ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
Published Mon, Sep 5 2016 12:12 AM | Last Updated on Tue, May 29 2018 3:46 PM
– కర్నూలులో ప్రారంభమైన విద్యా పరిరక్షణ యాత్ర
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వైఎస్‌ఆర్‌టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులపతి ఆరోపించారు. ఆదివారం వైఎస్‌ఆర్‌టీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన విద్యా పరిరక్షణ యాత్రను ఆయన కర్నూలులో ప్రారంభించారు. యాత్రలో భాగంగా కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లోని ప్రధాన పట్టణాలు, మండల కేంద్రాల్లో సదస్సులను నిర్వహించి ఉపాధ్యాయుల నుంచి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. ఆదివారం ఉదయం 11 గంటలకు కర్నూలులోని టౌన్ మోడల్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.
సర్వీసు రూల్స్ సాధన కోసం ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకోవడంలేదని ఆరోపించారు. కేంద్ర హోంశాఖ అధికారులతో కనీసం మాట్లాడడంలేదని, కొన్ని ఉపాధ్యాయ సంఘాల నేతలే హడావుడి చేస్తున్నారని ఆరోపించారు. రెండున్నరేళ్లు గడిచినా ఉపాధ్యాయులకు నగదు రహిత వైద్యం అందడం లేదన్నారు. వెఎస్‌ఆర్‌టీఎఫ్ సభ్యులు సైనికుళ్లగా పనిచేసి సంఘాన్ని బలోపేతం చేసేందుకు కషి చేయాలని కోరారు.
సమావేశంలో పాల్గొన్న అనంతపురం, కర్నూలు జిల్లా ల అధ్యక్షులు అశోక్‌కుమార్‌రెడ్డి, నాగభూషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయాసమస్యలపై పోరాటానికి వైఎస్‌ఆర్‌టీఎఫ్ తరపున ఒక్క ఎమ్మెల్సీ ఉండాలని..2017లో జరిగే ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎన్‌రమేష్, రాష్ట్ర కార్యదర్శి మహేష్, పాముల మండల అధ్యక్షుడు శేఖర్‌నాయక్, నందికొట్కూరు మండల శాఖ అధ్యక్షుడు జగదీశ్వరరెడ్డి పాల్గొన్నారు.
Advertisement
Advertisement