విజయవాడ రైల్వే ఎస్పీ పి.శ్యాంప్రసాద్ సస్పెన్షన్ విషయంలో ఆంధ్రప్రదేశ్ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది.
-ఎస్పీ శ్యాంప్రసాద్ సస్పెన్షన్ ఉత్తర్వులు కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: విజయవాడ రైల్వే ఎస్పీ పి.శ్యాంప్రసాద్ సస్పెన్షన్ విషయంలో ఆంధ్రప్రదేశ్ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది. నిబంధనలకు విరుద్దంగా ఆయన్ను సస్పెండ్ చేశారని స్పష్టం చేసిన కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్)...సస్పెన్షన్ ఉత్తర్వులను కొట్టివేసింది. ఈ మేరకు క్యాట్ సభ్యులు వెంకటేశ్వర్‌రావు, రంజనాచౌదరిల నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. సస్పెన్షన్ కారణంగా ఆయన నష్టపోయిన అన్ని బెనిఫిట్స్‌ను ఇవ్వాలని అధికారులను ఆదేశించింది.
విజయవాడ రైల్వే ఎస్పీగా పనిచేస్తున్న శ్యాంప్రపాద్‌ను గత ఏడాది బదిలీ చేస్తున్నట్లు మౌఖికంగా చెప్పిన డీజీపీ కార్యాలయం అధికారులు వెంటనే ఆయన్ను హైదరాబాద్‌లో రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ ఆయన క్యాట్‌ను ఆశ్రయించారు. ఈ ఆదేశాలను తప్పుబట్టిన క్యాట్...ఆయన్ను అక్కడే కొనసాగించాలని ఆదేశించింది. ట్రిబ్యునల్ ఆదేశాలు అమలు చేయడం ఇష్టం లేని ఏపీ సర్కారు ... రైల్వే క్వార్టర్‌లో ఉంటూ అదనంగా హెచ్‌ఆర్‌ఏ తీసుకున్నారంటూ తప్పుడు అభియోగాలు మోపి సస్పెండ్ చేసింది.
రైల్వే ఎస్పీగా కొనసాగించాలన్న ట్రిబ్యునల్ ఉత్తర్వులను అమలు చేయలేదు’’ అని శ్యాంప్రసాద్ తరఫు న్యాయవాది సుధాకర్‌రెడ్డి తెలిపారు. అయితే చివరికి ఏపీ సర్కారు తీరును చట్టవిరుద్దమని క్యాట్ ప్రకటించిందని ఆయన తెలిపారు.