IND Vs NZ 1st ODI: Rohit Sharma Led Team India Reached Hyderabad, Videos And Pics Viral - Sakshi
Sakshi News home page

IND vs NZ: హైదరాబాద్‌ చేరుకున్న భారత జట్టు.. ఫోటోలు వైరల్‌

Published Tue, Jan 17 2023 7:35 AM | Last Updated on Tue, Jan 17 2023 9:51 AM

IND vs NZ: Rohit Sharma led India Reached Hyderabad - Sakshi

శ్రీలంకతో వన్డే సిరీస్‌ను ఘనంగా ముగించిన టీమిండియా.. ఇప్పుడు మరో కీలకపోరుకు సిద్దమైంది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు వన్డేలు, మూడు టీ20ల్లో భారత్‌ తలపడనుంది. తొలుత వన్డే సిరీస్‌ జరగనుంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి వన్డే హైదరాబాద్‌లోని ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియం వేదికగా జనవరి18(బుధవారం)న జరగనుంది. ఈ క్రమంలో భారత జట్టు సోమవారం హైదరాబాద్‌ చేరుకుంది.

హైదరాబాద్‌లో అడుగుపెట్టిన భారత జట్టుకు ఘన స్వాగతం లభించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.ఇక రోహిత్‌ సేన మంగళవారం మధ్యాహ్నం తమ తొలి ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గోనుంది. ఇక ఇప్పటికే బాగ్యనగరానికి చేరుకున్న ప్రత్యర్ధి న్యూజిలాండ్‌ జట్టు ప్రా‍క్టీస్‌లో మునిగితేలుతుంది. కాగా ఈ సిరీస్‌కు కివీస్‌ రెగ్యూలర్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ దూరమయ్యాడు.



భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుభమన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కెఎస్ భరత్ (వికెట్ కీపర్‌), హార్దిక్ పాండ్యా (వైస్‌ కెప్టెన్‌), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ చాహల్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్

న్యూజిలాండ్ వన్డే జట్టు: టామ్ లాథమ్ (కెప్టెన్‌), ఫిన్ అలెన్, మైకేల్ బ్రేస్‌వెల్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, హెన్రీ సో షిప్లీ
చదవండి
IND vs SL: తీవ్రంగా గాయపడిన శ్రీలంక ఆటగాళ్లు.. స్ట్రెచర్‌పై మైదానం బయటకు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement