సాక్షి, హైదరాబాద్: పదేళ్లుగా తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీఎస్‌ఎస్‌పీడీసీఎల్)తో నడుస్తున్న విద్యుత్ వివాదానికి హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ముగింపు పలికింది. హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్ రావు, కార్యదర్శి దేవ్‌రాజ్ నేతృత్వంలోని కార్యవర్గం ఇందుకు శుభం కార్డు వేసింది.
ఈ క్రమంలో 2015లో మొదలైన ఈ విద్యుత్ జగడానికి తాము స్వస్తి పలికినట్లు జగన్‌మోహన్ రావు వెల్లడించారు. సుమారు రూ. ఒక కోటీ 64 లక్షల విద్యుత్ బిల్లు బకాయిగా ఉండగా, ఐపీఎల్ సమయంలో తొలుత రూ.15 లక్షలు చెల్లించామని ఆయన చెప్పారు.
మిగిలిన మొత్తం 45 వాయిదాల్లో చెల్లించాలని అనుకున్నామన్నారు. అయితే హెచ్‌సీఏ పేరు ప్రతిష్టలను దృష్టిలో పెట్టుకుని ఒకేసారి అంతా చెల్లించామని ఆయన వివరించారు.
ఈ మేరకు మంగళవారం టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ సీఎండీ ముషా రఫ్ అలీ ఫరూఖీకి జగన్‌మోహన్ రావు రూ.1 కోటి 48 లక్షల 94 వేల 521ల మొత్తాన్ని చెక్ రూపంలో అందించారు.
విద్యుత్ బిల్లు పెండింగ్‌లో ఉందనే కారణంతో ఐపీఎల్ సందర్భంగా క్రికెటర్లు ప్రాక్టీసు చేస్తుండగా కరెంట్ తీసేసి, హైదరాబాద్, తెలంగాణ ఇమేజ్‌ను దెబ్బతీసే విధంగా ప్రవర్తించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫరూఖీని జగన్ ఈ సందర్భంగా కోరారు.
చదవండి: ఇంటర్వ్యూకు హాజరైన గంభీర్
Comments
Please login to add a commentAdd a comment