'టీచర్ల సమస్య ఒక్కటీ తీరలేదు' | teachers problems not solved in chandrababu Regime | Sakshi

'టీచర్ల సమస్య ఒక్కటీ తీరలేదు'

Published Sat, May 21 2016 1:10 PM | Last Updated on Sat, Jul 28 2018 3:33 PM

'టీచర్ల సమస్య ఒక్కటీ తీరలేదు' - Sakshi

'టీచర్ల సమస్య ఒక్కటీ తీరలేదు'

చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత టీచర్ల సమస్యల్లో ఏ ఒక్కటీ పరిష్కారం కాలేదని వైఎస్సార్ కాంగ్రెస్ టీచర్ల ఫెడరేషన్ (వైఎస్సార్‌టీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు కాలిరెడ్డి అన్నారు.

వేంపల్లె: చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత టీచర్ల సమస్యల్లో ఏ ఒక్కటీ పరిష్కారం కాలేదని వైఎస్సార్ కాంగ్రెస్ టీచర్ల ఫెడరేషన్ (వైఎస్సార్‌టీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు కాలిరెడ్డి అన్నారు. వైఎస్సార్‌టీఎఫ్ 5వ వార్షికోత్సవ సభ శనివారం వైఎస్సార్ జిల్లా వేంపల్లె మండలం ఇడుపులపాయ ఎస్టేట్ వద్ద జరిగింది. ఈ సందర్భంగా కాలిరెడ్డి, వైఎస్సార్‌టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులపతి వైఎస్సార్ సమాధి వద్ద పుష్పగుచ్చాలను ఉంచి నివాళులు అర్పించారు. కాలిరెడ్డి మాట్లాడుతూ... వైఎస్సార్ అభిమానులకు ఇది పవిత్ర స్థలమని చెప్పారు. వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌కు అండగా ఉంటామని, టీచర్లకు త్వరలోనే మంచికాలం వస్తుందన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement