aganist
-
ఒరిజినల్ కాంగ్రెసును కాపాడుకోవడమే మా లక్ష్యం : ఉత్తమ్
-
గన్ షాట్ : చంద్రబాబుకు సీమ నేర్పిన పాఠం ఏంటి ..?
-
సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌పై కేసు నమోదు
-
అమరావతి రైతుల పాదయాత్రకు తాడేపల్లిగూడెంలో నిరసన సెగ
-
సీపీఎస్ అంతం.. ఉద్యోగుల పంతం
- కాకినాడలో కదం తొక్కిన ఉద్యోగులు - భారీ ప్రదర్శన, బహిరంగ సభ - సంఘటిత ఉద్యమం ఉద్ధృతానికి నేతల పిలుపు కాకినాడ సిటీ : కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్)ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు కాకినాడలో శనివారం కదం తొక్కారు. ఏపీ సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యాన జిల్లా నలుమూలల నుంచీ వివిధ శాఖల ఉద్యోగులు పెద్ద ఎత్తున కాకినాడ తరలివచ్చి మహాశాంతి ర్యాలీ నిర్వహించారు. తొలుత బాలాత్రిపురసుందరి అమ్మవారి ఆలయం నుంచి మెయిన్‌రోడ్, బాలాజీచెరువు సెంటర్, జీజీహెచ్, కలెక్టరేట్, రామారావుపేట మీదుగా మెక్లారిన్ స్కూల్ వరకూ భారీ ప్రదర్శన నిర్వహించారు. ‘సీపీఎస్ అంతం - ఉద్యోగుల పంతం, ఒకే సర్వీసుకు ఒకే పెన్షన్ ఉండాలి’ అంటూ పెద్ద పెట్టున నినదించారు. సీపీఎస్ విధానంవల్ల ప్రభుత్వ ఉద్యోగుల ప్రాథమిక హక్కులైన పెన్షన్, గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ వంటి సదుపాయాలను కోల్పోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. సామాజిక, ఆర్థిక భద్రత లేని సీపీఎస్ విధానం రద్దు చేసేలా నిర్ణీత కాలపరిమితితో కూడిన కమిటీ వేయాలని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేస్తున్న డెత్ గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ సదుపాయం తమకు కూడా కల్పించాలని, చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు అందాల్సిన ఆర్థిక ప్రయోజనాలను తక్షణం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ర్యాలీ అనంతరం మెక్లారిన్ హైస్కూల్ ఆవరణలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో తొలుత ఇటీవల మృతి చెందిన సీపీఎస్ ఉద్యోగులకు నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్వీ యుగంధర్ మాట్లాడుతూ, 2004 జనవరి ఒకటి నుంచి కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌ను అమలు చేస్తూ, 2004కు ముందు, తరువాత అంటూ ఉద్యోగులను ప్రభుత్వం విభజించి గోడ నిర్మించిందన్నారు. ఆ గోడను బద్దలుగొట్టేందుకు ఉద్యోగులు మరింత సంఘటితంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. పాత పెన్షన్ విధానాన్ని సాధించుకోవడమే లక్ష్యంగా ముందుకు వెళదామని పిలుపునిచ్చారు. ఉద్యోగుల సంక్షేమాన్ని ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని, సీపీఎస్, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్) అనే తేడా లేకుండా ఉద్యోగులందరూ ఉద్యమిస్తే పాలకులు దిగి వస్తారని అన్నారు. ఉద్యమ కార్యాచరణ జిల్లాలో ఉద్యమ కార్యాచరణను సీపీఎస్ ఉద్యోగుల సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతా నారాయణమూర్తి ప్రకటించారు. సంఘ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 28న రక్తదాన శిబిరాలు, జూన్‌లో వారం రోజులు బ్లాక్‌డే పాటించాలని, జూలై మొదటి వారంలో ఉద్యోగులు వారి కార్యాలయాల ముందు ధర్నాలు చేపట్టాలని, ఆగస్ట్ 9న క్విట్ ఉద్యమం, సెప్టెంబర్ ఒకటిన చలో అమరావతి చేపట్టాలని వివరించారు. అలాగే తునిలో భిక్షాటన, అమలాపురంలో భారీ బైక్ ర్యాలీ, రాజమహేంద్రవరంలో సత్యాగ్రహ యాత్ర చేపట్టాలని నిర్ణయించామని, వీటి తేదీలను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. సంఘ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర నాయకులు కె.మునిప్రసాద్, గుబ్బల శ్రీనివాస్, ఖాజా రహ్మతుల్లా, జిల్లా గౌరవాధ్యక్షులు తూతిక శ్రీనివాస విశ్వనాథ్, జిల్లా నాయకులు కె.వెంకటేష్, కె.రత్నాకర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
మెట్రో డిపోకు భూములిచ్చేది లేదు
– ప్రాణత్యాగానికైనా సిద్ధమే – తేల్చిచెప్పిన నిడమానూరు రైతులు – డిపో నిడమానూరులోనే నిర్మిస్తాం: ఎండీ రాధాకృష్ణ మెట్రో కోచ్ డిపో నిడమానూరులోనేఏర్పాటు మెట్రో ఎమ్డీ రాధాకృష్ణ విజయవాడ (రామవరప్పాడు): మెట్రో రైలు కోచ్ డిపో నిర్మాణానికి ఎట్టి పరిస్థితుల్లోనూ తమ భూములు ఇచ్చేది లేదని నిర్వాసిత రైతులు మరోసారి తేల్చిచెప్పారు. శుక్రవారం గ్రామంలోని పొలాలను మెట్రో అధికారులు పరిశీలిస్తున్నారన్న విషయాన్ని తెలుసుకున్న స్థానిక రైతులు, స్థల యజమానులు పెద్ద సంఖ్యలో చేరుకుని అధికారులతో మాట్లాడారు. ప్రాణాలను త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాము గాని మెట్రోకు భూములివ్వబోమని అధికారులకు తేల్చిచెప్పారు. ఇప్పటికే పలుమార్లు మెట్రోకు భూములివ్వబోమని గ్రామ సభల్లో, పలు సమావేశాల్లో చెప్పామన్నారు. అయినా పదే పదే కొలతలు, సర్వే అంటూ మా భూములను ఎందుకు పరిశీలిస్తున్నారని అధికారులను ప్రశ్నించారు. 100 శాతం మంది రైతులు వ్యతిరేకిస్తున్నారు 2013 చట్ట ప్రకారం ప్రాజెక్టు నిర్మాణానికి 70శాతం రైతుల మెజారిటీ కావాల్సి ఉందని కాని 100 శాతం రైతులు దీన్ని వ్యతిరేకిస్తున్నారన్నారు. ఈ కోచ్ డిపో నిర్మాణం చేయదలచిన భూములు మా పూర్వీకుల నుంచి సంక్రమించాయని, ఆడపడుచులకు పసుపు, కుంకుమ కింద ఇచ్చామన్నారు. బలవంతంగా భూములు సేకరిస్తారన్న ఆలోచనతో ఇప్పటికే ముగ్గురు రైతులు మనోవేదనతో చనిపోయారని తెలిపారు. గ్రామంలో కోచ్ డిపో నిర్మాణానికి సంభంధించి ప్రభుత్వ భూములు ఎన్ని ఉన్నాయో సర్వే నెంబర్లతో సహా లిఖిత పూర్వకంగా తెలియపర్చినా అధికారులు మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారన్నారు. పంచాయతీ కార్యాయంలో కూడా కోచ్ డిపోను వ్యతిరేకిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారని గుర్తు చేశారు. బాక్సులో వేయాలి డిపో ఇక్కడే వస్తుంది: రాధాకృష్ణ మెట్రో రైలు కోచ్ డిపోను నిడమానూరులోనే ఏర్పాటు చేస్తామని మెట్రో ఎండీ (డీఎమ్ఆర్సీ) రాధాకృష్ణ చెప్పారు. నిడమానూరులో మెట్రో కోచ్ డిపోకు అవసరమైన భూములను శుక్రవారం పరిశీలించారు. రాధాకృష్ణ మాట్లాడుతూ విజయవాడ మెట్రో రైల్ కోసం 29.44 హెక్టార్ల భూమి సేకరించవలసి ఉండగా దానిలో 25.0 హెక్టార్లు భూమిని నిడమానూరులోనే కావాలని అన్నారు. ఈ ప్రాజెక్టు మెట్రో కోచ్ డిపోను నిడమానూరులోనే ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ పరిశీలనలో అసిస్టెంట్ ప్రాజెక్టు అధికారి పాండురంగారావు పాల్గొన్నారు. -
ఉగ్రవాదుల చర్య హేయం
అమర సైనికులకు జడ్జిల నివాళులు మచిలీపట్నం : కశ్మీర్‌లోని సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసి సైనికులను పొట్టనబెట్టుకోవడం హేయమైన చర్య అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై.లక్ష్మణరావు అన్నారు. ఉడీ సైనిక స్థావరంపై దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ శుక్రవారం జిల్లా కోర్టులో న్యాయమూర్తులు కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. -
సీపీఎస్‌తో ఉద్యోగులకు అంధకారమే
– రద్దు చేయాలంటూ సెప్టెంబర్ 1న ర్యాలీ, సభ గాంధీనగర్: రాజ్యాంగ వ్యతిరేకమైన, లోపభూయిష్టమైన కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని (సీపీఎస్)ను రద్దు చేయాలని కోరుతూ సెప్టెంబర్ 1న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఏపీసీపీఎస్ఈఏ) రాష్ట్ర ఉపాధ్యక్షులు సిఎం దాస్ తెలిపారు. సెప్టెంబర్ 1న ఏలూరు రోడ్డు నుంచి జింఖానా మైదానం వరకు శాంతి ర్యాలీ నిర్వహిస్తామని, అనంతరం మహాసభ జరుగుతుందని ఆయన తెలిపారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీపీఎస్ వల్ల 2004 తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగులు గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్‌ను కోల్పోవడమే కాకుండా దాచుకున్న సొమ్ము షేర్‌మార్కెట్ లో పెట్టి ఉద్యోగుల భవిష్యత్‌ను అంధకారంలో నెడుతున్న ఈ విధానాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలన్నారు. సీపీఎస్‌ను రద్దుచేసి పాత విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ మహాసభ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు పార్థసారధి, గుంటూరు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి ప్రతాప్, సుదర్శనం, రత్తయ్య, కృష్ణాజిల్లా ప్రధాన కార్యదర్శి ఎం శ్రీను పాల్గొన్నారు.