Uri Sector (Jammu and Kashmir)
-
చొరబాటుకు యత్నించిన ముగ్గురు పాక్ తీవ్రవాదులు హతం
శ్రీనగర్: బారాముల్లా ప్రాంతంలోని వాస్తవాధీన రేఖ సమీపంలో ముగ్గురు పాక్ తీవ్రవాదులు పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి భారత భూభాగమైన యూరిలోకి చొరబడేందుకు ప్రయత్నించగా భారత సైన్యం, జమ్మూ కశ్మీర్ పోలీసులు, గూఢచారి ఏజెన్సీలు చేసిన జాయింట్ ఆపరేషన్‌లో ముగ్గురూ మృతి చెందినట్లు చినార్ కార్ప్స్ ఇండియన్ ఆర్మీ ఎక్స్(ట్విట్టర్) ద్వారా వెల్లడించింది. ఇండియన్ ఆర్మీ తెలిపిన వివరాల ప్రకారం బారాముల్లా వద్ద పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి ముగ్గురు తీవ్రవాదులు వాస్తవాధీన రేఖను దాటుకుని యురి వైపుగా వస్తుండటాన్ని గమనించి సైనికులు అప్రమత్తమై కాల్పులు జరిపారని దాడిలో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోగా ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. పాకిస్తాన్ దళాలు మాపై కాల్పులు జరపడంతో మరో మృతదేహాన్ని క్యాప్చర్ చేయడం సాధ్యపడలేదని తెలిపారు. మూడో మృతదేహాన్ని స్వాధీనం చేసుకునేందుకు వెళ్తుండగా పాక్ దళాలు కాల్పులు జరపడం 2021లో వాస్తవాధీన రేఖ వద్ద కాల్పులు విరమణకు చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని అన్నారు. యురి సెక్టార్లో ఇప్పటికీ ఆపరేషన్ కొనసాగుతోందని తెలిపారు. Update Op Khanda, #Uri A Joint operation was launched today morning in Uri Sector. Contact established & firefight ensued. 03xTerrorists eliminated. 02xAK Rifles, 01xPistol, 07xHand Grenades, 01xIED and other war like stores along with Pak Currency Notes recovered. Joint… — Chinar Corps🍁 - Indian Army (@ChinarcorpsIA) September 16, 2023 ఇది కూడా చదవండి: మాటలు జాగ్రత్త.. విద్వేషాలను రెచ్చగొట్టకూడదు -
చొరబాట్లను అడ్డుకున్న సైన్యం
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో సరిహద్దు దాటి భారత భూభాగంలోకి చొరబడేందుకు యత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. హాత్‌లంగా ప్రాంతంలోని ఘటనా స్థలం నుంచి భారీస్థాయిలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు గురువారం సైన్యాధికారి చెప్పారు. హతమైన వారిలో ఒకరు పాకిస్తానీ అని, మిగతా వారి వివరాలు ఇంకా తెలియదని అధికారి పేర్కొన్నారు. ఉరీ సెక్టార్, గోహలన్ ప్రాంతాల్లో చొరబాట్లు జరగొచ్చనే ముందస్తు సమాచారం మేరకు సరిహద్దు వెంట గాలింపు పెంచామని, చివరకు ఇలా ఉగ్రవాదుల చొరబాట్లను అడ్డుకున్నామని లెఫ్టినెంట్ జనరల్ డీపీ పాండే చెప్పారు. మొత్తం ఆరుగురు చొరబాటుకు ప్రయత్నించారని, నలుగురు సరిహద్దు ఆవలే ఉండిపోయారని, ఇద్దరు సరిహద్దు దాటారని, ఎదురుకాల్పుల్లో మొత్తంగా ముగ్గురు హతమయ్యారని వివరించారు. భారత్‌లో ఉగ్రచర్యల్లో పిస్టళ్లను వాడే కొత్త పంథాను పాక్ అవలంభిస్తోందని కశ్మీర్ జోన్ ఐజీ విజయ్ కుమార్ చెప్పారు. ఈ ఏడాది 97 పిస్టళ్లను సైన్యం స్వాధీనం చేసుకుంది. ఈ ఏడాది నిరాయుధులైన పోలీసులను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఉగ్రదాడుల్లో 85 శాతం ఘటనల్లో పిస్టళ్లనే వాడారని ఐజీ పేర్కొన్నారు. షోపియాన్‌లో మరో ఉగ్రవాది.. షోపియాన్ జిల్లాలో కేశ్వా గ్రామంలో భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో అనాయత్ అష్రాఫ్ అనే ఉగ్రవాది మరణించాడు. అక్రమంగా ఆయుధాలను సమీకరిస్తూ, మాదక ద్రవ్యాల లావాదేవీలు కొనసాగిస్తున్నాడనే పక్కా సమాచారంతో సైన్యం అష్రఫ్‌ను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేసింది. లొంగిపోకుండా అష్రఫ్ సైన్యం పైకి కాల్పులు జరిపాడు. దీంతో సైన్యం జరిపిన కాల్పుల్లో అతను మృతిచెందాడు. -
ఏళ్లుగా భరించాం.. ఇక ఊరుకోం
ఘజియాబాద్: ‘అయిందేదో అయింది. ఏళ్లుగా భరించాం. ఇక ఊరుకునే ప్రసక్తే లేదు’అని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఉగ్రవాదాన్ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ లక్ష్యంగా జరుగుతున్న ఉగ్రకుట్రలకు తగిన గుణపాఠం చెప్పి తీరతామని స్ప ష్టం చేశారు. పుల్వామా, ఉడి ఘటనలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆదివారం ఇక్కడ జరిగిన కేంద్ర పారిశ్రామిక భద్రతా బలగాల (సీఐఎస్ఎఫ్) 50వ వ్యవస్థాపక దినోత్సవంలో ప్రధాని ప్రసంగించారు. దేశ భద్రతను కాపాడుతున్న సీఐఎస్ఎఫ్ జవాన్ల కృషి అభినందనీయమని కొనియాడారు. స్వాతంత్య్రం అనంతరం దేశం కోసం ప్రాణాలర్పించిన 35 వేల మంది పోలీసుల్లో పాలమిలటరీ దళాలకు చెందిన వారు 4 వేల మంది ఉన్నారని పేర్కొ న్నారు. వీరి శౌర్యం, అంకితభావం ప్రజలందరికీ ఆదర్శనీయమని ప్రశంసించారు. ఉగ్రదాడులకు వ్యతిరేకంగా తమ ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. పుల్వామా ఉగ్రదాడికి వ్యతిరేకంగా పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై వైమానిక దాడులకు పాల్పడిన విషయాన్ని ప్రస్తావించారు. దేశప్రజల మద్దతుతోనే ఇదంతా సాధ్యమైందని పేర్కొన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తమ ప్రభుత్వం నూతన విధానాన్ని తీసుకొచ్చిందన్నారు. ఉగ్రదాడు లను సమర్థంగా ఎదుర్కొనేందుకు అధునాతన గాడ్జెట్లను కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. ఇక వీఐపీ సంస్కృతిపై మోదీ విమర్శల వర్షం కురిపించారు. వీఐపీలకు భద్రతను అందించే సీఐఎస్ఎఫ్ బలగాలతో వారు వ్యవహరించే తీరు దారుణంగా ఉంటోం దన్నారు. సీఐఎస్ఎఫ్ జవాన్ల గురించి ప్రజలకు తెలిసేలా వారి చరిత్ర, విధివిధానాలతో డిజిటల్ మ్యూజియాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజల ఆశీర్వాదం కోరుతున్నా: మోదీ న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేను మరోసారి ఆశీర్వదించాల్సిందిగా ప్రజలను తాను కోరుతున్నానని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ‘అందరితోపాటుగా, అందరి అభివృద్ధి అనే మా మార్గంలో వెళ్తూ మరోసారి మీ ఆశీర్వాదం కోరుతున్నా. గత 70 ఏళ్లలో నాటి ప్రభుత్వాలు తీర్చలేకపోయిన కనీస అవసరాలను మా ప్రభుత్వం తీర్చింది. ఇప్పుడు మనం మరింత బలమైన, వృద్ధి దాయకమైన, భద్రమైన ఇండియాను నిర్మించాలి’అని మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలను మోదీ ప్రస్తావించారు. -
కొత్తనీతి.. సరికొత్త రీతి
నోయిడా: బాలాకోట్ ఉగ్రదాడిపై ఆధారాలు చూపాలంటున్న ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. ఉగ్రమూకల ఏరివేత విషయంలో యూపీఏ ప్రభుత్వం ధైర్యం, తెగువ చూపలేకపోయిందని విమర్శించారు. కానీ ఎన్డీయే ప్రభుత్వం 2016లో సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా ఉగ్రమూకలకు వారికి అర్థమయ్యే భాషలోనే గుణపాఠం చెప్పిందని వ్యాఖ్యానించారు. భారత్ ఇప్పుడు ‘కొత్తనీతి–సరికొత్త రీతి’తో ముందుకుపోతోందన్నారు. ‘2008లో జరిగిన ముంబై మారణహోమాన్ని దేశం ఎన్నటికీ మర్చిపోదు. ఆ ఉగ్రదాడులకు భారత్ వెంటనే ప్రతిస్పందించి ఉంటే ప్రపంచం మొత్తం మనకు అండగా నిలిచేది. పాక్‌లో ఉగ్రసంస్థల పాత్రపై మనదగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి. కానీ అప్పటి ప్రభుత్వం ధైర్యం, తెగువ చూపలేకపోయింది. ఉగ్రదుశ్చర్యకు ప్రతీకారం తీర్చుకోవడానికి మన భద్రతాబలగాలు సిద్ధంగా ఉన్నప్పటికీ కేంద్రం మౌనం వహించింది’ అని అన్నారు. తెల్లవారుజామునే పాకిస్తాన్ ఏడ్చింది.. పాక్‌లోని బాలాకోట్‌లో జైషే ఉగ్రస్థావరంపై భారత వాయుసేన ఫిబ్రవరి 24న దాడిచేశాక తెల్లవారుజామున 5 గంటలకు ‘మోదీ మాపై దాడి చేశాడు’ అని పాక్ ఏడుపు అందుకుంది. దాడులతో ఇబ్బందిపెడుతూనే ఉండొచ్చనీ, ఇండియా ప్రతిస్పందించదని వాళ్లు భావిస్తున్నారు. 2014కు ముందున్న రిమోట్ కంట్రోల్ ప్రభుత్వం కారణంగానే శత్రువులకు ఈ అభిప్రాయం బలంగా ఏర్పడింది. ఉడీ ఘటన తర్వాత మన బలగాలు ఉగ్రవాదుల ఇళ్లలోకి దూరి వాళ్లను హతమార్చాయి. యూపీలోని కుర్జాలో, బిహార్‌లోని బుక్సారిన్‌లో రెండు థర్మల్ విద్యుత్ కేంద్రాలను ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. 50ఏళ్ల పాత సామగ్రిని వాడటంతో విద్యుత్ ఉత్పత్తి వ్యయం యూనిట్‌కు రూ.10కు చేరుకుందని ప్రధాని తెలిపారు. కానీ సౌరశక్తి ద్వారా ఇప్పుడు యూనిట్ విద్యుత్‌ను రూ.2కే ఉత్పత్తి చేయొచ్చన్నారు. ఐదేళ్లలో మూడు దాడులు: రాజ్‌నాథ్ మంగళూరు: గత ఐదేళ్లలో భారత్ మూడు సార్లు దాడులు చేసిందని హోం మంత్రి రాజ్‌నాథ్ చెప్పారు. 2016లో ఉడి ఉగ్రవాద దాడి తర్వాత చేపట్టిన దాడి, ఇటీవల జరిపిన వైమానిక దాడుల గురించి వివరించిన రాజ్‌నాథ్ మూడో దాడి వివరాలు బయటపెట్టలేదు. శనివారం కర్ణాటక బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఉడిలో నిద్రపోతున్న సైనికులపై ఉగ్రవాదులు దాడి జరిపి 17 మందిని చంపివేశారని, దీనికి ప్రతీకారంగా పీవోకే భారత్ తొలి మెరుపుదాడి చేసిందన్నారు. పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఆత్మాహుతి దాడి తర్వాత వైమానిక దాడి జరిపి జైషే ఉగ్ర శిబిరాన్ని నాశనం చేసిందన్నారు. ఈ దాడులతో భారత్ బలహీన దేశం కాదని పాకిస్తాన్‌కు గట్టి సందేశం ఇచ్చామని వెల్లడించారు. -
చేతులు కట్టుకొని కూర్చోం.. ఇంట్లోకి చొరబడి కొడతాం!
‘హిందూస్తాన్ అబ్ చుప్ నహి బైఠేగా. యే నయా హిందూస్తాన్ హై. యె ఘర్ మే గుసెగా భీ, ఔర్ మారేగా భీ’ (భారతదేశం ఇప్పుడు చేతులు కట్టుకొని కూర్చోదు. ఇది ఒకప్పటి భారతదేశం కాదు. ఇప్పుడు ఇంట్లోకి చొరబడటమే కాదు దెబ్బతీసి చూపిస్తాం).. ‘ఉడీ: ది సర్జికల్ స్ట్రైక్’ సినిమాలో అజిత్ ధోవల్ పాత్ర పోషించిన పరేశ్ రావల్ చెప్పిన డైలాగ్ ఇది.. 2016లో ఉడిలో భారత జవాన్లను టార్గెట్‌గా చేసుకొని ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. ఈ ఘటనకు ప్రతీకారంగా భారత్ సైన్యం తొలిసారి పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద తండాలపై సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించింది. ఈ సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంతో తెరకెక్కిన ‘ఉడీ’ సినిమా సంచలన విజయం సాధించింది. 40మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న పూల్వామా ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా మరోసారి పాక్‌కు బుద్ధి చెప్తూ సర్జికల్ స్ట్రైక్స్-2 నిర్వహించినట్టు భారత సైన్యం ప్రకటించింది. దీంతో ప్రతీకారంతో రగిలిపోతున్న భారతీయుల్లో ఆనందార్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పలు చోట్ల యువత, ప్రజలు రోడ్లమీదకు వచ్చి సంబరాలు జరుపుకుంటున్నారు. ఇక, సోషల్ మీడియాలో, వాట్సాప్ లాంటి మెసేజింగ్ యాప్‌ల్లో సర్జికల్ స్ట్రైక్స్-2 గురించే చర్చ జరుగుతోంది. చాలామంది ‘ఉడీ’లో పరేశ్ రావల్ చెప్పిన డైలాగ్‌ను ఉటంకిస్తున్నారు. భారత్ ఒకప్పటిలా సైలెంట్‌గా ఉండదు.. మాతో పెట్టుకుంటే ఇంట్లోకి చొరబడి కొడతాం.. అంటూ ఈ సినిమా డైలాగులను చాలామంది వాట్సాప్ స్టేటస్‌లుగా, ఫేస్బుక్లో పోస్టులుగా పెట్టుకుంటున్నారు. భారత వైమానిక దళానికి, సైన్యానికి సెల్యూట్ చేస్తున్నారు. జవాన్లును ఆత్మాహుతి దాడిలో మట్టుబెట్టిన ఉగ్రవాదులకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పైలట్లు గట్టిగా బుద్ధి చెప్పారని ప్రశంసిస్తున్నారు. మరో విశేషమేమిటంటే.. సర్జికల్ స్ట్రైక్-2 గురించి కథనాలు వెలువడగానే.. టోరంటో వెబ్సైట్లో ‘ఉడీ’ సినిమా కోసం సెర్చ్ కోసం సెర్చ్ చేసిన వారి సంఖ్య అమాంతం పెరిగిపోయింది. నెలన్నర కింద విడుదలై.. బ్లాక్‌బస్టర్ హిట్ అయిన ఈ సినిమాను మళ్లీ చూసేందుకు నెటిజన్లు ఎగబడ్డారు. -
కోర్టుకెళ్తున్న హీరోయిన్
సినిమాల కంటే కూడా ఒక ప్రముఖ ఫెయిర్‌నెస్ క్రీమ్ ప్రకటన ద్వారా ఎక్కువమందికి పరిచయమైన హీరోయిన్ యామి గౌతమ్. అయితే ఈ మధ్యకాలంలో ఈ ముద్దుగుమ్మ తరచుగా బాంబే హైకోర్టు బయట కనిపిస్తుంది. అది కూడా షాహీద్ కపూర్ కోసమంట. వీరిద్దరి మధ్య ఏమైనా వివాదాలు వచ్చాయా.. కోర్టుకెల్లేంత పెద్ద గొడవలు ఏం జరిగి ఉంటాయబ్బ అని ఆలోచిస్తున్నారా.. అయితే మీ ఆలోచనలకు అక్కడే ఫుల్స్టాప్ పెట్టండి. ఎందుకంటే యామి కోర్టుకు వెళ్తుంది విచారణ ఎదుర్కోవడానికి కాదు. తదుపరి చిత్రం ‘బట్టి గుల్ మీటర్ చలు’లో చేయబోయే లాయర్ పాత్ర కోసం ఈ అమ్మడు తరచు కోర్టుకు వెళ్తూ... లాయర్ల పనితీరు గురించి తెలుసుకుంటోంది. సినిమా అంటే ఎంత డెడికేషనో యామీకి! ప్రస్తుతం యామి.. శ్రీనారాయణ సింగ్ దర్శకత్వంలో, షాహిద్ కపూర్ హీరోగా రూపొందుతున్న ‘బట్టి గుల్ మీటర్ చలు’ సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శ్రద్ధాకపూర్ మరో కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. చిన్నపట్టణాల్లో ఎదురయ్యే విద్యుత్ సమస్యల ఆధారంగా రూపొందనున్న ఈ చిత్రంలో యామి లాయర్‌గా కనిపించనుంది. ‘కోర్టు ప్రొసిడింగ్స్ ఎలా ఉంటాయి. ప్రాసిక్యూషన్ బాధితుల పట్ల ఎలా ప్రవర్తిస్తుందో స్వయంగా తెలుసుకోవాలనుకున్నాను. ఈ విషయంలో నాకు సహాయం చేయమని ఒక లాయర్ స్నేహితురాలిని కోరాను. ఇప్పుడైతే కోర్టుకు సెలవులు కానీ అదృష్టం కొద్ది నా లాయర్ స్నేహితురాలు మరికొందరు లాయర్లు కలిసి ఒక వెకేషన్ బెంచ్ సెషన్‌ను నిర్వహిస్తున్నారు. షూటింగ్ ప్రారంభమయ్యేలోపు నిజంగా కోర్టులో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలుసుకునేందుకు కోర్టుకు హాజరవుతున్నా’ని యామి చెప్పారు. ‘బట్టి గుల్ మీటర్ చలు’ కాక ఆదిత్య ధార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఉరి’ చిత్రంలో కూడా ఆమె నటించనున్నారు. 2016, సెప్టెంబర్‌లో ‘ఉరి సెక్టార్’లో జరిగిన సంఘటనల ఆధారంగా తెరెకెక్కనున్న ఈ చిత్రంలో యామి పవర్‌పుల్ ఇంటిలిజెన్స్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. -
యూరియా కలిసిన నీరుతాగి గొర్రెలు మృతి
నస్పూర్(మంచిర్యాల): నస్పూర్ మండలం తీగల్‌పహాడ్ పంచాయతీ పరిధిలోని సంఘంమల్లయ్య పల్లెకు చెందిన పొనవేణి గట్టయ్యకు చెందిన 16 సబ్సిడీ గొర్రెలు మంగళవారం మృతి చెందాయి. ఎఫ్‌సీఐ గోదాముల వద్ద యూరియా కలిసిన నీటిని గొర్రెలు తాగడంతో తీవ్ర అస్వస్థతకు గురై మృతిచెందినట్లు బాధితుడు తెలిపాడు. గోదాముల్లో కింద పడిన యూరియాను పారవేయకుండా నీరుపోసి శుభ్రం చేయడంతో ఆ నీరు బయటకు వచ్చి నిలిచి ఉండడంతో గొర్రెలు తాగి చనిపోయాయని పేర్కొన్నాడు. గొర్రెలను మండల సహాయ పశు వైద్యురాలు పద్మ పరిశీలించారు. పరిహారం అందించి ఆదుకోవాలని బాధితుడు ప్రభుత్వాన్ని కోరాడు. మంగళవారం సాయత్రం మంచిర్యాల పశు వైద్యాధికారి ఎం.భూమయ్య, వైద్యులు సిద్దు పవార్, సంతోష్, పద్మలు గ్రామంలోని మిగతా గొర్రెలకు చికిత్స అందించారు. -
50 కేజీల యూరియా బస్తాకు మంగళం
సాక్షి, హైదరాబాద్ : యూరియా 50 కేజీల బస్తాకు కేంద్ర ప్రభుత్వం మంగళం పాడింది. ఇక నుంచి 2, 5, 10, 25, 45 కేజీల బస్తాలు అందుబాటులోకి రానున్నాయి. యూరి యా వాడకాన్ని తగ్గించేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని, ఆ మేరకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి మంగళవారం లేఖ రాశారు. బస్తా పరిమాణం తగ్గిస్తే బస్తాకు 5 కేజీల చొప్పున వాడకం తగ్గుతుందని చెప్పారు. ఈ విషయమై జిల్లాల్లో ఎరువుల దుకాణాదారులకు అవగాహన కల్పించాలని, అందుకు ఎరువుల డీలర్లతో సమావేశం నిర్వహించాలని కోరారు. -
ఆరుగురు జైషే ఉగ్రవాదుల హతం
శ్రీనగర్ : జమ్మూ,కశ్మీర్లో భారత భద్రతా దళాలకు మరో భారీ విజయం లభించింది యురి సెక్టార్లో భద్రతా బలగాలు - ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. భారత్‌లోకి అక్రమంగా చొరబడేందుకు యత్నించిన ఉగ్రవాదులను... భద్రతా దళాలు మధ్యలోనే అడ్డుకుని మట్టుబెట్టాయి. జమ్మూ,కశ్మీర్ పోలీసులు, ఆర్మీ, పారా మిలటరీ బలగాలు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో ముందుగా ఐదుగురు ఉగ్రవాదులు మరణించారు. అనంతరం తనిఖీలు నిర్వహించగా మరో ఉగ్రవాది.. జవాన్లపై కాల్పులు జరపడంతో ప్రతిగా జవాన్లు ఎదురు కాల్పులు జరపడంతో మరో ఉగ్రవాది మృతి చెందాడు. ఘటనా స్థలం నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్...భద్రతా దళాలను అభినందించారు. -
కశ్మీర్లో చొరబాటు యత్నం భగ్నం
శ్రీనగర్: కశ్మీర్‌లోని ఉడీ సెక్టార్లో భద్రతా బలగాలు పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీమ్(బ్యాట్) చొరబాటు యత్నాన్ని భగ్నం చేసి ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపెట్టాయి. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత ఈ ఘటన జరిగినట్లు ఆర్మీ అధికార ప్రతినిధి తెలిపారు. ఎల్వోసీ వెంట చొరబడటానికి ప్రయత్నించిన ఉగ్రవాదులను ఆర్మీ అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయని, అందులో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని తెలిపారు. చనిపోయిన ఉగ్రవాదుల వద్ద భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి లభ్యమైందని వెల్లడించారు. -
హిజ్బుల్ టాప్ కమాండర్ హతం
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని ఉడీ సెక్టార్లో హిజ్బుల్ టాప్ కమాండర్ అబ్దుల్ ఖయూం నజర్‌ను భారత బలగాలు మట్టుబెట్టాయి. గత 17 ఏళ్లలో దాదాపు 50కి పైగా హత్యలతో ప్రమేయమున్న నజర్ మరణంతో భద్రతా బలగాలు భారీ విజయం సాధించినట్లైంది. నియంత్రణ రేఖ వద్ద కశ్మీర్లోకి చొరబడేందుకు నజర్ ప్రయత్నిస్తుండగా.. ఎదురుకాల్పుల్లో అతను హతమైనట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. ‘సరిహద్దు వెంట ఉడీ సెక్టార్లో లచిపొరా వద్ద మంగళవారం ఉదయం చొరబాటు యత్నాల్ని భద్రతా దళాలు భగ్నం చేసి నజర్‌ను హతమార్చాయి. ఇటీవల హిజ్బుల్ టాప్ కమాండర్లు వరుసగా భారత బలగాల చేతిలో మరణించడంతో.. ఆ సంస్థ కమాండర్‌గా బాధ్యతలు చేపట్టడం కోసం నజర్ పాకిస్తాన్ నుంచి కశ్మీర్లోకి చొరబడేందుకు ప్రయత్నించాడు’ అని బారాముల్లా సీనియర్ ఎస్పీ ఇంతియాజ్ హుస్సేన్ చెప్పారు. అనేక మంది ప్రజలు, పోలీసులతో పాటు భద్రతా సిబ్బందిని నజర్ హత్యచేశాడని, పలు పేలుళ్ల కేసుల్లో అతని ప్రమేయముంద న్నారు. సొపోర్ పట్టణానికి చెందిన నజర్.. హిజ్బుల్ కమాండర్ అబ్దుల్ మజీద్ దార్ హత్యతో 2003లో ఉగ్ర జీవితాన్ని మొదలుపెట్టాడు. హిజ్బుల్‌తో భేదాభిప్రాయాల నేపథ్యంలో 2015లో పీఓకేలోని ముజఫరాబాద్ ఉగ్ర శిబిరానికి వెళ్లి అగ్ర నేతలతో చర్చలు జరిపాడు. ఇటీవల కశ్మీర్లో వరుసగా టాప్ కమాండర్లు హతమైన నేపథ్యంలో హిజ్బుల్‌కు పునరుత్తేజం తెచ్చే బాధ్యతల్ని నజర్‌కు అప్పగించారు. -
బలగాలు కీలక విజయం.. ఖయ్యూం ఖతం
-
ఎల్వోసీ వద్ద ఆర్మీ భారీ ఆపరేషన్!
-
ఎల్వోసీ వద్ద ఆర్మీ భారీ ఆపరేషన్!
శ్రీనగర్: ఆర్మీ ఆదివారం ఉదయం ఉగ్రవాదులను ఏరివేసేందుకు భారీ ఆపరేషన్‌ను చేపట్టంది. జమ్మూకశ్మీర్ వాస్తవాధీన రేఖ (ఎల్వోసీ) సమీపంలోని యూరీ సెక్టార్లో ఉగ్రవాదులను మట్టుబెట్టే ఆపరేషన్ కొనసాగిస్తోంది. ఎల్వోసీ సమీపంలోని కల్గాయ్ అడవిలో ముగ్గురు, నలుగురు ఉగ్రవాదులు మాటువేశారని నిఘా వర్గాలు సమాచారం అందించడం భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. ప్రస్తుతం ఉగ్రవాదులు, భద్రతాదళాల మధ్య భారీ ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదులను భద్రతా దళాలు రౌండప్ చేశాయని, ఉగ్రవాదులున్న ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం భారీ ఆపరేషన్ కొనసాగుతోందని, పెద్ద ఎత్తున గన్‌ఫైట్ జరుగుతోందని ఆ వర్గాలు వివరించాయి. ఈ ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాది మృతిచెందాడు. ఇతర ఉగ్రవాదుల కోసం భద్రతా దళాల వేట కొనసాగుతోంది. కాగా, బరాముల్లా జిల్లాలోని షోపూర్‌లోని ఎస్బీఐ బ్యాంకు వద్ద ఉగ్రవాదులు గ్రనేడ్ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ముగ్గురికి గాయాలు అయ్యాయి. -
ఎరువులు ప్రియం
అన్నదాతపై భారం మోపేందుకు రంగం సిద్ధం - వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అమలు - పన్ను తగ్గించాలని కోరుతున్న రైతు సంఘాలు - పాత నిల్వల్ని పాత రేటుకే ఇవ్వాలని డిమాండ్ సాక్షి, హైదరాబాద్: రైతులపై ఎరువుల భారం మోపేందుకు రంగం సిద్ధమైంది. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) నేపథ్యంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచే అన్ని రకాల ఎరువుల ధరలు పెరగనున్నాయి. ఇప్పటివరకు పన్నులు లేకుండా విక్రయిస్తున్న కొన్ని రకాల సూక్ష్మ పోషకాల ఎరువుల ధరలకు కూడా రెక్కలు రానున్నాయి. పెరిగిన ధరలు వచ్చేనెల ఒకటి నుంచి అమలవుతాయి. ఈ మేరకు ఎరువుల డీలర్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లాయి. మరోవైపు పాత నిల్వల్ని పాత రేటుకే పంపిణీ చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నెలాఖరులోగా కొనుగోలు చేసే వాటికే పాత ధరలు ఉంటాయని కంపెనీలు చెబుతున్నాయి. ఇప్పటికే కనీస మద్దతు ధర లేక కొట్టుమిట్టాడుతున్న రైతులను ఎరువుల ధరల పెంపు మరిన్ని నష్టాల్లోకి నెట్టేయనుంది. ఇక యూరియా బస్తా రూ.315 కేంద్ర ప్రభుత్వం అత్యధిక సబ్సిడీతో ఇచ్చే 50 కిలోల యూరియా బస్తాపై గరిష్టంగా రు.17.68 పెరగనుంది. ప్రస్తుతం యూరియా బస్తా రూ.298 ఉండగా జూలై ఒకటి నుంచి అది రూ.315.68 కానుంది. ఇప్పటి వరకు పన్నులు లేకుండా ఎరువుల్ని విక్రయించిన తమిళనాడు, పంజాబ్, హరియాణా, గుజరాత్ సైతం ఇకపై ఈ ధరకే విక్రయించాల్సి ఉంటుంది. డై అమోనియం పాస్పేట్ (డీఏపీ), కాంప్లెక్స్ ఎరువుల ధరలు కూడా పెరుగుతాయి. ప్రస్తుతం డీఏపీ బస్తా రూ.1,086.50 ఉండగా ఇకపై రూ.62 పెరిగి రూ.1,149 కానుందని కంపెనీలు చెబుతున్నాయి. డీలర్లు మాత్రం రు.76 పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఈ ఎరువుల ధరల ఉత్పత్తి వ్యయం ఆయా కంపెనీల సామర్థ్యం, స్థాపనను అనుసరించి ఉంటుంది. ఇఫ్కో, క్రిబ్కో వంటి కంపెనీల ధరలు కాస్త తక్కువగా, మద్రాస్ ఫెర్టిలైజర్స్ వంటి వాటి ధరలు కొంత ఎక్కువగా ఉంటాయి. తెలంగాణలో వానాకాలానికి 8 లక్షల మెట్రిక్ టన్నులు, యాసంగికి రూ. 5.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రచించింది. అలాగే వ్యవసాయ సీజన్‌కు 2.5 లక్షల డీఏపీని సరఫరా చేయాలని లక్ష్యంగా ప్రకటించింది. ఈ లెక్కన పెరిగే ధరలతో రైతులపై రూ.82.27 కోట్ల అదనపు భారం పడనుంది. పురుగు మందులపై 18 శాతం పన్ను దుక్కుల్లో వేసే జింక్, మెగ్నీషియం, ఇతరత్రా సూక్ష్మపోషకాలు, బయో ఫెర్టిలైజర్ల ధరలు సగటున 5.7 శాతం పెరగనున్నాయి. క్రిమిసంహారక మందులపై ఏకంగా 18 శాతం పెరుగుతాయని అంచనా. ఎరువులు, పురుగు మందులు, సూక్ష్మపోషకాలు అన్నింటి ధరలు పెరగడంతో రాష్ట్రంలో రైతులపై దాదాపు రూ.200 కోట్ల అదనపు భారం పడనుందని అంచనా వేస్తున్నారు. ఎరువులపై విధించే 12 శాతం పన్నుల్లో కేంద్రానికి 5, రాష్ట్రానికి 7 శాతం వస్తుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నోరెత్తడం లేదని రైతు సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. చెప్పులపై 12 శాతం పన్ను విధించినందుకు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రంతో పోరాడి తగ్గించుకున్నారని, రాష్ట్ర ప్రభుత్వం కనీసం కేంద్ర ఆర్థిక మంత్రికి లేఖ రాసి ఎరువులపై పన్ను తగ్గించేందుకు ఎందుకు ప్రయత్నించడం లేదని ప్రశ్నిస్తున్నారు. -
భారత్ కాల్పుల్లో ఇద్దరు పాక్ జవాన్ల హతం
-
భారత్ కాల్పుల్లో ఇద్దరు పాక్ జవాన్ల హతం
జమ్ము: పాకిస్తాన్ మరోసారి కాల్పులు విరమణ ఉల్లంఘనకు పాల్పడింది. అయితే పాకిస్తాన్‌కు భారత సైన్యం ధీటుగా సమాధానమిచ్చింది. జమ్ముకశ్మీర్‌లోని యురీ సెక్టార్లో పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీమ్‌కు చెందిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడింది. అప్రమత్తమైన భారత జవాన్లు పాక్ కాల్పులను సమర్థవంతంగా తిప్పికొట్టారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. పాక్ కాల్పులను భారత్ సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. కాగా గతంలో పాక్ బోర్డర్ యాక్షన్ టీమ్ సభ్యులు పలుమార్లు జవాన్లతో పాటు భారత్ పోస్టులపై తెగబడ్డారు. అంతేకాకుండా భారత్ జవాన్ల దేహాలను అత్యంత కిరాతంగా చింధ్రం చేసిన విషయం తెలిసిందే. -
శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో జవాను అరెస్ట్
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్ విమానాశ్రయంలో ఓ జవాను గ్రెనేడ్లతో రావడం కలకలం సృష్టించింది. ఉరీ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వద్ద విధులు నిర్వహించే ఓ జవాను సోమవారం ఢిల్లీ వెళ్లేందుకు శ్రీనగర్ ఎయిర్‌పోర్టుకు వచ్చాడు. విమానం ఎక్కబోతున్న అతడ్ని పోలీసులు తనిఖీ చేయగా.. అతని బ్యాగులో రెండు గ్రెనేడ్లను గుర్తించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు అతడిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. జవానును పశ్చిమ బెంగాల్‌కు చెందిన భూపాల్ ముఖియాగా పోలీసులు గుర్తించారు. ఆ గ్రెనేడ్లను జవాను ఢిల్లీలోని ఓ వ్యక్తికి అప్పజెప్పేందుకు వెళ్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని అటు ఆర్మీగానీ, ఇటు పోలీసులు గానీ అధికారికంగా వెల్లడించలేదు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆ దాడులకు బాధ్యులెవరు: ఒవైసీ
న్యూఢిల్లీ: భారత సైనికులే లక్ష్యంగా వరుసగా ఉగ్రవాద దాడులు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. మొన్నటికి మొన్న పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడి, ఉడీ ఉగ్రవాద దాడుల్లో పెద్ద ఎత్తున జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా జమ్మూకశ్మీర్‌లోని నగ్రోటా ఉగ్రవాద దాడిలో ఏడుగురు జవాన్లు అమరులయ్యారు. దేశ రక్షణలో భాగంగా వరుస దాడుల్లో సైనికులు ప్రాణాలు కోల్పోతున్న అంశాన్ని ప్రతిపక్ష సభ్యులు బుధవారం పార్లమెంటులో లేవనెత్తారు. ఈ అంశంపై కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ స్పందిస్తూ నగ్రోటా ఉగ్రవాద దాడిలో మరణించిన జవాన్లకు నివాళులర్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరినా వినిపించుకోలేదని, దీనిపై రక్షణమంత్రి సభలో ప్రకటన చేయలేదని విమర్శించారు. ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. నిఘా వైఫల్యం కారణంగా పఠాన్ కోట్, ఉడీ ఉగ్రవాద దాడులు జరిగాయని, తాజాగా నగ్రోటా దాడి జరిగిందని, ఈ దాడులకు ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నించారు. -
పోతూ కూడా ఇండియాకు వార్నింగ్ !
పాక్ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ నోటిదురుసు.. దిగిపోతున్న పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్ మంగళవారం భారత్‌కు వార్నింగ్ ఇచ్చాడు. కశ్మీర్ ఉద్రికత్తల విషయంలో తాము సంయమనంగా వ్యవహరించడాన్ని బలహీనతగా భావించవద్దని, అలా భావిస్తే ప్రమాదకరమైన పొరపాటేనని ఆయన అన్నారు. పదవీ నుంచి దిగిపోతున్న రహీల్ షరీఫ్ తన వారసుడైన కొత్త ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వాను ఆహ్వానిస్తూ రావాల్పిండి ఆర్మీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ‘దురదృష్టవశాత్తు ఇటీవలికాలంలో ఆక్రమిత కశ్మీర్లో ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం పెరిగిపోయింది. భారత్ దురాక్రమణపూరిత చర్యలకు దిగుతుండటంతో ఈ ప్రాంతంలో శాంతిభద్రతలు ప్రమాదంలో పడ్డాయి’ అని షరీఫ్ అన్నారు. ‘మా సంయమనాన్ని బలహీనతగా భావిస్తే.. అది భారత్‌కు ప్రమాదకరమేనని నేను ఆ దేశానికి స్పష్టం చేయదలిచాను’ అని పేర్కొన్నారు. ఉడీ ఉగ్రవాద దాడి అనంతరం అణ్వాయుధ దేశాలైన భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయిన సంగతి తెలిసిందే. ఉడీ ఉగ్రవాద దాడి అనంతరం పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించడం, అనంతరం సరిహద్దుల్లో వరుస కాల్పులతో ఉద్రిక్తతలు పెరిగిపోయిన సంగతి తెలిసిందే. -
గురి చూశాకే తుపాకీ పేలుస్తున్నారా?
అవలోకనం నేడు మనకున్న అత్యంత విశ్వసనీయత గల నేత మోదీయే. మరే ఇతర నేతా ఆత్మవిశ్వాసంతో దేశాన్ని ఇంతటి కల్లోలంలోకి విజయవంతంగా నడపలేరు. వచ్చే రెండున్నరేళ్లలో కూడా ఆయన తన జనాకర్షణను నిలబెట్టుకుంటారు. 2019 ఎన్నికల్లో ఆయన్ను ఓడించటం చాలా కష్టం. ఆయన చేపట్టిన చర్యలు చాలా వాటి పర్యవసానాలు ఈలోగానే వెల్లడి కావాలని కోరుకుంటున్నాను. గొప్ప ఆలోచనతో పులకరించి పోవడమే గాక, దాని వివరాల పట్ల ఆసక్తి కూడా మన ప్రధానికి ఉన్నదా? లేదా? అనేది తేలడం ఆయనకూ, మనకూ కూడా మంచిది. యూరోపియన్ యూనియన్ ఏర్పాటు అనే భావనకే ఫ్రెంచి నేత జిస్కార్ డెస్టాంగ్ పులకరించి పోయేవాడుగానీ, దాని వివరాలు మాత్రం ఆయనకు విసు గెత్తించేవని అంటారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టే చాలా అంశాలలో అదే ధోరణి కనిపిస్తున్నదేమోనని తరచూ నాకు అనుమానం కలుగుతుంటుంది. నరేంద్ర మోదీ నల్ల ధనంపై భారీ దాడిని ప్రారంభించిన తదుపరి గడచిన రెండు వారా లకు సంబంధించి రెండు వాస్తవాలను ఒప్పుకోవడం సమంజసం. ఒకటి ఇంతటి అసౌకర్యం తర్వాత కూడా మోదీ తనకున్న విస్తృతమైన ప్రజా మద్దతును నిల బెట్టుకుంటున్నారు. రెండు నగదు కొరత వల్ల తలెత్తుతున్న ఆర్థిక సమస్యలు పేరు కుపోతూనే ఉన్నాయని వార్తా నివేదికలు తెలుపుతున్నాయి. అది సూరత్ నుంచే అయినా లేదా లూథియానా లేదా మొరాదాబాద్ వంటివే అయినా మన వస్తుతయారీ కేంద్రాలన్నిటి నుంచి వస్తున్న వార్తా నివే దికలన్నీ ఒకేలా ఉంటున్నాయి. వస్తుతయారీ యూనిట్లు తక్కువ ఉత్పత్తి సామ ర్థ్యంతో పని చేస్తున్నాయనో లేదా మూత పడ్డాయనో తెలుపుతున్నాయి. అవి తయారు చేసే వస్తువులకు గిరాకీ లేకపోవడమూ, ముడి పదార్థాల కొనుగోలుకు నగదు అంటుబాటులో లేకపోవడం అందుకు కారణం. అవి శ్రామికులను పనిలో కొనసాగించడానికి విముఖతను చూపడం, వలస కార్మికులను తొలగించడం లేదా వారి స్వస్థలాలకు పంపివేయడం సర్వత్రా కనిపిస్తున్న మరో సామాన్యాంశం. దీనికి సంబంధించిన సరైన గణాంక సమాచారం కోసం మనం ఇంకా వేచి చూడాల్సి ఉంది. అయినాగానీ ఘటనల నివేదికలు పరిస్థితిని సూచించే సంకే తాలు అయినట్లయితే డిసెంబర్‌లోనూ, కొత్త సంవత్సరంలోనూ ఇంకా పెద్ద సమస్య తలెత్తనున్నదని అనిపిస్తుంది. ఉద్దేశపూర్వకంగా కొని తెచ్చుకున్న ఈ అనిశ్చిత పరిస్థితిలో కూడా మోదీ జనాదరణ విస్తృతమైనదిగానూ, భారీగానూ ఉన్నదనేది నిర్వివాదాంశం. ఇందుకు కారణంఏమిటి? ఇది మోదీ పదవీ కాలం నట్ట నడుమకు చేరిన సమయం కూడా కాబట్టి ఆ విషయాన్ని పరిశీలిద్దాం. అద్భుతమైన పథకాలను ప్రారంభించడం, గొప్ప ప్రకటనలను చే యడమే ఇంతవరకు గడచిన మోదీ పాలనలో కనిపించే విశిష్ట లక్షణం. ఇవన్నీ ప్రజల దృష్టిని, ప్రత్యేకించి మీడియా దృష్టిని ఆకట్టుకున్నాయి. మేక్ ఇన్ ఇండియా, బుల్లెట్ ట్రైన్, స్మార్ట్ నగరాలు, స్వచ్ఛ భారత్, లక్ష్యిత దాడులు, పెద్ద నోట్ల రద్దు వగైరా. ఇవన్నీ, ఇంకా ఇతరత్రా మోదీ చొరవ చూపిన అంశాలన్నిటిలో ఒకే పద్ధతి కనిపిస్తుంది. ఇవన్నీ గతంతో పూర్తిగా తెగతెంపులు చేసుకోవడానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. పాతను, కృశించిపోతున్నదాన్ని తుంచి పారేసి, దాని స్థానంలో కొత్తదాన్ని, మరింత మెరుగైనదాన్ని తెస్తామని వాగ్దానం చేసేవి. అవి ఈ లక్ష్యాన్ని ఏ మేరకైనా సాధించాయా? వాటి నిజ పర్యవసానాలు ఏమిటి? కాలక్రమేణానే అవి మనకు తెలుస్తాయి. ఒక ఉదాహరణను చూద్దాం. ఉడీ ఉగ్రదాడి తదుపరి జరిపిన లక్ష్యిత దాడులు... వాస్తవాధీన రేఖకు అవతల నుంచి పంపుతున్న వారు చేస్తున్న హింసా కాండకు ప్రతిస్పందనగా చేసినవి. ఆ తదుపరి మనం 20 మంది సైనికులను కోల్పోయాం. లక్ష్యిత దాడులకు ముందు సాపేక్షికంగా శాంతియుతంగా ఉండిన వాస్తవాధీన రేఖ ఆ తదుపరి భగ్గున మండుతుండటమే అందుకు ప్రధాన కారణం. తిరిగి కాల్పుల విరమణ నెలకొన్నదని మన రక్షణ మంత్రి అంటున్నారు. అయితే ఈలోగా 20 మంది భారత సైనికులను కోల్పోవాల్సి వచ్చింది. కాబట్టి లక్ష్యిత దాడులను జరపాలనేది మంచి నిర్ణయమేనా? ఈ ప్రశ్నకు ఏ విధంగా సమాధానం చెప్పినా అది జాతి వ్యతిరేకమైనదే అవుతుంది. కాబట్టి దీన్ని ఇంత టితో వదిలేద్దాం. ఏదేమైనా భారత సైనికుణ్ణి ఆరాధించవ లసిందే. అతడు తనం తట తానుగా ఆత్మబలిదానాలు చేయాల్సిందేనని నేనంటాను. సైనికుడు దేశం కోసం చేసిన త్యాగాల పట్ల మనకు పూజ్యభావం ఉన్నదే తప్ప, అతని ప్రాణాల పట్ల గౌరవం మాత్రం లేదు. ప్రధాని మోదీ గొప్ప ప్రకటనల పర్యవసానాల వల్ల ప్రయోజనాలు కలిగే దెవరికో, నష్టపోయేది ఎవరో మనకు కచ్చితంగా తెలియదు. చాలా వరకు ప్రకటనల తీరు ఇంతేనని చెప్పుకోవచ్చు. అయితే నల్ల ధనంపై చేపట్టిన లక్ష్యిత దాడి నిజ ఫలితాలు ఏమిటో తెలియడానికి మరింత ఎక్కువ సమయం పడుతుందనే మాట నిజమే. కానీ మనం దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ప్రవేశపెట్టనున్న బుల్లెట్ ట్రైన్ మాటేమిటి? అణు సరఫరాదారుల గ్రూపులో (ఎన్ఎస్జీ) స్థానాన్ని సాధించడానికి మనం వెచ్చిస్తున్న దౌత్యశక్తి, ప్రధాని వ్యక్తిగత ప్రతిష్టల సంగ తేమిటి? వాటి పర్యవసానాలను గురించి అవసరమైనంత లోతైన విశ్లేషణ జరిపారా? నేనిక్కడ ఉద్దేశాలను ప్రశ్నించడం లేదు. కాకపోతే ముందుగా తుపాకీ పేల్చి, తర్వాత గురి చూడటం అనే వైఖరిని ప్రభుత్వం అవలంబిస్తున్నదేమోననే నా అనుమానం నిరాధారమైనదేనా? అని తెలుసుకోవాలనే నా కుతూ హలమంతా. నేడు మనకున్న అత్యంత విశ్వసనీయత గల నేత మోదీయే. మరే ఇతర నేతా ఆత్మవిశ్వాసంతో దేశాన్ని ఇంతటి కల్లోలంలోకి విజయవంతంగా నడపలేరు. వచ్చే రెండున్నరేళ్లలో కూడా ఆయన తన జనాకర్షణను నిలబెట్టుకుంటారు. 2019 ఎన్ని కల్లో ఆయన్ను ఓడించటం చాలా కష్టం. ఆయన చేపట్టిన చర్యలు చాలా వాటి పర్యవసానాలు ఈలోగానే వెల్లడి కావాలని నేను కోరుకుంటున్నాను. గొప్ప ఆలో చనతో పులకరించి పోవడమే గాక, దాని వివరాల పట్ల ఆసక్తి కూడా ఆయనకు ఉన్నదా? లేదా? అనేది తేలడం ఆయనకూ, మనకూ కూడా మంచిది. ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత ఈ-మెయిల్ : aakar.patel@icloud.com -
అమ్మ నా మాటలు నమ్మలేదు: నటి
న్యూఢిల్లీ: ముస్లిం వ్యాపారవేత్త జీవితంలో చోటుచేసుకున్న సంఘటనల సమాహారంగా రూపొందుతోన్న మూవీ ‘రాయిస్’. ఈ మూవీలో బాలీవుడ్ బాద్షా హీరో కాగా, పాకిస్తాన్ నటి మహీరాఖాన్ ఈ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఉడీలో పాక్ ఉగ్రదాడుల తర్వాత దాయాది దేశానికి చెందిన ఆర్టిస్టులపై నిషేధం, వారు నటించిన మూవీలను విడుదలను అడ్డుకోవాలంటూ 'రాయిస్', 'ఏ దిల్ హై ముష్కిల్' లపై ఇటీవల పెనుదుమారం చెలరేగింది. తాజాగా ఈ మూవీకి సంబంధించి మహీరా కొన్ని విషయాలను తెలిపింది. తన తల్లికి బాలీవుడ్ ఎంట్రీ విషయం చెప్పగా ఆమె పెద్దగా షాక్ కాలేదని, అయితే స్టార్ హీరో షారుక్ సరసన నటిస్తున్నానని చెబితే నమ్మలేదని చెప్పింది. 'నువ్వు అబద్దం చెబుతున్నావు, ఎందుకంటే షారుక్ లాంటి అగ్రహీరో మూవీతో ఎంట్రీ ఛాన్స్ దక్కడం ఎవరికైనా కష్టమే' అన్న మా అమ్మ ఈ విషయాన్ని నమ్మిన వెంటనే ఉద్వేగానికి లోనై ఒక్కసారిగా ఏడ్చేసిందని నటి మహీరా చెప్పుకొచ్చింది. మోహసినా అనే పాత్రలో తాను రాయిస్ లో కనిపించనుంది. వచ్చే ఏడాది జనవరి 26న మూవీని విడుదల చేయాలని యూనిట్ భావిస్తోంది. -
ఉడీ ఉగ్రదాడిలో కూడా ఇంతమంది చనిపోలేదు
-
ఉడీ ఉగ్రదాడిలో కూడా ఇంతమంది చనిపోలేదు: ఆజాద్
పాక్ ఉగ్రవాదులు ఉడీలో సైనిక శిబిరంపై దాడిచేసి, భారత సైనికులను దారుణంగా హతమార్చిన విషయమై రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర గందరగోళానికి దారితీశాయి. 500, 1000 రూపాయల నోట్లను రద్దుచేయడంలో ప్రభుత్వ తప్పుడు విధానం వల్ల ఇప్పుడు చనిపోతున్నవారిలో సగం మంది కూడా ఉడీ ఉగ్రదాడిలో మరణించలేదని గులాం నబీ రాజ్యసభలో వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభకు వచ్చి సమాధానం చెప్పేవరకు సభను నడవనిచ్చేది లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే.. ఈ సమయంలో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఒకవైపు కొంతమంది ప్రతిపక్ష సభ్యులు పోడియం వద్దకు వచ్చి తీవ్రస్థాయిలో నినాదాలు చేయడంతో గులాం నబీ ఏమన్నారో సరిగా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. కానీ, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మాత్రం ఆయన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకుడు జాతిని అవమానిస్తున్నారని ఆయన అన్నారు. ఈ ఘటనను పాక్ ఉగ్రవాద దాడులతో ఆయన పోలుస్తున్నారని.. అందుకు ఆయన క్షమాపణ చెప్పి తీరాలని, ఈ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అయితే తాను రికార్డులు పరిశీలించి తగిన చర్య తీసుకుంటానని సభాధ్యక్షుడు పీజే కురియన్ చెప్పారు. వెంకయ్య వ్యాఖ్యలతో మరింత ఆగ్రహానికి గురైన గులాం నబీ ఆజాద్.. ''మీరు పాకిస్థాన్‌లో పెళ్లిళ్లు, ఫంక్షన్లకు వెళ్లి వచ్చి, వాళ్లకు రెడ్ కార్పెట్లు పరుస్తారు, మీరు మాకు చెబుతారా.. పాకిస్థాన్ కాల్పులకు ప్రతిరోజూ గురయ్యే రాష్ట్రానికి చెందినవాడిని నేను. మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు'' అని ఆయన అన్నారు. అయితే వెంకయ్య నాయుడు మాత్రం తన వాదనకు కట్టుబడి ఉండి.. గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని, ఆయన క్షమాపణ చెప్పాలని పట్టుబట్టారు. ఈ గందరగోళం నడుమ రాజ్యసభ శుక్రవారానికి వాయిదా పడింది. -
ఉడీ ఉగ్రదాడి; సంచలన వాస్తవం
జమ్మూకశ్మీర్ లోని ఉడీ సైనిక స్థావరంపై దాడి పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే-ఈ-తొయిబా పనేనని వెల్లడైంది. పాకిస్థాన్ లోని గుజ్రాన్ వాలా పట్టణంలో వెలసిన పోస్టర్లు ఇందుకు సాక్షంగా నిలుస్తున్నాయి. ఉడీ దాడిలో హతమైన ఉగ్రవాది మహ్మద్ అనాస్ అలియాస్ అబూ సిరాఖా అంత్యక్రియలు సందర్భంగా నిర్వహించే ప్రత్యేక నమాజ్ కు రావాలంటూ స్థానికులను ఆహ్వానిస్తూ గుజ్రాన్ వాలాలో పోస్టర్లు వెలిశాయని 'ఇండియన్ ఎక్స్ ప్రెస్' వెల్లడించింది. 'ఎంతో ధైరవంతుడైన మత పోరాటయోధుడు అబూ సిరఖా మహ్మద్ అనాస్.. ఆక్రమిత కశ్మీర్ లో ఉడీ బ్రిగేడ్ క్యాంపులో 177 మంది హిందూ సైనికులను నరకానికి పంపాడు. మతం కోసం అతడు ప్రాణత్యాగం చేశాడ'ని ఈ పోస్టర్లలో పేర్కొన్నారు. మహ్మద్ అనాస్ ఫొటోతో పాటు లష్కరే-ఈ-తొయిబా అధినేత హఫీజ్ మహ్మద్ సయీద్ చిత్రాన్ని పోస్టర్లతో ముద్రించారు. అనాస్ మృతదేహం లేకుండా అతడి అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. గుజ్రాన్ వాలా పట్టణంలోని గిర్ జాఖ్ సమీపంలో బాదానుల్లా ప్రాంతంలో అంత్యక్రియలు జరపనున్నట్టు తెలిపారు. ఉడీ దాడి పాకిస్థాన్ ఉగ్రవాదుల పనేనని భారత్ చేస్తున్న వాదనకు ఈ పోస్టర్లు సాక్ష్యంగా నిలిచాయి. ఉడీ దాడితో సంబంధం లేదని బొంకుతున్న పాకిస్థాన్ దీనికి ఏం సమాధానం చెబుతుందో చూడాలి. అయితే పాకిస్థాన్ కే చెందిన జైషే-ఈ-మహ్మద్ ఉగ్రవాద సంస్థ ఉడీ దాడికి పాల్పడిందన్న అనుమానాన్ని ప్రాథమికంగా భారత్ వ్యక్తం చేసింది. తాజాగా వెలుగుచూసిన పోస్టర్లతో ఇది లష్కరే-ఈ-తొయిబా ఘాతుకంగా వెల్లడైంది. కుట్రదారులను గుర్తించడం, ఆధారాల సేకరణలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు ఇప్పటివరకు స్పష్టమైన పురోగతి సాధించలేకపోయారు. ఉడీ దాడిలో హతమైన ఉగ్రవాదుల వద్ద రెండు జర్మనీ తుపాకులు దొరికాయి. అయితే వీటిలో ఒకటి పూర్తిగా ధ్వంసమైంది. మరో తుపాకీని ఫోరెన్సిక్ నిపుణులు పరీక్షిస్తున్నారు. ఘటనా స్థలంలో దొరికిన మందులు, ఆహార పొట్లాలు ఉగ్రవాదులు పాకిస్థాన్ కు చెందిన వారని నిర్ధారించినా.. వారు ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవారో కచ్చితంగా నిర్దరణకు వచ్చే అవకాశం కల్పించలేకపోయాయి. ఉగ్రవాదులకు చొరబాటుకు సహకరించారనే ఆరోపణలతో అరెస్టు చేసిన అహసాన్ ఖుర్షీద్, ఫైసాల్ అవాన్ కూడా పరస్పర విరుద్ధ వాంగూల్మం ఇవ్వడంతో దర్యాప్తు ముందుకు సాగడం లేదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో గుజ్రాన్ వాలాలో వెలుగుచూసిన పోస్టర్లు సాక్ష్యంగా నిలబడతాయా, లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. ఉడీ దాడిలో హతమైన మిగతా ముగ్గురు ఉగ్రవాదుల స్వస్థలాల్లో కూడా ఇదేవిధంగా పోస్టర్లు వెలిశాయో, లేదో తెలియదని 'ఇండియన్ ఎక్స్ ప్రెస్' పేర్కొంది. సెప్టెంబర్ 18న ఉడీ సైనిక స్థావరంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 20 సైనికులు మృతి చెందారు. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. -
ఉడీ ఉగ్రదాడులను ఖండించిన జపాన్
తమ దేశం కూడా ఉగ్రవాద బాధిత దేశమేనని జపాన్ రాయబారి కెంజి హిరమట్సు అన్నారు. 19 మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయిన ఉడీ ఉగ్రదాడిని తమ దేశం ఖండిస్తోందని ఆయన తెలిపారు. ఉగ్రవాదంపై పోరాడాలంటే సమాచార మార్పిడి, నిఘా విషయాలు పంచుకోవడం చాలా ముఖ్యమన్నారు. ''ఉడీలో భారత సైనిక స్థావరంపై జరిగిన ఉగ్రదాడిని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం'' అని హిరమట్సు చెప్పారు. జపాన్ కూడా ఉగ్రవాద బాధిత దేశమేనని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. గత జూలై నెలలో జరిగిన ఢాకా ఉగ్రదాడిలో ఒక భారతీయ యువతితో పాటు ఏడుగురు జపనీయులు కూడా మరణించారని ఆయన గుర్తుచేశారు. ఢాకాలోని హోలీ ఆర్టిసాన్ బేకరీలో జరిగిన ఉగ్రదాడిలో మొత్తం 29 మంది ప్రాణాలు కోల్పోయారు. అందుకే, ఉగ్రవాదంపై పోరాటంలో జపాన్, భారతదేశం కలిసి మెలిసి ఉండాలని.. నిఘా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని హిరమట్సు తెలిపారు. -
పాక్ సిద్ధమే.. భారత్ సిద్ధమేనా: షరీఫ్
ఇస్లామాబాద్: భారత్ తో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నారు. కశ్మీర్ సమస్యలను పరిష్కారించాలని భారత్ కూడా భావించినట్లయితే అందుకు తమకు ఏ అభ్యంతరం లేదని షరీష్ తెలిపారు. మూడో రోజుల పర్యటనలో భాగంగా అజర్ బైజాన్, బాకులో ఉన్న పాక్ ప్రధాని మీడియాతో మాట్లాడాతూ.. కశ్మీర్లో కొనసాగుతున్న హింస, ఇతర ముఖ్య సమస్యలపై చర్చించాలని పాక్ పలు పర్యాయాలు భారత్ కు ఆహ్వానం పంపినా ప్రయోజనం లేకపోయిందన్నారు. భారత్-పాక్ మధ్య అశాంతియుత వాతావరణం నెలకొనడానికి కశ్మీర్ అంశమే ప్రధాన కారణమని షరీష్ అభిప్రాయపడ్డారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సూచన మేరకు భారత్ కూడా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలని చెప్పారు. ఉడీలోని భారత ఆర్మీ క్యాంపుపై జరిగిన ఉగ్రదాడికి పాకిస్తాన్ పనేనన్న భారత్ ఆరోపణలను మరోసారి కొట్టిపారేశారు. లైన్ ఆఫ్ కంట్రోల్(ఎల్వోసీ) వద్ద పాక్ ఎలాంటి చొరబాట్లకు యత్నించలేదన్నారు. ఉడీలో జరిగిన ఉగ్రదాడిలో 19 మంది భారత జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. -
పాకిస్థాన్‌కు మరోసారి అమెరికా స్ట్రాంగ్ మెసేజ్!
వాషింగ్టన్: తన భూభాగాన్ని స్వర్గధామంగా మార్చుకొని కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాదులందరినీ ఏరిపారేయాల్సిందేనని పాకిస్థాన్‌కు అమెరికా మరోసారి స్పష్టం చేసింది. పాకిస్థాన్ భూభాగంలో పనిచేస్తున్న ఉగ్రవాద గ్రూపులన్నింటినీ అక్రమమైనవిగా గుర్తించి.. నిర్మూలించాలని సూచించింది. 'పాకిస్థాన్ భూభాగంలో పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలన్నింటిపై ఉక్కుపాదం మోపాల్సిందేనని మేం ఆ దేశాన్ని కోరుతూనే ఉన్నాం' అని అమెరికా విదేశాంగ డిప్యూటీ అధికార ప్రతినిధి మార్క్ టోనర్ శుక్రవారం విలేకరులకు తెలిపారు. ఉగ్రవాదులు, హింసాత్మక అతివాదుల కారణంగా పాకిస్థానే ఎక్కువగా నష్టపోయిందని ఆయన గుర్తుచేశారు. ఉగ్రవాద ముప్పుపై పోరాటంలో పాకిస్థాన్‌కు తాము సాయం అందిస్తామని, అయితే పాకిస్థాన్ భూభాగాన్ని తమకు స్వేచ్ఛాయుత ఆవాసంగా మార్చుకున్న ఉగ్రవాదులపై ఆ దేశం చర్య తీసుకోవాల్సిందేనని ఆయన స్పష్టంచేశారు. 19 మంది సైనికులను పొట్టనబెట్టుకున్న ఉడీ ఉగ్రవాద దాడితో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయిన సంగతి తెలిసిందే. దీంతో భారత సైన్యం పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ దాడులు జరిపింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులపై భారత సైన్యం జరిపిన దాడులను అమెరికా సమర్థించింది. ఉడీ దాడీ సీమాంతర ఉగ్రవాదానికి స్పష్టమైన నిదర్శనమని తేల్చిచెప్పిన అగ్రరాజ్యం... ఉగ్రవాద ముప్పుపై సైనిక చర్యలతో బదులు చెప్పాల్సిన అవసరముందంటూ భారత్ వైఖరిని సమర్థించింది. -
'మన వీర ఠాకూర్‌ను చంపేస్తారంట!'
న్యూఢిల్లీ: 'ఒక వేళ యుద్ధం వస్తే కశ్మీర్ ఉంటుంది. అది కూడా భారత్ లోనే ఉంటుంది. కానీ పాకిస్థాన్ మాత్రం ఉండదు' అంటూ కశ్మీర్‌కు సంబంధించి దేశభక్తి పద్య రూపంలో పాక్‌కు చాలా స్ట్రాంగ్ ఇచ్చిన భారత ప్రాదేశిక సైనిక విభాగంలో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ మనోజ్ ఠాకూర్‌కు బెదిరింపులు వస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది ఉగ్రవాదులే కాకుండా, నేరుగా పాక్ పౌరుల్లో రాడికల్ వర్గానికి చెందినవారు ఆయనకు పరోక్షంగా హెచ్చరికలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఠాకూర్‌ని త్వరలోనే చంపేస్తామని ఉగ్రవాదులు బెదిరిస్తున్నాంట. జమ్ముకశ్మీర్‌లోని ఉడీ సెక్టార్‌పై అనూహ్యంగా పాక్ ఉగ్రవాదులు దాడులు చేసి 18మంది వీర జవాన్లను బలితీసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన సమయంలోనే హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ ప్రాంతంలో భారత ప్రాదేశిక సైనిక విభాగంలో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న మనోజ్ ఠాకూర్ ఉడీ ఘటనకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సింహం(భారత్) ఎవ్వరికీ భయపడదని, ఈ విషయం పాక్ తెలుసుకుంటే మంచిదంటూ వార్నింగ్ ఇచ్చాడు. గతంలో భారత్ పలుమార్లు పాక్‌ను యుద్ధంలో మట్టికరిపించిన సందర్భాలు గుర్తు చేశాడు. కశ్మీర్ ఎప్పటికీ భారత్ లోనే ఉంటుందని, మరోసారి యుద్ధం వస్తే పాక్ మిగలదని, కశ్మీర్ మాత్రం ఉంటుందంటూ ఒక దేశ భక్తి రూప పద్యంలో వీడియో ద్వారా వార్నింగ్ ఇచ్చాడు. ఈ వీడియో పెద్ద వైరల్ అయింది. దీనిని ఇప్పటికే లక్షల మంది వీక్షించారు. దీన్ని చూసిన ఉగ్రవాదులు, పాక్ లోని కొంతమంది రాడికల్ ప్రజలు ఠాకూర్ ను చంపేస్తామంటూ హెచ్చరిస్తున్నారని కథనాలు వస్తున్నాయి. -
ఉడీ ఉగ్రదాడులపై నోరువిప్పిన పాక్ నటి
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ లో జరిగిన ఉడీ ఉగ్రదాడులపై పాకిస్తాన్ ఆర్టిస్టులు ఒక్కొక్కరుగా నోరు విప్పుతున్నారు. తొలుత ఫవాద్ ఖాన్ ఉడీలో జరిగిన ఉగ్రదాడులను ఖండించగా.. ప్రస్తుతం పాకిస్తాన్ నటి మహీరాఖాన్ సోషల్ మీడియా ద్వారా ఈ ఘటనను వ్యతిరేకించింది. ఉడీలో పాక్ ఉగ్రదాడులు, అనంతరం భారత్ సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించడంతో దాయాది దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో పాక్ ఆర్టిస్టులపై నిషేధం విధించారు. మొదట ఫవాద్ ఖాన్ స్పందిస్తూ.. తన భార్యకు డెలివరీ ఉందని తాను మూడు నెలలుగా పాక్ లోనే ఉన్నానని, అయితే ఉగ్రదాడులు ఏ దేశం చేసినా తీవ్రంగా చర్యలు తీసుకోవాలని చెప్పాడు. భవిష్యత్తులో తమ పిల్లలు ఎక్కడ ఉన్నా ఒప్పుకుంటారు కానీ ఉగ్రదాడులు జరిగే ప్రాంతాల్లో ఉండాలని ఏ తల్లిదండ్రులు కోరుకోరని మహీరాఖాన్ తెలిపింది. ఇరుదేశాలు శాంతిని పాటించాలని, ఉగ్రదాడుల వల్ల ఎంతో ప్రాణనష్టం జరుగుతుందని ఆమె ఆందోళన వ్యక్తంచేసింది. గత ఐదేళ్లుగా నటిగా కొనసాగుతున్న తాను పాక్ గౌరవానికి భంగం వాటిల్లేలా ఎప్పుడూ ప్రవర్తించలేదని పేర్కొంది. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న 'రాయిస్' సినిమాతో పాక్ నటి మహీరాఖాన్ బాలీవుడ్‌కు పరిచయం కానుంది. పాక్ ఆర్టిస్టులపై నిషేధం విధించడంతో 'రాయిస్' మూవీ షూటింగ్ మధ్యలోనే మహీరా పాక్ కు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ముస్లిం వ్యాపారవేత్త జీవితంలో చోటుచేసుకున్న సంఘటనల సమాహారంగా రూపొందుతోన్న ‘రాయిస్’ చిత్రంపై పాకిస్తాన్ లో ఇదివరకే ఆంక్షలు మొదలయ్యాయి. షారుఖ్ ఖాన్, మహీరా ఖాన్ జంటగా నటిస్తోన్న ‘రాయిస్’ను పాకిస్తాన్ లోనూ అధికారికంగా విడుదల చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తుండగా.. సన్నీలియోన్, షారుక్ పై చిత్రీకరించిన ఆ ఐటం పాటపై పాక్ అభ్యంతరాలు లేవనెత్తడంతో అక్కడ ఈ పాటను కట్ చేసి మూవీ రిలీజ్ చేయనున్నారు. -
ఆ నాయకులకు విషమివ్వండి: ఉడీ ఉగ్రదాడి బాధితులు
సర్జికల్ స్ట్రైక్స్‌ను ప్రశ్నిస్తున్న నాయకులపై భారత నాయకులపై ఉడీ ఉగ్రదాడి బాధితులు తీవ్రంగా మండిపడుతున్నారు. అసలు సర్జికల్ దాడులు చేయాల్సింది కూడా ఉగ్రవాదుల మీద కాదని, ముందుగా ఇలాంటి నాయకుల మీద అని అంటున్నారు. సర్జికల్ దాడులు జరిగాయా లేదా.. సైన్యం సరిహద్దుల్లో ఎప్పుడూ జరిపే కాల్పులనే అలా చిత్రీకరించిందా అంటూ కొందరు నాయకులు అనుమానాలు వ్యక్తం చేయడంతో ఉడీ ఉగ్రదాడిలో తమవాళ్లను కోల్పోయిన కుటుంబాల సభ్యులు తీవ్ర ఆగ్రహావేశాలకు లోనవుతున్నారు. ఉడీ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన హవల్దార్ అశోక్ కుమార్ సింగ్ కుటుంబం కూడా ఈ నాయకుల మీద దాడులు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరుతోంది. 'సర్జికల్ దాడుల గురించి ప్రశ్నిస్తున్న నాయకులు ద్రోహులని అశోక్ కుమార్ సింగ్ భార్య సంగీతాదేవి అన్నారు. ఉగ్రవాదులు దేశంలోకి చొరబడటానికి ఇలాంటి నాయకులే కారణమని, అసలు సర్జికల్ దాడులు నిజంగానే జరిగాయని వీళ్లు ఎందుకు అర్థం చేసుకోరని ఆమె ప్రశ్నించారు. మన దేశానికి చెందిన నాయకులే భారత సైన్యం నిబద్ధతను ప్రశ్నించడం తనను ఎంతగానో బాధించిందని ఆమె చెప్పారు. పాకిస్థాన్ ఎప్పుడూ ఉగ్రవాద దేశమేనని, వాళ్లు మన దాడులను ప్రశ్నించడం మమూలే గానీ మనవాళ్లు కూడా వాళ్లలాగే మాట్లాడటం షాక్ కలిగించిందన్నారు. ఒక అమర సైనికుడి కుటుంబం ఎంత బాధపడుతుందో వాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని తెలిపారు. ఇలాంటి నాయకులకు విషమిచ్చి చంపాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు పి.చిదంబరం, సంజయ్ నిరుపమ్ కూడా సర్జికల్ దాడుల వీడియోలను బయట పెట్టాలని డిమాండ్ చేయడం, పాక్ పత్రికలలో వాళ్ల డిమాండ్లు పతాక శీర్షికలలో కనిపించడం తెలిసిందే. -
అక్షయ్ కుమార్ సంచలన వీడియో
ఉడీలో ఉగ్రదాడి జరిగి.. 19 మంది సైనికులు మరణించినప్పటి నుంచి భారతీయుల రక్తం ఉడికిపోతోంది. సర్జికల్ స్ట్రైక్స్‌తో ఆ కోపం కొంతవరకు చల్లారింది. అయితే.. ఈలోపు పాక్ నటీనటులను నిషేధించడం, దానిమీద ఒక్కొక్కరు ఒక్కోలా వ్యాఖ్యలు చేయడంతో దీనిపై పెద్ద చర్చే జరిగింది. తాజాగా అంశంపై బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ స్పందించాడు. పలు సినిమాల్లో సైనికుడి పాత్రలు, పోలీసు పాత్రలు పోషించిన అక్షయ్ కుమార్.. నిజ జీవితంలో ఒక సైనికాధికారి కొడుకు. అందుకే ఈ అంశంపై తీవ్రంగా స్పందించిన అతడు.. తన ఫేస్బుక్ పేజీలో ఒక వీడియో పోస్ట్ చేశాడు. అందులో అక్షయ్ చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి... ''ఈరోజు నేను సెలబ్రిటీలా మాట్లాడటం లేదు. ఒక సైనికుడి కొడుకుగా మాట్లాడుతున్నా. మన దేశవాసులే ఒకరితో ఒకరు వాదించుకుంటున్న విషయాన్ని కొంత కాలంగా టీవీ వార్తలు, వార్తాపత్రికలలో చూస్తున్నా. కొంతమంది సర్జికల్ స్ట్రైక్స్‌కు ఆధారాలు కావాలంటున్నారు. మరికొందరు కళాకారులను నిషేధించాలంటున్నారు. మరికొందరు అసలు యుద్ధం జరుగుతుందా లేదా అని భయపడుతున్నారు. మీ వాదనలన్నీ తర్వాత చేసుకోండి. ముందు.. సరిహద్దుల్లో మీకోసం ప్రాణాలు వదులుతున్న జవాన్ల గురించి ఆలోచించండి. ఉడీ ఉగ్రదాడులలో 19 మంది జవాన్లు వీరమరణం పొందారు. 24 ఏళ్ల నితిన్ కుమార్ బారాముల్లాలో ప్రాణత్యాగం చేశాడు. ఒక సినిమా విడుదల అవుతుందా లేదా.. ఒక కళాకారుడిపై నిషేధం ఉంటుందా లేదా అని వాళ్ల కుటుంబాలు ఏమైనా బాధపడుతున్నాయా? వాళ్ల ఆందోళన అంతా ఒక్కటే.. తమ భవిష్యత్తు ఏంటని. మనమంతా కూడా దాని గురించి ఆలోచించాలి. వాళ్ల భవిష్యత్తు భద్రంగా ఉండేలా చూడాలి. వాళ్లు మనల్ని కాపాడుతున్నారు కాబట్టే ఇక్కడ మీరు, నేను అంతా బతికి ఉన్నాం. వాళ్లు కాపాడకపోతేప.. హిందూస్థాన్ అనే దేశమే ఉండదు... జై హింద్'' అని ఆ వీడియోలో అక్షయ్ కుమార్ పేర్కొన్నాడు. -
అక్షయ్ కుమార్ సంచలన వీడియో
-
పాకిస్థాన్ సైన్యానికి ప్రధాని స్ట్రాంగ్ వార్నింగ్!
ఉగ్రవాదం విషయంలో అంతర్జాతీయంగా ఏకాకిగా మిగిలిపోతున్న పాకిస్థాన్ ఎట్టకేలకు చర్యలకు ఉప్రకమించినట్టు కనిపిస్తోంది. పాక్ భూభాగంలోని ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాల్సిందేనని, లేకపోతే అంతర్జాతీయంగా ఏకాకి కావాల్సి వస్తుందంటూ ఆ దేశ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ సైన్యాన్ని గట్టిగా హెచ్చరించారు. అదేవిధంగా పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడిపై విచారణ త్వరగా పూర్తిచేయాలని, స్తంభించిపోయిన ముంబై దాడుల కేసు విచారణను తిరగదొడాలని ఆయన సైన్యానికి తేల్చిచెప్పినట్టు పాకిస్థాన్ ప్రధాన పత్రిక 'డాన్' వెల్లడించింది. భారత్-పాకిస్థాన్ మధ్య ఇటీవలి ఉద్రిక్త పరిణామాల నేపథ్యంలో పౌర ప్రభుత్వానికి-సైన్యానికి మధ్య కీలక సమావేశం జరిగిందని, ఈ సమావేశంలో అసాధారణరీతిలో ప్రభుత్వం సైన్యానికి పరుషమైన హెచ్చరికలు జారీచేసిందని ఈ భేటీలో పాల్గొన్న విశ్వసనీయవర్గాలను ఉటంకిస్తూ ఆ పత్రిక గురువారం వెల్లడించింది. నిషేధిత ఉగ్రవాద గ్రూపులపై చర్యలు సహా కీలకాంశాల్లో ప్రభుత్వానికి అనుగుణంగా సైన్యం నడుచుకోవాలని షరీఫ్ ఈ భేటీలో స్పష్టం చేసినట్టు డాన్ పత్రిక పేర్కొంది. పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడిపై దర్యాప్తు పూర్తిచేసేందుకు, ముంబై దాడుల కేసులో పునర్విచారణ జరిపేందుకు చర్యలు తీసుకోవాలని షరీఫ్ తేల్చిచెప్పినట్టు తెలిపింది. నిషేధిత లేదా అదుపులో లేని మిలిటెంట్ గ్రూపులపై లా ఎన్ఫోర్స్మెంట్ చర్యలు తీసుకుంటే.. అందులో సైనిక నిఘా ఏజెన్సీలు జోక్యం చేసుకోకూడదనే సందేశాన్ని ఈ సమావేశం ఇచ్చిందని, ఈ సందేశాన్ని సైనిక, నిఘా వర్గాలకు అందజేసేందుకు ఐఎస్ఐ చీఫ్ లెప్టినెంట్ జనరల్ రిజ్వాన్ అఖ్తర్, జాతీయ భద్రతా సలహాదారు నజర్ జంజువా నాలుగు ప్రావిన్సులలో పర్యటించనున్నారని ఆ పత్రిక వెల్లడించింది. జమ్ముకశ్మీర్‌లోని ఉడీ ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాకిస్థాన్‌ను అంతర్జాతీయంగా దౌత్యపరంగా, ఆర్థికపరంగా ఏకాకిని చేయాలని భారత్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం సర్జికల్ దాడులు జరుపడంతో ఇరుదేశాల సంబంధాలు ఉద్రిక్తంగా మారాయి. సార్క్ దేశాలు కూడా పాక్ తీరును నిరసిస్తూ.. ఆ దేశంలో సార్క్ సదస్సుకు హాజరుకాబోమని తేల్చిచెప్పాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా ఇరకాటంలో పడ్డ పాక్ ప్రభుత్వం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చినట్టు భావిస్తున్నారు. -
సైనికుల కోసం.. గళం విప్పుతున్న సూపర్ స్టార్
అమితాబ్ బచ్చన్ చెప్పారంటే.. దేశమంతా వింటుంది. ఆయన ఏమైనా చేస్తే.. అందరూ అదే చేస్తారు. పోలియోను దేశం నుంచి తరిమికొట్టాలన్నా.. స్వచ్ఛభారత్ అభియాన్‌ను ముందుకు తీసుకెళ్లాలన్నా.. అన్నింటికీ ఆయన సేవలను ప్రభుత్వం వినియోగించుకుంటుంది. ఇప్పుడు ఆ పెద్దాయన మరోసారి తెరమీదకు వస్తున్నారు. ఈసారి భారత సైన్యం కోసం తన గళం విప్పుతున్నారు. ఉడీ ఉగ్రదాడిలో అసులువు బాసిన వీరసైనికులకు ఆ పాటను అంకితం ఇస్తున్నారు. బీజేపీ నాయకుడు తరుణ్ విజయ్ ఇటీవల సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌ను కలిసి.. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన జవాన్ల కోసం ఒక పాట పాడాలని కోరారు. అమితాబ్‌ది చాలా విలక్షణమైన గొంతు. పాత కాలంలోనే ఆయన పాడిన 'మేరే అంగనేమే తుమ్హారా క్యా కామ్ హై' లాంటి పాటలు సూపర్ హిట్ అయ్యాయి. తరుణ్ విజయ్ అడిగిన వెంటనే అమితాబ్ సరేనన్నారు. అమరుల కోసం పాట పాడటం అంటే అంతకన్నా అదృష్టం ఏముంటుందని చెప్పారు. ఇంతకుముందు టి-20 ప్రపంచకప్‌లో భారత్ - పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు అమితాబ్ ముందుగా జాతీయగీతం పాడారు. కోట్లాది మంది ఆ మ్యాచ్‌తో పాటు అమితాబ్ పాటను కూడా లైవ్‌లో చూశారు. ఇప్పుడు ఆయన సైనికుల కోసం ప్రత్యేకంగా పాట పాడటం అంటే.. మరోసారి తన మ్యాజిక్ చూపిస్తారనే అభిమానులు ఆశిస్తున్నారు. -
యుద్ధంపై పాక్ ప్రధాని అధికారిక ప్రకటన
ఇస్లామాబాద్: ఉడీ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఇండియన్ ఆర్మీ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత ఇరు దేశాల్లో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కీలక ప్రకటన చేశారు. బుధవారం పాకిస్థాన్ పార్లమెంట్ ను ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. ఉడీ ఉగ్రదాడితో పాకిస్థాన్ కు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. ఉడీ దాడి జరిగిన కొద్ది గంటల్లోపే ఎలాంటి ఆధారాలు లేకుండా భారత్.. పాకిస్థాన్ ను నిందించిందని ఆక్షేపించారు. పాకిస్థాన్ ను శాంతికాముక దేశంగా అభివర్ణించిన నవాజ్.. తాము భారత్ తో యుద్ధం చేయాలని కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. కీలకమైన కశ్మీర్ సహా ఇండియాతో నెలకొన్న అన్ని సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని భావిస్తున్నట్లు సభకు చెప్పారు. అయితే తమ ప్రమేయం లేకుండా ఎదురయ్యే విపత్కర పరిస్థితులను తిప్పికొట్టేందుకు పాక్ సైన్యం సిద్ధంగా ఉందన్నారు. -
ఆర్మీ నన్ను శిక్షించాలి : ఓం పురీ
అమరవీరులైన భారత ఆర్మీ జవాన్లపై తను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సీనియర్ నటుడు ఓం పురి క్షమాపణ చెప్పుకున్నారు. ఆర్మీ తనను శిక్షించాలని, ఆర్మీ జోన్‌కు పంపించి యుద్ధం ఎలా చేయాలో నేర్పించాలని క్షమాపణ ప్రకటనలో తెలిపారు. భారత జవాన్లను ఎవరు ఆర్మీలో చేరమన్నారు? ఎవరు వారిని ఆయుధాలు పట్టుకోమన్నారంటూ ఓ న్యూస్ చానల్ చర్చాకార్యక్రమంలో ఓం పురి రెచ్చిపోయారు. అమరవీరులైన ఆర్మీ జవాన్లపై ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఓం పురిపై పోలీసు స్టేషన్లలో కేసు కూడా నమోదైంది. ఈ కేసు నమోదు అనంతరం ఓం పురికి తన తప్పు తెలుసొచ్చినట్టై వెంటనే ఆర్మీకి క్షమాపణ చెప్పారు. తనది క్షమించరాని నేరమని, వెంటనే తనని శిక్షించమని ప్రాదేయపడ్డారు. మొదట తాను ఉడి ఉగ్రఘటనలో అమరవీరుల కుటుంబసభ్యులకు క్షమాపణ చెబుతానని చెప్పారు. ఒకవేళ వారు క్షమిస్తే, దేశాన్ని, ఆర్మీని క్షమాపణ కోరతానన్నారు. తనకు తాను కూడా ఓం పురి భారీ శిక్షే విధించుకున్నారు. తనని యుద్ద ప్రాంతంలోకి పంపాలని, దేశ రక్షణలో ఆర్మీజవాన్లకు సహకరిస్తానని చెప్పారు. ఆయుధాలను ఎలా వాడాలో ఆర్మీ తనకు నేర్పించాలని, ఎక్కడైతే ఆర్మీ జవాన్లు తమ ప్రాణాలను దేశానికి త్యాగం చేశారో ఆ ప్రాంతంలోకి తనను పంపించాలని ప్రాదేయపడ్డారు. క్షమించాలని మాత్రమే తాను కోరుకోవడం లేదని, తనను కచ్చితంగా శిక్షించాలని కోరుతున్నట్టు ఓం పురి తెలిపారు. పాకిస్తానీ నటులపై భారత్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్(ఐఎమ్పీపీఏ)నిషేధం విధించడంతో ఆయన ఆర్మీ జవాన్లపై అవమానకర వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలపై దేశమంతటా చర్చనీయాంశంగా మారాయి. పలువురు బాలీవుడ్ నటులు ఆయన వ్యాఖ్యలను ఖండించారు. జవాన్లను ఎవరైనా ఆర్మీలో చేరమని బలవంతం పెట్టారా? అని ఓం పురి వ్యాఖ్యానించారు. -
భారత సైన్యంపై ఓం పురి వివాదాస్పద వ్యాఖ్యలు
ఉడీ ఘటన అనంతరం పాకిస్తాన్ నటులపై భారత్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్(ఐఎమ్పీపీఏ) విధించిన నిషేధ నేపథ్యంలో ప్రముఖ నటుడు ఓం పురి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉడీ ఘటనలో అమరవీరులైన భారత సైన్యంపై ఆయన అవమానకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వివాదం రాజుకున్నాయి. పాకిస్తానీ నటులపై ఐఎమ్పీపీఏ తీసుకున్న నిషేధంపై ఓ ప్రముఖ న్యూస్ చానల్ చర్చ నిర్వహించింది. ఆ చర్చలో ఉడీ ఉగ్రదాడిలో అసువులు బాసిన 18 వీర జవాన్లపై ఓం పురి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓం పురి చేసిన వ్యాఖ్యలు ఈ విధంగా ఉన్నాయి.." ఎవరు వారిని(భారత సైన్యాన్ని) ఆర్మీలో చేరమన్నారు? ఎవరు వారిని ఆయుధాలు పట్టుకోమన్నారు. మేమేమి జవాన్లను ఆర్మీలో చేరమని చెప్పలేదుగా.15 నుంచి 20 మానవ బాంబులు తయారుచేయండి. పాకిస్తాన్‌ను పేల్చడానికి వాటిని వాడండి. ఇజ్రాయిల్, పాలస్తీనా మాదిరి భారత్-పాకిస్తాన్‌లు కూడా యుగయుగాలుగా శత్రువులుగా మారలనుకుంటున్నారా? కోట్లమంది ముస్లింలకు భారత్ పుట్టినిల్లు. భారత్-పాకిస్తాన్ విభజన అంటే కేవలం దేశాల విభజనే మాత్రమే కాదు, కుటుంబాలు విడిపోవడం కూడా. భారతీయుల కుటుంబసభ్యులు అక్కడ ఉన్నారు. అక్కడ వారు ఇక్కడా ఉన్నారు. సరిహద్దు కుటుంబాలు ఎలా యుద్ధం చేసుకుంటారు?. పాకిస్తాన్ నటులను, సెలబ్రిటీలపై నిజంగా నిషేధం విధించాలంటే, భారత ప్రభుత్వాన్ని వారి వీసాలు రద్దు చేయమనండి" అంటూ న్యూస్ చానల్ చర్చా కార్యక్రమంలో రెచ్చిపోయారు. ముందు కూడా పాకిస్తాన్ నటులకు ఆయన మద్దతిచ్చారు. వాలిడ్ వీసాతో వారు ఇక్కడ పనిచేస్తున్నారని, వారిని నిషేధించడం సరికాదన్నారు. పాకిస్తానీ నటులపై నిషేధం, పరిస్థితుల్లో మార్పు తేవన్నారు. దీంతో ఓం పురి వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. -
'సర్జికల్ స్ట్రైక్స్ ఏ మాత్రం సరిపోవు'
ఫ్రాంకోయిస్ హోరో(43) ఉడీ ఉగ్రదాడిలో తీవ్రంగా గాయపడిన భారత సైనికుడు. ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో 22 రోజుల పాటు ప్రాణాలకోసం పోరాడి తుదిశ్వాస విడిచారు. హోరో మృతితో ఉడీ దాడిలో మృతి చెందిన భారత సైనికుల సంఖ్య 20 కు చేరింది. ఆయన అంత్యక్రియలను ఆదివారం స్వస్థలం జార్కండ్లోని లాలి గ్రామంలో నిర్వహించారు. హోరో మృతితో ఆయన కుటుంబసభ్యులు (తల్లి, భార్య, ఇద్దరు కూతుళ్లు) తీవ్ర విషాదంలో మిగిలిపోయారు. హోరో అంత్యక్రియల సందర్భంగా లాలి గ్రామంలో ఉద్వేగభరిత వాతావరణం నెలకొంది. గ్రామస్తులు పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. హోరో పెద్ద కూతురు అనూ మాట్లాడుతూ.. తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని, దానికి భారత్ చేపట్టిన సర్జికల్ దాడులు ఏ మాత్రం సరిపోవని అన్నారు. -
నిద్ర లేదు.. సెలవు లేదు...
ప్రస్తుతం సరిహద్దులో భారత సైనికుల పరిస్థితి న్యూఢిల్లీ: భారత జవాన్లకు ప్రస్తుతం నిద్ర లేదు.. సెలవులు లేవు... సరిహద్దు భూభాగంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా దేశ జవాన్లు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. నియంత్రణ రేఖ వెంబడి పరిస్థితులు దినదిన గండంగా సాగుతున్నాయి. సైనికులు అప్రమత్తంగా ఉంటున్నారు. విధులను నిర్వర్తిస్తున్నారు. ఉడీ ఉగ్ర దాడి అనంతరం భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ వల్ల ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్తాన్ నుంచి ఎప్పుడు, ఏ రకంగా ముప్పు వాటిల్లుతుందోనని అత్యంత హైఅలర్ట్‌తో భారత్ సైన్యం మెలుగుతోంది. ఖాళీ సమయాల్లో చేసే అన్ని పనులకు మన జవాన్లు చెక్ చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాలను అనుసరించడమే ప్రస్తుతం వారి ముందున్న ప్రధాన విధి. సైనికులకు సెలవులు దొరకడం మాట అటుంచితే కనీసం సరిగా నిద్రపోవడానికి కూడా సమయం లేకుండా పోయింది. ఇదివరకు సైనికులు 6 గంటలు నిద్రపోయేవారు కానీ తాజా పరిస్థితుల్లో కనీసం 4 గంటలు కూడా నిద్రపోవడం లేదు. నిద్రాహారాలు మాని నియంత్రణ రేఖ వద్ద నిత్యం పెట్రోలింగ్ చేస్తూ సరిహద్దును కాపాడే పనిలో భారత ఆర్మీ పూర్తి స్థాయిలో నిమగ్నమైంది. -
సార్క్‌పై చర్చలు జరుపుతాం
కఠ్మాండు: సార్క్ సమావేశాలను నిర్వహించేలా సభ్య దేశాలతో చర్చలు జరుపుతామని కూటమి అధ్యక్ష దేశం నేపాల్ తెలిపింది. ఈ మేరకు అన్ని చర్యలు చేపడతామని విదేశాంగ మంత్రి ప్రకాశ్ శరణ్ మహత్ చెప్పారు. అన్ని సభ్య దేశాలు సున్నితంగా వ్యవహరిస్తూ ఇందులో పాల్గొనాలని కోరారు. సమావేశాలు నిర్వహించడానికి అవసరమైర సుహృద్భావ వాతావరణాన్ని నెలకొల్పాల్సిన బాధ్యత సభ్య దేశాలపై ఉందని పేర్కొన్నారు. అన్ని సభ్యదేశాలతో 19వ సార్క్ సదస్సు విజయవంతం చేసేందుకు సంప్రదింపులు జరుపుతామని తెలిపారు. తమ భూభాగాలను సరిహద్దు తీవ్రవాద కార్యకలాపాలకు వేదిక కాకుండా చూడాలని సభ్య దేశాలను నేపాల్ కోరింది. కశ్మీర్ లోని ఉడీ సైనిక స్థావరంపై ఉగ్రదాడి నేపథ్యంలో సార్క్ సదస్సులో పాల్గొనబోమని భారత్ ప్రకటించింది. మాల్దీవులు, బంగ్లాదేశ్, భూటాన్, అఫ్ఘానిస్థాన్, శ్రీలంక దేశాలు విరమించుకోవడంతో సదస్సు వాయిదా పడడం తెలిసిందే. -
ఉడీ బ్రిగేడ్ కమాండర్ బదిలీ
జమ్మూకశ్మీర్: సైనిక స్థావరంపై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ఉడీ బ్రిగేడ్ కమాండర్‌ను బదిలీ చేస్తూ ఆర్మీ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 18 తెల్లవారుజామున ఉడీ సైనిక స్థావరంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 19 మంది సైనికులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఎల్ఓసీకి సమీపంలో ఉన్న ప్రతిష్టాత్మక సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి జరపడంలో భద్రతా బలగాల అలసత్వం కూడా ఉందనే విమర్శలు దేశవ్యాప్తంగా వినిపించాయి. దీనిపై విచారణ చేపట్టిన ఆర్మీ.. ఉడీ బ్రిగేడ్ కమాండర్ కే సోమశేఖర్ స్థానంలో 28 మౌంటెయిన్ డివిజన్‌కు చెందిన ఆఫిసర్‌కు బాధ్యతలు అప్పగించింది. అయితే దీనిపై మరింత సమాచారం ఇచ్చేందుకు ఆర్మీ అధికారులు నిరాకరించారు. -
పాక్‌కు యూఎస్ సందేశం
వాషింగ్టన్: అణ్వాయుధాల వాడకం విషయంలో పాకిస్తాన్ నిగ్రహాన్ని పాటించాని అమెరికా సందేశాన్ని పంపింది. పాకిస్తాన్లో ఉన్న తీవ్రవాద సంస్థల మీద చర్యలు తీసుకోవాలని పాక్‌కు సూచించింది. అణ్వాయుధాలు కలిగిన దేశాలు, వాటి వాడకం విషయంలో నిగ్రహంతో ఉండాల్సిన బాధ్యత ఉందని యూఎస్ ఉప అధికార ప్రతినిధి మార్క్ టోనర్ అన్నారు. పాక్ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే అణ్వాయుధాలను సైతం వాడడానికి సిధ్దంగా ఉన్నామని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా మహ్మద్ ఆసిఫ్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో మార్క్ టోనర్ విలేకరులు అడిగిన ప్రశ్నకు పై విధంగా బదులిచ్చారు. భారత్, పాకిస్తాన్ మధ్య చోటు చేసుకుంటున్న ఉద్రిక్త పరిస్థితులను అమెరికా నిశితంగా పరిశీలిస్తోందన్నారు. ఉడీ ఉగ్రదాడుల అనంతరం జరుగుతున్న పరిణామాల తర్వాత తమ వద్ద అణ్వస్త్రాలు ఉన్న విషయాన్ని పాకిస్థాన్ పదే పదే బయటకు చెబుతున్న విషయం తెలిసిందే. భారతదేశంతో ఒకవేళ యుద్ధం అంటూ వస్తే వాటిని ఉపయోగించడానికి ఏ మాత్రం వెనకాడేది లేదని అంటోంది. తమ వద్ద ఉన్న అణ్వస్త్రాలు ఆటబొమ్మలేవీ కావని ఖ్వాజా మహ్మద్ ఆసిఫ్ అన్నారు. ''మా దగ్గర ఉన్న వ్యూహాత్మక ఆయుధాలను మా రక్షణ కోసమే తయారు చేశాం. ఈ ఆయుధాలు ఆటబొమ్మలు ఏమీ కావు. మా క్షేమానికి ఏమైనా ముప్పు ఉందనుకుంటే వాటిని వెంటనే ఉపయోగంలోకి తీసుకొస్తాం'' అని ఆసిఫ్ చెప్పారు. ఇప్పటికిప్పుడు యుద్ధం వస్తుందన్న భయం ఏమీ లేదని.. కానీ ఖురాన్లో అల్లా చెప్పినట్లు, 'గుర్రాలు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి' అని ఖ్వాజా మహ్మద్ ఆసిఫ్ అన్నారు. పాకిస్థాన్ మీద ఎప్పుడూ ఒత్తిడి ఉంటూనే ఉందని, అందువల్ల అవసరమైన వాటి కంటే ఎక్కువగా తమదగ్గర వ్యూహాత్మక ఆయుధాలు ఉన్నాయని చెప్పారు. ఈ విషయంలో తమదే ఆధిక్యం అన్న విషయానికి అంతర్జాతయంగా కూడా గుర్తింపు ఉందని చెబుతూ.. ఎవరైనా తమ గడ్డమీద అడుగుపెట్టినా, తమ అంతర్గత భద్రతకు ముప్పు తేవాలని చూసినా తమ రక్షణ కోసం ఆ ఆయుధాలను ఉపయోగించడానికి వెనుకాడబోమని అన్నారు. భారతదేశంతో యుద్ధం వస్తే పాకిస్థాన్ అణ్వాయుధాలు ఉపయోగిస్తుందా అన్న ప్రశ్నకు.. అది పరిస్థితులను బట్టి ఆధారపడుతుందని, తమ ఉనికి ప్రమాదంలో పడితే తాము అన్నింటినీ ఉపయోగిస్తామని స్పష్టం చేశారు. అందులో భయపడాల్సింది ఏముందని ఎదురు ప్రశ్నించారు. హిల్లరీ ఆందోళన పాకిస్తాన్లో అణ్వాయుధాలు జీహాదీల చేతుల్లోకి వెళితే పెను ప్రమాదం తప్పదని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ భయాందోళనలు వ్యక్తం చేశారు. తద్వారా అణుఆత్మాహుతి దాడులు జరిగే అవకాశం ఉందన్నారు. ‘జీహాదీలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తారన్న భయంతో జీవిస్తున్నాం. వారు అణ్వాయుధాలు హస్తగతం చేసుకుంటారు. ఫలితంగా అణు ఆత్మాహుతి దాడులకు అవకాశం ఏర్పడుతుంది’ అని ఆందోళన వ్యక్తం చేసినట్టు ‘న్యూయార్క్ టైమ్స్’ పేర్కొంది. డెమోక్రటిక్ పార్టీ కంప్యూటర్ల హ్యాకింగ్ ద్వారా హిల్లరీ మాట్లాడిన ఆడియో సారాంశాన్ని పత్రిక వెల్లడించింది.గత ఫిబ్రవరిలో వర్జీనియాలో నిధుల సేకరణ సందర్భంగా ఆమె సన్నిహితులతో ఈ వ్యాఖ్యలు చేశారంది. భారత్‌తో ఉన్న శత్రుత్వంతో పాక్ అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తోందని హిల్ల రీ పేర్కొన్నారు. రష్యా, చైనాతో పాటు పాక్, భారత్ అణ్వాయుధాల్లో పోటీపడుతున్నాయని... ఇది అత్యంత ప్రమాదకర పరిణామమని అన్నారు. -
వాజ్‌పేయి చేయనిది మోదీ చేశారు
పాకిస్థాన్ భూభాగంలో శిక్షణ పొందిన ఉగ్రవాదులు భారత్‌లో దాడులు చేస్తూ దేశ భద్రతకు సవాల్ విసురుతున్నారు. పాక్ ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూ భారత్‌పై దాడులకు ఉసిగొల్పుతోంది. 2011లో అటల్ బిహారి వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఉగ్రవాదులు సాక్షాత్తూ పార్లమెంట్‌పైనే దాడి చేశారు. అంతకుముందు, ఆ తర్వాత కూడా పాక్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు దేశంలో పలు చోట్ల దాడులు చేశారు. వాజ్‌పేయి హయాంలో పోఖ్రాన్ అణుపరీక్షలు నిర్వహించారు. అలాగే కార్గిల్ యుద్ధంలో విజయం సాధించారు. కానీ పార్లమెంట్‌పై ఉగ్రదాడి అనంతరం వాజ్‌పేయి ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించలేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. నాడు అటల్ చేయలేనిది, నేడు ప్రధాని నరేంద్ర మోదీ చేసి చూపించారు. ఇటీవల జరిగిన ఉడీ ఉగ్రదాడికి మోదీ పాకిస్థాన్‌కు తగిన గుణపాఠం చెప్పారు. దేశ సరిహద్దులు దాటి పాక్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేయడానికి సైన్యానికి అనుమతిచ్చారు. భారత సైన్యం 40 మంది ఉగ్రవాదులను హతమార్చి, మరికొందరిని బందీలుగా పట్టుకుంది. తద్వారా ఉగ్రవాదాన్ని ఇక ఏమాత్రం ఉపేక్షించబోమని, దీటైన సమాధానం చెబుతామంటూ మోదీ ప్రభుత్వం పాక్‌కు వార్నింగ్ ఇచ్చింది. ఉడీ ఉగ్రదాడి తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టి పాకిస్థాన్‌ను ఏకాకిని చేయడంలో సఫలమయ్యారు. ఇక దక్షిణాసియా దేశాలు భారత్‌కు అండగా నిలిచి.. పాక్‌లో జరగాల్సిన సార్క్ సదస్సును బహిష్కరించాయి. ప్రపంచ దేశాల నుంచి పాక్‌కు ఆర్థికంగా, సైనికపరంగా సాయం అందకుండా చేసి, బలహీనపరచడానికి మోదీ ప్రభుత్వం వ్యూహరచన చేసింది. ఉడీ దాడిని మరచిపోమని చెప్పిన ప్రధాని మోదీ కేరళలో జరిగిన బీజేపీ జాతీయ మండలి సమావేశం వేదిక నుంచి పాకిస్థాన్‌కు గట్టి హెచ్చరిక చేస్తారని భావించారు. అయితే దేశ ప్రజలు, మీడియా ఊహించిన స్థాయిలో మోదీ స్పందించలేదు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంలో గాక పేదరికాన్ని నిర్మూలించడంలో, అభివృద్ధి సాధించడంలో పోటీ పడాల్సిందిగా పాక్‌కు సూచించారు. ఉడీ ఉగ్రదాడికి బదులు చెప్పడానికి మోదీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదనే విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే మోదీ మాటలతో గాక చేతలతో చూపించారు. దేశ ప్రజలు ఊహించిన దానికంటే మోదీ అసాధారణ నిర్ణయం తీసుకుని పాక్‌కు గట్టి జవాబు చెప్పారు. -
మరో సైనికుడి వీర మరణం
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో ఉడీ సైనిక స్థావరంపై పాకిస్థాన్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో వీర మరణం పొందిన సైనికుల సంఖ్య 19కి చేరింది. తీవ్రవాదుల దాడిలో తీవ్రగాయాలైన జవాను రాజ్‌కిషోర్ సింగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. మృతి చెందిన సైనికుల వివరాలు.. 1. సుబేదార్ కర్నైల్ సింగ్(జమ్మూకశ్మీర్) 2. హవిల్దార్ రవి పాల్(జమ్మూకశ్మీర్) 3. హవిల్దార్ ఎన్ ఎస్ రావత్(రాజస్థాన్) 4. సిపాయి జావ్రా ముండా(జార్ఖండ్) 5. సిపాయి నైమాన్ కుజుర్(జార్ఖండ్) 6. సిపాయి రాజేశ్ సింగ్(బిహార్) 7. హవిల్దార్ అశోక్ కుమార్ సింగ్(బిహార్) 8. నాయక్ ఎస్ కే విదార్థి(బిహార్) 9. సిపాయి బిశ్వజిత్ గొరాయ్ (పశ్చిమ బెంగాల్) 10. సిపాయి గంగాధర్ దులాయ్(పశ్చిమ బెంగాల్) 11. లాన్స్ నాయక్ ఆర్ కే యాదవ్(ఉత్తరప్రదేశ్) 12. సిపాయి హరిందర్ యాదవ్(ఉత్తరప్రదేశ్) 13. సిపాయి గణేశ్ శంకర్(ఉత్తరప్రదేశ్) 14. సిపాయి రాజేశ్ కేఆర్ సింగ్(ఉత్తరప్రదేశ్) 15. లాన్స్ నాయక్ జి. శంకర్(మహారాష్ట్ర) 16. సిపాయి టీఎస్ సోమనాథ్(మహారాష్ట్ర) 17. సిపాయి ఉయికి జాన్‌రావు(మహారాష్ట్ర) 18. కె. వికాస్ జనార్థన్ 19.రాజ్‌కిషోర్ సింగ్ -
నిమిషాల్లో కోటి రూపాయలు పోగైంది
ఉడీ ఉగ్రదాడి దేశ ప్రజలకు తీవ్ర ఆగ్రహం, ఆవేశాన్ని కలిగించింది. ఉగ్రవాదాన్ని పోషిస్తున్న పాకిస్థాన్ వైఖరిని ఖండిస్తూ.. దాయాదికి తగిన గుణపాఠం చెప్పాలంటూ యావత్ భారతీయులు రగిలిపోయారు. సామాన్యుల నుంచి రాష్ట్రపతి, ప్రధాని వరకు మన జవాన్లకు అండగా నిలిచారు. ఉడీ దాడిలో వీరమరణం పొందిన జవాన్లకు దేశ ప్రజలు నివాళులు అర్పించి.. వారి కుటుంబాలకు అండగా నిలిచారు. వీర జవాన్లకు నివాళులు అర్పించడానికి గుజరాత్‌లోని సూరత్‌లో ఓ కార్యక్రమం నిర్వహించారు. వేదికపై కళాకారులు వీర జవాన్ల సేవలను కీర్తిస్తూ దేశ భక్తి గీతాలు పాడారు. స్థానికులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరై వీర జవాన్ల సేవలను స్మరించుకున్నారు. భారీ మొత్తంలో డబ్బును కళాకారులకు ఇచ్చారు. మొత్తం కోటి రూపాయలకు పైగా డబ్బు పోగైంది. ఈ డబ్బును కళాకారులు, నిర్వాహకులు తీసుకోకుండా ఉదారత చాటుకున్నారు. ఉడీ దాడిలో మరణించిన జవాన్ల కుటుంబాలకు ఈ డబ్బును అందజేస్తామని కార్యక్రమ నిర్వాహకులు చెప్పారు. త్వరలో వారి కుటుంబాలను కలసి ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు. సూరత్ ప్రజలు, కళాకారులు, నిర్వాహకుల ఉదారత అందరికీ స్ఫూర్తిదాయకం. -
ఉడీ లాంటి దాడి తర్వాత ఉద్రిక్తతలు సహజం
ఉడీలో జరిగిన ఉగ్రదాడి చాలా దారుణమని, అలాంటి దాని తర్వాత ఇలాంటి ఉద్రిక్తతలు తలెత్తడం సహజమేనని అమెరికా తేల్చిచెప్పింది. ఈ అంశంపై అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ స్పందించారు. భారత సైన్యం నిర్వహించిన నిర్దేశిత దాడుల (సర్జికల్ స్ట్రైక్స్) గురించి చూశామని, పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని ఆయన అన్నారు. భారత్, పాక్ సైన్యాలు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారని భావిస్తున్నామని, ఉద్రిక్తతలను తగ్గించాలంటే ఇరువురి మధ్య కమ్యూనికేషన్ ఉండటం చాలా ముఖ్యమని చెప్పారు. ఉగ్రవాదం వల్ల ఈ ప్రాంతానికి ముప్పు పొంచి ఉందన్న విషయాన్ని అమెరికా పదే పదే చెబుతూనే ఉందని, ఉగ్రవాదానికి సరిహద్దులు లేవని, అందువల్ల లష్కరే తాయిబా జైషే మహ్మద్ లాంటి ఉగ్రవాద గ్రూపులను అణిచేయలని, వాటిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు జాన్ కిర్బీ చెప్పారు. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి జాన్ కెర్రీ ఈనెల 27వ తేదీన భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌తో మాట్లాడారని, ఉడీ ఉగ్రదాడిని గట్టిగా ఖండిస్తున్నట్లు ఆయన చెప్పారని అన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని తాము ఖండిస్తామని, దానివల్ల ఉద్రిక్తతలు తలెత్తకుండా చూసుకోవాలని తెలిపారు. ఈ దాడి గురించి తాను ప్రత్యకంగా చెప్పాలనుకోను గానీ... ఉడీ లాంటి ఉగ్రదాడుల వల్ల భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరగడం సహజమేనని జాన్ కిర్బీ అన్నారు. ఉడీ లాంటి దాడులు చాలా భయంకరమైనవని చెప్పారు. ఈతరుణంలో భారత్, పాకిస్థాన్ రెండు దేశాలకూ తము ఇచ్చే సందేశం ఒకటేనని.. ఇరు దేశాల మధ్య చర్చలు పెరిగి, ఉద్రిక్తతలను మరింత పెంచే చర్యలు మానుకోవాలని సూచించారు. -
నిమిషాల్లో కోటి రూపాయలు పోగైంది
-
పాక్‌తో యుద్ధం వస్తే...
న్యూఢిల్లీ: ఉడి ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ లక్షిత దాడులతో ముష్కరులను మట్టుబెట్టడం వరకు బాగానే ఉంది. కానీ ఈ దాడుల ప్రభావం ఎలా ఉండబోతోంది? ఒకవేళ భారత్- పాకిస్తాన్ల మధ్య యుద్ధం వస్తే పరిస్థితి ఏమిటి? ఎలాంటి పరిణామాలు సంభవిస్తా యనే దానిపై అనేక అధ్యయనాలు జరిగాయి. వాటి ప్రకారం... ⇔ రెండు దేశాలు ఒక్కొక్కటి 15 కిలోటన్నుల హిరోషిమా అణుబాంబుతో సమానమైన దాదాపు 100 అణ్వస్త్రాలను ప్రయోగిస్తే ఈ భూగోళాన్ని సంరక్షిస్తున్న ఓజోన్ పొరలో సగం నాశనమైపోతుంది. అదే జరిగితే అణు శీతాకాలం వచ్చి రుతుపవనాలను దెబ్బతీస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం నాశనమైపోతుంది. ⇔ అణు బాంబులను ప్రయోగిస్తే రెండుదేశాలలో కలిపి మొదటి వారంలో 2.1 కోట్ల మంది మరణిస్తారు. రెండో ప్రపంచ యుద్ధంలో చనిపోయిన వారి సంఖ్యలో ఇది సగం. గాయాలు, విపరీతమైన రేడియోధార్మికత ప్రభావానికి లోనయ్యే వారి సంఖ్య దీనికి అదనం. ⇔ అణుయుద్ధం జరిగితే వచ్చే వాతావరణ మార్పుల వల్ల ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మంది జనాభా ఆకలితో అలమటిస్తారని అంచనా. పాకిస్తాన్ అణు క్షిపణుల సామర్థ్యం పాకిస్తాన్ వద్ద 130 వరకు అణు వార్‌హెడ్స్ ఉన్నాయని అంచనా. పాకిస్థాన్ వద్ద ఉన్న అణ్వస్త్ర సహిత మధ్య శ్రేణి హతాఫ్ క్షిపణులతో భారత్‌లోని నాలుగు ప్రధాన నగరాలైన న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నైలను గురిపెట్టగలదని అంచనా. అలాగే ఘోరి క్షిపణులు 1,300 కి.మీ దూరాలను చేరుకోగలవు. అంటే ఢిల్లీ, జైపూర్, అహ్మదాబాద్, ముంబై, పునె, నాగపూర్, భోపాల్, లక్నోలు దాని రేంజ్లో ఉంటాయి. షహీన్ 2 రకం క్షిపణులు 2,500 కి.మీ లక్ష్యాలను ఛేదించగలవు. స్వల్ప శ్రేణి ఘజ్నవి క్షిపణులు 270 నుంచి 350 కి.మీల దూరాలలోని లక్ష్యాలను చేరుకోగలవు. అంటే లూధియానా, అహ్మదాబాద్, ఢిల్లీ శివార్లన్న మాట. ఇంకా షహీన్ 1 క్షిపణుల రేంజ్ 750 కి.మీలు. ఇవి లూథియానా, ఢిల్లీ, జైపూర్, అహ్మదాబాద్‌లను చేరుకోగలవు. భారత్ అణ్వస్త్ర సామర్థ్యం... భారత్ వద్ద పృధ్వి, అగ్ని అణు క్షిపణులున్నాయి. ఐఎన్ఎస్ అరిహంత్ సబ్‌మెరైన్ నుంచి కె-15 సాగరిక క్షిపణులను ప్రయోగించగలదు. ఇస్లామాబాద్, రావల్పిండి, లాహోర్, కరాచీ, నౌషెరాలోని సైనిక ప్రధాన కార్యాలయం సహా పాకిస్తాన్‌లోని ఏభాగాన్నైనా ఛేదించగలిగిన సామర్థ్యం గలిగినవి. అణువార్హెడ్లతో కూడిన పృథ్వి క్షిపణులు పాకిస్తాన్‌లోని లాహోర్, సియాల్కోట్, ఇస్లామాబాద్, రావల్పిండిని ఛేధించగలవు. అగ్ని క్షిపణులు 2,000 కి.మీ దూరాలను చేరుకోగలవు. ఇవి లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి, పెషావర్, ముల్తాన్, కరాచీ, క్వెట్టా, గ్వదర్లను ఛేదించగలవు. -
సరైన లక్ష్యం + మెరుపు వేగం= సర్జికల్ దాడి
ఉడీ ఘటనకు ప్రతీకారంగా భారత ఆర్మీ పీవోకేలోని పాక్ మిలిటెంట్ల స్థావరాలపై సర్జికల్ దాడులు నిర్వహించింది. అణ్వాయుధాలు వాడేందుకు ఆలోచించేది లేదన్న పాక్ వ్యాఖ్యల నేపథ్యంలో.. భారత్ జరిపిన ఈ మెరుపు (సర్జికల్) దాడుల అంశంపై తెరపైకి వచ్చింది. అసలు సర్జికల్ దాడులంటే ఏంటి? ఈ దాడుల ప్రణాళికేంటి? ఎందుకు? ఎప్పుడు నిర్వహిస్తారనేది ఓసారి చూస్తే.. సర్జికల్ దాడులంటే ఏంటి? నిర్దేశిత లక్ష్యాలపై చాలా చురుకుగా దాడి చేసి శత్రువును మట్టుబెట్టడం, భారీగా నష్టం కలిగించటమే సర్జికల్ దాడి. అయితే సామాన్య ప్రజలకు, దాడి జరిగిన ప్రాంతాల్లో చుట్టుపక్కల పెద్దగా నష్టం జరగకుండా, కేవలం లక్ష్యాన్ని, అక్కడున్న శత్రవులను మట్టుపెట్టడం ఈ దాడుల్లో చాలా కీలకం. చాలా సందర్భాల్లో యుద్ధాన్ని నివారించేందుకు కూడా ఇటువంటి దాడులను చేస్తుంటారు. నియంత్రణ రేఖ (ఎల్వోసీ) గుండా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు తరచూ చొరబాట్లు చేస్తున్న నేపథ్యంలో సర్జికల్ దాడుల ద్వారా పీవోకేలో ఉగ్రవాద కేంద్రాలను ఏరివేసేందుకు భారత్ ఈ ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో పాల్గొనే బృందాలు ప్రత్యర్థి కళ్లుమూసి తెరిచేలోగానే మొత్తం పనిచక్కబెట్టుకుని వచ్చేస్తాయి. అప్పుడే ఆపరేషన్ విజయవంతం అయినట్లు. ఈ దాడులెలా చేస్తారు? సర్జికల్ దాడులు చేయటం చాలా వ్యూహాత్మకమైన ఆపరేషన్. సర్వీస్ ఇంటెలిజెన్స్ విభాగం, ఇంటెలిజెన్స్ బ్యూరో, రా (రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్), సాంకేతిక బృందాలు కలుపుకుని ఆర్మీలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన బలగాలతో ఈ ఆపరేషన్ టీమ్‌లను ఏర్పాటుచేస్తారు. ప్రత్యర్థి ఎంత దూరంలో ఉన్నాడు? చుట్టుపక్కల పరిస్థితేంటి? ఎంత వేగంగా పని చక్కబెట్టుకోవచ్చు వంటి అంశాలపై వివిధ స్థాయీల్లో తీవ్రమైన చర్చ, ఈ భాగాల మధ్య సమన్వయం అవసరం. వీటన్నింటిపై స్పష్టత వచ్చాకే సర్జికల్ దాడులు మొదలవుతాయి. నిర్ణయించుకున్న ప్రణాళిక ప్రకారం లక్ష్యాలపై.. ఒక్క అడుగు కూడా లెక్కలో తేడా రాకుండా మెరుపువేగంతో దాడులు జరుగుతాయి. ఈ తతంగం జరుగుతున్నంతసేపు సీ4ఐఎస్ఆర్ (ఆదేశం, నియంత్రణ, సమాచారం, కంప్యూటర్లు, ఇంటెలిజెన్స్, నిఘా, గూఢచర్య విభాగాల సమన్వయం)తో ఈ ప్రత్యేక బృందాలు అనుసంధానమై ఉంటాయి. ప్రజలు నివసించే ప్రాంతాల్లోనూ సామాన్య జనానికి నష్టం జరగకుండా.. కేవలం లక్ష్యాన్ని మాత్రమే ధ్వంసం చేసేందుకు సర్జికల్ దాడులు నిర్వహిస్తారు. దాడులకు ముందే ప్రత్యర్థి వర్గంలోకి కోవర్టుల్లా ప్రవేశించి సేకరించే సమాచారం కూడా ఇలాంటి ఆపరేషన్లలో ప్రత్యేక భూమిక నిర్వహిస్తుంది. భారత్ బలమెంత? ఈ తరహా దాడులు చేయటంలో భారత్ వద్ద త్రివిధ దళాల్లో పలు ప్రత్యేక బృందాలున్నాయి. ఈ దాడుల్లో ప్రముఖ పాత్ర వైమానిక దళానిదే. భారత వైమానిక దళంలో కీలకమైన బృందాలున్నాయి. దీంతోపాటు భారత పారాచ్యూట్ రెజిమెంట్‌లోని శిక్షణ పొందిన పారాపైలట్లు ఇలాంటి ఆపరేషన్లు చేయటంలో ప్రత్యేకంగా శిక్షణ పొందారు. క్షేత్రస్థాయిలో శ్రతువుపై పోరాడటం కష్టంగా ఉన్నప్పుడుకూడా ఇటువంటి దాడులు నిర్వహిస్తారు. అటు నేవీ కూడా తమ మెరైన్ కమాండోస్ (మార్కోస్) ఈ తరహా దాడులు చేయటంలో దిట్ట అని పేర్కొంది. వైమానిక దళంలో ‘గరుడ’ దళం సామాన్యంగా ఇలాంటి దాడులకు శిక్షణ పొందుతుంది. ఈ దాడులు చాలా కష్టం: మాజీ ఆర్మీ అధికారి ‘సర్జికల్ దాడులను నిర్వహించటం అంత సులభమేం కాదు. లక్ష్యాలు స్థిరంగా ఉండొచ్చు. గమనంలో ఉండొచ్చు. వీటిని టార్గెట్ చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందడుగేయాలి. ఆపరేషన్‌కు బయలుదేరేముందు బృందంలోని ప్రతి సిపాయికి ఆపరేషన్‌కు సంబంధించిన ప్రతి విషయాన్ని వివరంగా చెబుతారు. ఎవరి బాధ్యతను వారికి అప్పగిస్తారు. మనకేం నష్టం జరగకుండా ప్రత్యర్థిని మట్టుబెట్టి రావటం ఈ ఆపరేషన్ ప్రత్యేకత. అందుకే సర్జికల్ దాడులు చేసేందుకు ధైర్యం కావాలి’ అని రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ శంకర్ ప్రసాద్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సర్జికల్ దాడులు 1. మయన్మార్‌లో భారత ఆపరేషన్: 2015, జూన్‌లో 70 మంది భారత కమాండోలు మయన్మార్ అడవుల్లో సర్జికల్ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 38 మంది నాగా మిలిటెంట్లు హతమవ్వగా ఏడుగురికి గాయాలయ్యాయి. జూన్4వ తేదీన మణిపూర్‌లో ఆర్మీ వాహనంపై దాడిచేసి 18 మంది జవాన్లను మట్టుబెట్టిన కాసేపటికే భారత్ ఈ దాడులు నిర్వహించింది. 2. ఒసామా ఆపరేషన్, పాకిస్తాన్: 2011లో పాకిస్తాన్‌లోని అబోత్తాబాద్‌లో ఐఎస్ఐ భద్రతావలయంలోని ఓ ఇంటిపై (అల్‌కాయిదా చీఫ్ ఒసామా దాక్కున్నాడన్న పక్కా సమాచారంతో) అమెరికా బలగాలు మెరుపుదాడి చేశాయి. సీఐఏ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఘటనకు ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్ (ఆపరేషన్ జెరోనిమో అనికూడా) అని పేరుపెట్టారు. 3. ఎంటెబీలో దాడి, ఉగాండా: ప్రపంచ సర్జికల్ దాడుల చరిత్రలో ఇది చాలా ప్రత్యేకం. 1979లో ఫ్రాన్స్ విమానాన్ని పాలస్తీనా విముక్తి ఉగ్రవాదులు ఉగాండాలోని ఎంటెబీలో హైజాక్ చేశారు. 100 మంది ఇజ్రాయిలీ కమాండోలు నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో ఉగ్రవాదులందరూ, ముగ్గురు ప్రయాణికులు మృతిచెందగా.. మిగిలిన వారిని క్షేమంగా రక్షించారు. 4. బే ఆఫ్ పిగ్స్ ఆక్రమణ: 1961లో క్యూబాలో ఫిడేల్ క్యాస్ట్రోను గద్దెదించేందుకు అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ, సీఐఏ నేతృత్వంలో బే ఆఫ్ పిగ్స్ సమీపంలో ఈ ఆపరేషన్ జరిగింది. ఈ ఆపరేషన్‌లో 100 మంది అమెరికన్ సైనికులు చనిపోయారు. ఈ ఆపరేషన్ ద్వారా అనుకున్నది సాధించలేకపోవటం అమెరికాకు ఓ పీడకలగా మిగిలింది. 5. ఆపరేషన్ ఈగల్ క్లా, ఇరాన్: 1979లో కొందరు ఇరానియన్ విద్యార్థులు.. తెహ్రాన్‌లో 53 మంది అమెరికన్లను బందీలుగా చేసుకున్నారు. దీంతో అప్పటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ సీక్రెట్ మిషన్‌కు ఆదేశించారు. ఆపరేషన్ ఈగల్ క్లాగా వ్యవహరించిన ఈ ఘటనకూడా అమెరికాకు చేదు జ్ఞాపకాలనే మిగిల్చింది. బందీలను విడిపించే క్రమంలో అమెరికన్ సైనికులు ఇసుక తుపానులో చిక్కుకుపోయారు. ఓ హెలికాప్టర్ కూలిపోయింది. -
పాక్‌ను ఏకాకిని చేయడమెలా?
దౌత్యపరంగా పాకిస్తాన్‌ను ఏకాకిని చెయ్యడమనేది పైకి చెప్పినంత సులభం కాదు. అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలకు పావుగా ఉన్న పాకిస్తాన్‌పై చర్యలు తీసుకోవాలంటే మన విదేశీ విధానం తీవ్ర కసరత్తు చేయాల్సి ఉంది. ఉడీ సైనిక స్థావరంపై ఉగ్ర వాదుల దాడిలో 19 మంది భారత సైనికులు తమ ప్రాణా లను బలి చేసిన తర్వాత భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తత పరాకాష్టకు చేరుకుంది. ఈ దాడి ఐక్య రాజ్యసమితి సాధారణ సభలో తీవ్ర చర్చకు తావిచ్చింది. కశ్మీర్లో భారత సైనికుల దాడిలో హతమైన హిజ్బుల్ ఉగ్రవాది బర్హాన్ వానిని ఐరాస సభలో పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ అమరుడిగా వర్ణించారు. అంతే కాకుండా కశ్మీరులో ప్రజలను వధించడం, అంధత్వానికి గురిచేయడం, గాయపర్చటం ద్వారా భారత భద్రతా బలగాలు మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నాయని షరీఫ్ ఆరోపించారే తప్ప, సరిహద్దుల్లో చొరబాటు గురించి, పాక్ ఆక్రమిత కశ్మీరులో ఉగ్రవాద శిబిరాల మూసివేత విషయంలో తామేం చర్యలు తీసుకున్నా మన్న అంశంపై పల్లెత్తు మాట అనలేదు. ఈ రెండు అంశాలకు సంబంధించి తగు చర్య తీసు కుంటామంటూ వివిధ సందర్భాల్లో పాకిస్తాన్ ప్రభు త్వాలు వాగ్దానం చేస్తూవచ్చాయి. ప్రత్యేకించి కశ్మీర్ అధీన రేఖ వద్ద ఉగ్రవాదుల కదలికలను అడ్డుకుంటా మని నాటి పాక్ అధ్యక్షుడు ముషారఫ్.. 2002లో పాక్‌ను సందర్శించిన అమెరికా విదేశాంగ శాఖ ఉప కార్యదర్శి రిచ్చర్డ్ ఆర్మిటేజ్కు వాగ్దానం చేశారు. ఆర్మి టేజ్ 2003లో మళ్లీ పాక్‌లో పర్యటించినప్పుడు కూడా ముషారఫ్ హామీ ఇస్తూ పీఓకేలోని ఉగ్రవాద శిబి రాలను మూసివేస్తామని చెప్పారు. కానీ ముషారఫ్ ఇచ్చిన ఆ వాగ్దానాలు ఏమయ్యాయి? భారత్‌కు పాక్ ఇచ్చిన హామీల విషయం సరే.. అమెరికన్ అత్యున్నతా దికారుల ముందు చేసిన వాగ్దానాలను కూడా పాకిస్తాన్ గౌరవించలేదు, బాధ్యతగా వ్యవహరించలేదు. వాటిని నేటికీ అమలు చేయలేదు. ప్రత్యేకించి ఈ అంశంపైనే వివిధ అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్‌ను వేలెత్తి చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉడీ నేపథ్యంలో పూర్తి స్థాయి దాడి చేయటం నుంచి దౌత్యపరంగా పాకిస్తాన్‌ను ఒంటరిని చేయడం వరకు భారతప్రభుత్వం పలు చర్యలు చేపట్టనుందని పలువురు భావిస్తున్నారు. భారత పాకిస్తాన్ రెండు దేశాలూ అణ్వస్త్ర దేశాలే కాబట్టి యుద్ధం జరిగితే అపార నష్టం, అధిక మరణాలు చోటుచేసుకునే ప్రమాదం ఉన్నందున సైనిక చర్యకు తనదైన పరిమితులున్నాయి. పైగా, ఒకసారి సైనిక ఘర్షణ మొదలైతే, యుద్ధంలో మునిగిన రెండు దేశాలే కాకుండా ఇతర అగ్రరాజ్యాలు కూడా తమ అనుకూల దేశానికి మద్దతుగా కలిసివచ్చేం దుకు అవకాశాలున్నాయి. కాబట్టే పాకిస్తాన్‌ను దౌత్య పరంగా ఏకాకిని చేయడ మే ఉత్తమమని చాలామంది భావిస్తున్నట్లుంది. అయితే పాక్‌ను దౌత్యపర ఏకాకి తనంలోకి నెట్టడం పైకి చెప్పినంత సులభం కాదు. ఆర్థిక ఆంక్షలు, వాణిజ్య నిబంధనలు విధించడం, అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘిస్తున్న దేశానికి.. అంతర్జాతీయ కమ్యూనిటీ లేదా ఐరాసలోని అధిక దేశాలు ఆర్థిక సహాయాన్ని నిలిపివేయటం వంటి చర్య లను దౌత్యపరమైన ఏకాంతంగా చెబుతున్నారు. అయితే దౌత్యపరంగా పాక్‌ను ఏకాకిని చేయడానికి ముందుగా కొన్ని కఠిన వాస్తవాలను, చారిత్రిక సత్యా లను పరిగణించాల్సి ఉంది. ఆర్థికంగా సుస్థిరంగా ఉన్న పాకిస్తాన్ అటు అమెరికా ప్రయోజనాలకూ, ఇటు మొత్తం ఆగ్నేయాసియా సుస్థిరతకూ కీలకమైనది. సోవియట్ యూనియన్ 1979లో ఆప్ఘనిస్తాన్‌ను ఆక్రమించిన నాటినుంచి సోవియట్ విస్తరణవాదాన్ని అడ్డుకోవడానికి పాకిస్తాన్‌ని ఒక ప్రాబల్య ప్రాంతంగా అమెరికా గుర్తిస్తూ వచ్చింది. నాటి రీగన్ ప్రభుత్వం 1981లో పాకిస్తాన్‌కు 3.2 బిలియన్ డాలర్ల మేరకు ఆర్థిక, సైనిక సహాయ ప్యాకేజీని అందించింది. నాటి నుంచి ఆప్ఘనిస్తాన్‌లో సైనికచర్యలకుగాను అమెరికా, దాని మిత్రులకు కీలకమైన సైనిక సామగ్రి సరఫరా దేశంగా పాకిస్తాన్ మారిపోయింది. ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేయడంలో పాకిస్తాన్ పాత్రను గుర్తిస్తున్నప్ప టికీ పాక్‌ను, అమెరికా తన కుడిభుజంగానే చూస్తోంది. పైగా భారత్‌కు చిరకాలంగా మిత్రదేశంగా ఉన్న రష్యా విదేశీ విధానం గత ఏడాది కాలంగా పాకిస్తాన్ వైపు మొగ్గు చూపుతోంది. ఇరుదేశాలు సైనిక విన్యాసా లకు కూడా సిద్ధపడ్డాయి. అమెరికా-భారత్ మధ్య స్నేహం పెరుగుతున్న క్రమంలోనే ఈ పరిణామం నెలకొంది మరోవైపున తొలినుంచీ పాక్‌ను శాశ్వత మిత్ర దేశంగా పేర్కొంటున్న చైనా కూడా సైనిక దాడి జరిగితే తాను పాక్‌ను బలపరుస్తానని బహిరంగంగా ప్రకటించింది. అంటే ప్రపంచ ఆధిపత్య శక్తులతో పాక్ నెరుపుతున్న సంబంధాలను జాగ్రత్తగా అంచనా వేయవలసి ఉంది. పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్ర వాద సంస్థలపై, దాని అణు కార్యక్రమాలపై నిషేధం విషయంలో పలు అంతర్జాతీయ, ప్రాంతీయ వేదికలను సంప్రదించాల్సి ఉంది. మొత్తం మీద చూస్తే పాక్‌ను దౌత్యపరంగా ఏకాకి చేయడం అనేది పైకి చెప్పినంత సులభం కాదు. ప్రపంచ, రాజకీయ, ఆర్థిక, సైనిక సంక్లిష్టతల మధ్య ఈ అంశాన్ని ముందుపీటికి తీసుకురావటంలో భారత విదే శాంగశాఖ అత్యంత నైపుణ్యంగా వ్యవహరించవలసి ఉండటం అవశ్యం. - వ్యాసకర్త రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, ఐక్యరాజ్యసమితి పూర్వ ప్రధాన భద్రతా సలహాదారు మొబైల్: 08801-676660 - కేసీ రెడ్డి -
అనూహ్యం.. విస్మయం..!
ఊహించనిరీతిలో విస్మయపరచడంలో నరేంద్రమోదీని మించిన నాయకుడు లేరంటే అతియోశక్తి కాదేమో! సెప్టెంబర్ 18న 18మంది సైనికుల్ని పొట్టనబెట్టుకున్న ఉడీ ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాక్‌ను ఇరకాటంలో నెట్టేందుకు దౌత్యపరమైన మార్గాల్లోనే ఎన్డీయే ప్రభుత్వం ముందుకు సాగుతోందని అందరూ భావించారు. సైనిక చర్యలాంటి తీవ్రమైన నిర్ణయాలు ఉండకపోవచ్చునని దేశ ప్రజలు కూడా నిర్ధారణకు వచ్చేలోపే.. అనూహ్యంగా సైన్యం పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ ఉగ్రవాద శిబిరాలపై ’సునిశిత దాడులు’ (సర్జికల్ స్ట్రైక్స్) జరిపింది.1990 నుంచి పాక్ మన దేశంలోకి ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తున్నా.. ఇలాంటి దాడులు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ సైనిక చర్యల పర్యవసానం ఏమిటి? ప్రభావం ఎలా ఉండబోతున్నది? అన్నది ఇప్పటికిప్పుడు బేరీజు వేయలేం. కానీ, తన దౌత్య వ్యూహంలో భాగంగా రిస్క్ చేయడానికి వెనుకాడని ప్రధాని మోదీని మెచ్చుకోకుండా ఉండలేం. నిజానికి మోదీ ఇలాంటి అనూహ్య నిర్ణయాలు తీసుకోవడం ఇదేం కొత్త కాదు. 2014 మేలో ఆయన ప్రధానిగా తన ప్రమాణ స్వీకార వేడుకకు సార్క్ దేశాధినేతలతోపాటు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను కూడా ఆహ్వానించారు. దీనిని ఎవరూ పెద్దగా ఊహించలేకపోయారు. అనంతరం ఇరుదేశాల ద్వైపాక్షిక చర్చలను ముందుకు తీసుకెళ్లాలని ఇరునేతలు నిర్ణయించారు. మోదీ-షరీఫ్ మధ్య గొప్ప ’కెమిస్ట్రీ’ ఉండటంతో భారత్-పాక్ సంబంధాలు ఘననీయంగా మెరుగుపడతాయని అంతా భావించారు. కానీ కశ్మీర్లో మృతిచెందిన మిలిటెంట్ కమాండర్ బుర్హాన్ వనీని షరీఫ్ అమరుడు అని కీర్తించడం, పాకిస్థానీ స్వాతంత్య్ర దినమైన ఆగస్టు 14న అతనికి అంకితం ఇవ్వడంతో ఇరుదేశాలు సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. కానీ, అంతకుముందు రెండేళ్లలో భారత్-పాక్ సంబంధాల్లో కొన్ని మెరుపులు, కొన్ని విస్మయాలు, కొన్ని ఎదురుదెబ్బలు ఉన్నాయి. 2014లో ఇరుదేశాల విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చలు నిర్వహించాలని మోదీ ప్రభుత్వం భావిస్తే.. వెంటనే కశ్మీర్ వేర్పాటువాద హురియత్ నేతలతో సమావేశమై పాక్ హై కమిషనర్ అబ్బుల్ బాసిత్ షాక్ ఇచ్చాడు. బ్యాంకాక్‌లో 2015 డిసెంబర్లో ఎన్ఎస్ఏ స్థాయి సమావేశం జరుగగా.. ఆ తర్వాత వారానికే పారిస్‌లో ఊహించనిరీతిలో మోదీ-షరీఫ్ భేటీ అయ్యారు. ఇక రష్యా పర్యటన నుంచి తిరిగొస్తూ ఆఫ్గన్ మీదుగా లాహోర్‌లోని షరీఫ్ ఫామ్‌హౌజ్‌కు వెళ్లి ప్రధాని మోదీ ఏకంగా దేశాన్ని విస్మయ పరిచారు. షరీఫ్ మనవరాలి పెళ్లి విందులో పాల్గొని తన దౌత్య చతురతను చాటారు. నిజానికి మోదీ పాక్ విషయంలోనే కాదు అమెరికా విషయంలోనూ దూకుడుగా దౌత్యనీతిని అవలంబించారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా కోసం పారిస్ వాతావరణ ఒప్పందాన్ని ఆమోదిస్తున్నట్టు ఇటీవల ప్రకటించి ఆయన అందరినీ విస్మయ పరిచారు. నిజానికి ఈ ఏడాది చివర్లోగానీ ఈ ఒప్పందాన్ని ఆమోదించబోమని మోదీ చైనాలో జీ20 సదస్సు సందర్భంగా పేర్కొన్న సంగతి తెలిసిందే. -
ఆ సూత్రధారిని కూడా సైన్యం టార్గెట్ చేయాలి!
పాకిస్థాన్ భూభాగంలోకి ప్రవేశించి మరీ ఉగ్రవాదులన్ని ఏరివేసేందుకు భారత్ సైన్యం చేసిన ‘సునిశిత దాడుల’ (సర్జికల్ స్ట్రైక్స్)పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. పాకిస్థానీ ఉగ్రవాదులు జరిపిన ఉడీ దాడులో వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలు ఈ దాడులపై సంతోషం వ్యక్తం చేశాయి. భారత్‌లో ఉగ్రవాద దాడులకు ప్రణాళికలు రచిస్తున్న హఫీజ్ సయీద్ లాంటి ఉగ్రవాద సూత్రధారుల్ని మట్టుబెట్టేందుకు కూడా భారత సైన్యం వ్యూహం రచించాలని వారు కోరారు. ఉడీ దాడిలో మరణించిన హవల్దార్ అశోక్‌కుమార్ సింగ్ భార్య సంగీతా దేవీ సైన్యం సర్జికల్ స్ట్రైక్స్‌పై ఆనందం వ్యక్తం చేశారు. లష్కరే తోయిబా స్థాపకుడు అయిన హఫీజ్ సయీద్‌కు కూడా బుద్ధి చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ‘భారత్‌లో జరిగిన అనేక ఉగ్రవాద దాడులకు హఫీజ్ సయీదే సూత్రధారి. భారత సైన్యం అతన్ని లక్ష్యంగా చేసుకొని హతమార్చాలి. అతను లక్ష్యంగా ఇలాంటి దాడులు చేయాలి’ అని సంగీతాదేవి మీడియాతో పేర్కొన్నారు. మరో అమర సైనికుడు ఎస్కే విద్యార్థి భార్య స్పందిస్తూ సైన్యం దాడులపై హర్షం వ్యక్తం చేశారు. ఉడీ దాడులకు ముందే సైన్యం ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని ఉంటే ఇంతమంది సైనికులు ప్రాణాలు పోయి ఉండేవి కావని ఆమె పేర్కొన్నారు. -
సార్క్ సదస్సు బహిష్కరణపై టాటా ఏమన్నారు..
ఉడీ ఉగ్రదాడి నేపథ్యంలో సార్క్ సదస్సును బహిష్కరించాలంటూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ప్రశంసించారు. ''సార్క్ సమావేశాన్ని బహిష్కరించాలన్న భారత ప్రభుత్వ స్థిర నిర్ణయం, సభ్య దేశాలు కూడా అందుకు మద్దతివ్వడం చూస్తే చాలా గర్వంగా ఉంది'' అని ఆయన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు ఇప్పటివరకు 10 వేల లైకులు రాగా, 6,800 మందికి పైగా దాన్ని రీట్వీట్ చేశారు. జమ్ము కశ్మీర్‌లోని ఉడీ ప్రాంతంలో భౄరత సైనిక శిబిరంపై పాకిస్థాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు 18 మంది జవాన్లను పొట్టన పెట్టుకున్న దారుణ ఘటన తర్వాత భారత్ - పాకిస్థాన్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దాంతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో సదస్సు నుంచి తప్పుకొంటున్నట్లు భారతదేశం ప్రకటించింది. ఆ వెంటనే బంగ్లాదేశ్, భూటాన్, అఫ్ఘానిస్థాన్ కూడా తాము సదస్సులో పాల్గొనేది లేదని తెలిపాయి. అయితే ఎలాగైనా సదస్సు నిర్వహించాలని ప్రస్తుతం సార్క్ అధ్యక్ష స్థానంలో ఉన్న నేపాల్ భావిస్తోంది. So proud of Indian govt's firm stand on bycot of SARC mtg & overwhelming support by member nations. — Ratan N. Tata (@RNTata2000) 28 September 2016 -
మా అణ్వస్త్రాలు.. ఆటబొమ్మలు కావు
తమ వద్ద అణ్వస్త్రాలు ఉన్న విషయాన్ని పాకిస్థాన్ పదే పదే బయటకు చెబుతోంది. భారతదేశంతో ఒకవేళ యుద్ధం అంటూ వస్తే వాటిని ఉపయోగించడానికి ఏ మాత్రం వెనకాడేది లేదని అంటోంది. ఈ విషయాన్ని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా మహ్మద్ ఆసిఫ్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. తమ వద్ద ఉన్న అణ్వస్త్రాలు ఆటబొమ్మలేవీ కావని ఆయన అన్నారు. ''మా దగ్గర ఉన్న వ్యూహాత్మక ఆయుధాలను మా రక్షణ కోసమే తయారు చేశాం. ఈ ఆయుధాలు ఆటబొమ్మలు ఏమీ కావు. మా క్షేమానికి ఏమైనా ముప్పు ఉందనుకుంటే వాటిని వెంటనే ఉపయోగంలోకి తీసుకొస్తాం'' అని జియో టీవీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆసిఫ్ చెప్పారు. ఈ ఇంటర్వ్యూ సెప్టెంబర్ 26వ తేదీన ప్రసారమైంది. ఉడీ ఉగ్రదాడి జరగడానికి ఒక్కరోజు ముందు.. అంటే సెప్టెంబర్ 17వ తేదీన కూడా ఇలాంటిదే మరో ఇంటర్వ్యూ ప్రసారమైంది. ఇప్పటికిప్పుడు యుద్ధం వస్తుందన్న భయం ఏమీ లేదని.. కానీ ఖురాన్లో అల్లా చెప్పినట్లు, 'గుర్రాలు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి' అని ఖ్వాజా మహ్మద్ ఆసిఫ్ అన్నారు. పాకిస్థాన్ మీద ఎప్పుడూ ఒత్తిడి ఉంటూనే ఉందని, అందువల్ల అవసరమైన వాటి కంటే ఎక్కువగా తమదగ్గర వ్యూహాత్మక ఆయుధాలు ఉన్నాయని చెప్పారు. ఈ విషయంలో తమదే ఆధిక్యం అన్న విషయానికి అంతర్జాతయంగా కూడా గుర్తింపు ఉందని చెబుతూ.. ఎవరైనా తమ గడ్డమీద అడుగుపెట్టినా, తమ అంతర్గత భద్రతకు ముప్పు తేవాలని చూసినా తమ రక్షణ కోసం ఆ ఆయుధాలను ఉపయోగించడానికి వెనుకాడబోమని అన్నారు. భారతదేశంతో యుద్ధం వస్తే పాకిస్థాన్ అణ్వాయుధాలు ఉపయోగిస్తుందా అన్న ప్రశ్నకు.. అది పరిస్థితులను బట్టి ఆధారపడుతుందని, తమ ఉనికి ప్రమాదంలో పడితే తాము అన్నింటినీ ఉపయోగిస్తామని స్పష్టం చేశారు. అందులో భయపడాల్సింది ఏముందని ఎదురు ప్రశ్నించారు. -
సమయానికే సార్క్ సదస్సు నిర్వహిస్తాం
భారత్ సహా నాలుగు దేశాలు తాము హాజరయ్యేది లేదని స్పష్టంగా చెప్పినా.. ప్రస్తుతం సార్క్ అధ్యక్ష స్థానంలో ఉన్న నేపాల్ మాత్రం.. సరైన సమయానికే ఈ సదస్సు నిర్వహించాలని భావిస్తోంది. ఇందుకు సభ్యదేశాలన్నీ సహకరించాలని గట్టిగా కోరింది. ఈ మేరకు బుధవారం రాత్రి తర్వాత నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన జారీచేసింది. నవంబర్ 9, 10 తేదీలలో ఇస్లామాబాద్‌లో సార్క్ సదస్సు జరిగేందుకు తగిన వాతావరణాన్ని ఏర్పరచాలని అందులో తెలిపింది. ఉడీ ఉగ్రదాడి నేపథ్యంలో ఈ సదస్సుకు హాజరయ్యేది లేదని భారతదేశం ముందుగా స్పష్టం చేసింది. ఆ తర్వాత వరుసపెట్టి బంగ్లాదేశ్, భూటాన్, అఫ్ఘానిస్థాన్ కూడా వివిధ కారణాలతో తాము ఇస్లామాబాద్‌లో జరిగే సదస్సుకు హాజరు కాబోమని తెలిపాయి. దాంతో ఇక ఆతిథ్య దేశం పాకిస్థాన్‌తో పాటు కేవలం శ్రీలంక, మాల్దీవులు, నేపాల్ మాత్రమే ఆ సదస్సులో పాల్గొనే పరిస్థితి ఏర్పడింది. అయితే అసలు ఏ ఒక్క సభ్య దేశం రాకపోయినా సదస్సు వాయిదా వేయాల్సిందే. ప్రస్తుత పరిస్థితిని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని నేపాల్ ప్రభుత్వం ఆ ప్రకటనలో తెలిపింది. అయితే, భారత ప్రయోజనాలకు విరుద్ధంగా నేపాల్ ఎందుకింతలా పట్టుబడుతోందన్న విషయం మాత్రం ఇంకా తెలియలేదు. -
యూఎస్ నుంచి అజిత్ దోవల్‌కు ఫోన్‌కాల్
వాషింగ్టన్: భారత జాతీయ భత్రతా సలహాదారు అజిత్ దోవల్ కు అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ సుసన్ రైస్ ఫోన్ చేశారు. ఉడీ ఉగ్రవాద ఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ విషయంలో పాకిస్థాన్‌ను తగిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఆమె దోవల్‌కు తెలిపారు. లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్ర సంస్థలపై పాక్ కఠిన చర్యలు తీసుకుంటుందని తాము భావిస్తున్నట్టు ఆమె వెల్లడించారు. ఉడీ ఉగ్రదాడి అనంతరం అమెరికా అత్యున్నత అధికారి స్పందించడం ఇదే తొలిసారి. ఉగ్రవాద బాధిత దేశాలకు న్యాయం చేసేందుకు తమ పోరాటాన్ని మరింత ఉదృతం చేస్తామనే ఒబామా సందేశాన్ని ఆమె దోవల్‌కు వివరించారు. ఉగ్రవాదులను ఒంటరి చేసేందుకు మరింత సహకారంతో కలిసి పనిచేసేందుకు ఆమెహామీ ఇచ్చారని ఫోన్ కాల్ వివరాలను అమెరికా అధ్యక్షుని అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ వెల్లడించారు. -
కేజ్రీవాల్‌పై ట్విట్టర్ జనాల దాడి
సోషల్ మీడియాలో తన భావాలను ఎప్పటికప్పుడు చెబుతూ, ట్విట్టర్ ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాలే ఆయుధంగా ఉద్యమాలు నిర్మించిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఆ ట్విట్టరే పెద్ద షాకిచ్చింది. ఉడీ ఉగ్రదాడిని కూడా రాజకీయాలకు వాడుకోవాలనుకున్న కేజ్రీవాల్‌పై ట్విట్టర్ జనాలు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఉడీ ఉగ్రదాడి నేపథ్యంలో ఒక జాతీయ పత్రికలో వచ్చిన కథనాన్ని ప్రస్తావిస్తూ.. ''అద్భుతమైన కథనం. ఉడీ దాడి విషయంలో అంతర్జాతీయంగా పాకిస్థాన్ కాదు, భారతదేశమే ఒంటరి అయిపోతున్నట్లు కనిపిస్తోంది'' అని ఆయన ట్వీట్ చేశారు. దీంతో ఒక్కసారిగా ట్విట్టర్ జనాలలో కలకలం రేగింది. పాకిస్థానీ పౌరులకు ఆయన ట్వీట్ ఒక ఆయుధంలా దొరికింది. భారతదేశం గురించి తమ ఆలోచనలను సమర్థించే నాయకుడు ఒకరు దొరికారని వాళ్లు సంబరపడ్డారు. విషయం ఏమిటంటే, ఇస్లామాబాద్‌లో నవంబర్ నెలలో నిర్వహించే సార్క్ సదస్సుకు హాజరు కాకూడదని భారతదేశం నిర్ణయించుకున్న తర్వాత.. అదే బాటలో అఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్, భూటాన్ కూడా సదస్సును బహిష్కరించాయి. దాంతో ప్రస్తుతం సార్క్ అధ్యక్ష పదవిలో ఉన్న నేపాల్.. సదస్సు వేదికను మార్చాలని భావించడం పాకిస్థాన్‌ను మరింత ఇబ్బందిలోకి నెట్టేసింది. కానీ కేజ్రీవాల్ మాత్రం ఈ పరిస్థితికి పూర్తి భిన్నంగా వ్యవహరించడంతో భారతీయులతో పాటు ఇతర దేశాలలో వాళ్లు కూడా ఆయనను తీవ్రంగా విమర్శించారు. సార్క్ సదస్సుకు మోదీ రాకపోతే.. ఆయన బదులు కేజ్రీవాల్ రావచ్చుగా అని కొందరు అంటే, భారతీయులు అసలు కేజ్రీవాల్‌కు బుర్ర ఉందా.. ఆయనకు సలహాలు ఇచ్చేవాళ్లు ఎవరు అంటూ రకరకాలుగా మండిపడ్డారు. మరికొందరు తీవ్ర అసభ్య పదజాలంతో కూడా కేజ్రీవాల్‌ను దూషించారు. Excellent article. On Uri, rather than Pak, India seems to be getting isolated internationally https://t.co/u6wKBE20fP — Arvind Kejriwal (@ArvindKejriwal) September 27, 2016 That whatever moment when Delhi, yes, Delhi CM, tweets an Indian article about India's isolation while India is trying to isolate Pakistan — Mehr Tarar (@MehrTarar) September 27, 2016 If Modi doesn't want to attend #SAARCSummit at Islamabad then Pakistan MoFA should extend an official invitation to Mr. CM @ArvindKejriwal — Abdul Qadeer Khan (@PakDef_Patriot) September 28, 2016 The only thing worse than this article is Kejriwal's endorsement of it. Utterly disgraceful https://t.co/iJAXwyzTOk — Minhaz Merchant (@minhazmerchant) September 27, 2016 @ArvindKejriwal Seriously sir, shame on you. Thought u would keep politics aside on Nat'l interest, but u're shameless. @TheTribuneIndia — Devika (@Dayweekaa) September 27, 2016 . @ArvindKejriwal You should be happy about this. You should use this to become PM & spread the famous "Ration card model" across India — The Masakadzas (@Nesenag) September 27, 2016 @ArvindKejriwal OMG!Do you even understand what say? Either you are a foolish actor or a traitor.I wonder who are your advisers.Illiterates? — Dr ArvindChaturvedi (@ArvindChaturved) September 27, 2016 By endorsing this article, @ArvindKejriwal has successfully achieved the Ranks of "Bharat tere tukde honge" Brigade.https://t.co/GIIufLV5kr — चार लोग (@WoCharLog) September 27, 2016 -
సార్క్ బహిష్కరణ: పాక్‌కు షాకిచ్చే అంశాలివే.!
-
లోటుపాట్లు సరిదిద్దాలి
ఎప్పుడూ అంతంతమాత్రంగానే ఉన్న భారత్-పాక్ సంబంధాలు ఉడీ ఉగ్రవాద దాడి తర్వాత మరింత క్షీణిస్తున్నాయి. అంతక్రితం పఠాన్‌కోట్ దాడి సమయంలో భారత్ స్పందించిన తీరు చూశాకైనా మారని పాకిస్తాన్ వైఖరిని ఉడీ దాడి మరింత ప్రస్ఫుటం చేసింది. కేంద్ర మంత్రులూ, వివిధ పార్టీల నాయకులకు మీడియా కూడా తోడై ‘ఏదో ఒకటి చేయకపోతే కుదరద’న్న అభిప్రాయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం వరస చర్యలను ప్రకటి స్తున్నది. కేరళలోని కోజికోడ్‌లో బీజేపీ జాతీయ మండలి సమావేశం సందర్భంగా శనివారం జరిగిన బహిరంగసభలో ప్రధాని నరేంద్ర మోదీ దౌత్యపరంగా పాక్‌ను ఏకాకి చేయడానికి ప్రయత్నిస్తామని ప్రతినబూనారు. ఆ తర్వాత పాక్‌ను ఏకాకిని చేయడానికి, దాన్ని ఇతరత్రా మార్గాల్లోనూ ఇరకాటంలో పెట్టడానికి చర్యలు ప్రారంభమయ్యాయి. పాకిస్తాన్‌తో 1960లో కుదిరిన సింధునదీ జలాల ఒప్పందం అమలును పునఃసమీక్షించాలన్న నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఉగ్రవాదం సంగతి తేలేవరకూ సింధు నదీజలాల కమిషన్ సమావేశాలను నిలిపి వేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఆ వెంటనే పాకిస్తాన్‌కు ప్రస్తుతం మనం ఇస్తున్న అత్యంత సానుకూల దేశం(ఎంఎన్ఎఫ్) హోదాను తొలగించే అంశాన్ని పరిశీలించాలని నిర్ణయించారు. ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ దీటుగా జవాబిచ్చారు. తాము చెలిమిని కోరుతుంటే పాక్ పఠాన్‌కోట్, యుడీలతో జవాబిచ్చిందని ప్రపంచ దేశాల దృష్టికి తీసుకొచ్చారు. 1971 యుద్ధంలో తూర్పు పాకిస్తాన్ విడివడి బంగ్లాదేశ్‌గా ఏర్పడిన నాటి నుంచీ రగిలిపోతున్న పాకిస్తాన్ ఏదో రకంగా భారత్‌ను ఇబ్బందుల్లోకి నెట్టాలని ప్రయత్నిస్తూనే ఉంది. కశ్మీర్లో తాజాగా ఏర్పడ్డ పరిస్థితులను సాకుగా తీసుకుని ఉడీలో దాడికి తెగబడి...అక్కడి పరిణామాలే అందుకు కారణం తప్ప తాము కాదని తప్పించుకోజూస్తున్నది. అయితే పాక్ ఏకాకవుతున్న జాడలు చిన్న గానే అయినా కనిపిస్తూనే ఉన్నాయి. ఇస్లామాబాద్‌లో జరగాల్సిన దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి (సార్క్) సమావేశాలకు హాజరు కావడంలేదని మన దేశం ప్రకటించిన నేపథ్యంలో అవి వాయిదా పడతాయని బుధవారం నేపాల్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. మనకన్నా ముందే భూటాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్ దేశాలు పాక్ వైఖరికి నిరసనగా సార్క్ సమావేశాలను బహిష్కరి స్తున్నట్టు ప్రకటించాయి. ఎనిమిది సభ్య దేశాల్లో సగం దేశాలు గైర్హాజరు కావాలని నిర్ణయించుకోవడంతో సార్క్ సమావేశాలు వాయిదా పడటం మినహా గత్యం తరం లేదు. ప్రపంచంలో తాము ఏకాకులమవుతున్నామన్న కథనాల్లో నిజం లేదని పాకి స్తాన్ చేస్తున్న తర్కాన్ని ఈ పరిణామం ఎండగడుతుంది. అయితే సార్క్ సమావేశాల సంగతలా ఉంచి ఇతర చర్యలు ఆశించినంత ఫలి తాలనిస్తాయా అన్నది అనుమానమే. సింధు నదీ జలాల ఒప్పందంలోని క్లాజుల ప్రకారం దాన్నుంచి ఇరు దేశాల్లో ఏ ఒక్కటీ ఏకపక్షంగా వైదొలగడం సాధ్యం కాదు. దాన్లో మన వాటా జలాలను పూర్తిగా వినియోగించుకోలేక పాక్‌కే వదిలి పెడుతున్న విషయం వాస్తవమే అయినా దాన్ని సవరించుకోవడం ఇప్పటికిప్పుడు సాధ్య మయ్యే పనికాదు. రిజర్వాయర్లు నిర్మించడం భారీ వ్యయంతో కూడుకున్న పని. అందుకు ఏళ్లకేళ్లు పడుతుంది. దానివల్ల తక్షణ ఫలితాలు సమకూడవు. అయితే కమిషన్ సమావేశాలను నిలిపివేయాలన్న నిర్ణయం వల్ల అనిశ్చిత వాతా వరణం ఏర్పడుతుంది. దానివల్ల పాక్‌కు ఇబ్బందులు తప్పకపోవచ్చు. మన దేశం ఈ ఒప్పందాన్ని పునఃసమీక్షించాలని నిర్ణయించిన వెంటనే పాక్ విదేశాంగ శాఖ సలహాదారు సర్తాజ్ అజీజ్ ఉలిక్కిపడటాన్ని గమనిస్తే సింధు నదీ జలాలు ఆ దేశ ఆర్ధిక వ్యవస్థతో ఎంతగా ముడిపడి ఉన్నాయో అర్ధమవుతుంది. ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా చీఫ్ హఫీజ్ మహమ్మద్ సయీద్ అయితే సింధు నదీజలాల్లో భాగమైన చీనాబ్ నదిపై ఉన్న ఆనకట్టలనుంచి భారీ పరిమాణంలో నీళ్లు విడుదల చేయడం లేదా అడ్డుకోవడం ద్వారా వాయువ్య పంజాబ్‌ను సర్వనాశనం చేయ డానికి భారత్ చూస్తున్నదని హెచ్చరించాడు. పాక్‌కు ఎంఎన్ఎఫ్ ప్రతిపత్తిని ఉప సంహరించడం వల్ల అక్కడి నుంచి మన దేశానికి జరిగే ఎగుమతులు ఆగిపోతాయి గనుక ఆ మేరకు ఎంతో కొంత నష్టం ఉంటుంది. పాక్‌కు మనం ఇచ్చినట్టుగా అది మనకు ఎంఎన్ఎఫ్ ప్రతిపత్తి ఇవ్వకపోయినా మన నుంచి అది దిగుమతి చేసుకునే సరుకుల విలువ ఎక్కువే ఉంది. ప్రస్తుతం మన దేశంనుంచి పాకిస్తాన్‌కు సాగు తున్న ఎగుమతులు దాదాపు 217 కోట్ల డాలర్లు. అక్కడి నుంచి దిగు మతులు50 కోట్ల డాలర్లు మించి లేవు. అంటే ద్వైపాక్షిక వాణిజ్యంలో ఒడి దుడుకులు ఏర్పడితే పాక్‌కన్నా మనమే ఎక్కువగా నష్టపోతాం.అయితే ఇందులో లాభనష్టాల సంగతలా ఉంచి ఆ చర్య వెనకున్న ఉద్దేశాలపై అందరి దృష్టి పడుతుంది. పాక్‌ను భారత్ అంటరాని దేశంగా ఎందుకు పరిగణిస్తున్నదన్న అంశంపై చర్చ జరుగుతుంది. వీటన్నిటితోపాటు భద్రతాపరంగా పటిష్టమైన చర్యలు అవసరమవుతాయి. 2001లో పార్లమెంటుపై ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత, 2008లో ముంబైపై ఉగ్రదాడి తర్వాత పాక్ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరపాలని కొందరు సూచించారు. ఆ సమయాల్లో ప్రధానులుగా ఉన్న వాజపేయి, మన్మోహన్ సింగ్ త్రివిధ దళాధిపతులతో భేటీ అయ్యారు. దాడులు జరపడంలోని మంచి చెడ్డల సంగతలా ఉంచి మన దళాలకు అందుకు అవసరమైన హెలికాప్టర్లయినా, ఇతర రక్షణ సామగ్రి అయినా తగిన స్థాయిలో లేదని ఆ రెండుసార్లూ వెల్లడైంది. ఆ రెండు ఉదంతాలకూ మధ్య ఏడేళ్ల వ్యవధి ఉంటే ఇప్పుడు మరో ఎనిమిదేళ్లు గడిచాయి. అయినా ఇప్పటికీ రక్షణ సామగ్రి విషయంలో మన దళాలు వెనకబడే ఉన్నాయి. ఇది మంచిది కాదు. ఇలాంటి లోటుపాట్లన్నిటిపైనా కూడా దృష్టి సారిస్తే తప్ప మెరుగైన ఫలితాలు కలగవు. -
సార్క్ బహిష్కరణ: పాక్‌కు షాకిచ్చే అంశాలివే!
-
సార్క్ బహిష్కరణ: పాక్‌కు షాకిచ్చే అంశాలివే!
జమ్ముకశ్మీర్‌లోని ఉడీ ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాకిస్థాన్‌పై భారత్ తీవ్రమైన కోపాన్ని ప్రదర్శిస్తోంది. ఇందులో భాగంగా నవంబర్‌లో పాకిస్థాన్‌లో జరగనున్న సార్క్ సదస్సు నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించింది. దీంతో భారత్ దారిలోనే సాగుతూ బంగ్లాదేశ్, ఆఫ్గనిస్థాన్, భూటాన్ కూడా సార్క్ సదస్సును బహిష్కరించాయి. దీంతో ఇస్లామాబాద్‌లో జరగాల్సిన సార్క్ సదస్సు రద్దయ్యే పరిస్థితి నెలకొంది. 18మంది సైనికుల్ని పొట్టనబెట్టుకున్న ఉడీ దాడి నేపథ్యంలో పాక్‌ను ఎంతమాత్రం ఉపేంక్షించరాదని మోదీ సర్కార్ నిర్ణయించింది. పాక్‌ను దౌత్యపరంగా ఏకాకిని చేసేందుకు వీలున్న అన్నీ మార్గాలను ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సింధు నది ఒప్పందంపై సమీక్ష నిర్వహించడంతోపాటు పాక్‌కు ఇచ్చిన అత్యంత ప్రాధాన్య దేశం హోదాను రద్దు చేయాలని నిర్ణయించింది. తాజాగా సార్క్ సదస్సును బహిష్కరించడం ద్వారా పాకిస్థాన్‌పై భారత్ ప్రాంతీయంగా ఆధిపత్యం సాధించింది. ఈ నిర్ణయం ద్వారా భారత్ దక్కిన సానుకూలతలు ఏమిటంటే.. ప్రాంతీయ సహకారంలోనూ ఉగ్రవాద కోణాన్ని జోడించడం! 'ప్రాంతీయ సహకారం, అనుసంధానత, సంప్రదింపుల విషయంలో భారత్ కట్టుబడి ఉంది. కానీ, ఇది ఉగ్రవాద రహిత వాతావరణంలోనే ముందుకు సాగుతుందని భావిస్తోంది'.. పాక్‌లో 19వ సార్క్ సదస్సును బహిష్కరిస్తూ విదేశాంగ శాఖ చేసిన ప్రకటన ఇది. ఈ ప్రకటన ద్వారా పాక్ పెంచిపోషిస్తున్న ఉగ్రవాదం ఒక్క భారత్‌కే కాదు.. దక్షిణాసియా ప్రాంతీయ సహకారానికి పెను ముప్పుగా మారిందనే విషయాన్ని మన దేశం తేల్చిచెప్పింది. ఒకప్పుడు భారత్-పాక్ ద్వైపాక్షిక చర్చల సందర్భంలోనే ఉగ్రవాద రహిత వాతావరణం ప్రస్తావన వచ్చేది. కానీ ఇప్పుడు ప్రాంతీయ చర్చల్లోనూ ఈ అంశాన్ని ప్రధాన అంశంగా భారత్ ముందుకు తెచ్చింది. పాక్‌ను ఇరుకునపెట్టడంలో భారత్‌కు కొత్త మిత్రులు! పాక్‌ను ప్రాంతీయంగా ఇరుకున పెట్టడంలో మోదీ ప్రభుత్వం దౌత్యపరంగా విజయం సాధించింది. ఇస్లామాబాద్‌లో జరిగే సార్క్ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొంటారా? లేదా? అన్నది సందేహాస్పదంగా ఉండగానే బంగ్లాదేశ్, ఆఫ్గనిస్థాన్ ముందుకొచ్చి.. తాము ఆ దేశానికి వెళ్లబోమని తేల్చిచెప్పాయి. ఇప్పుడు భారత్ అధికారికంగా చెప్పడంతో బంగ్లా, ఆఫ్గన్‌తో మన పొరుగు దేశం భూటాన్ కూడా జతకలిసి.. పాక్‌కు షాకిచ్చింది. సార్క్ పునరుద్ధరణ! 1985లో దక్షిణాసియాలోని ఎనిమిది సభ్యదేశాలతో ఏర్పాటైన సార్క్‌తో విస్తృత సంబంధాలు కొనసాగించేందుకు ఎన్డీయే సర్కారు తపిస్తున్నా.. పాకిస్థాన్ మాత్రం అడ్డుపుల్ల వేస్తోంది. సార్క్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు కొర్రిలు పెడుతోంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మినహాయించి ఇతర సార్క్ దేశాలతో సంబంధాలు పెంపొందించుకోవడం, పాక్‌ను బ్లాక్ చేసేలా సబ్-రిజినల్ కనెక్టివిటీని పెంచుకోవడానికి భారత్ ప్రయత్నిస్తోంది. రాజకీయంగా కీలకమే! సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నరేంద్రమోదీ పాకిస్థాన్‌ను నియంత్రించడం గురించి ఎన్నో వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ హామీలపై నిలబడాల్సిన పరిస్థితి ఎన్డీయే ప్రభుత్వానిది. అంతేకాకుండా కీలకమైన ఉత్తరప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ ఒత్తిళ్లకు అనుగుణంగా పాక్‌పై కఠినంగా వ్యవహరించక తప్పదు. ఆ సంకేతాలు ఇచ్చే దిశగా మోదీ ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇక పాకిస్థాన్‌ను దౌత్యపరంగా ఏకాకిని చేయాలన్న విధానం కూడా అమలవుతున్నదన్న సంకేతాలను సార్క్ సదస్సు బహిష్కరణ ద్వారా భారత్ ఇచ్చినట్టు అయింది. దీనికితోడు బంగ్లా, ఆఫ్గన్ వ్యవహారాల్లో పాక్ జోక్యాన్ని నివారించి ఆ దేశాలను తనవైపు తిప్పుకోవడంలోనూ అడ్వాంటేజ్ సాధించింది. నిజానికి దక్షిణాసియాలో మిత్రదేశాలు కావాలని పాక్ కోరుకోవడం లేదు. చైనా, అమెరికా, సౌదీ అరేబియలతో దౌత్య సంబంధాలకే ఆ దేశం అధిక ప్రాధాన్యమిస్తోంది. అయినా సార్క్ సదస్సును నిర్వహించే అవకాశాన్ని పాక్ కోల్పోవడం నిజంగా ఆ దేశానికి నష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
పాకిస్థాన్ చూస్తూ ఊరుకోదు: ముషార్రఫ్
న్యూఢిల్లీ: సింధు నది నుంచి తమ దేశానికి నీళ్లు రాకుండా భారత్ అడ్డుకుంటే చూస్తూ ఊరుకోబోమని పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ హెచ్చరించారు. ప్రతిఘటిచేందుకు సిద్ధంగా ఉంటామని ‘ఇండియా టుడే’ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. నీళ్లపై నియంత్రణతో రెండు దేశాల మధ్య వివాదం మరింత ముదిరే అవకాశముందని అభిప్రాయపడ్డారు. భారత్ తో తలపడాలని తాము కోరుకోవడం లేదని, శాంతిప్రక్రియ ద్వారానే కశ్మీర్ సమస్య పరిష్కారమవుతుందని విశ్వసిస్తున్నామని పేర్కొన్నారు. పుట్టినరోజు పర్యటనలు ఎల్లప్పుడు సమస్యలను పరిష్కరించలేవని అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా పాకిస్థాన్ వెళ్లి నవాజ్ షరీఫ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నేపథ్యంలో ముషార్రఫ్ ఈ వ్యాఖ్య చేశారు. ప్రతిదానికి పాకిస్థాన్ ను నిందించడం సరికాదన్నారు. ఉడీ సైనిక స్థావరంపై జరిగిన ఉగ్రవాదుల దాడికి పాకిస్థాన్ కారణమంటూ రాజకీయ ప్రయోజనాల కోసమే ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఐక్యరాజ్యసమితిలో సుష్మా స్వరాజ్ ప్రసంగం డాబుసరిగా ఉందని విమర్శించారు. సార్క్ సమావేశాల నుంచి భారత్ తప్పుకోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. భారత్ ప్రభావితం చేయడం వల్లే అప్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ కూడా సార్క్ సదస్సుకు దూరమయ్యాయని ఆరోపించారు. బలూచిస్థాన్ లో పాకిస్థాన్ జాతీయ పతకాలను తగులబెట్టిన వారికి కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. -
అక్కడ 'ధోనీ' సినిమాకు షాక్!
మధ్యతరగతి నుంచి అత్యున్నత శిఖరాలకు ఎదిగిన భారత క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన సినిమా 'ఎంఎస్ ధోనీ: ద అన్‌టోల్డ్ స్టోరీ'. ఉడీ ఉగ్రవాద దాడి నేపథ్యంలో దాయాది దేశాలు భారత్-పాకిస్థాన్ మధ్య తారస్థాయిలో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఈ సినిమాపై ఆ ప్రభావం పడింది. భారత్‌లోని పాకిస్థానీ నటులు వెంటనే దేశం విడిచివెళ్లిపోవాలని రాజ్ ఠాక్రే నేతృత్వంలోని ఎమ్మెన్నెస్ బెదిరిస్తున్న నేపథ్యంలో పాకిస్థాన్ ఏకంగా 'ధోనీ' సినిమాపై నిషేధం విధించింది. 'ధోనీ' సినిమాను పాకిస్థాన్‌లో విడుదల చేయవద్దని ఆ దేశం డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయించారని 'మిడ్ డే' పత్రిక తెలిపింది. పాక్‌లో ఈ సినిమాను పంపిణీ చేయడానికి ఎవరూ ముందుకురాలేదని, దీంతో పాక్‌లో ఈ సినిమా విడుదల కాకపోవచ్చునని విశ్వసనీయవర్గాలను ఉటంకిస్తూ ఆ పత్రిక తెలిపింది. ఇరుదేశాల మధ్య నెలకొన్న మాటల యుద్ధం, ఉద్రిక్తతల నేపథ్యంలో సినిమాలపై ప్రభావం ఉంటుందని, భారత సినిమాలు పాక్‌లో విడుదల అయ్యే అవకాశం లేదని ఐఎంజీసీ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ చైర్మన్ అహ్మద్ రషీద్ తెలిపారు. ఇక కశ్మీర్ సమస్య పరిష్కారమయ్యేవరకు భారత్ సినిమాలు పాక్‌లో విడుదల కాకుండా నిషేధించాలని లాహోర్ హైకోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలైంది. -
అప్పుడు వచ్చిన నోళ్లు ఇప్పుడేమయ్యాయి?
పాకిస్థానీ నటీనటులు భారతదేశాన్ని వదిలిపెట్టి వెళ్లిపోవాలన్న తమ నిర్ణయాన్ని మహారాష్ట్ర నవ నిర్మాణ సమితి (ఎంఎన్ఎస్) మరోసారి స్పష్టం చేసింది. వ్యక్తిగతంగా తమకు ఏ ఒక్కరిపైనా ఎలాంటి ద్వేషం లేదని, కానీ.. కళను దేశాన్ని వేరు చేయడం సాధ్యం కాదని ఎంఎన్ఎస్ ప్రతినిధి అమే ఖోప్కర్ అన్నారు. పాక్ నటీనటులను భారతదేశంలో చాలా గౌరవిస్తారని చెబుతూ.. ప్యారిస్‌లోను, సిరియాలోను ఉగ్రదాడులు జరిగినప్పుడు ఈ పాక్ నటులంతా స్పందించి, బాధితులకు సంఘీభావంగా ట్వీట్లు చేశారని, మరి ఉడీలో ఉగ్రవాదులు దాడిచేసి భారతీయ సైనికుల ప్రాణాలను బలిగొన్నప్పుడు వీళ్ల నోళ్లు ఏమైపోయాయని ఖోప్కర్ ప్రశ్నించారు. అందుకే ఉంటున్న దేశమంటే గౌరవం లేని వాళ్లు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. -
పాకిస్థాన్‌కు అమెరికా పత్రిక హెచ్చరిక
ఇటీవలి కాలంలో భారతదేశం వైపు అమెరికా మొగ్గు చూపుతున్నట్లే కనిపించినా, మరోవైపు పాకిస్థాన్‌కు కూడా సాయం చేస్తూనే ఉంటుంది. అలాంటిది అమెరికాలోని ప్రఖ్యాత పత్రిక వాల్‌స్ట్రీట్ జర్నల్ తొలిసారిగా పాకిస్థాన్‌ను హెచ్చరిస్తూ ఓ కథనం ప్రచురించింది. భారత ప్రధాని నరేంద్రమోదీ స్నేహహస్తం చాస్తున్నారని, దాన్ని నిరాకరిస్తే మాత్రం పాక్ ఓ పనికిమాలిన దేశంగా మిగిలిపోతుందని తెలిపింది. భారతదేశం వ్యూహాత్మకంగానే సహనం పాటిస్తోందని, కానీ దాన్ని అలుసుగా తీసుకుంటే నష్టపోయేది పాకిస్థానేనని వాల్‌స్ట్రీట్ జర్నల్ తెలిపింది. మోదీ ప్రస్తుతానికి సహనం పాటిస్తున్నారని, కానీ ఇస్లామాబాద్ ఈ వైఖరి ఎక్కువకాలం అవలంబించడం సరికాదని, అలా చేస్తే ఇప్పుడు ఉన్నదానికంటే పనికిరాని దేశంగా పాక్ మిగిలిపోతుందని చెప్పింది. సరిహద్దుల్లో ఉగ్రవాదులకు ఆయుధాల సరఫరాను పాక్ కొనసాగిస్తే, భారత ప్రధానమంత్రి దానికి గట్టిగా సమాధానం చెప్పగలరని తెలిపింది. ఉగ్రవాద విషయంలో భారత్ నైతిక విలువలను ఎప్పుడూ పాటిస్తూనే ఉందని, కానీ ఆ విషయాన్ని గట్టిగా చెప్పడానికి గతంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ధైర్యం చేయలేకపోయాయని ఆ కథనం పేర్కొంది. ఆ వ్యూహాత్మక మౌనం వల్ల పాకిస్థాన్ ఎన్నిసార్లు దాడులకు పాల్పడినా.. ఆ ఉగ్రవాదానికి ఎప్పుడూ బాధ్యురాలిగా చేయలేదని కూడా తెలిపింది. ఇప్పటికిప్పుడు ఎలాంటి సైనిక చర్య తీసుకోకూడదన్న ప్రధాని మోదీ నిర్ణయాన్ని అమెరికన్ పత్రిక ప్రశంసించింది. దానికి బదులు పాకిస్థాన్‌ను అంతర్జాతీయంగా ఒంటరిని చేసే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపింది. 1960 నాటి సింధు నదీజలాల ఒప్పందాన్ని రద్దు చేయడం, మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాను తప్పించడం లాంటి చర్యల ద్వారా పాక్‌ను అణగదొక్కే ప్రయత్నాలపై ఆలోచిస్తున్నారని కథనంలో వివరించింది. ఉడీ ఉగ్రదాడి తర్వాత భారత విధాన నిర్ణేతలకు తీవ్రస్థాయిలో కోపం, చికాకు వచ్చాయని, దాంతో తక్షణం సైనిక చర్య తీసుకోవాలన్న ఒత్తిడులు కూడా వచ్చాయని ఆ పత్రిక చెప్పింది. భారీ సైనిక దాడి చేస్తే ప్రజల్లో ఉన్న ఆవేశం కూడా కొంతవరకు తగ్గుతుందని.. కానీ దానివల్ల భారత ప్రభుత్వ రాజకీయ, ఇతర ప్రయోజనాలు నెరవేరుతాయో లేదో మాత్రం అనుమానమేనని వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. -
ఉడీ దాడి కుట్ర భారతదేశానిదే: పాక్
పాకిస్థాన్ సరికొత్త వాదన మొదలుపెట్టింది. జమ్ము కశ్మీర్‌లోని ఉడీ పట్టణంలో భారత ఆర్మీ శిబిరంపై దాడి చేసి 19 మంది సైనికులను పొట్టన పెట్టుకున్నది పాక్ వాళ్లు కారట.. భారతదేశమే దానికి కుట్రపన్ని మరీ ఆ పనిచేసిందని ఆ దేశ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ అంటున్నారు. సెప్టెంబర్ 18 నాటి ఆ దాడి వెనుక పాకిస్థాన్ హస్తం ఉందనడానికి ఇంతవరకు ఎలాంటి ఆధారాలు లేవని ఆయన చెప్పారు. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ పేరును కావాలనే వాళ్లు ప్రస్తావిస్తున్నారని, నిజానికి ఆ కుట్ర భారతదేశమే రచించిందని ఆరోపించారు. పాకిస్థాన్‌లో తయారైన మందులు, అక్కడే కొన్నట్లుగా రుజువైన రెడ్‌బుల్ క్యాన్లు వీటన్నింటినీ చూపించడమే కాక పాకిస్థాన్ రాయబారిని స్వయంగా పిలిపించి ఆ ఆధారాలను కూడా భారత్ ఆయనకు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇంత జరిగినా, ఉడీ దాడిపై అంతర్జాతీయ సమాజం దృష్టిని మళ్లించేందుకు పాకిస్థాన్ ఇలాంటి పనికిమాలిన ఆరోపణలకు దిగింది. పాకిస్థాన్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలంటూ అమెరికన్ కాంగ్రెస్‌లో ఒక బిల్లు కూడా చర్చలో ఉందన్న విషయాన్ని ఖ్వాజా ఆసిఫ్ వద్ద ప్రస్తావించగా.. నాలుగైదు గొంతుకలు లేచినంత మాత్రాన పాకిస్థాన్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించడం సాధ్యం కాదని చెప్పారు. -
సింధు నది ఒప్పందంపై పాక్ గగ్గోలు
-
పాక్‌పై భారత్ మరో దౌత్యదాడి!
అబ్దుల్ బాసిత్‌కు సమన్లు ఉడీ దాడిపై ఆధారాలు అందజేత న్యూఢిల్లీ: ఉడీ ఉగ్రవాద దాడి నేపథ్యంలో దాయాది పాకిస్థాన్‌పై భారత్ తన దౌత్య దాడిని తీవ్రతరం చేసింది. ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్‌కు మంగళవారం సమన్లు జారీచేసింది. అంతేకాకుండా ఉడీ దాడిలో పాకిస్థాన్ హస్తాన్ని నిరూపించే ఆధారాలను అబ్దుల్ బాసిత్‌కు అందించింది. ’విదేశాంగ కార్యదర్శి ఎస్ జైశంకర్ అబ్దుల్ బాసిత్‌ను పిలిపించి మాట్లాడారు. సరిహద్దుల్లో (పాక్ ఉగ్రవాదుల) చొరబాట్లకు సహకరించిన ఇద్దరు గైడ్లను స్థానిక గ్రామస్తులు పట్టుకున్నారని, వారు ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నారని బాసిత్‌కు తెలియజేశారు’అని విదేశాంగ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ మంగళవారం ట్వీట్ చేశారు. ’ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఉడీలో దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్లో ఒకడిని హఫీజ్ అహ్మద్‌గా గుర్తించారు. అతను పాకిస్థాన్ ముజఫరాబాద్‌లోని దర్భాంగ్‌కు చెందిన ఫిరోజ్ కొడుకు అని తేలింది’ అని ఆయన తెలిపారు. ఉడీలో దాడికి దిగిన మరో ఇద్దరిని మహ్మద్ కబీర్ అవాన్, బషారత్‌గా గుర్తించినట్టు తెలిపారు. భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదులు దాడులు కొనసాగించడం ఎంతమాత్రం ఆమోదనీయం కాదని బాసిత్‌కు తేల్చి చెప్పినట్టు ఆయన పేర్కొన్నారు. పాక్ రాయబారి బాసిత్‌కు భారత్ సమన్లు జారీచేయడం ఇది రెండోసారి. ఉడీ ఉగ్రవాద దాడి నేపథ్యంలో సెప్టెంబర్ 21న కూడా ఆయనకు విదేశాంగ కార్యదర్శి సమన్లు జారీచేశారు. 18మంది సైనికుల్ని పొట్టనబెట్టుకున్న ఉడీ ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాకిస్థాన్‌ను దౌత్యపరంగా అంతర్జాతీయంగా ఏకాకిని చేయాలని, ఆర్థికంగా, సైనికంగా దెబ్బకొట్టే వ్యూహాలు రచించాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. -
సింధు నది ఒప్పందంపై పాక్ గగ్గోలు
ఒప్పందం నుంచి భారత్ ఏకపక్షంగా తప్పుకోలేదు ఇంటర్నేషనల్ కోర్టుకు వెళుతామని వ్యాఖ్య ఇస్లామాబాద్: సింధు నది జలాల పంపిణీ ఒప్పందం నుంచి తప్పుకోవాలన్న భారత్ నిర్ణయంపై పాకిస్థాన్ గగ్గోలు పెట్టింది. ఈ ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘిస్తే.. తాము అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని పేర్కొంది. ఉడీ ఉగ్రవాద దాడి నేపథ్యంలో సింధు నదీ జలాలపై భారత్-పాకిస్తాన్ చర్చలను రద్దు చేయాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. నెత్తురు, నీళ్లు కలిసి ప్రవహించలేవంటూ ఈ ఒప్పందంపై సమీక్షా సమావేశంలో ప్రధాని మోదీ పేర్కొన్న సంగతి తెలిసిందే. 'అంతర్జాతీయ చట్టాల ప్రకారం భారత్ ఏకపక్షంగా ఈ ఒప్పందం నుంచి తప్పుకోలేదు' అని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజిజ్ మంగళవారం పేర్కొన్నారు. పాక్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. కార్గిల్ యుద్ధం, సియాచిన్ సంఘర్షణ సమయంలోనూ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించలేదని గుర్తుచేశారు. ప్రపంచబ్యాంకు మధ్యవర్తిత్వంతో కుదిరిన సింధు నది ఒప్పందాన్ని భారత్ ఏకపక్షంగా రద్దు చేయలేదని, ఒప్పందాన్ని రద్దుచేయడానికిగానీ, ఒప్పందం నుంచి తప్పుకోవడానికిగానీ ఎలాంటి నిబంధనలు లేవని, ఇది కుదరదని సర్తాజ్ అజిజ్ పేర్కొన్నారు. -
పాక్‌కు వ్యతిరేకంగా భారత్‌కు బలమైన సాక్ష్యం
-
ఉడీ బాధిత కుటుంబాలకు కోహ్లి సానుభూతి
కాన్పూర్: ఇటీవల ఉడీ సెక్టార్లో ఉగ్రవాదుల దాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు టెస్టుకెప్టెన్ విరాట్ కోహ్లి తన ప్రగాఢ సానుభూతిని తెలిపాడు. ఇలాంటి పిరికి చర్యలు దేశంలోని ప్రతి ఒక్కరి మనసును గాయపరుస్తాయని అన్నాడు. ‘నిరంతరం ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం. సైనికుల కుటుంబాల గురించి ఆలోచిస్తే ఆవేదనగా ఉంది. ఓ భారతీయుడిగా ఈ దుర్ఘటనలో నష్టపోరుున కుటుంబాలకు సానుభూతి తెలుపుతు న్నాను’ అని కోహ్లి తెలిపాడు. -
రాఫెల్ వైపే మొగ్గు
ఉడీ ఉగ్రవాద దాడి అనంతరం భారత్, పాకిస్తాన్ల మధ్య వాగ్యుద్ధం తీవ్ర స్థాయికి చేరి, అది యుద్ధ వాతావరణం దిశగా పోతున్నదని అందరూ అనుకుంటున్న సమయంలో రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంపై భారత్-ఫ్రాన్స్ దేశాలు సంతకాలు చేశాయి. వాస్తవానికి ఇప్పుడు కుదిరిన ఒప్పందం లాంఛనమే. ప్రధాని నరేంద్ర మోదీ 17 నెలలక్రితం ఫ్రాన్స్ వెళ్లినప్పుడు ఇందుకు సంబంధించి సూత్ర ప్రాయమైన అంగీకారం కుదిరింది. ఇంకా వెనక్కు వెళ్తే 2012లో అప్పటి యూపీఏ ప్రభుత్వం రాఫెల్ యుద్ధ విమానాల కోసం వాటిని ఉత్పత్తి చేసే డసాల్ట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తంగా రూ. 1.34 లక్షల కోట్ల వ్యయంతో 126 యుద్ధ విమానాలు కొనడం దాని సారాంశం. 2015కల్లా 18 విమానాలను సమ కూరుస్తామని ఆ సందర్భంగా డసాల్ట్ సంస్థ పూచీపడింది. కానీ అందుకు సంబం ధించిన తదుపరి చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. నేరుగా 18 విమానాలు అంద జేసి, మిగిలిన 108 విమానాలకు సంబంధించి సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీచేసి బెంగళూరులోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్(హెచ్ఏఎల్)లో వాటిని ఉత్పత్తిచేసేలా లెసైన్స్ ఇస్తామన్న సంస్థ మళ్లీ వెనక్కు తగ్గింది. నిరుడు ఏప్రిల్‌లో మోదీ ఫ్రాన్స్ పర్యటించినప్పుడు కదలిక వచ్చింది. పాత ఒప్పందం స్థానంలో కొత్త ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరు దేశాలూ నిర్ణయించుకున్నాయి. గతంలో యూపీఏ ప్రభుత్వం నేరుగా డసాల్ట్‌తో ఒప్పందం కుదుర్చుకోగా... అందుకు భిన్నంగా మోదీ ఫ్రాన్స్ ప్రభుత్వంతో దీన్ని ముడిపెట్టారు. 36 విమానాలు అందజేయడం ఆ ఒప్పందం సారాంశం. వాటి విలువ రూ. 64,000 కోట్లుగా లెక్కేశారు. అయినా తుది ఒప్పందానికి ఇన్నాళ్ల సమయం పట్టింది. ఈ 17 నెలల బేరసారాల్లో ఇది ప్రస్తుతం రూ. 59,000 కోట్లకు చేరిందని రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ ప్రకటిం చారు. ఇప్పుడు కూడా తొలి విమానం మరో రెండేళ్లకుగానీ అందదు. రక్షణ ఒప్పం దాలు ఎంత సంక్లిష్టమైనవో, అవి సాకారం కావడానికి ఎంత సుదీర్ఘ సమయం అవసరమవుతుందో దీన్నిబట్టి అర్ధం చేసుకోవచ్చు. అందువల్లే ఈ విషయంలో చాలా ముందుచూపు అవసరమవుతుంది. మరో పాతికేళ్లకు ఎలాంటి పరిస్థితులుం టాయో, వాటిని దీటుగా ఎదుర్కొనేందుకు మనం తీసుకోవలసిన చర్యలేమిటన్న అంశాల్లో స్పష్టమైన అవగాహన ఉండాలి. అందుకు అనుగుణంగా అడుగులేయాలి. ఎన్నో ఏళ్లుగా మన వైమానిక దళం యుద్ధ విమానాల కొరతను ఎదుర్కొం టున్నది. ఒకప్పుడు పాకిస్తాన్‌ను గడగడలాడించిన మిగ్-21, మిగ్-27 యుద్ధ విమానాలకు వయసు మీదపడింది. అవి తెల్ల ఏనుగుల్లా మారాయి. ఖర్చు బారెడు.. ప్రయోజనం మూరెడు అన్న చందంగా తయారైంది. పేరుకు వంద విమా నాలున్నాయన్న పేరే గానీ... వాటిలో ఏ సమయంలోనైనా దాదాపు 60కి మించి అందుబాటులో ఉండవు. మిగిలినవి ఎప్పుడూ మరమ్మతుల్లోనే ఉంటాయి. గతంలో మనతో పోలిస్తే ఎంతో వెనకబడి ఉన్న పాక్ కొన్నేళ్లుగా రక్షణ కొనుగోళ్లలో చురుగ్గా ఉంది. పాక్ సంగతి వదిలిపెట్టినా మొత్తంగా ప్రపంచవ్యాప్తంగానే ఈ కొనుగోళ్లు గణనీయంగా పెరిగాయి. ప్రతి దేశమూ రక్షణ అవసరాలపై చేస్తున్న వ్యయాన్ని బాగా పెంచింది. ఈ నేపథ్యంలో వైమానిక దళం వినతులపై ప్రభుత్వం దృష్టిసారించింది. 2000 సంవత్సరంలో యుద్ధ విమానాల కొనుగోలుకు నిర్ణయిం చాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు సంస్థలు వాటిని అమ్ముతామంటూ పోటీప డటం మొదలెట్టాయి. పోటీదారు ఉత్పత్తి చేసే యుద్ధ విమానాలతో పోలిస్తే తమ ఉత్పత్తులు అన్నివిధాలా మెరుగైనవని ఒప్పించే ప్రయత్నం చేశాయి. జాబితా నుంచి తమ దేశానికి చెందిన సంస్థను ప్రాథమిక దశలోనే తొలగించారని తెలుసు కున్నాక అమెరికా తీవ్ర నిరాశకు గురైంది. భారత్‌ను ఒప్పించడంలో విఫలమయ్యా రన్న అభిప్రాయం అమెరికా ప్రభుత్వానికి కలగడంతో భారత్‌లో తమ రాయ బారిగా ఉన్న తిమోతి రోమెర్ను పదవినుంచి తప్పించారన్న కథనాలు వచ్చాయి. చివరకు ఫ్రాన్స్ సంస్థ డసాల్ట్ను ఎంపిక చేశారని తెలిశాక బ్రిటన్, జర్మనీ, స్పెయిన్, ఇటలీ దేశాలకు చెందిన కన్సార్టియానికి కూడా తీవ్ర అసంతృప్తి కలిగింది. తాము ఉత్పత్తి చేసే యుద్ధ విమానాలతో పోలిస్తే రాఫెల్ ఏమంత మెరుగైంది కాదన్న ప్రచారాన్ని ప్రారంభించాయి. అయితే ఇప్పుడు కుదిరిన ఒప్పందాన్ని మెచ్చుకుంటున్నవారున్నట్టే విమర్శి స్తున్నవారూ లేకపోలేదు. తక్షణం వినియోగంలోకొచ్చే విధంగా 36 యుద్ధ విమా నాలు మన అమ్ములపొదిలో చేరబోతున్నాయని నిరుడు మోదీ ప్రకటించారు. ఇప్పుడు పరీకర్ చెబుతున్న ప్రకారం తొలి విమానం రావడానికే మరో రెండేళ్లు పడుతుంది. వాస్తవానికి 36 యుద్ధ విమానాలూ మన వైమానిక దళ అవసరాలకు ఏమాత్రం సరిపోవు. కనీసం వంద విమానాల అవసరం ఉన్నదని అంటున్నారు. ఈ స్థితిలో గత 17నెలలుగా ఫ్రాన్స్ ఎటూ తేల్చకుండా నాన్చింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేసేందుకు వెనకాడింది. అందువల్లే ఒక దశలో పరీకర్ విసుగు చెంది ప్రత్యామ్నాయ ప్రతిపాదనల వైపు మొగ్గుచూపారు. లాక్‌హీడ్ మార్టిన్, బోయింగ్ తదితర సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఆ మూడు సంస్థలూ సాంకేతిక పరిజ్ఞానం బదిలీకి అంగీకరించాయి కూడా. వీటిలో ఏదో ఒక సంస్థను ఖరారు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని పరీకర్ అన్నారు. అయితే అనూహ్యంగా మళ్లీ రాఫెల్ రంగంలోకొచ్చింది. ఇందులో ఎన్నో అనుకూ లాంశాలు లేకపోలేదు. మన అవసరాలకు తగిన విధంగా విమానం డిజైన్‌లో మార్పులు చేసేందుకూ... ముఖ్యంగా లేహ్వంటి గడ్డకట్టే చలి ప్రాంతాల్లో కూడా అవి సమర్ధవంతంగా పనిచేసేందుకూ డసాల్ట్ చర్యలు తీసుకుంటున్నది. అలాగే పలు ఇతర సదుపాయాల కల్పనకు కూడా అంగీకరించింది. అయితే కీలకమైన సాంకేతిక పరిజ్ఞానం బదిలీ అలాగే ఉండిపోయింది. మన హెచ్ఏఎల్లోనే వాటిని ఉత్పత్తి చేసేలా ఒప్పించి ఉంటే ఎన్డీఏ సర్కారు నినాదం ‘మేక్ ఇన్ ఇండియా’ స్ఫూర్తి నెరవేరేది. రక్షణ అవసరాలు తరుముకొస్తున్న సంగతి వాస్తవమే అయినా ఈ విషయంలో మరింత పట్టుబట్టవలసింది. -
పాక్ జీవనాడిపై దెబ్బ కొడదామా.. వద్దా?
-
పాకిస్థాన్‌పై భారత్ జల యుద్ధం చేస్తే....
న్యూఢిల్లీ: భారత సైనిక స్థావరాలపై దాడులకు తెగబడుతున్న పాకిస్థాన్ పీచమణచడానికి సంప్రదాయక యుద్ధం చేయడం అంత సులువు కాకపోతే జల యుద్ధం చేయాలని పలు వర్గాల నుంచి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి సూచనలు, సలహాలు వస్తున్నాయి. జల యుద్ధం అంటే ఇరు దేశాల మధ్య పారుతున్న నదుల పరివాహక ప్రాంతాల్లో జల వనరుల పంపిణీ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడమే. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం సింధు నదీ జలాల ఒప్పందంపై పలువురు ఉన్నతస్థాయి అధికారులతో చర్చించారు. ఆ ఒప్పందాన్ని మనం ఏకపక్షంగా రద్దు చేసుకోవచ్చా? ఏకపక్షంగా చేసుకున్నా అది ఎవరికి నష్టం, ఎవరికి లాభం? ఫలితంగా ఇరు దేశాలు ఎలాంటి పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది? భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ప్రసిద్ధ సింధూతోపాటు జీలం, చీనాబ్, సట్లేజ్, బియాస్, రావి అనే ఉప నదులు పారుతున్నాయి. ఈ నదీ జలాల పంపకం కోసం 1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో ఇరుదేశాల మధ్య అంగీకారం కుదిరింది. పశ్చిమ ప్రాంతంలో ప్రవహిస్తున్న సింధూ, జీలమ్, చీనాబ్ నదుల జలాలను పాకిస్థాన్ ఎక్కువగా వాడుకుంటే, తూర్పున ప్రవహిస్తున్న సట్లేజ్, బియాస్, రవి నదుల జలాలను భారత్ ఎక్కువగా వినియోగించుకుంటోంది. ఈ ఆరు నదులు భారత భూభాగం నుంచే పోతున్నందున పాకిస్థాన్‌తో కుదుర్చుకున్న ‘సింధూ ఒప్పందం’ రద్దు చేసుకొని పాకిస్థాన్‌కు నదీ జలాలు వెళ్లకుండా నియంత్రించాలన్నది పలు వర్గాల నుంచి భారత ప్రభుత్వానికి అందుతున్న సూచన. తద్వారా పాకిస్థాన్ తీవ్రంగా దెబ్బతిని భారత్ దారికొస్తుందన్నది వారి వాదన. ఈ ఒప్పందం విషయంలో ఎప్పుడైనా వివాదం తలెత్తితే జోక్యం చేసుకునే అధికారం పరిమితంగానైనా ప్రపంచ బ్యాంకుకు ఉంది. సమస్య పరిష్కారం కోసం అంతర్జాతీయ ‘మధ్యవర్తి’ని ప్రపంచ బ్యాంకు నియమించవచ్చు. దీన్ని పట్టించుకోకుండా కూడా భారత్ ఒప్పందాన్ని రద్దు చేసుకోవచ్చు. అయితే ఈ ఆరు నదుల్లో నీటిని దిగువకు వదలకుండా నిల్వ చేసుకోవడానికి భారీ డ్యామ్‌లేవీ మన భూభాగంలో లేవు. వాటిని నిర్మించుకోవడానికి మనకు చాలాకాలమే పడుతుంది. ఒకవేళ నిర్మించినప్పటికీ నీటిని మనవైపు మళ్లించేందుకు ఆస్కారమే లేదు. ఇరుదేశాల సరిహద్దుల్లో వున్న భౌగోళిక పరిస్థితులే అందుకు కారణం. భారీ డ్యామ్‌లు నిర్మించుకున్నా కొంతకాలం మాత్రమే నీటిని దిగువకు విడుదల చేయకుండా ఆపగలంగానీ, ఎక్కువ సేపు ఆపలేం. డ్యామ్‌లు నిండితే వదలకుండా ఏం చేయలేం. ఢిల్లీలోని డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలసిస్‌లో పరిశోధన చేస్తున్న ఉత్తమ్ కుమార్ లాంటి వారు ఎంతో మంది అక్కడి భౌగోళిక పరిస్థితుల గురించి ఇదివరకే వివరించారు. పాక్‌తో సింధూ జల వనరుల పంపిణీ ఒప్పందాన్ని రద్దుచేసుకుంటే బంగ్లా, నేపాల్ దేశాలతో మనం చేసుకున్న అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం ఆ దేశాలకు నీరివ్వలేం. వాటితో కూడా అంతర్జాతీయ వివాదాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. దేన్ని ఖాతరు చేయకుండా తాత్కాలికంగానైనా పాక్‌కు నదుల జలాలను నిలిపేయాలకుంటే చైనా తక్షణమే రంగప్రవేశం చేస్తుంది. సింధూ, సట్లేజ్ నదులు టిబెట్ నుంచి పారుతున్నందున టిబెట్ చైనా ఆధీనంలో ఉండడం వల్ల అక్కడ ఆ నదులకు అడ్డుకట్ట వేస్తోంది. ఇటీవలనే ఈ విషయాన్ని చైనా స్పష్టం చేసింది కూడా. ఏ రకంగా చూసినా జల యుద్ధం అన్ని రకాలుగా భారత్‌కే నష్టం. అందుకనే భారత్, పాక్ మధ్య జరిగిన 1965, 1971, 1999 యుద్ధాలేవి ఈ జల వనరుల ఒప్పందంపై ప్రభావం చూపలేకపోయాయి. -
పాక్ జీవనాడిపై దెబ్బ కొడదామా.. వద్దా?
న్యూఢిల్లీ: అస్థిర ప్రభుత్వాలు, ఉగ్రవాదం, అవినీతి యంత్రాంగం.. ఒక దేశానికి ఎన్ని అవలక్షణాలుండాలో అంతకుమించే ఉన్న పాకిస్థాన్ ఆర్థిక శక్తిగా కొనసాగుతుండటానికి ప్రధాన కారణం.. సింధూ నదీ జలాలు. పాక్ జీవనాడి అయిన ఈ నదీ జలాలపై 56 ఏళ్ల కిందట చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవాలని లేదా పునఃసమీక్షించుకోవాని భారత ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం 'సింధు నదీ జలాల ఒప్పందం'పై పలువురు ఉన్నతస్థాయి అధికారులతో చర్చించారు. భేటీ అనంతరం జలవనరుల శాఖ అధికారులు మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్ణయాలు త్వరలోనే అందరికీ వెల్లడిస్తామని వ్యాఖ్యానించారు. కాగా ఇదే సమావేశంలో ప్రధాని మోదీ.. 'భారత్,పాక్‌ల మధ్య నెత్తురూ, నీళ్లూ ఒకేసారి ప్రవహించలేవు'అని అన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. సెప్టెంబర్ 18నాటి ఉడీ ఉగ్రదాడి అనంతరం దౌత్యపరంగా, వ్యూహాత్మకంగా పాకిస్థాన్ కు గట్టిగా బుద్ధి చెబుతామని ప్రకటించిన మోదీ ప్రభుత్వం ఆమేరకు 1960నాటి సింధూ నదీ జలాల ఒప్పందంపై దృష్టిసారించింది. సోమవారంనాటి ఉన్నతస్థాయి భేటీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ శాఖ కార్యదర్శి ఎస్.జైశంకర్, కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ శశిశేఖర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలను తిరిగి క్యాబినెట్ భేటీలో చర్చించిన తరువాతే సింధూ జలాల ఒప్పందంపై ప్రధాని తుది నిర్ణయాన్ని వెల్లడిస్తారు. ఆ తర్వాత ఇదే విషయాన్ని పాకిస్థాన్ తో చర్చిస్తారు. పాక్‌ను మనం కొడితే.. చైనా మనని కొడుతుంది! పాక్ జీవనాడిపై దెబ్బ కొడితే ఆ దేశం కకావికలం కావడం ఖాయం. ప్రపంచంలోనే అద్భుతమైన నీటిపారుదల వ్యవస్థల్లో ఒకటైన సింధూ డెల్టాయే పాకిస్థాన్ కు ఆదరువు. పలు ఫ్రావిన్స్ లను సస్యశామలం చేసే సింధూ నది.. కరాచీ సమీపంలో అరేబియా సముద్రంలో కలుస్తుంది. సింధుతోపాటు దీని ఉపనదులైన జీలం-చినాబ్-బియాస్-రావి-సట్లెజ్ నదులపై 1960లో నాటి భారత్ పాక్ ప్రధానులు జవహర్ లాల్ నెహ్రూ, అయూబ్ ఖాన్ లు ఒప్పందం కుదుర్చుకున్నారు. తద్వారా తూర్పు నదులైన బియాస్, రావీ, సట్లెజ్ నదులపై భారత్‌కు, పశ్చిమ నదులైన సింధు, చీనాబ్, జీలంపై పాక్‌కు నియంత్రణ లభించింది. లు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. తూర్పు నదులైన బియాస్, రావీ, సట్లెజ్ నదులపై భారత్‌కు, పశ్చిమ నదులైన సింధు, చీనాబ్, జీలంపై పాక్‌కు నియంత్రణ లభించింది. అయితే సింధూ ప్రారంభస్థానం చైనాలో ఉన్నందున భారత్ తీసుకోబోయే ఎలాంటి నిర్ణయానికైనా అడ్డుపడే అవకాశం ఆ దేశానికి ఉంది. తన ఆధీనంలోని సింధు జలాలను భారత్ లోకి రానీయకుండా చైనా అడ్డుకుంటే ప్రస్తుతం మనం వాడుకుంటున్న 36 శాతం నీళ్లు కూడా దక్కకుండా పోతాయి. అంతేకాదు తన స్నేహితుడు పాకిస్థాన్ పై భారత చర్యకు ప్రతీకారంగా చైనా బ్రహ్మపుత్ర ప్రవాహాన్ని కూడా అడ్డుకునే అవకాశాలున్నాయి. చైనాగానీ బ్రహ్మపుత్ర జలాలను అడ్డుకుంటే తూర్పు, ఈశాన్య రాష్ట్రాలతోపాటు బంగ్లాదేశ్ ఘోరంగా దెబ్బతింటాయి. అదీగాక భారత్- పాకిస్థాన్-చైనాలు సంయుక్తంగా ఇప్పటివరకు ఎలాంటి అంతర్జాతీయ జల ఒప్పందాలు చేసుకోలేదు. కశ్మీర్ నీట మునగటం ఖాయం సింధూ జలాలను ఉన్నపళంగా అడ్డుకుంటే గనుక భారత్.. అంతర్జాతీయ నదీ జలాల చట్టాలను ఉల్లంఘించినట్లవుతుంది. పాక్ ను ఒంటరి చేయాలనే నిర్ణయాన్ని సమర్థించేవారి విశ్వాసాన్ని కూడా కోల్పోయేప్రమాదం ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యంగా సింధూ జలాలను సరైన పద్ధతిలో మళ్లించలేకపోతే కశ్మీర్ మొత్తం నీట మునుగుతుంది. కాబట్టి ఇప్పటికిప్పుడే నదీ జలాల అడ్డుకట్ట ఉండదు. అయితే ఒప్పందాలను మాత్రమే రద్దు చేసుకుని పాక్ పై ఒత్తిడిపెంచాలని భారత్ భావిస్తోంది. -
'అది ఎప్పటికీ కలే.. యుద్ధం చేస్తే భారత్‌కే నష్టం'
న్యూఢిల్లీ: అంతర్జాతీయ సమాజంలో పాకిస్థాన్‌ను ఒంటరి చేయాలనకుంటున్న భారత్‌కు ఆ విషయం ఒక కలగానే మిగిలిపోతుందని పాక్‌కు చెందిన దౌత్యవేత్త ఒకరు అన్నారు. పాక్ ను ఒంటిరి చేయాలని చూస్తే భారత్ తానంతట తాను ఒంటరి అవ్వాలనుకోవడమే అని విమర్శించారు. పాక్ తో యుద్ధం చేయాలని భారత్ అనుకోదని, అలా చేస్తే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనం అవుతుందని వారికి తెలుసని అందుకే ప్రస్తుతం యుద్ధం జరిగే అవకాశం లేదని చెప్పారు. ఈ మేరకు ఓ కథనాన్ని పాక్ కు చెందిన డాన్ పత్రికలో ఆ దౌత్య వేత్త పేరు ప్రకటించకుండా వెల్లడించింది. ఉడీ ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్ ఉగ్రవాద దేశం అని ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ ఉగ్రవాద దాడి జరిగిన దాని మూలాలు పాక్ లోనే ఉన్నాయని, ఆ దేశాన్ని అంతర్జాతీయ సమాజంలో ఒంటరిని చేస్తామని ప్రధాని నరేంద్రమోదీ ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ అసలు యుద్ధాన్ని ఎంచుకోదని పాక్ కు చెందిన పలువురు దౌత్యవేత్తలు ధీమా వ్యక్తం చేసినట్లు ఆ కథనం వెల్లడించింది. 'యుద్ధం ఉండబోదు. ఇప్పటికే ఇరు దేశాలు వాస్తవ పరిస్థితిని గుర్తించాయి. రెండు దేశాల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందనే నిర్ణయానికి వచ్చాయి. అందుకే యుద్ధాన్ని ఇండియా ఎంచుకోదు' అని ఓ దౌత్య వేత్త అన్నట్లు పాక్ డాన్ పత్రిక కథనాన్ని వెలువరించింది. -
ఉగ్రవాద నిర్మూలనలో మోదీ విఫలం: కాంగ్రెస్
న్యూఢిల్లీ: ఉడీ తరహా దాడిని అడ్డుకునేలా సరైన చర్యలు తీసుకోవడంలో ప్రధాని మోదీ విఫలమయ్యారని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఉగ్రవాదాన్ని ఉక్కు పిడికిలితో నిర్మూలిస్తామన్న మోదీ ఎన్నికల వాగ్దానం మోసపూరితమని తేలిపోయిందంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సూర్జేవాలా విమర్శించారు. కొజికోడ్ సభలో ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు తీసుకునే చర్యల్ని వెల్లడించడంలో మోదీ విఫలమయ్యారన్నారు. తన వాగ్బాణాలతో మోదీ పాక్‌ను నాశనం చేశారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ ట్వీట్ చేశారు. -
1965 నాటి పరిస్థితులున్నాయ్!
♦ ఉడీ ఘటనపై దేశమంతా ఆగ్రహం ♦ కశ్మీర్‌కు శాంతి, ఐకమత్యంతోనే పరిష్కారం ♦ మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ న్యూఢిల్లీ: ఉడీ ఘటన దేశం మొత్తాన్ని కలచివేసిందని.. దాడికి పాల్పడిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. మాసాంతపు రేడియో కార్యక్రమం ‘మన్‌కీ బాత్’ సందర్భంగా ప్రధాని దేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఉడీ ఘటనలో అమరులైన 18 మంది జవాన్లకు నివాళులర్పిస్తూ కార్యక్రమాన్ని ప్రసంగించిన ప్రధాని.. ఇది వారి కుటుంబాలకు జరిగిన నష్టం మాత్రమే కాదని.. యావద్భారతంలో ఆగ్రహజ్వాలలు ఎగసిపడుతున్నాయన్నారు. 1965లో పాకిస్తాన్‌తో యుద్ధం సందర్భంగా దేశవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులే కనిపించాయన్నారు. జాతీయవాదం ఉవ్వెత్తున ఎగసిపడి.. ప్రతి ఒక్కరూ దేశం కోసం ఏదో చేయాలని సిద్ధమయ్యారని గుర్తుచేశారు. అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి ప్రజల ఆవేశాన్ని సరైన మార్గంలో వినియోగించేందుకు ‘జై జవాన్, జై కిసాన్’ నినాదాన్ని ఇచ్చారని.. దీని ద్వారా సామాన్య ప్రజలు కూడా దేశం కోసం పనిచేసేందుకు స్ఫూర్తి పొందారన్నారు. మహాత్మాగాంధీ కూడా స్వాతంత్య్రోద్యమ సమయంలో నిర్మాణాత్మకమైన కార్యాచరణ ద్వారానే మార్గదర్శనం చేశారన్నారు. ఉడీ ఘటనకు ఆర్మీ చేతల్లో సమాధానం చెబుతుందన్నారు. శాంతితోనే ‘కశ్మీర్’కు పరిష్కారం రెండు నెలలుగా కశ్మీర్లో నెలకొన్న పరిస్థితులతో అక్కడి ప్రజానీకం తీవ్రంగా ఇబ్బందుల పాలయ్యారు. దేశ వ్యతిరేక శక్తులను వారు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు. వారికి వాస్తవం బోధపడుతున్న కొద్దీ ఇలాంటి దుష్టశక్తుల నుంచి దూరమై శాంతివైపు మరలుతున్నారన్నారు. ‘తల్లిదండ్రులు తమ పిల్లలను విద్యాలయాలకు పంపాలనుకుంటున్నారు. రైతు తను పండించిన దాన్ని మార్కెట్‌కు తీసుకెళ్లాలనుకుంటున్నాడు. ఆర్థిక కార్యకలాపాలు మొదలవ్వాలి. కొన్ని రోజులుగా మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. శాంతి, ఐకమత్యం, సామరస్యం ద్వారా వారి సమస్యకు పరిష్కారం లభిస్తుందని నేను బలంగా విశ్వసిస్తున్నాను’ అని మోదీ తెలిపారు. అటు భద్రతా దళాలు కూడా ఆయుధాలు, అధికారాలను శాంతి భద్రతలకోసమే వినియోగించుకుని శాంతియుత వాతావరణానికి సహకరించాలన్నారు. పారాలింపిక్స్ విజేతలకు శుభాకాంక్షలు ఇటీవల జరిగిన పారాలింపిక్స్‌లో భారత్ తరపున పతకాలు గెలిచిన భారత అథ్లెట్లకు ప్రధాన మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. రెండేళ్ల క్రితం ప్రారంభించిన ‘స్వచ్ఛ్ భారత్’ కార్యక్రమం విజయవంతం అవుతోందని.. ప్రజల్లో స్వచ్ఛతపై అవగాహన పెరిగిందన్నారు. ప్రధాని అధికారిక నివాసాన్ని 7 రేస్‌కోర్సు రోడ్ నుంచి లోక్‌కల్యాణ్ మార్గ్‌కు మార్చటంపై సానుకూలంగా స్పందించారు. -
వారిని వదిలిపెట్టే ప్రసక్తేలేదు: మోదీ
న్యూఢిల్లీ: ఉడీ దాడికి బాధ్యులైనవారిని వదిలిపెట్టే ప్రసక్తేలేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి స్పష్టం చేశారు. ఆదివారం మన్ కీ బాత్ రేడియో కార్యక్రమం ద్వారా దేశ ప్రజలతో ముచ్చటించిన మోదీ.. ఉడీ దాడిలో మరణించిన జవాన్లకు నివాళులర్పించారు. ఈ విషయంలో సైన్యం మాట్లాడదని.. తన పరాక్రమాన్ని చూపిస్తుందన్నారు. ఇటీవల పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులు దేశం గర్వించేలా చేశారని మోదీ అభినందించారు. పారాలింపిక్స్‌లో మరింత ప్రతిభ కనబరిచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఇటీవల గుజరాత్లో తన పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన దివ్యాంగుల గురించి ప్రస్తావించిన మోదీ.. అది తనకు ఉద్వేగపూరితమైన, అద్భుతమైన అనుభవమని వెల్లడించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ప్రజలకు పరిశుభ్రతపై మరింత అవగాహన పెరిగిందని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. స్వచ్ఛతా హెల్ప్‌లైన్ నంబర్‌గా 1969 ను మోదీ ఈ సందర్భంగా ప్రకటించారు. గ్రామీణ భారతంలో ఇప్పటివరకు 2.48 కోట్ల టాయ్లెట్లను నిర్మించామని.. వచ్చే ఏడాది మరో 1.5 కోట్ల టాయ్లెట్లను నిర్మించనున్నట్లు మోదీ తెలిపారు. తీవ్రవాదాన్ని వ్యతిరేకిస్తుండటం పట్ల కశ్మీరీ ప్రజలను మోదీ అభినందించారు. గాంధీ జయంతి నుంచి దీపావలి మధ్య కాలంలో దేశ ప్రజలు ఖాదీ వస్త్రాలను కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు.