uppal cricket stadium
-
HCA: రూ. కోటికి పైగా బిల్లు చెల్లింపు.. వివాదానికి ముగింపు
సాక్షి, హైదరాబాద్: పదేళ్లుగా తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీఎస్ఎస్పీడీసీఎల్)తో నడుస్తున్న విద్యుత్ వివాదానికి హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ముగింపు పలికింది. హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు, కార్యదర్శి దేవ్‌రాజ్ నేతృత్వంలోని కార్యవర్గం ఇందుకు శుభం కార్డు వేసింది. ఈ క్రమంలో 2015లో మొదలైన ఈ విద్యుత్ జగడానికి తాము స్వస్తి పలికినట్లు జగన్మోహన్ రావు వెల్లడించారు. సుమారు రూ. ఒక కోటీ 64 లక్షల విద్యుత్ బిల్లు బకాయిగా ఉండగా, ఐపీఎల్ సమయంలో తొలుత రూ.15 లక్షలు చెల్లించామని ఆయన చెప్పారు. మిగిలిన మొత్తం 45 వాయిదాల్లో చెల్లించాలని అనుకున్నామన్నారు. అయితే హెచ్‌సీఏ పేరు ప్రతిష్టలను దృష్టిలో పెట్టుకుని ఒకేసారి అంతా చెల్లించామని ఆయన వివరించారు.ఈ మేరకు మంగళవారం టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషా రఫ్ అలీ ఫరూఖీకి జగన్మోహన్ రావు రూ.1 కోటి 48 లక్షల 94 వేల 521ల మొత్తాన్ని చెక్ రూపంలో అందించారు. విద్యుత్ బిల్లు పెండింగ్‌లో ఉందనే కారణంతో ఐపీఎల్ సందర్భంగా క్రికెటర్లు ప్రాక్టీసు చేస్తుండగా కరెంట్ తీసేసి, హైదరాబాద్, తెలంగాణ ఇమేజ్ను దెబ్బతీసే విధంగా ప్రవర్తించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫరూఖీని జగన్ ఈ సందర్భంగా కోరారు.చదవండి: ఇంటర్వ్యూకు హాజరైన గంభీర్ -
SRH Vs LSG Photos: హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్..ఉప్పల్ ఊగేలా తారల సందడి (ఫొటోలు)
-
SRH Vs RCB: ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా మెట్రో అదనపు సర్వీసులు
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 25న జరుగనున్న ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా మెట్రో అదనపు సరీ్వసులు నడపనున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎనీ్వఎస్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నగరంలోని మూడు కారిడార్లలో ఆఖరి మెట్రో సరీ్వసులు గురువారం రాత్రి 12.15 గంటలకు బయలుదేరి తెల్లవారుజామున 1.10 గంటలకు గమ్యస్థానాలకు చేరుకుంటాయి. ఉప్పల్, స్టేడియం, ఎన్జీఆర్ఐ స్టేషన్లలో మాత్రం ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు తెరిచి ఉంచుతారు. మిగతా స్టేషన్లలో కేవలం ని్రష్కమణ ద్వారాలు మాత్రమే తెరిచి ఉంటాయి. 60 అదనపు బస్సులు.... ఐపీఎల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చే క్రికెట్ అభిమానుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి గురువారం ఉప్పల్ స్టేడియం వరకు 60 బస్సులను అదనంగా నడుపనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు.అర్ధరాత్రి వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు సరీ్వసులను ఏర్పాటు చేయనున్నారు. -
Kavya Maran Photos: సన్‌రైజర్స్ గెలుపు.. ఆనందంతో గంతులేసిన కావ్య పాప (ఫొటోలు)
-
7 వికెట్లతో చెలరేగిన ఇంగ్లండ్ స్పిన్నర్.. తొలి టెస్టులో భారత్ ఓటమి
ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను టీమిండియా ఓటమితో ఆరంభించింది. హైదరాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో 28 పరుగుల తేడాతో బారత్ ఓటమి పాలైంది. 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 202 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ అరంగేట్ర స్పిన్నర్ టామ్ హార్ట్లీ 7 వికెట్లు పడగొట్టి టీమిండియా పతనాన్ని శాసించాడు. భారత బ్యాటర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ(39) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కాగా లక్ష్య ఛేదనలో 119 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో రవిచంద్రన్ అశ్విన్, శ్రీకర్ భరత్ నిలకడగా ఆడుతూ భారత విజయంపై ఆశలు రెకెత్తించారు. ఎనిమిదో వికెట్‌కు 54 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే టామ్ హార్ట్లీ భరత్‌ను ఔట్ చేయడంతో మళ్లీ మ్యాచ్ ఇంగ్లండ్ వైపు మలుపు తిరిగింది. వెంటనే అశ్విన్ కూడా భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. అనంతరం సిరాజ్, బుమ్రా కాసేపు పోరాడనప్పటికీ ఓటమి నుంచి గట్టుఎక్కించ లేకపోయారు. భారత బ్యాటర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ(39) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఓవర్‌నైట్ స్కోర్ 316/6తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ అదనంగా 104 పరుగుల జోడించింది. రెండో ఇన్నింగ్స్‌లో 420 పరుగులకు ఇంగ్లీష్ జట్టు ఆలౌటైంది. దీంతో భారత్ ముందు 230 పరుగుల లక్ష్యాన్ని ఉంచగల్గింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో ఓలీ పోప్(196) అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. కాగా అంతకముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 436 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో రవీంద్ర జడేజా(87), రాహుల్(86), జైశ్వాల్(80) పరుగులతో రాణించారు. అదే విధంగా ఇంగ్లండ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 246 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ఫిబ్రవరి 2 నుంచి విశాఖపట్నం వేదికగా జరగనుంది. చదవండి: #Shubman Gill: నీవు మరి మారవా గిల్..? ఇంకా ఎన్ని ఛాన్స్‌లు! అతడిని తీసుకోండి? -
అక్కడ ఉన్నది జడ్డూ.. అలా వదిలేస్తే ఎలా? పాపం జానీ! వీడియో
హైదరాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అదరగొడుతున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచిన జడ్డూ.. రెండో ఇన్నింగ్స్‌లో సైతం తన స్పిన్ మయాజాలాన్ని ప్రదర్శించాడు. ఇంగ్లండ్ బ్యాటర్ జానీ బెయిర్ స్టోను సంచలన బంతితో జడేజా బోల్తా కొట్టించాడు. ఇంగ్లండ్ సెకెండ్ ఇన్నింగ్స్ 28 ఓవర్లో జడేజా.. బెయిర్ స్టోకు అద్బుతమైన డెలివరీని సంధించాడు. జడ్డూ వేసిన బంతిని బెయిర్ స్టో వెనుక్కి వదిలేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే మిడిల్లో పడిన బంతి మాత్రం అనూహ్యంగా టర్న్ అయ్యి ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది. దీంతో బెయిర్ స్టో షాక్‌కు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో జడ్డూ 87 పరుగులతో పాటు మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై టీమిండియా అధిపత్యం చెలాయిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 436 పరుగులకు ఆలౌటైంది. భారత్‌కు మొదటి ఇన్నింగ్స్‌లో 190 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇంగ్లండ్ 61 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 245 పరుగులు చేసింది. pic.twitter.com/PbWQuJr9Jc — Sitaraman (@Sitaraman112971) January 27, 2024 -
చరిత్ర సృష్టించిన జో రూట్.. సచిన్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు
ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ అరుదైన ఘనత సాధించాడు. భారత్ వర్సెస్ ఇంగ్లండ్ టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రూట్ నిలిచాడు. హైదరాబాద్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో 10 పరుగుల వక్యిగత స్కోర్ రూట్ ఈ ఘనతను అందుకున్నాడు. రూట్ ఇప్పటివరకు 45 ఇన్నింగ్స్‌లలో 2555 పరుగులు చేశాడు. ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును రూట్ బ్రేక్ చేశాడు. భారత్-ఇంగ్లండ్ టెస్టుల్లో సచిన్ 53 ఇన్నింగ్స్‌లలో 2535 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో సచిన్ ఆల్ టైమ్ రికార్డు బద్దలైంది. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి(1991) ఐదో స్ధానంలో ఉన్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో మొదటి రోజు లంచ్ విరామానికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. క్రీజులో జో రూట్(18), జానీ బెయిర్ స్టో(32) పరుగులతో ఉన్నారు. భారత బౌలర్లలో అశ్విన్ రెండు, జడేజా ఒక్క వికెట్ సాధించారు. చదవండి: IND vs ENG: రోహిత్ శర్మ కళ్లు చెదిరే క్యాచ్.. ఇంగ్లండ్ బ్యాటర్ మైండ్ బ్లాంక్ ! వీడియో -
భారత్-ఇంగ్లండ్ మ్యాచ్‌కు సర్వం సిద్దం..ఇరు జట్ల ప్రాక్టీస్
భాగ్యనగరం వాకిట్లో క్రికెట్ పండుగ వచ్చేసింది. అభిమానులందరికీ ప్రపంచ క్రికెట్లోని అగ్రశ్రేణి ఆటగాళ్లు తమ ఆటతీరుతో కనువిందు చేయడానికి ‘సై’ అంటున్నారు. గురువారం నుంచి ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్లు టెస్టు సమరానికి సిద్ధమయ్యాయి. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు ఈనెల 25 నుంచి 29 వరకు హైదరాబాద్‌లో జరగనుండగా..రెండో టెస్టుకు ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు విశాఖపట్నం ఆతిథ్యమివ్వనుంది. ఉప్పల్ స్టేడియంలో భారత జట్టు ఇప్పటి వరకు ఆరు టెస్టులు ఆడింది. ఇందులో నాలుగు టెస్టుల్లో గెలుపొంది, ఒక టెస్టును ‘డ్రా’ చేసుకుంది. ఈ మైదానంలో భారత జట్టు తమ అజేయ రికార్డును కొనసాగించాలని మరో విజయాన్ని తమ ఖాతాలో జమ చేసుకోవాలని ఆశిద్దాం. కోహ్లి లేడు.. వ్యక్తిగత కారణాలరీత్యా భారత స్టార్ విరాట్ కోహ్లి తొలి రెండు టెస్టులకు దూరం కావడం తెలుగు క్రికెట్ అభిమానులకు కాస్త నిరాశ కలిగించే అంశం. అయితే రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ బ్యాట్‌తో... జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్ వాడివేడి పేస్‌తో..అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ తమ స్పిన్ మాయాజాలంతో అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇటీవల కాలంలో టెస్టుల్లోనూ టి20 తరహా దూకుడైన ఆటతో అదరగొడుతున్న ఇంగ్లండ్ జట్టు భారత గడ్డపై అదే జోరు కొనసాగిస్తుందో లేదో వేచి చూడాలి. ఇంగ్లండ్ బృందంలో బెన్ స్టోక్స్, జో రూట్, బెయిర్‌స్టో, ఒలీ పాప్, జేమ్స్ అండర్సన్, మార్క్ వుడ్ ప్రధాన ఆకర్షణగా నిలువనున్నారు. లోకల్ స్టార్ సిరాజ్ రె‘ఢీ’.. ఇప్పటికే భారత్, ఇంగ్లండ్ జట్లు హైదరాబాద్‌కు చేరుకున్నాయి. మంగళవారం రెండు జట్లు ముమ్మరంగా సాధన చేశాయి. ‘లోకల్ స్టార్’ మొహమ్మద్ సిరాజ్ సొంత మైదానంలో తొలి టెస్టు ఆడటం ఖాయమైంది. ఇప్పటి వరకు సిరాజ్ 23 టెస్టులు ఆడాడు. ఇందులో 6 టెస్టులు (చెన్నై, అహ్మదాబాద్, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, ఇండోర్) భారత గడ్డపై, మిగతా 17 టెస్టులు విదేశాల్లో ఆడాడు. వ్యూహ రచనలో జడేజా, అశ్విన్.. టీమిండియా స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ల భరతం పట్టేందుకు సిద్దంగా ఉన్నారు. ఉప్పల్ పిచ్ స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో వీరిద్దరు వ్యూహరచనల్లో నిమగ్నమై ఉన్నారు. ఇంగ్లండ్‌ను రెండు ఇన్నింగ్స్‌ల్లో మడతపట్టేందుకు వీరిద్దరూ కఠోరంగా సాధన చేస్తున్నారు. ఇంగ్లండ్ ఆటగాళ్లు సైతం.. భారత్‌ను స్వదేశంలో ఓడించాలంటే ఎంత కష్టమో ఇంగ్లండ్ ఆటగాళ్లు బాగా తెలుసు. అందుకే వారు మూడు రోజుల ముందుగానే తొలి టెస్ట్ వేదిక అయిన హైదరాబాద్‌కు చేరుకుని కఠోరంగా సాధన చేస్తున్నారు. అనుభవమే ఆయుధంగా.. భారత్‌పై ఆడిన అనుభవం ఎక్కువగా ఉన్న వెటరన్ పేసర్ ఆండర్సన్ అందరికంటే ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ చెమటోడుస్తున్నాడు. ఈ సిరీస్‌లో టీమిండియాను ఇబ్బంది పెట్టే బౌలర్ ఎవరైనా ఉన్నారా అంటే అది ఆండర్సనే అని చెప్పాలి. అతని అనుభవం ముందు టీమిండియా బ్యాటర్లు నిలబడతారో లేక ఆండర్సన్ కెరీర్‌కు చేదు అనుభవంతో ముగింపు పలుకుతారో వేచి చూడాలి. నాడు ప్లేయర్‌గా... నేడు కోచ్‌గా.. 2010లో ఉప్పల్ స్టేడియంలోనే భారత్‌తో జరిగిన టెస్టులో న్యూజిలాండ్ జట్టు తరఫున ‘డబుల్ సెంచరీ’ సాధించిన బ్రెండన్ మెకల్లమ్ ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టుకు హెడ్ కోచ్‌గా మళ్లీ హైదరాబాద్‌కు రావడం విశేషం. -
WC 2023: చార్మినార్ ముంగిట వన్డే వరల్డ్‌కప్..
ICC ODI World Cup 2023: ప్రపంచకప్ ట్రోఫీ గెలవడం ప్రతీ క్రికెటర్ కల.. కెరీర్లో ఎన్నో అద్భుత రికార్డులు, అరుదైన ఘనతలు సాధించినా.. కనీసం ఒక్క వరల్డ్‌కప్ టైటిల్ ఉండాలని ఆరాటపడుతూ ఉంటారు ఆటగాళ్లు.. ఆ కప్పును అందుకోగానే ప్రపంచాన్ని జయించిన ఫీలింగ్.. మరి అభిమానులకు నేరుగా మ్యాచ్‌లు వీక్షించడం కంటే సంతోషం మరొకటి ఉండదు.. ముఖ్యంగా ఫైనల్లో ట్రోఫీ ప్రదానోత్సవం ఫ్యాన్స్‌కు కన్నుల పండుగే అనడంలో సందేహం లేదు.. ఆటగాళ్ల భావోద్వేగాలకు ఒక్కోసారి వీరాభిమానుల కళ్లు కూడా చెమర్చుతాయి.. భాగ్యనగరానికి వచ్చేసిన ట్రోఫీ ఆ కప్పును తామే అందుకున్నంత సంబరం కూడా! మరి ఆ ట్రోఫీని కళ్లారా.. అది కూడా అతి దగ్గరగా చూసే అవకాశం వస్తే.. ఎగిరి గంతేయడం ఖాయం కదా! హైదరాబాద్ వాసులకు ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చింది.. అంతరిక్షం మొదలు.. ప్రపంచ దేశాలను చుట్టి వస్తున్న వన్డే వరల్డ్‌కప్ ట్రోఫీ ఇప్పుడు భాగ్యనగరానికి చేరుకుంది. చార్మినార్ ముంగిట వన్డే వరల్డ్‌కప్ వందల ఏళ్ల చరిత్ర ఉన్న చార్మినార్ ముందు గురువారం ఈ ట్రోఫీని ప్రదర్శించారు. దీంతో ఎప్పుడోగానీ లభించే ఈ సువర్ణావకాశాన్ని ఒడిసిపట్టుకునేందుకు సందర్శకులు అక్కడికి చేరుకోకుండా ఉంటారా?! కాగా అక్టోబరు 5 నుంచి భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్-2023 ఈవెంట్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ట్రోఫీ టూర్ ఇక్కడే మొదలై.. ఇప్పుడిలా.. జూన్ 27న ఇండియాలో వరల్డ్‌కప్ ట్రోఫీ టూర్ ఆరంభం కాగా.. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, పపువా న్యూగినియా, ఇండియా, యూఎస్ఏ, వెస్టిండీస్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, కువైట్, బహ్రెయిన్, ఇండియా, ఇటలీ, ఫ్రాన్స్, ఇంగ్లండ్, మలేషియా, ఉగాండా, నైజీరియా, సౌతాఫ్రికా.. మళ్లీ ఇప్పుడు.. సెప్టెంబరు 4న ఇండియాకు చేరుకుంది. తాజాగా హైదరాబాద్‌కు వచ్చేసింది. చార్మినార్‌తో పాటు ఉప్పల్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలోనూ ట్రోఫీని ప్రదర్శనకు ఉంచనున్నారు. వరల్డ్‌కప్ టోర్నీలో భాగంగా అక్టోబరులో ఉప్పల్‌లో మూడు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇక.. అంతకు ముందు తాజ్‌మహల్ ముంగిట కూడా ట్రోఫీని ప్రదర్శించిన విషయం తెలిసిందే. చదవండి: టీమిండియాతో తొలి వన్డేకు ముందు ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బలు #icc #CricketWorldCupTrophy put on display at #charminar #Hyderabad @cricketworldcup @ICC @arvindkumar_ias @BCCI @HiHyderabad @swachhhyd @KTRBRS @ntdailyonline pic.twitter.com/zXbODLgCuD — ℙ𝕖𝕠𝕡𝕝𝕖 𝕠𝕗 ℍ𝕪𝕕𝕖𝕣𝕒𝕓𝕒𝕕 (@PeopleHyderabad) September 21, 2023 -
హెచ్‌సీఏకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వార్నింగ్
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)కు క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వార్నింగ్ ఇవ్వడం ఆసక్తి కలిగించింది. హెచ్‌సీఏలో అవినీతి పెరిగిపోయిందని.. సెలక్షన్లలో అవకతవకలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్‌సీఏ తీరును ప్రభుత్వం గమనిస్తుందని త్వరలోనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ''ఉప్పల్ స్టేడియంకు సంబంధించిన లీజ్ త్వరలో ముగిసిపోతుంది. ఉప్పల్ స్టేడియం లీజ్‌పై ప్రభుత్వం పునరాలోచనలో ఉంది. హెచ్‌సీఏ అవినీతిని దృష్టిలో పెట్టుకొని ఉప్పల్ స్టేడియాన్ని స్పోర్ట్స్ అథారిటీకి అప్పగించే యోచనలో ఉన్నాం.'' అని వెల్లడించారు. చదవండి: చీఫ్ సెలెక్టర్ పదవికి ఆహ్వానాలు.. ముందు వరుసలో సెహ్వాగ్! -
ఉప్పల్‌లో మ్యాచ్ అంటే చెలరేగుతాడు.. కోహ్లి అరుదైన రికార్డు
ఐపీఎల్ 16వ సీజన్లో ఆర్సీబీ స్టార్.. కింగ్ కోహ్లి తన సూపర్ ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. తాజాగా హైదరాబాద్ వేదికగా ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో కోహ్లి సూపర్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ఇక ఉప్పల్‌లో మ్యాచ్ అంటే చాలు కోహ్లి చెలరేగిపోతాడు. అంతర్జాతీయ మ్యాచ్ నుంచి ఐపీఎల్ దాకా కోహ్లికి ఉప్పల్ స్టేడియంలో మంచి రికార్డు ఉంది. కోహ్లి ఉప్పల్‌లో ఇప్పటివరకు 12 టి 20 మ్యాచ్‌లు(అంతర్జాతీయ, ఐపీఎల్) ఆడి 592 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తాజాగా ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో దానిని కంటిన్యూ చేశాడు.కచ్చితంగా గెలవ్సాలిన మ్యాచ్‌లో జూలు విదిల్చిన కోహ్లి 61 బంతుల్లో సెంచరీ సాధించడం విశేషం. కోహ్లికి ఇది ఐపీఎల్లో ఆరో శతకం కాగా.. సీజన్లో ఆర్సీబీకి ఇది తొలి శతకం. దీంతో పాటు ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో ఆర్సీబీ మరిన్ని రికార్డులు కొల్లగొట్టింది. అవేంటో ఒకసారి చూద్దాం. ఈ క్రమంలో కోహ్లి ఐపీఎల్ 16వ సీజన్లో 500 పరుగుల మార్క్‌ను పూర్తి చేశాడు. ఐపీఎల్ చరిత్రలో కోహ్లి 500 ప్లస్ స్కోర్లు చేయడం ఇది ఆరోసారి. టీమిండియా తరపున ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్‌గా కోహ్లి రికార్డులకెక్కాడు. ఆర్సీబీ తరపున కోహ్లి 7500 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్, ఛాంపియన్స్ లీగ్ కలిపి కోహ్లి ఈ మార్క్ సాధించాడు. ఆర్సీబీ తరపున ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా నిలిచాడు. ఇక కోహ్లి-డుప్లెసిస్ ద్వయం ఆర్సీబీ తరపున వంద పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడం ఇది నాలుగోసారి. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక 100 ప్లస్ భాగస్వామ్యాలు నమోదు చేసిన జాబితాలో డేవిడ్ వార్నర్-శిఖర్ ధావన్ జోడి(ఎస్ఆర్హెచ్, ఆరుసార్లు) తొలి స్థానంలో ఉండగా.. డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో(ఎస్ఆర్హెచ్, ఐదుసార్లు) రెండో స్థానంలో ఉన్నారు. ఇక మయాంక్ అగర్వాల్- కేఎల్ రాహుల్ జోడి(పంజాబ్ కింగ్స్), క్రిస్ గేల్, విరాట్ కోహ్లి జోడి(ఆర్సీబీ), కోహ్లి-డుప్లెసిస్(ఆర్సీబీ) నాలుగేసి సార్లు వంద ప్లస్ పరుగుల భాగస్వామ్యాలను నమోదు చేశారు. ఇక ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్లో ఒక జోడి 800 ప్లస్ పరుగులు జోడించడం ఇది రెండోసారి మాత్రమే. కోహ్లి-డుప్లెసిస్ జోడి ఈ సీజన్లో 800 పరుగులు జోడించారు. ఇంతకముందు 2016లో కోహ్లి-డివిలియర్స్ జోడి 800 పరుగులకు పైగా జోడించారు. ఈ రెండు సందర్భాల్లోనూ ఆర్సీబీ, కోహ్లి కామన్‌గా ఉండడం విశేషం. 💯 Bow down to the greatness of 👑 #ViratKohli 👏 He is now tied with Chris Gayle for the most #TATAIPL hundreds 🔥#SRHvRCB #IPLonJioCinema #IPL2023 #EveryGameMatters pic.twitter.com/OGxWztuhk6 — JioCinema (@JioCinema) May 18, 2023 చదవండి: నాలుగేళ్ల నిరీక్షణకు తెర.. సెంచరీతో మెరిసిన 'కింగ్' కోహ్లి -
ఉప్పల్‌లో మ్యాచ్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం (ఫొటోలు)
-
ఉప్పల్‌లో మ్యాచ్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం (ఫొటోలు)
-
ఉప్పల్‌లో మ్యాచ్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ముంబయి విజయం (ఫొటోలు)
-
ఉప్పల్‌లో మ్యాచ్.. పంజాబ్ కింగ్స్‌పై సన్‌రైజర్స్ గెలుపు (ఫొటోలు)
-
IPL 2023: ఉప్పల్ స్టేడియం వద్ద ఫ్యాన్స్ సందడి (ఫొటోలు)
-
న్యూజిలాండ్‌తో తొలి వన్డే... కుల్దీప్కు చోటు! చాహల్‌కు నో చాన్స్
హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో భారత్ తలపడేందుకు సిద్దమైంది. ఈ కీలక పోరు బుధవారం మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ క్రమంలో కివీస్‌తో తొలి వన్డేలో తలపడే టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌ను భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అంచనా వేశాడు. తను అంచనా వేసిన జట్టులో ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్‌కు అవకాశం ఇచ్చాడు. వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో విరాట్ కోహ్లి, ఇషాన్ కిషన్‌ను జాఫర్ ఎంపిక చేశాడు. అదే విధంగా ఐదో స్థానంలో విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్‌కు చోటు దక్కింది. ఇక ఆలౌరౌండర్ల కోటాలో హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్‌ను అతడు ఎంపికచేశాడు. ఇక ఈ జట్టులో స్పెషలిస్టు స్పిన్నర్‌గా చాహల్‌ను కాదని కుల్దీప్ యాదవ్‌కు అతడు చోటిచ్చాడు. ఫాస్ట్ బౌలర్ల విభాగంలో సిరాజ్, మహ్మద్ షమీ, ఉమ్రాన్ మాలిక్ స్థానం దక్కించుకున్నారు. తొలి వన్డేకు వసీం జాఫర్ అంచనా వేసిన భారత తుది జట్టు: రోహిత్ శర్మ, శుబ్మాన్ గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, ఉమ్రాన్ మాలిక్, మహ్మద్ సిరాజ్ చదవండి: IND Vs NZ: న్యూజిలాండ్‌తో తొలి పోరు.. భారత్ జోరు కొనసాగేనా? -
IND vs NZ: హైదరాబాద్ చేరుకున్న భారత జట్టు.. ఫోటోలు వైరల్
శ్రీలంకతో వన్డే సిరీస్‌ను ఘనంగా ముగించిన టీమిండియా.. ఇప్పుడు మరో కీలకపోరుకు సిద్దమైంది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు వన్డేలు, మూడు టీ20ల్లో భారత్ తలపడనుంది. తొలుత వన్డే సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి వన్డే హైదరాబాద్‌లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియం వేదికగా జనవరి18(బుధవారం)న జరగనుంది. ఈ క్రమంలో భారత జట్టు సోమవారం హైదరాబాద్ చేరుకుంది. హైదరాబాద్‌లో అడుగుపెట్టిన భారత జట్టుకు ఘన స్వాగతం లభించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఇక రోహిత్ సేన మంగళవారం మధ్యాహ్నం తమ తొలి ప్రాక్టీస్ సెషన్లో పాల్గోనుంది. ఇక ఇప్పటికే బాగ్యనగరానికి చేరుకున్న ప్రత్యర్ధి న్యూజిలాండ్ జట్టు ప్రాక్టీస్‌లో మునిగితేలుతుంది. కాగా ఈ సిరీస్‌కు కివీస్ రెగ్యూలర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ దూరమయ్యాడు. భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కెఎస్ భరత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ చాహల్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ న్యూజిలాండ్ వన్డే జట్టు: టామ్ లాథమ్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైకేల్ బ్రేస్‌వెల్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, ఆడమ్ మిల్నే, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, హెన్రీ సో షిప్లీ చదవండి: IND vs SL: తీవ్రంగా గాయపడిన శ్రీలంక ఆటగాళ్లు.. స్ట్రెచర్‌పై మైదానం బయటకు! Virat Kohli Has Arrived In Hyderabad Ahead Of The ODI Series Against NZ.#ViratKohli #INDvNZ @imVkohli pic.twitter.com/RXZuQrbuCu — virat_kohli_18_club (@KohliSensation) January 16, 2023 -
హైదరాబాద్‌లో భారత్- న్యూజిలాండ్ తొలి వన్డే.. ఆన్లైన్లో టికెట్స్
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జనవరి18న భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తొలి వన్డేకు సంబంధించిన టికెట్లను పేటీఎంలో అందుబాటులో ఉంచినట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) తెలిపింది. ఓవరాల్‌గా 29 వేల టికెట్స్‌ను ఆన్లైన్లో విక్రయించనున్నట్లు హెచ్‌సీఏ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే తొలి రోజు (జనవరి13) కేవలం 6వేల టికెట్స్‌ను మాత్రమే హెచ్సీఎ అందుబాటులో ఉంచింది. ఈ నెల 16 వరకు ఆన్లైన్లో టికెట్స్‌ను బుక్ చేసుకోవచ్చు. ఇక ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్న వారు క్యూ ఆర్ కోడ్ చూపించి ఎల్బీ, గచ్చిబౌలి స్టేడియాల్లో ఫిజికల్ టికెట్లు తీసుకోవాలని హెచ్‌సీఏ అధికారులు తెలిపారు. కాగా ఫిజికల్ టికెట్లు జనవరి 15 నుంచి 18 వరకు పొందవచ్చు. కాగా గతేడాది జింఖానా గ్రౌండ్లో టికెట్లు కోసం జరిగిన తొక్కిసలాట ను దృష్టిలో పెట్టుకున్న హెచ్సీఎ ఈసారి మొత్తం టికెట్లను ఆన్లైన్లోనే విక్రయించనుంది. చదవండి: మహిళా క్రికెటర్ అనుమానస్పద మృతి.. అడవిలో మృతదేహం! -
పాకిస్తాన్ రికార్డు బద్దలు కొట్టిన భారత్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
హైదరాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా అద్భుతమైన విజయం సాధించింది. 2022 ఏడాదిలో భారత్‌కు ఇది 21 టీ20 విజయం. తద్వారా టీ20 క్రికెట్లో టీమిండియా ఓ అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. ఒకే క్యాలెండర్ ఈయర్‌లో టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా భారత్ నిలిచింది. అంతకు ముందు ఈ రికార్డు పాకిస్తాన్ పేరిట ఉండేది. 2021 ఏడాదిలో పాకిస్తాన్ 20 టీ20ల్లో విజయం సాధించింది. తాజా విజయంతో పాక్ రికార్డును భారత్ బ్రేక్ చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటర్లలో గ్రీన్(21 బంతుల్లో52 పరుగులు), డేవిడ్(27 బంతుల్లో 54) పరుగులతో రాణించారు. ఇక భారత బౌలర్లలో అక్షర్ పటేల్ మూడు, చాహల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్ తలా వికెట్ సాధించారు. ఇక 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత విజయంలో విరాట్ కోహ్లి( 48 బంతుల్లో 63), సూర్యకుమార్ యాదవ్(36 బంతుల్లో 69) కీలక పాత్ర పోషించారు. ఈ విజయంతో భారత్ మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. చదవండి: IND Vs AUS: కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. రెండో భారత కెప్టెన్‌గా -
రూ.850 టికెట్ ను రూ.11వేలకు విక్రయిస్తుండగా పట్టివేత
-
భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌పై జోరుగా బెట్టింగ్‌లు..
భారత్-ఆస్ట్రేలియా మధ్య కీలకమైన మూడో టీ20 హైదరాబాద్‌గా ఆదివారం జరగనుంది. ఇప్పటికే మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్-ఆసీస్ జట్లు చెరో విజయంతో సమంగా నిలిచాయి. సిరీస్ డిసైడ్ మ్యాచ్‌లో తలపడేందకు ఇరు జట్లు ఊవ్విళ్లూరుతున్నాయి. ఇక ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుంది. మరోవైపు ఈ కీలక మ్యాచ్‌పై భారీ బెట్టింగ్ జరుగుతోంది. బాల్ టూ బాల్, ప్రతీ రన్‌కు, వికెట్‌కు బుకీలు బెట్టింగ్ కడుతున్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తుందని భారీగా బెట్టింగ్‌లు పెడుతున్నారు రూ.వెయ్యి నుంచి రూ. లక్ష వరకు బెట్టింగ్ జరుగుతున్నట్లు సమాచారం. బుకీలు,మినీ బుకీలుగా రెండు రకాలుగా బెట్టింగులు జరుగుతున్నాయి. అధే విదంగా ఆన్లైన్లో లక్షల మంది బెట్టింగ్ కాస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బెట్టింగ్ రాయళ్లపై ఎస్వోటీ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. చదవండి: IND Vs AUS 3rd T20: ఉప్పల్ 'దంగల్'.. గత రికార్డులు ఎలా ఉన్నాయంటే? -
భారత్ , ఆసీస్ టీ-20 మ్యాచ్ పై భారీగా బెట్టింగులు
-
ఫైనల్ పంచ్ ఎవరిదబ్బా ..?
-
ఆస్ట్రేలియాతో మూడో టీ20.. పంత్, చాహల్‌కు నో ఛాన్స్!
స్వదేశంలో భారత్-ఆస్ట్రేలియా టీ20 సిరీస్ తుది దశకు చేరుకుంది. నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో 6వికెట్ల తేడాతో భారత్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. తద్వారా మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా 1-1తో సమం చేసింది. ఇక సిరీస్ ఫలితాన్ని తేల్చే అఖరి టీ20 ఆదివారం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుంది. ఈ కీలక మ్యాచ్‌లో భారత జట్టులో పలు మార్పులు చోటు చేసుకోనే అవకాశం ఉంది. భారత్ బ్యాటింగ్ పరంగా పటిష్టంగా ఉన్నప్పటికీ.. బౌలింగ్, ఫీల్డింగ్‌లో మాత్రం అంతగా రాణించపోతుంది. మొహాలీ వేదికగా జరిగిన తొలి టీ20 పూర్తిగా తేలిపోయిన భారత బౌలర్లు.. రెండో టీ20లో కాస్త పర్వాలేదనిపించారు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి రావడం టీమిండియాకు కలిసొచ్చే అంశం. అదే విధంగా స్పిన్నర్ అక్షర్ పటేల్ కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. కాగా గత రెండు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమైన హర్షల్ పటేల్ స్థానంలో తిరిగి భువనేశ్వర్ కుమార్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. అదే విధంగా పంత్ స్థానంలోపేసర్ దీపక్ చాహర్ తుది జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు భారీగా పరుగులు సమర్పించుకుంటున్న స్పిన్నర్ చాహల్ స్థానంలో అశ్విన్‌ను తీసుకోవాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. భారత తుది జట్టు (అంచనా) కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, అశ్విన్, దీపక్ చాహర్. చదవండి: 2007 T20 World Cup: 'శ్రీశాంత్ బంతిని పట్టుకోలేదు.. ప్రపంచకప్‌ను పట్టుకున్నాడు'