శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఆటగాడు శ్రేయస్ అయ్యర్ చెలరేగి ఆడిన సంగతి తెలిసిందే. కేవలం 28 బంతుల్లో 57 పరుగులు చేసి భారత్ భారీ స్కోర్ సాధించడంలో అయ్యర్ కీలక పాత్ర పోషించాడు. కాగా ఈ సిరీస్‌కు దూరమైన విరాట్ కోహ్లి స్ధానంలో అయ్యర్ బ్యాటింగ్‌కు వచ్చాడు. ఈ నేపథ్యంలో అయ్యర్‌పై టీమిండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. 'అయ్యర్‌కు ఏ స్ధానంలోనైనా ఆడగలిగే సత్తా ఉంది.
అతడు ఫామ్‌లో ఉన్నప్పడు.. ఆటను చూసి ఏంజాయ్ చేయవచ్చు. అతడు క్రీజులో ఒకే చోట ఉండడు.. అయినప్పటికీ బ్యాలెన్స్ చేస్తూ ఆడడం అయ్యర్‌కే సొంతం. ఈ మ్యాచ్‌లో అయ్యర్ బంతిని చూడకుండా కొట్టిన సిక్స్ నాకు ఎంతగానో నచ్చింది. అతడు చమీరా, కరుణరత్నే బౌలింగ్‌లో స్లో డెలివరీలకు కొట్టిన సిక్స్‌లు కూడా అద్భుతమైనవి. అయ్యర్ తనపై వస్తున్న విమర్శలకు బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు' అని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు. కాగా ఇప్పటి వరకు 34 టీ20 మ్యాచ్‌లు ఆడిన అయ్యర్.. 662 పరుగులు సాధించాడు. ఇక భారత్-శ్రీలంక మధ్య రెండో టీ20 ధర్మశాల వేదికగా శనివారం జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment