
ఆటల్లో గెలుపు, ఓటములు సహజం
ఓడిపోతున్నామని నిరాశ పడకండి
ఐపీఎల్‌లో ఎస్‌ఆర్‌హెచ్ క్రికెటర్
నితీష్ కుమార్‌రెడ్డి స్పష్టీకరణ
శేరిలింగంపల్లి: హైదరాబాద్‌లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో పిచ్ ఆటకు అనుకూలంగానే ఉంటుందని ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ క్రికెటర్ నితీష్ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. శేరిలింగంపల్లి నల్లగండ్లలోని టీబీసీ సెలూన్‌ను శుక్రవారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ క్రికెట్, ఇతర ఆటల పోటీల్లో గెలుపు ఓటములు సహజమని పేర్కొన్నారు. రేపటి ఐపీఎల్ మ్యాచ్ కోసం సిద్ధం అవుతున్నామని తెలిపారు. ఐపీఎల్ మ్యాచ్‌లలో ఓడిపోతున్నామని నిరాశ పడవద్దని, ఇప్పటి వరకూ ఆడిన ఆటతీరుతో ఎస్‌ఆర్‌హెచ్‌తో ప్రయాణం పట్ల సంతోషంగా ఉన్నామని అన్నారు. రెండు రోజుల గ్యాప్ ఉందని తనను ఇక్కడికి ఇన్‌వైట్ చేశారని, తాను ప్రారంభించిన స్టోర్‌లో తన అభిమానులు విజిట్ చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తనను అభిమానిస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, అభిమానులకు కతజ్ఞతలు తెలిపారు.
ఇక్కడి బిర్యానీ టేస్ట్ చేశా..
తాను క్రికెట్‌ను ఎంతగా ఇష్టపడతానో.. నగరంలోని బిర్యానీని అంతగా ఇష్టపడతానని, అందుకే హైదరాబాద్ బిర్యానీని టేస్ట్ చేశానని నితీష్ తెలిపారు. దీంతో పాటు నగరంలోని క్రికెట్ పిచ్ కూడా అంతే ఇష్టమని స్పష్టం చేశారు.
ఎస్‌ఆర్‌హెచ్ క్రికెటర్ల సందడి..
నల్లగండ్ల టీబీసీ సెలూన్ ప్రారంభానికి నితీష్ కుమార్‌రెడ్డితోపాటు ఎస్‌ఆర్‌హెచ్ క్రికెటర్లు మ్కాస్ స్టోయినిస్, ఇషాన్‌కిషన్, అభిõÙక్ శర్మ, జావియర్ బార్లెట్, అరోన్ హర్డీ వంటి క్రికెటర్లు కూడా హాజరై సందడి చేశారు. క్రికెటర్లను చూడడానికి పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు.