పెద్ద నోట్ల రద్దు అర్థరహితం
– ముందు చిల్లర నగదు విడుదల చేయండి
– కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి
– ఆంధ్రా బ్యాంక్ ఎదుట డీసీసీ నిరసన
కర్నూలు (ఓల్డ్‌సిటీ): పెద్ద నోట్ల రద్దు అర్థరహితమని కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి అన్నారు. బుధవారం డీసీసీ అధ్యక్షుడు పి.లక్ష్మిరెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ నాయకులు కర్నూలు పెద్ద మార్కెట్ సమీపంలోని ఆంధ్రా బ్యాంకు ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కోట్ల మాట్లాడుతూ.. నల్లకుబేరులను ప్రధాని నరేంద్ర మోదీ కాపాడుతున్నారని ఆరోపించారు. రూ. 2000 విలువ చేసే పెద్దనోట్లతో పేదలకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ప్రయోజనంలేని ఆలోచనలను నరేంద్ర మోదీమానుకుని ప్రజల కష్టాలు, వయోవృద్ధుల మరణాలు ఆపాలని కోరారు. నేటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఖాతాలో రూ. 2.5 లక్షల పరిమితిని సడలించి రూ. 5 నుంచి 10 లక్షల వరకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. అలాగే రూ. 100, రూ. 50 నోట్లను విరివిగా విడుదల చేయాలన్నారు. నిరసన కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు సర్దార్ బుచ్చిబాబు, డీసీసీ ఉపాధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం.పి.తిప్పన్న, కార్యదర్శులు ఎస్.ఖలీల్‌బాషా, రమణారెడ్డి, చంద్రారెడ్డి, ఇమామ్‌పటేల్, శ్రీనివాసరెడ్డి, విజయభాస్కరరెడ్డి, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు నాగమధు, యూత్ కాంగ్రెస్ డి.ఖాసిం తదితరులు పాల్గొన్నారు.