ఇర్ఫాన్‌ కొత్త లుక్.. మంచులో ‘కోబ్రా’ షూటిం‍గ్‌‌ | Irfan Pathan Shares Cobra Movie Shooting Pic At Moscow Russia | Sakshi
Sakshi News home page

ఇర్ఫాన్‌ కొత్త లుక్.. మంచులో ‘కోబ్రా’ షూటిం‍గ్‌‌

Published Sat, Feb 27 2021 3:53 PM | Last Updated on Sat, Feb 27 2021 4:03 PM

Irfan Pathan Shares Cobra Movie Shooting Pic At Moscow Russia - Sakshi

చియాన్‌ విక్రమ్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘కోబ్రా’. ఈ చిత్రానికి సంబంధించిన విదేశీ షెడ్యూల్‌ చిత్రీకరణలో మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్ పాల్గొన్నారు. ఇర్ఫాన్‌ ‘కోబ్రా’ చిత్రంలో అస్లాన్ యిల్మాజ్ అనే ఇంటర్‌పోల్‌ ఆఫీసర్‌ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ఫారిన్‌ షూటింగ్‌ ప్రస్తుతం రష్యా రాజధాని మాస్కోలో జరుగుతోంది. దీనికి సంబంధించిన ఓ ఫోటోను ఇర్ఫాన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు.

‘షూటింగ్‌లో ఓ అందమైన ప్రాంతం’అని ఆయన కామెంట్‌ జతచేశారు. చిత్రం బృందం మంచులో చిత్రీకరణ జరుపుతుండగా ఇర్ఫాన్ వింటర్‌ దుస్తుల్లో నిలబడి కనిపిస్తున్నారు. అజయ్ జ్ఞానముతు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శ్రీనిధి శెట్టి, మియా జార్జ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తూ షూటింగ్‌లో పాల్గొనవచ్చని ప్రభుత్వం అనుతించడంతో వారం రోజుల కిత్రం ‘కోబ్రా’ టీం రష్యాలో పయనమైంది. మూవీకి సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌కు ఇది తొలి చిత్రం కావటం విశేషం.
 

చదవండి: సోనూసూద్‌ మరో మంచి కార్యక్రమం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement