
ఉగ్రవాద నిర్మూలనలో మోదీ విఫలం: కాంగ్రెస్
న్యూఢిల్లీ: ఉడీ తరహా దాడిని అడ్డుకునేలా సరైన చర్యలు తీసుకోవడంలో ప్రధాని మోదీ విఫలమయ్యారని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఉగ్రవాదాన్ని ఉక్కు పిడికిలితో నిర్మూలిస్తామన్న మోదీ ఎన్నికల వాగ్దానం మోసపూరితమని తేలిపోయిందంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సూర్జేవాలా విమర్శించారు. కొజికోడ్ సభలో ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు తీసుకునే చర్యల్ని వెల్లడించడంలో మోదీ విఫలమయ్యారన్నారు. తన వాగ్బాణాలతో మోదీ పాక్‌ను నాశనం చేశారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ ట్వీట్ చేశారు.