కేంద్రం మెతక వైఖరితోనే యూరి ఘటన
– కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి
కర్నూలు(ఓల్డ్‌సిటీ): కేంద్ర ప్రభుత్వ మెతక వైఖరితోనే యూరి ఘటన చోటు చేసుకుందని కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి ఆరోపించారు. గురువారం రాత్రి డీసీసీ అధ్యక్షుడు పి.లక్ష్మిరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు పార్టీ కార్యాలయం నుంచి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తెలుగుతల్లి విగ్రహం వద్ద ప్రదర్శన జరిపారు. యూడీ ఘటనలో అమరులైన జవానులకు నివాళులు అర్పించి, జోహార్లు తెలిపారు. ఈ సందర్భంగా కోట్ల మాట్లాడుతూ.. దేశ రక్షణ విధుల్లో ఉన్న వీర సైనికులు మతి చెందడం బాధాకరమన్నారు. జెడ్పీ మాజీ చైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే మదనగోపాల్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు సర్దార్ బుచ్చిబాబు, ఉపాధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి, వై.వి.రమణ, ప్రధాన కార్యదర్శులు పెద్దారెడ్డి, ఎం.పి.తిప్పన్న, కార్యదర్శులు పాల్గొన్నారు.