failure
-
ఇద్దరు బిడ్డల తల్లి : ఒకే రోజు ఆరు బ్యూటీ సర్జరీలు.. చివరికి!
ఐశ్వర్య అంత అందంగా కనిపించాలి, ఎత్తుపెరగాలి.. ఆరడుగులు డార్లింగ్‌గా మారిపోవాలి...ఆధునిక యువతలో ఇదో పెద్ద క్రేజ్. ఈ పిచ్చినే కొంతమంది స్వార్థపరులు క్యాష్ చేసుకుంటున్నారు. అందంకోసం ఆరాటపడి ప్రాణాలనే పొగొట్టుకున్న షాకింగ్ సంఘటన ఒకటి చైనాలో చోటు చేసుకుంది. దీంతో ఉన్నదానితో సంతృప్తి పడే కాలం పోయింది. లేని దాని కోసం అర్రులు చాచడం ఒక వేలం వెర్రిగా మారిపోయిందంటన్న నెటిజన్లు కామెంట్లు వైరల్‌గా మారాయి.దక్షిణ చైనాలోని గ్వాంగ్జీ ప్రావిన్స్‌లోని గుయిగాంగ్లోని గ్రామీణ ప్రాంతానికి చెందిన మహిళ 24 గంటల వ్యవధిలో ఆరు కాస్మెటిక్ సర్జరీలు చేసుకుంది. కానీ తన అందాన్ని తనివి తీరా చూసుకోకముందే తనువు చాలించింది. సుమారు రూ. 4.7 లక్షలు ( 40వేల యువాన్లు) అప్పు చేసి మరీ నన్నింగ్‌లోని ఒక క్లినిక్‌లో చేరింది.. ఒకే రోజు కళ్లు, ముక్కు, ఉదరం కోసం సర్జరీలు చేయించుకుంది. తరువాత ఆమె తొడలలోని కొవ్వును తీసి ముఖం, రొమ్ములలోకి ఇంజెక్ట్ చేసే లైపోసక్షన్ సర్జరీలు చేయించుకుంది. అయితే ఆ మహిళ డిశ్చార్జి కాగానే క్లినిక్‌లోని లిఫ్ట్ ముందేఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వైద్యులు చికిత్స చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. లైపోసక్షన్ తర్వాత పల్మనరీ ఎంబోలిజం కారణంగా తీవ్రమైన శ్వాసకోశ సమస్య రావడంతో చనిపోయిందని పోస్ట్ మార్టం నివేదికలో తేలింది. ఆమెకు ఎనిమిదేళ్ల కూతురు, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు.మరోవైపు మహిళ మరణంపై కుటుంబ సభ్యులు తమకు న్యాయం కావాలంటూ క్లినిక్‌పై కేసు వేశారు . అయితే 2 లక్షల యువాన్ల నష్టపరిహారం ఇవ్వడానికి అంగీకరించింది. అయితే, అతను కనీసం 10 లక్షల యువాన్లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆమె భర్త కోర్టును ఆశ్రయించాడు. దీన్ని విచారించిన కోర్టు చివరికి సుమారు 70 లక్షల రూపాయలు (590,000 యువాన్ల ) నష్టపరిహారంచెల్లించాలని ఆసుపత్రిని ఆదేశించింది. పరిస్థితిని సరిగ్గా గమనించకుండా, కొన్ని వైద్యపరమైన తప్పులు చేసిందని న్యాయమూర్తి లి షాన్ వ్యాఖ్యానించారు. తపుడు వాగ్దానాలతో అప్పు చేసి మరీ ఆపరేషన్లు చేయించుకునేలా ప్రేరేపించిందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.2020ల నాటి ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అందంకోసం అతిగా పోతే అనర్థం తప్పదంటూ కొంతమంది నెటిజన్లు వ్యాఖ్యానించగా , డబ్బులు కోసం ఎంతకైనా తెగిస్తారా అంటూ క్లినిక్‌పై కొందరు, ఒకే రోజులో ఆరు సర్జరీలు? క్లినిక్‌కి ఇంగితజ్ఞానం లేదా? ముఖ్యంగా రక్తం గడ్డకట్టడానికి దారితీసే లైపోసక్షన్‌తో సమస్యల ప్రమాదాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదా? అంటూ మరికొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. (వైరల్ వీడియో: కీరవాణిగారూ.. ఒక్క ఛాన్స్ ప్లీజ్: ఆర్టీసీ ఎండీ సజ్జనార్ రిక్వెస్ట్)చైనాలో లైపోసక్షన్ ఆపరేషన్లు చాలా సాధారణంగా మారిపోతున్నాయి. అందంగా, స్లిమ్‌గా ఉండాలనే కోరికతో మహిళలు కాస్మొటిక్ సర్జరీలవైపు మొగ్గు చూపుతున్నారు. చాలామంది చనిపోతున్నారు. మరికొంతమంది తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. -
KSR Live Show: ఇసుక మాఫియా.. మద్యం మాఫియా.. ఇంత అరాచక పాలన దేశంలో ఎక్కడ లేదు
-
అంజుమ్ కేసులో.. పోలీసుల వైఫల్యం
పుంగనూరు : చిత్తూరు జిల్లా పుంగనూరులో ఏడేళ్ల బాలిక అశి్వయ అంజుమ్‌ను కిడ్నాప్ చేసి, దారుణంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో నీటముంచి హత్యచేసిన కేసును ఛేదించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. ఎంపీ మిథున్‌రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డెప్ప, మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, పలువురు పార్టీ నేతలతో కలిసి శనివారం అశి్వయ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. కాగితాలు కాలిపోతే తమపై ఆరోపణలు చేస్తూ హెలికాప్టర్లో డీజీపీ, సీఐడీ చీఫ్‌లను ఉన్నపళంగా పంపిన సీఎంచంద్రబాబు.. మైనార్టీ బాలిక కిడ్నాప్, హత్య కేసులో ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందన్నారు.న్యాయం జరిగే వరకు తమ పార్టీ తరఫున ఉద్యమిస్తామన్నారు. హత్య కేసులో సీసీటీవీ పుటేజ్ కానీ, ఆధారాలు కానీ లేవని.. పోస్టుమార్టంలో ఏం వచ్చిందన్న విషయాలు కూడా వెల్లడించడంలో పోలీసులు విఫలమయ్యారని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఈ విషయంలో ఏం చేస్తున్నారని పెద్దిరెడ్డి ప్రశ్నించారు. ఇక బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ఈనెల 9న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పుంగనూరుకు రానున్నట్లు పెద్దిరెడ్డి వెల్లడించారు. పోలీసులు స్పందించడంలేదు : మిథున్‌రెడ్డి గత కొద్దిరోజుల్లో ఇద్దరు మైనర్ బాలికలు హత్యకు గురైన సంఘటనలో నిందితులను ఎందుకు అరెస్టుచేయలేదని, దీని వెనుక ఉన్న లోగుట్టు వెల్లడించాలని ఎంపీ మిధున్‌రెడ్డి డిమాండ్ చేశారు. చిన్నారి అశ్వియ అంజుమ్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. మైనార్టీ బాలిక కిడ్నాప్, హత్య కేసులో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. వారం రోజులుగా బాధిత కుటుంబానికి ఎలాంటి న్యాయం చేయలేదన్నారు. పట్టణ ప్రజలు నిద్రహారాలు మాని ఆందోళనలు చేస్తున్నా పోలీసులు ఎందుకు స్పందించడంలేదని విమర్శించారు. ఈనెల 9న బాధిత కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించనున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు ఉన్నపళంగా పుంగనూరు పర్యటనకు రావడం విస్మయానికి గురిచేస్తోందని.. వారం రోజులుగా స్పందనలేని ముఖ్యమంత్రికి, మంత్రులకు జగనన్న వస్తున్నారనే వార్త స్పందన కలిగించిందని మిథున్‌రెడ్డి ఎద్దేవా చేశారు. -
స్పేస్ఎక్స్ మిషన్‌లో... స్వల్ప సమస్య
వాషింగ్టన్: స్పేస్ఎక్స్ సంస్థ క్రూ–9 డ్రాగన్ అంతరిక్ష ప్రయోగంలో చిరు వైఫల్యం చోటుచేసుకుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ను క్షేమంగా వెనక్కి తీసుకొచ్చేందుకు నాసాతో కలిసి స్పేస్ ఎక్స్ శనివారం ఈ మిషన్ చేపట్టడం తెలిసిందే. అమెరికాలో ఫ్లోరిడాలోని కేప్ కెనవెరాల్ నుంచి ఫాల్కన్9 రాకెట్ ద్వారా క్రూ–9 డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌ను ప్రయోగించింది. ఇది విజయవంతమైనట్టు ఆదివారం ‘ఎక్స్’లో పోస్టు చేసింది. అయితే, ‘‘డ్రాగన్ వ్యోమనౌక రాకెట్ నుంచి విజయవంతంగా విడిపోయి ఐఎస్ఎస్ వైపు సాగింది. అనంతరం ఫాల్కన్9 రాకెట్ క్షేమంగా భూమిపైకి తిరిగివచి్చంది. అందులోని రెండో దశ మాత్రం సముద్రంలో పడాల్సిన చోటికి కాస్తంత దూరంలో పడిపోయింది’’ అని స్పేస్ఎక్స్ వెల్లడించింది. ఇందుకు కారణాలపై పరిశోధన చేస్తున్నట్లు పేర్కొంది. ఫాల్కన్9 పునరి్వనియోగ రాకెట్. ఇందులోని రెండో దశ విఫలం కావడం ఇది రెండోసారి. ఇది స్పేస్ఎక్స్కు ఇబ్బందికరంగా మారింది. పొరపాట్లు సరి చేసుకుంటామని, భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఆ సంస్థ చెబుతోంది. క్రూ–9 రాకెట్లో నాసా వ్యోమగామి నిక్ హేగ్, రోస్కోస్మాస్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునోవ్ ఐఎస్ఎస్కు పయనమయ్యారు. సునీత, విల్మోర్లను వెనక్కు తీసుకొచ్చేందుకు వీలుగా రెండు సీట్లను ఖాళీగా ఉంచారు. వారిద్దరూ జూన్‌లో స్టార్‌లైనర్ తొలి ప్రయోగంలో భాగంగా ఐఎస్ఎస్ చేరుకోవడం తెలిసిందే. -
వినేశ్‌కు ‘నాడా’ నోటీసులు
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) నోటీసులు జారీ చేసింది. ఎప్పుడు ఎక్కడ ఉన్నారనే అంశంపై 14 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కోరింది. ఈనెల 9న హరియాణాలోని ఖర్ఖోడ గ్రామంలో డోప్ టెస్టు నిర్వహించాలనుకుంటే ఆ సమయంలో వినేశ్ అందుబాటులో లేకపోవడంతో ‘నాడా’ ఈ నోటీసులు జారీ చేసింది. పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు చేరిన వినేశ్ ఫొగాట్... వంద గ్రాములు అధిక బరువు కారణంగా అనర్హతకు గురైంది. ఆ తర్వాత కెరీర్‌కు వీడ్కోలు పలికి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వినేశ్... హరియాణాలోని జులానా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యరి్థగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచింది. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్న వినేశ్ హరియాణాలో విసృతంగా పర్యటిస్తోంది. ఈ నేపథ్యంలో ‘ఎప్పుడు ఎక్కడ ఉన్నారనే వివరాలు అందించనందుకు గానూ వినేశ్‌కు నోటీసులు అందించాం. డోప్ నిరోధక అధికారి హాజరైన సమయంలో వినేశ్ అందుబాటులో లేదు. అందుకే ఈ నోటీసులు జారీ చేశాం’ అని ‘నాడా’ నోటీసులు పేర్కొంది. నిబంధనల ప్రకారం ఏడాది కాలంలో మూడుసార్లు వివరాలు అందించడంలో విఫలమైన అథ్లెట్లపై ‘నాడా’ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది. -
అన్నమో రామ‘చంద్రా’..
సాక్షి, అమరావతి/సాక్షి బృందం విజయవాడ: బుడమేరు ముంపు వచ్చి నాలుగు రోజులైంది. ముంపునీటిలో ఆరున్నర లక్షల మంది విలవిల్లాడుతున్నారు. ఇన్ని రోజులైనా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, చేతగానితనం కారణంగా బాధితులు అన్నమో రామచంద్రా అంటూ అలమటిస్తున్నారు. దాతలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నా వారికి సరిగ్గా దిశానిర్దేశం చేయడంలో సర్కారు ఘోరంగా విఫలమైంది. గుక్కెడు నీళ్లు, పట్టెడన్నం కూడా ఇవ్వలేకపోవడంతో బాధితుల ఆక్రందనలకు అంతులేకుండాపోతోంది. మరోవైపు.. ఆకలితో అలమటిస్తూ పలువురు మృత్యువాత పడుతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. అయినా సరే ప్రభుత్వంలో చలనం కని్పంచడంలేదు. కొద్దోగొప్పో ఆహార పంపిణీ చేస్తున్నప్పటికీ ఫొటోలకు ఫోజులిచ్చేందుకు అందరూ పాకులాడుతున్నారు. ఇక హెలికాçప్టర్లు, డ్రోన్ల ద్వారా ఆహార పంపిణీ పెద్ద ప్రహసనంగా తయారైంది. బురదమయమైన చోట జార విడుస్తున్న ఆహార పొట్లాల కోసం బాధితులు కొట్టుకుంటున్న పరిస్థితి. ఆకలి తీర్చే యంత్రాంగమేది? దాతలు అందించే విరాళాలతో పలుచోట్ల ఆహారం తయారుచేస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. కానీ, ఆ ఆహారాన్ని అవసరమైన వారికి అందించడంలో ఘోరంగా విఫలమవుతోంది. నగరంలో ఏ ఏ డివిజన్లలో ఎంతమంది బాధితులున్నారో ప్రభుత్వం వద్ద స్పష్టమైన సమాచారం ఉన్నా వారికి ఎంతమేర ఆహారం అవసరమవుతుందో అంచనా వేయలేకపోతున్నారు. దీంతో.. మంచినీరు, ఆహార పొట్లాలను తీసుకెళ్తున్న వాహనాలను ఎక్కడపడితే అక్కడ నిలిపివేసి అక్కడకు వచి్చన వారికి మాత్రమే అందిస్తూ చేతులు దులిపేసుకుంటున్నారు. ప్రధాన రోడ్లకు లోపలగా ఉన్న ప్రాంతాలకూ వచ్చి ఆహార పొట్లాలు అందించాలని వేడుకుంటున్నా పట్టించుకునే దిక్కులేదు. చాలాచోట్ల ఆహారం సరిగా లేకపోవడం, తినడానికి పనికిరాకుండా పాడైపోవడం వంటి కారణాలతో ప్యాకెట్లు రోడ్డుపాలవుతున్నాయి. బాధితులకు ఛీత్కారాలు.. చీదరింపులు ఇదిలా ఉంటే.. సితార సెంటర్, లేబర్ కాలనీ, కబేళా ప్రాంతాల్లో ఆహారం కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్న బాధితులు అధికారులు, సిబ్బంది నుంచి ఛీత్కారాలు ఎదుర్కొంటున్నారు. వాహనాల్లో ఆహారాన్ని పంపిణీ చేసేందుకు వస్తున్న వారు బాధితులను చులకనగా చూస్తూ మనసు గాయపడేలా మాట్లాడుతున్నారు. కానీ, కొందరు సిబ్బంది పంపిణీ ప్రక్రియను వదిలేసి సెలీ్ఫలు, వీడియోలపైనే ఆసక్తి కనబరుస్తున్నారు.దాతలకు గైడ్ చేసే నాథుల్లేరు.. ఇక బాధితుల ఆకలి తీర్చేందుకు పెద్ద సంఖ్యలో దాతలు ముందుకొస్తున్నా వారికి దిశానిర్దేశం చేసే నాథులు కని్పంచడంలేదు. నగరానికి చెందిన వారే కాదు.. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో దాతలు సొంతంగా ఆహారం తయారుచేయించుకుని విజయవాడ తీసుకొస్తున్నారు. బాధితులను చేరుకోవాలంటే ఎటువైపు వెళ్లాలో వారికి తెలీడంలేదు. దీంతో వారు ఉన్నచోటే పంచేసి మిగిలిపోయిన ఆహారాన్ని అక్కడే వదిలేస్తున్న పరిస్థితులు కన్పిస్తున్నాయి. కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసినా అధికారులు స్పందించడంలేదని చెబుతున్నారు.కంపుకొడుతున్న ఆహారం.. ఇక నగరంలోని వరద ముంపు ప్రాంతాలకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఆహారం వాసనొచ్చి తినేలాలేదని.. వీటిని పిల్లలకు ఎలా పెట్టాలని బాధితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అర్థరాత్రి వేళ భోజన ప్యాకెట్లు వస్తున్నాయని.. వాటిని ఇక్కడ పడేసి రేపు ఉదయం తినాలని సూచిస్తున్నారని.. పొద్దున చూస్తే అవి పాడైపోయి కనిపిస్తున్నాయంటున్నారు. ఇలా బస్తాల బస్తాల ఆహార పొట్లాలు నేలపాలవుతున్నాయి. పలువురు వీటిని తిని వాంతులు చేసుకున్నారు.రెండ్రోజుల నుంచి ఖాళీ కడుపుతోఆకలితో అలమటిస్తున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. రెండ్రోజుల నుంచి ఖాళీ కడుపుతోనున్న వారు ఎందరో. హెలికాప్టర్ నుంచి విసురుతున్న పొట్లాలు ఎక్కడో దూరంగా పడి ఎవరికీ అందకుండాపోతున్నాయి. పేదల ఆకలంటే అందరికీ అలుసుగా ఉంది. – గిరికే ఏడుకొండలు, వాంబే కాలనీ తిండి, నీరులేక నాలుగు రోజులు విలవిల కుటుంబమంతా వరద నీటిలో చిక్కుకుని నాలుగు రోజులుగా తిండి, తాగునీరు లేక విలవిల్లాడిపోయాం. చివరికి టైర్ ట్యూబుల సాయంతో బుధవారం నున్న గ్రామానికి చేరుకున్నాం. ఇక్కడ నుంచి గన్నవరంలోని బంధువుల ఇంటికి వెళ్తున్నాం. – ఎస్. నారాయణరావు, పాయకాపురం, విజయవాడ ముసలివాళ్లకు ఆహారం అందడంలేదు.. ఇంట్లో నేను, నా భార్య ఇద్దరమే ఉంటున్నాం. నాలుగు రోజులుగా తినడానికి తిండి దొరక్క చాలా ఇబ్బందులు పడ్డాం. ఆహార పొట్లాలు నాలాంటి ముసలివాళ్లకు అందడంలేదు. నా ముసలిదాని ఆకలి తీర్చాలని ఈరోజు కష్టపడి ఆహార పొట్లాన్ని అందుకున్నా. – గుంజ వెంకటయ్య, రాజీవ్‌నగర్ -
Gun Shot: ఆంధ్రాను ఆఫ్ఘాన్ చేసిన చంద్రబాబు
-
పుణే ఘటన! ఎవరిది ఈ పాపం? ఇది పేరెంటింగ్ వైఫల్యమేనా..?
పుణెలో మైనర్ బాలుడి డ్రైవింగ్ కారణంగా ఇద్దరు యువ ఇంజనీర్లు ప్రాణాలు కోల్పోయారు. కారుని గంటకు 200 కి.మీ వేగంతో ప్రయాణిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అంతేగాదు ఈ ప్రమాదానికి ముందు పంబ్లో సంబరాలు చేసుకోవడమే గాక ఏకంగా రూ. రూ. 48 వేలు ఖర్చు పెట్టి మరీ మందు తాగినట్లు తేలింది. నిజానికి మహారాష్ట్రలో 25 ఏళ్లు దాటిన వారికే మద్యం సేవించేందుకు అనుమతి ఉంది. ఇక్కడ నిందితుడికి కొద్ది గంట్లలోనే షరతులతో కూడిన బెయిల్ రావడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాదు నిందుతుడి తండ్రిని కూడా అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ దిగ్బ్రాంతికర ఘటన యావత్తు దేశాన్ని ఒక్కసారిగా ఉలక్కిపడేలా చేసింది. ఇక్కడ సరిగాలేని చట్టాలది తప్పా? లేక నిందితుడిని అలా పెంచిన తల్లిదండ్రులది తప్పా? దీనికి ఎవరు బాధ్యులు? ఎవరదీ ఈ పాపం..?యావత్తు దృష్టిని ఆకర్షించిన ఈ ప్రమాదం అతిపెద్ద ప్రజాస్వామ్యంలో జరిగిన భయానక దిగ్బ్రాంతికర ఘటనగా చెప్పొచ్చు. 17 ఏళ్లు మైనర్ రూపంలో మృత్యువు ఎన్నోకలలతో ఉన్న ఇద్దరు యువతీయుకుల జీవితాలను బలితీసుకుంది. రెండు కుంటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇంత ఘోరానికి పాల్పడ్డ నిందితుడు కొద్ది గంటల్లోనే బెయిల్‌పై రావడమే గాక మేజర్ కాదు కాబట్టి శిక్షార్హడు అని కోర్టు పేర్కోనడమే అత్యంత కలిచివేసే విషయం. ఇక్కడ మైనర్ ఎంత పెద్ద నేరం చేసిన శిక్ష పడకుండా తప్పించుకోగలుగుతున్నందుకు బాధపడాలో లేక తల్లిదండ్రుల పెంపకానికి రెండు నిండు జీవితాలు బలైనందుకు కలత చెందాలో తెలియని స్థితి. ఈ ఘటన ఒక్క విషయం చెప్పకనే చెప్పింది. తల్లిదండ్రుల పెంపక వైఫల్యతకు నిదర్శనమే ఈ ఘటన అని చెంపదెబ్బ కొట్టినట్లు చెప్పకనే చెబుతోంది. మేజర్ కానివాడికి విలావంతమైన కారు ఇవ్వడం ఒక తప్పు అయితే..ఖర్చుపెట్టుకోమని అంతంత డబ్బు ఇస్తున్నారంటే..తల్లిదండ్రులుగా వాళ్లకు ఏం చెబుతున్నారో అర్థమవుతోంది. ఇక్కడ తల్లిదండ్రులు మేము ఒళ్లు గుల్ల చేసుకుని డబ్బులు సంపాదించేస్తాం..మీరు విచ్చలవిడి జీవితానికి అలవాటు పడి తాగితందనాలు ఆడి బీభత్సం సృష్టించమని చెబుతున్నారా? అని అనలా. ఏదైనా మొక్కగా ఉన్నప్పుడే సరిచేయాలి. విలాసవంతమైన వస్తువులు కొనివ్వగలిగే స్తోమత ఉన్న తల్లిదండ్రులు రెండు విషయాలు తప్పక గుర్తించుకోవాలి. కొన్నింటికి నో చెప్పడం ముఖ్యం..ఒకటి దీనివల్ల వాడికి ప్రయోజనం ఉంటుందా లేదా గ్రహించాలి. రెండు ఎంత వరకు ఆ లగ్జరియస్ వస్తువు పిల్లలకు అవసరం అనేది కూడా గమనించాలి. స్నేహితుల ప్రభావంతో స్టేటస్ ఆఫ్ సింబల్‌గా విలాస వస్తువులు కావాలనుకుంటున్నారా? అన్నది కూడా తల్లిదండ్రులుగా తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం. ప్రతి తల్లిదండ్రులు స్తోమత ఉన్నా లేకపోయినా విలావంతమైన వస్తువులకు 'నో' చెప్పాలి. అంతేగాదు తల్లిదండ్రులుగా ప్రతిదానికి 'ఎస్' అని చెప్పడం కాదు నో అని చెప్పి కట్టడి చేయడం వంటివి కూడా చేయాలి. ఒక వస్తువు కొనేందుకు ఖర్చు అవుతున్న డబ్బులు అందుకోసం మీరు పడుతున్న కష్టం గురించి విడమరిచి చెప్పాలి. చాలామంది చేసే ప్రధానమైన తప్పు ఏంటంటే..ప్రతీది కాదంటే వారు నొచ్చుకుంటారు,స్నేహితుల ముందు చిన్నబోతారని భావిస్తుంటారు. పైగా పిల్లలు కదా..!పోనీలే అనే భావన కూడా అస్సలు వద్దు. మీ ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు ఎంత ఖరీదైనదేనా కొనిచ్చేస్తారు..ఆ తర్వాత ఏంటీ..? అనేది అతిపెద్ద ప్రశ్న..?. అనేది గుర్తుపెట్టుకోండి.. పిల్లల భవిష్యత్తు భద్రమైన వస్తువులు కొనివ్వండి. గారాభంగా పెంచడం తప్పుకాదు. ముద్దుగా, గారాభంగా పెంచుతూనే బాధ్యతలను, విలువలను నేర్పించాలి. ముఖ్యంగా ప్రయోజకులుగా మారకపోయిన పర్లేదు గానీ ఇతరులకు హాని తలపెట్టే వారిగా, అందరూ అసహ్యించుకునేవారిలా మాత్రం తయారవ్వనివ్వకండి. (చదవండి: ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ తీసుకోవచ్చా? అధ్యయనంలో షాకింగ్ విషయాలు!) -
గనిలో చిక్కుకున్న 14 మంది అధికారులు.. కొనసాగుతున్న సహాయక చర్యలు!
రాజస్థాన్‌లోని నీమ్ కా థానా జిల్లాలో మంగళవారం రాత్రి హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్‌లో ప్రమాదం సంభవించింది. సంస్థకు చెందిన 14 మంది అధికారులు, విజిలెన్స్ బృందం సభ్యులు గనిలో చిక్కుకున్నారు.ఉద్యోగులను గని లోపలికి, బయటికి తరలించేందుకు ఉపయోగించే వర్టికల్ షాఫ్ట్ పనిచేయకపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మైనింగ్ అధికారి ఒకరు తెలిపిన వివరాల ప్రకారం గనిలో చిక్కుకున్న అధికారులను బయటకు తీసుకువచ్చే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కోలిహన్ గని వద్ద విజిలెన్స్ బృందం కంపెనీ సీనియర్ అధికారులతో కలిసి తనిఖీలు చేసేందుకు వందల మీటర్ల మేర గనిలోకి దిగింది. వారు పైకి వస్తున్న సమయంలో షాఫ్ట్ (కేజ్) వైర్ తెగిపోయింది. దీంతో గని లోపల తనిఖీ చేయడానికి వెళ్లిన 14 మంది అధికారులు లోపలే చిక్కుకుపోయారు.సమాచారం అందుకున్న వెంటనే ఖేత్రికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే ధరంపాల్ గుర్జార్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలంలో పలువురు అధికారులతో పాటు ఏడు అంబులెన్స్‌లు ఉన్నాయి. అధికారులను బయటకు తీసుకువచ్చే పనిలో రెస్క్యూ టీమ్ నిమగ్నమైంది. ప్రస్తుతానికి ప్రాణనష్టం గురించి ఎలాంటి సమాచారం లేదు. -
చిలకలూరిపేట సభపై ఎల్లో మీడియా వక్రభాష్యం
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కొత్త వ్యూహంలోకి వెళుతున్నట్లుగా ఉంది. ఒకవైపు జనసేన, BJPలను బతిమలాడుకుని పొత్తు పెట్టుకున్న ఆయన, వ్యవస్థలపై దృష్టి సారించినట్లుగా ఉంది. 58 నెలలపాటు న్యాయ వ్యవస్థను అడ్డుపెట్టుకుని నిత్యం కేసులు వేస్తూ , ఏపీలోని వైఎస్ జగన్ ప్రభుత్వానికి అడుగడుగున ఆటంకాలు కల్పిస్తూ వచ్చిన చంద్రబాబు నాయుడు కీలకమైన ఈ రెండు నెలలు తన మిత్రపక్షం బిజెపి ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ఎన్నికల కమిషన్ పై ఒత్తిడి తెచ్చి వీలైనంతమేర YSR కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టడానికి ప్లాన్ చేసినట్లు కనిపిస్తుంది. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో అన్ని రాజకీయ పార్టీలకు ఈ రెండు నెలలు కీలకం అవుతాయి. ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న కూటమి సభ విఫలం అవడంతో , ఆ నెపం మొత్తాన్ని పోలీసులపైన తోసేసి ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నాలు ఆరంభించారు. DGPతో పాటు కొందరు IPS అధికారులను టార్గెట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముఖ్య అదికారి మీనాకు ఫిర్యాదు చేసింది. దానిపై జనసేన, BJP ప్రతినిధులు కూడా సంతకాలు చేసి ఆ పాపంలో పాలు పంచుకున్నారు. నిజంగా ప్రధాని మోడీ సభ అంత నాసిరకంగా జరగడానికి కారణం ఎవరు? నిర్వహణ బాధ్యతలన్నీ తెలుగుదేశం నేతలే తీసుకున్నారు కదా! అలాంటప్పుడు వైఫల్యానికి కూడా వారే బాద్యత వహించాలి కదా! దానిని కప్పిపుచ్చే ప్రయత్నం స్పష్టంగా కనబడుతోంది. (సభ ఏర్పాట్లను పూర్తిగా దగ్గరుండి పర్యవేక్షించిన లోకేష్) మిత్రపక్షంగా బిజెపి అయిందో లేదో, వెంటనే చంద్రబాబు నాయుడు తన మేనేజ్ మెంట్ స్కిల్ ఉపయోగించి ఎన్నికలను నెల రోజులు ఆలస్యంగా జరిగేలా చేశారన్నది ఎక్కువ మంది భావన. ఇక ఇప్పుడు ఎపిలో చిత్తశుద్దితో పనిచేస్తున్న పోలీసు అధికారులపై దాడి చేసి వారిని భయోత్పాతానికి గురి చేయడం ద్వారా లబ్ది పొందాలన్న కుట్రకు తెరలేపారు. అందుకే మోడీ సభకు సంబందించి టిడిపి ఫిర్యాదు చేసిందన్న భావన ఏర్పడింది. ఆ ఫిర్యాదు పత్రంలో పేర్కొన్న అంశాలు చూడండి. తాము ముందస్తుగానే పోలీసులకు భద్రత ఏర్పాట్ల గురించి లేఖ రాసినా, అధికారులు సరైన చర్యలు తీసుకోలేదని, భద్రత ఏర్పాట్లలో లోపాలకు డిజిపి బాద్యుడని ఎన్నికల ముఖ్య అధికారికి టిడిపి రాసిన లేఖలో తెలిపింది. జన సమూహాన్ని నియంత్రించడం, ట్రాఫిక్‌ను క్రమబద్దం చేయడంలో పోలీసులు విఫలం అయ్యారని టిడిపి ఆరోపణ. అందువల్లే కూటమి బహిరంగ సభలో ప్రజలు తోసుకుంటూ ముందుకు వచ్చారని, అలాగే మైక్ సౌండ్ సిస్టమ్ వైపు కూడా వచ్చారని టిడిపి పేర్కొంది. దానివల్ల మోడీ స్పీచ్ ఇస్తున్నప్పుడు పలుమార్లు మైక్ ఆగిపోయిందని ఆ పార్టీ ఫిర్యాదుగా ఉంది. విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయిందని ఆ పార్టీ ఆరోపించింది. ప్రధాని పలుమార్లు టవర్ల నుంచి దిగాలని సభకు వచ్చినవారిని కోరినా, పోలీసులు చొరవ తీసుకోలేదని పార్టీ ఆరోపించింది. మోడీని సత్కరించడానికి తెచ్చిన పుష్పగుచ్చాన్ని కాని, శాలువాని కాని పోలీసులు అనుమతించలేదని చిత్రమైన ఫిర్యాదు చేసింది. ఇదంతా YSRCPతో పోలీసులు కుమ్మక్కయి కుట్ర చేశారని టిడిపి అభియోగం. ఇక సభకు వస్తున్న వాహనాలను జాతీయ రహదారిపై కావాలని ఆపేశారని మరో ఆరోపణ చేసింది. సభకు వచ్చిన వారి అత్యుత్సాహం వల్లే మైక్ సిస్టమ్ పని చేయకుండా నిలిచిపోయిందని మాత్రం టిడిపి అంగీకరించడం విశేషం. డిజిపి రాజేంద్రనాధ్ రెడ్డి, ఐజి పాలరాజు, పల్నాడు ఎస్పి రవిశంకర్ రెడ్డిలపై ఆరోపణలు గుప్పిస్తూ టిడిపి ఈ లేఖ రాసింది. (సభలో పరిస్థితి) ఈ లేఖలోని ఆరోపణలపై జాగ్రత్తగా పరిశీలన చేసినా, విచారణ జరిపినా కొన్ని విషయాలు తేలికగా తెలిసిపోతాయి. లేఖ ఆసాంతం పరిశీలిస్తే.. తెలుగుదేశం పార్టీ డొల్లతనం బయటపడుతుంది. ప్రధాని మోడీ పాల్గొన్న సభకు భద్రత ఏర్పాట్ల నిమిత్తం నాలుగువేల మంది పోలీసులను నియమించారు. అయినా తక్కువ మందిని పెట్టారని అసత్యపు ఆరోపణను కూటమి నేతలు చేశారు. కరెంటు పోయిందన్నది అబద్దమని చెబుతున్నారు. సభా ప్రాంగణానికి ప్రత్యేకంగా విద్యుత్ లైనే లేదట. సభ అంతా జనరేటర్ పై ఆధారపడి ఏర్పాటు చేసుకున్నారట. అలాంటప్పుడు కరెంటు పోయే సమస్య ఎక్కడ నుంచి వస్తుందని కొందరు ప్రశ్నిస్తున్నారు. మైక్ సిస్టమ్ సరైనది ఎంపిక చేసుకునే బాధ్యత టిడిపి వారిదే కాని, పోలీసులకు ఏమి సంబంధం? చిలకలూరిపేట ప్రాంతంలో రికార్డింగ్ డాన్స్ లకు వాడే మైక్ సిస్టమ్‌ను తెలుగుదేశం నేతలు తీసుకురావడంతోనే ఈ సమస్య వచ్చిందన్నది స్థానికుల అభిప్రాయంగా ఉంది. ఒకసారి ప్రధాని భద్రత కోసం వచ్చే ప్రాంగణాన్ని SPG అధీనంలోకి తీసుకున్న తర్వాత స్థానిక పోలీసులకు ప్రత్యేక అధికారాలు ఉండవు. SPG అనుమతి ఇచ్చి ఉంటే ప్రధాని కోసం టిడిపి తెచ్చిన పుష్పగుచ్ఛం, శాలువాను స్థానిక పోలీసులు అనుమతించకుండా ఎలా ఉంటారు? (మోదీని సన్మానిస్తారని ప్రకటన చేయగా.. శాలువాలు, పూలబోకే లేక దిక్కులు చూస్తోన్న బాబు, పవన్) టిడిపి నేతలు చేసినవన్నీ అబద్దపు ఆరోపణలని పోలీసు అధికారుల సంఘం నేతలు చెబుతున్నారు. పోలీసులకు రాజకీయ రంగు పులమడం సరికాదని వారు వ్యాఖ్యానిస్తున్నారు. సభ ఎజెండా ఖరారు చేసుకునేటప్పుడు అన్ని సిద్ధంగా ఉన్నాయా ? లేదా? అన్నది చూసుకోవల్సిన బాధ్యత కూటమి నేతలపై ఉంటుంది. వారు వాటిని ఎందుకు చెక్ చేసుకోలేదు? ఇదే టైమ్ లో బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఒక విగ్రహ జ్ఞాపికను వేదిక మీదకు ఎలా తీసుకు వెళ్లగలిగారు? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు చేతులూపుకుంటూ వెళ్లి కూర్చున్నారే కాని, ప్రధానిని సత్కరించడానికి అవసరమైన ఏర్పాట్ల గురించి ఎందుకు ఆరా తీయలేదో తెలియదు. రోడ్లపై ట్రాఫిక్ ను రెగ్యులేట్ చేయలేదని ఇంకో తప్పుడు ఆరోపణ చేశారు. నిజానికి ఈ సభ కోసం భారీగా ఏమీ వాహనాలు రాలేదు. ఆ విషయం గమనించిన తెలుగుదేశం వారు రోడ్డుపై కొన్ని వాహనాలను అడ్డంగా నిలిపి, చాలా వాహనాలు ఆగిపోయినట్లు కలరింగ్ ఇస్తూ దానిని డ్రోన్ ద్వారా వీడియో తీశారు. కాని ఆ విషయం బయటపడిపోవడంతో ఈ దిక్కుమాలిన ఫిర్యాదు చేశారు. ఎప్పుడూ ఏదో ఒక అబద్దపు ప్రచారంతో నెట్టుకువచ్చే తెలుగుదేశం పార్టీ ఈ రకంగా కూడా ప్రజలను మోసం చేసే యత్నం చేసింది. RTC బస్ లు తగినన్ని ఇవ్వలేదని టిడిపి మీడియా ప్రచారం చేసింది. విషయం ఏమిటంటే 2500 RTC బస్‌లను రిజర్వు చేసుకున్న టిడిపి వాటిలో 1500 బస్ లను ఎందుకు కాన్సిల్ చేసిందో కూడా వివరించాలి కదా! అసలు రాష్ట్రంలో వారివల్ల ఎక్కడ ఏ తప్పు జరిగినా, ముందుగా ఎదుటివారిపై తోసేయడం చంద్రబాబు బృందానికి అలవాటేనన్నది రాజకీయ వర్గాల విమర్శగా ఉంది. ప్రధాని మోడీ సభలో ఏదైనా అలజడి జరిగితే దానిని ప్రభుత్వంపై నెట్టి రాజకీయ లబ్ది పొందాలన్నది వారి లక్ష్యం కావచ్చని అనుమానిస్తున్నారు. సభలో ప్రజలు ఎవరూ టవర్లు ఎక్కకుండా అక్కడ పార్టీ వలంటీర్లనో, కార్యకర్తలనో పెట్టుకోవలిసిన టిడిపి ఎందుకు ఆ పని చేయలేదు? ఆయా టిడిపి సభలలో ఒక యాంకర్ మాదిరి వైర్ లెస్ కార్డు సిస్టమ్ వాడి ప్రసంగం చేసే చంద్రబాబుకు పాతపద్దతిలో మైక్ సిస్టమ్ ఎలా అనుమతించారు? గతంలో కందుకూరు వద్ద ఇరుకు రోడ్డుపై సభ పెట్టి తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది మరణించిన ఏం చేశారు? గుంటూరులో చంద్రబాబు సభకు వచ్చేవారికి చీరలు ఇస్తామని ప్రకటించి,వేలాది మంది వచ్చేలా చేసి, అక్కడ సరిగా నిర్వహించకుండా తొక్కిసలాట జరిగినప్పుడు ఏం చేశారు? మనుష్యులు మరణించినప్పుడు ఆ నెపాన్ని పోలీసులపైనే నెట్టేయలేదా? గోదావరి పుష్కరాలలో చంద్రబాబు ప్రచార యావవల్ల తొక్కిసలాట జరిగి 29 మంది మరణించినప్పుడు చంద్రబాబు ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడింది గుర్తు లేదా? కుంభమేళాలలో చనిపోవడం లేదా? రోడ్డు ప్రమాదాలలో పోవడం లేదా అని ప్రశ్నించి అందరిని విస్తుపరిచారు. ఇప్పుడు తమ పార్టీ ప్రయోజనాల కోసం అలాంటి ఘటన ఏదైనా జరిగితే ప్రయోజనం అని ఏమైనా భావించారా అన్న విమర్శను కొందరు చేస్తున్నారు. కేవలం పోలీసు ఉన్నతాధికారులను భయపెట్టి , తమ పార్టీ అభ్యర్ధులు చేసే డబ్బు పంపిణీ, కానుకల పంపిణీ వంటి వాటికి అడ్డు రాకుండా చూసుకోవాలన్న ఆలోచనతో వారిపై ఈ ఆరోపణలు చేశారా అన్న సందేహం వస్తుంది. దానికి తగినట్లే ఈనాడు మీడియా ఇదంతా పోలీసుల వైఫల్యం అని, కేంద్రం నిఘా అధికారులు నివేదిక పంపించారంటూ కధనాన్ని కూడా ప్రచారం చేసింది. పైగా పల్నాడు ఎస్పిపై ఎన్నికల కమిషన్ చర్య తీసుకోవచ్చంటూ రాసేసింది. అసలు విచారణ చేసిందెప్పుడు, సంబందిత అధికారుల వివరణ కోరిందెప్పుడు? నివేదికను కేంద్రానికి పంపిందెప్పుడు? అదే నిజమైతే ఈనాడు మీడియాకే ఎందుకు ఇచ్చారు? అంటే ఇదంతా ఒక కుట్రగా కనిపించడం లేదా!ఇంతకాలం కోర్టులను అడ్డంపెట్టుకుని ఇలాంటి కధలను నడిపిన టిడిపి, ఈనాడు, ఆంద్రజ్యోతి తదితర ఎల్లో మీడియా, ఇప్పుడు కొత్త తరహా కుట్రలకు తెరలేపినట్లుగా ఉంది. అందులో భాగంగానే ఇలాంటి తప్పుడు ఆరోపణలతో ప్రచారం చేస్తున్నారనుకోవాలి.ఇక్కడ ఒక సంగతి చెప్పాలి. జనం అంతా సభ విఫలం అయిందని, మోడీకి అవమానకరంగా సభ నడిచిందని అనుకుంటుంటే, ఈనాడు మాత్రం అందుకు భిన్నంగా టీవీలో ఒక ప్రచారం చేసింది. సభ ముగిసిన వెంటనే ప్రధానిని చంద్రబాబు, పవన్ కలిశారని, ఆ సందర్భంగా మోడీ సభ గ్రాండ్ సక్సెస్ అయిందని అన్నారని టీవీలో వార్తలు ఇచ్చింది. అది నిజమే అయితే ఇప్పుడు ఆ వైఫల్యం..ఈ వైఫల్యం అంటూ కొత్తబాణి ఎందుకు అందుకున్నట్లు? - కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ జర్నలిస్టు -
సెప్టిక్ షాక్: నటుడు శరత్‌బాబు ఉసురు తీసింది ఆ వ్యాధే!
టాలీవుడ్ నటుడు శరత్ బాబు తెలుగు , కన్నడతో సహా వివిధ భాషలలో హీరోగా చేసి ప్రేక్షకులను మెప్పించాడు. అలా ఆయన దాదాపు 230కి పైగా చిత్రాల్లో నటించారు . ఆయన క్యారెక్టర్ రోల్స్‌లో కూడా ప్రేక్షకులను అలరించారు. చివరికి 71 ఏళ్ల వయసులో ఈ మహమ్మారి సెప్సిస్ బారిన పడి మృతి చెందారు. ఆఖరి దశలో తీవ్ర ఇన్ఫెక్షన్కు గురై చాల రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది. ఆయనకు వచ్చిన సెప్సిస్ ప్రాణాంతకమా? ఎందువల్ల వస్తుంది..? సెప్టిక్ షాక్ అనేది సెప్సిస్‌కి సంబంధించిన తీవ్ర దశ. దీని కారణంగా శరీరంలో ఒక్కసారిగా రక్తపోటు పడిపోయి శరీరం తీవ్ర ఇన్ఫెక్షన్కు గురవ్వుతుంది. ఈ పరిస్థితి ప్రాణాంతకమైనది. ఈ దశలో మెదడు నుంచి సమస్త అవయవాలు వైఫల్యం చెంది పరిస్థితి విషమంగా మారిపోతుంది. దీన్ని బహుళ అవయవాల వైఫల్యానికి దారితీసే వైద్య పరిస్థితి అని అంటారు. సెప్సిస్ అంటే.. సెప్సిస్‌ని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ)గా పిలుస్తారు. అంటే.. ఇన్ఫెక్షనకు శరీరం తీవ్ర ప్రతిస్పందించడం అని అర్థం. ఈ పరిస్థితి ఎప్పుడు సంభవిస్తుందటే..శరీరం అంతటా ఇన్షెక్షన్ చైన్ రియాక్షన్‌లా వ్యాపించడం జరిగితే ఈ సెప్సిస్ బారిన పడటం జరుగుతుంది. చాలా వరకు రోగిని ఆస్పత్రికి తీసుకు వెళ్లే ముందు ప్రారంభమవుతాయి. ఈ సెప్సిస్ ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తులు, మూత్రనాళాలు, చర్మం లేదా జీర్ణశయాంతర ప్రేగుల నుంచి ప్రారంభమవుతాయి. కారణం.. సూక్ష్మక్రిములు ఒక వ్యక్తి శరీరంలోకి ప్రవేశిస్తాయి.ఆ తర్వాత శరీరం అంతటా వ్యాపించడం ప్రారంభిస్తుంది. అయితే దీనికి చికిత్స తీసుకుంటూ ఆపేసినా లేక తీసుకోకపోయినా సెప్సిస్ బారిన పడటం జరుగుతుంది. చాలా వరకు బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు సెప్సిస్‌కు కారణం. ఇది వైరల్ ఇన్ఫెక్షన్లు లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ల వంటి ఇతర ఇన్ఫెక్షన్ల వల్ల కూడా సంభవించవచ్చు. ఈ సెప్సిస్‌ని శరీరంలో అభివృద్ధి చేసే వ్యక్తులు దీర్ఘకాలిక ఊపిరితిత్తుల లేదా బలహీనమైన రోగనిరోధక వ్యకవస్థతో తీవ్ర వైద్య పరిస్థితిని కలిగి ఉంటారు. ఈ ఇన్ఫెక్షన్తో బాధపడే వారిలో దాదాపు పావు నుంచి ఒక వంతు దాక ఆస్పత్రిని సందిర్శించిన ఒక్క వారంలోనే మళ్లీ ఆస్పత్రిలో చేరడం జరుగుతుంది. సెప్సిస్ దశలు.. మూడు దశలు సెప్సిస్: ఇది రోగనిరోధక వ్యవస్థ ఇన్ఫెక్షన్కు అతిగా స్పందించే పరిస్థితి. తీవ్రమైన సెప్సిస్: సెప్సిస్ అవయవాలు పనిచేయకపోవడానికి కారణమవుతుంది. ఇది సాధారణంగా తక్కువ రక్తపోటు, వాపు ఫలితంగా జరుగుతుంది. సెప్టిక్ షాక్: సెప్టిక్ షాక్ అనేది సెప్సిస్ చివరి దశ. చాలా IV (ఇంట్రావీనస్) ద్రవాలు ఉన్నప్పటికీ, ఇది అత్యంత తక్కువ రక్తపోటు ద్వారా నిర్వచించబడింది. ఈ దశ ప్రాణాంతకమని చెప్పొచ్చు. లక్షణాలు.. వేగవంతమైన హృదయ స్పందన రేటు జ్వరం లేదా అల్పోష్ణస్థితి (ఉష్ణోగ్రతలు పడిపోవడం) వణుకు లేదా చలి వెచ్చగా, తడిగా లేదా చెమటతో కూడిన చర్మం గందరగోళం లేదా దిక్కుతోచని స్థితి హైపర్వెంటిలేషన్ (వేగవంతమైన శ్వాస) శ్వాస ఆడకపోవుట. సెప్టక్ షాక్ లేదా చివరి దశకు చేరినప్పుడు.. చాలా తక్కువ రక్తపోటు కాంతిహీనత మూత్ర విసర్జన తక్కువగా లేదా లేదు గుండె దడ అవయవాలు పనిచేయకపోవడం చర్మ దద్దుర్లు (చదవండి: దంగల్ నటి సుహాని భట్నాగర్ మృతికి ఆ వ్యాధే కారణం! వెలుగులోకి షాకింగ్ విషయాలు!) -
బీజేపీ విజయానికి.. కాంగ్రెస్ ఓటమికి.. ఐదు కారణాలివే!
రాజస్థాన్ ఎన్నికల ఫలితాల్లో ఏడు డివిజన్లలో భిన్నమైన తీరుతెన్నులు కనిపించాయి. జైపూర్ డివిజన్ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. డివిజన్లోని 50 స్థానాలకు గాను గతసారి బీజేపీ 10 స్థానాల్లో విజయం సాధించగా, ఈసారి 26 స్థానాల్లో విజయం సాధించి కాంగ్రెస్‌ను వెనక్కు నెట్టివేసింది. ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ విజయానికి కారణాలేమిటి? కాంగ్రెస్ ఓటమికి కారణాలేమిటనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. రాజకీయ నిపుణులు దీనిపై విశ్లేషణ అందించారు. బీజేపీ విజయానికి ఐదు కారణాలు పార్టీలో ఐక్యత నెలకొంది. నేతలంతా అభ్యర్థులు ఇబ్బందులు పడకుండా చూసుకున్నారు. ప్రధాని మోదీ పాలనే అజెండాగా రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీకి దిగడం లాభదాయకంగా మారింది. టికెట్ల కేటాయింపులో రాష్ట్రానికి చెందిన నేతలందరి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవడం ప్రయోజనకరంగా మారింది. ఎన్నికల ప్రచారంలో జాతీయ నేతలతో పాటు రాష్ట్ర నేతలు కూడా అన్ని ప్రాంతాలలో పర్యటించారు. ‘సనాతనం’ అంశంతో ఓట్లర్లను ఆకర్షించేందుకు బీజేపీ చేసిన ప్రయత్నం కలిసివచ్చింది. కాంగ్రెస్ ఓటమికి ఐదు కారణాలు రాష్ట్రంలోని సీనియర్ నేతల మధ్య తలెత్తిన వర్గపోరు కారణంగా కార్యకర్తల ఐక్యతలో చీలిక ఏర్పడింది. టిక్కెట్ల కేటాయింపులో సీనియర్ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో ప్రత్యక్షంగా నష్టపోయారనే వాదన వినిపిస్తోంది. బ్యాడ్ ఇమేజ్ ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులకు కూడా టిక్కెట్లు కేటాయించారు. పార్టీ నేతలు మితిమీరిన ప్రకటనలు చేయడంతో ప్రజలు వాటిని నమ్మలేదు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరగడం కాంగ్రెస్ పాలనపై ప్రతికూల ప్రభావం చూపింది. ఇది కూడా చదవండి: రాజస్థాన్‌కు యూపీ సీఎం.. కారణమిదే! -
మీ నవ్వులు చూడాలనుకుంటున్నా– విజయ్ దేవరకొండ
‘‘నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నా సక్సెస్‌లో, ఫెయిల్యూర్స్‌లో ఇంత ప్రేమ ఇచ్చిన మీకు(ఫ్యాన్స్) థ్యాంక్స్. జీవితంలో చాలా మారాయి. ఎత్తు, పల్లాలు చూస్తున్నా. నా చుట్టూ మనుషులు మారుతున్నారు.. నా గురించి ఏదో మాట్లాడతారు. కానీ, మీ (ఫ్యాన్స్) ప్రేమ స్థిరంగా ఉంటుంది.. అందుకే సెప్టెంబర్ 1న మీ మొహాల్లో నవ్వులు చూడాలనుకుంటున్నా’’ అని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 1న విడుదలవుతోంది. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన ‘ఖుషి మ్యూజికల్ కన్సర్ట్’ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ–‘‘నీ మొహంలో నవ్వు చూడాలని మాత్రమే పనిచేస్తున్నా’ అంటూ గత నెల రోజులుగా చెబుతున్నాడు శివ నిర్వాణ. నాక్కూడా నవ్వులు చూడాలని ఉంది. కానీ, నాకంటే ఎక్కువగా సమంత మొహంలో నవ్వులు చూడాలని ఉంది. తను ఈ సినిమా కోసం ఎంతో కష్టపడింది. అలాగే శివ నిర్వాణలోనూ నవ్వులు చూడాలనుంది’’ అన్నారు. సమంత మాట్లాడుతూ–‘‘మీ కోసం(అభిమానులు, ప్రేక్షకులు) కష్టపడుతున్నాను.. తిరిగి ఆరోగ్యంగా వస్తాను.. ‘ఖుషి’తో బ్లాక్ బస్టర్ ఇస్తానని మీకు మాట ఇస్తున్నాను’’ అన్నారు. శివ నిర్వాణ మాట్లాడుతూ–‘‘ఖుషి’ చూస్తే మీకు(ప్రేక్షకులు) విజయ్, సమంత కనిపించరు.. విప్లవ్, ఆరాధ్య మాత్రమే కనిపిస్తారు. సినిమా చూసి బయటికెళ్లేటప్పుడు ఈ మూవీని మరోసారి చూద్దామనిపిస్తుంది’’ అన్నారు. ‘‘డియర్ కామ్రేడ్’ మేము అనుకున్నంత విజయం సాధించలేదు. కానీ ‘ఖుషి’ పెద్ద హిట్ కాబోతోంది’’ అన్నారు నవీన్ యెర్నేని. ‘‘శివ నిర్వాణతో మా బ్యానర్లో మరో సినిమా చేయనున్నాం’’ అన్నారు వై.రవిశంకర్. ‘‘ఖుషి మ్యూజికల్ కన్సర్ట్’కి విచ్చేసిన విజయ్, సమంతలకి థ్యాంక్స్. ఈ వేడుకని గ్రాండ్‌గా చేసేందుకు సహకారం అందించిన నవీన్, రవిశంకర్, దినేశ్గార్లకు కృతజ్ఞతలు’’ అన్నారు చిత్ర సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహబ్. ఈ కార్యక్రమంలో మైత్రీ మూవీస్ సీఈవో చెర్రీ, కెమెరామేన్ జి.మురళి, డైరెక్టర్ అనిల్ రావిపూడి తదితరులు పాల్గొన్నారు. -
తప్పులు చేయకపోతే...???
సర్వసాధారణంగా లోకంలో ..ఎవరయినా విజయం సాధిస్తే..దానికి వారు ఎంత కష్టపడిందీ పదేపదే చెప్పుకుని పొంగిపోతుంటారు. అది సహజం కూడా. కానీ అపజయం ఎదురయితే మాత్రం... ‘మనం చేయాల్సింది చేశాం కానీ ఫలితం లేకపోయింది’ అంటారు.. అంటే విజయం అయితే తన స్వంతం. అదే వైఫల్యం చెందితే అందరినీ కలుపుకుంటారు. తన వైఫల్యాన్ని అంగీకరించరు..ఇది కూడా ఎక్కువగా చూస్తుంటాం. కానీ విశ్వవిఖ్యాత భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ విజేత, రామన్ ఎఫెక్ట్ సష్టికర్త సర్ సివి రామన్ ఏమంటారంటే... ‘‘ఎక్కడ నేను వైఫల్యం చెందానో దానికి యజమానిని నేను. నేనే కర్తను, నేనే భోక్తను, నేనే దానికి పూర్తిగా బాధ్యుణ్ణి. అసలు నేను వైఫల్యం చెందకపోతే .. నేను నేర్చుకోవడం ఎలా సాధ్యపడుతుంది!!!’’– అని. దిద్దుకుందామన్న స్పృహ లేకపోతే దోషం కానీ, దిద్దుకోవడానికి సిద్ధంగా ఉండి.. తాను పొందిన వైఫల్యాలను అనుభవంగా స్వీకరించి, అది నేర్పిన పాఠాలతో మరింత జాగ్రత్తగా తమ ప్రయత్నాలను కొనసాగిస్తానంటే... ఇక సమస్యే ముంది!!! నిజానికి అందరిలో ఉండాల్సిన లక్షణం అది. సుందరకాండలో స్వామి హనుమ... ‘‘నాలుగు అంగుళాలు కూడా వదలకుండా లంకా పట్టణమంతా గాలించేసాను. సీతమ్మ కనబడలేదు. అంటే సీతమ్మ ఇక్కడ లేదేమో.. సీతమ్మ క్షేమ సమాచారం లేకుండా నేను తిరిగి వెడితే..అక్కడ రాముడు శరీరం వదిలేస్తాడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయి, కోసల రాజ్య ప్రజలు, వానర రాజ్యంలో ఉన్నవాళ్ళు...అందరూ హతాశులైపోతారు. నేను వెళ్ళి సీతమ్మ సమాచారం దొరకలేదని చెప్పి ఇంతమందిని బాధపెట్టడం కంటే ఈ సముద్రపు ఒడ్డున కూర్చుని ప్రాయోపవేశం చేస్తాను. శరీరం వదిలేస్తాను’’ అన్నాడు... హనుమ అంత బలశాలి లంకంతా వెతికి సీతమ్మజాడ తెలియకపోతే... ఎంత నిరాశ, ఎంత నిస్పృహæ... అది కొద్దిసేపే... వెంటనే తన బాధ్యతలను గుర్తు చేసుకున్నాడు.. ‘అసలు మనిషికి శోకం పొందకుండా ఉండడం, బాధ పడకుండా ఉండడం, వైఫల్యానికి బాధపడినా దాన్ని విడిచి మళ్లీ... దిద్దుకుని ఉత్సాహం పొంది ఎక్కడ వైఫల్యం చెందాడో అక్కడ తిరిగి విజయం అందుకోవడానికి సాధన మొదలుపెట్టడం ముఖ్యం’ అనుకున్నాడు. ఎక్కడ వస్తువు పోగొట్టుకున్నామో అక్కడ వెతికితే ఫలితం... ఎక్కడ వైఫల్యం చెందామో అక్కడ విజయం సాధిస్తే అది ఇచ్చే తృప్తి, అది నేర్పిన పాఠం, అది నేర్పిన అనుభవం ఎప్పటికీ గుర్తుండిపోతాయి... అటువంటి పరిస్థితులు ఎదురయినప్పుడు మరింత స్ఫూర్తినిస్తాయి... అన్న వివేకం మనల్ని ముందుకు నడిపించడమే గాక మరిన్ని విజయాలను రుచి చూపిస్తుంది. అంతే తప్ప నేనేది చేసినా ఇంతే... అయినా నాకా శక్తి ఎక్కడిది.. అని నిరాశపడితే జీవితం ముందుకు కదలదు. మేడమీద ఉన్న కిటికీలోంచి ఇద్దరు వ్యక్తులు బయటికి చూస్తే... ఒకడికి కింద ఉన్న బురదనేల, మురికి కనిపించి నిరాశ పరిస్తే.. మరొకడికి ఆకాశంలో నక్షత్రాలు, చంద్రుడు, వెలుగులు కనిపించి మురిపిస్తాయి. వాళ్ళ దక్పథాల్లోనే తేడా.. ఆశావాదం ఉన్న వాళ్లు జీవితంలో వృద్ధిలోకి వస్తారు... నిరాశావాదులు నిరాశను ప్రయత్నపూర్వకంగా వదిలించుకోవాలి. రామన్ చెప్పినట్లు వైఫల్యాలను మనసారా అంగీకరిస్తే... అది మనల్ని ఎన్నటికీ నిరాశపరచకపోగా... కొత్త శక్తినిస్తుంది. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
టీడీపీ బస్సు యాత్ర అట్టర్‌ప్లాప్.. ఎందుకిలా జరుగుతోంది?
అదేంటో తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా ఫెయిల్ అవుతోంది. తాజాగా భవిష్యత్ గ్యారెంటీ అనే పేరుతో ఐదు ప్రాంతాల నుంచి బస్సు యాత్ర ప్రారంభించారు పచ్చ నేతలు. ఎక్కడా జనం ఈ పచ్చ బస్సుని పట్టించుకోవడంలేదు. అనంతపురం నుంచి ప్రారంభమైన యాత్ర కూడా సేమ్. అయితే ఈ జిల్లాలో బస్సు యాత్రను టీడీపీ నేతలే బ్రేకులు వేస్తున్నారు. ఎందుకిలా జరుగుతోంది? ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం బస్సు యాత్రకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో టీడీపీ చేపట్టిన ఈ బస్సు యాత్రకు ఆ పార్టీ శ్రేణులే ఆటంకాలు కల్పిస్తున్నాయి. శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో ఈనెల 23న ప్రారంభమైన బస్సు యాత్ర 30వ తేదీ వరకు ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ సాగాల్సి ఉంది. అయితే గ్రూపు రాజకీయాల కారణంగా మడకశిర నియోజకవర్గంలో బస్సు యాత్రను టీడీపీ అధిష్టానం రద్దు చేసింది. 26వ తేదీన మడకశిరలో బస్సు యాత్ర జరగాల్సి ఉంది. ఆ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఈరన్నకు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు కొనసాగుతున్నాయి. మడకశిర నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న ఈరన్న ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరగాల్సి ఉంది. ఈరన్న నాయకత్వంలో తాము పనిచేసేది లేదని గుండుమల తిప్పేస్వామి వర్గం పార్టీ నాయకత్వానికి స్పష్టం చేసింది. బస్సుయాత్రలో ఈరన్న పాల్గొంటే ఖచ్చితంగా అడ్డుకుంటామని తిప్పేస్వామి వర్గం అల్టిమేటం జారీ చేసింది. యాత్ర ఆగిపోయి పరువు ఎక్కడ పోతుందో అని భయపడిన టీడీపీ నాయకత్వం ఏకంగా మడకశిర నియోజకవర్గంలో బస్సు యాత్రను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రాప్తాడు నియోజకవర్గంలో యాత్రను దారి మళ్లించి బ్రతికిపోయింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో వాస్తవానికి బస్సు యాత్ర ప్రారంభం నుంచే టీడీపీ నేతల గ్రూపు రాజకీయాలు చంద్రబాబుకు తలనొప్పిగా మారాయి. చదవండి: ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే వైఎస్సార్సీపీదే జయభేరీ కదిరి నియోజకవర్గంలో అత్తార్ చాంద్ భాషా అసంతృప్తిగా ఉన్నారు. పెనుకొండ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారది, స్థానిక నేత సవితమ్మ ఢీ అంటే ఢీ అంటున్నారు. పెనుకొండలో జరిగిన బస్సు యాత్రలో రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. పరస్పర నినాదాలు, తోపులాటలతో బీకే, సవిత వర్గాలు ఆధిపత్యాన్ని చాటుకునేందుకు యత్నించాయి. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనటంతో రెండు వర్గాలవారిని పోలీసులు చెదరగొట్టారు. అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీలో రెండు మూడు గ్రూపులు ఉండటంతో బస్సు యాత్ర ఉద్దేశం దారి తప్పుతోంది. భవిష్యత్తు గ్యారెంటీ ప్రజలకు కాదు...ముందు తమకు ఇవ్వాలని టీడీపీ అసమ్మతి నేతలు స్పష్టం చేస్తూ ఉండటంతో పచ్చ పార్టీ పరువు బజారున పడుతోంది. చదవండి: ‘ఈనాడు’ అసలు బాధ అదేనా?.. ఎందుకీ పడరాని పాట్లు..! మరోవైపు బస్సు యాత్రకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన రావడంలేదు. ప్రజలే పట్టించుకోనపుడు ఈ యాత్ర వల్ల ఉపయోగం ఏముందని టీడీపీ సీనియర్లే ప్రశ్నించుకుంటున్నారు. అనవసరంగా యాత్ర ప్రారంభించామని, మధ్యలో ఆపలేమని లోలోన మదనపడుతున్నట్లు టాక్ నడుస్తోంది. -
టైటాన్ మిస్సింగ్.. ఎలాన్ మస్క్‌కు బిగ్ ఫెయిల్యూర్..?
111 ఏళ్ల కిత్రం సముద్రంలో మునిగిపోయిన భారీ నౌక టైటానిక్ శకలాలను చూసేందుకు వెళ్లిన జలాంతర్గామి మంగళవారం గల్లంతయ్యింది. ఓషన్‌గేట్ ఎక్స్‌పెడిషన్స్ నిర్వహిస్తున్న ఈ టూరిస్ట్ క్రాఫ్ట్ ఆదివారం యాత్రను ప్రారంభించింది. మొదలైన రెండు గంటలలోపే కమ్యూనికేషన్ కోల్పోయింది. అయితే.. ప్రముఖ స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ సర్వీస్ టైటాన్ యాత్రకు కమ్యునికేషన్ సర్వీస్‌ను అందిస్తోంది. దీంతో స్టార్‌లింక్ సర్వీస్ నిర్వాహణ తీరుపై కూడా విమర్శలు ఎదురువుతున్నాయి. Despite being in the middle of the North Atlantic, we have the internet connection we need to make our #Titanic dive operations a success - thank you @Starlink! pic.twitter.com/sujBmPr3JD — OceanGate Expeditions (@OceanGateExped) June 1, 2023 సాంకేతిక సమస్యా..? జలాంతర్గామి గల్లంతవడానికి ఇంటర్నెట్ ఒకటే సమస్య అని ఖచ్చితంగా చెప్పలేం. ఇతర సాంకేతిక సమస్యలు కూడా ఉండొచ్చు. కమ్యునికేషన్ కోల్పోయిన తర్వాత కూడా సబ్‌మెరైన్ పైకి రావడానికి కావాల్సిన వ్యవస్థ అందులో ఉంది. కానీ ఇప్పటివరకు జలాంతర్గామి జాడ తెలియకపోవడం ఇతర టెక్నికల్ సమస్యలను సూచిస్తోంది. The wreck of the Titanic lies about 400 miles off the coast of Newfoundland. Without any cell towers in the middle of the ocean, we are relying on @Starlink to provide the communications we require throughout this year’s 2023 Titanic Expedition. More: https://t.co/F7OtKI0En7 pic.twitter.com/wr7HeKlGjj — OceanGate Expeditions (@OceanGateExped) June 14, 2023 ఈ ప్రమాదంపై కమాండ్ షిప్లో విధులు నిర్వహించిన డేవిడ్ పోగ్ మరో కోణాన్ని వెల్లడించారు. జలాంతర్గామికి కమ్యూనికేషన్ పోయిన తర్వాత కూడా షార్ట్ మెసేజ్ చేయడానికి అవకాశం ఉంటుందని పోగ్ తెలిపారు. కానీ అదేమీ జరగలేదని చెప్పారు. అయితే.. సబ్‌మెరైన్ పరిస్థితులను బయటకు చెప్పకుండా కమాండ్ షిప్లో ఇంటర్నెట్ను నిలుపుదల చేస్తారని చెప్పారు. ఇదీ చదవండి: టైటానిక్ శిథిలాలను చూసేందుకు వెళ్లిన సబ్ మెరైన్ గల్లంతు.. అందులో పాక్ అత్యంత ధనవంతుడు ఖాతరు చేయలేదు..? జలాంతర్గామి వెల్లదలచిన లోతుపై గతంలో అభ్యంతరం వ్యక్తం చేసినట్లు ఓషన్‌గేట్‌కు చెందిన ఉద్యోగి డేవిడ్ లిచర్డ్ తెలిపారు. గతంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన షాంపిల్స్‌లో కూడా ఆయన అనేక లోపాలను గుర్తించినట్లు చెప్పారు. 4 వేల మీటర్ల వరకు జలాంతర్గామిని తీసుకువెళ్లడానికి సంస్థ నిర్ణయించింది. కానీ 1300 మీటర్ల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. ఈ అంశంపై మాట్లాడిన ఉద్యోగులను సంస్థ తొలగించినట్లు డేవిడ్ తెలిపారు. చర్చలతో ఆ వివాదం ముగిసినట్లు వెల్లడించారు. Wow. OceanGate, the company that owns the missing submersible, fired an employee a few years ago after he filed safety complaints against them. The employee specifically said the sub was not capable of descending to such extreme depths before he was fired.https://t.co/c3s2H3eVEr — Caroline Orr Bueno, Ph.D (@RVAwonk) June 20, 2023 స్టార్ లింక్కూ వైఫల్యమే..? ఏదేమైనా ప్రస్తుతం జలాంతర్గామి గల్లంతవడంతో అనేక లోపాలు బయటపడుతున్నాయి. ఈ అంశంపై స్టార్ లింక్ సంస్థ గానీ, ఎలాన్ మస్క్ గానీ ఇప్పటివరకు స్పందించలేదు. మరి.. కమ్యునికేషన్ అంశంలో లోపాలపై ఎలాన్ మస్క్ సంస్థ స్టార్ లింక్‌కు కూడా ఇది పెద్ద వైఫల్యంగా మారుతుంది. ఇదీ చదవండి: టైటాన్ మిస్సింగ్‌కి రెండురోజులు.. ఆక్సిజన్ అయిపోతోంది.. కొన్ని గంటలే! వాళ్ల జాడేది? -
ఇండిగో విమానం ఇంజీన్ ఫెయిల్: అత్యవసర ల్యాండింగ్!
న్యూఢిలీ: బడ్జెట్ ధరల విమానయాన సంస్థ ఇండిగో విమానానికి భారీ ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ వెళ్తున్న ఇండిగో విమానం ఇంజన్ ఒకటి ఫెయిల్ కావడంతో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఇంజీన్ లోపాన్ని గుర్తించిన వెంటనే పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కి సమాచారమిచ్చిన పైలట్ అత్యవసర ల్యాండింగ్ అనుమతి తీసుకున్నారు. అనంతరం విమానాన్ని వెనక్కి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణీకులంతా క్షేమంగా ఉన్నట్టు తెలుస్తోంది. బుధవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఎయిర్ టర్న్బ్యాక్కు కారణాన్ని ఇంకా ధృవీకరించలేదు. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. -
కిమ్‌కు తొలిసారి షాక్! ఉత్తర కొరియా నిఘా ఉపగ్రహ ప్రయోగం విఫలం
సియోల్: ఉత్తర కొరి యోలో కిమ్ ప్రభు త్వం మిలటరీ కార్యక లాపాలకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. వరస పెట్టి క్షిపణి పరీక్షలు నిర్వహిస్తున్న ఆ దేశం తొలిసారిగా ప్రయోగించిన నిఘా ఉపగ్రహం విఫలమైంది. ఉపగ్రహాన్ని తీసుకువెళుతున్న రాకెట్ రెండో దశ సమయంలో కనెక్షన్ తెగిపోయినట్టు ఉత్తర కొరియా అధికారిక న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఉపగ్రహ ప్రయోగం వైఫల్యానికి గల కారణాలను శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నట్టుగా వెల్లడించింది. ఉపగ్రహం శకలాలు కొరియాలోని ఉత్తరంవైపు సముద్ర జలాల్లో పడినట్టుగా తెలిపింది. ప్రయోగం విఫలమై రాకెట్ భూమిపైకి దూసుకువచ్చే సమయంలో అసాధారణంగా ప్రయాణించడంతో దక్షిణ కొరియా, జపాన్‌లు వణికిపోయాయి. రాకెట్ ఎక్కడ తమ భూభాగం మీద పడుతుందోనన్న భయంతో దేశ ప్రజలు అండర్ గ్రౌండ్లోకి వెళ్లిపొమ్మంటూ హెచ్చరించాయి. చివరికి రాకెట్ సముద్రంలో పడడంతో ఆ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. -
జయాపజయాలు
మానవ జీవితం ద్వంద్వాలమయం. కష్టసుఖాలు, కలిమిలేములు, జయాపజయాలు జీవన గమనంలో సహజ పరిణామాలు. జయాపజయాల గురించి మన సమాజంలో పట్టింపు మోతాదు కంటే ఎక్కువే! విజేతలకు వీరపూజలు చేయడం, పరాజితులను విస్మృతిలోకి తోసిపారేయడం సర్వ సాధారణం. అయితే, జయాపజయాలు దైవాధీనాలని ఆధ్యాత్మికవాదుల విశ్వాసం. ఎవరెన్ని సూక్తులు చెప్పినా, ఎవరూ గెలుపు కోసం ప్రయత్నాలను మానుకోరు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమకు గెలుపు దక్కాలనుకునే పట్టుదలతో పగ్గాలు విడిచిన గుర్రాల్లా దూసుకుపోయేవారు కొందరు ఉంటారు. గెలుపు కోసం ఎలాంటి అడ్డదారులు తొక్కడానికైనా, ఎంతటి నీచానికి దిగజారడానికైనా తెగబడేవారు ఇంకొందరు ఉంటారు. శక్తికి మించిన విజిగీషతో రగిలిపోయేవారు చరిత్రను రక్తసిక్తం చేస్తారు. అడ్డదారుల్లో పడి అడ్డదిడ్డంగా పరుగులు తీసి, అడ్డు వచ్చినవాళ్లను నిర్దాక్షిణ్యంగా తొక్కిపడేసి అందలాలెక్కుతారు. విజయోన్మత్తతను తలకెక్కించుకుని విర్రవీగుతారు. కాలం ఎప్పుడూ ఒక్కలాగానే ఉండదు. మార్పు దాని సహజ స్వభావం. కాలం మారి, పరిస్థితులు వికటించినప్పుడు విజేతలమనుకుని అంతవరకు విర్రవీగిన వారు పెనుతుపాను తాకిడికి కుప్పకూలిన తాటిచెట్లలా నేలకూలిపోతారు. మన పురా ణాల్లో దుర్యోధనుడు, మన సమీప చరిత్రలో హిట్లర్ వంటి వారు అలాంటి శాల్తీలే! ‘అజ్ఞానపు టంధయుగంలో/ తెలియని ఏ తీవ్రశక్తులో/ నడిపిస్తే నడిచి మనుష్యులు/ అంతా తమ ప్రయోజకత్వం/ తామే భువి కధినాథులమని/ స్థాపించిన సామ్రాజ్యాలూ/ నిర్మించిన కృత్రిమ చట్టాల్/ ఇతరేతర శక్తులు లేస్తే/ పడిపోయెను పేకమేడలై’ అన్నాడు మహాకవి శ్రీశ్రీ. అజ్ఞానపుటంధ యుగంలోనే కాదు, వర్తమాన అత్యాధునిక యుగంలోనూ పరిస్థితుల్లో పెద్ద మార్పు కనిపించడం లేదు. మొరటు బలం, మూర్ఖత్వం, మోసం, కుట్రలతో సాధించిన అడ్డగోలు విజయాలను తలకెక్కించుకుని, అదంతా తమ ప్రయోజకత్వంగా తలచి విర్రవీగే విజయోన్మత్తులలో దేశాధి నేతల మొదలుకొని చిల్లరమల్లర మనుషుల వరకు నేటికీ ఉన్నారు. ఇలాంటి వాళ్లలోనే దుర్యోధ నుడికి గుడి కట్టి పూజించేవాళ్లు, హిట్లర్‌ను ఆరాధించే వాళ్లు, లేని సుగుణాలను కీర్తిస్తూ నిరంకు శులకు బాకాలూదే వాళ్లు కనిపిస్తారు. గోబెల్స్‌కు బాబుల్లాంటి దుష్ప్రచార నిపుణులు నిర్విరామంగా ఊదరగొడుతూ, జీవితానికి గెలుపే పరమార్థమనే భావనకు ఆజ్యం పోస్తున్నారు. వీళ్ల ప్రభావం కారణంగానే ఓటమిని జీర్ణించుకోలేని తరం తయారవుతోంది. మనుషుల స్థితిగతులను గెలుపు ఓటములతోనే అంచనా వేయడం మన సమాజానికి అలవాటైపోయింది. గెలవాలనే ఒత్తిడి ఒకవైపు, ఓటమి భయం మరోవైపు బతుకుల్లో ప్రశాంతతను ఆవిరి చేస్తున్నాయి. పరీక్షలను ఎదుర్కొనే విద్యార్థుల నుంచి ఎన్నికలను ఎదుర్కొనే రాజకీయ నాయకుల వరకు ప్రతి ఒక్కరికీ ఈ ఒత్తిడి తప్పడం లేదు. గెలుపు ఒత్తిడి కొందరిని మానసికంగా కుంగదీస్తుంది. ఇంకొందరిని అడ్డదారులు తొక్కిస్తుంది. సమాజంలో ప్రబలుతున్న ఈ ధోరణిని సొమ్ముచేసుకోవడానికి కొందరు మేధావి రచయితలు విజయ సోపానమార్గాలను పుస్తకాలుగా అచ్చోసి జనాల మీదకు వదులుతారు. నానావిధ ప్రసార, సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిత్వ వికాస ప్రవచనాలతో ఊదరగొడతారు. ‘విజయానికి కావలసినది పదిశాతం ప్రేరణ, తొంభైశాతం కఠోర శ్రమ’ అన్నాడు థామస్ ఆల్వా ఎడిసన్. విద్యుత్తు బల్బును కనుక్కొనే ప్రయత్నంలో ఆయన వెయ్యి వైఫల్యాలను చవిచూశాడు. ‘విద్యుత్ బల్బును కనుక్కోవడంలో వెయ్యిసార్లు విఫలమై, ఇప్పుడు సాధించారు కదా! ఇప్పుడు మీకేమనిపిస్తోంది?’ అని ఒక పాత్రికేయుడు ఆయనను ప్రశ్నించాడు. ‘వెయ్యిసార్లు నేను విఫలమవలేదు. వెయ్యి అంచెల తర్వాత విద్యుత్ దీపాన్ని కనుక్కోగలిగాను’ అని బదులిచ్చాడాయన. వైఫల్యాలే విజయానికి సోపానాలని గ్రహించడానికి ఎడిసన్ అనుభవమే మంచి ఉదాహరణ. గెలుపు కోసం ప్రయత్నించే వాళ్లు ఓటమికి కూడా మానసిక సంసిద్ధతతో ఉండాలి. ఓటమి ఎదురైనప్పుడు రెట్టించిన పట్టుదలతో పునఃప్రయత్నం చేయడానికి తగిన శక్తి యుక్తులను సమకూర్చుకోవడానికి తగిన ఓరిమితో ఉండాలి. ఈ రెండూ లోపించడం వల్లనే పరీక్షల్లో వైఫల్యం ఎదురైనప్పుడు అర్ధంతరంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారెందరో! స్వేచ్ఛగా జీవితాన్ని జీవించడమే ఒక సాఫల్యం. ఈ ఎరుక లేకనే చాలామంది జీవితాలను వ్యర్థం చేసుకుంటారు. చిల్లర గెలుపుల కోసం, పదవుల కోసం, పదవులను పదిలపరచుకోవడం కోసం అధికార బలసంపన్నుల ముందు సాగిలబడతారు. ‘వాని జన్మంబు సఫల మెవ్వాడు పీల్చు/ ప్రాణవాయువు స్వాతంత్య్ర భరభరితమొ/ పరుల మోచేతి గంజికై ప్రాకులాడు/ వాని కంటెను మృతుడను వాడెవండు?’ అన్నాడో చాటు కవి. ‘విజయమే అంతిమం కాదు. వైఫల్యమేమీ ప్రాణాంతకం కాదు’ అని తేల్చేశాడు బ్రిటన్ మాజీ ప్రధాని విన్స్టన్ చర్చిల్. కాబట్టి వైఫల్యం ఎదురైనంత మాత్రాన ముంచుకొచ్చే ముప్పేమీ ఉండదు. విజయం సాధించినంత మాత్రాన అమాంతంగా ఒరిగిపడే ఆకాశమూ ఉండదు. ‘వైఫల్యాల నుంచి ఏమీ నేర్చుకోకపోవడమే మన అసలు పొరపాటు’ అంటాడు అమెరికన్ పారిశ్రామికవేత్త హెన్రీ ఫోర్డ్. వైఫల్యాలే మనకు గుణపాఠాలు నేర్పే గురువులు. గురువులను గౌరవించడం మన సంప్రదాయం. వైఫల్యాలను గౌరవించడం, విజయాలను వినయంగా శిరసావహించడమే మన కర్తవ్యం! -
అఫ్ఘాన్ నుంచి యూఎస్ సేనల నిష్క్రమణలో వైఫల్యానికి కారణం అదే!
అఫ్ఘనిస్తాన్ నుంచి యూఎస్ బలగాలు నిష్క్రమిస్తున్న సమయంలో చోటు చేసుకున్న విషాద ఘటనలకు సంబంధించి సమీక్షను వైట్‌హౌస్ విడుదల చేసింది. సుదీర్థకాల నిరీక్షణల అనంతరం విడుదల చేసిన ఈ సమీక్షలో ఎన్నో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. సరిగ్గా ఆగస్టు 2021 నాటి బలగాల ఉపసంహరణ సమయంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న జో బైడెన్ వైపల్యాలపై దర్యాప్తు చేపట్టింది అమెరికా భద్రతా మండలి. ఈ మేరకు జాదీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ నాటి నిష్క్రమణలో పొరపాట్లు జరిగాయిని అంగీకరించారు. అందువల్లే కొద్ది వారల్లోనే తాలిబాన్లు అఫ్ఘనిస్తాన్‌ను నియంత్రణలోకి తెచ్చుకుని స్వాధీనం చేసుకుంది. చివరికి అమెరికన్ బలగాలు, దాని మిత్ర దేశాలు అప్పటికప్పుడూ అకస్మాత్తుగా నిష్క్రమించక తప్పలేదంటూ సంచలన విషయాలను బయటపెట్టారు. ఏ యుద్ధమైన ముగించడం అనేది అంత తేలికైన పని కాదన్నారు. ఈ నిష్క్రమణలో దారితీసిన పరిస్థితులకు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కారణమని పేర్కొన్నారు. అలాగే అమెరికా గూఢచార్యం అఫ్ఘాన్‌లోని తాలిబాన్లు బలాన్ని, అక్కడి ప్రభుత్వ బలహీనతలను అంచనా వేయడంలో పూర్తిగా విఫలమైనట్లు తెలిపారు. అందుకు సంబంధించి ఇంటిలిజెన్స్ సరైన స్పష్టత ఇవ్వకపోవడంతోనే అలాంటి ఘటనలు తలెత్తాయని కిర్బీ చెప్పారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ తన పరిపాలన హయాంలో 2020లో తాలిబాన్లతో చేసుకున్న ఒప్పందంలో పలు లోపాలున్నాయని , ఇది ఒకరకంగా బైడెన్ పాలనను ఏ నిర్ణయం తీసుకోలేని సందిగ్ధంలో పడేసిందన్నారు. దీంతో బైడెన్‌కి నిష్క్రమణ అనే పదాన్ని వెనక్కి తీసుకోలేని విపత్కర పరిస్థితి ఎదురవ్వడంతో.. ఆయన మరికొంత మంది యూఎస్ బలగాలను అఫ్ఘాన్ పంపించే సాహసం చేయలేకపోయినట్లు తెలిపారు. అలాగే ట్రంప్ తన పదవికాలం ముగింపు సమయంలోని చివరి 11 నెలలు నుంచి అఫ్ఘాన్‌లో యూఎస్ బలగాల ఉనికిని క్రమంగా తగ్గించారని, తదనంతరం జనవరిలో బైడెన్ అధ్యక్షుడిగా చేపట్టే సమయానికి కేవల 2500 మంది సిబ్బంది మాత్రమే ఉన్నట్లు నివేదిక పేర్కొంది . కాగా, కాబుల్‌లో ఆగస్టు 26న యూఎస్ బలగాల నిష్క్రమణ సమయంలో అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో సుమారు 13 యూఎస్ దళాలు, 170 మంది అఫ్ఘాన్లు మరణించిన సంగతి తెలిసింది. దీంతో యూఎస్ కొన్ని విమానాలను పంపించి బలగాలను వెనక్కి తీసుకొస్తున్న క్రమంలో..అక్కడి అఫ్ఘాన్ పౌరుల తాలిబాన్లను నుంచి తప్పించుకునేందుకు విమానాలను చుట్టుమట్టిన దిగ్బ్రాంతికర దృశ్యాలు అందర్నీ కలిచి వేశాయి. (చదవండి: కిడ్నాప్ నాటకంతో డబ్బుల కాజేయాలనుకుంది..కానీ చివరికీ ఆ భార్య..) -
చేష్టలుడిగిన భద్రతా మండలి: కొరోసీ
ఐరాస: అత్యంత శక్తిమంతమైన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి పూర్తిగా చేష్టలుడిగిందని ఐరాస సర్వప్రతినిధి సభ అధ్యక్షుడు సబా కొరోసీ వాపోయారు. వర్తమాన కాలపు వాస్తవాలను అది ఎంతమాత్రమూ ప్రతిబింబించడం లేదంటూ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘యుద్ధాలను నివారించి అంతర్జాతీయ శాంతిభద్రతలను పరిరక్షించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన మండలి ఆ బాధ్యతల నిర్వహణలో విఫలమవుతోంది. దానికి కారణమూ సుస్పష్టం. దాని శాశ్వత సభ్య దేశాల్లోనే ఒకటి పొరుగు దేశంపై దురాక్రమణకు పాల్పడి ప్రపంచాన్ని తీవ్ర ప్రమాదంలోకి, సంక్షోభంలోకి నెట్టింది. ఈ దుందుడుకుతనానికి గాను రష్యాపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన భద్రతా మండలి శాశ్వత సభ్య దేశాల వీటో పవర్ కారణంగా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పడింది. అందుకే మండలిని సంస్కరించాల్సిన అవసరం చాలా ఉంది. మండలి కూర్పు రెండో ప్రపంచ యుద్ధానంతరపు అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో జరిగింది. దాన్నిప్పుడు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవాలి’’ అని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ సంస్థల పనితీరు ఎలా ఉండాలనే విషయంలో రష్యా దురాక్రమణ పెద్ద గుణపాఠంగా నిలిచిందన్నారు. భారత పర్యటనకు వచ్చిన కొరోసీ పీటీఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. -
ప్లీజ్.. తమ్ముళ్లూ ప్లీజ్.. టీడీపీ నేతలకు చంద్రబాబు లాలింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధఃపాతాళానికి కూరుకుపోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ దారుణ ఓటములు. విపక్ష పార్టీగా అన్నీ వైఫల్యాలు. పార్టీ, అగ్రనేతలపై జనం ఏవగింపు. వచ్చే ఎన్నికల్లోనూ గెలిచే అవకాశాల్లేవని అర్థం చేసుకున్న నేతలు. నియోజకవర్గాల వైపు చూడని వైనం. ఏతావాతా 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబులో తీవ్ర ఆందోళన. దయచేసి నియోజకవర్గాలకు వెళ్లాలని వేడుకొంటున్నారు. వారిని పిలిచి బుజ్జగిస్తున్నారు. చదవండి: టీడీపీలో వర్గ విభేదాలకు ఆజ్యం పోస్తున్న వాసు, బీటెక్ రవి పార్టీ కోసం పనిచేయాలని, మున్ముందు పార్టీకి ఊపు వస్తుందని నమ్మబలుకుతున్నారు. అయినా నేతల్లో పెద్దగా మార్పు కనిపించడంలేదని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. 2019 ఎన్నికల్లో, ఆ తర్వాత స్థానిక ఎన్నికల దెబ్బకు టీడీపీ ముఖ్య నేతలందరూ ప్రజల్లోకి వెళ్లడం మానేశారు. మూడేళ్లుగా వారంతా స్తబ్దుగా ఉన్నారు. చంద్రబాబు మరీ ఒత్తిడి తెస్తే అప్పుడప్పుడు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి, తాము ఉన్నామని చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో తనకు అనుకూలం గా ఉండే ఎల్లో మీడియా, సోషల్ మీడియా ద్వారానే చంద్రబాబు పార్టీని నడుపుకుంటూ వస్తున్నారు. రకరకాల అంశాలపై ఆందోళనలు చేయాలని ఇస్తున్న పిలుపులకు కూడా పార్టీ నేతల నుంచి అస్సలు స్పందన ఉండడంలేదని సమాచారం. బాదుడే బాదుడు పేరుతో అన్ని నియోజకవర్గాల్లో విస్తృతంగా ఆందోళనలు చేయాలని చంద్రబాబు పదేపదే చెప్పినా నాయకులు పెద్దగా పట్టించుకోలేదు. మీడియాలో కనపడటం కోసం చేసే హడావుడి తప్ప ప్రజల్లోకి వెళ్లడంలేదని పార్టీ సీనియర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు యువతకు 40 శాతం సీట్లిస్తామనే పల్లవి అందుకున్నారు. యువతను ప్రోత్సాహించేందుకు ఈ నిర్ణయమని బయటకు చెప్పుకుంటున్నా.. నాయకుల కొరత వల్లే నిర్ణయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నియోజకవర్గాల్లో స్పందన కరువు ఈ మూడేళ్లలో చంద్రబాబు ఇచ్చిన కార్యక్రమాలకు కనీసం సగం నియోజకవర్గాల నుంచి కూడా స్పందన రాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 175 నియోజకవర్గాలకుగాను 70కి పైగా నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలే లేరు. కొన్నిచోట్ల ఇన్చార్జిలు ఉన్నా అలంకారం కోసమే. కృష్ణా జిల్లా గన్నవరం ఇన్చార్జిగా ఉన్న పార్టీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు అసలు నియోజకవర్గానికి వెళ్లడమే లేదని పార్టీ నేతలే చెబుతున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి బాధ్యుడి నియామకమే జరగలేదు. టీడీపీకి పట్టున్నట్లుగా చెప్పుకునే ఈ రెండు కీలక నియోజకవర్గాల్లోనే పార్టీ పరిస్థితి ఇలా ఉంటే మిగతా నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చని అంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు చక్రం తిప్పిన ప్రత్తిపాటి పుల్లారావు, గంటా శ్రీనివాసరావు, నారాయణ వంటి అనేక మంది నేతలు ఇప్పుడు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మెజారిటీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి దయనీయంగా ఉందని చంద్రబాబు చేయించిన సర్వేల్లో కూడా తేలినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే రోజుకు 4 నియోజకవర్గాల ఇన్చార్జిలతో సమావేశమవుతున్నారు. పారీ్టకి మంచి భవిష్యత్తు ఉందని, నియోజకవర్గంలో పనిచేయాలని కోరుతున్నారు. నియోజకవర్గాల్లో సమస్యలపై ఆందోళనలు చేయాలని సూచిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ మీదేనంటూ ఇన్చార్జిలకు హామీ ఇస్తున్నారు. ఇప్పటివరకు 60కి పైగా నియోజకవర్గాల నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. అయినా, పెద్దగా ఉపయోగం కనిపించడంలేదని, చంద్రబాబు ఎంత బతిమిలాడినా భవిష్యత్తుపై నమ్మకం లేక ముఖ్య నేతలు నియోజకవర్గాలకు రావడంలేదని కొందరు నేతలు తెలిపారు. -
హెచ్‌సీఏ ఘోర వైఫల్యం.. 32 వేల టిక్కెట్లు ఎక్కడికి పోయాయి?
సాక్షి, హైదరాబాద్: ఆసీస్-భారత్ జట్ల మధ్య ఉప్పల్‌లో జరగబోయే మ్యాచ్ కోసం సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ వద్ద టికెట్ల అమ్మకాల్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA)ఘోర వైఫల్యం మూటగట్టుకుంది. టిక్కెట్లు కోసం ఒక్కసారిగా అభిమానులు తోసుకుని రావడంతో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హెచ్‌సీఏ తీరుపై తీవ్ర విమర్శలు వెలువెత్తున్నాయి. హెచ్‌సీఏ ఘోర వైఫల్యంపై ఆ అసోసియేషన్ మాజీ కార్యదర్శి శేష్ నారాయణ్ మండిపడ్డారు. 32 వేల టిక్కెట్లు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. చదవండి: ఉప్పల్ స్టేడియంలో ఇండియా– ఆస్ట్రేలియా మ్యాచ్.. అభిమానులతో ఆటలా! ‘‘ఒక్కరోజే ఇన్ని టిక్కెట్లు ఎలా అమ్ముదామనుకున్నారు. ఆన్లైన్లో అని చెప్పి ఆఫ్‌లైన్‌లోకి ఎందుకెళ్లారు?. హెచ్‌సీఏలో అజారుద్దీన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. తొక్కిసలాటకు ఆయనే బాధ్యత వహించాలి. 32 వేల టిక్కెట్లు అందుబాటులో ఉండాలి. టికెట్ల విక్రయానికి అన్ని చోట్ల కౌంటర్లు ఏర్పాటు చేయాలి. ఒక్కచోటే కౌంటర్ పెట్టడం సరికాదు. ఒక్కరోజే టికెట్లు విక్రయించడం సరికాదు. కనీసం నాలుగైదు రోజులు టికెట్లు విక్రయించాలి. ఆన్లైన్లో అమ్మిన టికెట్లలో అక్రమాలు జరిగాయి. ఎవరికి టికెట్లు అమ్మారో వివరాలు బయటపెట్టాలి’’ అని శేష్ నారాయణ్ డిమాండ్ చేశారు. -
సమస్యలను పక్కదారి పట్టించడానికే వైషమ్యాలు
మోదీ ప్రభుత్వం తన విధానాలతో దేశ ప్రజలను ఎనిమిదేళ్లుగా నానా తిప్పలు పెడుతోంది. ‘అచ్ఛే దిన్’ అంటూ అధికారంలోకి వచ్చారు. తమ పాలనతో ‘బురే దిన్’ చేశారు. నిత్యావసర ధరలు వంద శాతం పెరిగాయి. ఈ సమస్యలను పక్కదారి పట్టించడానికి మైజారిటీ, మైనారిటీ వర్గాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు. ‘‘ఎక్కువ తక్కువలు, కులమత భేదాలుండటం మానవజాతికి అవమానకరం’’ – మహాత్మా గాంధీ నేడు దేశాన్ని పాలిస్తున్నవారు జాతిపిత గాంధీజీ చెప్పిన మాటలకు పూర్తి భిన్నంగా వ్యవహరి స్తున్నారు. కుల, మత భేదాలు సృష్టించి దేశాన్ని విభజించే కుట్ర చేస్తున్నారు. దేశాభివృద్ధిని కోరు కుంటున్న ఏ ప్రభుత్వమైనా ప్రజలందరినీ సమాన దృష్టితో చూస్తుంది. కానీ దేశాన్ని ప్రస్తుతం పాలిస్తున్నవారి ఎజెండానే వేరు. ప్రజల మధ్య ఎంత వైషమ్యాలు పెరిగితే అది అంతగా తమకు లాభమనేది వారి ఆలోచన! ఇదేదో గాలికి చేస్తున్న విమర్శ కాదు. దేశంలో కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇదే అర్థమవుతుంది. ఓ వర్గం లక్ష్యంగా ఎప్పుడూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే జాతీయ పార్టీ నాయ కులు, వారికి తగ్గట్టు... ‘80 శాతం ఉన్న మనం’ అంటూ రాష్ట్రంలో యువత మెదళ్లలో మతతత్వపు పురుగును చొప్పిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి నెలకో ఇష్యూ చొప్పున తెరపైకి తెస్తున్నారు. జనవరిలో కర్ణాటకలో ‘హిజాబ్’ ఇష్యూతో దుమారం రేగింది. ఆ వివాదం నడుస్తుండగానే ‘హలాల్ మాంసం’ తినొద్దనీ, ముస్లింల షాపుల్లో వస్తువులు కొనొద్దనీ బీజేపీ పాలిత కర్ణాటకలో తీర్మానాలు చేశారు. అది సద్దుమణిగే లోపే ఫిబ్రవరిలో ‘కశ్మీరీ ఫైల్స్’ సినిమాతో మరో అగ్గి రాజేశారు. కశ్మీర్లో పండిట్లు, ఇతర వర్గాల మధ్య ఓ స్పష్టమైన విభజన రేఖను సృష్టించారు. ఈ సినిమాకు ప్రధానమంత్రి, హోంమంత్రి, కేంద్ర మంత్రులు ప్రచారకర్తలయ్యారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలు ఉచితంగా సినిమా షోలు నడిపించాయి. దీనిని బట్టి... బీజేపీది విభజన వాదమనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఏప్రిల్‌లో మహారాష్ట్రలో హనుమాన్ చాలీసా, లౌడ్ స్పీకర్లు అంటూ కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. మే నెలలో ఢిల్లీ షాహీన్ బాగ్ కూల్చి వేతలు మొదలు, తాజ్ మహల్, జ్ఞానవాపి మసీదు ఇష్యూ... వరకు అన్నీ ఓ వర్గాన్ని టార్గెట్ చేస్తున్న అంశాలే! ఎందుకీ రాద్ధాంతం? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ), నోట్ల రద్దు, కార్పొరేట్ల అనుకూల విధానాలు వంటివాటితో గత ఎనిమిదేళ్లలో ఘనత వహించిన మోదీ ప్రభుత్వం చేసిందేం లేదు. 8 ఏళ్ల క్రితం ‘అచ్ఛే దిన్’ (మంచిరోజులు) అంటూ అధికారంలోకి వచ్చారు. ఈ కాలంలో... ఉన్న అచ్చే దిన్ కాస్తా ‘బురే దిన్’ (చెడ్డ దినాలు) అయ్యాయి. పేదవాడు ఓ పూట బుక్కెడు బువ్వ తినాలంటే ఆస్తులు తాకట్టు పెట్టాల్సిన దుస్థితి దాపురించింది. నిత్యావసరాల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. మోదీ ప్రధాని అయినప్పటి నుంచీ ఇప్పటివరకు చూసుకుంటే వంట నూనె, పెట్రోల్, డీజిల్ ధరలు వంద శాతం పెరిగాయి. రూపాయి విలువ దిగజారిపోయింది. వంట గ్యాస్ సిలిండర్ ధర 2014లో రూ. 414 గా ఉంటే... ఇప్పుడు రూ. 1,052కు పెరిగింది. లీటర్ పెట్రోల్ ధర 2014లో రూ. 71 ఉంటే ఇప్పుడు రూ. 120కి పెరిగింది. లీటర్ డీజిల్ ధర 2014లో రూ. 55 ఉంటే ఇప్పుడు రూ.105కు పెరిగింది. ఇటీవల నామ్ కే వాస్తే కొంత తగ్గించారు. ద్రవ్యోల్బణం 30 ఏళ్ల గరిష్ఠానికి చేరింది. 42 ఏళ్లలో దేశ ఆర్థికవ్యవస్థ ఎన్నడూ లేనంత అత్యంత దారుణమైన పరిస్థితికి పడి పోయింది. నిరుద్యోగం 45 ఏళ్ల గరిష్ఠానికి పెరిగింది. కరోనా కాలంలో ఇచ్చిన ఉచిత రేషన్ తప్ప... కేంద్రం నుంచి పేదవాడికి వచ్చింది ఏమీ లేదు. రాష్ట్రాల నుంచి పన్నుల రూపంలో వస్తున్న ధనమంతా ఎక్కడపోతోంది? దాదాపు 25 ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మేశారు. మొత్తం 36 ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు ఉప సంహరణ ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం తలమునకలై ఉంది. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఆ ఆమ్దానీ అంతా ఎటు పోయింది? ఇప్పుడు దేశ ప్రజలు అడుగుతున్న ఈ ప్రశ్నలకు మోదీ సర్కారు దగ్గర సమాధానం లేదు. జవాబు చెప్పలేనప్పుడు... జవాబు చెబితే పదవి పోయే పరిస్థితి అయినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మోదీ సర్కారు చేస్తున్న పనే చేయాలి. అసలు విషయాన్ని పక్కదారి పట్టించాలి. కొత్తగా బలమైన అంశాన్ని తెరపైకి తీసుకురావాలి. అది కూడా మెజార్టీ ప్రజలకు సంబంధించిన అంశమై ఉండాలి. సున్నితమైన అంశమైతే పాత విషయం మరిచిపోవడమే కాదు... మైలేజీ పెరుగుతుంది. ఇప్పుడు మోదీ సర్కారు నూటికి నూరు శాతం చేస్తున్నది ఇదే. (👉🏾చదవండి: ఇవాళ మనకు కావాల్సింది ఇదీ!) బీజేపీ చేస్తున్న ఈ మతరాజకీయాన్ని ఆదిలోనే తుంచేయకుంటే దేశ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. భరతమాతకు మతం పేరుతో బీజేపీ వేస్తున్న సంకెళ్లను తెంచడం మనందరి బాధ్యత. (👉🏾చదవండి: కోటి ఎకరాల మాగాణి కల నిజమౌతుంది!) - వై. సతీష్ రెడ్డి తెరాస రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ -
డివిలియర్స్ చెత్త రికార్డు.. కలిసి రాని యూఏఈ
AB De Villiers Failure In IPl 2021 UAE.. ఐపీఎల్ 2021లో భాగంగా కేకేఆర్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. కరోనా విరామం తర్వాత సెకండ్‌ఫేజ్‌లో ఆర్సీబీ బ్యాటింగ్ విభాగంలో పడిక్కల్, కోహ్లి, మ్యాక్స్‌వెల్, కేఎస్ భరత్ కీలకపాత్ర పోషించారు. అయితే సీనియర్ బ్యాటర్ ఏబీ డివిలియర్స్‌కు మాత్రం యూఏఈ గడ్డ ఏమాత్రం కలిసిరాలేదు. ప్లేఆఫ్స్‌తో కలిపి డివిలియర్స్ 8 మ్యాచ్‌ల్లో 17.66 సగటుతో 106 పరుగులు మాత్రమే చేయగలిగాడు. 0,12,11,4, 23, 19, 26,11 ఇవి డివిలియర్స్ యూఏఈ గడ్డపై నమోదు చేసిన స్కోర్లు. ఇందులో ఒక గోల్డెన్ డక్ ఉండడం విశేషం. చదవండి: Virat Kohli: కెప్టెన్‌గా ఇదే చివరిసారి.. అంపైర్‌తో కోహ్లి వాగ్వాదం ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఎలిమినేటర్ మ్యాచ్‌లో కేకేఆర్ 4 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చేధించింది. కేకేఆర్ బ్యాటింగ్‌లో సునీల్ నరైన్ 26 పరుగులతో గేమ్ చేంజర్ కాగా.. గిల్ 29, వెంకటేశ్ అయ్యర్ 26, నితీష్ రాణా 23 పరుగులు చేశారు. అంతకముందు ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. సునీల్ నరైన్(4/21) బౌలింగ్‌లో మెరవడంతో ఆర్సీబీ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. కోహ్లి 39 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. పడిక్కల్ 21 పరుగులు చేశాడు. చదవండి: Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్‌గా ముగిసిన కథ pic.twitter.com/4duozs0Vnk — Cricsphere (@Cricsphere) October 11, 2021