ఉగ్రవాదుల చర్య హేయం
ఉగ్రవాదుల చర్య హేయం
Published Fri, Sep 23 2016 8:31 PM | Last Updated on Sat, Aug 25 2018 3:57 PM
అమర సైనికులకు జడ్జిల నివాళులు
మచిలీపట్నం :
కశ్మీర్‌లోని సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసి సైనికులను పొట్టనబెట్టుకోవడం హేయమైన చర్య అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై.లక్ష్మణరావు అన్నారు. ఉడీ సైనిక స్థావరంపై దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ శుక్రవారం జిల్లా కోర్టులో న్యాయమూర్తులు కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement