kotla
-
వైఎస్సార్సీపీలోకి కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి
కోడుమూరు: అందరం జగనన్నకే జై కొడదామని, వైఎస్సార్సీపీలో చేరదామని కోట్ల వర్గీయులు ముక్తకంఠంతో ప్రకటించారు. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి సోదరుడు, కోడుమూరు మాజీ ఎంపీపీ కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి రాజకీయ భవిష్యత్‌పై నిర్ణయం తీసుకునేందుకు శనివారం కోడుమూరు పట్టణంలోని స్నేహవినాయక కల్యాణ మండపంలో నిర్వహించిన సమావేశానికి కోడుమూరు, గోనెగండ్ల, దేవనకొండ మండలాల పరిధిలోని కాంగ్రెస్ కార్యకర్తలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, మాజీ సర్పంచులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. జై జగన్..జై హర్ష నినాదాలతో కల్యాణ మండపం మార్మోగింది. ముందుగా మాజీ సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. టీడీపీ దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలను ఎదుర్కొవాలంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడమే సరైనదని స్పష్టం చేశారు. నా రాజకీయ శత్రువు టీడీపీనే రాజకీయంగా శాశ్వత శత్రువుగా ఉన్న టీడీపీతో పొత్తు పెట్టుకొని అనైతిక రాజకీయాలు చేసేందుకు ఆత్మాభిమానం అడ్డురావడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి తెలిపారు. జవసత్వాలు లేని కాంగ్రెస్ పార్టీలో మనుగడ సాధించలేనని తెలుసుకొని, తనను నమ్ముకున్న కార్యకర్తలు, కోట్ల అభిమానులను కాపాడుకోవాలంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే సరైన వేదిక అని ఆ పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. ఆలూరు, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ కార్యకర్తలతో సమాలోచనలు జరిపిన అనంతరం ఫిబ్రవరి 6వతేదీన వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరుదామన్నారు. తన సోదరుడు కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ఇతర పార్టీలతో జతకట్టి రాజకీయాలు చేద్దామన్న విషయాలు తన మనసును నొప్పించాయన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమవుతుందని, అందువల్లే వైఎస్సార్సీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నానని తెలియజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రఘునాథ్‌రెడ్డి, ప్యాలకుర్తి హర్షవర్దన్‌రెడ్డి, మాజీ సర్పంచు సీబీ లత, సింగిల్‌విండో అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు హేమాద్రిరెడ్డి, ఫైనాన్సియర్ వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచులు ఈశ్వరరెడ్డి, రామేశ్వరరెడ్డి గంగాధర్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, నక్క పరమేష్, మల్లారెడ్డి, తేనేశ్వరరెడ్డి, మాదులు, బోరెల్లి సోమన్న, టెలిఫోన్ రాముడు, పుట్టపాశం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆత్మీయ అనుబంధం
- జిల్లాలో మూడుసార్లు పర్యటించిన దర్శకరత్న కర్నూలు(కల్చరల్): సుప్రసిద్ధ సినీ దర్శకులు, మాజీ కేంద్ర మంత్రి, దర్శకరత్న దాసరి నారాయణరావుకు కర్నూలు జిల్లాతో ఆత్మీయ అనుబంధం ఉంది. జిల్లాలో దాసరి మూడుసార్లు పర్యటించి స్థానిక నాయకులు, కళాకారులు, రచయితలతో ముచ్చటించారు. దివంగత కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డితో దాసరి నారాయణరావుకు అత్యంత స్నేహపూర్వక అనుబంధం ఉండేది. చక్కని రాజకీయ సామాజిక విలువలు కలిగిన నేతగా విజయభాస్కర్‌రెడ్డిని దాసరి ఎంతగానో ఆదరించే వారు. విజయభాస్కర్‌రెడ్డి పరమపదించినపుడు ఆయన అంత్యక్రియల సందర్భంగా అంతిమయాత్రలో కర్నూలు నగర వీధుల్లో నడుచుకుంటూ పాల్గొన్నారు. స్థానిక కిసాన్ఘాట్ వద్ద జరిగిన అంత్యక్రియల్లో ఆయన భాస్కర్‌రెడ్డి భౌతికాయం వద్ద విషణ్ణవదనంతో నివాళులు అర్పించి కోట్ల కుటుంబాన్ని ఆప్యాయంగా పరామర్శించారు. విజయభాస్కర్‌రెడ్డి తనయుడు మాజీ కేంద్ర మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్రెడ్డితోనూ దాసరికి ఆత్మీయ అనుబంధం ఉంది. కర్నూలులో సుప్రసిద్ధ చలన చిత్రనటుడు శోభన్‌బాబు విగ్రహావిష్కరణ సందర్భంగా దాసరి నారాయణరావు 2011 మే నెలలో కర్నూలును సందర్శించారు. అభిమానుల మధ్య దాసరి నారాయణరావు స్థానిక కిడ్స్ వరల్డ్ సమీపంలో ఆనందోత్సాహాల నడుమ శోభన్‌బాబు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం సునయన ఆడిటోరియంలో శోభన్‌బాబు సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన సత్కార సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. శోభన్‌భాబు సేవా సమితి జాతీయ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు ఆహ్వానం మేరకు తాను కర్నూలుకు వచ్చానని, శోభన్‌బాబుతో తనకున్న స్నేహపూర్వక అనుబంధాన్ని ఆయన నెమరు వేసుకున్నారు. 2004 ఎన్నికల సందర్భంగా ప్రచారంలో భాగంగా దాసరి నారాయణరావు కర్నూలు, డోన్, ప్యాపిలి తదితర ప్రాంతాల్లో పర్యటించారు. కళాకారులు, రచయితలతో.. 2015 డిసెంబర్ 27న కర్నూలు లలిత కళా సమితి అధ్యక్షులు పత్తి ఓబులయ్య, కార్యదర్శి మహమ్మద్‌మియా, సహాయ కార్యదర్శి ఇనాయతుల్లా, బనగానపల్లె అరుణభారతి అధ్యక్షుడు బీసీ రాజారెడ్డిలు దాసరి నారాయణరావును హైదరాబాద్‌లో కలిసి ఆయనతో పుస్తకాన్ని ఆవిష్కరింపజేశారు. రాజారెడ్డి రచించిన మానవ జీవనయానం అనే పుస్తకాన్ని దాసరి ఆయన స్వగృహంలో ఆవిష్కరించి రచయితలతో గంటసేపు ముచ్చటించారు. కర్నూలు రచయిత ఇనాయతుల్లా రచించిన నిచ్చెన పుస్తకాన్ని అందుకొని అందులోని కర్నూలు మాండలికాన్ని ఆయన కొనియాడారు. కర్నూలు గజల్ గాయకుడు మమహ్మద్మియా పాడిన గజల్‌ను ఆసాంతం విని ఆనందోత్సాహంతో అభినందించారు. కర్నూలు జిల్లా రాయలసీమలో ప్రత్యేకతను సంతరించుకొందని.. కర్నూలు అంటే తనకు ప్రత్యేక అభిమానమని ఈ సందర్భంగా ఆయన రచయితలు, కళాకారులతో తన జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. దాసరి మృతి పట్ల లలిత కళా సమితి అధ్యక్షులు పత్తి ఓబులయ్య, సభ్యులు మియా, ఇనాయతుల్లా, సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి జంధ్యాల రఘుబాబు ప్రగాడ సంతాపాన్ని తెలియజేశారు. దాసరి మా సంస్థ గౌరవ సలహాదారు నాకు దాసరి నారాయణ రావుతో ఆత్మీయ అనుబంధం ఉంది. 2011లో నేను హైదరాబాద్ వెళ్లి, కర్నూలులో శోభన్‌బాబు విగ్రహావిష్కరణకు రావాలని ఆహ్వానించిన వెంటనే ఆయన మారు మాట్లాడకుండా నా ఆహ్వానాన్ని మన్నించి కర్నూలుకు విచ్చేశారు. శోభన్‌బాబుతో బావా బావా అనుకునే ఆత్మీయ బంధుత్వం తనకు ఉందని దాసరి గుర్తు చేశారు. 1975లో దాసరి తొలిసారిగా బలిపీఠం అనే సినిమాను శోభన్‌బాబుతో తీసి సూపర్‌హిట్ సాధించడంతో స్టార్ హీరోలతో సినిమాలు చేయడం ప్రారంభించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. - సుధాకర్‌బాబు, శోభన్‌బాబు సేవా సమితి జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ -
ప్రభుత్వ విధానాలతో ఆర్థిక వ్యవస్థ కుదేలు
– కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి కర్నూలు (ఓల్డ్‌సిటీ): ప్రభుత్వ విధానాలతో ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందని కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి అన్నారు. కృష్ణగిరి మండలం లాల్‌మాన్‌పల్లికి చెందిన టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు చిన్నకాలేసాహెబ్ నాయకత్వంలో సుమారు 200 మంది ఆ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం స్థానిక జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో వారికి కోట్ల సూర్య పార్టీ కండువాలు కప్పారు. తర్వాత డీసీసీ అధ్యక్షుడు పి.లక్ష్మిరెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. పెద్దనోట్ల రద్దు జరిగినప్పటి నుంచి ప్రజలు బ్యాంకుల్లో డబ్బు వేయడానికి భయపడుతున్నారన్నారు. బ్యాంకుల్లో లావాదేవీలు కూడా 50 శాతం మేర తగ్గిపోయాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా సక్రమంగా నెరవేర్చలేదన్నారు. దేశాన్ని పాలించే సత్తా ఒక్క కాంగ్రెస్‌కే ఉందని, తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. డీసీసీ అధ్యక్షుడు పి.లక్ష్మిరెడ్డి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంపై రైతులు, ప్రజలు, చివరికి ఆ పార్టీ కార్యకర్తలు కూడా విసిగిపోయారన్నారు. చంద్రబాబుకు అమరావతి తప్ప రాయలసీమ గోడు పట్టడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మదనగోపాల్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు సర్దార్ బుచ్చిబాబు, ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు పూడూరు నాగమధు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో అరాచక పాలన
- స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి మద్దతు - కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి కోడుమూరు రూరల్: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అరాచక పాలన సాగిస్తోందని కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి అన్నారు. మంగళవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి గౌరు వెంకటరెడ్డి.. మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డితో కలిసి లద్దగిరిలో కోట్లను కలిసి మద్దతు కోరారు. ఈ సందర్భంగా ఆయన వైఎస్ఆర్సీపీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. టీడీపీ హయాంలో రాయలసీమకు.. ముఖ్యంగా కర్నూలు జిల్లాకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. ఆ పార్టీ నాయకుల అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండా పోతుందన్నారు. ఎల్ఎల్సీ, జీడీపీ ఆయకట్టుకు సకాలంలో నీరందక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హంద్రీ నది ఎండిపోయి పరీవాహక ప్రాంతాల్లో తీవ్ర మంచినీటి ఎద్దడి నెలకొన్నా నాయకులు, అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. టీడీపీ ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి మద్దతిస్తున్నట్లు చెప్పారు. మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ పట్టిసీమ ప్రాజెక్టులో రాయలసీమకు ఒరిగిందేమీ లేదన్నారు. ప్రభుత్వ పాలన అవినీతిమయంగా మారిందని.. మంత్రులు తమ స్వలాభం చూసుకుంటూ ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేశారన్నారు. ఏకపక్ష నిర్ణయాలతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న టీడీపీ అభ్యర్థులను స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడించి తగిన బుద్ధి చెప్పాలన్నారు. వైఎస్ఆర్సీపీ తరపున బరిలోని గౌరు వెంకటరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. -
ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడతాం
– కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి కర్నూలు (ఓల్డ్‌సిటీ): గ్రామాల్లో తిరిగి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడతామని కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక కళావెంకట్రావ్ భవనంలో డీసీసీ అధ్యక్షుడు పి.లక్ష్మిరెడ్డి అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోట్ల మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం 2013లో జాతీయ ఆహార భద్రత పథకం ప్రవేశపెట్టిందని, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఆ పథకాన్ని ఏర్పాటు చేసినట్లు గొప్పలు చెప్పుకోవడం విడ్డూరమన్నారు. పెద్దనోట్లు రద్దు చేసి సామాన్య ప్రజలను కష్టనష్టాలకు గురి చేశారన్నారు. బీజేపీ, టీడీపీలు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నాయని విమర్శించారు. డీసీసీ అధ్యక్షుడు పి.లక్ష్మిరెడ్డి మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయన్నారు. కా -
నోట్ల రద్దుతో అభివృద్ధి వెనక్కి
ప్యాపిలి: పెద్ద నోట్ల రద్దుతో దేశ అభివృద్ధి ఆగిపోయిందని కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్య ప్రకాష్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. పట్టణ సమీపంలో బోరెడ్డి పుల్లారెడ్డి ఫ్యాక్టరీలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నవంబర్ 8న ప్రధానమంత్రి నరేంద్రమోదీ పెద్ద నోట్లను రద్దు చేస్తున్నుట్లు ప్రకటించగానే పేదల ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నమైందన్నారు. పెద్ద నోట్లు మార్చుకోవడానికి కొత్తనోట్లకు చిల్లర కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా బీజేపీ నేతల ఇళ్లల్లో మాత్రం శుభకార్యాలు అంగరంగ వైభవంగా సాగడంతో మతలబు ఏమిటని ప్రశ్నించారు. నోట్ల రద్దు వ్యవహారంలో పెద్దలకో న్యాయం.. పేదలకో న్యాయం అన్న చందంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసే శక్తి ఎవరికీ లేదని 2019లో తిరిగి కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమన్నారు. వచ్చే నెల 11న మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి విగ్రహావిష్కరణకు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్యాపిలి రానున్నట్లు చెప్పారు. అనంతరం విగ్రహ ఏర్పాటు స్థలాన్ని ఆయన పరిశీలించారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు లక్కసాగరం లక్ష్మిరెడ్డి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ బోరెడ్డి పుల్లారెడ్డి, ప్యాపిలి, హుసేనాపురం సింగిల్ విండో అధ్యక్షుడు చిన్న వెంకటరెడ్డి, సీమ సుధాకర్‌రెడ్డి, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు గడ్డం భువనేశ్వరరెడ్డి, న్యాయవాది నాగభూషణంరెడ్డి, సీనియర్ నాయకులు చిన్నపూజర్ల రామచంద్రారెడ్డి, కమతం భాస్కర్‌రెడ్డి, బోరెడ్డి రాము పాల్గొన్నారు. -
పెద్ద నోట్ల రద్దు అర్థరహితం
– ముందు చిల్లర నగదు విడుదల చేయండి – కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి – ఆంధ్రా బ్యాంక్ ఎదుట డీసీసీ నిరసన కర్నూలు (ఓల్డ్‌సిటీ): పెద్ద నోట్ల రద్దు అర్థరహితమని కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి అన్నారు. బుధవారం డీసీసీ అధ్యక్షుడు పి.లక్ష్మిరెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ నాయకులు కర్నూలు పెద్ద మార్కెట్ సమీపంలోని ఆంధ్రా బ్యాంకు ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కోట్ల మాట్లాడుతూ.. నల్లకుబేరులను ప్రధాని నరేంద్ర మోదీ కాపాడుతున్నారని ఆరోపించారు. రూ. 2000 విలువ చేసే పెద్దనోట్లతో పేదలకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ప్రయోజనంలేని ఆలోచనలను నరేంద్ర మోదీమానుకుని ప్రజల కష్టాలు, వయోవృద్ధుల మరణాలు ఆపాలని కోరారు. నేటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఖాతాలో రూ. 2.5 లక్షల పరిమితిని సడలించి రూ. 5 నుంచి 10 లక్షల వరకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. అలాగే రూ. 100, రూ. 50 నోట్లను విరివిగా విడుదల చేయాలన్నారు. నిరసన కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు సర్దార్ బుచ్చిబాబు, డీసీసీ ఉపాధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం.పి.తిప్పన్న, కార్యదర్శులు ఎస్.ఖలీల్‌బాషా, రమణారెడ్డి, చంద్రారెడ్డి, ఇమామ్పటేల్, శ్రీనివాసరెడ్డి, విజయభాస్కరరెడ్డి, ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు నాగమధు, యూత్ కాంగ్రెస్ డి.ఖాసిం తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో పెరుగుతున్న అవినీతి
కోడుమూరు రూరల్ : రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని, ప్రజా పాలన పక్కనబెట్టి టీడీపీ నేతలు దోచుకునేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. శనివారం కోడుమూరులో రైతు మహాసభ సందర్భంగా భారీ ఎత్తున కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. కరువు కాటకాలతో ప్రజలు అల్లాడుతుంటే వారిని పరామర్శించకుండా టీడీపీ నేతలు డబ్బు సంపాదనకు దొంగదారులు వెతుక్కుంటున్నారన్నారు. పెద్ద నోట్ల రద్దుతో రైతులు, ప్రజలు రోడ్డు పడ్డారన్నారు. గుండ్రేవుల ప్రాజెక్టుకు అనుమతులు తెచ్చినా నిర్మాణానికి ప్రభుత్వం తాత్సరం చేస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో తనను గెలిపిస్తే తాగు, సాగునీటి సమస్యలను తీరుస్తానన్నారు. అధికారంలోకి వచ్చాక సమస్యలు పరిష్కరించకుంటే రాజకీయాల నుంచి వైదొలుగుతాన్నారు. -
రైతుల సమస్యలు గాలికొదిలిన ప్రభుత్వం
కోడుమూరు రూరల్: రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి విమర్శించారు. గురువారం గాజులదిన్నె ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తులసీరెడ్డితో కలసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కోట్ల సూర్య విలేకరులతో మాట్లాడుతూ జిల్లాకు ఎల్ఎల్సీ ద్వారా న్యాయంగా రావాల్సిన నీటి వాటాను ప్రభుత్వం రాబట్టలేకపోయిందన్నారు. ఎల్ఎల్సీకి జీడీపీ నీటిని విడుదల చేస్తూ ఆయకట్టు రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారన్నారు. ప్రస్తుతం జీడీపీలో 1.9టీఎంసీల నీరుందని, ఈ నీటితో ఆయకట్టు కింద పొలాలకు రబీలో సాగునీరు ఎలా అందిస్తారని, వేసవిలో తాగునీటి అవసరాలను ఎలా తీరుస్తారని ప్రశ్నించారు. అంతకుముందు వారు కోడుమూరులో ఈనెల 19న తలపెట్టిన రైతు మహాసభ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో తులసీరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల హామీలు అమలు చేయలేని దద్దమ్మ పార్టీగా టీడీపీని అభివర్ణించారు. రుణమాఫీ, ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా, కొత్త రుణాలను మంజూరు చేయకుండా ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేసిందన్నారు. పెద్ద నోట్లపై కేంద్రం తీసుకున్న నిర్ణయం చూస్తే పిచ్చి తుగ్లక్‌పాలన గుర్తుకు వస్తుందన్నారు. వీరి వెంట డీసీసీ అధ్యక్షుడు లక్కసాగరం లక్ష్మీరెడ్డి, జిల్లా ఆర్టీఐ చైర్మన్ సుదర్శన్‌రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, సర్పంచు సిబి.లత, కాంగ్రెస్ నేతలు సర్దార్ బుచ్చిబాబు, గుడిసె గోపాల్‌రెడ్డి, హేమాద్రిరెడ్డి, హంపిరెడ్డి, జెఎండీ.రఫీక్‌బాషా ఉన్నారు. -
పెద్దాయనకు ఘన నివాళి
కర్నూలు(ఓల్డ్‌సిటీ): దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి 15వర్ధంతి సందర్భంగా మంగళవారం ఆయన కుమారుడు, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డితోపాటు ప్రముఖనేతలు ఘనంగా నివాళి అర్పించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు పి.లక్ష్మిరెడ్డి అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి, కోట్ల సర్కిల్లోని ఆయన కాంశ్య విగ్రహానికి, కిసాన్ ఘాట్‌లో ఆయన సమాధికి పూలమాలలు, పుష్పగుచ్ఛాలు సమర్పించి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ మచ్చలేని నాయకుడుగా ఎదిగి జిల్లా గౌరవం పెంచిన ఘనత కోట్ల విజయభాస్కర్‌రెడ్డికే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే మదనగోపాల్, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు సర్దార్ బుచ్చిబాబు, రాష్ట్ర మైనారిటీసెల్ చైర్మన్ అహ్మద్ అలీఖాన్, ఉపాధ్యక్షులు వేణుగోపాల్‌రెడ్డి, వై.వి.రమణ, అశోక్‌రత్నం, ప్రమోద్‌కుమార్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, నాయకులు పాల్గొన్నారు. -
టీడీపీకి ఓటమి భయం
⇒ అందుకే మున్సిపల్ ఎన్నికలు వాయిదా వేస్తోంది ⇒ కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కోడుమూరు: తెలుగుదేశం పార్టీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే కర్నూలు కార్పొరేషన్ ఎన్నికలను వాయిదా వేస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. శనివారం లద్దగిరిలోని తన స్వగృహంలో వెల్దుర్తి, కృష్ణగిరి మండలాల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు మాట్లాడుతూ.. పరిస్థితులన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే అనుకూలంగా ఉన్నాయని, కాంగ్రెస్ నాయకులంతా పత్తికొండ నియోజకవర్గ ఇంచార్జి చెరుకుపాటి నారాయణ వెంట వెళ్తున్నారని తెలియజేయడంతో కోట్ల కొంత అసహనానికి లోనయ్యాడు. రెండు గుర్రాల స్వారీ పద్ధతి కాదని, తన వెంట నడిచే వాళ్లే తనతో ఉండాలని, లేదంటే ఎవరి దారి వాళ్లు చూసుకోవాలని తెగేసి చెప్పారు. టీడీపీ నేతల దౌర్జన్యాలకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. రెండున్నర సంవత్సరాలు టీడీపీ ఎలాంటి అభివృద్ధి చేయకపోవడంతో ప్రజలు ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారని తెలిపారు. కరువు ఏర్పడినా మూడేళ్లుగా నష్టపరిహారమివ్వలేదని, రైతులకు గిట్టుబాటు ధరలు రావడంలేదని.. ఈ సమస్యలన్నింటిపై పోరాడేందుకు జిల్లా అంతటా పర్యటిస్తానని తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చి కూర్చున్నా.. కర్నూలు కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ గెలవలేదన్నారు. కార్యకర్తల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు లక్కసారం లక్ష్మీరెడ్డి, వెల్దుర్తి జెడ్పీటీసీ సభ్యులు సమీర్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు సంజన్నగౌడ్, అమకతాడు వీరభద్రుడు తదితరులు పాల్గొన్నారు. -
కేంద్రం మెతక వైఖరితోనే యూరి ఘటన
– కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కర్నూలు(ఓల్డ్‌సిటీ): కేంద్ర ప్రభుత్వ మెతక వైఖరితోనే యూరి ఘటన చోటు చేసుకుందని కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి ఆరోపించారు. గురువారం రాత్రి డీసీసీ అధ్యక్షుడు పి.లక్ష్మిరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు పార్టీ కార్యాలయం నుంచి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తెలుగుతల్లి విగ్రహం వద్ద ప్రదర్శన జరిపారు. యూడీ ఘటనలో అమరులైన జవానులకు నివాళులు అర్పించి, జోహార్లు తెలిపారు. ఈ సందర్భంగా కోట్ల మాట్లాడుతూ.. దేశ రక్షణ విధుల్లో ఉన్న వీర సైనికులు మతి చెందడం బాధాకరమన్నారు. జెడ్పీ మాజీ చైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే మదనగోపాల్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు సర్దార్ బుచ్చిబాబు, ఉపాధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి, వై.వి.రమణ, ప్రధాన కార్యదర్శులు పెద్దారెడ్డి, ఎం.పి.తిప్పన్న, కార్యదర్శులు పాల్గొన్నారు. -
కర్నూలు అభివృద్ధిలో కోట్లది కీలకపాత్ర
– డీసీసీ అధ్యక్షుడు పి.లక్ష్మీరెడ్డి – ఘనంగా కేంద్ర మాజీ మంత్రి కోట్ల జన్మదిన వేడుకలు – శుభాకాంక్షలు తెలిపిన టీజీ కర్నూలు (ఓల్డ్‌సిటీ): కర్నూలు అభివృద్ధిలో కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి కీలక పాత్ర పోషించారని డీసీసీ అధ్యక్షుడు పి.లక్ష్మీరెడ్డి కొనియాడారు. ఆదివారం స్థానిక రివర్వ్యూ కాలనీలోని కోట్ల నివాసానికి పార్టీ నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. డీసీసీ ఆధ్వర్యంలో వేద పండితులతో ఆశీర్వచన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ నాయకులు, ఎన్ఎస్యూఐ విద్యార్థులు కోట్లతో కేక్ కట్ చేయించారు. అనంతరం లక్ష్మీ‡రెడ్డి మాట్లాడుతూ కోట్ల కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు కర్నూలు టౌన్‌గా ఉన్న రైల్వేస్టేçÙన్ను సిటీగా మార్చారని, ఇంటర్సిటీరైలు, నంద్యాలకు ప్యాసింజర్ ట్రై న్, కృష్ణానగర్, బిర్లాగేటు వద్ద రైల్వే అండర్ బ్రిడ్జీలు మంజూరు చేయించారని తెలిపారు. టీడీపీ నేత,రాజ్యసభ సభ్యుడు టి.జి.వెంకటేశ్, జెడ్పీ మాజీ చైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే మదనగోపాల్, పీసీసీ కార్యదర్శి సర్దార్ బుచ్చిబాబు, పార్టీ మైనారిటీసెల్ చైర్మన్ అహ్మద్‌అలీఖాన్, ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు పూడూరు నాగమధు యాదవ్, డీసీసీ ఉపాధ్యక్షుడు ఎస్. ఖలీల్‌బాష, నాయకులు వేణుగోపాల్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, చున్నుమియ్య, ఇమాంపటేల్, ఆర్టీఐ చైర్మన్ సుదర్శన్‌రెడ్డి తదితరులు కోట్లను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. -
సీఎం సీమ ద్రోహి
– కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి – శ్రీశైలంలో కనీస నీటిమట్టం పాటించాలని డిమాండ్ – త్వరలో ఆరు జిల్లాల రైతులు, మేధావులతో సదస్సు కోడుమూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమకు తీరని అన్యాయం చేస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన కోడుమూరులో విలేకరులతో మాట్లాడారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో 854 అడుగుల నీటిమట్టం లేకుండానే నాగార్జునసాగర్‌కు విడుదల చేయడం సరికాదన్నారు. కనీస నీటి మట్టం పాటించకుంటే పాలమూరు, డిండి ప్రాజెక్టులతోపాటు హంద్రీనీవా ఎత్తిపోతల పథకాలకు నీరు చేరదని, అదే జరిగితే రాయలసీమ ప్రాంతం ఏడారిగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాయలసీమ రైతుల కోసం పార్టీలకు అతీతంగా కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల రైతులు, మేధావులను ఏకం చేసి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు. త్వరలో 6 జిల్లాల రైతులతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. జిల్లాలో పాలన అస్తవ్యస్తం.. జిల్లాలో పరిపాలన అస్తవ్యస్తంగా మారిందని కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ఆరోపించారు. ప్రాజెక్టులు, చెరువుల్లో నీరున్నప్పటికీ జనం తాగు, సాగునీటికి అవస్థలు పడే పరిస్థితి నెలకొందన్నారు. 38 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేసే నంద్యాల వాటర్ స్కీం రెండేళ్లుగా పని చేయకపోయినా కాంట్రాక్టర్లు నిధులు స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ విజయమోహన్ అధికార పార్టీ తొత్తుగా మారారని ఆరోపించారు. విలేకరుల సమావేశంలో సీబీ లత, సింగిల్‌విండో అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు కె.హేమాద్రి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రోజులు దగ్గర పడ్డాయి
కర్నూలు(టౌన్): ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రోజులు దగ్గర పడ్డాయని కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి జయంతి వేడుకల సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే కోట్ల సర్కిల్లో కోట్ల విజయభాస్కర్‌రెడ్డి కాంస్య విగ్రహానికి పూలమాలలు వేశారు. స్థానిక కిసాన్‌ఘాట్‌లో కోట్ల 97వ జయంతి వేడుకలను పురస్కరించుకుని భారీ కేక్‌ను కట్ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి మాట్లాడుతూ స్వర్గీయ కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఎన్నో ఉన్నత పదవులు అలంకరించి పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. రైతుల కోసం ఎల్ఎల్సీ, కేసీ కెనాల్, గాజులదిన్నె ప్రాజెక్టు నిర్మాణంలో విశేషంగా కషి చేశారని కొనియాడారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని మోదీ మాట తప్పారన్నారు. సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేశారని విమర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సుధాకర్ బాబు, మాజీ ఎమ్మెల్యే మదన్‌గోపాల్, మాజీ జెడ్పీ చైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి, పీసీసీ కార్యదర్శి సర్దార్ బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు. -
కర్నూలు జిల్లాలో ఓ కుటుంబ కథా చిత్రం
-
రాయల తెలంగాణ అనలేదు: కోట్ల
-
విభజనపై వెనక్కి తగ్గేది లేదు, తెల్చి చెప్పిన సోనియా