సాక్షి, విజయవాడ: చంద్రబాబు పాలనలో ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొంది. ఎన్నికల ముందు ఉద్యోగులకు హామీల వర్షం కురిపించిన చంద్రబాబు సర్కార్.. హామీల సంగతి దేవుడెరుగు.. కనీసం ఉద్యోగులకు జీతాలు ఇవ్వడంలో నానా ఇబ్బందులకు గురిచేస్తోంది.
జీతాలు రాక ప్రభుత ఉపాధ్యాయులు అవస్థలు పడుతున్నారు. 2 వ తేదీ వచ్చినా కానీ కూటమి ప్రభుత్వం.. టీచర్లకు జీతాలు వేయలేదు. 2 నెలలుగా కూడా ఒకటో తేదీన జీతాలు వేయలేదు. పెన్షనర్లకు కూడా ఇంకా పెన్షన్లు జమ కాలేదు.
కాగా, చంద్రబాబు ప్రభుత్వంలో ఉద్యోగులకు వేధింపులే తప్ప ఎలాంటి మేలు జరగటం లేదు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. ఐఆర్, పీఆర్‌సీ సంగతి ప్రభుత్వం గాలికొదిలేసింది. అధికారంలోకి రాగానే అమలు చేస్తామన్న హామీలు ఏమయ్యాయి? అంటూ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
ఇంటి స్థలాలను వెంటనే మంజూరు చేయాలని, పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పది శాతం ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని వెంటనే అమలు చేయాలని.. జాబ్ కేలండర్‌ను త్వరగా విడుదల చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: చంద్రబాబూ.. మరి అవన్నీ కుట్రలేనా?: రాచమల్లు
Comments
Please login to add a commentAdd a comment