ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడతాం
– కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి
కర్నూలు (ఓల్డ్‌సిటీ): గ్రామాల్లో తిరిగి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడతామని కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక కళావెంకట్రావ్ భవనంలో డీసీసీ అధ్యక్షుడు పి.లక్ష్మిరెడ్డి అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోట్ల మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం 2013లో జాతీయ ఆహార భద్రత పథకం ప్రవేశపెట్టిందని, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఆ పథకాన్ని ఏర్పాటు చేసినట్లు గొప్పలు చెప్పుకోవడం విడ్డూరమన్నారు. పెద్దనోట్లు రద్దు చేసి సామాన్య ప్రజలను కష్టనష్టాలకు గురి చేశారన్నారు. బీజేపీ, టీడీపీలు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నాయని విమర్శించారు. డీసీసీ అధ్యక్షుడు పి.లక్ష్మిరెడ్డి మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయన్నారు. కా