మెట్రో డిపోకు భూములిచ్చేది లేదు
మెట్రో డిపోకు భూములిచ్చేది లేదు
Published Fri, Sep 30 2016 11:12 PM | Last Updated on Tue, Oct 16 2018 5:14 PM
– ప్రాణత్యాగానికైనా సిద్ధమే
– తేల్చిచెప్పిన నిడమానూరు రైతులు
– డిపో నిడమానూరులోనే నిర్మిస్తాం: ఎండీ రాధాకృష్ణ
మెట్రో కోచ్ డిపో నిడమానూరులోనేఏర్పాటు
మెట్రో ఎమ్‌డీ రాధాకృష్ణ
విజయవాడ (రామవరప్పాడు):
మెట్రో రైలు కోచ్ డిపో నిర్మాణానికి ఎట్టి పరిస్థితుల్లోనూ తమ భూములు ఇచ్చేది లేదని నిర్వాసిత రైతులు మరోసారి తేల్చిచెప్పారు. శుక్రవారం గ్రామంలోని పొలాలను మెట్రో అధికారులు పరిశీలిస్తున్నారన్న విషయాన్ని తెలుసుకున్న స్థానిక రైతులు, స్థల యజమానులు పెద్ద సంఖ్యలో చేరుకుని అధికారులతో మాట్లాడారు. ప్రాణాలను త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాము గాని మెట్రోకు భూములివ్వబోమని అధికారులకు తేల్చిచెప్పారు. ఇప్పటికే పలుమార్లు మెట్రోకు భూములివ్వబోమని గ్రామ సభల్లో, పలు సమావేశాల్లో చెప్పామన్నారు. అయినా పదే పదే కొలతలు, సర్వే అంటూ మా భూములను ఎందుకు పరిశీలిస్తున్నారని అధికారులను ప్రశ్నించారు.
100 శాతం మంది రైతులు వ్యతిరేకిస్తున్నారు
2013 చట్ట ప్రకారం ప్రాజెక్టు నిర్మాణానికి 70శాతం రైతుల మెజారిటీ కావాల్సి ఉందని కాని 100 శాతం రైతులు దీన్ని వ్యతిరేకిస్తున్నారన్నారు. ఈ కోచ్ డిపో నిర్మాణం చేయదలచిన భూములు మా పూర్వీకుల నుంచి సంక్రమించాయని, ఆడపడుచులకు పసుపు, కుంకుమ కింద ఇచ్చామన్నారు. బలవంతంగా భూములు సేకరిస్తారన్న ఆలోచనతో ఇప్పటికే ముగ్గురు రైతులు మనోవేదనతో చనిపోయారని తెలిపారు. గ్రామంలో కోచ్ డిపో నిర్మాణానికి సంభంధించి ప్రభుత్వ భూములు ఎన్ని ఉన్నాయో సర్వే నెంబర్లతో సహా లిఖిత పూర్వకంగా తెలియపర్చినా అధికారులు మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారన్నారు. పంచాయతీ కార్యాయంలో కూడా కోచ్ డిపోను వ్యతిరేకిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారని గుర్తు చేశారు.
బాక్సులో వేయాలి డిపో ఇక్కడే వస్తుంది: రాధాకృష్ణ
మెట్రో రైలు కోచ్ డిపోను నిడమానూరులోనే ఏర్పాటు చేస్తామని మెట్రో ఎండీ (డీఎమ్‌ఆర్‌సీ) రాధాకృష్ణ చెప్పారు. నిడమానూరులో మెట్రో కోచ్ డిపోకు అవసరమైన భూములను శుక్రవారం పరిశీలించారు. రాధాకృష్ణ మాట్లాడుతూ విజయవాడ మెట్రో రైల్ కోసం 29.44 హెక్టార్ల భూమి సేకరించవలసి ఉండగా దానిలో 25.0 హెక్టార్లు భూమిని నిడమానూరులోనే కావాలని అన్నారు. ఈ ప్రాజెక్టు మెట్రో కోచ్ డిపోను నిడమానూరులోనే ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ పరిశీలనలో అసిస్టెంట్ ప్రాజెక్టు అధికారి పాండురంగారావు పాల్గొన్నారు.
Advertisement
Advertisement