
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లకు పటిష్టమైన భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్ల రాచకొండ సీపీ సుధీర్ వెల్లడించారు. శుక్రవారం ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఐపీఎల్ (IPL-2025) మ్యాచ్‌ల భద్రతా ఏర్పాట్లపై శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
ఉప్పల్ స్టేడియంలో 450 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని సీపీ వెల్లడించారు. 2,700 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామని.. 300 మంది ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్‌లో 1,218 మంది, 12 మంది బెటాలియన్లు, 2 ఆక్టోపస్ బృందాలు, 10 మౌంటెడ్ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
ఐపీఎల్ 2025 మహా సంగ్రామానికి సర్వం సిద్ధమైంది. రేపు (శనివారం) నుంచి ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభం కానుంది. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్-ఆర్సీబీ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఆదివారం (ఎల్లుండి) సన్ రైజర్స్ హైదరాబాద్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment