
బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరగుతోన్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 252 పరుగులకు ఆలౌటైంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఆదిలోనే ఓపెనర్లు వికెట్లు కోల్పోయింది. మయాంక్ అగర్వాల్(4),రోహిత్(15) పరుగులు మాత్రమే చేశారు. అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లి కూడా నిరాశపరిచాడు. కష్టపరిస్ధితుల్లో పడిన జట్టును శ్రేయస్ అయ్యర్ అదుకున్నాడు. అయ్యర్ 92 పరుగులతో ఒంటరి పోరాటం చేయండంతో టీమిండియా గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది.
ఇది ఇలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో అయ్యర్ తన అర్ధ సెంచరీను భారీ సిక్సర్‌తో పూర్తి చేశాడు. ఆట మొదటి రోజు స్పిన్నర్లపై అయ్యర్ విరుచుకుపడ్డాడు. అయితే ఇన్నింగ్స్ 48 ఓవర్‌లో ధనంజయ డి సిల్వా వేసిన అఖరి బంతికి శ్రేయస్ అయ్యర్ భారీ షాట్ ఆడగా.. బంతి స్టేడియం బయటకు వెళ్లి పడింది. ఈ సిక్సర్‌తోనే అయ్యర్ తన అర్దసెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అయ్యర్ సిక్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: Ind Vs SL 2nd Test: అయ్యో మా గుండె పగిలింది కోహ్లి! నా పరిస్థితీ అదే ఇక్కడ .. ఏం చెప్పను!
— Diving Slip (@SlipDiving) March 12, 2022