సాక్షి, హైదరాబాద్: ఆసీస్-భారత్ జట్ల మధ్య ఉప్పల్‌లో జరగబోయే మ్యాచ్ కోసం సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ వద్ద టికెట్ల అమ్మకాల్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA)ఘోర వైఫల్యం మూటగట్టుకుంది. టిక్కెట్లు కోసం ఒక్కసారిగా అభిమానులు తోసుకుని రావడంతో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హెచ్‌సీఏ తీరుపై తీవ్ర విమర్శలు వెలువెత్తున్నాయి. హెచ్‌సీఏ ఘోర వైఫల్యంపై ఆ అసోసియేషన్ మాజీ కార్యదర్శి శేష్ నారాయణ్ మండిపడ్డారు. 32 వేల టిక్కెట్లు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు.
చదవండి: ఉప్పల్ స్టేడియంలో ఇండియా– ఆస్ట్రేలియా మ్యాచ్.. అభిమానులతో ఆటలా!
‘‘ఒక్కరోజే ఇన్ని టిక్కెట్లు ఎలా అమ్ముదామనుకున్నారు. ఆన్‌లైన్‌లో అని చెప్పి ఆఫ్‌లైన్‌లోకి ఎందుకెళ్లారు?. హెచ్‌సీఏలో అజారుద్దీన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. తొక్కిసలాటకు ఆయనే బాధ్యత వహించాలి. 32 వేల టిక్కెట్లు అందుబాటులో ఉండాలి. టికెట్ల విక్రయానికి అన్ని చోట్ల కౌంటర్లు ఏర్పాటు చేయాలి. ఒక్కచోటే కౌంటర్ పెట్టడం సరికాదు. ఒక్కరోజే టికెట్లు విక్రయించడం సరికాదు. కనీసం నాలుగైదు రోజులు టికెట్లు విక్రయించాలి. ఆన్‌లైన్‌లో అమ్మిన టికెట్లలో అక్రమాలు జరిగాయి. ఎవరికి టికెట్లు అమ్మారో వివరాలు బయటపెట్టాలి’’ అని శేష్ నారాయణ్ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment