సాక్షి, విజయవాడ: ఏపీలో ప్రభుత్వ టీచర్ల (Government teachers)కు జీతాలు అందలేదు. 4వ తేదీ వచ్చిన కూడా ఉపాధ్యాయులకు చంద్రబాబు సర్కార్ (Chandrababu Govt) జీతాలు చెల్లించలేదు. ప్రతి నెలా 1వ తేదీన జీతాలు(Salaries) ఇస్తామని మేనిఫెస్టోలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రూ.5 వేల కోట్లు అప్పు తెచ్చి కూడా టీచర్లకి కూటమి ప్రభుత్వం జీతాలు చెల్లించలేదు. ప్రభుత్వ తీరుపై టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు, పెన్షన్లు చెల్లిస్తామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం. దాన్ని ఒక్క నెల ముచ్చటగా మార్చేసింది. తొలి నెల మినహా తర్వాత నెల నుంచి ఒకటో తేదీన ఉద్యోగులందరికీ జీతాలు, పెన్షనర్లు అందరికీ పెన్షన్లు జమ చేయడం లేదు. నూతన సంవత్సరంలోనూ నాలుగో తేదీ వచ్చినప్పటికీ వేతనాల కోసం సుమారు రెండు లక్షల మంది ఉపాధ్యాయులు ఎదురుచూపులు చూస్తున్నారు. ఉపాధ్యాయులతోపాటు పలు శాఖల్లోని ఉద్యోగులకు ఈ నెల ఒకటో తేదీన వేతనాలు అందలేదు.
ఇదీ చదవండి: ‘చంద్రబాబుగారూ.. ఇంత ద్రోహమా? ఇంతటి బరితెగింపా?’
రెండో తేదీ కొంత మంది ఉద్యోగులకు వేతనాలను ప్రభుత్వం జమ చేయగా, అయితే 4వ తేదీ కూడా ఉపాధ్యాయులు ఎవరికీ జీతాలు అందలేదు. జీతాల కోసం ప్రతి నెలా ఎదురుచూపులు తప్పడం లేదని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గత నెల కూడా ఉపాధ్యాయులకు ఒకటో తేదీన వేతనాలు జమచేయలేదు. ప్రతి నెలా 6, 7 తేదీల వరకు జీతాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment