్భంగా నిర్వహిస్తున్న సంబురాలు) భాగంగా టోర్నీ ఇనాగురల్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ ఇండియా మహారాజాస్, వరల్డ్ జెయింట్స్ జట్ల మధ్య జరుగనుంది. ఇండియా మహారాజాస్‌కు బీసీసీఐ బాస్ గంగూలీ సారధ్యం వహించనుండగా.. వరల్డ్ జెయింట్స్ జట్టుకు ఇయాన్ మోర్గాన్ నేతృత్వం వహించనున్నాడు. చదవండి: అభిమానులకు ఊహించని షాకిచ్చిన గంగూలీ! -
Ind Vs Hk: రవీంద్ర జడేజా అరుదైన రికార్డు.. టీమిండియా తొలి బౌలర్‌గా..
Asia Cup 2022 India Vs Hong Kong- Ravindra Jadeja: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆసియా కప్ టోర్నీ చరిత్రలో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ మెగా ఈవెంట్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలిచాడు. ఆసియా కప్-2022లో భాగంగా.. హాంగ్ కాంగ్‌తో బుధవారం(ఆగష్టు 31) జరిగిన మ్యాచ్‌లో బాబర్ హయత్ వికెట్ తీయడం ద్వారా ఈ ఫీట్ నమోదు చేశాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ పేసర్ ఇర్ఫాన్ పేరిట ఉన్న రికార్డును జడ్డూ బద్దలు కొట్టాడు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో జడేజా ఇప్పటి వరకు మొత్తంగా 23 వికెట్లు పడగొట్టాడు. 2010 నుంచి ఆసియా కప్ టోర్నీలో ఆడుతున్న ఈ ఆల్‌రౌండర్ తాజాగా సాధించిన ఘనతతో దిగ్గజ బౌలర్ ముత్తయ్య మురళీధరన్, లసిత్ మలింగ, అజంతా మెండిస్, సయీద్ అజ్మల్ తర్వాతి స్థానంలో నిలిచాడు. కాగా హాంగ్ కాంగ్‌తో మ్యాచ్‌లో జడేజా 4 ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి 15 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీశాడు. అంతకుముందు పాకిస్తాన్‌తో ఆరంభ మ్యాచ్‌లో 2 ఓవర్లలో 11 పరుగులు ఇచ్చాడు. ఆసియా కప్ టోర్నీలో 2010 నుంచి 2022లో హాంగ్ కాంగ్‌తో మ్యాచ్ వరకు రవీంద్ర జడేజా తీసిన వికెట్లు: ►2010- నాలుగు వికెట్లు ►2012- ఒక వికెట్ ►2014- ఏడు వికెట్లు ►2016- మూడు వికెట్లు ►2018- ఏడు వికెట్లు ►2022 హాంగ్ కాంగ్‌తో మ్యాచ్ నాటికి- ఒకటి ఆసియా కప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 ఆటగాళ్లు(ఇప్పటి వరకు) 1. మురళీధరన్(శ్రీలంక)- 30 2. లసిత్ మలింగ(శ్రీలంక)- 29 3. అజంతా మెండిస్(శ్రీలంక)- 26 4. సయీద్ అజ్మల్(పాకిస్తాన్)- 25 5. రవీంద్ర జడేజా(ఇండియా)- 23 చదవండి: Ind Vs HK: కోహ్లికి హాంగ్ కాంగ్ జట్టు స్పెషల్ గిఫ్ట్.. థాంక్యూ విరాట్ అంటూ! ఫిదా అయిన ‘కింగ్’! Asia Cup 2022: నాడు కోహ్లి వర్సెస్ సూర్య! ఇప్పుడు సూర్యకు విరాట్ ఫిదా! తలవంచి మరీ! వైరల్ IND VS HK: అక్కడ ఉన్నది జడేజా.. కొంచెం చూసి వెళ్లాలి కదా! వీడియో వైరల్ -
మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్‌కు చేదు అనుభవం!
ఇండియన్ మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. విస్తారా ఎయిర్‌లైన్స్ సిబ్బంది తనపట్ల అనుచితంగా ప్రవర్తించారని మండిపడ్డారు. సంబంధిత అధికారులపై విస్తారా ఎయిర్‌లైన్స్ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని కోరారు. పఠాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి ముంబై నుంచి దుబాయ్‌కి విస్తారా ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణించారు. ఈ ప్రయాణం సందర్భంగా ఇర్ఫాన్ పఠాన్ తన భార్య పిల్లలతో కలిసి కౌంటర్ వద్ద పడికాపులు కాయాల్సిన పరిస్థితి ఎదురైనట్లు చెప్పారు. గ్రౌండ్ స్టాఫ్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు,నేను ముంబై నుండి విస్తారా ఫ్లైట్ యూకే -201లో దుబాయ్‌కి ప్రయాణిస్తున్నాను. చెక్ ఇన్ కౌంటర్లో చేదు అనుభవం ఎదురైంది. విస్తారా ఫ్లైట్‌లో నా టికెట్ క్లాస్ కాన్ఫామ్ అయ్యింది. కానీ విస్తారా డౌన్‌గ్రేడ్ (అంటే బుక్ చేసుకున్న క్లాస్ వేరే..వాళ్లు కాన్ఫామ్ చేసిన సీటు వేరు) చేసింది. దాన్ని ధృవీకరించేందుకు నన్ను వెయిట్ చేయించింది. కౌంటర్ వద్ద అరగంటకు పైగా ఎదురు చూశా. Hope you notice and rectify @airvistara pic.twitter.com/IaR0nb74Cb — Irfan Pathan (@IrfanPathan) August 24, 2022 "గ్రౌండ్ స్టాఫ్ దురుసుగా ప్రవర్తించారు. సాకులు చెప్పారు. వాస్తవానికి, ఇద్దరు ప్రయాణికులకు కూడా ఇదే అనుభవం ఎదురైంది. మేనేజ్మెంట్ను ఉద్దేశిస్తూ..వారు ఫ్లైట్ టికెట్లను ఇలా ఎందుకు అమ్ముతున్నారు. మేనేజ్మెంట్ ఎలా ఆమోదిస్తుందో? నాకు అర్థం కావడం లేదు. ఈ ఘటనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు కోరుతున్నా. నాకు ఎదురైన అనుభవం.. ఇంకెవరూ అనుభవించకూడదు" అని ట్వీట్లో పేర్కొన్నారు. అయితే పఠాన్ ట్వీట్‌పై మాజీ క్రికెటర్ ఆకాష్ చౌప్రా స్పందించారు. ఎయిర్‌లైన్స్ నుండి ఇలాంటి ప్రవర్తన ఊహించలేదని రిప్లయి ఇచ్చారు. Hey @airvistara, totally unexpected from you. https://t.co/7w9YnHMo89 — Aakash Chopra (@cricketaakash) August 24, 2022 -
'ఆ ఐడియా నాదే.. బ్యాంక్ అకౌంట్ వివరాలు పంపిస్తున్నా'
ఐపీఎల్లో రెండుసార్లు చాంపియన్‌గా నిలిచిన కేకేఆర్ బుధవారం తమ జట్టు కొత్త హెడ్‌కోచ్‌గా రంజీ దిగ్గజం చంద్రకాంత్ పండిట్‌ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఆరుసార్లు రంజీ ట్రోపీ గెలిపించిన కోచ్‌గా చంద్రకాంత్ పండిట్ కొత్త చరిత్ర సృష్టించాడు. కోచ్‌గా సరైన వ్యక్తిని ఎంపిక చేసుకోవడంతోనే కేకేఆర్ సగం సక్సెస్ అయిందని.. ఇక ఈసారి కచ్చితంగా కేకేఆర్ టైటిల్ కొట్టబోతుందని అభిమానులు పేర్కొన్నారు. కాగా చంద్రకాంత్ పండిట్ నియామకంపై అన్ని వైపుల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్న వేళ టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్, కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ మధ్య ఒక ఆసక్తికర సంభాషణ నడిచింది. విషయంలోకి వెళితే.. కొద్ది రోజుల క్రితం మధ్యప్రదేశ్ రంజీ ట్రోపీ-2022 విజేతగా అవతరించిన సంగతి తెలిసిందే. ఈ విజయం వెనుక మధ్యప్రదేశ్ రంజీ కోచ్ చంద్రకాంత్ పండిట్ పాత్ర కీలకం. ఒకప్పుడు కెప్టెన్‌గా సాధించలేనిది కోచ్‌గా తన కలను నెరవేర్చుకున్నాడు. ఈ సందర్భంగా ఇర్ఫాన్ పఠాన్ అభినందిస్తూ ఒక ట్వీట్ చేశాడు.'' కంగ్రాట్స్ మధ్యప్రదేశ్.. రంజీ ట్రోపీ గెలిచినందుకు. చంద్రకాంత్ పండిట్ మ్యాజిక్ మరోసారి పనిచేసింది. అతనికి ఐపీఎల్ కోచ్‌గా కాంట్రాక్ట్ ఇస్తే ఎలా ఉంటుంది'' అని ట్వీట్ చేశాడు. తాజాగా కేకేఆర్ కోచ్‌గా చంద్రకాంత్ పండిట్ ఎంపికైన నేపథ్యంలో ఆ జట్టు సీఈవో వెంకీ మైసూర్... ఇర్ఫాన్ పఠాన్ పాత ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ.. ''ఇర్ఫాన్ భయ్యా.. మీ మాటలు విన్నాం.. అందుకే'' అంటూ లాఫింగ్ ఎమోజీ షేర్ చేశాడు. దీనిపై ఇర్ఫాన్ స్పందిస్తూ.. ''హాహా.. వెంకీబాయ్ ఉన్నా.. మీకు(వెంకీ మైసూర్).. అలాగే కొత్త కోచ్‌గా వచ్చిన చందు భాయికి(చంద్రకాంత్ పండిట్) ఆల్ ది బెస్ట్. అలాగే చందు భయ్యాను కోచ్‌గా తీసుకోవాలనే ఐడియా నేనే ఇచ్చా.. అందుకే నా బ్యాంక్ అకౌంట్ వివరాలు పంపతున్నా'' అంటూ ఫన్నీగా ట్వీట్ చేశాడు. ప్రస్తుతం వీరిద్దరి సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక గౌతమ్ గంభీర్ నేతృత్వంలో 2012, 2014లో చాంపియన్‌గా నిలిచిన కేకేఆర్.. మరోసారి కప్ కొట్టడంలో విఫలమైంది. అయితే 2021లో ఇయాన్ మోర్గాన్ సారధ్యంలో ఫైనల్ చేరినప్పటికి.. సీఎస్కే చేతిలో ఓటమిపాలై రన్నరప్‌గా నిలిచింది. ఇక 2022 ఐపీఎల్ సీజన్లో శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని కేకేఆర్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్లేఆఫ్ చేరడంలో విఫలమైన కేకేఆర్ ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. చదవండి: Chandrakanth Pandit: కొత్త కోచ్‌గా రంజీ దిగ్గజం.. కేకేఆర్ దశ మారనుందా! IND vs ZIM: ఆరు నెలల తర్వాత రీ ఎంట్రీ.. బ్యాటర్లకు చుక్కలు చూపించిన చాహర్! -
'అతడిని సరిగ్గా ఉపయోగించుకోండి.. మరో ఏడేళ్ల పాటు భారత్‌కు'
టీమిండియా ఆటగాడు దీపక్ హుడా గత కొంత కాలంగా అద్భుతంగా రాణిస్తున్నాడు. తనకు లభించిన తక్కువ అవకాశాల్లో అదరిపోయే ఆటతీరుతో అందరనీ అకట్టుకున్నాడు. ముఖ్యంగా ఐర్లాండ్ పర్యటనలో హుడా అత్యత్తుమ ప్రదర్శన కనబరిచాడు. ఈ సిరీస్‌లో సెంచరీతో చెలరేగిన హుడా.. 151 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కాగా ప్రస్తుతం దీపక్ విండీస్ పర్యటనలో ఉన్న భారత జట్టులో భాగంగా ఉన్నాడు. ఆదివారం విండీస్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ విజయంలో ఆల్ రౌండ్ ప్రదర్శనతో హుడా తన వంతు పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో దీపక్ హుడాపై భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. రానున్న రోజుల్లో భారత జట్టుకు స్టార్ ఆల్‌రౌండర్‌గా హుడా నిలుస్తాడని పఠాన్ కొనియాడాడు. "రెండేళ్ల క్రితం భారత జట్టులోకి వస్తానని హుడా అసలు ఊహించి ఉండడు. జట్టులోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే హుడా అదరగొడుతున్నాడు. అతడు జట్టులోకి రావడానికి చేసిన ప్రయత్నంలోనే సగం విజయం సాధించాడు. అతడికి ఇప్పుడు కేవలం 27 ఏళ్ల మాత్రమే. భారత్ అతడిని సరిగ్గా ఉపయోగించుకుంటే మరో ఆరు ఏడేళ్ల పాటు తన సేవలు అందించగలడు. అతడు ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ప్రతిఫలం ఆశించి పనిచేస్తే ఎప్పుడూ నీవు రాణించలేవని గతంలో అతడితో చెప్పాను. జట్టు పరిస్థితులను బట్టి తన బ్యాటింగ్ స్ట్టైల్ను మార్చుకుంటాడు. ఎప్పుడూ నెమ్మదిగా ఆడాలో, ఎప్పుడు వేగంగా ఆడాలో అతడికి బాగా తెలుసు అని అని పఠాన్ పేర్కొన్నాడు. చదవండి: Virat Kohli - Robin Uthappa: జట్టులో కోహ్లి స్థానం గురించి ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు! వీళ్లంతా అప్పుడేం చేశారు? -
ఆఖరి ఓవర్లో సిక్సర్‌తో టీమిండియాను గెలిపించింది వీళ్లే! ఎప్పుడెప్పుడంటే?
క్రికెట్ మ్యాచ్ ఏదైనా.. ముఖ్యంగా వన్డే లేదంటే టీ20 మ్యాచ్‌లో ఆఖరి ఓవర్, ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపే సందర్భాల్లో.. ఆటగాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెడితే.. ప్రేక్షకులకు మాత్రం పరిమిత ఓవర్ల మ్యాచ్‌లోని అసలైన మజా అనుభవించే అవకాశం దొరుకుతుంది. వెస్టిండీస్ పర్యటనలో భాగంగా శిఖర్ ధావన్ సారథ్యంలోని టీమిండియా వన్డే సిరీస్‌లోని రెండు మ్యాచ్‌లలో ఇలాంటి అనుభవాలు చవిచూసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మొదటి వన్డేలో 3 పరుగులు, రెండో వన్డేలో ఆఖరి ఓవర్లో అక్షర్ పటేల్ సిక్సర్ కొట్టడంతో 2 వికెట్ల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. ఇక భారత బౌలింగ్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కెరీర్లోనే ఇది చిరస్మరణీయ మ్యాచ్ అనడంలో సందేహం లేదు. విజయానంతరం అతడు మాట్లాడుతూ.. అద్భుత ఇన్నింగ్స్‌తో అది కూడా సిక్సర్‌తో ముగించి జట్టు సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించడం తనకు ఎల్లప్పుడూ గుర్తుండిపోతుందని చెప్పాడు. మరి, అక్షర్ లాగే ఫైనల్ ఓవర్లో సిక్స్‌తో ఫినిషింగ్ ఇచ్చి జట్టును విజయతీరాలకు చేర్చిన టీమిండియా క్రికెటర్లు ఎవరో ఓసారి గమనిద్దాం. అక్షర్ పటేల్ వెస్టిండీస్ పర్యటన-2022లో భాగంగా పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో అక్షర్ పటేల్ ఈ అరుదైన ఘనత సాధించాడు. రెండో వన్డేలో భారత్ విజయానికి ఆరు బంతుల్లో ఎనిమిది పరుగులు అవసరమైన వేళ.. తొలి 3 బంతుల్లో 2 పరుగులే వచ్చాయి. .@akshar2026 takes #TeamIndia home! Finishes it in style. Watch all the action from the India tour of West Indies LIVE, only on #FanCode 👉 https://t.co/RCdQk1l7GU@BCCI @windiescricket #WIvIND #INDvsWIonFanCode #INDvsWI pic.twitter.com/WHjdscpzd9 — FanCode (@FanCode) July 24, 2022 ఈ క్రమంలో విండీస్ బౌలర్ మేయర్స్ నాలుగో బంతిని ఫుల్‌టాస్‌గా సంధించగా.. అక్షర్ దానిని సిక్సర్‌గా మలిచాడు. దీంతో టీమిండియా విజయం ఖరారైంది. అదే విధంగా అంతకు ముందు మొదటి మ్యాచ్‌ల కూడా గెలవడంతో సిరీస్ కూడా సొంతమైంది. ఎంఎస్ ధోని టీమిండియా అత్యుత్తమ ఫినిషర్‌గా పేరొందాడు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. అతడి బెస్ట్ ఫినిషింగ్ ఇన్నింగ్స్ అనగానే వన్డే వరల్డ్‌కప్-2011 గుర్తుకురావడం సహజం. ఫైనల్లో శ్రీలంక ఆటగాడు కులశేఖర బౌలింగ్‌లో 49వ ఓవర్ రెండో బంతిని భారీ సిక్సర్‌గా మలిచాడు. ఆ సిక్స్ భారత్‌కు ప్రపంచకప్‌ను అందించింది. ఇదిలా ఉంటే.. ఆఖరి ఓవర్లో ధోని సిక్స్ బాది టీమిండియాను గెలిపించిన సందర్భాన్ని గుర్తు చేసుకుందాం. 2013లో వెస్టిండీస్ వేదికగా విండీస్, శ్రీలంక, టీమిండియా మధ్య వన్డే ట్రై సిరీస్ జరిగింది. ఇందులో బాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే ఆరు బంతుల్లో 15 పరుగులు చేయాలి. అప్పటికి ధోని క్రీజులో ఉన్నాడు. షమిందా ఎరంగా బౌలింగ్ చేస్తున్నాడు. మొదటిది డాట్ బాల్.. దీంతో ఐదు బంతుల్లో 15 పరుగులు సాధించాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో తదుపరి మూడు బంతుల్లో ధోని వరుసగా సిక్సర్, ఫోర్, సిక్సర్ బాదాడు. విజయం టీమిండియా సొంతమైంది. దినేశ్ కార్తిక్ 2018 నిదహాస్ టీ20 ట్రోఫీలో భాగంగా ఫైనల్ మ్యాచ్‌ను ఎవరూ అంత తేలికగా మర్చిపోరు. ఈ ట్రై సిరీస్‌లో బంగ్లాదేశ్- టీమిండియా మధ్య ట్రోఫీకై హోరాహోరీ పోరు జరిగింది. టైటిల్ గెలవాలంటే ఆఖరి రెండు ఓవర్లలో భారత్‌కు 34 పరుగులు కావాలి. విజయ్ శంకర్, దినేశ్ కార్తిక్ క్రీజులో ఉన్నారు. గెలుపు బాధ్యతను నెత్తికెత్తుకున్న డీకే.. 19వ ఓవర్లో 22 పరుగులు చేశాడు. దీంతో సమీకరణం ఆరు బంతుల్లో 12 పరుగులుగా మారింది. అయితే, స్ట్రైక్ రొటేట్ చేస్తున్న వేళ విజయ్ తడబడటంతో ఆఖరి బంతికి ఐదు పరుగులు చేయాల్సిన పరిస్థితి. నరాలు తెగే ఉత్కంఠ. సౌమ్య సర్కార్ బౌలింగ్‌లో ఆఖరి బంతిని సిక్సర్‌గా మలిచి డీకే భారత్‌కు చిరస్మరణీయ విజయం అందించాడు. హార్దిక్ పాండ్యా టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. ఆస్ట్రేలియా పర్యటనలో తనదైన శైలిలో భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. సిడ్నీ వేదికగా 2020లో ఇరు జట్ల మధ్య టీ20 మ్యాచ్.. ఆస్ట్రేలియా 5 వికెట్ల నష్టానికి 194 పరుగులు సాధించి భారత్‌కు భారీ లక్ష్యం విధించింది. 16.1 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 149 పరుగులు చేసి.. నాలుగు వికెట్లు కోల్పోయింది. 23 బంతుల్లో 56 పరుగులు చేయాలి. హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్ క్రీజులో ఉన్నారు. ఆఖరి ఓవర్లో టీమిండియా గెలుపు సమీకరణం 14 పరుగులు.. డేనియల్ సామ్స్ బౌలింగ్. పాండ్యా క్రీజులో ఉన్నాడు. మొదటి మూడు బంతుల్లో స్కోరు వరుసగా 2,6, డాట్. దీంతో మూడు బంతుల్లో ఆరు పరుగులు చేయాలి. పాండ్యా తనదైన శైలిలో భారీ షాట్ బాది టీమిండియాకు విజయం అందించాడు. ఆ మ్యాచ్‌లో 22 బంతుల్లో 42 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు. హర్భజన్ సింగ్ టర్బోనేటర్, టీమిండియా ఆఫ్ స్పిన్నర్ భజ్జీ.. పాకిస్తాన్‌తో 2010 నాటి మ్యాచ్‌లో బ్యాటర్‌గా తన విశ్వరూపం ప్రదర్శించాడు. డంబుల్లా వేదికగా జరిగిన ఆసియా కప్ ఈవెంట్లో భాగంగా దాయాది జట్టుతో పోరు. టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్ సల్మాన్ భట్ 74 పరుగులతో రాణించాడు. కమ్రాన్ అక్మల్ 51 పరుగులు చేశాడు. దీంతో పాకిస్తాన్ 267 పరుగులు సాధించింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌ను ఓపెనర్ గౌతమ్ గంభీర్ 83, కెప్టెన్ ధోని 56 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిపారు. అయితే, ఆ తర్వాత సీన్ మారింది. వరుస విరామాల్లో భారత్ వికెట్లు కోల్పోయింది. 46వ ఓవర్.. భారత్ స్కోరు 219. చేతిలో నాలుగు వికెట్లు. మహ్మద్ ఆమిర్ చేతికి బంతినిచ్చాడు పాక్ సారథి ఆఫ్రిది. భారత్ గెలవాలంటే ఆఖరి ఓవర్లో ఏడు పరుగులు చేయాలి. సురేశ్ రైనా, హర్భజన్ సింగ్ క్రీజులో ఉన్నారు. రెండో బంతికి రైనా అవుటయ్యాడు. ఈ క్రమంలో సమీకరణం రెండు బంతుల్లో మూడు పరుగులకు చేరింది. భజ్జీకి షార్ట్ లెంగ్త్ బాల్ సంధించాడు ఆమిర్. ఏమాత్రం తడబడకుండా దాన్ని బౌండరీకి తరలించి జట్టును గెలిపించాడు టర్బోనేటర్. ఇర్ఫాన్ పఠాన్ 2007 ఫిబ్రవరి.. శ్రీలంకతో టీమిండియా టీ20 మ్యాచ్. నాలుగు వికెట్ల నష్టానికి లంక జట్టు 171 పరుగులు చేసింది. భారత్‌కు శుభారంభం లభించలేదు. ఆదుకుంటారనుకున్న సురేశ్ రైనా, యువరాజ్ సింగ్ కూడా 30 పరుగులకే పెవిలియన్ చేరారు. 15.1 ఓవర్లలో స్కోరు 115/7. గెలవాలంటే 29 బంతుల్లో 56 పరుగులు చేయాలి. యూసఫ్ పఠాన్, అతడి తమ్ముడు ఇర్ఫాన్ పఠాన్ క్రీజులో ఉన్నారు. యూసఫ్ దూకుడుగా ఆడటం మొదలుపెట్టాడు. ఇర్ఫాన్ కూడా అన్నకు జతకలిశాడు. ఇద్దరూ కలిసి ఆచితూచి ఆడుతూనే పరుగులు రాబడుతూ భారత శిబిరంలో ఉత్సాహం నింపారు. ఈ క్రమంలో గెలుపు సమీకరణం ఆఖరి ఓవర్లో ఐదు పరుగులకు చేరింది. లసిత్ మలింగ బరిలోకి దిగాడు. మొదటి బంతికి యూసఫ్ సింగిల్ తీశాడు. రెండో బంతిని ఎదుర్కొన్న ఇర్ఫాన్ మిడ్ వికెట్ మీదుగా సిక్సర్ బాది భారత్ విజయం ఖరారు చేశాడు. చదవండి: Commonwealth Games 2022: భారత్‌కు భారీ షాక్.. కామన్వెల్త్ గేమ్స్ నుంచి నీరజ్ చోప్రా ఔట్! Rahul Dravid: సెంచరీ సాధించినా నా పేరు ఎవరికీ తెలియలేదు.. అప్పుడే నిర్ణయించుకున్నా! -
విక్రమ్ ‘కోబ్రా’ ఆడియో లాంచ్ (ఫొటోలు)
-
‘ప్రపంచకప్‌లో భారత తుది జట్టు.. వికెట్ కీపర్‌గా డీకే.. పంత్‌కు నో ఛాన్స్..!’
ఆస్ట్రేలియా వేదికగా జరుగన్న టీ20 ప్రపంచకప్-2022కు ఇంకా సమయం ఉన్నప్పటికీ మాజీలు, క్రికెట్ నిపుణులు తమ తమ అంచనాలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్ బరిలో దిగే భారత తుది జట్టును టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అంచనా వేశాడు. ఈ జట్టులో వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ స్ధానంలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న దినేష్ కార్తీక్‌ను పఠాన్ ఎంపిక చేశాడు. గత కొన్ని మ్యాచ్‌ల నుంచి పంత్ పేలవమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌కు సారథ్యం వహించిన పంత్.. కెప్టెన్‌గా కాస్త పర్వాలేదనపించనప్పటికీ, బ్యాటర్‌గా మాత్రం విఫలమయ్యాడు. ఈ క్రమంలో అతడి ఆటతీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. మరో వైపు మూడేళ్ల తర్వాత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన కార్తీక్ అదరగొడుతున్నాడు. దీంతో ప్రపంచకప్‌కు పంత్ స్థానంలో కార్తీక్‌ను ఎంపిక చేయాలని మాజీలు సూచిస్తున్నారు. ఇక పఠాన్ ఎంచుకున్న జట్టు విషయానికి వస్తే.. ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలను ఎంపిక చేశాడు. మూడు, నాలుగు స్థానాల్లో వరుసగా విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్‌లకు అవకాశమిచ్చాడు. ఇక ఐదో స్థానంలో హార్ధిక్ పాండ్యా, ఫినిషర్‌గా దినేష్ కార్తీక్‌కు చోటిచ్చాడు. ఇక తన జట్టలో ఫుల్‌టైమ్ ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజాను ఎంపిక చేయగా.. స్పెషెలిస్ట్ స్పిన్నర్ కోటాలో కేవలం చహల్‌కు మాత్రమే చోటు పఠాన్ చోటు ఇచ్చాడు. ఇక తన ఎంచుకున్న జట్టులో ప్రధాన పేసర్లుగా బుమ్రా, భువనేశ్వర్ కుమార్,హర్షల్ పటేల్‌కు ఛాన్స్ ఇచ్చాడు. ఇక ఇర్ఫాన్ పఠాన్ ప్రకటించిన జట్టులో రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, మహ్మద్ షమీకి చోటు దక్క లేదు. టీ20 ప్రపంచకప్‌కు ఇర్ఫాన్ పఠాన్ ఎంచకున్న జట్టు: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, రవీంద్ర జడేజా,హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా చదవండి: Trolls On Ruturaj Gaikwad: అసలేంటి రుతురాజ్ నువ్వు? నీ నుంచి ఇది అస్సలు ఊహించలేదు.. మరీ ఇలా చేస్తావా? పాపం.. -
'శ్రేయస్ స్పిన్నర్లకు అద్భుతంగా ఆడుతాడు.. కానీ పేసర్లకు'
టీమిండియా ఆటగాడు శ్రేయస్ అయ్యర్ ఫాస్ట్ బౌలర్లనుఎదుర్కొవడానికి ఇబ్బంది పడుతున్నాడని భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడుతున్నాడు. అదే విధంగా స్పిన్నర్లకు, మీడియం పేస్ బౌలర్లకు అయ్యర్ అద్భుతంగా ఆడుతున్నాడని అతడు తెలిపాడు. స్వదేశంలో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో అదరగొట్టిన అయ్యర్.. ప్రస్తుతం దక్షిణాప్రికాతో జరుగుతోన్న టీ20 సిరీస్‌లో అంతగా రాణించ లేకపోతున్నాడు. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన అయ్యర్.. 94 పరుగులు మాత్రమే చేశాడు. "అయ్యర్ పేస్ బౌలింగ్‌కు ఆడటానికి ఇబ్బంది పడుతున్నాడు. ఈ ఒక్క సిరీస్‌లోనే కాదు గత కొన్ని మ్యాచ్‌ల నుంచి కూడా ఫాస్ట్ బౌలర్లకే తన వికెట్‌ను సమర్పించుకుంటున్నాడు. ఐపీఎల్లో 140 కిమీ కంటే ఎక్కువ వేగంతో వచ్చే బంతుల్ల్ని ఆడిన సందర్భాల్లో అతడి స్ట్రైక్ రేట్ భారీగా తగ్గింది. అయితే అతడు స్పిన్నర్లు, 140 కిమీ కంటే తక్కువ వేగంతో వేసే బౌలర్లపై అతడు తేలిగ్గా ఆడుతాడు. అతడు తన భుజాలపైకి వచ్చే బంతులను ఎదర్కొవడంపై ప్రాక్టీస్ చేయాలి" అని ఓ స్పోర్ట్స్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు. చదవండి: Former Cricketer Salil Ankola: దిగ్గజ క్రికెటర్‌తో పాటే అరంగేట్రం.. క్రికెట్‌పై అసూయ పెంచుకొని -
ఐపీఎల్ అత్యుత్తమ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా..!
Irfan Pathan best XI IN IPL 2022: ఐపీఎల్ 15వ సీజన్ ఆదివారంతో ముగిసింది. ఐపీఎల్-2022 చాంఫియన్స్‌గా గుజరాత్ టైటాన్స్ నిలిచిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో రాజస్తాన్‌పై గుజరాత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక ఈ ఏడాది సీజన్లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ అదరగొట్టాయి. హార్ధిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ తొలి సీజన్లోనే టైటిల్‌ను ముద్దాడగా.. రాహుల్ కెప్టెన్సీలోని లక్నో ప్లే ఆఫ్స్‌లో తన ప్రయాణాన్ని ముగించింది. ముఖ్యంగా ఈ ఏడాది సీజన్లో ఆయా జట్ల యువ ఆటగాళ్లు దుమ్మురేపారు. అదే విధంగా దినేష్ కార్తీక్, చాహల్,కుల్ధీప్ యాదవ్ వంటి వెటరన్ ఆటగాళ్లు కూడా అద్భుతమైన ప్రదర్శన చేశారు. ఈ క్రమంలో ఐపీఎల్-2022లో తన బెస్ట్ ఎలెవన్‌ను మాజీ భారత ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రకటించాడు. తన ఎంచుకున్న జట్టుకు హార్ధిక్ పాండ్యాను కెప్టెన్‌గా పఠాన్ ఎంచుకున్నాడు. అదే విధంగా ఓపెనర్లుగా జోస్ బట్లర్, కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేశాడు. వరుసగా మూడు నాలుగు స్థానాల్లో సంజూ శాంసన్, హార్ధిక్ పాండ్యాకు చోటు ఇచ్చాడు. ఐదు ఆరు స్థానాల్లో లాయమ్ లివింగ్ స్టోన్, డేవిడ్ మిల్లర్‌కు చోటు దక్కింది. ఇక బౌలింగ్ ఆల్ రౌండర్లగా రషీద్ ఖాన్,హార్షల్ పటేల్‌ను పఠాన్ ఎంపిక చేశాడు. ఆదే విధంగా బౌలర్ల కోటాలో మహ్మద్ షమీ, యజువేంద్ర చహాల్, ఉమ్రాన్ మాలిక్‌కు అతడు అవకాశం ఇచ్చాడు. ఇక ఈ జట్టులో 12వ ఆటగాడిగా స్పిన్నర్ కుల్ధీప్ యాదవ్ ఎంపికయ్యాడు. ఇర్ఫాన్ పఠాన్ ఐపీఎల్-2022 బెస్ట్ ఎలెవన్: జోస్ బట్లర్, కేఎల్ రాహుల్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మిల్లర్, రషీద్ ఖాన్, హర్షల్ పటేల్, మహ్మద్ షమీ, యుజ్వేంద్ర చాహల్, ఉమ్రాన్ మాలిక్ (12వ ఆటగాడు- కుల్దీప్ యాదవ్) చదవండి: IPL 2022: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన ఆశిష్ నెహ్రా.. తొలి ‘భారత’ హెడ్ కోచ్‌గా! -
'ఐపీఎల్ చరిత్రలో అతడే అత్యత్తుమ ఫినిషర్'
చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఐపీఎల్లో అందరికంటే ఎంఎస్ ధోని అత్యత్తుమ ఫినిషర్ అని పఠాన్ అభిప్రాయపడ్డాడు. కాగా ఈ ఏడాది సీజన్లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌ను ధోని తనదైన స్టైల్లో ఫినిష్ చేసిన సంగతి తెలిసిందే. "ఐపీఎల్ చరిత్రలో ఎంఎస్ ధోని అత్యత్తుమ ఫినిషర్. ధోని ఐపీఎల్ నుంచి తప్పుకున్న తర్వాత మరొకరు ఈ జాబితాలోకి చేరవచ్చు. కానీ ధోని లాంటి గ్రేట్ ఫినిషర్లు రారు. ఐపీఎల్ చరిత్రలో ధోని, డివిలియర్స్ అద్భుతమైన ఫినిషర్లు. కానీ ధోనీ ముందంజలో ఉన్నాడు. ఇక సీఎస్కే జట్టు గురించి మాట్లాడూతూ.. చెన్నై సూపర్ కింగ్స్‌ను ఏ జట్టు తక్కువగా అంచనా వేయదు. ఎందుకంటే చాలాసార్లు ఓటమి అంచుల నుంచి విజయ తీరాలకు చేరుకుంది. లీగ్ చరిత్రలో సీఎస్కే అత్యంత ప్రమాదకరమైన జట్టు" అని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు. ఇక ప్రస్తుత సీజన్లో 7 మ్యాచ్‌లు ఆడిన సీఎస్కే.. రెండు మ్యాచ్‌లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. కాగా సోమవారం పంజాబ్ కింగ్స్‌తో సీఎస్కే తలపడనుంది. చదవండి: IPL 2022: వరుస ఓటముల నేపథ్యంలో ముంబై ఇండియన్స్ కోచ్ కీలక వ్యాఖ్యలు -
అప్పుడూ.. ఇప్పుడూ ధోని మాస్టర్ ప్లాన్‌కు చిత్తు.. ఇగో వదిలెయ్!
IPL 2022 CSK Vs MI- MS Dhoni- Kieron Pollard: ముంబై ఇండియన్స్ హిట్టర్ కీరన్ పొలార్డ్ తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ విమర్శలు గుప్పించాడు. నాకు తిరుగులేదు అన్న అహంభావంతోనే చెన్నై సూపర్‌కింగ్స్‌తో మ్యాచ్‌లో వికెట్ కోల్పోయాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇకనైనా ఇగోను పక్కనపెట్టి జట్టు ప్రయోజనాల కోసం ఆడాలని సూచించాడు. కాగా ఐపీఎల్-2022లో భాగంగా చెన్నైతో గురువారం జరిగిన మ్యాచ్‌లో ముంబై పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఆఖరి బంతికి ధోని ఫోర్ బాదడంతో మూడు వికెట్ల తేడాతో ఓటమి పాలై వరుసగా ఏడో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఓపెనర్లు రోహిత్ శర్మ(0), ఇషాన్ కిషన్(0) పూర్తిగా విఫలం కాగా... వన్‌డౌన్‌లో వచ్చిన డెవాల్డ్ బ్రెవిస్ 4 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్(32), తిలక్ వర్మ(51) కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఆఖర్లో 9 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్ బాది 14 పరుగులు సాధించిన పొలార్డ్ భారీ స్కోరు చేసేలా కనిపించాడు. అయితే, ప్రమాదకరంగా పరిణమిస్తున్న పొలార్డ్‌ను పెవిలియన్‌కు పంపేందుకు చెన్నై మాజీ కెప్టెన్ ధోని ఫీల్డ్ సెట్ చేశాడు. తలైవా మాస్టర్ ప్లాన్‌లో చిక్కుకున్న ఈ భారీ హిట్టర్ మహీశ్ తీక్షణ బౌలింగ్‌లో శివమ్ దూబేకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మహీశ్ సంధించిన క్యారమ్ బాల్‌ను తేలికగా తీసుకుని డీప్‌లో ఉన్న దూబేకు దొరికిపోయి వికెట్ సమర్పించుకున్నాడు. ఒకరకంగా చెప్పాలంటే ధోనికి కౌంటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇగోకు పోయి బొక్కబోర్లా పడ్డాడు. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘స్ట్రెయిట్ షాట్లు ఆడటమే పొలార్డ్ బలం. అందుకే అక్కడ వాళ్లు(సీఎస్కే) ఫీల్డర్‌ను పెట్టారు. కాబట్టి పొలార్డ్ కాస్త ఆచితూచి ఆడాల్సింది. కానీ అతడు అప్పుడు కూడా స్ట్రెయిట్ షాట్ ఆడేందుకే మొగ్గు చూపాడు. మూల్యం చెల్లించాడు. మంచి ఇన్నింగ్స్ ఆడుతూ.. మ్యాచ్‌లు గెలిపిస్తూ కీలక ప్లేయర్‌గా అవతరించిన తర్వాత.. ‘‘మీరు నాకోసం వల పన్నారు కదా! చూడండి నా బలమేమిటో చూపిస్తా’’ అన్నట్లుగా పొలార్డ్ వ్యవహరించాడు. ఫలితంగా వికెట్ సమర్పించుకున్నాడు’’ అని పేర్కొన్నాడు. 12 ఏళ్ల క్రితం ఇదే తరహాలో ఐపీఎల్-2010 ఫైనల్లో సీఎస్కేతో మ్యాచ్‌లో పొలార్డ్ అవుటైన సంగతి తెలిసిందే. ఆల్బీ మోర్కెల్‌కు బంతిని ఇచ్చిన ధోని మిడాఫ్‌లో మాథ్యూ హెడెన్ ఫీల్డర్‌గా పెట్టగా.. పొలార్డ్ అతడికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్‌లో ముంబైపై 22 పరుగుల తేడాతో గెలుపొందిన ధోని సేన టైటిల్ ఎగురేసుకుపోయింది. చదవండి👉🏾: MS Dhoni IPL Record: ఐపీఎల్లో ధోని అరుదైన రికార్డు.. రైనా, డివిల్లియర్స్‌ను వెనక్కి నెట్టి.. Nobody finishes cricket matches like him and yet again MS Dhoni 28* (13) shows why he is the best finisher. A four off the final ball to take @ChennaiIPL home. What a finish! #TATAIPL #MIvCSK pic.twitter.com/oAFOOi5uyJ — IndianPremierLeague (@IPL) April 21, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } });