Fail
-
ఇండియా కూటమికి బీటలు? మహారాష్ట్ర ఎన్నికల తర్వాత పరిస్థితి ఇదే..
2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు, విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఇండియా కూటమి పేరుతో ఎన్డీఏను ఢీకొట్టాలని భావించాయి. అయితే ఇప్పుడు అదే ఇండియా కూటమి విచ్ఛిన్నం కాబోతోంది. వాస్తవానికి 2023లో దేశంలోని 26 ప్రధాన ప్రతిపక్షాలు కలిసి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ 26 ప్రధాన పార్టీల కలయికతో ఇండియా అలయన్స్ (ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్) ఏర్పాటయ్యింది. లోక్‌సభ ఎన్నికల్లో పరాభవంప్రస్తుతం మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షునిగా ఉన్న కాంగ్రెస్ ఈ కూటమికి సారధ్యం వహిస్తోంది. అయితే లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి మెజారిటీని పొందలేకపోయింది. ఇండియా కూటమిలో చేరిన పార్టీలు ఇప్పుడు ఒక్కొక్కటిగా దూరమవుతున్నట్లు కనిపిస్తోంది. వీటిలో ముందుగా మహారాష్ట్రకు చెందిన ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) నుంచి విడిపోతున్నట్లు మహారాష్ట్ర సమాజ్‌వాదీ పార్టీ ప్రకటించింది. దీనికి ముందు మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీకి ఎక్కువ సీట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ నిరాకరించడంతో సమాజ్‌వాదీ పార్టీ - కాంగ్రెస్ మధ్య వివాదం నెలకొంది. సమాజ్‌వాదీ పార్టీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసింది. లోక్‌సభలో అవధేష్ ప్రసాద్‌ను వెనక్కి పంపడంపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేసింది.షాకిచ్చిన మమతా బెనర్జీఇండియా కూటమిలో కొనసాగుతున్న సమాజ్‌వాదీ పార్టీ అసంతృప్తి మధ్య, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా విపక్షాలకు షాక్ ఇచ్చే ప్రకటన చేశారు. మమతా బెనర్జీ ఇండియా కూటమికి నాయకత్వం వహించాలనే తన కోరికను వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ ఓటమి తర్వాత మమతా బెనర్జీ.. బెంగాల్ నుండే కూటమి బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమని ప్రకటించారు. దీంతో ఇండియా అలయన్స్‌కు నాయకత్వం వహించే బాధ్యతను ఆమె కోరుకుంటున్నారా లేక ఇండియా అలయన్స్ నుండి ఆమె వేరుపడుతున్నారా అనేది అర్థంకాని ప్రశ్నగా మారింది. ఒక ఇంటర్వ్యూలో మమతా బెనర్జీ ఇండియా కూటమి సృష్టికర్త తానేనని, దానిని నిర్వహించాల్సిన బాధ్యత కూటమి నేతలపై ఉందన్నారు. కానీ వారు దానిని సమర్థవంతంగా నెరవేర్చలేకపోతే తానేమి చేయగలనని ప్రశ్నించారు. మరోవైపు టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ ఇటీవల మమతా బెనర్జీని ఇండియా కూటమికి నాయకురాలిగా అభివర్ణించారు.కూటమిని వీడిన ఆమ్ ఆద్మీ పార్టీవచ్చే ఏడాది ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు ముందుగానే ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి దూరమైంది. లోక్‌సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉంది. అయితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఢిల్లీలో ముక్కోణపు పోటీ కనిపిస్తోంది. దీనికిముందు పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు వేర్వేరుగా పోటీ చేశాయి. దీనిని చూస్తుంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమి నుంచి విడిపోతున్నట్లు కనిపిస్తోంది.మహారాష్ట్ర ఎన్నికల తర్వాత..లోక్‌సభ ఎన్నికల తర్వాత ఇండియా కూటమిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఎన్నికల్లో 26 ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కలిసి పోటీ చేసినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడీ కూడా ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ నేపధ్యంలో ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీలు కూటమికి దూరమవుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల యూపీలో తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ కాంగ్రెస్‌ను పక్కన పెట్టి అన్ని స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది. ఈ పరిణామాలు చూస్తుంటే ఇండియా కూటమిలో కొనసాగుతున్న ఈ విచ్ఛిన్నం విచ్చిన్నం ఆగుతుందా ఇంకా కొనసాగుతుందా అనేది చర్చనీయాంశంగా మారింది. ఇది కూడా చదవండి: 60 గంటల్లో ప్రపంచాన్ని చుట్టి.. ‘నాసా’ కొత్త చీఫ్ ఇసాక్‌మన్ సక్సెస్ స్టోరీ -
అటు హర్యానా.. ఇటు మహారాష్ట్ర.. మారని కాంగ్రెస్ భవితవ్యం
న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో కాంగ్రెస్‌ను పరాజయం వెంటాడుతోంది. ఎన్ని ఎన్నికలు వచ్చిపోతున్నా కాంగ్రెస్ భవితవ్యం మారడం లేదు. తొలుత హర్యానాలో కాంగ్రెస్ ఓటమిపాలయ్యింది. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా ఓటమిని చవిచూసింది. లోక్‌సభ ఎన్నికల్లో మెరుగైన పనితీరు కనబరిచినా మహారాష్ట్రలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా మారింది. శరద్ పవార్ ఎన్సీపీ, ఉద్ధవ్ ఠాక్రే శివసేనతో పొత్తు పెట్టుకున్నప్పటికీ బీజేపీని అధికారం నుంచి కాంగ్రెస్ గద్దె దించలేకపోయింది. మహాయుతి తుఫానులో మహావికాస్ అఘాడీ కనుమరుగయ్యింది. మహారాష్ట్ర ఎన్నికల్లో ఎంవీఏ కేవలం 50 సీట్లకే పరిమితమైంది.మహారాష్ట్రలో మహాయుతి విజయం సాధిస్తుందనే అంచనాలున్నప్పటికీ, ఇంత భారీ విజయం సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు. మహారాష్ట్ర ఎన్నికల్లో 288 స్థానాలకు గాను 234 స్థానాలను మహాయుతి గెలుచుకుంది. బీజేపీ ఒంటరిగా 132 స్థానాల్లో కాషాయ జెండాను ఎగురవేసి అతిపెద్ద పార్టీగా అవతరించింది. షిండే నేతృత్వంలోని శివసేన 57 సీట్లు గెలుచుకోగా, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 41 సీట్లు గెలుచుకోగలిగింది. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి 10 సీట్లు, ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేనకు 20 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ 16 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది.మహారాష్ట్రలో 100 సీట్లకు పైగా పోటీ చేసిన కాంగ్రెస్ కేవలం 16 సీట్లు గెలుచుకోవడం ఆ పార్టీకి తీవ్ర నిరాశను మిగిల్చింది. ఇప్పుడు హర్యానా, మహారాష్ట్రలో కాంగ్రెస్ ఓడిపోవడంతో రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ కేంద్ర నాయకత్వంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఓటమిపై కాంగ్రెస్‌లోనే నిరసన స్వరాలు వినిపిస్తున్నాయి. దీంతో మరోసారి పార్టీ కేంద్ర నాయకత్వంలో పునర్వ్యవస్థీకరణ డిమాండ్ ఏర్పడే అవకాశాలున్నాయి. అలాగే ఇప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 మంది పార్లమెంటు సభ్యుల సమూహం(జీ23) మరింత యాక్టివ్ కావాల్సిన అవసరం ఉందనే వాదన వినిపిస్తోంది. కాంగ్రెస్‌లోని జీ23 గ్రూపులోని కపిల్ సిబల్, గులాం నబీ ఆజాద్ కూడా కాంగ్రెస్‌ను వీడారు. వీరు గతంలో పార్టీలో కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు ఆనంద్ శర్మ, శశి థరూర్, హుడా వంటి నాయకులు మాత్రమే మిగిలారు. ఈ నేపధ్యంలో జీ 23 మరింత బలపడాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: మహాయుతి దెబ్బకు ‘ఎల్వోపీ’ సీటు గల్లంతు -
అనంతపురంలో సూర్యకుమార్ యాదవ్.. 5 పరుగులకే అవుట్ (ఫొటోలు)
-
ఫెయిల్ అయ్యానని వైద్య విద్యార్థిని ఆత్మహత్య
షాద్‌నగర్ రూరల్: పరీక్షలో ఫెయిల్ కావ డంతో మనస్తాపం చెందిన ఫిజియో థెరపీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్ప డిన ఘటన గురువారం రాత్రి షాద్‌నగర్ రైతు కాలనీలో చోటుచేసుకుంది. కాలనీకి చెందిన బుచ్చి బాబు, అమృత దంపతుల పెద్ద కూతురు కీర్తి (24) హైదరాబాద్‌లోని దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ కళాశాలలో ఫిజియోథెరపీ నాలు గో ఏడాది చదువుతోంది. ఇటీవల థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఓ సబ్జెక్టులో ఫెయిలైన కీర్తి తీవ్ర మనస్తాపంతో ఉంటోంది. ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న కీర్తి తల్లి, ఆర్ఎంపీ వైద్యుడైన తండ్రి బుచ్చిబాబు ఇద్దరూ వేర్వేరు పనులపై గురువారం సాయంత్రం బయటకు వెళ్లారు. ఇదే అదనుగా భావించిన కీర్తి సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటికి వచ్చిన తండ్రి బెడ్రూంలోకి వెళ్లి చూడగా ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ రాంచందర్ తెలిపారు. -
‘ఐదు’ తప్పి, ఆరులో ప్రమోషన్ కోసం న్యాయపోరాటం
దేశ రాజధాని ఢిల్లీలో ఒక ఆసక్తికర ఉదంతం చోటుచేసుకుంది. స్థానికంగా ఐదో తరగతి చదువుతున్న ఓ బాలుడు ఫెయిల్ కావడంతో ఆరో తరగతికి ప్రమోట్ చేసేందుకు ఆ పాఠశాల యాజమాన్యం నిరాకరించింది. దీంతో ఆ పదేళ్ల బాలుడు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. బాలల హక్కుల కోసం జరిగిన ఈ పోరాటంలో తల్లిదండ్రులు, న్యాయవాదులు ఆ బాలునికి మద్దతుగా నిలిచారు. ఈ కేసు అలకనందలోని ఓ ప్రైవేట్ పాఠశాలకు సంబంధించినది. 2023-24 సంవత్సరంలో 10 ఏళ్ల బాలుడు ఐదవ తరగతి పరీక్షకు హాజరయ్యాడు. అయితే సదరు పాఠశాల యాజమాన్యం ఆ బాలుడు ఫెయిలయ్యాడనే విషయాన్ని తెలియజేయకుండా 15 రోజుల వ్యవధిలో తిరిగి అతనికి మరోమారు పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల్లో ఆ బాలుడు ఫెయిల్ అయ్యాడు. దీంతో ఆ బాలుడిని ఆరో తరగతికి ప్రమోట్ చేసేందుకు పాఠశాల యాజమాన్యం నిరాకరించింది. దీంతో ఆ విద్యార్థి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఇది విద్యా చట్టంలోని సెక్షన్ 16(3)ని ఉల్లంఘించడమేనని ఆ బాలుడు తన పిటిషన్లో పేర్కొన్నాడు. ఆ బాలుడు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన జస్టిస్ సి హరిశంకర్ ధర్మాసనం ఆ బాలునికి సిక్స్త్‌లో అడ్మిషన్ కల్పించకపోతే అతని చదువు దెబ్బతింటుందని పేర్కొంది. ఆరో తరగతిలో ఆ బాలుడిని కూర్చోవడానికి పాఠశాల అనుమతిస్తే, అది పాఠశాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదని వ్యాఖ్యానించింది. దీనికి నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టు సదరు ప్రైవేట్ స్కూల్‌తో పాటు విద్యా డైరెక్టరేట్‌ను ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణ జూలై 4న జరగనుంది. తన ఫెయిల్యూర్ గురించి స్కూల్ తనకు తెలియజేయలేదని కోర్టులో పిటిషన్ వేసిన బాలుడు పేర్కొన్నాడు. అంతేకాకుండా పరీక్షలకు సిద్ధం అయ్యేందుకు రెండు నెలల సమయం కావాలని కోరాడు. దీంతో సదరు పాఠశాల యాజమాన్యం రెండు నెలల తరువాత ఆ విద్యార్థికి తిరిగి పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పించింది. -
Ganta : గంటా కంపెనీ ఆస్తుల వేలానికి రంగం సిద్ధం
ఎందెందు వెతికినా.. వాడు అందందే గలడు అన్నట్టు ఏ నేరం చూసినా.. దాని బ్యాక్‌గ్రౌండ్‌లో టిడిపి నేతలే బయటకు వస్తున్నారు. బ్యాంకు కేసుల నుంచి డ్రగ్స్ దాకా, ఓటుకు కోట్లు నుంచి పేకాట శిబిరాల దాకా టిడిపి క్రైం లిస్టు పెరిగిపోతోంది. గంట మోగింది. టిడిపి మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు, ఆయన బంధువులు బ్యాంకుల్లో తీసుకున్న రుణం చెల్లించకపోవడంతో ఆస్తుల స్వాధీనానికి నోటీసులు జారీ అయ్యాయి. ప్రత్యూష కంపెనీ పేరిట ఇండియన్ బ్యాంక్ నుంచి రుణం తీసుకొని ఎగవేశారు గంటా శ్రీనివాసరావు అండ్ కో. ఏకంగా రూ. 390 కోట్ల 7 లక్షల 52 వేల 945 రుణం ఎగవేసినట్టు ఇండియన్ బ్యాంక్ నోటీసులు ఇచ్చింది. ప్రత్యూష కంపెనీ పేరిట గతంలో కూడా ఓ బ్యాంకుకు టోకరా పెట్టారు గంట శ్రీనివాసరావు అండ్ కో. అప్పుకు సంబంధించి జప్తుగా పెట్టిన జీవీఎంసీ సమీపంలోని బాలయ్య శాస్త్రి లేఔట్లో గంటా అండ్ కో ఆస్తులను వేలంపాట వేయాలని బ్యాంకు ఇవ్వాళ నోటీసులిచ్చింది. పద్మనాభం మండలం అయినాడ వద్ద స్థిరాస్తిని కూడా స్వాధీనం చేసుకుంటున్నట్టు నోటీసులో తెలిపింది ఇండియన్ బ్యాంక్. 16-04-24 తేదీన 12 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలు వరకు ఆస్తులను వేలం వేస్తున్నట్లు ప్రకటించింది బ్యాంకు. -
క్లైమాక్స్ బాగుంటే హిట్టే – శివ నిర్వాణ
విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొం దిన చిత్రం ‘ఖుషి’. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం యూనిట్ నిర్వహించిన విలేకర్ల సమావేశంలో శివ నిర్వాణ మాట్లాడుతూ– ‘‘శాస్త్రాలు, సిద్ధాంతాలు వేరు కావొచ్చు. కానీ ఎవరు ఏది నమ్మినా నమ్మకున్నా మనం మనల్ని ప్రేమించే మనుషులతో కలిసి ఉండాలని ‘ఖుషి’లో చెప్పం. క్లైమాక్స్ బాగుందని ప్రశంసలు వస్తున్నందుకు హ్యాపీగా ఉంది. క్లైమాక్స్ బాగుంటే సినిమా హిట్టే.. ఫెయిల్ అయిన చరిత్ర లేదు’’ అన్నారు. ‘‘షో బై షో కలెక్షన్స్ పెరుగుతున్నాయని రిపోర్ట్స్ వస్తున్నాయి. ‘ఖుషి’ మంచి మూవీ కాబట్టి అవార్డులూ రావొచ్చు’’ అన్నారు నవీన్. ‘‘కథని నమ్మి ‘ఖుషి’ని నిర్మించాం. మా నమ్మకానికి తగ్గట్టు ఫలితాలు సానుకూలంగా వస్తున్నాయి’’ అన్నారు వై. రవిశంకర్. ఈ కార్యక్రమంలో చిత్ర సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహబ్, సినిమాటోగ్రాఫర్ మురళి, మైత్రీ డిస్ట్రిబ్యూటర్ శశి పాల్గొన్నారు. -
30న సీపీఎం అభ్యర్థుల తొలి జాబితా ప్రకటన!
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయబోయే అభ్యర్థులతో ఈ నెల 30వ తేదీన మొదటి జాబితా విడుదల చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు పొత్తులకు సంబంధించిన అంశంపై చర్చించేందుకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ ఆదివారం సమావేశమైంది. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీల తరఫున చెరో ఐదు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాలని పార్టీ భావిస్తోంది. ఈ మేరకు 30న సీపీఐ, సీపీఎం సమావేశమై ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించే అవకాశ ముంది. వామపక్షాలతో పొత్తు ఉండబోదని బీఆర్ఎస్ పార్టీ తేల్చిచెప్పడంతో ఈ రెండుపార్టీలు ఈ నిర్ణయానికి వచ్చాయి. కాగా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రేతో సీపీఐ నేతలు ఆదివారం భేటీ అయిన సంగతి తెలిసిందే. ఠాక్రే సీపీఎంతో కూడా సోమవారం సమావేశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్‌తో పొత్తు కుదిరితే సరే సరే, లేకుంటే ఉభయ కమ్యూనిస్టు పార్టీల తరఫున రెండో జాబితా కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఎవరితో పొత్తు లేకపోతే రెండు పార్టీలు కలిసి దాదాపు 20 నుంచి 24 మధ్య అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. కాగా, సీపీఎం రాష్ట్ర కమిటీలో బీఆర్ఎస్ తీరుపై వాడీవేడి చర్చ జరిగినట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్తో పార్టీ వ్యవహరించినతీరుపై కూడా కొందరు నాయకులు విమర్శించినట్లు సమాచారం. బీఆర్ఎస్ తీరును ముందే ఎందుకు అర్థం చేసుకోలేకపోయామని నిలదీసినట్టు తెలిసింది. రాబోయే ఎన్నికల్లో ప్రజాతంత్ర లౌకిక పార్టీలతో ముందుకు సాగాలని పార్టీ నిర్ణయించింది. -
ఎక్స్ టేకోవర్: ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు,అసలేం జరుగుతోంది?
గత ఏడాది అక్టోబర్‌లో 44 బిలియన్ డాలర్లకు మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్‌ను స్వాధీనం చేసుకున్న బిలియనీర్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ పలు కీలక మార్పులకు చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా అందరూ ఊహించినట్టుగా ఈ టేకోవర్ ఫెయిల్ కావచ్చు కానీ సాధ్యమైనంతవరకు సక్సెస్‌ను ప్రయత్నిస్తున్నామనడం చర్చకు దారి తీసింది. అలాగే ఎక్కువగా సంపాదించాలనుకునే జర్నలిస్టులకు ఎక్స్‌లో ఆఫర్ అంటూ ట్వీట్ చేయడం సంచలనం రేపుతోంది. ఎవరైతే స్వేచ్ఛగా ఆర్టికల్స్ రాయాలనుకుంటారో ఆ జర్నలిస్టులు డైరెక్ట్ ఎక్స్‌లో పబ్లిష్ చేసి డబ్బులు సంపాదించవచ్చు అంటూ మస్క్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది ఇప్పటికే ఇది 24 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ( అంతేకాదు ఆయా ఆర్టికల్ చదివే వినియోగదారుల నుంచి డబ్బులు తీసుకునే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.యూజర్లు చదివే ఆర్టికల్ ని బట్టి ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా నెలవారీ సబ్స్క్రిప్షన్ చేసుకోకపోతే మరింత చెల్లించాల్సి ఉంటుంది. అయితే తాజా నివేదికల ప్రకారం, ఇప్పుడు ఎక్స్‌లో షేర్ అయిన వార్తల ముఖ్యాంశాలను తొలగించాలని యోచిస్తున్నాడు.తద్వారా ట్వీట్ పరిణామాన్ని తగ్గించి, యూజర్ టైమ్‌లైన్‌లో మరిన్ని ట్వీట్లు సరిపోయేలా చేయడానికే ఈ ఎత్తుగడ అని తెలుస్తోంది. యూజర్ స్క్రీన్‌పై ట్వీట్ ఆక్రమించే నిలువు స్థలాన్నితగ్గించడమే ఈ మార్పు వెనుకకారణమని ఫార్చ్యూన్ నివేదించింది.దీనితో పాటు క్లిక్‌బైట్‌ను తగ్గించడంలో కూడా సహాయపడుతుందని మస్క్ భావిస్తున్నాడట. If you’re a journalist who wants more freedom to write and a higher income, then publish directly on this platform! — Elon Musk (@elonmusk) August 21, 2023 ఎక్స్ (ట్విటర్) టేకోవర్ విఫలం కావచ్చు: మస్క్ ముఖ్యంగా గా బిలియన్ల డాలర్ల ట్విటర్ టేకోవర్ "విఫలం కావచ్చు" అని అంగీకరించడం మరో సంచలన వార్తగా మారింది. ట్విటర్ "బ్లాక్" ఫీచర్‌ను తొలగించే నిర్ణయంపై తాజా ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కొన్ననేపథ్యంలో మస్క్ ఈ వ్యాఖ్యలు చేశాడు. గత నెలలో మార్క్ జుకర్‌బర్గ్ మెటా ప్రారంభించిన టెక్స్ట్-ఆధారిత సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ థ్రెడ్స్‌కు పోటీ వెబ్ వెర్షన్‌ను రూపొందించడానికి సిద్ధమైనప్పటికీ ఎక్స్ అనిశ్చిత భవిష్యత్తుపై మస్క్ ఇలా పేర్కొన్నాడు. "చాలామంది ఊహించినట్లుగా తాము విఫలం కావచ్చు, కానీ కనీసం ఒకరిగాఉండటానికి తమ వంతు ప్రయత్నం చేస్తాము." అన్నాడు. అలాగే ఆదివారం నాటి పోస్ట్‌లో ."విచారకరమైన నిజం ఏమిటంటే, ప్రస్తుతం గొప్ప "సోషల్ నెట్‌వర్క్‌లు" లేవు అందుకే అలాంటి నొకదానిని నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నానని తెలిపాడు. The sad truth is that there are no great “social networks” right now. We may fail, as so many have predicted, but we will try our best to make there be at least one. — Elon Musk (@elonmusk) August 19, 2023 hey @elonmusk + @lindayaX … please rethink removing the block feature. as an anti-bullying activist (and target of harassment) i can assure you it’s a critical tool to keep people safe online. - that woman — Monica Lewinsky (she/her) (@MonicaLewinsky) August 19, 2023 కాగా ఇప్పటికే బ్లూటిక్ పేరుతో యూజర్లనుంచి చార్జ్ వసూలు చేస్తున్నారు. అలాగే ఇటివలి కాలంలో పరిచయం చేసిన యాడ్ రెవెన్యూ షేర్ ఫీచర్ కింద వెరిఫైడ్ యూజర్లు మానిటైజేషన్ రూల్స్ ప్రకారం డబ్బు సంపాదించుకునే అవకాశం అందుబాటులో ఉంది. తాజా నిర్ణయంతో స్వేచ్ఛగా రాయాలనుకునే జర్నలిస్టులకు డబ్బులు ఆర్జించే అవకాశాన్ని కల్పించడం విశేషం.అయితే దీనిపై పబ్లిషర్స్నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
Chat GPT చెప్పింది అని విద్యార్దులను ఫెయిల్ చేసాడు.. చివరికి ఏమైందంటే..
-
డెలివరీ ఫెయిల్: జొమాటోకు భారీ షాక్
న్యూఢిల్లీ: ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఆర్డర్‌ను డెలివరీ చేయనందుకు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. తిరువనంతపురానికి చెందిన ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి ఆర్డర్ డెలివరీ చేయక పోవడంతో భారీ జరిమానా చెల్లించింది.(మునుగుతున్న ట్విటర్ 2.0? ఉద్యోగుల సంఖ్య తెలిస్తే షాకవుతారు!) యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలో లా చివరి సంవత్సరం విద్యార్థి అరుణ్ జీ కృష్ణన్ తిరువనంతపురంలో జొమాటోలో రూ. 362 రూపాయలకు ఫుడ్ ఆర్డ్‌ర్ చేశారు. బ్యాంకు నుంచి మనీ కూడా డిడక్ట్ అయింది. కానీ అతనికి ఆర్డర్ డెలివరీ చేయడంలో జొమాటో విఫలమైంది. దీంతో వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు. ఢిల్లీలో కూడా తనకు ఇలాంటి అనుభవమే ఎదురైందని కృష్ణన్ ఆరోపించారు. ఇందుకు తనకు రూ. 1.5 లక్షల నష్టపరిహారం, కోర్టు ఖర్చుల నిమిత్తం రూ. 10వేలు చెల్లించాలని కోరారు.(ఉద్యోగుల ఝలక్, ఆఫీసుల మూత: మస్క్ షాకింగ్ రియాక్షన్) అయితే ఆర్డర్ ఎందుకు డెలివరీ చేయలేదనేదానిపై జొమాటో రెండు వివరణలిచ్చింది. కృష్ణన్ పేర్కొన్న చిరునామాలో ఆర్డర్ తీసు కోలేదని, చిరునామాలో సమస్య ఉందని తెలిపింది. తన యాప్‌లో సమస్యుందని దాన్ని సరిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. దీంతో కృష్ణన్‌కు అనుకూలంగా తీర్పునిచ్చిన కోర్టు జొమాటోను దోషిగా ప్రకటించింది. వడ్డీ, కృష్ణన్ మానసిక వేదనకు పరిహారంగా 5వేల రూపాయలు, కోర్టు ఖర్చుల కింద 3వేల రూపాయలు మొత్తంగా రూ. 8,362 పెనాల్టీ విధించింది కొల్లాం జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమీషన్. -
గన్ తలకు గురిపెట్టి కాల్చబోయాడు.. ఊహించని ట్విస్ట్
బ్యూనస్ ఎయిర్స్: అర్జెంటీనా ఉపాధ్యక్షుడు క్రిస్టినా ఫెర్నాండెజ్ డె కిర్చనర్.. హత్యాయత్నం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఓ దుండగుడు గన్ ఆమెకు గురిపెట్టి తలకు కాల్చే ప్రయత్నం చేశాడు. అయితే అతి సమీపంగా జరిగిన ఈ దాడి యత్నంతో అంతా షాక్ తిన్నారు. అయితే.. ట్రిగ్గర్ నొక్కినా గన్ మిస్‌ఫైర్ కావడంతో ఆమె సురక్షితంగా దాడి నుంచి బయటపడ్డారు. ఆ వెంటనే దుండగుడిని పోలీసులు, సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. గురువారం రాత్రి బ్యూనస్ ఎయిర్స్ ఇంటి వద్ద ఈ ఘటన జరిగినట్లు భద్రతా మంత్రి అనిబల్ ఫెర్నాండేజ్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను చాలా చానెల్స్‌తో పాటు సోషల్ మీడియాలోనూ సర్క్యులేట్ అవుతోంది. మిలిటరీ నియంతృత్వ పాలన నుంచి అర్జెంటీనా 1983లో స్వాతంత్రం సంపాదించుకుంది. అయితే.. అప్పటి నుంచి ఈ తరహా హత్యాయత్నాలు జరగడం మాత్రం ఇదే తొలిసారి. దాడికి యత్నించిన వ్యక్తిని బ్రెజిల్ వాసి ఫెర్నాండో ఆండ్రే సబాగ్ మోనటియల్గా గుర్తించారు. అతనిపై ఎలాంటి క్రిమినల్ రికార్డు లేదని పోలీసులు ధృవీకరించారు. క్రిస్టియానా ఫెర్నాండేజ్ డె కిర్చనర్.. గతంలో రెండుసార్లు అధ్యక్షురాలిగా కూడా వ్యవహరించారు. 2007-15 మధ్య ఆమె పని చేశారు. అయితే పబ్లిక్ కాంట్రాక్ట్‌ల విషయంలో అవినీతి, అవకతవకలకు పాల్పడారన్న ఆరోపణలతో.. విచారణ ఎదుర్కొంటున్నారు ఆమె. రుజువైతే ఆమె 12 ఏళ్లు శిక్ష ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇదీ చదవండి: అగ్రరాజ్యం ఆంక్షలకు చెక్‌పెట్టేలా... -
కాబోయే భార్య ఎగ్జామ్ ఫెయిల్ అయ్యిందని ఏకంగా స్కూల్‌నే తగలెట్టేశాడు
కోపంతో ఆవేశంగా తీసుకునే నిర్ణయాలు చాలా అనర్థాన్ని సృష్టిస్తాయి. ఆ కోపం వారినే కాదు తనతో ఉన్నవారిని కూడా కష్టాలపాల్జేస్తుంది. అచ్చం అలానే ఇక్కడోక వ్యక్తి తన కాబోయే భార్య ఎగ్జామ్ పెయిలైందన్న కోపంతో చేసిన పని కొంతమంది విద్యార్థుల భవితవ్యాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేసింది. వివారాల్లోకెళ్తే...ఈజిప్టులోని 21 ఏళ్ల యువకుడు తన కాబోయే భార్య చదువుతున్న స్కూల్‌కి నిప్పుపెట్టాడు. తన కాబోయే భార్య ఎగ్జామ్‌లో ఫెయిలైందన్న కోపంతో ఈ ఘటనకు పాల్పడ్డాడు. ఈ మేరకు ఈజిప్టులోని ఘర్బియా గవర్నరేట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...ఈజిప్టు రాజధాని కైరోకు ఉత్తరాన ఉన్న మెనోఫియా ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపారు. ఈ అగ్నిప్రమాదంలో ఎవరూ గాయపడలేదని చెప్పారు. సదరు నిందితుడు విచారణలో చెప్పిన విషయాలు విని పోలీసుల ఒక్కసారిగా షాక్ అయ్యారు. తన కాబోయే భార్య ఎగ్జామ్ ఫెయిలవ్వడంతో ఆమె మరో ఏడాది చదువుకోవాల్సి ఉంటుందని చెప్పాడు. అందువల్ల తమ పెళ్లి వాయిదా పడుతుందన్న కోపంతో ఈ దారుణానికి ఒడిగట్టానని చెప్పుకొచ్చాడు. ఐతే సమయానికి అగ్నిమాపక సిబ్బంది వచ్చి త్వరితగతిన మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పారు. ఈ అగ్ని ప్రమాదంలో ప్రిన్స్‌పాల్ కార్యాలయం, అడ్మినిస్ట్రేటివ్ భవనం దారుణంగా దెబ్బతాన్నాయని పోలీసులు చెప్పారు. అంతేగాక ఆ స్కూల్లోని కొంతమంది విద్యార్థుల రికార్డులు నాశనమయ్యాయని తెలిపారు. ఐతే అతను ఈ దారుణానికి ఒడిగట్టినప్పుడు చూసిన స్థానికులు అతని గురించి పూర్తి సమాచారం అందించారని చెప్పారు. ప్రస్తుతం పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడమే కాకుండా కోర్టు ఎదుట హాజరుపర్చనున్నట్లు పేర్కొన్నారు. (చదవండి: Lying Down Championship: అలా తిని పడుకుంటే.. డబ్బులొస్తాయ్!) -
మరో విమానం ఇంజన్ ఫెయిల్: వరుస ఘటనలతో ప్రయాణీకులు బెంబేలు
సాక్షి, న్యూఢిల్లీ: విమానాల్లో వరుస సాంకేతిక లోపాలు ప్రయాణీకుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. ఇప్పటికే ప్రైవేటు విమానయాన సంస్థ స్పైస్ జెట్ విమానంలో విండ్‌షీల్డ్ క్రాక్ కారణంగా బుధవారం ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. దీనిపై డీజీసీఐ సంస్థకు నోటీసులు కూడా జారి చేసింది. తాజాగా మరో ప్రైవేటు విమానయాన సంస్థ విస్తారా విమానంలో ఇంజీన్ ఫెయిల్ అయిన ఘటన ఆందోళన రేపింది. అయితే విమానం సేఫ్టీగా ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మంగళవారం జరిగిన ఈ ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. బ్యాంకాక్ నుంచి బయలుదేరి, ఢిల్లీలో ల్యాండ్ అయిన వెంటనే విస్తారా విమానం ఇంజిన్ ఫెయిల్ అయింది. దీంతో విమానాన్ని ట్యాక్సీవే నుంచి పార్కింగ్ ప్రాంతానికి లాగాల్సి వచ్చింది. బ్యాంకాక్-ఢిల్లీ విమానం UK-122 (సింగిల్ ఇంజన్) నిన్న (మంగళవారం) ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అయినప్పుడు ఈ సంఘటన జరిగిందని ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. ఢిల్లీలో ల్యాండింగ్ తర్వాత, పార్కింగ్ బేకు వెళుతున్న క్రమంలో చిన్న విద్యుత్ సమస్య ఏర్పడిందని, అయితే ప్రయాణీకుల భద్రత రీత్యా అప్రమత్తమైన సిబ్బంది ట్యాక్సీవే నుంచి పార్కింగ్ విమానాన్ని తరలించారని విస్తారా ఒక ప్రకటనలో తెలిపింది. -
ఆన్లైన్ తరగతులు అర్థం కాలేదు.. ఫెయిలైనందుకు క్షణికావేశంలో..
సాక్షి,ఆదిలాబాద్‌టౌన్: ఇంటర్ పరీక్షల్లో తప్పినందుకు ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడి బుధవా రం ఉదయం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం... జిల్లా కేంద్రంలోని రిక్షా కాలనీకి చెందిన బుర్రివార్ గజానంద్– సంగీత దంపతుల కు కూతురు నందిని (17), కుమారుడు ఉన్నారు. నందిని 10వ తరగతి వరకు బంగారుగూడ మోడల్ స్కూల్లో చదివింది. కరోనా కారణంగా పరీక్షలు రా యకుండానే పదో తరగతి ఉత్తీర్ణులైంది. ఆ తర్వాత ఆదిలాబాద్ పట్టణంలోని విద్యార్థి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ ఎంపీసీ గ్రూప్‌లో చేరింది. అయితే గత శుక్రవారం ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలు విడుదల కాగా నందిని ఫెయిలైంది. దీంతో అదే రోజు సాయంత్రం ఇంట్లోని వాస్మొల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆన్లైన్ తరగతులు అర్థం కాక.. కరోనా మహమ్మారి కారణంగా కళాశాలల్లో ప్రత్యక్ష తరగతులు జరగలేదు. ఆన్లైన్ ద్వారా విద్యాబోధన సాగింది. ఆన్లైన్లో విన్న పాఠాలు సరైన రీతిలో అర్థం కాలేదు. పరీక్షలు నిర్వహించకుండానే ప్రభుత్వం ప్రథమ సంవత్సరం విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేసింది. ఆ తర్వాత కరోనా తగ్గుముఖం పట్టడంతో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలను నిర్వహించింది. పరీక్షలు రాసిన ఈ విద్యార్థిని నాలుగు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయినట్లు ఫలితాలు వెలువడ్డాయి. కాలనీలో విషాదం.. ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చిన రోజు సాయంత్రం 6గంటల ప్రాంతంలో విద్యార్థిని ఇంట్లోని వాస్మొల్ ఆయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచనల మేరకు మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో మృతిచెందింది. దీంతో మృతురాలి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నారు. కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను కంటతడి పెట్టించాయి. చదవండి: ఏడాది సహజీవనం.. మోజు తీరాక.. ప్లేటు ఫిరాయించి.. -
గుండు కొట్టించాడు.. ఉన్న ఉద్యోగం ఊడింది
సాక్షి ,హైదరాబాద్: మంచి జరగాలని దేవునికి తలనీలాలు ఇచ్చుకోవడం చాలా మంది చేసేదే! అయితే, అదే గుండు వల్ల ఉన్న ఉద్యోగం పోవడం నిజంగా దురదృష్టమే. హైదరాబాద్ నగరంలో గుండు కోట్టించుకున్నందుకు ఓ యువకుడికి ఉద్యోగం పోయింది. శ్రీకాంత్ అనే వ్యక్తి ఏడాదిన్నరగా ఉబర్‌లో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకొని తలనీలాలు సమర్పించుకున్నాడు. అనంతరం ఎప్పటిలానే ఫిబ్రవరి 27న ఉబర్ యాప్‌లో సెల్ఫీతో లాగిన్ అయ్యేందుకు ప్రయత్నించగా సాధ్యపడలేదు. దీంతో పలుమార్లు ప్రయత్నిస్తే అతడి ఖాతా పూర్తిగా బ్లాక్ కావడంతో కొత్త కష్టాలు మొదలయ్యాయి. కారణం ఏంటా అని చూస్తే గుండుతో విధుల్లో చేరేందుకు వచ్చిన శ్రీకాంత్ ముఖాన్ని ఉబర్ యాప్ గుర్తుపట్టకపోవడంతో ఉపాధికి దూరమయ్యాడు. అతడు ఇప్పటివరకు 1428 ట్రిప్లతో 4.67 స్టార్ రేటింగ్‌తో ఉన్నాడు. తనకు ఎదురైన ఇబ్బందిపై శ్రీకాంత్ ఆవేదన వ్యక్తంచేశాడు. ‘ప్రస్తుతం నా ఖాతా బ్లాక్ అయింది. ఉబర్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేస్తే.. నా కారుకు వేరే డ్రైవర్‌ను పెట్టుకోవాలని సూచించారు. కానీ, నేను అంత భరించలేను. నెల తర్వాత మళ్లీ ఉబర్ కార్యాలయానికి పలుమార్లు తిరిగితే.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఫిర్యాదు చేసేందుకు ఒక ఈ-మెయిల్ ఐడీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ ఆ వ్యవహారం నడుస్తూనే ఉంది’ అంటూ అతను వాపోయాడు. యాప్ ఆధారిత ట్రాన్స్పోర్ట్ వర్కర్ల జాతీయ సమాఖ్య ప్రధాన కార్యదర్శి షేక్ సలాయుద్దీన్ ఈ విషయంపై మాట్లాడుతూ డ్రైవింగే శ్రీకాంత్ కు జీవనాధారమని, అతడు కారు ఈఎంఐ కూడా చెల్లించాల్సి ఉందన్నారు. లాక్డౌన్ సమయంలో డ్రైవర్లంతా ఖాళీగానే తిరగాల్సి వచ్చిందని, కొన్ని సందర్భాల్లో ఉబర్ అల్గారిథమ్ డ్రైవర్ల ముఖాల్ని గుర్తించకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. శ్రీకాంత్‌కు ఎదురైన ఇలాంటి సమస్య మరో డ్రైవర్‌కు రాకూడదని, ఉబర్ సంస్థ ఆ దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. ( చదవండి: తాగి తందనాలు.. భార్య హోటల్లో పనిచేస్తుండటంతో ) -
నీట్ గందరగోళం.. టాపర్‌ని ఫెయిల్ చేశారు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) ఫలితాలపై దేశ వ్యాప్తంగా ఆగ్రహం వెల్లువెత్తుతుంది. ఇప్పటికే ఫస్ట్ ర్యాంక్ ప్రకటన విషయంలో విమర్శలు వస్తుండగా.. తాజాగా టాపర్‌గా నిలిచిన విద్యార్థిని ఫెయిల్ అయినట్లు ప్రకటించినట్లు తెలిసింది. వివరాలు.. 17 ఏళ్ల రావత్ రాజస్తాన్ లోని సవాయి మాధోపూర్ జిల్లాలోని గంగాపూర్ పట్టణంలో నివసిస్తున్నాడు. అక్టోబర్ 16 న, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఏటీఏ) జారీ చేసిన మొదటి మార్క్‌షీట్ ప్రకారం అతడు ఫెయిల్ అయినట్లు వచ్చింది. 720 మార్కులకు గాను మృదుల్‌కు 329 పాయింట్లు ఇచ్చింది. దాంతో అతడు రిజల్ట్‌ని సవాలు చేశాడు. ఈ క్రమంలో అతడి ఓఎంఆర్ షీట్, ఆన్సర్ కీని తిరిగి తనిఖీ చేయడంతో 650 మార్కులతో అతను ఎస్టీ కేటగిరీలో ఆల్ ఇండియా టాపర్ అని తేలింది. జనరల్ కేటగిరీలో ఆల్ ఇండియా 3577వ ర్యాంకు సాధించాడు. (చదవండి: ఎన్నదగిన తీర్పు) అయితే, ఎన్టీఏ జారీ చేసిన రెండవ మార్క్‌షీట్‌లో కూడా మరో పొరపాటును గుర్తించారు. దానిలో, అతని మార్కుల మొత్తం 650 అని చూపించినప్పటికి.. అక్షరాల్లో మాత్రం మూడు వందల ఇరవై తొమ్మిది అని రాశారు. అలానే ఫస్ట్ ర్యాంకు విషయంలో కూడా విమర్శలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఒడిశాకు చెందిన సోయబ్ అఫ్తాబ్, ఢిల్లీకి చెందిన ఆకాంక్ష సింగ్ ఇద్దరు ఆవుట్ ఆఫ్ మార్కులు సాధించారు. కానీ ఎన్టీఏ టై బ్రేకింగ్ పాలసీ ప్రకారం అఫ్తాబ్‌కి మొదటి ర్యాంకు, ఆకాంక్షకు రెండవ ర్యాంకుగా ప్రకటించింది. -
ఫెయిలైనందుకు వైద్యవిద్యార్థిని ఆత్మహత్య
కర్ణాటక, బళ్లారి రూరల్ : ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం ఫెయిల్ అయినందుకు వైద్యవిద్యార్థిని ఆత్మహత్య చేసుకొన్న ఘటన నగరంలోని విద్యానగర్‌లో గురువారం వెలుగు చూసింది. సంబంధీకులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నగర శివారు ప్రాంతంలోని కృష్ణానగర్ క్యాంపునకు చెందిన శ్రీనివాసరావు, గీత దంపతుల కుమార్తె ఎ.దివ్య(20) విమ్స్ వైద్యకళాశాలలో ఎంబీబీఎస్ మూడవ సంవత్సరం చదువుతోంది. విద్యానగర్‌లో ఉంటున్న తమ తల్లిదండ్రుల వద్ద నుంచి ప్రతిరోజూ కళాశాలకు వెళ్లివస్తుండేది. ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసింది. బుధవారం రాత్రి 11 గంటలకు ఫలితాలు వెలువడ్డాయి. ఈ పరీక్షల్లో దివ్య ఫెయిల్ అయింది. ఇదే సమయంలో బెంగుళూరులో ఉన్న తమ్ముడు ఫోన్ చేసి ఫలితాలు వచ్చాయి కదా, ఏమైందని అడిగాడు. పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని చెప్పింది. మళ్లీ కొంతసేపటికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది, నిద్ర పోయి ఉంటుందని అనుకొన్నాడు. అయితే తాను ఫెయిల్ అయ్యానన్న విషయం అందరికీ తెలిసిందని మనస్తాపంతో దివ్య తన గదిలోని ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొంది. ఉదయం తల్లిదండ్రులు గమనించి విమ్స్‌కు తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనపై కౌల్‌బజార్ పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు. విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణస్వామి, డాక్టర్ దత్తాత్రేయరెడ్డి, వైద్యవిద్యార్థులు దివ్య మృతదేహాన్ని పరామర్శించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. విషయం తెలుసుకున్న ఎంఎల్ఏ శ్రీరాములు విమ్స్ మార్చురీకి చేరుకొని తల్లిదండ్రులను పరామర్శించి ఓదార్చారు. విద్యార్థులను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకొన్నారు. -
శ్రీలంకలో అఖిలపక్ష భేటీ విఫలం
కొలంబో: శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఆదివారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశం నిష్ప్రయోజనంగా ముగిసింది. ఈ సమావేశానికి మాజీ ప్రధాని రణిల్ విక్రమసింఘేతో పాటు మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్స హాజరయ్యారు. కాగా, ఈ భేటీని పార్లమెంటు స్పీకర్ జయసూర్యతో పాటు పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ పార్టీ బహిష్కరించాయి. ఈ సమస్యను సృష్టించిన సిరిసేనే దీన్ని పరిష్కరించాలనీ, ఇందులో తమ ప్రమేయం ఏమీ లేదని జేవీపీ స్పష్టం చేసింది. ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు అవసరమైతే మరోసారి పార్లమెంటును సమావేశపర్చాలని కోరగా అధ్యక్షుడు స్పందించలేదు. -
119 మంది ఐపీఎస్‌లు ఫెయిల్
సాక్షి, హైదరాబాద్: త్వరలో వివిధ రాష్ట్రాల్లో పోలీస్ అధికారులుగా బాధ్యతలు చేపట్టనున్న దాదాపు 119 మంది ఐపీఎస్ అధికారులు శిక్షణా పరీక్షలో ఫెయిల్ అయ్యారు. విచిత్రమేమిటంటే పరీక్ష రాసినవారి సంఖ్య 122 అయితే, 90 శాతం మంది అభ్యర్థులు పరీక్ష తప్పారన్నమాట. ఇది నేషనల్ పోలీస్ అకాడమీ చరిత్రలో ఓ రికార్డు. వాస్తవానికి 136 మంది అధికారులు పరీక్ష రాయగా... వీరిలో 14 మంది ఇండియన్ ఫారిన్ సర్వీసెస్(ఐఎఫ్ఎస్)కు చెందినవారు. అంటే పరీక్ష రాసిన ఐపీఎస్‌ల సంఖ్య 122 కాగా, వీరిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్ట్‌లలో ఫెయిల్ అయినవారు 119 మంది. అంటే అన్ని సబ్జెక్టులలో ఉత్తీర్ణులైనవారు కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు. జరిగిందేమిటంటే...: ప్రతి ఏడాది సివిల్స్ పరీక్షల్లో పాసైనవారిలో అర్హులైన ఐఏఎస్ అధికారులకు ముస్సోరిలో ఉన్న లాల్‌బహదూర్‌శాస్త్రి నేషనల్ అకాడమీలో శిక్షణ ఇస్తారు. ఇండియన్ పోలీసు సర్వీస్(ఐపీఎస్) అధికారులకు హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ ఇస్తారు. ఇలా 2016 బ్యాచ్‌కు చెందిన అభ్యర్థుల పరీక్షల ఫలితాలు ఇటీవలే వెల్లడయ్యాయి. వీరిలో 119 మంది ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ సబ్జెక్టులలో ఉత్తీర్ణులు కాలేదు. ఇలా శిక్షణా పరీక్షలో ఫెయిల్ అయినా, వీరికి గ్రాడ్యుయేషన్ ఇవ్వడమేగాక ప్రొబేషన్ కింద అధికారులుగా నియమిస్తారు. అయితే, వీరు అన్ని సబ్జెక్టులను పూర్తి చేసేందుకు మరో రెండు అవకాశాలు ఇస్తారు. అంటే పరీక్ష పాసయ్యేందుకు మొత్తం మూడు అవకాశాలుంటాయన్నమాట. ఈ మూడుసార్లు ఫెయిలయితే వారిని సర్వీసులో కొనసాగించరు. టాపర్స్ కూడా... మొత్తం 136 మంది ఆఫీసర్లలో 133 మంది ఆఫీసర్లు ఒకటి లేదా రెండు సబ్జెక్ట్‌లలో ఫెయిలయ్యారు. ప్రధానంగా ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లలో కూడా వీరు ఫెయిల్ అయినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక రాసింది. పాసింగ్ ఔట్ పరేడ్‌లో మెడల్స్, ట్రోఫీలు పొందిన టాపర్స్ కూడా ఫెయిల్ అయినవారిలో ఉన్నారు. అకాడమీ చరిత్రలో ఇంతమంది ఫెయిల్ కావడం అరుదని ఓ అధికారి అన్నట్లు టైమ్స్ రాసింది. పరీక్షల్లో ఫెయిల్ కావడం సాధారణమేనని, కాని ఇలా గంపగుత్తగా 90 శాతం మంది ఫెయిల్ కావ డం ఇదే మొదటిసారని ఓ అధికారి అన్నారు. లా అండ్ ఆర్డర్ వంటి ప్రాథమిక సబ్జెక్ట్‌లలో కూడా చాలా మంది ఫెయిల్ అయినట్లు పత్రిక రాసింది. ఇక్కడ పొందే మార్కులు సీనియారిటీ విషయంలో కీలకపాత్ర పోషిస్తాయి. అందుకే ఇక్కడి పరీక్షలను చాలా మంది సీరియస్‌గా తీసుకుంటారు. హైదరాబాద్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఈ శిక్షణ 45 వారాల పాటు సాగుతుంది. -
విశాఖ జిల్లా కంచరపాలెం బ్యాంక్ దోపిడికి యత్నం
-
అబ్బాయి ఫెయిల్.. కుటుంబం పండుగ..!!
భోపాల్, మధ్యప్రదేశ్ : పదో తరగతిలో ఫెయిల్ అబ్బాయినో లేక అమ్మాయినో ఇంట్లో ఏమంటారు?. ఏం చదివావు ఏడాదిగా అని ప్రశ్నిస్తారు. తప్పినందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. మధ్యప్రదేశ్‌లోని ఓ కుటుంబం మాత్రం ఇందుకు విభిన్నంగా స్పందించి స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. పదో తరగతి తప్పిన అబ్బాయి చేతికి పుష్పగుచ్ఛం ఇచ్చి, వీధిలో అందరికీ స్వీట్స్ పంచిందా కుటుంబం. పెద్ద ఎత్తున మేళతాళాలతో ఊరేగింపును నిర్వహించింది. టపాసులు పేల్చింది. ఎందుకిలా చేస్తున్నారని స్థానికులు అడిగిన ప్రశ్నకు పరీక్షల్లో తప్పినందుకు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని, జీవితంలో ఇది ఒక్కటే చివరి పరీక్ష కాదని చెప్పడానికే ఇలా చేస్తున్నామని బాలుడి కుటుంబ సభ్యులు వివరించారు. నాలుగు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాయని చెప్పిన కొడుకు అన్షును తండ్రి సురేంద్ర గట్టిగా కౌగిలించుకున్నారని, అనంతరం స్నేహితులకు, బంధువులకు ఫోన్లు చేసి రప్పించారని పేర్కొన్నారు. ఈ ఘటనతో అన్షు ఆశ్చర్యపోయాడని వివరించారు. దీంతో బాలుడి తండ్రి పాజిటివ్ థింకింగ్‌కు ఫిదా అయిన స్థానికులు కూడా ఊరేగింపులో పాల్గొన్నారు. ఊరేగింపు అనంతరం మాట్లాడిన బాలుడు తనకు చదువుకోవాలని లేదని, తండ్రి ట్రాన్స్‌పోర్టు బిజినెస్‌ను కొనసాగించాలని భావిస్తున్నట్లు వెల్లడించాడు. సోమవారం మధ్యప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాలు వెల్లడయ్యాయి. ఫలితాలు వెలువడిన గంటల్లోనే దాదాపు 11 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
ఆ రెండు పార్టీలకు పతనం తప్పదు..కొట్ల
దేవనకొండ : వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలకు పతనం తప్పదని కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి అన్నారు. గురువారం దేవనకొండలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రధాని మోదీ ప్రభుత్వం కుప్పకూలిపోతుందన్నారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టీడీపీ పాలనకు ప్రజలే చరమగీతం పాడుతారన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రేమనాథరెడ్డి, అలారుదిన్నె నారాయణరెడ్డి, బొజ్జప్పనాయుడు, సంపంగి గోవిందరాజులు, రాజాసాహెబ్, బండ్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
తెలుగులోనూ తప్పారు..!
సాక్షి, యాదాద్రి :ప్రతి ఏటా జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాల్లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం తగ్గిపోతోంది. ఇటీవల ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాల అనే తేడా లేకుండా విద్యార్థులు తెలుగులో రికార్డు స్థాయిలో విద్యార్థులు ఫెయిలయ్యారు. అర్ధశాస్త్రం, సివిక్స్, కామర్స్, ఇంగ్లీష్‌లో పెద్ద ఎత్తున తప్పారు. ప్రభుత్వ కళాశాలలతోపాటు ప్రైవేట్ కళాశాలల్లో కూడా ఈ పరిస్థితి నెలకొనడంతో విద్యాప్రమాణాలు తగ్గుతున్నాయా అన్న అనుమానాలను పలువురు విద్యావేత్తలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇలా.. జిల్లా వ్యాప్తంగా ఉన్న 59కళాశాలలు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ 11, గురుకుల 6, మోడల్ కళాశాలలు 6, 36ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ప్రథమ సంవత్సరంలో 59శాతం, ద్వితీయ సంవత్సరంలో 66శాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ సంవత్సరంలో 5,333మంది హాజరు కాగా 2,777మంది ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో 5,546మంది విద్యార్థులు హాజరు కాగా 3,307మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రథమ సంవత్సరంలో.. ప్రథమ సంవత్సరంలో అర్ధశాస్త్రంలో 1,104మంది ఫెయిలయ్యారు. సివిక్స్‌లో 984మంది, వాణిజ్యశాస్త్రంలో 879, ఇంగ్లీష్‌లో 721 మాతృభాష తెలుగులో 687మంది ఫెయిలయ్యారు. ద్వితీయసంవత్సరంలో.. ద్వితీయ సంవత్సరం సివిక్స్‌లో 1,111మంది అత్యధికంగా, వాణిజ్య శాస్త్రంలో 933 మంది, ఇంగ్లీష్‌లో 898, అర్ధశాస్త్రంలో 794, తెలుగులో 627మంది ఫెయిలయ్యారు. మాతృభాష తెలుగులో విద్యార్థులు పెద్ద ఎత్తున ఫెయిల్ కావడం తల్లిదండ్రులను సైతం ఆందోళనకు గురి చేస్తోంది. ప్రధాన సబ్జెక్టులతోపాటు తెలుగు, ఇంగ్లీష్‌లపై కూడా విద్యార్థులు పట్టు సాధించే విధంగా విద్యాబోధన చేయలేకపోతున్నారా అన్న అనుమానం వ్యక్తమవుతుంది. -
ఫెయిల్ అయ్యానని..
భూదాన్‌పోచంపల్లి (భువనగిరి) : ఇంటర్లో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో ఓ విద్యార్థి బలవర్మణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన శుక్రవారం మండలంలోని కనుముకులలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపి న వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా అర్వపల్లికి చెందిన కుంభం భద్రయ్య కుటుంబ సభ్యులతో 11 ఏళ్ల క్రితం వలస వచ్చి మండలంలోని కనుముకుల గ్రామానికి చెందిన రైతు కోట సత్తిరెడ్డికు చెందిన ఫౌల్ట్రిఫామ్‌లో పనిచేస్తున్నాడు. ఇతడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో పెద్ద కుమారుడైన కుంభం వంశీ(17) హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లోని నారాయణ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. శుక్రవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో వంశీ మ్యాథ్స్ సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయ్యాడని తెలుసుకొని మనస్తాపానికి గురయ్యా డు. మధ్యాహ్నం ఫౌల్ట్రీఫామ్ సమీపంలో గల తోటలో పురుగుల మందు తాగాడు. కాసేపటికి వాంతులు చేసుకుంటుండటంతో తల్లిదండ్రులు గమనించి, ఆరాతీయగా, పురుగుల మందు తాగానని తెలి పా డు. అతడిని చికిత్స నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రి అక్కడినుంచి హైదరాబాద్‌కు తీసుకెళుతండగా మార్గమధ్యలో మృతిచెందాడు. చౌటుప్పల్ ప్రభు త్వ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం మతదేహాన్ని స్వస్థలం అర్వపల్లికి తరలిం చారు. చేతికంది వచ్చిన కుమారుడు ఆత్మహత్యకు పాల్పడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. -
ఉదయం పాస్.. సాయంత్రానికి ఫెయిల్
కదిరి: ఎస్కేయూ డిగ్రీ ఫలితాలు విద్యార్థులను అయోమయంలో పడేశాయి. సోమవారం డిగ్రీ చివరి సంవత్సరం ఫలితాలు విడుదల కాగా ఉదయం ఉత్తీర్ణులైనట్లు చూపించిన ఫలితాలు... సాయంత్రంలోపు మారిపోయి ఫెయిల్ అయినట్లు చూపించాయి. ఇందుకు నిరసనగా డిగ్రీ విద్యార్థులు స్థానిక వేమారెడ్డి కూడిలి సమీపంలో కదిరి–హిందూపురం రహదారిపై రాత్రి సమయంలో గంటపాటు బైఠాయించారు. అదే సమయంలో అశోక్, అజయ్, ప్రతీష్, రవితేజ, త్యాగి, శ్రీకాంత్ అనే ఐదురుగు డిగ్రీ విద్యార్థులు అక్కడే సమీపంలోని సెల్ టవర్ ఎక్కి దూకేస్తామంటూ గట్టిగా కేకలు వేశారు. విద్యార్థులు రాస్తారోకోతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పట్టణ ఎస్ఐ హేమంత్ కుమార్ సంఘటనా స్థలానికి వచ్చి విద్యార్థులకు నచ్చజెప్పి రాస్తారోకో విరమింపజేశారు. అక్కడి నుంచి టవర్ దగ్గరకు చేరుకుని టవర్‌పైకి ఎక్కిన విద్యార్థులతో మాట్లాడారు. న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చి వారు దిగేలా చేశారు. -
వింత వ్యాధి.. కథ మళ్లీ మొదటికే!
ఢాకా : మాములు మనిషిగా మారేందుకు చెట్టు మనిషి ‘అబుల్ బజందర్’ చేసిన ప్రయత్నాలు విజయవంతం కాలేదు. వైద్యులు చేసిన సర్జరీలు ఫలించకపోగా.. ఇప్పుడు మళ్లీ అతని చేతిపై కుక్క గొడుగుల్లాంటి ఆకారాలు మొలవటం ప్రారంభమైంది. దీంతో అతను ఆందోళనకు గురవుతున్నాడు. 25 ఏళ్ల బజందర్ దాదాపు పన్నెండేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నాడు. 'ఎపిడర్మోడిస్ప్లాషియా వెర్రసిఫార్మిస్' అనే చర్మ వ్యాధి అతనికి సోకింది. అది కాస్త ముదరటంతో చెట్టు బెరడు లాంటి ఆకృతులతో ఉన్న అతడి రెండు చేతులు, కాళ్లు మీద పెరిగిపోగా.. ఆ బాధతో అతను నరకం అనుభవించాడు. 2016లో ఇతని గురించి మొదటిసారి వార్తలు వెలువడగా.. బంగ్లా ట్రీ మ్యాన్(చెట్టు మనిషిగా) అతని పేరు పాపులర్ అయిపోయింది. ఢాకాలోని మెడికల్ కాలేజీ ఆస్పత్రి అతనికి ఉచితంగా చికిత్స చేసేందుకు ముందుకొచ్చింది. శస్త్రచికిత్స ద్వారా వింత వ్యాధి నుంచి విముక్తి కలిగిస్తామని అతనికి వైద్యులు మనోధైర్యం కల్పించారు. చివరకు గతేడాది 24 సర్జరీలు చేసి వాటిని తొలగించటంతో.. ఇక మాములు మనిషిని అయిపోయానని అతను సంతోషించాడు. వైద్య శాస్త్రంలో ఇదో అరుదైన చికిత్స అని బంగ్లాదేశ్ వైద్యులు కూడా గర్వంగా ప్రకటించుకున్నారు. ఇక శస్త్ర చికిత్సల అనంతరం పరిశీలన కోసం ఏడాది నుంచి అతను ఆస్పత్రిలోనే ఉంచుతున్నారు. ఓ చిన్న గదిలో భార్య కూతురుతోపాటు అతను నివసిస్తున్నాడు. కొన్ని రోజులు గడిచాక సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. అతను మెరుగవటానికి కాస్త సమయం పట్టొచ్చని.. మరిన్ని శస్త్ర చికిత్సలు అవసరమని వైద్యుడు సమంత లాల్ సేన్ చెబుతున్నారు. కానీ, బజందర్ మాత్రం వణికిపోతున్నాడు. ‘‘ఇంక నాకు ఎలాంటి శస్త్ర చికిత్సలు వద్దు. నా కాళ్లు చేతులు బాగుపడతాయనే నమ్మకం పోయింది. నేను చనిపోయినా ఫర్వాలేదు. నన్ను బయటికి పంపించేయండి. నా కుటుంబాన్ని పోషించుకోవాలి. నా కూతురిని చదివించుకోవాలని’’ అంటూ వైద్యులను అతను వేడుకుంటున్నాడు. అయినప్పటికీ 25వ సర్జరీకి వైద్యులు సిద్ధమైపోయారు. ప్రపంచంలో ఇతనికి ముందు ముగ్గురు ఇలాంటి సమస్యను ఎదుర్కున్నారు. అయితే వారి విషయంలో కూడా శస్త్రచికిత్సలు పలించలేదని తెలుస్తోంది. అబుల్ బజందర్ సర్జరీకి ముందు.. ప్రస్తుతం -
దొంగలకే చుక్కలు చూపించిదెవరంటే...
-
దొంగలకే చుక్కలు చూపించిదెవరంటే...
పక్కా ప్లాన్‌తో వచ్చిన దొంగలకు అక్కడున్న గ్లాస్ కౌంటర్ చుక్కలు చూపించిన వైనం కెమెరాకు చిక్కింది. చోరాగ్రేసరుల రకరకాల చోళకళ గురించి మనం చాలానే విన్నాం. అయినా ఎక్కడో ఒక చోట ఒక చిన్న క్లూతో దొరికిపోవడం మామూలే. ముఖ్యంగా సీసీ టీవీలు వచ్చిన తరువాత పోలీసులకు ఈ పని మరింత సులువైంది. అయితే మలేసియాలోని ఓ జ్యుయలరీ షాపులో దొంగతనానికి వచ్చిన దొంగలకు అనుకోని చుక్కెదురైంది. ఎంత చోమటోడ్చినా ఫలితం దక్కకపోవడంతో తోకముడవక తప్పలేదు. ఈ దోపిడీ ప్రయత్నంచేసిన దొంగల ముఠాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నలుగురు దొంగల ముఠా సెక్యూరిటీని గన్‌తో బెదిరించి మరీ మలేషియాలోని ఒక ఆభరణాల దుకాణంలోకి ఎంటర్ అయింది. ముఖాలకు హెల్మెట్లు, సుత్తులు లాంటి సరుకు సరంజామాతో పనిలోకి దిగారు. తమ వెంట తెచ్చుకున్న సుత్తెలతో జ్యూయెలరీ షోరూమ్లోవున్న డిస్ ప్లే కౌంటర్ గ్లాసులను పగల కొట్టడానికి ట్రై చేశారు. ఒకరి తరువాత ఒకరు ఇద్దరు దొంగలు శతవిధాలా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. అది చాలా మందంగా వుండడంతో పాటు ప్రత్యేకంగా తయారు చేసినవికావడంతో ఆ గ్లాస్ పగల్లేదు. ఇక చేసేదేమీలేక అక్కడ నుంచి చల్లగా జారుకున్నారు. ఈ తతంగమంతా అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. కెడై ఇమాస్ శ్రీ ఆలం జ్యుయల్లరీ షోరూం లో సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. ఫేస్బుక్ లో దాదాపు 6 మిలియన్లకు పైగా వ్యూస్‌ను, వేలాది షేర్లను సొంతం చేసుకుంది. -
ఆ సిమ్‌కార్డ్ పనిచేయకపోతే భారీ పెనాల్టీ
న్యూఢిల్లీ: టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఇంటర్నేషనల్ రోమింగ్ సిమ్ కార్డ్, గ్లోబల్ కార్డ్ ప్రొవైడర్లకు భారీ షాక్ ఇచ్చింది. ఈమేరకు టెలికాం డిపార్ట్మెంట్ (డాట్)కు కీలక ప్రతిపాదనలు చేసింది.అంతర్జాతీయ సిమ్ కార్డు విఫలమైతే రూ. 5వేల నష్టపరిహారం చెల్లించాలని రికమెండ్ చేసింది. w పెనాల్టీ తోపాటు, కస్టమర్ చెల్లించిన ఫీజును 15రోజుల్లో వారికి చెల్లించాలని ప్రతిపాదించింది. ఖాతాదారుల విదేశీ ప్రయాణాల్లో సర్వీసుల్లో సేవల్లో అంతరాయం కలిగితే ప్రిపెయిడ్, పోస్ట్ పెయిడ్ ఖాతాదారులకు ఈ పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందని సూచించింది. అంతేకాదు ఆయా సర్వీసు ప్రొవైడర్ల అనుమతిని రద్దు చేయాలని కూడా సూచించింది. విక్రయించిన మొత్తం అంతర్జాతీయ సిమ్ కార్డులలో 10 శాతం పనిచేయకపోతే అటువంటి కంపెనీల అనుమతి రద్దు చేయవచ్చని కూడా రెగ్యులేటరీ సూచించింది. ఈ మేరకు అంతర్జాతీయ సిమ్ కార్డు విక్రేతలు గ్రీవెన్స్ రెడ్రెస్సల్ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని రెగ్యులేటర్ సిఫార్సు చేసింది. తద్వారా కస్టమర్ల ఫిర్యాదులను సతర్వమే పరిష్కరించాలని కోరింది. అలాగే డిజిటల్ మోడ్‌లో మాత్రమే అంతర్జాతీయ కాలింగ్ కార్డులను, అంతర్జాతీయ సిమ్ కార్డులను కొనుగోలు చేయాలని ట్రాయ్ సిఫార్సు చేసింది. ముఖ్యంగా నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ లేదా డెబిట్ కార్డు, ఇ-వాలెట్ ద్వారా ఈ కోనుగోళ్లు చేయాలని కోరింది. మరోవైపు ఈ సమస్యపై చర్చల పిలుపునకు స్పందించని 23 కంపెనీల అనుమతి రద్దు చేయాలని కూడా ట్రాయ్ ఆలోచిస్తోంది. కాగా ఈ కార్డులపై ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలోఇటీవల రెగ్యులేటర్ నిర్వహించిన ఎస్ఎంస్ ఆధారిత సర్వే లో దాదాపు సగం మంది వినియోగదారుల ఇంటరర్నేషనల్ కార్డు సేవలు అస్సలు పనిచేయకపోవడం లేదా పాక్షికంగా పని చేస్తున్నాయని తేలింది. దీంతో ట్రాయ్ ఇంటర్నేషనల్ రోమింగ్ సిమ్ కార్డ్, గ్లోబల్ కార్డ్ ప్రొవైడర్లతో చర్చలు నిర్వహించింది. -
అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తున్నారు
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు ధ్వజం గాదరాడ (కోరుకొండ) : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలను నిత్యం మోసం చేస్తున్నాడని, ప్రజలు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అన్నారు. ఆదివారం కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలో వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో గడపగడపకూ వైఎస్సార్ జరిగింది. కార్యక్రమంలో కన్నబాబు, జక్కంపూడి విజయలక్ష్మి, పార్టీ యూత్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాజాల వద్దకు గ్రామంలోని పలువురు మహిళలు, రైతులు, యువత, వృద్ధులు, వికలాంగులు వచ్చి పలుసమస్యలను ఏకరువుపెట్టారు. ఈ సందర్భంగా కురసాల మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగ¯ŒSమోహ¯ŒSరెడ్డిపై నమ్మకం, దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖరరెడ్డిపై ప్రేమ రోజురోజుకు పెరుగుతుందన్నారు. చంద్రబాబుకు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నమ్మి ఓట్లు వేసి మోసపోయామని అనేక మంది ప్రజలు తమ వద్దకు వచ్చి చెబుతున్నారన్నారు. ప్రజల పక్షాన నిలిచే నాయకులపై చంద్రబాబు అక్రమ కేసులు బనాయిస్తున్నాడని, వాటికి భయపడేది లేదని, ప్రజలపక్షాన నిలుస్తామన్నారు. ప్రతిపక్ష నేతగా జగన్ నిత్యం ప్రజలతో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారన్నారు. జగ¯ŒSమోహ¯ŒSరెడ్డిని స్పూర్తిగా తీసుకొని ఆయన బాటలోనే నిరంతరం పనిచేస్తామన్నారు. అమరావతిలో నేటికి ఏటువంటి అభివృధ్ధి జరగలేదని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ చంద్రబాబు పాలన దోచుకుని తినడమేనని అన్నారు. వైఎస్సార్ సీపీ యూత్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, పార్టీ ప్రచారకమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, కాకినాడ రూరల్ నియోజకవర్గ నాయకులు పుల్లా కోటేశ్వరరావు, శెట్టి బాబూరావు, జవ్వాది సతీష్, రాజమహేంద్రవరం కార్పొరేటర్ బొంతా శ్రీహరి, పార్టీ జిల్లా కార్యదర్శులు అడబాల చినబాబు, కార్మిక సంఘం జిల్లా నాయకులు నిడిగట్ల బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. -
ట్రంప్ వైఫ్యలం తప్పదు..మార్కెట్ల కల కల్లే..
ఒక పక్క అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతోంటే.. మరోపక్క కోటీశ్వరుడు, పెట్టుబడిదారుడు జార్జ్ సోరోస్ మాత్రం ట్రంప్ విఫలం కావడం తధ్యమని జోస్యం చెప్పారు. అంతేకాదు మార్కెట్ల కల ఇక ముగిసినట్టే నని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడుగా డోనాల్డ్ ట్రంప్ చేపటనున్న విధానాలతో అంతర్జాతీయ మార్కెట్లలో మరింత అనిశ్చితి కొనసాగనుందని బిలియనీర్ ఇన్వెస్టర్ జార్జ్ సోరోస్ అభిప్రాయపడ్డారు. స్విట్జర్లాండ్ లోని దావూస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన వార్షిక సమావేశంలో బ్లూమ్ బర్గ్ తో మాట్లాడిన సోరస్ గురువారం ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మార్కెట్ల అనిశ్చితి పీక్ స్టేజ్ లోఉందన్నారు. ఇకముందు మార్కెట్టు మరింత తడబాటుకు గురవుతాయని, ఇంతకంటే బావుంటాయని తాను భావించడంలేదన్నారు. మొత్తంమీద ట్రంప్ విఫలం కానున్నాడని తాను వ్యక్తిగతంగా విశ్వశిస్తున్నానన్నారు. ముందు ముందు ఎలా వ్యవహరించనున్నాడనే దాన్ని అంచనావేయడం కష్టమని పేర్కొన్నారు. అమెరికా వాస్తవ ఆర్థిక వ్యవస్థ మరింత ఆర్థిక మాంద్యంలోకి కూరుకు పోనున్నదని సొరోస్ హెచ్చరించారు. ఇతర దేశాల ప్రజలు.. చైనీయులు, చమురు ఉత్పత్తి దేశాల ప్రజలు డాలర్ నిల్వలను పోగేసుకున్నారని, ఈ సంక్షోభ కాలంలో వీటిని వాస్తవ సంపదలుగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని సోరోస్ చెప్పారు. కాబట్టే ఈ దేశాలు ఇప్పుడు సంపన్నదేశాలుగా మారుతుండడతో, అమెరికన్లకు మరింత రుణాభారం మీదపడుతోందని పేర్కొన్నారు. ఇంధనం, భూతాపం, ఇంధన పరాధీనతకు సంబంధించిన సమస్యలపై తలపడేందుకు భారీస్థాయిలో పెట్టుబడులు అవసరమని సోరోస్ పేర్కొన్నారు. ఆర్థికవృద్ధిలో చైనా దూసుకుపోతుందన్నారు. నవంబర్ 8 ట్రంప్ గెలుపు తర్వాత అమెరికా మార్కెట్లు భారీగా లాభపడిన సంగతి విదితమే. అలాగే బ్రిటన్ ప్రధాని థెరిసా మే పదవిలో కొనసాగుతారని వ్యాఖ్యానించారు. ప్రధాని మే మంగళవారం బ్రిటన్ యూరోపియన్ యూనియన్ నుంచి నిష్క్రమణ చర్చలు కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్న నేపథ్యంలో, బ్రెగ్జిట్ పరిణామాలు రెండు వైపులా ప్రభావితం చేయనున్నాని చెప్పారు. కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా డెమొక్రటిక్ పార్టీ హిల్లరీ క్లింటన్ కి జార్జ్ సోరోస్ సుమారు13 మిలియన్ డాలర్లు (సుమారుగా రూ.86 కోట్లు) విరాళం ప్రకటించారు. వైట్‌హౌస్‌లోకి రిపబ్లికన్నేత ఎవరూ రావడానికి వీల్లదేని ఆయన తెగేసి చెప్పారు. వలసవాదానికి, ఇస్లాంకు వ్యతిరేకంగా తీవ్రమైన విధానాన్ని వారు ఎంచుకున్నారంటూ రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్‌ల ప్రచార తీరుతెన్నులపై అప్పట్లో మండిపడిన సంగతి తెలిసిందే. -
వంశధార నిర్వాసితులతో చర్చలు విఫలం
శ్రీకాకుళం: హిర మండలం పాడలి గ్రామంలో వంశధార నిర్వాసితులతో అధికారులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. నాలుగు రోజుల క్రితం ఆందోళన నిర్వహించిన నిర్వాసితులు నిర్మాణ పనులు ఆపించారు. పాలకొండ ఆర్డీవో రెడ్డి గున్నయ్య, తహశిల్దార్ కాళీప్రసాద్, డీఎస్పీ ఆదినారాయణలు వంశధార పనులకు సహకరించాలని కోరుతూ నిర్వాసితులతో ఆదివారం చర్చించారు. అయితే అధికారుల సమాధానంతో నిర్వాసితులు సంతృప్తి చెందలేదు. -
ఉద్దేశ్యం మంచిదే.. ఆచరణలో వికటించింది
రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు దేవీచౌక్, కల్చరల్ (రాజమహేంద్రవరం) : పెద్ద నోట్ల రద్దు ఉద్దేశ్యం మంచిదే అయినా, ఆచరణలో వికటించిందని చాంబర్ ఆఫ్ కామర్సు రాష్ట్ర కన్వీనర్ అశోక్‌కుమార్ జై¯ŒS అన్నారు. లోక్‌సత్తా పౌర నిఘా వేదిక ఆధ్వర్యంలో కోటిపల్లి బస్టాండు సమీపంలోని ఇండియా ఇండిపెండె¯Œ్స సెంటరులో ఆర్థిక నిపుణులు, న్యాయవాదులు, రాజకీయవేత్తలు, ప్రజాసంఘాల ప్రతినిధులతో పెద్ద నోట్ల రద్దులో చట్ట నిబద్ధత అనే అంశంపై సోమవారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో జై¯ŒS మాట్లాడారు. నోట్ల రద్దు సంగతి కొందరికి ముందే తెలిసిపోయిందన్నారు. సీపీఐ నాయకుడు మీసాల సత్యనారాయణ మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు ప్రజలను మభ్యపెట్టడానికేనన్నారు. లోక్‌సత్తా ఉద్యమ సంస్థ కార్యకర్త జె.రవి మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల కొమ్ముకాస్తోందని విమర్శించారు. జిల్లా వినియోగదారుల హక్కుల పరిరక్షణ సమితిప్రతినిధి బీఎ¯ŒS వర్మ మాట్లాడుతూ ప్రభుత్వాలు సీబీఐ వంటి దర్యాప్తు సంఘాలను దుర్వినియోగం చేస్తున్నాయన్నారు.రాష్ట్ర బార్ అసోసియేష¯ŒS అధ్యక్షుడు ముప్పాళ సుబ్బారావు సమావేశానికి పంపిన సందేశంలో ముందుగానే అస్మదీయులకు లీకులు ఇచ్చి, అన్నీ సర్దుకున్నాక ఈ ప్రకటన చేశారని ధ్వజమెత్తారు. ప్రముఖ న్యాయవాది మద్దూరి శివసుబ్బారావు మాట్లాడుతూ హోం వర్కు చేయకుండా తీసుకున్న చర్య అన్నారు. ఖాతాదారునిపై నిబంధనలు విధించడం చట్ట విరుద్ధమని లోక్‌సత్తా పౌర నిఘా వేదిక కన్వీనర్ ఎంవీ రాజగోపాల్ పేర్కొన్నారు. సభకు అధ్యక్షత వహించిన రాష్ట్రపతి అవార్డు గ్రహీత చింతపాటిశర్మ మాట్లాడుతూ సముద్రంలో నీరు ఎంత ఉన్నా, దాహం తీరడానికి గుక్కెడు నీరు లేకపోతే ప్రయొజనం లేదన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మ¯ŒS అల్లు బాబి మాట్లాడుతూ హీరోలు కావాలనుకుని నేతలు జీరోలయ్యారని విమర్శించారు. ఆడిటర్ టి.వీరభద్రరావు, న్యాయవాది వల్లూరి సురేష్, జె.కాళేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
రిజిస్ట్రేషన్లు ఢమాల్
అనంతపురం టౌన్ : బ్యాంకులన్నీ మూతపడిన నేపథ్యంలో ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే స్టాంప్స్ అండ్ రిజిసే్ట్రష¯Œ్స శాఖలో బుధవారం రిజిసే్ట్రషన్లు అమాంతం తగ్గిపోయాయి. అనంతపురం, హిందూపురం జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో 21 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. రోజూ సుమారు 700 నుంచి 800 వరకు డాక్యుమెంట్లు రిజిసే్ట్రష¯ŒS అయ్యేవి. అయితే రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో కార్యాలయాలన్నీ బోసిపోయాయి. వందకు మించి రిజిసే్ట్రషన్లు కాలేదు. యాడికి, కణేకల్లు వంటి గ్రేడ్–2 కార్యాలయాల్లో అసలు రిజిసే్ట్రష¯ŒS ప్రక్రియే ప్రారంభం కాలేదు. బ్యాంకులు కూడా మూసివేయడంతో చలానాలు కట్టలేని పరిస్థితి నెలకొంది. ఇంతకుముందే చలానా కట్టినవారు మాత్రమే కార్యాలయాలకు వచ్చి తమ పనులు చేసుకుని వెళ్లారు. బ్యాంక్ రుణాలకు సంబంధించి రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఒక్కరోజే సుమారు రూ.50 లక్షల వరకు శాఖ ఆదాయాన్ని కోల్పోయింది. అనంతపురం రిజిసే్ట్రష¯ŒS కార్యాలయంలో రోజూ 70 డాక్యుమెంట్ల రిజిసే్ట్రష¯ŒS జరిగేవి. బుధవారం మాత్రం 15కు మించలేదని సబ్ రిజిస్ట్రార్ తాయన్న తెలిపారు. రూరల్ కార్యాలయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. గురువారం ఒక్క రిజిసే్ట్రష¯ŒSకు కూడా అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. -
ఎన్‌సీడీలపై వడ్డీ చెల్లింపుల్లో మరోసారి జేఎస్పీఎల్ విఫలం
న్యూఢిల్లీ: నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ (ఎన్సీడీ) హోల్డర్లకు వడ్డీ చెల్లింపుల్లో జిందాల్ స్టీల్ అండ్ పవర్ (జేఎస్పీఎల్) మరోసారి విఫలం అరుు్యంది. ఎన్‌సీడీలకు గడువు ప్రకారం అక్టోబర్ 31 లోపు రూ.15.43 కోట్ల మేర వడ్డీ చెల్లించాల్సి ఉండగా, అందులో విఫలమైనట్టు స్వయంగా కంపెనీయే బీఎస్ఈ, ఎన్ఎస్ఈలకు సమాచారం ఇచ్చింది. అంతకుముందు సెప్టెంబర్‌లోనూ గడువు తేదీ 30 నాటికి ఎన్‌సీడీలపై వడ్డీ చెల్లింపుల్లో జేఎస్పీఎల్ విఫలమైన విషయం విదితమే. నవీన్ జిందాల్‌కు చెందిన జేఎస్పీఎల్ రూ.46,000 కోట్ల రుణభారంతో సతమతం అవుతోంది. దీన్ని తగ్గించుకునేందుకు గత కొన్ని నెలల కాలంలో కంపెనీ ఆస్తుల విక్రయాలకు ప్రయత్నాలు సాగిస్తోంది. సతారాలోని 24 మెగావాట్ల విండ్ పవర్ ప్లాంట్‌ను ఇండియా ఇన్‌ఫ్రాస్టక్చ్రర్ ఫండ్-2కు విక్రరుుంచనున్నట్టు కంపెనీ అక్టోబర్‌లో ప్రకటించింది. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో ఉన్న వెరుు్య మెగా వాట్ల విద్యుత్ ప్లాంట్ విక్రయానికీ ఒప్పందం కుదుర్చుకుంది. -
ఉగ్రవాద నిర్మూలనలో మోదీ విఫలం: కాంగ్రెస్
న్యూఢిల్లీ: ఉడీ తరహా దాడిని అడ్డుకునేలా సరైన చర్యలు తీసుకోవడంలో ప్రధాని మోదీ విఫలమయ్యారని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఉగ్రవాదాన్ని ఉక్కు పిడికిలితో నిర్మూలిస్తామన్న మోదీ ఎన్నికల వాగ్దానం మోసపూరితమని తేలిపోయిందంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సూర్జేవాలా విమర్శించారు. కొజికోడ్ సభలో ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు తీసుకునే చర్యల్ని వెల్లడించడంలో మోదీ విఫలమయ్యారన్నారు. తన వాగ్బాణాలతో మోదీ పాక్‌ను నాశనం చేశారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ ట్వీట్ చేశారు. -
ఏటీఎంలో చోరీకి యత్నం
సెక్యూరిటీగార్డుపై దాడి చిలకలపూడి స్టేషన్లో కేసు నమోదు మచిలీపట్నం(కోనేరుసెంటర్) : ఏటీఎంలో చోరీకి గుర్తు తెలియని దుండగులు యత్నించారు. సెక్యూరిటీగార్డు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. విఫలం కావటంతో ఉడాయించారు. ఈ సంఘటన మచిలీపట్నంలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు అందించిన వివరాలు.. పట్టణంలోని చిలకలపూడి స్టేట్‌బ్యాంకు ఏటీఎం ఉంది. సెక్యూరిటీ గార్డుగా పంబలగూడేనికికు చెందిన గాలంకి శ్రీహరిబాబుlపనిచేస్తున్నాడు. సుమారు 2 గంటల సమయంలో గుర్తు తెలియని ముగ్గురు ముసుగులు వేసుకుని ఏటీఎం లోనికి వెళ్లారు. నాలుగో వ్యక్తి రోడ్డుపై నిలబడ్డాడు. ఏటీఎంలోకి వెళ్లిన ముగ్గురు ఒక్కసారిగా శ్రీహరి తలకు గుడ్డ చుట్టి ఏటీఎం లాకర్ నంబరు చెప్పమంటూ బెదిరించారు. తెలియదని బదులు ఇవ్వటంతో సుత్తులతో అతని తలపై చక్షణారహితంగా కొట్టారు. మిషన్‌ను బద్దలు కొట్టి డబ్బు బయటికి తీసేందుకు ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోవటంతో గత్యంతరంలేని దుండగులు అక్కడి నుంచి బైక్‌లపై చిలకలపూడి రైల్వేస్టేషన్ వైపు ఉడాయించారు. తీవ్రగాయాపాలైన శ్రీహరి తేరుకుని జరిగిన విషయాన్ని ఫోన్లో తన సోదరుడికి సమాచారం ఇచ్చాడు. విషయం తెలుసుకున్న శ్రీహరి సోదరుడు అక్కడికి చేరుకుని చికిత్స నిమిత్తం బందరు ప్రభుత్వాస్పత్రికి తరలించాడు. డీఎస్పీ పరిశీలన.. సమాచారం అందుకున్న డీఎస్పీ డీఎస్ శ్రావణ్‌కుమార్ ఏటీఎం సెంటర్‌ను పరిశీలించారు. క్లూస్‌టీం సిబ్బంది వేలిముద్రలు సేకరించగా, రంగంలోకి దిగిన డాగ్‌స్వా్కడ్ ఏటీఎం నుంచి చిలకలపూడి రైల్వేస్టేషన్ వైపు వెళ్లి ఆగిపోయింది. కాగా బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జనార్దన్, నాగరాజు తెలిపారు. దుండగులను సీసీ పుటేజీల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తామని చెప్పారు. -
యాజమాన్య కమిటీ వైఫల్యంతోనే నీటి ఎద్దడి
రైతుల పట్ల పాలకులకు కొరవడిన చిత్తశుద్ధి వైఎస్సార్ సీపీ జిల్లాఅధ్యక్షుడు కన్నబాబు కరప మండలంలో కాలువలు, చేల పరిశీలన విజయరాయుడుపాలెం(కరప): నీటి యాజమాన్య కమిటీ వైఫల్యం వల్లే కరప మండలంలో సాగునీటి సమస్య ఎదురైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లాఅధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అన్నారు. మండలంలోని విజయరాయుడుపాలెం, పెద్దాపురప్పాడు గ్రామాల్లో గురువారం ఆయన రైతులతో కలసి పంటపొలాలను, కాలువలను పరిశీలించారు. కాలువల్లో నీటిమట్టం పెరిగినా పంటపొలాలు తడవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. ‘మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నీటి ఎద్దడి రాగా ఎప్పటికప్పుడు ఇరిగేషన్ అధికారులతో చర్చించి, సాగునీరందించేందుకు చర్యలు తీసుకునేవారు. ఇప్పుడు పట్టించుకునేవారే లే’రని వాపోయారు. ఆందోళన పడవద్దని, పూర్తిస్థాయిలో సాగునీరు సరఫరా చేసేందుకు ఇరిగేషన్ అధికారులతో సంప్రదిస్తానని కన్నబాబు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ గోదావరిలో పుష్కలంగా నీరున్నా ఇక్కడ సాగునీటి ఎద్దడి ఏమిటని ప్రశ్నించారు. నేటి పాలకుల్లో రైతుల పట్ల చిత్తశుద్ధి కొరవడిందన్నారు. నీటి యాజమాన్య కమిటీ వైఫల్యంతో పాటు అధికారుల నిర్లక్ష్యం కనబడుతోందన్నారు. కాలువలోకి వచ్చిననీరంతా కిందకే పోతోందని, డీపీలు మూయించి వేసి, రాత్రి సమయంలో కాపలా పెట్టించాలని, అప్పుడే పంటపొలాలు తడుస్తాయని రైతులు తెలిపారు. ఇరిగేషన్ ఈఈ అప్పలనాయుడుతో సంప్రదించి, నీరొచ్చేలా చర్యలు తీసుకోమని కోరినట్టు కన్నబాబు తెలిపారు. కాపవరం వంతెనవద్ద సెంట్రింగ్ తొలగించి, పంటకాలువలోని తూడుకాడ, గుర్రపుడెక్క తొలగిస్తున్నామని, శుక్రవారానికల్లా నీరందుతుందని ఈఈ చెప్పారని రైతులకు తెలిపారు. రైతుల పక్షాన నిలబడి పంటపొలాలు తడిసేలా చూస్తామని, పరిస్థితిని చక్కదిద్దుతామని భరోసా ఇచ్చారు. నడకుదురు ఎంపీటీసీ జవ్వాది సతీష్, పెద్దాపురప్పాడు మాజీ సర్పంచ్ గొల్లపల్లి ప్రసాదరావు, రైతులు వెలుగుబంట్ల సీతారామరాఘవ, నున్న వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఇంజక్షన్ వికటించి తొమ్మిది మేకలు మృతి
రణస్థలం : రణస్థలం పంచాయతీ పిట్టపాలేం గ్రామానికి చెందిన ఆవల లక్ష్మణరావుకు చెందిన తొమ్మిది మేకలు సోమవారం ఉదయం మృతి చెందాయి. లక్ష్మణరావుకు 15 మేకలు ఉండగా ఇందులో ఒక మేకకు జబ్బు చేసి చనిపోవటంతో సమీపంలోని రిటైర్డ్ జూనియర్ వెటర్నరీ అధికారి ఆర్ఎస్ఎన్ పట్నాయిక్‌కు విషయం తెలియజేశారు. మేక చనిపోయిందని మిగతా మేకలకు ఎటువంటి జబ్బు రాకుండా మందులు వేయాలని లక్ష్మణరావు కోరడంతో సోమవారం ఉదయం రిటైర్డ్ వైద్యులు పట్నాయిక్ పిట్టపాలేం వెళ్లి మేకలకు ఇంజక్షన్లు చేశారు. 14 మేకలకు ఇంజక్షన్లు చేయగా చేసిన 5 నిమిషాలకే ఒక్కొక్కటి చొప్పున ఎనిమిది మేకలు మృతి చెందాయి. విషయం తెలుసుకున్న మండల పశు వైద్యాధికారులు బి.దుర్గారావు, రవికుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మందు తీవ్రతను మేకలు తట్టుకోలేకపోయాయని సమయంలో విరుగుడు ఇవ్వలేకపోవటం వల్ల చనిపోయాయని వైద్యులు చెప్పారు. బాధితునికి శాఖ తరఫున సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. తమను ఆదుకోవాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరారు. రిటైర్ట్ వైద్యులు పట్నాయిక్ మాట్లాడుతూ తాను సరిగానే ఇంజక్షన్లు చేశానని జబ్బు వల్ల చనిపోయి ఉంటాయని చెప్పారు. -
సమస్యల పరిష్కారంలో బాబు విఫలం
నల్లమాడ: సమస్యల పరిష్కారంలో ముఖ్య మంత్రి చంద్రబాబు విఫలమయ్యారని రైతులు, మహిళలు, వృద్ధులు ధ్వజమెత్తారు. ఆదివారం మండలంలోని మీసాలవాండ్లపల్లి, కొండకిందతండా, వేళ్లమద్ది, కొత్తపల్లితండాలో గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమం నిర్వహించారు. గడప గడపకూ కార్యక్రమంలో భాగంగా పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయకర్త ఇళ్లిళ్లూ తిరుగుతూ కరపత్రం పంచుతూ పలు సమస్యలు ప్రస్తావించారు. ఈ సందర్భంగా సీసీ రోడ్లు, డ్రైనేజీ, రేషన్‌కార్డులు, పింఛన్లు, ఇళ్లు తదితర సమస్యలను శ్రీధర్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. రాబోయే ఎన్నికల్లో జగనన్న సీఎం అయితే మన సమస్యలు అన్నీ పరిష్కారం అవుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అనంతరం కొత్తపల్లితండాలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజధాని హైదరాబాదులో 10 సంవత్సరాల వరకూ హక్కు ఉన్నా.. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు ఇరుక్కుపోయి కేసీఆర్ భయంతో అమరావతిలో తూతూ మంత్రంగా బ్లాకులు నిర్మిస్తున్నారన్నారు. అత్యంత వెనుకబడి కరువు బారిన పడ్డ అనంతపురం జిల్లాను మంత్రులు, ఎమ్మెల్యేలు ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. హంద్రీనీవా పనులు పూర్తి చేసి జిల్లాలో ప్రతి నీటి కుంటలకు నీరు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పుట్టపర్తి నియోజకవర్గంలో అభివృద్ధిని విస్మరించారన్నారు. సమస్యలు పరిష్కరించలేని మంత్రిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి డీఎస్ కేశవరెడ్డి, కార్యదర్శి దుద్దుకుంట సుధాకర్‌రెడ్డి, సేవాదళ్ సభ్యుడు ఏఎన్ చంద్రశేఖర్‌రెడ్డి, చారుపల్లి, రెడ్డిపల్లి సర్పంచులు ప్రతాపరెడ్డి, కె.సూర్యనారాయణ, బుక్కపట్నం సింగల్‌విండో అధ్యక్షుడు విజయరెడ్డి, కర్వీనర్ సుధాకర్‌రెడ్డి, సర్పంచ్ గంగమనాయుడు, గ్రామ కమిటీ అధ్యక్షులు పురుషోత్తంయాదవ్, అశోక్‌కుమార్‌యాదవ్, రజనీకాంతరెడ్డి, ఆనంద్, మోహన్‌దాస్, జయమ్మ, సింగల్‌విండో మాజీ డైరెక్టర్ బొజ్జేనాయక్, నాయకులు న్యాయవాది రామచంద్రారెడ్డి, విజయభాస్కరరెడ్డి, సీతారాం, కె. సురేష్, నాగార్జున, పక్కీర్‌నాయక్, గిరినాయక్, ఎర్ర సూరి, గంగిరెడ్డి, సుధాకర్ పాల్గొన్నారు. -
‘ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు’
పాత శ్రీకాకుళం: అధికారం చేపట్టిన రెండేళ్ల పాలనలో టీడీపీ, బీజేపీలు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని డీసీసీ అధ్యక్షుడు డోల జగన్, పీసీసీ అధికార ప్రతినిధి రత్నాల నర్సింహమూర్తి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 22న ప్రవేశపెట్టనున్న ప్రత్యేక హోదా బిల్లుకైనా మద్దతు ఇవ్వాలని కోరారు. దీనిపై ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. -
ఒక్క మార్కుతో ఫెయిలైన విద్యార్ధి
-
ఆ పరీక్ష రాసిన అందరూ ఫెయిల్!
అజ్మీర్: రాజస్థాన్ లోని ఓ ప్రభుత్వ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్(ఐటీఐ) మొదటి సంవత్సరం తొలి సెమిస్టర్ రాసిన విద్యార్ధులందరూ అన్ని సబ్జెక్టుల్లో ఫెయిలయ్యారు. అంతకంటే ఆశ్చర్యకరమైన మరో విషయం ఈ పరీక్షల్లో యాభై శాతం ప్రశ్నలు అబ్జక్టివ్ టైప్ కావడం. శనివారం ఫలితాలను చూసుకున్న విద్యార్థులు షాక్ కు గురయ్యారు. అందరికీ ప్రాక్టికల్, థియరిటికల్ పరీక్షల్లో సున్నా మార్కులు రావడంతో జోథ్ పూర్ లో నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్(ఎన్సీవీటీ)కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థులందరికీ సున్నా మార్కులు రావడాన్ని తాము నమ్మడం లేదని టీచర్లు తెలిపారు. దీనిపై విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టరుకు విద్యార్థులు వినతి పత్రాన్ని అందజేశారు. విద్యార్థులందరికీ సున్నా మార్కులు రావడంపై షాక్ కు గురయ్యామని కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు. పరీక్షా ఫలితాలపై యూనివర్సిటీకు లేఖ రాసినట్లు వివరించారు. కాగా, ఈ నెల 27తో తదుపరి సెమిస్టర్ ఫీజు చెల్లింపు తేది ముగుస్తుంది. ఒకవేళ విద్యార్థులు తదుపరి సెమిస్టర్ ఫీజును చెల్లిస్తే, ప్రస్తుత ఫలితాలను అంగీకరించి సప్లిమెంటరీలో వాటిని క్లియర్ చేయాల్సివుంటుంది. ఇప్పటిలానే పోరాటం కొనసాగిస్తే ఒక విద్యాసంవత్సరాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ నేపధ్యంలో యూనివర్సిటీ త్వరగా సమాధానం ఇస్తే బాగుంటుందని ఆశిస్తున్నారు. -
9 ఏళ్లగా ఇంజనీరింగ్ పరీక్షలు రాస్తున్నారు!
82 మంది విద్యార్థులు గత తొమ్మిది సంవత్సరాలుగా బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ పరీక్షలు రాస్తూ ఫెయిలవుతున్నారు. ఈ కాలంలో కనీసం ఒక విద్యార్థి 12 నుంచి 15 సార్లు ఫెయిలయిన పేపర్లనే రాశారు. అయినా, వీరి పాస్ కాకపోతుండటంతో గుజరాత్ యూనివర్సిటీ వీరిని దృష్టిలో ఉంచుకుని వెబ్ సైట్ లో మెటీరియల్ ను కూడా అందుబాటులో ఉంచింది. అంతేకాకుండా కచ్చితంగా వెబ్ సైట్ లో ఉన్న మెటీరియల్ నుంచే పరీక్షల్లో ప్రశ్నలు వచ్చేలా నిబంధనలు కూడా తెచ్చింది. అయినా, మార్పు లేదు. అదే తంతు. 82 మందిలో ఒక్కరంటే ఒక్కరు కూడా ఒక్క సబ్జెక్టులోనైనా ఉత్తీర్ణత సాధించలేకపోయారు. కాగా, వీరందరికి పరీక్షల్లో కాపీలు అందిచినా ఉత్తీర్ణులు కాలేరనే జోక్ క్యాంపస్ లో వినిపిస్తోంది. చదువుపై విద్యార్థుల అలసత్వంతో విసిగిపోయిన యూనివర్సిటీ యాజమాన్యం ఈ సారి నిర్వహించబోయే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని వారిని తిరిగి మొదటి ఏడాది నుంచి గుజరాత్ టెక్నలాజికల్ యూనివర్సిటీ(జీటీయూ)లో చేరుస్తామని ప్రకటించింది. జీయూ 2007లో జీటీయూగా మారింది. కాగా, అప్పటికే ఆ ఏడాది బ్యాచ్ లు ప్రారంభంకావడంతో వారందరికి జీయూ కిందే పరీక్షలు నిర్వహిస్తూ వస్తోంది. కాదా, విద్యార్థులు అందరూ గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేసుకుని బీఈ పట్టాని అందుకోగా, 82 మంది మాత్రం మిగిలిపోయారు. కాగా, వీరందరి చేత బీఈని పూర్తి చేయించేందుకు జీయూ ఆపసోపాలు పడాల్సివస్తోంది. యూనివర్సిటీ హెచ్చరికల నేపథ్యంలో ఈ నెల 24తో పరీక్షలు ముగియనున్నాయి. సగానికి సగం మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కావడం లేదు. మరికొందరు పరీక్ష హాలుకు వచ్చి మూడు గంటల సమయాన్ని అక్కడ వెచ్చించకుండా గంటన్నరకే వెళ్లిపోతున్నారు. ఫెయిలయిన విద్యార్థులందరూ ఏదో ఒక ఉద్యోగంలో చేరడంతో సమయం లేకపోవడం వల్లే బీఈ డిగ్రీపై దృష్టి సారించలేకపోతున్నామని తెలిపారు. ఈ ఏడాది నుంచి పరీక్ష ఫీజును రూ.5,000లుగా చేసిన జీయూ ఈ విధంగానైనా విద్యార్థుల దృష్టిని చదువుపై మళ్లించాలని చేసిన ప్రయత్నం ఈ సారి కూడా విఫలమైనట్లు కనిపిస్తోంది. 82 మందిలో ఓ విద్యార్థికి ఎనిమిది పేపర్లు బ్యాక్ లాగ్ లు ఉన్నాయని, అతను 40 వేల రూపాయల పరీక్ష ఫీజును చెల్లించాడిన జీయూ అధికారి ఒకరు తెలిపారు. సాధారణంగా ఒక విద్యార్థికి ఫెయిలయిన పేపర్ ను రెండు సార్లు తిరిగి రాసుకునేందుకు అనుమతి ఇస్తారు. కాగా, జీయూ వీరికి 15 ఛాన్స్ లు ఇచ్చినా వినియోగించుకోలేక పోతున్నారు. -
కల్యాణమైంది.. ‘లక్ష్మి’ రాలేదు..!
♦ బీసీలకు అందని ద్రాక్షలా కల్యాణలక్ష్మి ♦ దరఖాస్తులకే పరిమితం ♦ రెండునెలలైనా కాసులు ఇవ్వని సర్కారు ♦ లబ్ధిదారుల నిరీక్షణ చిత్రంలో కనిపిస్తున్న వధువు, వరుడి పేర్లు సంగీత, గంగాధర్. వధువుది సిరికొండ మండలం హుస్సేన్‌నగర్ గ్రామ పరిధిలోని లొంకతండా కాగా, వరుడిది కమ్మర్పల్లి మండలం మానాల. ఫిబ్రవరిలో వీరి వివాహమైంది. కల్యాణలక్ష్మికి దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు విచారణ కూడా చేశారు. మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు డబ్బులు రాలేదు. - సిరికొండ ఇందూరు : ఎస్సీ, ఎస్టీలకే పరిమితమైన కల్యాణలక్ష్మి పథకాన్ని ఏప్రిల్ 1వ తేదీ నుంచి బీసీలకు కూడా వర్తింపజేస్తున్నామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం అమలులో విఫలం అవుతోంది. దరఖాస్తులు చేసుకోవాలని రెండు నెలల క్రితం బీసీ సంక్షేమ శాఖకు జీవోఎంఎస్ నంబరు 5ను జారీ చేసింది. ఇందుకు వందల సంఖ్యలో దరఖాస్తులు వచ్చారుు. కానీ.. ఇంతవరకు సర్కారు ఒక్కరికి కూడా నయాపైసా అందజేయలేదు. పెళ్లి సమయంలో కాదు కదా.. పెళ్లి అయిన రెండు నెలల తర్వాత కూడా డబ్బులు రాకపోవడంతో దరఖాస్తులు చేసుకున్న పేదింటి ఆడ్డబిడ్డలు ఆందోళన చెందుతున్నారు. ఎస్సీ, ఎస్టీలకు వెంటనే నిధులు మంజూరు చేస్తున్న ప్రభుత్వం నిధుల లేమి సాకుతో బీసీలకు ‘లక్ష్మి’ని దూరం చేస్తుంది. దరఖాస్తులు 726 జిల్లాలో బీసీ జనాభా 13,00,174 ఉంది. ఇందులో 70 శాతం మంది పేదలు ఉన్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి పెళ్లిళ్లు చేసుకున్న పేదింటి బీసీలకు దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించింది. ఇందుకు ఏప్రిల్ నెల నుంచి ఇప్పటివరకు బీసీలు 671, ఓబీసీలు 55 మొత్తం కలిపి 726 మంది ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్నారు. ఇంకా చేసుకుంటూనే ఉన్నారు. అయితే వీటిని పరిశీలన జరిపి మంజూరు చేయాల్సి ఉంది. అయితే పరిశీలన అనంతరం పక్షం రోజుల్లో ప్రభుత్వం నుంచి నేరుగా వధువు ఖాతాలో డబ్బులు జమ కావాలి. కానీ.. దరఖాస్తులు చేసుకుని రెండు నెలలవుతున్నా ఇంతవరకు పరిశీలన జరగలేదు. నిధులూ జమ కాలేదు. దీంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. తమ బిడ్డల పెళ్లిళ్లకు ప్రభుత్వం అందించే నిధులు ఆర్థికంగా దోహదపడుతాయని అనుకున్న తల్లిదండ్రులకు అందని ద్రాక్షలా మారాయి. 726 మంది దరఖాస్తు దారులకు ఒక్కొక్కరికి రూ.51,000 చొప్పున మొత్తం జిల్లాకు రూ.3.70 కోట్ల నిధులు అవసరం ఉన్నాయి. పరిశీలన బాధ్యతలు తహసీల్దార్లకు అప్పగింత కల్యాణలక్ష్మి పథకం బీసీ, ఓబీసీలకు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తుల పరిశీలన బాధ్యతలు తొలుత సహాయ సంక్షేమాధికారులు (ఏబీసీడబ్ల్యూఓ), వసతిగృహ వార్డెన్లకు అప్పగించింది. బీసీ సంక్షేమలో వార్డెన్లు తక్కువగా ఉండటంతో పరిశీలన ఆలస్యం జరుగుతుందనే ఉద్దేశంతో పరిశీలన బాధ్యతలను మండలాల తహసీల్దార్లకు అప్పగిస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఇందుకు ఉత్తర్వులు రావాల్సి ఉంది. జిల్లాలో నమోదైన 726 దరఖాస్తులు ఇంత వరకు పరిశీలనకే నోచుకోలేదు. ఫలితంగా లబ్ధిదారులకు మరింత ఆలస్యం కానుంది. ప్రభుత్వం నిధులు విడుదల చేయాల్సి ఉంది రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆన్లైన్లో దరఖాస్తుల నమోదు జరుగుతుంది. ఇప్పటి వరకు 726 దరఖాస్తులు నమోదయ్యాయి. అయితే పరిశీలన బాధ్యతలు వార్డెన్లకా? తహసీల్దార్లకా? అనే విషయంపై స్పష్టత రావాలి. పరిశీలన తరువాత మంజూరు చేస్తాం. ఆ తరువాత ప్రభుత్వం నిధులు విడుదల చేయడమే తరువాయి. - విమలాదేవి, జిల్లా బీసీ సంక్షేమాధికారిణి -
కిడ్నీ ఆపరేషన్ ఫెయిల్ అయి..
హైదరాబాద్: వైద్యుల నిర్లక్ష్యం వల్ల నగరంలో మరో ప్రాణం బలైంది. ఆదివారం ఉదయం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో నిండు గర్భిణి మృతిచెందగా.. నగరంలోని కొత్తపేట ఓజోన్ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో కిడ్నీ ఆపరేషన్ ఫెయిల్ అయి ఆర్టీసీ కండక్టర్ మృతిచెందాడు. దీంతో అతని బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. కిడ్నీ సమస్యతో ఆస్పత్రిలో చేరిన ఆర్టీసీ కండక్టర్‌కు సరైన సమయంలో చికిత్స చేయకుండా ఆలస్యం చేసి ఆపరేషన్ నిర్వహించడంతోనే ఆయన మృతిచెందాడని బంధువులు ఆందోళన చేస్తున్నారు. -
మరోసారి ఉత్తర కొరియా బొక్కబోర్లా..!
ప్యాంగ్ యాంగ్: ఉత్తర కొరియా మరోసారి పరాభవాన్ని చవిచూసింది. మంగళవారం ఉదయం రెండు అణు క్షిపణులు పరీక్షించిన ఆ దేశానికి భంగపాటు ఎదురైంది. ఉత్తర కొరియా ఉదయం 5.20గంటల ప్రాంతంలో ప్రయోగించిన రెండు బాలిస్టిక్ క్షిపణులు విఫలమయ్యాయని దక్షిణ కొరియా అధికారులు తెలిపారు. గత జనవరిలో అణ్వాయుధ పరీక్షలు జరిపినప్పటి నుంచి ఈశాన్య ఆసియా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. అంతటితో ఆగని ఆ దేశంలో శాటిలైట్ లాంచింగ్ ప్రోగ్రాంలు, వివిధ క్షిపణులు పరీక్షిస్తూ ఇతర దేశాల ఆందోళనలను బేఖాతరు చేస్తోంది. ఇప్పటికే ఉత్తర కొరియా బాలిస్టిక్ మిసైల్ ప్రయోగిస్తుందని తెలిసి జపాన్ కూడా అప్రమత్తమైంది. తమ సరిహద్దులో ఒక్క మిసైల్ పడిన దానికి తగిన బుద్ధి చెప్పాలని తమ సైన్యానికి ఆదేశించింది. అయితే తాజా ప్రయోగం తర్వాత అలాంటిదేం ఇప్పటి వరకు జరగలేదని జపాన్ అధికారులు స్పష్టం చేశారు. ఉత్తర కొరియా తన అణుపరీక్షలను వదిలేసి ఆలోచనేది చేసేందుకు సుముఖంగా లేనందున తాము అమెరికాతో సంబంధాలు కొనసాగిస్తామని జపాన్ మరోసారి స్పష్టం చేసింది. వరుస వైఫల్యాలు తమ వద్ద జపాన్ లోని ఏ ప్రాంతంనైనా.. అమెరికాలోని ఏ ప్రాంతంనైనా ధ్వంసం చేయగల ముసుదాన్ అణుక్షిపణులు ఉన్నాయని చెబుతూ వచ్చిన ఉత్తర కొరియా వాటి పరీక్షల్లో మాత్రం ఇప్పటి వరకు విజయం సాధించలేదు. దాదాపు 20 నుంచి 30 ముసుదాన్ క్షిపణులు ఉత్తర కొరియా వద్ద ఉన్నట్లు దక్షిణ కొరియా చెబుతుంది. అయితే, వీటి సామర్థ్యం విషయంలో మాత్రం అనుమానాలు కలుగుతున్నాయి. గత నెలలో నిర్వహించిన పరీక్షల్లో కూడా ఇవి విఫలం అయ్యాయి. -
ఎంసెట్‌లో పాస్.. ఇంటర్లో ఫెయిల్!
ఎంసెట్‌లో ర్యాంకు పొంది ఇంటర్లో ఫెయిలైన 18,143 మంది సాక్షి, హైదరాబాద్: ఎంసెట్‌లో ఉత్తీర్ణత సాధించినా ఇంటర్లో ఫెయిల్ అవడంతో 18,143 మంది విద్యార్థులకు ర్యాంకులను ప్రకటించలేదు. మరో 3,114 మంది తమ ఇంటర్ మార్కుల వివరాలను అందజేయకపోవడంతో వారి ర్యాంకులను కూడా ప్రకటించలేదు. తెలంగాణ ఎంసెట్‌కు మొత్తంగా 2,46,540 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 2,23,542 మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో 2,00,861 మంది ఎంసెట్‌లో అర్హత సాధించారు. అయితే 18,143 మంది ఇంటర్లో ఫెయిల్ అయ్యారు. మరో 3,114 మంది ఇంటర్ ఉత్తీర్ణత వివరాలను ఇవ్వనందున ఎంసెట్ కమిటీ 1,79,609 మందికి మాత్రమే ర్యాంకులను ప్రకటించింది. -
రెండేళ్లలో బాబు అన్నిటా విఫలం
ఒర్లాండ్లో ప్రవాసాంధ్రులతో ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు తన రెండేళ్ల పాలనలో అన్ని రంగాల్లో విఫలమయ్యారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ఎన్ఆర్ఐలకు వివరించారు. సీఎం అవినీతికి పాల్పడిన అంశాలపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూపొందించిన ‘చంద్రబాబు- అవినీతి చక్రవర్తి’ పుస్తకాన్ని పార్టీ ఎన్నారై విభాగం అమెరికాలో శుక్రవారం ఆవిష్కరించింది. అమెరికా పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఫ్లోరిడా రాష్ట్రం ఒర్లాండ్ నగరంలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. రాజధాని పేరుతో విలువైన భూములను సీఎం చంద్రబాబు తన అనుయాయులకు కట్టబెడుతున్నారని.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదంటూనే విదేశీ పర్యటనల పేరుతో రూ. కోట్లాది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని శ్రీకాంత్‌రెడ్డి ఎన్నారై ప్రతినిధులకు వివరించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీ సాధించడంలోనూ సీఎంగా విఫలమయ్యారని విమర్శించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో ఎన్నారై పార్టీ సభ్యత్వం స్వీకరించారు. కార్యక్రమంలో అమెరికా దక్షిణ ఎన్నారై విభాగం పార్టీ ఇన్చార్జి నలిపిరెడ్డి వాసుదేవరెడ్డి, కొండా మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మాతృభాషకు పరాభవం
♦ ఇంటర్ ఫలితాల తీరు.. ♦ అధిక శాతం తెలుగు పరీక్ష ఫెయిల్ ♦ ఆర్ట్స్ కంటే సైన్స్ గ్రూప్‌ల్లో ఉత్తీర్ణత మెరుగు సాక్షి, సిటీబ్యూరో: తెలుగు నేలపై మాతృభాషకు పరాభవం ఎదురైంది. అత్యధిక శాతం ఇంటర్మీడియట్ విద్యార్థులు తెలుగు భాషా పత్రంలో ఫెయిలయ్యారు. తెలుగు భాషా కంటే.. ఇంగ్లిష్, సంస్కృతం పేపర్లలోనే చాలా మెరుగ్గా విద్యార్థులు నెగ్గడం విశేషం. అంతేగాక సైన్స్ కంటే.. ఆర్ట్స్ గ్రూప్‌లకు చెందిన విద్యార్థులే అధికంగా ఫెయిలయ్యారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌లో ఫలితాల తీరు ఇదే రీతిలో ఉంది. శుక్రవారం ప్రకటించిన జంట జిల్లాల ఇంటర్ ఫలితాలను విశ్లేషిస్తే పలు ఆసక్తికర అంశాలు స్పష్టమయ్యాయి. తెలుగు భాషా పేపర్లోనూ జంట జిల్లాల విద్యార్థులు చతికిలబడ్డారు. ఆ భాష పట్ల ఉన్న చులకన భావమే వారి కొంప ముంచిందని విద్యావేత్తలు చెబుతున్నారు. మాతృభాషపై మమకారం పెంచుకోవాలని, లేదంటే భాష ఉనికికే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ జిల్లాలో ఇంటర్ సెకండియర్ తెలుగు భాషా పేపర్లో 15.49 శాతం విద్యార్థులు తప్పారు. ఇంగ్లిష్‌లో 5.83 శాతం, సంస్కృతంలో 4.42 శాతం, హిందీలో 7.59 శాతమే ఫెయిలయ్యారు. రంగారెడ్డి జిల్లాలో తెలుగులో 11.90 శాతం, ఇంగ్లిష్‌లో 5.10, సంస్కృతంలో 4.08, హిందీలో 4.56 శాతం తప్పారు. ఫస్టియర్ ఫలితాల్లో హైదరాబాద్ విద్యార్థులు అమ్మభాషలో అధిక శాతం బోల్తా పడ్డారు. ఏకంగా 27.21 శాతం మంది ఫెయిలవడం గమనార్హం. రంగారెడ్డి జిల్లాలో సైతం 19 శాతం నమోదైంది. ఆర్ట్స్‌లో వెనుకంజ.. ప్రకటించిన ఫలితాల్లో సైన్స్ గ్రూప్ విద్యార్థులతో ఆర్ట్స్ విద్యార్థులు పోటీ పడలేకపోయారు. చాలామంది గణితం, జీవశాస్త్రం, కెమిస్ట్రీ, ఫిజిక్స్ తదితర సబ్జెక్టులంటే భయంతో.. ఆర్ట్స్ గ్రూప్‌లను ఆశ్రయిస్తున్నారు. తీరా ఫలితాల్లో బోల్తాపడుతున్నారు. సెకండియర్ ఫలితాల్లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఫలితాల తీరు ఇలాగే ఉంది. సైన్స్ కంటే.. ఆర్ట్స్ విద్యార్థులు ఏడెమినిది రెట్లు అధికంగా ఫెయిలయ్యారు. హైదరాబాద్ జిల్లాలో సైన్స్ సబ్జెక్టుల్లోనూ అధిక శాతం ఫెయిలయ్యారు. అధికంగా గణితం 2బిలో 23 శాతానికి పైగా అనుత్తీర్ణత నమోదైంది. -
ఫస్టియర్ విద్యార్థులూ జాగ్రత్త!
ఇప్పటికే పాసైన సబ్జెక్ట్‌ను ఇంప్రూవ్‌మెంట్‌లో ఫెయిలైతే ఫెయిలే సాక్షి, హైదరాబాద్: ఫస్టియర్‌లో కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిలై, కొన్ని సబ్జెక్టుల్లో పాసయ్యారా? ఫెయిలైన సబ్జెక్టులతోపాటు పాసైన సబ్జెక్టుల్లో మార్కులు పెంచుకునేందుకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాయాలనుకుంటున్నారా? అయితే జాగ్రత్త! ప్రస్తుతం పాసైన సబ్జెక్టుల్లో.. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలో ఫెయిల్ అయ్యారో ఫెయిల్ కిందే లెక్క! అంతకుముందుకు ఆ సబ్జెక్టులో పాస్ అయినా చివరి ఫలితాలనే పరిగణనలోకి తీసుకుంటారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు అధికారులు వెల్లడించారు. ఇక ప్రథమ సంవత్సర విద్యార్థులు అన్ని సబ్జెక్టుల్లో ఉతీర్ణులైన వారు ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చు. వీరికి మాత్రం ఎందులో ఎక్కువ మార్కులు వస్తే దాన్నే పరిగణనలోకి తీసుకుంటారు. వీరు సాధారణ ఫీజుతోపాటు ప్రతి పేపరుకు రూ.100 చొప్పున చెల్లించాలి. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కమ్ ఫొటోకాపీకి అవకాశం రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కమ్ ఫొటో కాపీ కోసం విద్యార్థులు ఈ నెల 30లోగా ఆన్లైన్లో ఫీజు చెల్లించాలి. రీకౌంటింగ్ కోసం ఒక్కో పేపరుకు రూ.100 చెల్లించాలి. రీ వెరిఫికేషన్, మూల్యాకనం చేసిన జవాబు పత్రాల జిరాక్స్ కాపీ (ఫొటో కాపీ) పొందేందుకు ఒక్కో సబ్జెక్టుకు రూ.600 చొప్పున మీసేవా, ఏపీ ఆన్లైన్ కేంద్రాల్లో ఫీజు చెల్లించాలి. ఇంప్రూవ్మెంట్ రాయాలనుకునే వారు, రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఇంటర్ బోర్డు అధికారులు సూచించారు. జేఈఈ మెయిన్‌లో వార్షిక పరీక్షలే లెక్క ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ తుది ర్యాం కుల ఖరారులో (జేఈఈ స్కోర్‌కు 60%, ఇంటర్ మార్కులకు 40%) ఇంటర్ వార్షిక పరీక్ష ఫలితాలనే పరిగణనలోకి తీసుకుంటారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో టాప్ ర్యాంకు విద్యార్థులు ఐఐటీల్లో ప్రవేశాలకోసం రాష్ట్ర బోర్డు నుంచి పరీక్షకు హాజరైన విద్యార్థుల్లో టాప్-20 పర్సంటైల్‌లో ఉండాలి. లేదా బోర్డు పరీక్షలో 75% మార్కులు సాధించి ఉండాలి. ఎంసెట్‌లో ఇలా.. ఇంటర్ వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల మార్కులకు 25% వెయిటేజీ ఇచ్చి ఎంసెట్ తుది ర్యాంకును ఖరారు చేస్తారు. ఎవరైనా విద్యార్థి వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయి, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో పాస్ అయితే ఆ మార్కులను పరిగణలోకి తీసుకుంటారు. వాటి ఆధారంగానే ఆ విద్యార్థికి ఎంసెట్ తుది ర్యాంకును ఖరారు చేస్తారు. -
పుట్టిన రోజే బొక్కబోర్లా..
సియోల్: తమ దేశ వ్యవస్థాపకుడి పుట్టిన రోజే ప్రయోగాలకు దిగిన ఉత్తర కొరియా బొక్కబోర్లా పడింది. శుక్రవారం ఉదయం నిర్వహించిన బాలిస్టిక్ క్షిఫణి ప్రయోగం విఫలమైందని దక్షిణ కొరియా మిలటరీ అధికారులు తెలిపారు. ఇప్పటికే కొరియా మొబైల్, మీడియం రేంజ్ ముసుదాన్ మిసైల్‌ను ప్రయోగించినట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ మిసైల్ అమెరికాలోని పలు ప్రాంతాలను నేరుగా ఢీకొట్ట గల సత్తా కలదు. అది చర్చలో ఉండగానే ప్రస్తుత పాలకుడు కిమ్ జాంగ్ ఉన్.. తన తాత ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్ టూ సంగ్ పుట్టిన రోజు సందర్భంగా స్వయంగా బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు నిర్వహించారు. కానీ, అది విఫలమైంది. అయితే, అది ఏ క్షిపణి అని, ఏ పేరు పెట్టారనే వార్తలు బయటకు రాకపోయినా అది కూడా మసుదాన్ క్షిపణి అయ్యుంటుందని దక్షిణ కొరియా అంటోంది. -
ఈ సారీ చర్చలు విఫలం
బెంగళూరు: డిమాండ్లను పరిష్కరించేంతవరకూ పీయూసీ (ఇంటర్మీడియట్) పరీక్షల సమాధానపత్రాలు రీవాల్యువేషన్ చేసేది లేదని నిరసన చేపట్టిన పీయూసీ కళాశాల అధ్యాపకులతో ప్రాథమిక, మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కిమ్మెనరత్నాకర్ జరిపిన ఆదివారం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో తమ నిరసన కార్యక్రమం కొనసాగుతుందని డిమాండ్లను పరిష్కరించేంతవరకూ రీ వాల్యువేషన్ చేసేది లేదని అధ్యాపకులు తేల్చిచెప్పారు. వేతన తారతమ్యం పరిష్కారించడానికి వీలుగా కుమార్‌నాయక్ నివేదిక అమలు, రీవాల్యువేషన్‌కు ప్రస్తుతం చెల్లిస్తున్న మొత్తాన్ని పెంచడం తదితర డిమాండ్లతో గత నవంబర్ నుంచి పీయూసీ కళాశాల అధ్యాపకుల సంఘం నిరసన చేపట్టింది. ఈ నేపథ్యంలో కిమ్మెనరత్నాకర్, పీయూసీ బోర్డు ఉన్నతాధికులు సంఘం ప్రతినిధులతో భేటీ అయ్యారు. అయితే డిమాండ్లను పరిష్కరించడానికి ప్రస్తుతానికి పరిష్కరించడానికి వీలుకాదని అయితే భవిష్యత్తులో ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంటుందని సంఘం ప్రతినిధులతో కిమ్మెన రత్నాకర్ పేర్కొన్నారు. ఇందుకోసం తాత్కాలికంగా రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్లు విడుదల చేయనుందని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని నిరసన కార్యక్రమాలను ఉపసంహరించుకుని రీవాల్యువేషన్‌కు ముందుకు రావాలని పేర్కొన్నారు. ఇందుకు సంఘం సభ్యులు ససేమిరా అన్నారు. కుమార్‌నాయక్ నివేదిక అమలు డిమాండ్ చాలా ఏళ్లుగా అలానే ఉందని, రీ వాల్యువేషన్ బహిష్కరణ ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదని వారు తెలిపారు. నవంబర్ నుంచి తాము నిరసన చేపట్టగా పీయూసీ పరీక్షలు ముగియనున్న తరుణంలో ఇప్పుడు హడావుడిగా చర్చలకు పిలవడంలో ఔచిత్యం ఏమిటని ప్రశ్నించారు. దీంతో కిమ్మెన రత్నాకర్ ఈ విషయమై మరోసారి ఈనెల 13న కుర్చొని మాట్లాడుకుందామని సంఘం ప్రతినిధులకు సూచించారు. దీంతో వారు చర్చల నుంచి బయటికి వచ్చేశారు. అనంతరం సంఘం అధ్యక్షుడు తిమ్మయ్య మాట్లాడుతూ డిమాండ్లు పరిష్కారమయ్యేంతవరకూ రీ వాల్యువేషన్కు హాజరయ్యేది లేదన్నారు. ఈనెల 13న జరిగే చర్చలకు మరోసారి వస్తామన్నారు. -
ఉత్థానపతనాలు!
టెన్నిస్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న షరపోవా ఎవరూ ఊహించని ప్రకటన విడుదల చేసి దిగ్భ్రాంతిపరిచింది. డోప్ పరీక్షలో తాను విఫలమయ్యానని వెల్లడించింది. ఆమె అతి ముఖ్యమైన ప్రకటనొకటి చేస్తారని షరపోవా ప్రతినిధి వెల్లడించినప్పుడు అందరూ అనుకున్నది వేరు. గాయాలతో ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న షరపోవా ఇక ఆటకు గుడ్‌బై చెప్పవ చ్చునని అంచనా వేశారు. షరపోవా చేసిన ప్రకటన పర్యవసానం అదే అయినా డోపింగ్ వివాదంలో ఆమె చిక్కుకుంటుందని, అందువల్ల ఆమెకు నిష్ర్కమణ తప్పనిసరవుతుందని ఎవరూ అనుకోలేదు. షరపోవాను ఆరాధ్య దేవతగా కొలిచే కోట్లాదిమంది టెన్నిస్ అభిమానులకు నిస్సందేహంగా ఇదొక షాక్. క్రీడాస్థలిలో చేతిలో రాకెట్‌తో నిల్చున్న నిలువెత్తు షరపోవాలో అందాన్ని మాత్రమే చూసేవా రుండొచ్చు. ఆమె ఆటను మెచ్చుకునేవారుండొచ్చు. ఆమె నేపథ్యం గురించి, ఆమె ఎదిగివచ్చిన తీరు గురించి తెలిసినప్పుడు...ఎంత అనుభవం గడించినా ఆట విషయంలో ఇప్పటికీ పాటించే శ్రద్ధాసక్తులను గమనించినప్పుడు షరపోవా వ్యక్తి త్వంపై గౌరవం ఏర్పడుతుంది. దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, అమెరికాకు వలస పోవడంవల్ల అదనంగా వచ్చి చేరిన కష్టాలకు ఎదురీదుతూ అనా రోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఏడేళ్ల వయసునుంచీ టెన్నిస్‌పై పట్టు సాధించ డానికి షరపోవా చేసిన కృషి అనితరసాధ్యమైనది. అమ్మకు దూరంగా ఉండాల్సి వచ్చినా, తనతోపాటు వచ్చిన తండ్రి దేశం కాని దేశంలో మనుగడ కోసం చిరు ద్యోగిగా ఎక్కడో పనిచేయాల్సివస్తున్నా టెన్నిస్ క్రీడపై నిమగ్నతను ఆమె చెదరని వ్వలేదు. పదహారేళ్ల చిరుప్రాయంలో వింబుల్డన్ సింగిల్స్ గెల్చుకుని దేశదేశాల్లోని టెన్నిస్ ప్రియులనూ ఆమె ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత వరసగా యూఎస్ ఓపెన్ (2006), ఆస్ట్రేలియన్ ఓపెన్(2008) సాధించింది. 2012, 2014 సంవత్సరాల్లో ఫ్రెంచ్ ఓపెన్ గెలిచింది. ఎందరికో ఆమె స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ప్రతి ఆరంభానికీ ఒక ముగింపు ఉంటుంది. కానీ షరపోవాను ఇన్నేళ్లుగా చూస్తున్నవారికి ఈ ముగింపు ఊహించనిది. ఆటలో మెరుగైన పాటవాన్ని ప్రదర్శించడం కోసం నిషేధిత ఉత్ప్రేరకాలను వాడటం అంతర్జాతీయ పోటీల్లో ఒక ధోరణిగా మారింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, ఎన్ని నిబంధనలు తీసుకొస్తున్నా దీన్ని అరికట్టడం వీలుకావడంలేదు. ఈ విషయంలో రష్యాపై తరచు ఆరోపణలు వస్తుంటాయి. 2012లో జరిగిన ఒలింపిక్స్‌లోనూ, ఇతర అంతర్జాతీయ పోటీల్లోనూ పతకాలను గెల్చుకుందుకు రష్యా కావాలనే అథ్లెట్లకు ఇలాంటి అలవాట్లు చేసిందని ప్రపంచ డోపింగ్ సంస్థ(వాడా) ఆమధ్య ఒక నివేదికలో ఆరోపించింది. పర్యవసానంగా రాబోయే అంతర్జాతీయ ఈవెంట్లలో...ముఖ్యంగా రియో డి జెనిరోలో ఈ ఏడాది జరిగే ఒలింపిక్స్‌లో రష్యా పాల్గొంటుందా లేదా అనే సందేహాలు కూడా వినబడుతున్నాయి. దేశానికి ఇలా తలవంపులు తీసుకొచ్చే చేష్టల్ని సహించబోమని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించినా దాన్నెవరూ విశ్వసించలేదు. ఆటల్లోకి రాజకీయాలు జొప్పించడంవల్లే గోరంతను కొండంతలు చేస్తున్నారన్నది రష్యా ఆరోపణ. సరిగ్గా ఇలాంటి సమయంలో ఆ దేశానికే చెందిన షరపోవాపై ఉత్ప్రేరకాల నింద పడటం గమనార్హం. చాలా పెద్ద తప్పు చేశానంటూ షరపోవా తనంత తానే ప్రకటన చేశారు. అభిమానుల నమ్మకాన్ని వమ్ము చేశానని, ఈ ఆటకు అపఖ్యాతి తెచ్చానని కూడా ఆమె అంగీకరించింది. వాస్తవానికి అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య ఇందుకు సంబంధించిన ప్రకటన చేయడానికి ఇంకా అయిదు రోజుల వ్యవధి ఉంది. ఈలోగా తానే ఈ సంగతిని ప్రపంచానికి వెల్లడించడం ద్వారా ఇందుకు సంబం ధించి మీడియాలో వెల్లువెత్తే కథనాలకు అడ్డుకట్ట వేయాలని ఆమె భావించినట్టు కనబడుతోంది. ఈ ప్రకటన చేసిన సందర్భంలో ఆమె వ్యక్తంచేసిన హావభా వాలైనా, ఆమె చెప్పిన జవాబులైనా షరపోవాపై ఉన్న విశ్వాసాన్ని సడలనీయవు. అన్యాయంగా ఇందులో చిక్కుకుపోయామని కన్నీటిపర్యంతమయ్యేవారినీ, తమ తప్పేమీ లేదని దబాయించేవారినీ చూసినవారికి షరపోవా తీరు భిన్నంగా కనబడు తుంది. పదేళ్లుగా ఈ మందు వాడుతున్నానని, మూడు నెలలక్రితం నిషేధిత ఉత్ప్రే రకాల జాబితాలో ఇది చేరిందని తెలియక అలవాటుగా వాడానని షరపోవా చెప్పిన మాటను విశ్వసించవచ్చుననే అనిపిస్తుంది. అయితే షరపోవా వ్యక్తిమాత్రురాలు కాదు. ఆమె కోసం పనిచేసేందుకు ఒక ప్రత్యేక బృందం ఉంటుంది. ఆటలో ఎలాంటి నిబంధనలొస్తున్నాయో, ఏ మార్పులు చోటు చేసుకుంటున్నాయో ఆ బృందంలోనివారిలో ఒక్కరైనా చెప్పలేదంటే నమ్మకం కలగదు. పైగా నిరుడంతా ఈ ఔషధం గురించి విస్తృతంగా చర్చ జరిగింది. దాని పనితీరు గురించి నిఘా ఉంది. గుండె కండరాలు దెబ్బతినడంవల్ల తగినంత పరిమాణంలో ఆక్సిజన్ అందని రోగులకు ఈ ఔషధాన్ని వాడితే ఆక్సిజన్ అవసరాన్నిది తగ్గిస్తుందట. గుండెకు తక్కువ పరిమాణంలో ఆక్సిజన్ సరిపోయేలా చేసే గుణమే ఆటగాళ్లలో ఈ ఔషధ ప్రాముఖ్యాన్ని పెంచింది! తూర్పు యూరప్ వెలుపల ఈ సంగతి ఇన్నాళ్లూ తెలియకపోవడంవల్లే రష్యా తదితర దేశాల క్రీడాకారులు దీన్ని యధేచ్ఛగా వినియోగించారని నిపుణులు చెబుతున్నారు. తాజా పరిణామం పర్యవసానంగా నైకి, పోర్షే, ట్యాగ్హ్యూయేర్ లాంటి పేరెన్నికగన్న బ్రాండ్లన్నీ ఆమెతో ఉన్న వందల కోట్ల రూపాయల విలువైన ప్రచార ఒప్పందాలను తెగదెంపులు చేసుకుం టున్నట్టు ప్రకటించాయి. విజేతలను మాత్రమే కీర్తించే ప్రపంచంలో ఇలాంటివి మామూలే. ఇప్పుడు టెన్నిస్ సమాఖ్య విధించిన నిషేధం తాత్కాలికమైనదే. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన తప్పా, తెలియక జరిగిందా అన్నది విచారణలో తేలాకే అసలు శిక్ష ఖరారవుతుంది. గెలుపోటముల్నే కాదు... చేసిన తప్పుల పర్యవ సానంగా వచ్చే ఈ మాదిరి ఉత్పాతాలనూ ఎదుర్కొనే స్థిర చిత్తం ఆటగాళ్లకు అవసరమని షరపోవా వర్తమాన స్థితి గమనించినవారికి అర్ధమవుతుంది. -
విద్యార్థి ఫెయిలైతే సిబ్బందిపై చర్యలు
♦ ఎస్ఎస్ఏ జిల్లా అధికారి శ్రీనివాస్ ♦ బషీరాబాద్ కస్తూర్బా పాఠశాల సందర్శన బషీరాబాద్: పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఫెయిలైతే ఆయా సబ్జెక్టులను బోధించే ఉపాధ్యాయులపై చర్యలు తప్పవని సర్వశిక్షాఅభియాన్ (రాజీవ్ విద్యామిషన్) జిల్లా ప్రాజెక్ట్ అధికారి శ్రీనివాస్ కస్తూర్బా సిబ్బందిని హెచ్చరించారు. మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల గురుకుల పాఠశాలలను మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా టెన్త్ విద్యార్థులకు క్లాస్ తీసుకున్నారు. కొంతమంది ప్రగతి బాగో లేదని అసహనం వ్యక్తం చేశారు. తాను అడిగిన ప్రశ్నలకు విద్యార్థుల నుంచి సరైన సమాధానం రాకపోవడంపై సంబంధిత ఉపాధ్యాయురాలిని నిలదీశారు. పదో తరగతి విద్యార్థులను వార్షిక పరీక్షలకు సిద్ధం చేయాలని సూచించారు. అనంతరం హాస్టల్లోని భోజనాన్ని పరిశీలించారు. గుడ్లను సరిగ్గా ఉడికించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెనూ పాటించాలని సిబ్బందికి సూచించారు. ఎస్ఓ సుమిత్ర, సిబ్బంది ఉన్నారు. -
టీడీపీకి చావుదెబ్బ
♦ జీహెచ్ఎంసీలో ఉనికి కోల్పోయిన తెలుగుదేశం ♦ 45 స్థానాల నుంచి ఒక్క సీటుకు పరిమితం ♦ ఏమాత్రం ప్రభావం చూపని చంద్రబాబు, లోకేశ్ ప్రచారం ♦ బీజేపీ- టీడీపీ పొత్తు విఫలం.. ♦ 2014లో గెలిచిన 9 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలోనూ దారుణ పరాభవం సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చావు దెబ్బతిన్నది. గ్రేటర్ హైదరాబాద్‌లో మాదే బలం అని గట్టిగా చెప్పుకొన్న ఆ పార్టీ... కేవలం ఒక్క సీటుకే పరిమితమైంది. మొత్తంగా 150 డివిజన్లలో బీజేపీతో పొత్తును కూడా పక్కనపెట్టి ఏకంగా 97 సీట్లలో పోటీ చేసినా... దాదాపుగా ఉనికినే కోల్పోయింది. కూకట్పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్‌బీ కాలనీలో మందడి శ్రీనివాస్‌రావు ఒక్కరే టీడీపీ నుంచి గెలుపొందారు. బీజేపీ పోటీ చేసిన 68 సీట్లలో మూడింట గెలిచి టీడీపీ కన్నా పైచేయి సాధించింది. టీడీపీ-బీజేపీ పొత్తులో ఎక్కువ బలాన్ని ఊహించుకుని బీజేపీకి కేటాయించిన సీట్లలో సైతం చివరి నిమిషంలో తెలుగుదేశం బీ-ఫారాలతో పో టీ చేసిన నేతలు తమతో పాటు బీజేపీ అభ్యర్థుల ఓటమికి కూడా కారణమయ్యారు. ఘోర పరాజయం.. రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీడీపీ తెలంగాణవ్యాప్తంగా ఘోర పరాజయం పాలయింది. కానీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24 సీట్లలో తొమ్మిదింటిని గెలుచుకుని ఉనికి చాటుకుంది. అయితే టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే... టీడీపీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీని వీడారు. టీడీపీలో కీలక నేతలుగా ఎదిగిన తలసాని శ్రీనివాస్‌యాదవ్, తీగల కృష్ణారెడ్డి తొలుత పార్టీని వీడగా... మాధవరం కృష్ణారావు, జి.సాయన్న వారిని అనుసరించారు. ఎల్బీ నగర్ నుంచి గెలిచిన ఆర్.కృష్ణయ్య టీడీపీకి దూరంగా ఉంటున్నారు. వీరితో పాటు గ్రేటర్‌లోని 24 నియోజకవర్గాల పరిధిలో గతంలో గెలిచిన 45 మంది కార్పొరేటర్లలో సుమారు 35 మంది మాజీలు, పార్టీ ముఖ్య నాయకులు ఈసారి టీఆర్ఎస్లో చేరి విజయం సాధించడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీని వీడిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలతో పాటు పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల డివిజన్లలోనూ టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. గ్రేటర్లో టీడీపీ ఒకే సీటుకు పడిపోతుందని వారితోపాటు ఇతర పార్టీల నేతలు కూడా ఊహించకపోవడం గమనార్హం. బాబు, లోకేశ్‌ల మాటలను నమ్మని సీమాంధ్రులు 2014 ఎన్నికల్లో టీడీపీ గ్రేటర్ పరిధిలో ఎమ్మెల్యే స్థానాలు సాధించినది సీమాంధ్రుల ఓట్ల కారణంగానే. ఈసారి కూడా ఆ ధీమాతోనే గ్రేటర్లో మెరుగైన సీట్లు సాధిస్తామని టీడీపీ నేతలు భావించారు. అందులో భాగంగానే ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌లు ఎన్నికల్లో ప్రచారం చేశారు. లోకేశ్ దాదాపు ఐదు రోజుల పాటు విస్తృతంగా ప్రచారం చేయగా, చంద్రబాబు శివారు నియోజకవర్గాల్లో రెండు రోజుల పాటు పర్యటించారు. హైదరాబాద్‌ను ప్రపంచపటంలో నిలిపింది తానేనని, గ్రేటర్లో టీడీపీ విజయం చారిత్రక అవసరమని, సీమాంధ్రులకు అండగా ఉంటామని చంద్రబాబు చెప్పిన మాటలను వారు విశ్వసించలేదు. ఇక మంత్రి కె. తారకరామారావు ప్రచారం ముందు చంద్రబాబు తనయుడు లోకేశ్ ప్రచారం వెలవెలబోయింది. చివరికి టీడీపీకి కంచుకోటలుగా భావించిన డివిజన్లలోనూ టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. గ్రేటర్లో ‘దేశం’ మనుగడ ప్రశ్నార్థకమే.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన తలసాని, తీగల, మాధవరం కృష్ణారావు, సాయన్న ఇప్పటికే టీఆర్ఎస్లో చేరారు. మాజీ మంత్రులు సి.కృష్ణయాదవ్ , కె.విజయరామారావులతో పాటు పలు నియోజకవర్గాల ఇన్చార్జులు, ముఖ్య నాయకులు గులాబీ గూటికి చేరారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీలు కూడా టీఆర్ఎస్లో చేరనున్నట్లు ఇప్పటికే ప్రచారం జరిగినా... పార్టీ అధినేత ఇచ్చిన పలు హామీలతో ఆగిపోయారు. ఇక తాజాగా గ్రేటర్ ఫలితాల నేపథ్యంలో వీరందరితో పాటు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ మాజీ నేత వివేకానంద కూడా కారు ఎక్కుతారనే ప్రచారం జరుగుతోంది. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య రాజకీయాలను వీడి బీసీ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారు. కాపులను బీసీల్లో చేర్చే ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఆయన ఇప్పటికే కార్యాచరణకు పిలుపిచ్చి కార్యరంగంలోకి దిగారు. ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారారు. మిగతా నియోజకవర్గాల ఇన్చార్జులు, నాయకులు కూడా టీఆర్ఎస్లోకే వెళ్లే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో టీడీపీ మనుగడే ప్రశ్నార్థకంగా మారిపోయింది. -
టెన్త్ పాత సిలబస్ వారు ఓపెన్ స్కూల్‌కే!
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పాత సిలబస్‌లో ఫెయిల్ అయిన విద్యార్థులంతా ఇకపై ఓపెన్ స్కూల్ సొసైటీ నిర్వహించే దూర విద్య పరీక్షల్లోనే పదో తరగతి పరీక్షలు రాసుకోవాలని, వారికి 2016 మార్చిలో జరిగే వార్షిక పరీక్షల్లో అవకాశం ఇవ్వడం లేదని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు జిల్లాల డీఈవోలకు పాఠశాల విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాత సిలబస్‌లో 2015 మార్చి పరీక్షలకంటే ముందు సంవత్సరాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఇకపై ఓపెన్ స్కూల్ దూర విద్యా విధానంలోనే టెన్త్ పూర్తి చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో 2014-15 విద్యా సంవత్సరంలో నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) విధానాన్ని విద్యాశాఖ 9, 10 తరగతుల్లో అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా ఇంటర్నల్స్ విధానం ప్రవేశ పెట్టి.. వాటికి 20 మార్కులను ఇస్తోంది. ఇక రాత పరీక్షలను ప్రతి సబ్జెక్టులో 80 మార్కులకే నిర్వహిస్తోంది. ఆ ప్రకారమే 2015 మార్చిలో పరీక్షలను నిర్వహించింది. ఇక 2014 మార్చి వరకు పాత విధానంలో టెన్త్ పరీక్షలు జరిగాయి. ఒక్కో సబ్జెక్టులో 100 మార్కులకు రాత పరీక్ష నిర్వహించింది. ఈ నేపథ్యంలో 2014 మార్చి, అంతకుమందు జరిగిన పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన వారంతా 2016 మార్చిలో జరిగే వార్షిక పరీక్షలకు హాజరయ్యే వీలు లేదని విద్యా శాఖ వెల్లడించింది. వారు జాతీయ ఓపెన్ స్కూల్ సొసైటీ లేదా రాష్ట్ర ఓపెన్ స్కూల్ సొసైటీ నిర్వహించే ఎస్సెస్సీ పరీక్షలకు హాజరై పదో తరగతి పూర్తి చేయాలని సూచించింది. ఈ అంశంపై డీఈవోలు విస్తృత ప్రచారం నిర్వహించాలని స్పష్టం చేసింది. పదో తరగతి పాత సిలబస్‌లో ఫెయిల్ అయిన వారంతా ఓపెన్ స్కూల్లో అడ్మిషన్ తీసుకోవాలని వెల్లడించింది. ఓపెన్ స్కూల్లో 4వరకు ప్రవేశాలు.. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ పదో తరగతి ప్రవేశాల నోటిఫికేషన్‌ను జారీ చేసిందని, ఈ నెల 25 నుంచి డిసెంబర్ 4 వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించిందని విద్యాశాఖ వెల్లడించింది. ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించింది. అలాగే ఇదే అంశంపై సోమవారం ఎంఈవోలు, డిప్యూటీ ఈవోలు, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్లు కలసి జిల్లాల్లోని ప్రతి మండలంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించింది. మీసేవ/ఏపీ ఆన్లైన్ ద్వారా విద్యార్థులు ఓపెన్ స్కూల్లో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకునేలా ప్రధానోపాధ్యాయులు చర్యలు చేపట్టాలని సూచించింది. ఒకటి ఫెయిలైనా.. మూడు రాయాల్సిందే... టెన్త్ పాత సిలబస్‌లో ఒక విద్యార్థి ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయినా ఓపెన్ స్కూల్ విధానంలో ఆ ఒక్క సబ్జెక్టులో మాత్రమే పరీక్షలు రాసే వీలు లేదు. ఆ అభ్యర్థి ఓపెన్ స్కూల్ ఎస్సెస్సీలో కనీసం మూడు సబ్జెక్టుల్లో పరీక్షలు రాయాల్సి ఉంటుందని ఓపెన్ స్కూల్ సొసైటీ డెరైక్టర్ వెంకటేశ్వర శర్మ పేర్కొన్నారు. రెగ్యులర్ టెన్త్‌లో ఫెయిల్ అయిన వారికి ఓపెన్ స్కూల్లో రెండు సబ్జెక్టులకు మాత్రమే మినహాయింపు ఉంటుందని, ట్రాన్స్ఫర్ ఆఫ్ క్రెడిట్స్(టీవోసీ) కింద రెండింటికే అవకాశం ఉంటుందన్నారు. ఓపెన్ స్కూల్లో చేరే పదో తరగతి విద్యార్థులు మొత్తంగా 5 సబ్జెక్టుల్లో పరీక్షలు రాసి ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. అప్పుడే ఎస్సెస్సీ పాస్ అయినట్లు లెక్క. కాబట్టి టీవోసీ కింద రెండింటికి మినహాయింపు ఇస్తామని, మరో మూడు సబ్జెక్టుల్లో కచ్చితంగా పరీక్షలు రాయాల్సి ఉంటుందన్నారు. -
నిధులు రాబట్టడంలో బాబు విఫలం
-
తెలంగాణ సర్కార్‌తో మున్సిపల్ ఉద్యోగులచర్చలు విఫలం
-
చర్చలు విఫలం: సమ్మెలోనే జీహెచ్ఎంసీ కార్మికులు
హైదరాబాద్: ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో సమ్మెను కొనసాగిస్తున్నట్లు జీహెచ్ఎంసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించింది. బుధవారం రాత్రి కార్మిక సంఘాల ప్రతినిధులతో కార్మిక మంత్రి నాయిని నర్సింహారెడ్డి జరిపిన చర్చలు ఎలాంటి పరిష్కారం లేకుండానే ముగిశాయి. గురువారం నుంచి సమ్మెను మరింత ఉదృతం చేయనున్నట్లు కార్మిక నాయకులు చెప్పారు. గురువారం రాత్రి నుంచి వీధిలైట్ల కార్మికులు.. శుక్రవారం నుంచి జలమండలి కార్మికులు కూడా సమ్మెలో పాల్గొంటారని తెలిపారు. డిమాండ్లు ఎప్పటిలోగా నెరవేరుస్తారన్నదానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంలేదని, పైగా కఠిన చర్యలకు దిగుతామని బెదిరింపులకు గురిచేస్తున్నదని కార్మిక సంఘాల జేఏసీ ఆరోపిస్తోంది. సీఎం కేసీఆర్ సమక్షంలో చర్చలు జరపాలన్న తమ అభ్యర్థనను కూడా మంత్రులు, అధికారులు పట్టించుకోవడంలేదంది. -
డీఈవో కార్యాలయంపై తల్లిదండ్రుల దాడి
హైదరాబాద్ : పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రలు ఆందోళన రెండోరోజు కూడా కొనసాగుతోంది. కావాలనే మార్కులు తక్కువగా వేసి విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ అయ్యేందుకు కారణం అయ్యారంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మంగళవారం హైదరాబాద్ డీఈవో కార్యాలయంపై దాడి చేశారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అన్ని సబ్జెక్ట్‌ల్లో పాసయిన తమ పిల్లలు మ్యాథ్స్, ఫిజిక్స్‌లోనే ఎందుకు తప్పారో చెప్పాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలపాలని వారు డిమాండ్ చేశారు. మరోవైపు ఫెయిల్ అయిన పదో తరగతి విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలిపే ప్రసక్తే లేదని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి స్పష్టం చేశారు. బట్టీ విధానంతో పాటు, కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా సీసీఈ విధానం అమలు చేశామన్నారు. అయితే విద్యార్థులు ఆ విధానాన్ని అలవాటు పడాల్సి ఉందన్నారు. -
ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య
వేలూరు: ప్లస్‌టూ ఫలితాల్లో ఫెయిల్ అవడంతో గుడియాత్తం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఇద్దరు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్లస్‌టూ పరీక్ష ఫలితాలను గురువారం ఉదయం విడుదల చేశారు. వేలూరు జిల్లా గుడియాత్తం సమీపంలోని ఉప్పరపల్లికు చెందిన కూలీ కార్మికుడు జయపాల్ కుమారుడు రఘు(18) ప్లస్‌టూలో ఫెయిల్ కావడంతో మనస్తాపం చెంది చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని లేఖ రాసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అదే విధంగా గుడియాత్తం సమీపంలోని మూంగపట్టు గ్రామానికి చెందిన నాగరాజ్ కుమారుడు గుణశేఖరన్(17)ప్లస్‌టూ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపం చెంది గుణశేఖరన్ ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన బంధువులు గుణశేఖరన్‌ను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే గుణశేఖరన్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తన కుమారుడు ప్లస్‌టూ పరీక్షల్లో ఫెయిల్ కావడంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని తండ్రి నాగరాజన్ గుడియాత్తం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు డీఎస్పీ విజయకుమార్, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు విద్యార్థులు గుడియాత్తం నెల్లూరు పేటలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కావడం గమనార్హం. -
కష్టం అనుకుంటే సమస్యే..!!
13-19 కేరెంటింగ్ అందరూ ఆ దశను దాటి వచ్చినవారే! అందరూ ఆ దశను అర్థం చేసుకోవడం పట్ల నిర్లక్ష్యం చేసేవారే! ఎందుకలా?! జీవితంలో అత్యంత ప్రాధాన్యం గల కౌమార దశను అర్థం చేసుకునేదెలా? సరైన మార్గం చూపేదెలా?! ఆ మార్గం చూపే ప్రయత్నమే ఈ 13-19... సుధీర్ కిందటేడాది పదవ తరగతి చదివేవాడు. పరీక్షలు రాయకపోవడం వల్ల పై క్లాస్‌కు వెళ్లలేకపోయాడు. సుధీర్ మరీ టాపర్ కాదు, అలాగని మరీ బొత్తిగా చదవనివాడూ కాదు. మార్కులు కూడా మధ్యస్థంగా వచ్చేవి. టెన్త్ పరీక్షలు నెల రోజులు ఉన్నాయనగా ఇంట్లో ఒత్తిడి మొదలైంది. స్కూల్లో రివిజన్ల మీద రివిజన్లు ఎలాగూ ఉన్నాయి. స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక కాసేపు విశ్రాంతి కోసం టీవీ చూసినా, స్నేహితులతో మాట్లాడినా పేరెంట్స్ తిట్టేవారు. పరీక్షలు రేపట్నించి మొదలు అనగా సుధీర్ కనిపించకుండా పోయాడు. ఎక్కడెక్కడో వెతికారు ఇంట్లో వాళ్లు. రెండు-మూడు నెలలకు కాని అతని జాడ తెలియలేదు. కనిపించకుండా పోయిన కొడుకు దొరికినందుకు సంతోషించినా పరీక్షలు రాయక ఓ ఏడాది నష్టపోయిన విధం అటు తల్లిదండ్రులను, ఇటు సుధీర్‌ను బాధిస్తూనే ఉన్నాయి. ప్రణతికి ఈ మధ్య పరధ్యానం ఎక్కువైంది. చదువుతూ చదువుతూ ఎటో చూస్తూ కూర్చుంటుంది. తల్లి గద్దిస్తే మళ్లీ చూపు పుస్తకంపై పెడుతుంది. అది కూడా కాసేపే! సరిగ్గా తిండి తినడం లేదు. అదేమని అడిగితే ఆకలి లేదంటుంది. పరీక్షల సమయంలో డిస్టర్బెన్స్‌గా ఉంటుందని ఇంట్లో టీవీ కనెక్షన్ తీసేశారు. కొన్నాళ్ల పాటు ఫోన్, కంప్యూటర్ ఉపయోగించడానికి వీల్లేదని తండ్రి గట్టిగా హెచ్చరించాడు. పరీక్షల సమయానికి ప్రణతికి విపరీతమైన జ్వరం.. కాసేపు కూడా కూర్చోని చదివే స్థితి లేదు. పరీక్షలంటే కబళించడానికి వస్తున్న మహమ్మారిలా పిల్లలు భయపడుతుంటారు. కాదు కాదు వారిని పెద్దలే భయపెడుతుంటారు. అందుకే పిల్లలు పరీక్షల నుంచి పారిపోవడానికి వెనకాడరు. ఆందోళనతో అనారోగ్యం పాల్పడుతుంటారు. ఏడాదికోసారి వచ్చే పండుగల్లాంటివే ఈ పరీక్షలనీ, ఇవి కూడా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండేలా చూసుకోవాలని పెద్దలే పిల్లలకు వివరించాలి. హెచ్చరికలు వద్దు... నూటికి నూరు శాతం తల్లిదండ్రులు చేసే తప్పిదాలలో ప్రధానమైనవి ‘పరీక్షలు దగ్గర పడ్డాయి జాగ్రత్త’, ‘బాగా రాయకపోతే అంతే’, ‘ఎలాగైనా ర్యాంకు వచ్చి తీరాలి’, ‘చదువుకి అయిన ఖర్చులు, పాసవకపోతే ఎంత నష్టమో’ తెలిపే వివరాలు ఏకరవు పెడుతుంటారు. అలాగే తెలిసినవారి పిల్లలు గతంలో సాధించిన విజయాలు, వారి కన్నా మెరుగైన ఫలితాలు రావాలనే మాటలు పిల్లల్లో అనుకోని భయాలను తెచ్చిపెడతాయి. ఇవన్నీ పిల్లల మెదళ్లపై నెగిటివ్ ప్రభావాన్ని చూపుతాయి దాంతో పరీక్షలంటేనే భయమేసి, దీంతో ఎలాగైనా ఈ పరిస్థితి నుంచి గట్టెక్కాలి అనుకోకుండా తప్పించుకోవాలి అని చూస్తారు. ఫలితంగా పరీక్షల సమయానికి ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోవడం, అనారోగ్యంతో పరీక్షలు రాయలేకపోవడం జరుగుతుంటుంది. శూన్యంలో చూపులా! పరీక్షల గురించి ఆలోచిస్తూ ఒక్కోసారి పిల్లలు శూన్యంలోకి చూస్తూ ఏదో లోకంలో ఉండిపోతారు. అది ‘పరీక్షలు బాగా రాయలేమేమో, మంచి మార్కులు రావేమో, ఫెయిల్ అవుతామేమో..’ అనే నెగిటివ్ థింకింగ్ కావచ్చు. టెన్షన్ వల్ల తిండి మీద ధ్యాస ఉండదు. ఆహారం ప్రభావం చదువు మీద చూపుతుంది. తినకపోతే నీరసం వల్ల చదవాలనిపించదు. ఎక్కువ తిన్నా అదే పరిస్థితి. అందుకని ఉదయం అల్పాహారం, పాలు, పళ్లరసం వంటి తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది. రోజంతా పుస్తకాలు ముందేసుకొని కూర్చోమని కాకుండా పక్కన కూర్చుని సరదాగా మాట్లాడాలి. పరీక్షల ఫలితాల గురించి బెంగ అవసరం లేదని చెప్పాలి. నటించినా మేలే! పరీక్షలని పిల్లలు ఎలాగూ సీరియస్‌గా ఉంటారు. వారిని ఇంకా సీరియస్‌లో ఉంచకుండా మీకు నవ్వు రాకపోయినా సరే నవ్వు మొఖంతో నటించండి. మీ నవ్వు మొఖం చూస్తే పిల్లలకు కాస్త రిలీఫ్‌గా ఉంటుంది. రోజూ రాత్రి పూట కాసేపు కబుర్లు చెప్పి, తర్వాత పడుకోమని చెప్పండి. చదివేదేదో తెల్లవారుజామున లేపి చదివించండి. ఆ టైమ్‌లో పరీక్షలో ఏమొస్తాయో చెప్పమని ప్రశ్నలు వేయడం మంచిది కాదు. పిల్లలు ఏవైనా అడిగిన సందేహాలకే సమాధానాలు ఇవ్వండి. రోజంతా చదవాల్సిన అవసరం లేదు. రెండేసి గంటల చొప్పున మూడు, నాలుగుసార్లు విభజించుకొని చదివితే మెదడు కూడా చదివినది జ్ఞాపకం ఉంచడానికి సహకరిస్తుంది. 5సిలకు దూరం దూరం... పరీక్షల సమయంలో మనసుని దారి తప్పించే సెల్‌ఫోన్, కేబుల్ టీవీ, క్రికెట్, సినిమా, చాటింగ్.. లు ప్రధానమైనవి. వీటిని నిర్దాక్షిణ్యంగా ‘కట్’ చేస్తున్నామని చెప్పకుండా వాటి వల్ల కలిగే నష్టం, పరీక్షల తర్వాత తిరిగి ఇచ్చే సదుపాయాల గురించి తెలియజేయండి. పూర్తిగా తీసివేయడం కాకుండా, సాధ్యమైనంత వరకు గ్యాడ్జెట్స్‌కి దూరంగా ఉండటం మేలు అని సూచించండి. చదువుతున్న రూమ్‌లో గోడల మీద పోస్టర్లు, క్యాలెండర్లు ఏవీ లేకుండా ఉంటే మంచి ఫలితం ఉంటుంది. లేదంటే సినీనటులు, క్రికెటర్ల క్యాలెండర్లు, బొమ్మలు చూడగానే మైండ్ చదువు నుంచి డైవర్ట్ అవుతుంది. చదువులో అద్భుతాలు... చదవాలి. ప్రశ్నలు వేసుకోవాలి. మళ్లీ చదవాలి. మనసులో వల్లెవేసుకోవాలి. మనసులో నిక్షిప్తం చేసుకోవాలి. కొద్దిగా విశ్రాంతి తీసుకోవాలి. గుర్తు తెచ్చుకోవాలి. చదివిన దాన్ని పేపరు మీద రాయాలి. ఇలా చేస్తే ఎవరైనా చదువులో అద్భుతాలు చేయవచ్చు. ఈ సూచన హెచ్చరికగా కాకుండా క్రమంగా అలవాటు పడేలా చేయాలి. ఈ కాలం విద్యార్థుల నోట వినిపించే సాధారణ మాట ‘చాలా కష్టపడి చదువుతున్నాను. అయినా ర్యాంకు రావడం లేదు’ అని. నిజం చెప్పాలంటే ‘కష్టం’ అనే మాట అనుకోగానే అదొక సమస్య అనే సజేషన్ సబ్కాన్షస్మైండ్కి చేరుతుంది. దాంతో సమాచార రవాణాలో కొంత అంతరాయం ఏర్పడుతుంది. అందుకే కష్టపడుతున్నాను అనకూడదు. ఇష్టపడి చదువుతున్నామనుకుంటే అంతా సుఖమే. అదే టీవీ చూడ్డం, క్రికెట్, ఫ్రెండ్స్, సినిమాలు, సరదాలు.. ఇవన్నీ ఇష్టపడి చేస్తున్న పనులు అవడం వల్ల సమాచార రవాణాలో అంతరాయం లేదు. అనుకున్న టైమ్‌కి అవి వెంటనే గుర్తుకు వస్తాయి. అందుకే కష్టపడి చదవద్దు-ఇష్టపడి చదవమని చెప్పాలి. టీచర్ పాత్ర ఇంట్లో వద్దు... పరీక్షల సమయంలో తల్లి పాత్ర అధికంగా ఉంటుంది. ‘చదువు, చదువు’ అంటూ టీచర్లా పదే పదే అంటూ ఉంటే పిల్లలకు విసుగు పుట్టవచ్చు. అందుకని టీచర్ పాత్ర పోషించనని ప్రతి తల్లి తనకు తానే ఒట్టుపెట్టుకోవాలి. (ఇది బాగా చదువుకుంటున్నవారి విషయంలో మాత్రమే). చివరగా... రాయబోయే పరీక్షలోని ప్రశ్నలన్నీ తాము చదివిన పుస్తకాల్లోనే ఉంటాయనే సత్యం ప్రతి ఒక్క విద్యార్థి గ్రహిస్తే చాలు. ఆందోళన లేకుండా ఆనందంగా పరీక్షలను పూర్తిచేస్తారు. - డా.బి.వి.పట్టాభిరామ్, సైకాలజిస్ట్, ప్రశాంతి కౌన్సెలింగ్ - హెచ్.ఆర్.డి సెంటర్, హైదరాబాద్ -
'30 ఇంటర్వ్యూల్లో ఫెయిల్'
ప్రయత్నం లేకుండా ఎవరూ ప్రయోజకులు కాలేరు. ప్రయత్నాల్లో పరాజితులైతే కుంగిపోకుండా పదే పదే ప్రయత్నిస్తే ఏదో ఒకరోజు పైకి రావచ్చని వివిధ రంగాల్లో విజేతలుగా నిలిచిన కొంత మంది ఇప్పటికే నిరూపించారు. అలాంటి కోవకు చెందిన వారే ఆలీబాబా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లూజీ నికోల్సన్ జ్యాక్ మా. ప్రపంచ వ్యాపార దిగ్గజాల్లో ఒకరిగా, చైనాలోకెల్లా సంపన్నుడిగా పేరు ప్రఖ్యాతులు గడించిన జ్యాక్ మాకు చెందిన ఈ కామర్స్ కంపెనీ ‘ఆలీబాబా’ రోజుకు పదికోట్ల షాపర్స్‌తో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తుందంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు ఎక్కడా ఉద్యోగం లభించక నానా అగచాట్లు పడిన జ్యాక్ మా ఆస్తి విలువ ఇప్పుడు అక్షరాల 20.4 బిలియన్ డాలర్లంటే ఆశ్చర్యమూ కలగకమానదు. చార్లీ రోజ్ అనే రాయిటర్స్ జర్నలిస్టుకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన తన సక్సెస్ స్టోరీ గురించి వివరించారు. 'కాలేజీ ప్రవేశ పరీక్షలో మూడు సార్లు ఫెయిలయ్యాను. ఇక కాలేజీ వదిలేసి ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించాను. 30 రకాల ఉద్యోగాలకు దరఖాస్తు చేశాను. ప్రతీచోట కాదనిపించుకున్నాను. పోలీసు ఉద్యోగానికీ ప్రయత్నించాను. అక్కడా పనికిరావు పొమ్మన్నారు. చివరకు మా నగరంలోనే వెలిసిన కేఎఫ్‌సీ (కెంటకీ ఫ్రైడ్ చికెన్) రెస్టారెంట్‌కు జాబ్ కోసం దరఖాస్తు చేశాను. అక్కడా జాబ్ కోసం 24 మంది పోటీ పడ్డారు. వారిలో 23 మంది సెలక్టయ్యారు ఒక్క నేను తప్ప' అని జ్యాక్ మా వివరించారు. ఇక అప్పుడు ఆయన తనకెవరూ ఉద్యోగం ఇచ్చేలా లేరనుకొని స్వయంగా ఏదైనా వ్యాపారం ప్రారంభించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందులో భాగంగానే 1998లో ఆలీబాబా కంపెనీని ఏర్పాటు చేశారు. అలా కూడా అగచాట్లు తప్పలేదు. తొలి మూడేళ్లు నయాపైసా లాభం రాలేదు. చెల్లింపులకు చేతిలో చిల్లిగవ్వా లేదు. బ్యాంకులు కూడా చేయూతనివ్వలేదు. అక్కడే ఈ చెల్లింపులకు సంబంధించి ఓ కొత్త ఆలోచన మెరుపులా మెరిసింది. కొనుగోలుదారులు, అమ్మకందారుల మధ్య కరెన్సీ మార్పిడీ చేస్తే ఎలా ఉంటుందన్నదే ఆ ఆలోచన. ఇంతకు మించి మూర్ఖ ఆలోచన మరోటి ఉండదని కూడా ఆయన ఆలోచన విన్నవారు అప్పట్లో తిట్టిపోశారట. ప్రజలు వినియోగించుకున్నంత కాలం అది మూర్ఖ ఆలోచన అయినా ఫర్వాలేదనుకొని ఆ ఆలోచనను ‘ఆలీపే’ పేరిట కార్యరూపంలోకి తీసుకొచ్చారు. ఈ రోజున 80 కోట్ల మంది ఆలీపేను ఉపయోగిస్తున్నారంటే ఆయన విజయం ఎంత ఘనమైనదో అంచనా వేయవచ్చు. -
దైవం... ప్రేమ స్వరూపం
చింతన మానవుని ప్రేమ షరతులతో కూడుకున్నది. అందుకే అనేక సందర్భాలలో అది విఫలం అవుతుంది. కానీ దేవుని ప్రేమ అనంతమైనది, షరతులు లేనిదీ. ‘నాకు లాభం కలిగితే అందులో కొంత నీకు చెల్లిస్తాను’ అని దేవునికి ప్రతిఫలం ఇవ్వజూపేవారు మనలో కొందరుంటారు. అయితే దేవుడు మన నుండి ఏమీ ఆశించకుండా ప్రేమిస్తున్నాడని మనం గ్రహించాలి. ఎందుకంటే ఈ సర్వ సృష్టి, సకల సంపదలు దేవునివే. ఆయన కలుగజేస్తే ఉద్భవించినవే. భగవంతుడు ప్రేమమయుడని భగవద్గీత, పురాణాలు అభివర్ణిస్తున్నాయి. దుర్మార్గుల పట్ల కూడా దేవుడు తన ప్రేమను కనబరిచి, వారు త్వరగా సన్మార్గంలోకి రావాలని ఆశిస్తాడు. తండ్రి తన బిడ్డల్లో ఎవరైనా తప్పు చేస్తే వారిని సరి చేయాలని చూస్తాడు తప్ప, నాశనం చేయాలనుకోడు. మతం పేరిట నేడు కొందరు హింసకు పాల్పడుతున్నారు. ఈ హింస, ద్వేషం, అరాచకత్వం అన్నీ దుష్ట లక్షణాలు. దైవానికి సంబంధించినవి కావు. ఒకవేళ ద్వేషం దేవుని లక్షణమైతే, ఈ పాటికి సర్వ ప్రపంచం ఆయన ఉగ్రతకు నాశనమై ఉండేది. దేవుడు ప్రేమ స్వరూపి కనుక మనం కూడా ఒకరి పట్ల ఒకరం ప్రేమగా మెలిగినప్పుడు ఆయనకు మనం అత్యంత ప్రీతిపాత్రులం అవుతాం. - యస్. విజయ భాస్కర్ -
పంతుళ్లూ..పైలమయో!
నిర్లక్ష్యంపై విద్యాశాఖ కొరడా ప్రభుత్వ పాఠశాలల్లో డీఈఓ ఆకస్మిక తనిఖీ ఒకరి సస్పెన్షన్, ముగ్గురికి మెమోలు సిద్దిపేట జోన్: ‘‘ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థి ఏ సబ్జెక్టులో ఫెయిల్ అయినా సంబంధిత టీచర్‌పై కఠిన చర్యలు తీసుకుంటాం.. అవసరమైతే సస్పెన్షన్‌కు కూడా వెనకాడబోం’’ రెండు నెలల క్రితం టీచర్లకు డీఈఓ జారీ చేసిన హెచ్చరిక. కట్ చేస్తే.. పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఇందిరానగర్ జెడ్పీ పాఠశాలను శుక్రవారం డీఈఓ రాజేశ్వర్‌రావు అకస్మికంగా తనిఖీ చేశారు. విద్యా బోధనలో విఫలమయ్యారనే కారణంతో ఇందిరానగర్ స్కూల్‌కు చెందిన ఓ ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు వేయడంతో పాటు మరో ముగ్గురికి మెమోలు జారీ చేశారు. ఊహించని ఈ పరిణామంతో ఉపాధ్యాయుల్లో ఆందోళన మొదలైంది. శుక్రవారం సిద్దిపేటకు వచ్చిన డీఈఓ రాజేశ్వర్‌రావు ముందుగా స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చేరుకుని స్కూల్ ఆవరణలోని ఖాళీ స్థలాన్ని, వెనక భాగంలో ఉన్న పురాతన భవనాన్ని పరిశీలించారు. ఇటీవల ప్రభుత్వం బ్యాంక్ నిర్మాణం కోసం సంబంధిత పాఠశాల స్థలాన్ని, భవనాన్ని స్వాధీనం చేయాలని విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసిన క్రమంలో సమగ్ర వివరాలు సేకరించారు. అనంతరం పదో తరగతి గదిని పరిశీలించి, విద్యార్థులను వివిధ పాఠ్యాంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత తెలుగు, హిందీ, ఇంగ్లిష్ మాధ్యమంలో విద్యార్థులకు పరీక్ష నిర్వహించి సంబంధిత పేపర్లను తీసుకెళ్లారు. ఇటీవల జరిగిన పదో తరగతి త్రైమాసిక పరీక్ష ప్రశ్నాపత్రాలను, పాఠశాల విద్యార్థుల మార్కుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా ఇందిరానగర్‌లోని జెడ్పీ ఉన్నత పాఠశాలకు చేరుకున్న డీఈఓ, పాఠశాల ఆవరణ చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని హెచ్ఎం వకులాదేవికి సూచించారు. పాఠశాలలో నిరుపయోగంగా ఉన్న మరుగుదొడ్లు, మూత్రశాలలను వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. పదో తరగతి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగారు. పదో తరగతి విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డుల రూపకల్పనలో నిర్లక్ష్యం వహించిన ఉపాధ్యాయుడు నిరంజన్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. సంబంధిత సబ్జెక్టుల్లో విద్యార్థుల ఫెయిల్ శాతం అధికంగా ఉందన్న కారణంతో అదే పాఠశాలకు చెందిన కొండల్‌రెడ్డి, శ్రీవిద్యలతో పాటు గైర్హాజరైన నీలం రెడ్డికి మెమోలు జారీ చేశారు. దీనికి బాధ్యులైన ఉపాధ్యాయుల రెండు ఇంక్రిమెంట్లలో కోత విధిస్తామని హెచ్చరించారు. మీరు మారండి.. విద్యార్థుల రాత మార్చండి... ప్రతి నెల వేల రూపాయల వేతనం పొందుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యాబోధనలోనూ మార్పు తెచ్చి విద్యార్థుల రాతను మార్చాలని డీఈఓ రాజేశ్వర్‌రావు సూచించారు. అందుకోసం ముందుగా ఉపాధ్యాయుల్లోనే మార్పు రావాలన్నారు. తనిఖీ నిర్వహించిన అనంతరం పాఠశాల ఉపాధ్యాయులతోప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు నమ్మకం మరింత పెంచాల్సిన గురుతర బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ముఖ్యంగా సీఎం జిల్లాలో విద్యా ఫలితాల్లో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆయన వెంట ఉప విద్యాధికారి మోహన్, జిల్లా విద్యాశాఖ సిబ్బంది సురేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
డీలర్లు.. మాయగాళ్లు
ఆదోని/కోడుమూరు: డీలర్ల అతి తెలివి నిరుపేదలకు శాపంగా మారింది. బోగస్ కార్డులను కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టి.. లబ్ధిదారులకు నెల సరుకులను దూరం చేసింది. అన్ని అర్హతలున్నాకార్డు రద్దు కావడంతో ఎన్నో కుటుంబాలు పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. బోగస్ కార్డుల ఏరివేతలో భాగంగా రేషన్ కార్డులకు ఆధార్ నెంబర్లను అనుసంధానం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ కార్యక్రమాన్ని అధికారులు డీలర్లకు అప్పగించారు. నియోజకవర్గంలో 76,844 తెల్ల రేషన్‌కార్డులు ఉండగా.. 124 మంది డీలర్లు ఉన్నారు. ఆధార్ అనుసంధానం చేసే సైట్లోకి లాగిన్ అయ్యేందుకు వీరందరికీ ఒకే పాస్వర్డ్ కేటాయించారు. డీలర్లు వారి పరిధిలోని వినియోగదారుల నుంచి ఆధార్ కార్డుల జిరిక్స్ కాపీలను సేకరించుకుని నెట్ సెంటర్లు, తహశీల్దార్ కార్యాలయాల్లో ఆధార్ నెంబర్లను అనుసంధానం చేశారు. ఆధార్ నెంబర్లు ఇవ్వకపోతే రేషన్ కార్డులను బోగస్‌గా పరిగణిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో తమ వద్దనున్న బోగస్ కార్డులు రద్దయితే అక్రమార్జనకు తెరపడుతుందని భావించిన కొందరు డీలర్లు సరికొత్త ఎత్తుగడ వేశారు. నిరుపేదల కడుపు మాడ్చయినా తమ జేబులు నింపుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అందరికీ ఒకే పాస్వర్డ్ కేటాయించడం వీరి ఆలోచనలకు కలిసొచ్చింది. ఇతర డీలర్ల పరిధిలోకి చొరబడి అర్హుల రేషన్ కార్డులకు అనుసంధానం చేసిన ఆధార్ నెంబర్లను బోగస్ కార్డులకు జతచేశారు. ఇలా డీలర్లు ఎవరికి వారు బోగస్‌లను కాపాడుకోవడంతో వేలాది మంది నిరుపేదలు కార్డులను కోల్పోయారు. నియోజకవర్గంలో ఆధార్ నెంబర్లు అనుసంధానం కాని 15,154 కార్డులు రద్దయ్యాయి. ఫలితంగా 3,273 మెట్రిక్ టన్నుల బియ్యం కోటాకు కత్తెర పడింది. ఇందులో సగానికి పైగా అర్హులైన వారే కావడం గమనార్హం. వీరంతా మూడు నెలలుగా రేషన్ అందక.. కూలీ పనులను వదులుకుని డీలర్లు, అధికారుల చుట్టూ ఆధార్ జిరాక్స్ కాపీలతో ప్రదక్షిణ చేస్తున్నారు. తమ తప్పేమీ లేదని.. ప్రభుత్వం ఎందుకు రద్దు చేసిందో తెలియదంటూ అధికార యంత్రాంగం తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. మరోసారి ఆధార్ జిరాక్స్ కాపీ ఇవ్వమనే ఉచిత సలహాతో తిప్పిపంపుతున్నారే తప్ప.. డీలర్ల మాయాజాలాన్ని గుర్తించకపోవడం గమనార్హం. తెలిసినా.. ఎక్కడ తమ మామూళ్లకు గండి పడుతుందోనని మౌనం దాలుస్తున్నారనే చర్చ జరుగుతోంది. నోటికాడి కూడు లాగేసినారు కూలీ పని చేసుకునేటోళ్లం. ఆధార్ కార్డు అడిగితే డీలర్‌కు ఇచ్చినాం. అయినా కార్డు రద్దు చేసినారు. అన్నీ సక్రమంగా ఉన్నా ఇలా చేస్తే ఎవరికి సెప్పుకోవాల. నాలెక్క సానా మందికి కార్డులు పోయినాయి. సారోళ్లకు సెబితే మళ్లీ ఆధార్ కార్డు జిరాక్సు ఇవ్వండి చూస్తామంటున్నారు. కార్డు ఎప్పుడొస్తాదంటే ఎవరూ సరిగా సెప్పరు. మూన్నెల్లు అయితాంది. కడుపు మాడ్చుకుంటున్నాం. ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకోవాల. - రాణి, ఆదోని ముసలోళ్లం.. ఎట్టా బతికేది నా వయసు 70 ఏళ్లు. కళ్లు సరిగా కనబడవు. పింఛన్ సొమ్ముపై ఆధారపడి భార్యతో కలిసి గుడిసెలో నివాసం ఉంటున్నా. ఆధార్ కార్డు జిరాక్సు కాపీలను డీలర్‌కు నాలుగు సార్లు అందజేసినా. అయినప్పటికీ రేషన్ కార్డు రద్దు చేసినారు. మేమెట్టా బతకాల. నడవటమే కష్టమైన పరిస్థితుల్లో ఇరుగుపొరుగు సాయంతో అధికారుల చుట్టూ తిరుగుతున్నా. ప్రభుత్వమే రద్దు చేసిందంటున్నారు. ఎప్పటికొస్తాదో ఏమో తెలుస్తలేదు. - పోలయ్య, ఆదోని డీలర్ల అక్రమాలపై ఫిర్యాదుల్లేవు ఒకటి కంటే ఎక్కువ చోట్ల రేషన్ కార్డులు ఉన్నా.. చనిపోయిన లబ్ధిదారులకు సంబంధించిన కార్డులు రద్దయ్యాయి. తమకు అన్ని అర్హతలున్నా కార్డులు రద్దయ్యాయంటూ కొందరు మా దృష్టికి తీసుకొస్తున్నారు. డీలర్ల వల్లే తమ కార్డులు రద్దయినట్లు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తదుపరి చర్యలు చేపడతాం. - రమేశ్వరరెడ్డి, ఫుడ్ ఇన్స్పెక్టర్, ఆదోని డీలర్ల, బోగస్ కార్డుల, ప్రయత్నం బెడిసికొట్టి, -
బిలాస్పూర్ బాధితులకు రాహుల్ పరామర్శ
బిలాస్పూర్: చత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల బాధితులను శనివారం ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పరామర్శించారు. నిర్లక్ష్యం, అవినీతి, నకిలీ మందుల కారణంగా మహిళల మరణించారని రాహుల్ విమర్శించారు. బిలాస్పూర్ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని రాహుల్ అన్నారు. బిలాస్పూర్ జిల్లాలో ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం 13 మంది మహిళల ప్రాణాలను బలిగొంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల క్యాంపులో 83 మంది మహిళలు ఆపరేషన్లు చేయించుకోగా వారిలో 13 మంది మహిళలు ఆపరేషన్లు వికటించడంతో చికిత్స పొందుతూ మృతిచెందారు. -
నేడు బిలాస్పూర్లో రాహుల్ పర్యటన
బిలాస్పూర్: చత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల బాధితులను ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పరామర్శించనున్నారు. శనివారం రాహుల్ బిలాస్పూర్లో పర్యటించనున్నారు. బిలాస్పూర్ జిల్లాలో ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం 13 మంది మహిళల ప్రాణాలను బలిగొంది. బిలాస్పూర్ పట్టణ శివార్లలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రభుత్వం శనివారం నిర్వహించిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల క్యాంపులో 83 మంది మహిళలు ఆపరేషన్లు చేయించుకోగా వారిలో 13 మంది మహిళలు ఆపరేషన్లు వికటించడంతో చికిత్స పొందుతూ మృతిచెందారు. -
రాజధానిపై స్పష్టత ఇవ్వడంలో ప్రభుత్వం విఫలం
కొత్తపేట(గుంటూరు) : నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని విషయంపై ప్రజలకు స్పష్టత ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమవుతోందని రాజ్యసభ మాజీ సభ్యుడు యలమంచిలి శివాజీ విమర్శించారు. రాజేంద్రనగర్‌లోని తన నివాసంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. నూతన ప్రభుత్వం గద్దెనెక్కి నాలుగు నెలలు కావస్తు న్నా రాజధాని ఎంపికపై చిత్తశుద్ధి లేనట్లు కనిపిస్తోందన్నారు. ఇప్పుటికి నాలుగు కమిటీలు ఏర్పాటు చేసి పరస్పర విరుద్ధ నివేదికలతో ప్రజలను తప్పుదోవ పట్టించారన్నారు. వేలాది ఎకరాలు కబ్జా.. గుంటూరు, అమరావతి, విజయవాడ సరిహద్దు ప్రాంతాల్లోని ప్రభుత్వ భూము లు వేలాది ఎకరాలు కబ్జాకు గురయ్యాయని, వాటిపై దృష్టిసారించనీయకుండా సీఎం చంద్రబాబుకు కొంతమంది తప్పుడు సలహాలిస్తున్నారని చెప్పారు. గుం టూరు, అమరావతి, విజయవాడ మధ్యలో ఎండోమెం ట్, రెవెన్యూ, మున్సిపల్, ఉడా, వక్ఫ్ భూములు సుమా రు 29 వేల ఎకారాలున్నాయన్నారు. వాటిని అభివృద్ధి చేయలేక, సాగు భూములను పూలింగ్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నించడం సబబు కాదన్నారు. ఆ భూ ములను అలానే వదిలేస్తే కార్పొరేటర్లు, కబ్జాదారులు వాటిని కాలగ ర్భంలో కలి పేసి ప్రభుత్వ భూమి అనేదే లేకుండా చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. కృష్ణా సిమెంట్ ఫ్యాక్టరీ భూములు ఏమయ్యాయని ప్రశ్నించారు. 1980లో వేలాది ఎకరాలను కొందరు కబ్జా చేసి రిజిస్టర్ చేయించుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఉన్న భూములను వినియోగించుకుంటే సరి రాజధాని నిర్మాణ ం 15 సంవత్సరాలైనా పూర్తి కాదని, ల్యాండ్ పూలింగ్ విషయాన్ని పక్కనబెట్టి ఉన్న ప్రభుత్వ భూములను వినియోగించుకోవాలని సూచించారు. ఉడా ఆధ్వర్యంలో 1984లో అమరావతి టౌన్ షిప్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం దాని ద్వారా ప్రజలకు ఎటువంటి లబ్ధి చేకూర్చలేకపోయిందని ఉదహరించారు. పులిచింతల పునరావస కేంద్రాల పరిస్థితి ఏమైందో గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలను వినియోగించుకోవాలి జిల్లాలోని ప్రభుత్వం కార్యాలయాలను ముఖ్యమంత్రి వినియోగించుకుంటూ రాష్ట్ర కార్యకలాపాలను సమీక్షించాలని సూచించారు. కలెక్టర్ కార్యాలయం, ఏస్పీ కార్యాలయం, కోర్టు ప్రాంగ ణాలు కలిపి మొత్తం 22 ఎకారాలు, కేంద్ర పొగాకు పరిశోధన కేంద్రంలో 84 ఎకారాల ఖాళీ భూములున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతాల్లో వేల అడుగుల మేరకు విశాలమైన ఫంక్షన్ హాళ్ల నిర్మాణాలు చేపట్టి విలువైన భూములను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఇప్పుటికైనా ప్రభుత్వం రాజధాని ఏర్పాటుపై పటిష్ట ప్రణాళికలు సిద్ధం చేసి, ప్రజలకు స్పష్టత ఇవ్వాలని కోరారు. -
ఓయూ డిగ్రీ ఫలితాలు విడుదల
జూలై ఒకటి నుంచి మార్కుల జాబితాలు సింగిల్ సబ్జెక్టు తప్పిన వారూ అధికమే.. మెరుగుపడని ఫలితాలు ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరిధిలో గత ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించిన డిగ్రీ వార్షిక పరీక్షలకు సంబంధించిన ఫలితాలు వెల్లడయ్యాయి. శుక్రవారం క్యాంపస్‌లోని అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వీసీ ప్రొ.సత్యనారాయణ డిగ్రీ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాలను ఉస్మానియా వెబ్‌సైట్‌తోపాటు, ఇతర వెబ్సైట్లలోనూ విద్యార్థుల కోసం అందుబాటులో ఉంచారు. బీఏ, బీకాం, బీఎస్సీ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరాలకు చెందిన లక్షా 70 వేల 958 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 52.40 శాతం మంది ఉత్తీర్ణులైనట్టు అధికారులు వెల్లడించారు. ఉత్తీర్ణులైన విద్యార్థులు జూలై ఒకటి నుంచి ఆయా కళాశాలల నుంచి మార్కుల జాబితాలను పొందవచ్చని సూచించారు. ఫెయిల్ అయిన వారు రీవాల్యుయేషన్ కోసం ఈనెల 16 నుంచి 27 వరకు, రూ.100 అపరాధ రుసుముతో జూలై ఒకటి వరకు ఏపీఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. సింగిల్ సబ్జెక్టులో 9 వేల మంది ఫెయిల్.. వివిధ డిగ్రీ కోర్సుల్లో సింగిల్ పేపర్ తప్పిన వారు తొమ్మిది వేలకుపైగా ఉన్నారు. ఏటా సింగిల్ సబ్జెక్టులో సుమారు పది వేల మంది విద్యార్థులు ఫెయిల్ అవుతూ విద్యకు దూరంగా ఉంటున్నారు. ఇన్స్టంట్ లేదా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. పురోగతిలేని ఫలితాలు ఓయూ డిగ్రీ ఫలితాల శాతంలో పురోగతి కనిపించడం లేదు. ఏటా వార్షిక పరీక్షలకు హాజరయ్యే వారి సంఖ్య సుమారు 2 లక్షల వరకు ఉంటున్నా ఫలితాలు ఆశించిన స్థాయిలో రావడం లేదు. ఇబ్బడి ముబ్బడిగా ప్రైవేటు కళాశాలలు పెరుగుతోన్న నేపథ్యంలో విద్యార్థుల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. కానీ కళాశాలల్లో మౌలిక వసతుల కొరత, అనుభజ్ఞులైన అధ్యాపకులు, సరైన బోధన లేనందు వల్లే మెరుగైన ఫలితాలు రావడం లేదని తెలుస్తోంది. అనేక ప్రైవేటు కళాశాలల్లో విద్యార్థుల హాజరుశాతం లేకపోయినా నిబంధనలకు విరుద్ధంగా పరీక్షలకు అనుతిస్తున్నట్టు ఆరోపణలున్నా ఓయూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ప్రైవేటు కళాశాలలపై ఓయూ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఫలితాలు దిగజారి పోతున్నాయని విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొన్నారు. -
ఇంటర్లో ఫెయిలైన ఎంసెట్ ర్యాంకర్లు
36 వేల మందిది ఇదే పరిస్థితి రీ వెరిఫికేషన్‌లో వచ్చిన మార్కులు లేకుండానే ఎంసెట్ ర్యాంకులు హైదరాబాద్: ఎంసెట్‌లో ర్యాంకు సాధించినా, ఇంటర్ మీడియెట్‌లో 36,310 మంది ఫెయిల్ అయ్యారు. అయితే చాలా మందికి ఇంటర్మీడియట్లో పరీక్షలు బాగా రాశామని నమ్మకం ఉన్న విద్యార్థులు, తక్కువ మార్కులు వచ్చిన వారు, ఫెయిల్ అయిన వారు రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందులో చాలా మందికి మార్కులు అదనంగా కలిశాయి. 1 నుంచి 10 మార్కుల వరకు కూడా కలిసిన విద్యార్థులు ఉన్నారు. అయితే, ఇలా అదనంగా వచ్చిన వారి మార్కులను మాత్రం ఎంసెట్ ర్యాంకుల ఖరారులో పరిగణనలోకి తీసుకోలేదు. ఇంటర్మీడియెట్ బోర్డు సంబంధిత వివరాలను ఎంసెట్ వర్గాలకు ఇంతవరకు ఇవ్వకపోవడమే ఇందుకు కారణం. దీంతో తాము తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిందని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. తమకు రీవెరిఫికేషన్ ద్వారా అదనంగా వచ్చిన మార్కులతో పాస్ అయిన విద్యార్థులు, మార్కులు పెరిగిన విద్యార్థులు తమకు నష్టం వాటిల్లిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక మే 22న జరిగిన ఈ పరీక్షకు ఇంజనీరింగ్‌లో 2,66,820 మంది హాజరు కాగా 1,88,831 మంది (70.77 శాతం) అర్హత సాధించి ర్యాంకులు పొందారు. అయితే మరో 24,723 మంది ఎంసెట్‌లో అర్హత సాధించినా ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయ్యారు. ఇక 1,782 మంది ఇంటర్మీడియట్లో పాస్ అయ్యారో, ఫెయిల్ అయ్యారో కూడా తెలియదు. అయితే వారిని ఫెయిల్ అయినట్టుగా పరిగణనలోకి తీసుకున్నారు. ఇక అగ్రికల్చర్ అండ్ మెడిసిన్‌లో 1,06,396 మంది పరీక్ష రాయగా 98,292 మంది (83.16శాతం) అర్హత సాధించి ర్యాంకులు పొందారు. మరో 8,371 మంది ర్యాంకు పొందినా ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయ్యారు. 1,434 మంది ఇంటర్లో పాస్ అయ్యారో, ఫెయిల్ అయ్యారో కూడా తెలియదు. వారిని కూడా ఫెయిల్ అయినట్టుగానే పరిగణించారు. -
తెలుగులో బోల్తా పడ్డారు!
- టెన్త్‌లో గణితం తర్వాత మాతృభాషలోనే ఎక్కువ మంది ఫెయిల్ - కేవలం 15 వేల మందికే ఇంగ్లీష్‌లో ఏ1 గ్రేడ్ సాక్షి, హైదరాబాద్: ఈసారి పదో తరగతి పరీక్షల్లో ఎక్కువ మంది విద్యార్థుల కొంప ముంచింది గణితమే. లెక్కలు రావడం లేదు సరే అనుకున్నా మాతృభాషలో గట్టెక్కలేక చతికిల పడ్డ విద్యార్థులూ ఎక్కువగానే ఉన్నారు. లెక్కలు తర్వాత ఎక్కువ మంది విద్యార్థులు తప్పింది తెలుగులోనే. పదో తరగతి ప్రథమ భాషలో తెలుగు/హిందీ/ఉర్దూ తీసుకోవడానికి అవకాశం ఉం ది. రాష్ట్రంలో ప్రథమభాషగా తెలుగు తీసుకున్న వి ద్యార్థుల సంఖ్య ఎక్కువ. తర్వాత స్థానం ఉర్దూ తీసుకున్న వారిది. గణితంలో గరిష్టంగా 6.17 శాతం మంది విద్యార్థులు ఫెయిల్ కాగా 4 శాతం మంది ప్రథమ భాషలో గట్టెక్కలేకపోయారు. మాతృభాషలో ఫెయిల్ అయిన వారి శాతం గతేడాది కంటే 0.65 శాతం ఎక్కువగా ఉంది. మాతృభాష కాని ద్వితీయ భాష(తెలుగు/హిందీ)లో కనిష్టంగా 1.73 శాతం మంది విద్యార్థులే ఫెయిల్ అయ్యారు. ద్వితీయభాష ఉత్తీర్ణత మార్కులు 18 కావడం కూడా ఉత్తీర్ణత శాతం పెరగడానికి కారణమని భావిస్తున్నారు. ఇంగ్లిష్ మహాకష్టం మన విద్యార్థులకు ఇప్పటీకీ మింగుడుపడని సబ్జెక్టు ఇంగ్లిషే. ఆంగ్లంలో 10 లక్షల మందికిపైగా విద్యార్థులు పాసయితే.. అందులే 1.44 శాతం మంది అంటే కేవలం 15,328 మందికే ఏ1 గ్రేడ్ వచ్చింది. లెక్కల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఫెయి ల్ అయినా ఆంగ్లంతో పోలిస్తే లెక్కల్లో ఏ1 గ్రేడ్ సాధించిన విద్యార్థుల సంఖ్య 10 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. -
ఫలితాల్లో ‘ట్ర’బుల్ ఐటీ
= ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరంలో ఉత్తీర్ణత 55 శాతమే = మెకానిక్స్లోనే ఎక్కువ మంది ఫెయిల్ నూజివీడు ట్రిపుల్ ఐటీ కళాశాల ప్రతిష్ట రానురాను మసకబారుతోంది. పదో తరగతిలో మండలస్థాయిలో ప్రథమస్థానాల్లో నిలిచిన విద్యార్థులను ఎంపికచేసి, వారిని 24 గంటలు తమ దగ్గరే ఉంచుకుని, వారికి ఐఐటీలో ప్రతిభ కనబరిచిన వారిని ప్రొఫెసర్లుగా నియమించి విద్యాబోధన చేస్తున్నప్పటికీ ఫలితాలు మాత్రం సాధారణ ఇంజినీరింగు కళాశాలల కంటే దారుణంగా ఉంటున్నాయి. నూజివీడు, న్యూస్‌లైన్ : స్థానిక ట్రిపుల్ ఐటీలో గత నెలలో నిర్వహించిన తొలిసెమిస్టర్ ఫలితాల్లో ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సర ఫలితాలు ఘోరంగా ఉన్నాయి. ఉత్తీర్ణత శాతం 55 శాతంగా మాత్రమే. 970 మంది ఇంజినీరింగు ప్రథమ సంవత్సర విద్యార్థులు నవంబర్‌లో నిర్వహించిన సెమిస్టర్ పరీక్షలు రాశారు. వారిలో 536 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. 434 మంది ఫెయిలయ్యారు. అత్యధికంగా మెకానిక్స్ సబ్జెక్టులో 195 మంది విద్యార్థులు తప్పారు. ఆ తరువాత స్థానాల్లో ఎలక్ట్రికల్ టెక్నాలజీలో 116 మంది, గణితంలో 118 మంది ఫెయిల య్యారు. ఇంత దారుణ ఫలితాలు ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేసిన ఏడు సంవత్సరాల్లో ఎప్పుడూ ఎదురవలేదు. పీయూసీదీ అదే పరిస్థితి పీయూసీ-1 ఫలితాలు కూడా ఆశాజనకంగా లేవు. 986 మంది విద్యార్థులు ప్రథమ సెమిస్టర్ పరీక్షలు రాయగా 759 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతం 77. ఫెయిలైన 227మందిలో ఒక సబ్జెక్టు తప్పిన విద్యార్థులు 144 మంది, రెండు సబ్జెక్టులు తప్పినవారు 60 మంది, మూడు సబ్జెక్టులు తప్పిన వారు 23 మంది. పీయూసీ-2 తప్పిన వారందరికీ ఈ నెలాఖరులో రెమీడియల్ పరీక్షలు నిర్వహించనున్నారు. లోపం ఎక్కడ..! దేశంలోని ఐఐటీల్లో చదివిన వారిని ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు పాఠాలు బోధించడానికి నియమించారు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో చదువుకుంటున్న విద్యార్థులందరూ పదో తరగతిలో 530 మార్కుల కంటే ఎక్కువ సాధించి, మండలస్థాయిలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన వారే. అయినప్పటికీ ఇంజినీరింగు ప్రథమ సంవత్సరంలో కేవలం 55 శాతం ఫలితాలు మాత్రమే రావడం విస్మయాన్ని కలిగిస్తోంది. నాలుగేళ్లుగా ఇంజినీరింగు ప్రథమ సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగు మెకానిక్స్, ఎల క్ట్రికల్ టెక్నాలజీ సబ్జెక్టుల్లోనే ఎక్కువ మంది ఫెయిలవుతున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందో గుర్తించి, సరిచేయకపోవడం వల్లే ఏటా ఈ సబ్జెక్టు విద్యార్థులకు గండంగా మారింది. అలాగే ఇతర రాష్ట్రాలకు చెందిన లెక్చరర్ల బోధన కూడా సరిగా ఉండక, వారు చెప్పేది అర్థంకాక తప్పుతున్నామని విద్యార్థులు పేర్కొంటున్నారు. కొంత మంది ఫ్యాకల్టీలు, లెక్చరర్లు రెగ్యులర్‌గా క్లాసులకు హాజరుకావడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇకనుంచైనా ఎక్కడ లోపాలు ఉన్నాయో గుర్తించి, వాటిపై శ్రద్ధ తీసుకుంటనే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయి. లేకుంటే ట్రిపుల్ ఐటీల ప్రతిష్ట మసకబారడం ఖాయమన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. సంబంధంలేని సబ్జెక్టులే కారణం ట్రిపుల్ ఐటీలో బోధిస్తున్న సబ్జెక్టులు ఇప్పటి వరకు విద్యార్థులకు సంబంధం లేనివే. ఈ కారణంగానే ఎక్కువ మంది ఉత్తీర్ణులు కాలేకపోతున్నారు. అయినా వీరికి త్వరలోనే రెమీడియల్స్ (సప్లిమెంటరీ) పరీక్షలు నిర్వహిస్తున్నాం. - ఇబ్రహీంఖాన్, ట్రిపుల ఐటీ డెరైక్టర్