సమస్యల పరిష్కారంలో ముఖ్య మంత్రి చంద్రబాబు విఫలమయ్యారని రైతులు, మహిళలు, వృద్ధులు ధ్వజమెత్తారు.
నల్లమాడ: సమస్యల పరిష్కారంలో ముఖ్య మంత్రి చంద్రబాబు విఫలమయ్యారని రైతులు, మహిళలు, వృద్ధులు ధ్వజమెత్తారు. ఆదివారం మండలంలోని మీసాలవాండ్లపల్లి, కొండకిందతండా, వేళ్లమద్ది, కొత్తపల్లితండాలో గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమం నిర్వహించారు. గడప గడపకూ కార్యక్రమంలో భాగంగా పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయకర్త ఇళ్లిళ్లూ తిరుగుతూ కరపత్రం పంచుతూ పలు సమస్యలు ప్రస్తావించారు. ఈ సందర్భంగా సీసీ రోడ్లు, డ్రైనేజీ, రేషన్‌కార్డులు, పింఛన్లు, ఇళ్లు తదితర సమస్యలను శ్రీధర్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. రాబోయే ఎన్నికల్లో జగనన్న సీఎం అయితే మన సమస్యలు అన్నీ పరిష్కారం అవుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అనంతరం కొత్తపల్లితండాలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజధాని హైదరాబాదులో 10 సంవత్సరాల వరకూ హక్కు ఉన్నా.. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు ఇరుక్కుపోయి కేసీఆర్ భయంతో అమరావతిలో తూతూ మంత్రంగా బ్లాకులు నిర్మిస్తున్నారన్నారు. అత్యంత వెనుకబడి కరువు బారిన పడ్డ అనంతపురం జిల్లాను మంత్రులు, ఎమ్మెల్యేలు ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. హంద్రీనీవా పనులు పూర్తి చేసి జిల్లాలో ప్రతి నీటి కుంటలకు నీరు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పుట్టపర్తి నియోజకవర్గంలో అభివృద్ధిని విస్మరించారన్నారు. సమస్యలు పరిష్కరించలేని మంత్రిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి డీఎస్ కేశవరెడ్డి, కార్యదర్శి దుద్దుకుంట సుధాకర్‌రెడ్డి, సేవాదళ్ సభ్యుడు ఏఎన్ చంద్రశేఖర్‌రెడ్డి, చారుపల్లి, రెడ్డిపల్లి సర్పంచులు ప్రతాపరెడ్డి, కె.సూర్యనారాయణ, బుక్కపట్నం సింగల్‌విండో అధ్యక్షుడు విజయరెడ్డి, కర్వీనర్ సుధాకర్‌రెడ్డి, సర్పంచ్ గంగమనాయుడు, గ్రామ కమిటీ అధ్యక్షులు పురుషోత్తంయాదవ్, అశోక్‌కుమార్‌యాదవ్, రజనీకాంతరెడ్డి, ఆనంద్, మోహన్‌దాస్, జయమ్మ, సింగల్‌విండో మాజీ డైరెక్టర్ బొజ్జేనాయక్, నాయకులు న్యాయవాది రామచంద్రారెడ్డి, విజయభాస్కరరెడ్డి, సీతారాం, కె. సురేష్, నాగార్జున, పక్కీర్‌నాయక్, గిరినాయక్, ఎర్ర సూరి, గంగిరెడ్డి, సుధాకర్ పాల్గొన్నారు.