puttaparthy
-
‘క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రం.. డైనమిక్ లీడర్ కావాలి’
సాక్షి, అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్లిష్టమైన పరిస్థితిలో ఉందని, ఇలాంటి సమయంలో వైఎస్ జగన్ లాంటి డైనమిక్ లీడర్ నాయకత్వం అవసరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి కడపల శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పుట్టపర్తిలోని సాయి ఆరామం హోటల్లో కార్యకర్తలతో కలసి ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పదవులు, టిక్కెట్ల కోసం వైఎస్సార్ సీపీలోకి రాలేదని అన్నారు. పార్టీ ఆదేశాలు, అవసరాల మేరకు తన అనుభవంతో సేవ చేస్తానని తెలిపారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన జనరంజక పథకాలు రూపు మాపి రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి, దౌర్జన్యం మితిమీరాయని ధ్వజమెత్తారు. చంద్రబాబు చివరకు దేవాలయాలను కూడా వదలడం లేదని విమర్శించారు. టీటీడీలో స్వామి వారి నగలు, వజ్రాలు మాయమైన వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. -
అలరించిన సంగీత కచేరి
పుట్టపర్తి అర్బన్: శరన్నవరాత్రుల సందర్భంగా శుక్రవారం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి మిర్పురీ సంగీత కళాశాల విద్యార్థులు నిర్వహించిన సంగీత కచేరి భక్తులను పరవశింపజేసింది. ‘అచింత్య రూపిణి సాయిమా’ అంటూ సత్యసాయిని కీర్తిస్తూ విద్యార్థులు కచేరీ చేశారు. కార్యక్రమంలో భాగంగా త్యాగరాజు రచించి హిందోళరాగంలో ఆలపించిన పాటలతో భక్తులు మైమరిపోయారు. ఇందులో మాతేశ్వరి పరమేశ్వరి, తుకారాం భైరవీ రాగంలో పాడిన ‘స్వామికృపాకరి కరణ’ పాట అందరినీ మంత్రముగ్ధులను చేసింది. -
అలరించిన ‘దైవం మానస రూపేణా’
పుట్టపర్తి అర్బన్: దశావతారాలు దాల్చిన భగవంతుడు.. కలియుగంలో సత్యసాయి అవతారం దాల్చి భక్తులను ఆదుకుంటున్నారన్న కథాంశంతో తెలంగాణ భక్తులు అత్యద్భుతంగా ప్రదర్శించిన నృత్య నాటకం అందరినీ అలరించింది. పర్తియాత్ర పేరుతో తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూలు, గద్వాల్ జిల్లాల నుంచి పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి విచ్చేసిన వేలాది మంది భక్తులు రెండో రోజు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మానవాళిని సత్యం, శాంతి, దయ, ప్రేమవంటి నాలుగు కాళ్లపై నడుపుతున్న మహోన్నత శక్తి సత్యసాయికి తప్ప మరో వ్యక్తికి లేదన్న భావంతో నిర్వహించిన నాట్య నృత్యం రంజింపజేసింది. ఈ సందర్భంగా సత్యసాయి సేవాదళ్ సభ్యుల అధ్యక్షుడు మాట్లాడుతూ, సత్యసాయి బాబా పేరుతో చేస్తున్న సేవా కార్యక్రమాలు, ఉచిత అన్నదానం, ఉచిత వైద్యం, ఉచిత విద్య మానవాళికి వరాలన్నారు. అనంతరం మహామంగళహారతి, సత్యసాయిని కీర్తిస్తూ భజన కార్యక్రమాలు నిర్వహించారు. -
పుట్టపర్తిలో భారీ అగ్నిప్రమాదం
పుట్టపర్తి అర్బన్: పుట్టపర్తిలోని గోపురం రెండో వీధిలో ఉన్న సాయి పల్లవి అపార్ట్ మెంట్లో నివాసముంటున్న మాజీ మున్సిపల్ చైర్మెన్ రామాంజినేయులు ఇంట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రూ.25 లక్షల ఆస్తినష్టం జరిగినట్లు రామాంజినేయులు తెలిపారు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు... బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత షార్ట్ సర్క్యూట్ జరగడంతో ఇంట్లోని అన్ని విలువైన వస్తువులూ కాలి బూడిదయ్యాయన్నారు. పనిమీద తాను విజయవాడకు వెళ్లడంతో భార్య మాధవీలత, కుమార్తెలు బిందు ప్రమద్వర, వేద మరుద్వతిలు ఇంట్లోనే నిద్రిస్తున్నట్లు చెప్పారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో తన కుటుంబ సభ్యులు బయటకు పరుగులు తీశారన్నారు. వెంటనే అగ్నిమాపకశాఖ సిబ్బందికి తెలియజేయగా వారు మంటలను అదుపులోకి తెచ్చినట్లు అధికారులు చెప్పారు. ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్లు పేలకపోవడంతో ప్రమాదం తప్పిందన్నారు. ఈ ఘటనపై పోలీస్‌లకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సీఐ బాలసుబ్రమణ్యంరెడ్డి చెప్పారు. రామాంజినేయులు మున్సిపల్ కమిషనర్‌గానూ, పుడా వైస్ చైర్మెన్‌గాను సుమారు 6 సంవత్సరాలు పని చేశారు. గత సంవత్సరం ఏసీబీ దాడుల్లో సస్పెన్షన్‌కు గురైనా పిల్లల చదువుల నిమిత్తం పుట్టపర్తిలో నివాసం ఉంటున్నారు. ఈ ఘటనపై రామాంజనేయులును సంప్రదించగా ఇది కుట్రపూరితంగా జరిగిందేమోనన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. -
ప్రశాంతి నిలయంలో పంద్రాగస్టు సంగీత కచేరీ
పుట్టపర్తి అర్బన్: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సంగీత కచేరీ నిర్వహించారు. సత్యసాయి మిర్పురి సంగీత కళాశాల విద్యార్థులు మంగళవారం సాయంత్రం నిర్వహించిన సంగీత కచేరీ భక్తులను తన్మయత్వంలో ముంచెత్తింది. కర్ణాటక, మలయాలీ,హిందూస్థానీ సంగీతంతో భక్తులను మంత్రముగ్దుల్ని చేశారు. జగదోద్ధారణ, చందన చర్చిత, దేశ్ హమారా యా దేశ్ హమారా, తదితర స్వాతంత్య్ర దేశ భక్తుల జీవిత గాథలతో ముడిపడిన పాటలు ఆలపించారు. సత్యసాయి మహా సమాధిని అందంగా అలంకరించారు. సత్యసాయి విద్యాసంస్థల విద్యార్థులు మహాసమాధి దర్శనం తర్వాత సంగీత కచేరీ నిర్వహించారు. -
మార్మోగిన సాయి నామస్మరణ
పుట్టపర్తి అర్బన్ : విజయనగరం జిల్లా వాసులు చేసిన సాయి నామస్మరణతో పుట్టపర్తి వీధులు పులకించాయి. పర్తియాత్ర పేరుతో పుట్టపర్తికి చేరుకున్న విజయనగరం జిల్లా సత్యసాయి భక్తులు స్వామివారి పల్లకీని ఊరేగిస్తూ ఆలపించిన గీతాలు అందరినీ ఆకట్టుకున్నాయి. విజయనగరం జిల్లాలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన సాయి భక్త బృందం పుట్టపర్తికి విచ్చేశారు. సత్యసాయి చిత్రపటాన్ని ప్రత్యేకంగా అలంకరించిన రథంపై పట్టణంలోని గణేష్ గేట్, ఆర్టీసీ బస్టాండ్, గోపురం వీధి, హనుమాన్ ఆలయం తదితర చోట్ల ఊరేగించారు. కార్యక్రమంలో కోలాటం, చెక్కభజన చేస్తూ మహిళలు ఆడిపాడారు. అనంతరం సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు. -
ఎస్బీఐకి నగదు తీసుకెళుతున్న కారు బోల్తా
పుట్టపర్తి అర్బన్ : గోరంట్ల ఎస్బీఐ బ్రాంచ్‌కి నగదు తరలించే కారు పుట్టపర్తి మండలం పెడపల్లి ఈద్గా మలుపు వద్ద శుక్రవారం బోల్తా పడింది. ఈ ఘటనలో పలువురు ఉద్యోగులుకు స్వల్ప గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. ఉదయం అద్దెకు కారు తీసుకుని గోరంట్ల నుంచి తాడిపత్రికి నగదు తీసుకురావడానికి ఇద్దరు సెక్యూరిటీతో కలసి మరో ఇద్దరు ఉద్యోగులు వెళ్లినట్లు గోరంట్ల ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్‌రావు చెప్పారు. నగదు తీసుకొని తిరిగి వస్తుండగా పెడపల్లి దాటి ఈద్గా మలుపు వద్దకు రాగానే టైరులో ఇనుప మేకు గుచ్చుకుని పంక్చరైంది. కారు అదుపు తప్పి రోడ్డు పక్కన గుంతలోకి బోల్తా పడింది. కారు నుజ్జునుజ్జు అయ్యింది. అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గోరంట్ల మేనేజర్‌కు సమాచారం అందించగానే ప్రత్యేక వాహనం తీసుకొచ్చి సిబ్బందిని సత్యసాయి ఆస్పత్రికి తరలించారు. నగదు పెట్టెను మరో కారులో గోరంట్ల ఎస్బీఐ బ్రాంచ్‌కు తీసుకెళ్లారు. రూరల్ ఏఎస్ఐ ప్రసాద్ కేసు నమోదు చేసుకున్నారు. -
మద్యం దుకాణం వద్దంటూ ఆందోళన
నల్లమాడ / కదిరి : జనావాసాల నడుమ మద్యం దుకాణం ఏర్పాటు చేయవద్దని డిమాండ్ చేస్తూ గురువారం నల్లమాడ, కదిరిలో విద్యార్థులు, మహిళలు ధర్నాకు దిగారు. నల్లమాడలో గంగా థియేటర్ కూడలిలో విద్యార్థులు, మహిళలు రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. దాదాపు గంటపాటు నిరసన తెలిపి అనంతరం ఎక్సైజ్ సీఐ భీమలింగప్పకు వినతిపత్రం ఇచ్చారు. ఎట్టిపరిస్థితుల్లో జనావాసాల నడుమదుకాణం ఏర్పాటు చేయకూడదని డిమాండ్ చేశారు. దీంతో సీఐ నల్లమాడకు వచ్చి దుకాణం ఏర్పాటు చేయనున్న అద్దె భవనాన్ని పరిశీలించారు. సమీపంలోని చర్చి, శివాలయం నుంచి అద్దె భవనం ఎన్ని మీటర్ల దూరంలో ఉందో కొలతలు వేస్తుండగా స్థానికులు మరోసారి అడ్డుకున్నారు. సీపీఐ మండల కార్యదర్శి చంద్ర ఆధ్వర్యంలో పాత బాలాజీ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు వీరికి మద్దతు పలికారు. దీంతో తిరిగి ఆందోళన చేపట్టగా ట్రాఫిక్ స్తంభించింది. విషయం తెలుసుకున్న తహసీల్దార్ ఏఎస్ఏ బాషా, ఎక్సైజ్ సీఐ భీమలింగప్ప వారికి నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. అలాగే కదిరిలో ఇళ్లమధ్య మద్యం దుకాణం ఏర్పాటు చేయడంపై మహిళలు కన్నెర్ర జేశారు. పోలీసులు, ఎక్సైజ్ అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా పట్టించుకోకపోయే సరికి ఇక లాభం లేదని వారే రంగంలోకి దిగారు. మద్యం దుకాణంలోకి దూరి మద్యం సీసాలను బయటకు తెచ్చి అక్కడే పగులగొట్టారు. పక్కనే ఉన్న మద్యం సిట్టింగ్ రూంలోని ఫర్నీచర్ మొత్తాన్ని బయటకు విసిరేశారు. అనంతరం నేరుగా ఆర్డీఓ కార్యాలయం వద్దకు చేరుకుని గంటపాటు నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి మహిళలపై మండిపడ్డారు. మద్యం దుకాణం «ధ్వంసం చేసిన మహిళలందరిపై కేసులు నమోదు చేస్తామని బెదిరించారు. అనంతరం అందరి పేర్లను నమోదు చేసుకుని వారితో సంతకాలు తీసుకుని సొంతపూచీ కత్తుపై వదిలేశారు. స్థానిక సీపీఎం నాయకులు నరసింహులు, ఎస్ఎఫ్ఐ నాయకులు కుమార్ నాయుడు మరికొందరు మహిళలకు మద్దతుగా నిలిచారు. -
ఘనంగా ఏకాదశి వేడుకలు
పుట్టపర్తి టౌన్ : ప్రశాంతి నిలయంలో తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలలో మహారాష్ట్ర , గోవాకు చెందిన వేలాది భక్తులు పాల్గొన్నారు. మహారాష్ట్ర సత్యసాయి భక్తులు తమకు ఎంతో ప్రీతిపాత్రమైన ఆశాడ ఏకాదశి వేడుకలు ప్రశాంతి నిలయంలో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. మంగళవారం ఉదయం సత్యసాయి మహా సమాధి చెంత మహారాష్ట్ర భక్తుల వేదఠనంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. పండరీనాథున్ని, సత్యసాయిని కొనియాడుతూ భక్తిగీతాలు ఆలపించారు. సాయంత్రం మహారాష్ట్రకు చెందిన బాలవికాస్ విద్యార్థులు ‘గాడ్ లక్కీ నెంబర్ 9’అన్న పేరుతో సంగీత నృత్యరూపకం అందరినీ ఆకట్టుకుంది. చిన్నారులు ప్రదర్శించిన హిరణ్య కషిపుడు, భక్త ప్రహల్లాదుల ఘట్టం భక్తుల హృదయాలను చలింపజేసింది. తర్వాత భక్తులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. వేడుకలను పురస్కరించుకుని సత్యసాయి మహాసమాధిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. -
టీడీపీ ఖాళీ కావడం ఖాయం
పుట్టపర్తి టౌన్ : తెలుగుదేశం పార్టీలో చిత్తశుద్ధితో పనిచేసే కార్యకర్తలను సస్పెండ్ చేస్తూ పోతే భవిష్యత్తులో నియోజకవర్గంలో పార్టీ ఖాళీ కావడం ఖాయమన్న విషయాన్ని మాజీ మంత్రి పల్లెతో పాటు పార్టీ పెద్దలు గుర్తించాలని టీడీపీ బహిష్కృత నేత, నగర పాలక చైర్మన్ పి.సి.గంగన్న తెలిపారు. ఆదివారం తన అనుచరులతో కలిసి పట్టణంలోని హనుమాన్ సర్కిల్లో ఆయన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్బంగా ‘పల్లె వద్దు.. గంగన్న ముద్దు’ అంటూ నినాదాలు రాసిన ప్ల కార్డులను ప్రదర్శించారు. అనంతరం గంగన్న మాట్లాడుతూ పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేసిన తనను సస్పెండ్ చేయడం దురదృష్టకరమన్నారు. పుట్టపర్తి నగర పంచాయతీలో అభివృద్ధి జరగకుండా మంత్రి అడ్డుకున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో తనతో పాటు పార్టీ కోసం పనిచేసే దాదాపు 10 మంది కార్యకర్తలను సస్పెండ్ చేశారని గుర్తుచేశారు. ఇలా సస్పెండ్ చేస్తూ పోతే పార్టీ ఖాళీ అయిపోయి ఒక్క పల్లె మాత్రమే మిగులుతారన్నారు. -
పురపాలకా..ఇదేమి మెలిక!
- అధిష్టానం ఆదేశం బేఖాతర్ - ఉత్కంఠను రేపుతున్న పుట్టపర్తి చైర్మన్ రాజీనామా వ్యవహారం - హామీలు నెరవేరిస్తే పదవికి రాజీనామా : మున్సిపల్ చైర్మన్ పీసీ గంగన్న - హామీలకు పదవికి మెలికపెడుతున్న వైనం పుట్టపర్తి టౌన్ : ముఖ్యమంత్రి ఆదేశంతో మున్సిపల్ చైర్మన్ మార్పు విషయంలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడుతుందని ఆశించిన టీడీపీ శ్రేణులు, పుట్టపర్తి ప్రజలకు తాజా పరిణామాలతో మరింత ఉత్కంఠ పెరిగింది. మున్సిపల్ చైర్మన్‌గా పీసీ గంగన్న రెండున్నరేళ్ల పదవీకాలం ముగియడంతో తక్షణమే రాజీనామా చేసి, ఇతరులకు అవకాశం కల్పించాలని ఏకంగా పార్టీ అధిష్టానం ఆదేశించినా ఆయన మాత్రం బెట్టువీడడంలేదు. అధిష్టానం ఆదేశాలను శిరసావహిస్తానని ఓ వైపు చెప్తూనే.. మరో వైపు గత ఎన్నికలప్పుడు పార్టీ కార్యకర్తలు, నాయకులకు ఇచ్చిన హామీలను ‘పల్లె’ నెరవేరిస్తే రాజీనామా చేస్తానంటూ మెలిక పెడుతూ పార్టీకి మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈనెల 9న ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పుట్టపర్తి ఎయిర్‌పోర్టులోకి మున్సిపల్ చైర్మన్ హోదాలో పీసీ గంగన్నను పోలీసులు అనుమతించలేదు. దీంతో పోలీసు అధికారులపై నోరుపారేసుకున్నారు. జిల్లాలో అలజడి రేగింది. గంగన్న దురుసు వైఖరితో పోలీసు శాఖతోపాటు, రెడ్డి సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఇది టీడీపీకి కూడా ఇబ్బందిగా మారింది. దీంతో గంగన్నపై పార్టీ పెద్దలు గుర్రుగా ఉన్నారు. రాజీకాని ‘పంచాయితీ’ : మాజీ మంత్రి ‘పల్లె’తోపాటు, పుట్టపర్తి టీడీపీ నాయకులు చైర్మన్ పదవి కోసం రెండున్నరేళ్ల ఒప్పందాన్ని జిల్లా పెద్దల వద్దకు తీసుకువచ్చారు. జిల్లా పెద్దల పంచాయితీలోనూ గంగన్న రాజీనామాకు ఆంగీకరించకపోవడంతో, పార్టీ అధిష్టానం వద్దకు చేరింది. తలనొప్పిగా మారిన జిల్లాలోని పార్టీ వ్యవహారాలపై రాష్ట్ర రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్షలోనూ పుట్టపర్తి చైర్మన్ రాజీనామా వ్యవహారం వాడీవేడిగా సాగింది. తక్షణమే రాజీనామా చేయించి ఇతరులకు అవకాశం కల్పించాలని టీడీపీ జిల్లా ఇన్చార్జ్ మంత్రి దేవినేని, పార్టీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథిని ఆదేశించినట్లు తెలుస్తోంది. సాయి ఆరామంలో ‘కొత్తనాటకం’ : ఇంతా జరుగుతున్నా... పుట్టపర్తి మున్సిపల్ చైర్మన్ పదవి విషయంలో జిల్లాలో ఉత్కంఠ ఉన్నా.. పార్టీ పెద్దలకు షాకిస్తూ శుక్రవారం తన అనుచరులతో కలసి గంగన్న సాయిఆరామంలో సమావేశం నిర్వహించారు. కొత్త నాటకానికి తెరలేపారు. గత ఎన్నికల సమయంలో ‘పల్లె’ రఘునాథరెడ్డి, పుడా, పుట్టపర్తి నగర పంచాయతీ వైస్ చైర్మన్, పుట్టపర్తి ఎంపీపీ, సహకార సంఘం అధ్యక్ష పదవుల విషయంలో ఇచ్చిన హామీలను తొలుత నెరవేర్చాలని, తరువాత పార్టీ పెద్దలు ఆదేశాల మేరకు వెంటనే తను రాజీనామా చేస్తానంటూ మెలిక పెట్టారు. ఈ పరిణామాలను గమనిస్తున్న వారు చైర్మన్ పదవికి గంగన్న రాజీనామా చేసే పరిస్థితిలేదని చర్చించుకున్నారు. డిమాండ్లు నెరవేరిస్తే రాజీనామా చేస్తా : పీసీ గంగన్న గత ఎన్నికల సమయంలో ‘పల్లె రఘునాథరెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్న తమ డిమాండ్‌ను నెరవేరిస్తే, అధిష్టానం ఆదేశం మేరకు తాను మున్సిపల్ చైర్మన్‌పదవికి రాజీనామా చేస్తానని పీసీ గంగన్న తేల్చి చెప్పారు. శుక్రవారం స్థానిక సాయిఆరామంలో తన అనుచరులతో కలసి ఆయన సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రెండున్నరేళ్ల పదవీకాలం ముగిసిన నేపథ్యంలో పార్టీ అధిష్టానం తనను చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని ఆదేశించిన మాట వాస్తవమేనన్నారు. చైర్మన్ ఒప్పందం కంటే ముందు చేసుకున్న పలు ఒప్పందాలను, ఎమ్మెల్యే పల్లె రఘనాథరెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. పుట్టపర్తి సహకార సంఘం అధ్యక్ష పదవి ఒప్పందం మేరకు రెండున్నరేళ్లకు ఓబులేసు రాజీనామా చేయగా, ముమ్మనేని వెంకటరాముడు అధ్యక్ష పదవి చేపట్టాడని, అయితే అధికార పార్టీ నాయకులే సమావేశాలు జరగకుండా అడ్డుకుని పాలకమండలి రద్దేయ్యే విధంగా చేశారన్నారు. అందుకు బాధ్యులపై చర్యలు తీసుకోలేదన్నారు.పుట్టపర్తి ఎంపీపీ పదవి ఒప్పందం మేరకు అమలు కాలేదన్నారు. ఈ విషయాలనన్నింటినీ ముఖ్యమంత్రి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి దృష్టికి తీసుకుపోతామని, వారి నిర్ణయం మేరకు తాను చైర్మన్ పదవిపై నిర్ణయం తీసుకుంటానన్నారు. కార్యక్రమంలో ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ జయరాంనాయుడు, కౌన్సిలర్ సుభాషిణి, నాయకులు కోనంకి చంద్రశేఖర్, వెంకటరాముడు, ఊరువాకిలి సురేష్‌నాయుడు, ముత్యాల మురళీ, గుట్లపల్లి గంగాద్రి, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు ముమ్మనేని వెంకటరామడు, బీవీప్రసాద్, సత్యనారాయణ, పుట్లగంగాద్రి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
గంగన్నా.. నోరు అదుపులో పెట్టుకో
- ఏపీ రెడ్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన పుట్టపర్తి టౌన్ : రెడ్డి సామాజిక వర్గం అధికారులను లక్ష్యంగా చేసుకుని టీడీపీ నేత, పుట్టపర్తి నగర పంచాయతీ చైర్మన్ పి.సి.గంగన్న దుర్బాషలాడడం సిగ్గు చేటని, నోరు అదుపులో పెట్టుకోకపోతే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఏపీ రెడ్ల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గంగులకుంట నరేష్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా సత్యసాయి ఎయిర్పోర్ట్ వద్ద పోలీసులపై పి.సి.గంగన్న అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా శనివారం ఏపీ రెడ్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.ఎనుములపల్లి గణేష్ సర్కిల్ నుంచి ర్యాలీగా వెళ్లి పుట్టపర్తి పట్టణ పోలీస్‌స్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నరేష్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ పుట్టపర్తికి ప్రథమ పౌరుడిగా ఉన్న గంగన్న తన స్థాయిని మరచి బజారు మనిషిలా అధికారులు, రెడ్డి సామాజిక వర్గాన్ని కించపరిచేలా ప్రవర్తించడం హేయమన్నారు. అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదన్నారు. ఆయన వ్యాఖ్యలను బీసీ వర్గాలే తప్పు పడుతున్నాయన్నారు.స్పందించిన సీఐలు బాలసుబ్రహ్మణ్యంరెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ విధుల్లో ఉన్న ఎస్ఐ ఫిర్యాదు మేరకు గంగన్నపై కేసు నమోదు చేశామన్నారు. ఒకటి, రెండు రోజుల్లో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తామన్నారు. కార్యక్రమంలో సంఘం నేతలు బీడుపల్లి మాధవరెడ్డి, కౌన్సిలర్ నారాయణరెడ్డి, జిల్లా అధ్యక్షుడు కమటం శేషారెడ్డి, పుట్టపర్తి మండల నాయకులు బాబుల్‌రెడ్డి, సాయిరాంరెడ్డి, అమర్నాథ్రెడ్డి, హనుమంతరెడ్డి, భాస్కర్‌రెడ్డి, రమణారెడ్డి, ఆదినారాయణరెడ్డి, మురశీకృష్ణారెడ్డి, తిప్పారెడ్డి, రఘునాథరెడ్డి, నాగిరెడ్డి, క్రిష్ణారెడ్డి, హిందూపురం ధర్మవరం, పరిగి, గోరంట్ల తదితర మండలాలకు చెందిన రెడ్డి సామాజిక వర్గం యువకులు పాల్గొన్నారు. -
పుట్టపర్తి ఎస్ఐ, హెడ్‌కానిస్టేబుల్ సస్పెన్షన్
అనంతపురం సెంట్రల్ : పుట్టపర్తి రూరల్ ఎస్ఐ రాఘవరెడ్డి, హెడ్‌కానిస్టేబుల్ వెంకటరాముడును సస్పెండ్ చేస్తూ అనంతపురం రేంజ్ డీఐజీ ప్రభాకర్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్పీ రాజశేఖరబాబు ఇచ్చిన నివేదికల ఆధారంగా డీఐజీ ఈ నిర్ణయం తీసుకున్నారు. పుట్టపర్తి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో హత్యాయత్నం కేసులను కూడా పంచాయితీలు పెట్టి సెటిల్మెంట్ చేస్తున్నారనే అభియోగాలు వచ్చాయి. కొంతమంది బాధితులు కూడా నేరుగా వచ్చి ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్పీ లోతుగా విచారించారు. విచారణలో ఆరోపణలన్నీ నిజమేనని తేలడంతో నివేదికను డీఐజీకి పంపించగా, ఆయన సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
‘కేంద్ర మంత్రి పర్యటనలో ప్రోటోకాల్ విస్మరించారు’
పుట్టపర్తి టౌన్ : ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి కేంద్ర మంత్రి అనంతకుమార్ జిల్లాలో పర్యటించిన సందర్భంగా అధికారులు ప్రొటోకాల్ నిబంధనలను విస్మరించడంపై బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, బీజేపీ జిల్లా అద్యక్షుడు అంకాల్‌రెడ్డి తదితరులు సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం జిల్లా పర్యటనలో భాగంగా పుట్టపర్తి విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రికి పార్టీ జిల్లా నాయకులతో కలసి ఫిర్యాదు చేశారు. తీవ్ర దుర్బిక్ష పరిస్థితులు నెలకొన్న కదిరి ప్రాంతంలో గురువారం కేంద్ర మంత్రి అనంతకుమార్ పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారని, ఈ సందర్భంగా ప్రొటోకాల్ మేరకు ఆయనకు స్వాగతం పలకాల్సిన ఆర్డీఓ, స్థానిక తహసీల్దార్ పట్టించుకోలేదన్నారు. అందుకు స్పందించిన సీఎం వెంటనే ప్రొటోకాల్ అంశంపై విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కత్తిరాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
భూములు పరిశీలించిన సింగపూర్ ప్రతినిధులు
పుట్టపర్తి అర్బన్ : ఇటీవల ఏపీఐఐసీ కొనుగోలు చేసిన భూములను ఆదివారం సింగపూర్‌కు చెందిన కంపెనీ ప్రతినిధులు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డితో కలసి పరిశీలించారు. పరిశ్రమల కోసం మండలంలోని కప్పలబండ గ్రామం వద్ద రైతులతో కొనుగోలు చేసిన 101 ఎకరాల భూమిని వారు పరిశీలించారు. ఆ స్థలానికి బెంగళూరు ఎయిర్ పోర్టు 100 కిలోమీటర్ల దూరం ఉందని, రైల్వే లైను, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, హంద్రీనీవా కాలవ సదుపాయాలపై మంత్రి వారికి వివరించారు. కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు. -
పెళ్లికొస్తూ.. పై లోకాలకు..
కర్ణాటకలో రోడ్డు ప్రమాదం ముగ్గురి దుర్మరణం - మరో పది మందికి గాయాలు - మృతుల్లో అమడగూరు మండల యువకుడు వంశోద్ధారకుడి కోసం ఆ దంపతులు ఎన్నో నోములు నోచారు. వారి నోముల ఫలితంగా వరుసగా నలుగురు ఆడబిడ్డల తరువాత పుట్టిన బిడ్డ అతను. అందరి ఆశలు అతని మీదే. పూలమ్మి మంచి చదువు చదివించారు. ఇప్పుడిప్పుడే ఓ ఉద్యోగం సాధించి, జీవితంలో నిలదొక్కుకుంటున్న తరుణంలో విధికి కన్నుకుట్టిందేమో.. తెల్లారితే దాయాదుల ఇంట్లో జరిగే పెళ్లికి బైక్‌లో బయలుదేరిన ఆ యువకుడ్ని మార్గమధ్యంలోనే మృత్యువు రోడ్డు ప్రమాదరూపంలో కబళించి, కాటికి పంపింది. కన్నవారికి కడుపుకోత మిగిల్చింది. - అమడగూరు(పుట్టపర్తి) అమడగూరు మండలం చీకిరేవులపల్లికి చెందిన రెడ్డమ్మ, రమణారెడ్డి దంపతుల ఏకైక కుమారుడు శివశంకర్‌రెడ్డి(25) కర్ణాటక రాష్ట్రం బెంగళూరు-హొసకోట సమీపంలోని శెట్టిపల్లి క్రాస్‌లో శనివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఇదే ప్రమాదంలో కర్ణాటక వాసులు మరో ఇద్దరు మరణించగా, ఇంకో పది మంది గాయాపడ్డారని పోలీసులు, మృతుని బంధువులు తెలిపారు. ఎలా జరిగిందంటే.. బీఫార్మసీ చేసిన శివశంకర్‌రెడ్డికి బెంగళూరులో ఇటీవలే ఉద్యోగం వచ్చింది. తమ స్వగ్రామంలోని దాయాదుల ఇంట్లో ఆదివారం ఉదయమే జరగనున్న పెళ్లికి అతను శనివారం రాత్రే బైక్‌లో బయలుదేరాడు. మార్గమధ్యంలో శెట్టిపల్లి క్రాస్‌లోకి రాగానే.. చింతామణి నుంచి బయలుదేరిన మినీ బస్సు ముందుగా వెళ్తున్న కారును ఓవర్‌టెక్ చేయబోయింది. ఈ క్రమంలో అదుపు తప్పి కారును బలంగా ఢీకొనడంతో మినీబస్సు మూడు పల్టీలు కొట్టి, ఎడమ వైపు నుంచి కుడి వైపునకు రోడ్డుకడ్డంగా పడిపోయింది. ఈ ప్రమాదంలో కర్ణాటక వాసులు ఇద్దరు మృతి చెందగా, మరో పది మంది గాయపడి ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో బెంగళూరు నుంచి వచ్చిన శివశంకర్‌రెడ్డి బైక్ మినీ బస్సును ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మరణించారు. పువ్వుల్లో పెట్టి చూసుకున్నా... పూట గడవడమే కష్టమైనా కుటుంబంలో పుట్టినా.. కసి, క్రమశిక్షణ, పట్టుదలతో బీఫార్మసీ పూర్తి చేసి ఇప్పుడిప్పుడే ఉద్యోగంలో స్థిరపడుతున్న కుమారుడ్ని చూసి వృద్ధ తల్లిదండ్రులు, ఆడబిడ్డలు, బంధువులు అతనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే చెట్టంత కుమారుడు విగతజీవిగా మారడంతో వారు తల్లడిల్లిపోయారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురాగానే వారు కుప్పకూలిపోయారు. ఇక మేం ఎవరికోసం బతకాలి కొడకా.. ముసలోళ్లమైన మాకు అండగా ఉంటావనుకుంటిమే. ఇక మాకు దిక్కెవరు తండ్రీ’ అంటూ కుమారుడి మృతదేహంపై పడి తల్లిదండ్రులు హృదయ విదారకంగా విలపించిన తీరు అందరి హృదయాలను బరువెక్కించింది. పుట్టపర్తి మండలంలో మరొకరు.. పుట్టపర్తి అర్బన్ : గోరంట్ల-కొత్తచెరువు మార్గంలోని పుట్టపర్తి మండలం జగరాజుపల్లి సమీపంలో గల మంగళకర కళాశాల వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గోరంట్ల మండలం కల్లితండాకు చెందిన లక్ష్మానాయక్(55) అక్కడికక్కడే మరణించగా, మరో ఆరుగురు గాయపడ్డారు. ఎస్ఐ రాజశేఖర్‌రెడ్డి కథనం మేరకు.. ఉదయం 8 గంటలకు గోరంట్ల నుంచి ఎనుములపల్లికి బయలుదేరిన నరసింహమూర్తి ఆటోలో ఆరుగురు ప్రయాణిస్తున్నారు. మార్గమధ్యంలోని మంగళకర కళాశాల వద్దకు రాగానే ఐచర్ వాహనం ఓవర్‌టెక్ చేసే ప్రయత్నంలో ఆటోను ఢీకొంది. ఆటోను 20 మీటర్ల దూరం ఐచర్ వాహనం ఈడ్చుకెళ్లింది. ఆటోలో ప్రయాణిస్తున్న కల్లితండాకు చెందిన లక్ష్మానాయక్ మరణించగా, పుట్టగుండ్లపల్లికి చెందిన వెంకటమ్మ, ఓబుళమ్మ, గువ్వలగుట్టపల్లికి చెందిన గంగమ్మ మరో మహిళ, జగరాజుపల్లికి చెందిన గౌతమి అనే విద్యార్థిని, ఆటో డ్రైవర్ నరసింహమూర్తి, గుమ్మయ్యగారిపల్లికి చెందిన అంజనేయులు తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో అటుగా వచ్చిన ప్రయాణికులు 108కు సమాచారం అందించారు. వారిని వెంటనే పుట్టపర్తి సత్యసాయి సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. కాగా లక్ష్మానాయక్ బ్రాహ్మణపల్లి తండాలో జరిగే వివాహానికి హాజరయ్యేందుకు వెళ్తూ ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహంపై పడి భార్య సాలీబాయి న్నీరుమున్నీరయ్యారు. వెంబడించి పట్టుకున్న గ్రామస్తులు నిర్లక్ష్యంగా నడపడగమే గాక.. ఒకరి మృతికి కారణమైన ఐచర్ వాహనాన్ని ప్రమాదం జరిగిన వెంటనే ఆపకుండా వెళ్లిపోయిన డ్రైవర్‌ను గ్రామస్తులు వెంబడించారు. చివరకు కప్పలబండ వద్ద పట్టుకున్నారు. విషయం తెలిసిన వెంటనే కొత్తచెరువు ఎస్ఐ రాజశేఖరరెడ్డి, పుట్టపర్తి రూరల్ ఏఎస్ఐ ప్రసాద్ తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పెనుకొండ ఆస్పత్రికి తరలించారు. -
ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి
ప్రపంచ దేశాల్లోని అశేష భక్త కోటితో ఆధ్మాత్మిక గురువుగా కొలువబడుతున్న సత్యసాయి నడయాడిన పుణ్యభూమి పుట్టపర్తి. ప్రశాంతతకు మారుపేరుగా ప్రశాంతి నిలయంగా పేరొందిన పుట్టపర్తిలో నిత్య ఆధ్యాత్మిక శోభతో పర్యాటకులను ఆకట్టుకుంటోంది. సత్యసాయి మహానిర్యాణం అనంతరం రూపుదిద్దుకున్న సత్యసాయి మహాసమాధి, సత్యసాయి నెలకొల్పిన కట్టడాలు, ఆయన జీవిత చరిత్రతో ముడిపడిన అంశాలు ఇక్కడికు వచ్చే పర్యాటకులను సంబ్రమాశ్చర్యాలకు గురిచేస్తున్నాయి. ఇక్కడ సత్యసాయి ఆశ్రమం, ప్రశాంతి మందిరంలోని సాయికుల్వంత్ సభా మందిరంలో అరుదైన పాలరాతితో నిర్మితమైన సత్యసాయి మహాసమాధి, చారిత్రక కట్టడమైన సర్వధర్మ స్థూపం, గడ్డి మైదానాలు, సత్యసాయి చరిత్రను తెలిపే పుస్తక విక్రయశాలలు, ప్రశాంతి నిలయానికి అనుకుని ఉన్న కొండపై మూడు అంతస్తుల్లో నిర్మితమైన సత్యసాయి పూర్వపు మ్యూజియం, సత్యసాయి యూనివర్శిటీ, కొండపై కల్పవృక్షం (చింత చెట్టు), సత్యసాయికి జన్మనిచ్చిన పెద్ద వెంకమరాజు, ఈశ్వరమ్మ పుణ్య దంపతుల సమాధులు, హనుమాన్ సర్కిల్లోని శివాలయం, సత్యసాయి నిర్మించిన అద్బుతమైన హిల్వ్యూవ్ క్రికెట్ మైదానం, కొండపై 66 అడుగుల హనుమంతుడు, షిరిడీ సాయి, ఏసుక్రీస్తు, శ్రీకృష్ణుడు, బుద్దుడు, జోరాస్టర్ల ప్రతిమలు, గోకులం వద్ద సత్యసాయి నిర్మించిన మిరుపురి సంగీత కళాశాల, ఇండోర్ స్టేడియంను చూడవచ్చు. జిల్లా కేంద్రమైన అనంతపురం నుంచి సుమారు 84 కిలోమీటర్లు ప్రయాణించి పుట్టపర్తి చేరుకోవచ్చు. ఇక్కడ అన్ని రకాల వసతి సౌకర్యాలు ఉన్నాయి. - పుట్టపర్తి టౌన్ -
పుట్టపర్తి టీడీపీలో ముదిరిన విభేదాలు
బుక్కపట్నం : కొన్నాళ్లుగా పుట్టపర్తి తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య తలెత్తిన విభేదాలు మరింత ముదిరి పాకానా పడ్డాయి. నగర పంచాయతీ చైర్మన్‌గా పదవీ కాలం ఒప్పందం ప్రకారం పూర్తయినా పీసీ గంగన్న పదవి నుంచి దిగిపోకపోవటంతో ప్రత్యర్థులు మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి అండతో గంగన్నపై వేటుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. గతంలో అనేకసార్లు అధిష్టానం ముందు పంచాయితీ జరిగినా పదవి నుంచి దిగేందుకు గంగన్న ససేమీరా అనటంతో ప్రత్యర్థులు ఈ సారి ఏకంగా అమరావతిలోనే ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి లోకేశ్‌ను నేరుగా కలసి అప్పట్లో ఒప్పందం చేసుకున్న అగ్రిమెంట్ పత్రాలు సమర్పించారు. ఒప్పందం ప్రకారం గంగన్న రెండున్నరేళ్లు బెస్త చలపతి రెండున్నరేళ్లు ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందాన్ని గంగన్న ఉల్లంఘించాడని బెస్త చలపతి వర్గం గట్టిగా వినిపించింది. ఒక వేళ పీసీ పదవి నుంచి దిగక పోతే పార్టీ నుంచి బహిష్కరించి సాగనంపేలా పావులు కదిపారు. ఈ సారీ ఎలాగైనా గంగన్నను చైర్మన్ పదవి నుంచి దింపేందుకు మాజీ మంత్రి పల్లె గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. గంగన్న పదవికి రాజీనామా చేస్తాడా లేక ఎదురు తిరుగుతాడా అనే విషయం రానున్న అతి కొద్ది రోజుల్లో తేలనుంది. ఈ విభేదాలు ఇలాగే కొనసాగితే గంగన్న పార్టీలో ఉంటారా లేదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. టీడీపీలో ఉన్న విభేదాల వల్ల నగర పంచాయతీ అభివృద్ధి కుంటు పడిందని పలువురు పేర్కొంటున్నారు. -
‘ పుట్టపర్తి సుందరీకరణపై ప్రత్యేక దృష్టి ’
పుట్టపర్తి టౌన్ : పుట్టపర్తిని సుందరంగా తీర్చిదిద్ది ఆదర్శంగా నిలుపుతామని స్వచ్చాంధ్ర మిషన్ ఎగ్జిక్యూటివ్ వైస్‌చైర్మన్ డాక్టర్ పి.ఎల్.వెంకటరావు తెలిపారు. ఆదివారం ఆయన నగర పంచాయతీ చైర్మన్ గంగన్న, కమిషనర్ విజయభాస్కర్‌రెడ్డితో కలసి పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో శిల్పారామం, థీంపార్క్, చిత్రావతి సుందరీకరణ ఘాట్, ప్రశాంతి గ్రాం, ఎనుములపల్లి, కర్ణాటక నాగేపల్లి సర్కిల్ తదితర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటకలోని నాగేపల్లి వద్ద డంప్‌యార్డు ఏర్పాటు చేసి పట్టణంలో సేకరించిన చెత్తతో ఎరువుతయారీ చేసే పద్ధతిని అభివృద్ధి చేస్తామన్నారు. çపట్టణంలో పచ్చదనం పెంపునకు, రైల్వేస్టేషన్ నుంచి పుట్టపర్తి వరకు తొమ్మిది కిలోమీటర్ల మేర బటర్ ఫ్లై లైట్లు వేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. శిల్పారామం, థీంపార్క్ అభివృద్ధికి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరారు. అనంతరం ప్రశాంతి నిలయంలో సత్యసాయి ట్రస్ట్ సభ్యులు ఆర్.జె.రత్నాకర్రాజు, ప్రసాద్‌రావును కలసి రాష్ట్రవ్యాప్తంగా సత్యసాయి సేవాదళ్ సహకారంతో పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. -
పుట్టపర్తి మున్సిపల్ చైర్మన్‌కు షోకాజ్
అనంతపురం టౌన్ : పుట్టపర్తి మునిసిపల్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ నేత పీసీ గంగన్నకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి శనివారం షోకాజ్ నోటీసు జారీ చేశారు. కొంతకాలంగా మాజీ మంత్రి, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డికి వ్యతిరేకంగా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, ఐదు రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. సంజాయిషీ ఇవ్వని పక్షంలో తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
‘చైర్మన్‌గా గంగన్నకే మద్దతు’
పుట్టపర్తి టౌన్ : పుట్టపర్తి నగర పంచాయతీ చైర్మన్ పీఠం మార్పుపై 4వ వార్డు కౌన్సిలర్ బెస్త చలపతి, కొందరు నాయకులు అనవసర రాద్దాంతాన్ని మానుకోవాలని, చైర్మన్‌గా గంగన్నను కొనసాగించడాన్నే సమర్థిస్తున్నామని టీడీపీకి చెందిన మెజారిటీ కౌన్సిలర్లు తేల్చిచెప్పారు. శుక్రవారం పాలకమండలి కౌన్సిల్ హాల్లో సమావేశమైన కౌన్సిలర్లు పీసీ గంగన్నకు మద్దతు ప్రకటించారు. వారు మాట్లాడుతూ కొందరు టీడీపీ నాయకులు లేని పోని మాటలు చెప్పి పల్లెను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. నగర పంచాయతీలో మూడేళ్లుగా అభివృద్ది పనులు జరగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ఆ నాయకులు ఇలాంటి వ్యవహారాలు మానుకోవాలని, లేక పోతే భవిష్యత్తులో పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. ఇప్పటికైనా మాజీ మంత్రి పల్లె, టీడీపీ పెద్దలు నగరపంచాయతీ చైర్మన్ మార్పు విషయంలో కౌన్సిలర్ల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకోవాలని కోరారు. మరో కౌన్సిలర్ షకీల సైతం ఇదే విషయాన్ని ఫోన్లో తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు బీవీ సుభాషిణి, సుబ్బమ్మ, చెన్నక్రిష్ణమ్మ, ఆదినారాయణమ్మ, దిల్షాద్షేక్, శ్రీరాంనాయక్, కళావతి, శివలక్ష్మి, నాయకులు బీవీ ప్రసాద్, మహమ్మద్ రఫీ, రాజప్ప, సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు. -
కమలాపురం బాలుడు పుట్టపర్తిలో ప్రత్యక్షం
బుక్కపట్నం(పుట్టపర్తి) : వైఎస్సార్ జిల్లా కమలాపురానికి చెందిన భారతి, రాజు దంపతుల కుమారుడు గంగరాజు(8) అనంతపురం జిల్లా పుట్టపర్తిలో మంగళవారం ప్రత్యక్షమయ్యాడు. కొత్తచెరువు సీఐ శ్రీధర్, ఎస్ఐ రాజశేఖర్‌రెడ్డి కథనం మేరకు..గంగరాజు ఇంటి నుంచి పారిపోయి వచ్చి గుత్తిలో దిగి, అక్కడి నుంచి మరో రైలులో పుట్టపర్తి చేరుకున్నాడు. ఇక్కడి రైల్వే స్టేషన్లో తచ్చాడుతుండగా.. పోలీసులు గమనించి బాలుడ్ని చేరదీశారు. వివరాలు అడిగి అతని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి పిలిపించారు. అనంతరం సురక్షితంగా వారికి అప్గించారు. అందుకు పోలీసులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. -
‘పల్లె’ తీరుపై టీడీపీ నేతల అసంతృప్తి
పుట్టపర్తి టౌన్ : మంత్రి పల్లె రఘునాథరెడ్డి తీరుపై టీడీపీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ డైరెక్టర్ల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించకుండా మంత్రి నిర్లక్ష్యం చేయడం వల్లే పుట్టపర్తి సహకార సంఘం రద్దయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక సాయి ఆరామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగరపంచాయతీ చైర్మన్ పీసీ.గంగన్న, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు చెన్నకేశవులు, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు ముమ్మనేని వెంకటరాముడు, డైరెక్టర్లు నరసింహులు, బండారు చెన్నప్ప, వెంకటరాముడు తదితరులు మాట్లాడారు. సహకారం సంఘంలో ఏడుగురు టీడీపీ, ఆరుగురు వైఎస్సార్సీపీ డైరెక్టర్లు ఉన్నారన్నారు. గత ఏడాదిగా టీడీపీ డైరెక్టర్ల మధ్య విభేదాలు నెలకొన్నాయన్నారు. పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్న నాయకులకే మంత్రి ప్రాధాన్యత ఇస్తుండటంతో విభేదాలు పరిష్కారం కాకుండాపోయాయన్నారు. ఇద్దరు, ముగ్గురు నాయకుల చెప్పుడు మాటలు వింటూ మంత్రి పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. సహకార సంఘం పాలకవర్గం రద్దుకు మాజీ అధ్యక్షుడు గూడూరు ఓబిలేసు ప్రధాన కారకుడన్నారు. -
రాక్షస పాలనకు చరమగీతం పాడదాం
పుట్టపర్తి టౌన్ : రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాస్వామ్య విలువలకు పాతరవేసి రౌడీయిజానికి, అవినీతికి వంతపాడుతూ రాక్షసపాలన కొనసాగిస్తున్నారని, ఇలాంటి దుష్టపాలనకు చరమగీతం పాడేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు సిద్ధం కావాలని పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం పుట్టపర్తిలోని స్థానిక సాయిఆరామంలో స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనను పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి పుష్ఫగుచ్చంతో అభినందించారు. అనంతరం వైఎస్సార్సీపీ శ్రేణులు, ఉపాధ్యాయులు ఆయన్ను ఘనంగా సన్మానించారు. ఈసందరంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు బాధ్యతారాహిత్య పాలనతో ప్రజలను నిలువునా మోసం చేశారన్నారు. ఎన్నికల హామీలను అటకెక్కించిన ఆయన రైతు, చేనేత, డ్రాక్రా రంగాలను సంక్షోభంలోకి నెట్టారని వివర్శించారు సంక్షేమ పథకాలకు పైసా విదల్చకుండా బడుగు బలహీన వర్గాలను వంచిస్తున్నాడన్నారు. టీడీపీ నాయకులు మహిళలపైనా,అధికారులపైనా దాడులకు తెగబడుతున్నా ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో 2019 ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా కృషి చేయాలన్నారు. అనంతరం వైఎస్సార్సీపీ పుట్టపర్తి సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ హిందూపురం పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లు పూర్తిగా వెనుకబడ్డాయని, చట్టసభల్లో ఈ ప్రాంతం సమస్యలపై పోరాడాలని కోరారు. పుట్టపర్తి నియోజకర్గంలో ఉపాధి లేక గ్రామీణులు కేరళ, బెంగళురుకు వలస పోతున్నా మంత్రి పల్లె రఘునాథరెడ్డి చోద్యం చూస్తున్నారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి డీఎస్ కేశవరెడ్డి, సహాయ కార్యదర్శి లోచర్ల విజయభాస్కర్‌రెడ్డి, ఈశ్వర్‌రెడ్డి, ట్రేడ్యునియన్ జిల్లా అధ్యక్షుడు కొర్రపాడు హుస్సేన్ పీరా, సహకార సంఘం అధ్యక్షులు ఏవీరమణారెడ్డి, నరసారెడ్డి, విశ్రాంత ఎంఈఓ నాగిరెడ్డి, వైఎస్సార్సీపీ పుట్టపర్తి పట్టణ, మండల కన్వీనర్లు మాధవరెడ్డి, గంగాద్రి, కౌన్సిలర్లు నారాయణరెడ్డి, రాంజీనాయక్, ఈశ్వరయ్య, నాయకులు చెరువు భాస్కర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, బీరే నారాయణ, రైల్వేభాస్కర్, గోపాల్‌రెడ్డి, గాజుల వెంకటేష్, శ్రీరాములు, సాయిరాంరెడ్డి, రామిరెడ్డి, శివప్ప, జయచంద్రారెడ్డి, మాజీ సర్పంచ్ తిప్పారెడ్డి, హనుమంతరెడ్డి, సాయినాథ్‌యాదవ్, ఆదినారాయణరెడ్డి, దాసిరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, గంగాద్రి, రఘు, గోవర్దన్‌రెడ్డి, నాగమల్లేశ్వర్‌రెడ్డి, ఓబిరెడ్డి, పతాంజలి, రఫీ, రంగారెడ్డి, రఘు, బాలాజీనాయక్, చిన్నా,ప్రసాద్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
అలరించిన సాయి విద్యార్థుల సంగీత కచేరి
పుట్టపర్తి టౌన్ : పర్తిసాయిపై తమకున్న భక్తి, కృతజ్ఞతను చాటుతూ సత్యసాయి విద్యాసంస్థల ప్రశాంతి నిలయం క్యాంపస్ పీజీ విద్యార్థులు, సంగీత కళాశాల విద్యార్థులు ఆదివారం సాయంత్రంనిర్వహించిన సంగీత కచేరి అలరించింది. సత్యసాయి మహా సమాధి చెంత విద్యార్థులు సుమారు గంట పాటు సంగీత కచేరి నిర్వహించారు. చక్కటి భక్తిగీతాలతో విద్యార్థులు భక్తులను మైమరిపింపజేశారు. -
అలరించిన సంగీత కచేరీ
సత్యసాయి మిరుపురి సంగీత కళాశాల, సత్యసాయి యూనివర్సిటీ యూజీ విద్యార్థులు నిర్వహించిన సంగీత కచేరీ భక్తులను అలరించింది. గురువారం సాయంత్రం సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత విద్యార్థులు సంగీత కచేరీ నిర్వహించారు. విద్యార్థులు సత్యసాయిని కీర్తిస్తూ చక్కటి భక్తిగీతాలు ఆలపించారు. సుమారు గంటపాటు కొనసాగిన సంగీత కచేరీతో సాయికుల్వంత్ సభా మందిరం మార్మోగింది. - పుట్టపర్తి టౌన్ -
11న మేనేజ్మెంట్ ఫెస్ట్
పుట్టపర్తి టౌన్ : సంస్కృతీ మేనేజ్మెంట్ కళాశాల ఆధ్వర్యంలో విజయోత్సవ్–2017 పేరుతో ఈనెల 11,12 తేదీల్లో కళాశాలల్లో మేనేజ్మెంట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు సంస్కృతీ విద్యాసంస్థల గ్రూప్ డైరెక్టర్ డాక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. కళాశాలలో బుధవారం సిబ్బందితో కలిసి ఆయన విజయోత్సవ్–2017 పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా నారాయణరెడ్డి మాట్లాడుతూ కళాశాలతో పాటు జర్మనీకి చెందిన రైజ్ సంస్థతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దేశీయంగా ప్రఖ్యాతి గాంచిన ఐదు కార్పొరేట్ సంస్థలు ఈ వేడుకలో పాల్గొంటాయన్నారు. విద్యార్థులకు పలు అంశాలపై వేదిక కల్పిస్తారని, ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు అందిస్తారన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా వ్యాప్తంగా మేనేజ్మెంట్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యావంతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు 9100974543 ,91009745538 నెంబర్లలో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనివాసన్, సిబ్బంది పాల్గొన్నారు. -
పులకించిన ప్రశాంతి నిలయం
ఘనంగా శివరాత్రి పర్వదిన వేడుకలు భక్తి శ్రద్ధలతో మహారుద్రాభిషేక ఘట్టం పుట్టపర్తి టౌన్ : సత్యసాయి సన్నిధిలో శివరాత్రి పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. వేలాది భక్తులు సత్యసాయి మహాసమాధి చెంత శివనామాన్ని స్మరిస్తూ సాయీశ్వర లింగానికి అభిషేకం చేస్తూ పరవశించిపోయారు. శుక్రవారం ఉదయం వేడుకలు వేదపఠనం, సత్యసాయి యూనివర్శిటీ విద్యార్థులు నాదస్వరం, పంచవాయిద్యాలతో ప్రారంభమయ్యాయి. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు ఆర్జే రత్నాకర్రాజు, ఇతర ట్రస్ట్ సభ్యులతో కలసి సత్యసాయి పరమభక్తుడు అజిత్పోపట్ రచించిన ‘ది డివైన్ పప్పెటీర్’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. సత్యసాయి బాబా 2001 నుంచి 2010 మధ్యకాలంలో భక్తులనుద్దేశించి ఇచ్చిన 65 ప్రసంగాల సమాహారాన్ని ఇందులో పొందుపరిచారు. అనంతరం సత్యసాయి మహాసమాధి చెంత వేదపండితులు మహారుద్రాభిషేకం నిర్వహించారు. సాయికుల్వంత్ సభా మందిరంలోని భజన మందిరంలో పండితుల వేదపఠనం నడుమ గణపతిపూజ, కుంకుమపూజ, కళశపూజ తదితర పూజాక్రతువులు నిర్వహించారు. మహారుద్రాభిషేకం ముగిసిన అనంతరం సాయీశ్వరున్ని కీర్తిస్తూ భక్తిగీతాలు ఆలపించారు. వేడుకల్లో తెలంగాణ ఐజీ చారుసిన్హా, సత్యసాయి ట్రస్ట్ సభ్యులు విజయభాస్కర్, ప్రసాద్‌రావు, నాగానంద, సత్యసాయి సేవా సంస్థల దేశీయ అధ్యక్షుడు నిమిష్‌పాండ్య పాల్గొన్నారు. -
సత్యసాయి సేవలు వెలకట్టలేనివి
పుట్టపర్తి టౌన్ : సత్యసాయి బాబా మానవాళికి అందించిన సేవలు వెలకట్టలేనివని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి కొనియాడారు. ప్రశాంతి నిలయంలో జరుగుతున్న శివరాత్రి వేడుకల్లో పాల్గొనేందుకు శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు ఆయన పుట్టపర్తికి చేరుకున్నారు. ప్రత్యేక కాన్వాయ్‌లో బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన చేరుకున్న ఆయనకు ప్రశాంతి నిలయంలోని శాంతిభవన్ అతిథి గృహం వద్ద సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ వర్గాలు, ఇన్చార్జ్ తహసీల్దార్ వసంత్‌కుమార్, డీఎస్పీ ముక్కా శివరామిరెడ్డి, సీఐ బాలసుబ్రమణ్యంరెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాకు రూ.వందల కోట్లు ఖర్చు చేసి తాగునీటిని అందించిన మహానుభావుడు సత్యసాయి అని కొనియాడారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆయన సేవలు కొనసాగుతున్నాయన్నారు. విద్య, వైద్యం, తాగునీటి రంగాల్లో ఆయన సేవలు ప్రపంచానికే ఆదర్శమని చెప్పారు. అనంతరం శివరాత్రి వేడుకల్లో భాగంగా ప్రశాంతి నిలయంలో జరుగుతున్న అఖండ భజన కార్యక్రమంలో పాల్గొని సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. -
పుట్టపర్తిలో మాజీ ఎమ్మెల్యే మృతి
పుట్టపర్తి టౌన్ : తూర్పుగోదావరి జిల్లా బూరగపూడి నియోజకవర్గ మాజీ శాసన సభ్యురాలు నీరుకొండ వెంకటరత్నమ్మ(95) ప్రశాంతి నిలయంలోని తన నివాసంలో మృతి చెందారు. వయసు మీదపడడంతో పాటు శనివారం ఆమె కొంత అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు సత్యసాయి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయారు. 1955లో తూర్పుగోదావరి జిల్లా బూరగపూడి నియోజకవర్గం నుంచి శాసన సభ్యురాలుగా ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమె భర్త నీరుకొండ వెంకటరామారావు మంత్రిగా పనిచేశారు. తూర్పుగోదావరి జిల్లాలో తొలి మహిళా శాసన సభ్యురాలిగా వెంకటరత్నమ్మ పేరెన్నికగన్నారు. చాలా ఏళ్లుగా ఆమె ప్రశాంతి నిలయంలో నివసిస్తున్నారు. సంతానం లేకపోవడంతో మేనల్లుడు అబ్బులు చౌదరిని దత్తత తీసుకున్నారు.ఆదివారం పుట్టపర్తి వద్దనున్న చిత్రావతి నదిలో ఆమె దహన సంస్కారాలు నిర్వహించనున్నారు. -
అలరించిన సంగీత కచేరి
పుట్టపర్తి టౌన్ : సత్యసాయి సన్నిధిలో ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసుడు శ్రీరాం పార్థసారథి బృందం నిర్వహించిన సంగీత కచేరి అలరించింది. శుక్రవారం సాయంత్రం సాయికుల్వంత్ సభా మందిరంలో కర్నాటక సంగీత రీతులలో చక్కటి స్వరాలు ఒలికిస్తూ సత్యసాయిని, సర్వదేవతలను కీర్తిస్తూ శ్రీరాం బృందం సాగిన కచేరి భక్తులను మైమరపించింది. పిదప కళాకారులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. -
ముగిసిన చైనీస్ సంవత్సరాది వేడుకలు
పుట్టపర్తి టౌన్ : ప్రశాంతి నిలయంలో చైనీస్ నూతన సంవత్సరాది వేడుకలు శనివారం ఘనంగా ముగిశాయి. రెండు రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం సాయికుల్వంత్ సభా మందిరంలో బౌద్ధ సంప్రదాయం మేరకు జాలి.. దయను స్మరించే డా బీ జో మంత్రాన్ని సత్యసాయి మహాసమాధి చెంత జకార్తాకు చెందిన భక్తులు పఠించారు. సత్యసాయి అంతర్జాతీయ సేవా సంస్థలకు చెందిన సీనియర్ ఆఫీస్బ బేరర్ బోర ఉస్లీ ప్రసంగించారు. తన జీవితంతో ఆధ్యాత్మిక చింతనతో పొందిన అనుభూతులను వివరించారు. అనంతరం ఇద్దరు యువకులు హార్మోనిక్ వాయిద్య ప్రదర్శన నిర్వహించారు. ఇండోనేషియాకు చెందిన మహిళా భక్తులు వర్ణరంజితమైన వేషధారణలో నూతన సంవత్సర గీతాన్ని ఆలపించారు. -
ఘనంగా చైనీస్ నూతన సంవత్సర వేడుకలు
పుట్టపర్తి టౌన్ : ప్రశాంతి నిలయంలో చైనీస్ నూతన సంవత్సర వేడుకలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వేడుకలను పురస్కరించుకుని సత్యసాయి మహాసమాధి, ప్రశాంతి నిలయాన్ని చైనా సాంప్రదాయ రీతిలో అలంకరించారు. చైనా, థాయిలాండ్, మలేషియా, హాంకాంగ్, ఇండోనేషియా దేశాలకు చెందిన వేలాది భక్తులు వేడుకల్లో పాల్గొన్నారు. సాయంత్రం సత్యసాయి మహాసమాధి చెంత వేదమంత్రోచ్ఛారణలతో వేడుకలు ప్రారంభమయ్యాయి. సత్యసాయి భక్తుడు బిల్లీ ఫాంగ్ ప్రసంగిస్తూ చైనా సంప్రదాయం ప్రకారం వరుస క్రమంలో ఈఏడాది సమయపాలనకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. సత్యసాయి దశావతారాలను వివరిస్తూ బిల్లీ ఫాంగ్ పుస్తకాన్ని అవిష్కరించారు. మహిళా భక్తురాలు ఇసాబెల్లా మాట్లాడారు. వేడుకలతో సాయికుల్వంత్ సభా మందిరం మార్మోగింది. -
అంతర్జిల్లా దొంగ అరెస్ట్
రూ.2.80 లక్షల వస్తువులు స్వాధీనం పుట్టపర్తి అర్బన్ : పుట్టపర్తి రూరల్ పోలీసులు అంతర్ జిల్లా దొంగను అరెస్ట్ చేశారు. ఇతని వద్ద నుంచి రూ.2.80 లక్షల విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ శ్రీధర్, ఎస్ఐ రాఘవరెడ్డి బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ప్రకాశం జిల్లా పొదిలి మండల కేంద్రానికి చెందిన ఇద్దరు మిత్రులు మాలకొండారెడ్డి, తిరుపతిస్వామి అలియాస్ వంశీ చెడు వ్యసనాలకు లోనై, సులభంగా డబ్బు సంపాదించడం కోసం దొంగలుగా మారారు. పలు జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడి, వివిధ కేసుల్లో పట్టుబడి ఒంగోలు జైలుకు కూడా వెళ్లారు. జనవరి 5వ తేదీన బెయిలుపై వచ్చిన ఈ ఇద్దరూ గుంటూరు జిల్లా రేపల్లిలో పల్సర్ బైకును అదే నెల 13వ తేదీన చోరీ చేశారు. 16న తెనాలి టౌన్లో రూ.30 వేల నగదు, బంగారు చైను, ఉంగరాలు సెల్‌ఫోన్ దొంగిలించారు. 20న నరసరావు పేట బ్రహ్మంగారి గుడి వద్ద రూ.లక్ష విలువ చేసే యమహా ఎఫ్‌జెడ్ బైకు అపహరించారు. 23న డోన్ ప్రభాకర్‌రెడ్డి నగర్లో హోండాషైన్ బైకు, ఎల్జీ టీవీ, సెల్‌ఫోన్, దొంగిలించారు. అక్కడినుండి పుట్టపర్తికి వచ్చి మండల పరిధిలోని పెడపల్లిలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. 25వ తేదీన కొత్తచెరువులో ఖైదీ నెంబర్ 150 సినిమా చూసిన ఇద్దరూ మామిళ్లకుంట క్రాస్ లోని పెట్రోలు బంకు వీధిలో రాజశేఖర్ ఇంటి వద్ద ఉన్న రూ.లక్ష విలువ చేసే బైకును దొంగిలించారు. దీన్ని అమ్మే ప్రయత్నంలో ఉన్న మాలకొండారెడ్డిని బుధవారం పెడపల్లిలో అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. ఇతడి వద్ద నుంచి రూ.లక్ష విలువ చేసే బైకు, సెల్ఫోన్లు, ఎల్ఈడీ టీవీ, స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. తిరుపతిస్వామి అలియాస్ వంశీ మరికొన్ని సామాన్లు అమ్ముకొని వచ్చే ప్రయత్నంలో పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. దొంగను పట్టుకోవడంలో సహకారం అందించిన హెడ్‌కానిస్టేబుళ్లు ధనుంజయ, శ్రీనివాస్, పీసీలు నాగేంద్ర, మారుతి, నరసింహలను సీఐ అభినందించారు. -
ఘనంగా సిమ్స్ వైట్‌ఫీల్డ్ 16 వార్షికోత్సవం
పుట్టపర్తి టౌన్ : బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లోని సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్ 16వ వార్సికోత్సవం ఆదివారం సాయంత్రం సాయికుల్వంత్ సభా మందిరంలో ఘనంగా జరిగింది. సత్యసాయి మహాసమాధి చెంత సిమ్స్ డైరెక్టర్ డాక్టర్ సుందరేషన్ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యసాయి ఆశీస్సులతోనే వైట్ ఫీల్డ్ సిమ్స్‌లో వైద్య సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయన్నారు. ప్రేమ,సేవా భావంతో కూడిన వైద్య విధానాన్ని సత్యసాయి ప్రవేశపెట్టారని, ఆయన చూపిన మార్గంలో నడుస్తూ అక్కడ వైద్య సేవలను కొనసాగిస్తున్నామన్నారు. పిదప పలువురు వైద్యులు వారి విభాగాల అధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను, వైద్య సేవలు తమ అనుభవాలను వివరిస్తూ ప్రసంగించారు. అదేవిధంగా 16 సంవత్సరాలుగా సిమ్స్ ద్వారా అందించిన చికిత్సలను విభాగాల వారిగా వివరించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సిబ్బంది నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అమితంగా అకట్టుకున్నారు. పిదప సిమ్స్ వైట్‌ఫీల్డ్ సిబ్బంది సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. వేడుకల్లో సత్యసాయి ట్రస్ట్ సభ్యుడు ఆర్జె.రత్నాకర్రాజు, చక్రవర్తి, విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆలయంలో దొంగలుపడ్డారు!
పుట్టపర్తి టౌన్ : పుట్టపర్తిలోని సత్యమ్మ ఆలయంలో దొంగలుపడ్డారు. బుధవారం అర్ధరాత్రి దుండగులు ఆలయంలోకి ప్రవేశించి నాలుగు హస్తాలు, ఐదు కిలోల అమ్మవారి కవచం, రెండు కిరీటాలు, ఒక పంచలోహ కిరీటం, రెండు కిలోల పంచలోహ విగ్రహం, అమ్మవారి మంగళసూత్రం, హుండీలను ఎత్తుకెళ్లారు. వాటి విలువ సుమారు రూ.3 లక్షలు ఉంటుందని ప్రాథమిక అంచనా. బుధవారం రాత్రి 12 గంటల వరకు అమ్మవారి ఆలంకరణ కోపం పూలను సిద్ధం చేస్తూ పూజారి సహా భక్తులు ఆలయంలోనే గడిపారు. ఆ తరువాత ఆలయ తలుపులు మూసివేసి పూజారి, భక్తులు ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. ఆ తరువాత దుండగులు ఆలయ తాళాలు పగులగొట్టి లోపలకు ప్రవేశించి అభరణాలను అపహరించుకుపోయారు. సమాచారం క్షణాల్లో అందరికీ తెలిసిపోవడంతో పోలీసులతో పాటు స్థానికులు ఆలయ పరిసర ప్రాంతాల్లో గాలించారు. పుట్టపర్తికి సమీపాన కర్ణాటక నాగేపల్లి వద్ద గల కంకర మిషన్ వద్ద ముళ్ల పొదల్లో అమ్మవారి ఆలయం హుండీ పడి ఉండడాన్ని అక్కడి ప్రజలు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి పోలీసులు డీఎస్పీ ముక్కా శివరామిరెడ్డి సహా క్లూస్‌టీం, డాగ్‌స్కాడ్ రంగంలోకి దిగాయి. ఆధారాలు సేకరించారు. ఆలయ సమీపంలోని ఎస్సీ బాలికల వసతి గృహం ప్రవేశద్వారం వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమరా పుటేజీలను పరిశీలించగా అంబాసిడర్ కారులో దుండగులు వచ్చినట్లు, వీపునకు లగేజీ బ్యాగు ధరించి ఉన్నట్లు కనుగొన్నారు. అమ్మవారి ఆలయంలో అభరణాలు చోరీ చేసిన అనంతరం అక్కడికి వచ్చి ఆ తరువాత కారులో పరారైనట్లు గుర్తించారు. దుండగులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాన్ని నియమించినట్లు డీఎస్పీ తెలిపారు. -
వైభవంగా సత్యసాయి పల్లకీ ఉత్సవం
పుట్టపర్తి టౌన్ : సత్యసాయిపై భక్తిప్రపత్తులు చాటుతూ విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు చెందిన సత్యసాయి భక్తులు గురువారం పల్లకీ ఉత్సవం నిర్వహించారు. పర్తియాత్రలో భాగంగా సుమారు 500 మంది విశాఖపట్టణం స్టీల్‌ప్లాంట్‌కు చెందిన సత్యసాయి భక్తులు పుట్టపర్తికి విచ్చేశారు. ఇందులో భాగంగా పట్టణంలో సత్యసాయిపల్లకీ ఉత్సవం నిర్వహించారు. ప్రశాంతి నిలయంలోని సత్యసాయి భక్తనివాస్ నుంచి సత్యసాయి పల్లకీని ఊరేగిస్తూ భక్తిగీతాలు ఆలపిస్తూ ఉత్సవం చేపట్టారు. పట్టణ పురవీధుల గుండా పల్లకీ ఉత్సవం శివాలయం వరకు సాగింది. వారు ఇంకా మూడు రోజుల పాటు ప్రశాంతి నిలయంలో పలు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. -
ముగ్గురు దొంగల అరెస్ట్
పుట్టపర్తి అర్బన్ : ముగ్గురు దొంగలను అరెస్ట్ చేసి, వారి నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నామని రూరల్ ఎస్ఐ రాఘవరెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన మేరకు.. జనవరి తొమ్మిదో తేదీన గువ్వలగుట్టపల్లికి చెందిన శ్రీరాములు, శ్రీనివాసులు, నరసప్పలు గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయ ప్రధాన ద్వార తాళం పగులగొట్టి లోనికి ప్రవేశించారు. స్వామి వారి వెండి, పంచలోహ, ఇత్తడి ఆభరణాలను అపహరించుకుపోయారు. పూజారి వెంకటాచలపతి ఫిర్యాదు మేరకు పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేసుకున్నారు. బుధవారం ఆభరణాలను గోరంట్లలో విక్రయించడానికి వెళుతున్న ముగ్గురు దొంగలనూ బస్టాండ్‌లో అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పెనుకొండ కోర్టులో నిందితులను హాజరుపరిచారు. -
చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు : డీఎస్పీ
పుట్టపర్తి టౌన్: పుట్టపర్తి ప్రశాంతతకు భంగం కలిగేలా ప్రవర్తిస్తే కఠినచర్యలు తీసుకుంటామని పుట్టపర్తి పట్టణ డీఎస్పీ ముక్కాశివరామిరెడ్డి హెచ్చరించారు. ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి కరణం రామక్రిష్ణ ఆస్తులను ఇతరులకు అమ్మిన కేసులో నిందితులను అరెస్ట్ చేసి సోమవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ ముక్కాశివరామిరెడ్డి మాట్లాడుతూ నకిలీ రిజిస్ట్రేష¯ŒS పత్రాలపై సాక్షి సంతకాలు చేసిన డేరంగుల విష్ణు, ఎంబీఏ విద్యార్థి రవికుమార్‌ను, రామక్రిష్ణ సంతకాలను ఫోర్జరీ చేసిన చంద్రశేఖర్‌రెడ్డిని, నకిలీ పాసుపుస్తకాలు తయారు చేసిన చంద్రశేఖర్‌రెడ్డిని, వారికి సహకరించిన తిరుపాల్నాయుడును పుట్టపర్తి పట్టణ సీఐ బాలసుబ్రమణ్యం బృందం అరెస్ట్ చేసిందన్నారు. మరో నిందితుడు నారాయణస్వామి పరారీలో ఉన్నాడని, ఆయనను సైతం త్వరలోనే ఆరెస్ట్ చేస్తామని చెప్పారు. -
శివలింగమందిరంలో మ్యూజియం ప్రారంభం
పుట్టపర్తి అర్బన్ : పుట్టపర్తి సమీపంలో నిర్మించిన శివలింగ మందిరం అంతర భాగంలో రతన్‌దాదా ఆధ్వర్యంలో సుమారు రూ.కోటి వెచ్చించి ఏర్పాటు చేసిన మ్యూజియంను శనివారం ప్రారంభించారు. ప్రశాంతి గ్రామంలో నిర్మించిన 75 అడుగుల ఎత్తైన శివలింగ మందిరంలోని ఈ మ్యూజియం చూపరులను ఆకట్టుకుంటోంది. స్వర్గంలో దేవతలు కొలువుదీరిన విధంగా బొమ్మల ఆకృతులను ఇక్కడ ఏర్పాటు చేశారు. శివలింగం, శ్రీరామ పట్టాభిషేకం, వేదాల పఠనం, శ్రీకృష్ణుడు గోపికలతో విహరిస్తున్న దృశ్యాలు కళ్లకు కట్టినట్లు ఉన్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. -
శివలింగం @ 75 అడుగులు
పుట్టపర్తి అర్బన్ : పుట్టపర్తి పరిధిలోని సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సమీపంలో భారీ శివలింగ మందిర నిర్మాణ పనులు పూర్తయ్యాయి. దేశంలోనే అతిపెద్ద శివలింగ మందిరం పుట్టపర్తిలో ఏర్పాటు కానుండటంతో బాబా భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి పొందిన పుట్టపర్తిలో కోటి రూపాయల వ్యయంతో నిర్మితమైన ఈ శివలింగ మందిరం సుమారు 75 అడుగుల ఎత్తు ఉంది. ఇందులో మూడు అంతస్తులు ఉంటాయని, అందులో లేజర్ షో, మెడిటేషన్ గది నిర్మాణం పూర్తయినట్లు ప్రజాపిత బ్రహ్మకుమారి ట్రస్ట్ సభ్యులు తెలిపారు. మహా శివరాత్రి పర్వదినం రోజున ఈ శివలింగ మందిరాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. పెయింటింగ్ పనులను కూడా త్వరలో పూర్తి చేస్తామన్నారు. ఇది దేశంలోనే అతి పెద్ద శివలింగ మందిరమని ఫౌండర్ రతన్‌దాదా తెలిపారు. లండన్ నుంచి విచ్చేసిన ఆయన మూడు రోజుల నుంచి పుట్టపర్తిలో ఉండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. -
రక్తి కట్టిన నాటకం
వేషం అదిరింది. నాటకం రక్తి కట్టింది. ఒక్కమాటలో చెప్పాలంటే నటించుమంటే వారంతా జీవించారు. అందరిలోనూ ఆలోచనను రేకెత్తించారు. ఔరా అనిపించారు. అందుకు ప్రశాంతినిలయం వేదికైంది. సత్యసాయి సాంస్కృతిక క్రీడా సమ్మేళనం మూడో రోజు వేడుకల్లో భాగంగా అనంతపురం, ముద్దనహళ్లి క్యాంప్‌స్‌ల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. మనిషి వేసే ప్రతి అడుగులోనూ పొందే ప్రతి అనుభవమూ దైవస్వరూపమేనన్న సందేశాన్ని చక్కగా తమ నాటిక ద్వారా వివరించారు. దేవుడు ఇందులేడందుగలడన్న సందేహమే లేదని, మానవుని ప్రతి అనుభవంలో, పొందే ప్రతి ఫలితంలోనూ దేవుడు దాగి ఉన్నాడన్న సందేశాన్ని చక్కగా వివరించారు. దేవుని దర్శనం కోసం ఆలయాలకు వెళ్లడం కన్నా అభాగ్యుల సేవలో దైవ స్వరూపాన్ని దర్శించుకోవడమే నిజమైన దర్శనమన్న సందేశంతో నాటికను ముగించడం అందరినీ ఆలోచింపజేసింది. విష్ణుభక్తుడైన భక్తప్రహల్లాదకు శివభక్తుడైన తన తండ్రి హిరణ్యకషిపుడుతో అపద ఎదురైనప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమై రక్షించిన తీరును కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. అపార భక్తిప్రపత్తులు కలిగిన నారాయణ అనే భక్తుడి జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను దేవుడు తన లీలను ప్రదర్శించి పరిష్కరించిన తీరును వివరించిన విధం కట్టిపడేసింది. అంధుడైన రామదాసు అనే భక్తుడు తిరుమల శ్రీవారి దర్శనార్థం వెళితే ఆత్మ స్వరూపుడుగా వెంకటేశ్వరుడు దర్శన భాగ్యం కల్పించిన తీరునూ అద్భుతంగా ప్రదర్శించారు. - పుట్టపర్తి టౌన్ -
సాంస్కృతిక క్రీడా సంబరం
- ఘనంగా సత్యసాయి విద్యాసంస్థల 33వ క్రీడా సాంస్కృతిక సమ్మేళనం - సాహస విన్యాసాలు, సాంస్కృతిక క్రీడలతో అలరించిన విద్యార్థులు పుట్టపర్తి టౌన్ : సనాతన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిభంబించే సాంస్కృతిక ప్రదర్శనలు, ఒళ్లు గగూర్పొడిచే సాహసోపేత విన్యాసాలతో సత్యసాయి విద్యార్థులు ఆహుతులను అబ్బుర పరిచారు. సత్యసాయి విద్యాసంస్థల 33వ క్రీడా సాంస్కృతిక సమ్మేళనం బుధవారం ఘనంగా జరిగింది. పుట్టపర్తి సత్యసాయి హిల్‌వీవ్ స్టేడియం వేదికగా జరిగిన సమ్మేళనాన్ని వేలాది మంది హాజఽరయ్యారు. ముందుగా సత్యసాయి చిత్రపటాన్ని ఊరేగింపుగా తీసుకువచ్చి హిల్‌వీవ్ స్టేడియం శాంతివేదికపై ఏర్పాటు చేసిన సత్యసాయి ఆసనంపై ఉంచారు. అనంతరం మార్చ్ ఫాస్ట్ చేశారు. తర్వాత సత్యసాయి యునివర్శిటీ పతాకాన్ని వైస్ చాన్సలర్ కేబీఆర్ వర్మ ఆవిష్కరించారు. అనంతరం క్రీడా జ్యోతి వెలిగించి సమ్మేళనాన్ని ప్రారంభించారు. మొదట అనంతపురం క్యాంపస్ విద్యార్థినులు పురాణ వేదమంత్రాలను వళ్లిస్తూ యోగాసనాల ఆవశ్యకతను వివరించే 36 యోగా విన్యాసాలను ప్రదర్శించారు. తర్వాత జంపింగ్, లాంగ్‌జంప్, బైక్ రైడింగ్ విన్యాసాలు చేశారు. సిమ్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అండ్ అలైడ్ సైన్సెస్ వైట్‌ఫీల్డ్ విద్యార్థినిలు జానపద కళను, యోగా, ఏరోబిక్స్ విన్యాసాలను బృందావన్ క్యాంపస్ విద్యార్థులు అత్యద్భుతంగా ప్రదర్శించారు. చివరిగా విద్యార్థులు ప్రదర్శించిన స్కైరన్నర్స్ విన్యాసాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సాయంత్రం జరిగిన సమ్మేళన కార్యక్రమంలో నృత్య ప్రదర్శనలను నిర్వహించారు. వేడుకల్లో మంత్రి పల్లె రఘునాథరెడ్డి, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు ఆర్జె.రత్నాకర్రాజు, చక్రవర్తి, నాగానంద, భగవత్, విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
ఏసు నామంతో పులకించిన పుట్టపర్తి
పుట్టపర్తి టౌన్ : క్రిస్మస్ సందర్భంగా ఏసునామ స్మరణతో పుట్టపర్తి పులకించిపోయింది. ఆదివారం ఉదయం ప్రశాంతినిలయంలోని సాయికుల్వంత్ సభామందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత సత్యసాయి స్కూల్ విద్యార్థుల వయొలిన్ వాయిద్య కచేరితో వేడుకలు ప్రారంభమయ్యాయి. బ్రాస్‌బ్యాండ్ వాయిద్య కచేరి నిర్వహించారు. ఏసును, సత్యసాయిని కీర్తిస్తూ భక్తిగీతాలు ఆలపించారు. గత క్రిస్మస్ వేడుకలలో ఇచ్చిన సందేశాన్ని భక్తులకు డిజిటల్ స్క్రీన్ల ద్వారా ప్రదర్శించారు. శాంతాక్లాజ్ తాత సాయికుల్వంత్ మందిరంలో కలియ తిరుగుతూ చాక్లెట్లు వెదజల్లుతూ మేరీ మేరీ క్రిస్మస్ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. సాయంత్రం పూర్వపు ఇంటర్నేషనల్ క్రిస్మస్ కమిటీ చైర్మన్ జాన్బెన్హార్డ్ క్రిస్మస్ వేడుకలు, క్రీస్తు, సత్యసాయి సందేశాలను వివరిస్తూ ప్రసంగించారు. ఏసు, సత్యసాయి ఇద్దరూ లోక కల్యాణ సాధనకు పాటుపడిన మహనీయులన్నారు. అనంతరం పలువురు విదేశీ భక్తులు శాస్త్రీయ సంగీత వాయిద్య కచేరీ నిర్వహించారు. కళాకారులకు సత్యసాయి ట్రస్ట్ సభ్యులు నూతన వస్త్రాలను బహూకరించి సన్మానించారు. వేడుకలలో తెలంగాణ ఐజీ చారుసిన్హా, వివిధ దేశాల సత్యసాయి భక్తులు పాల్గొన్నారు. -
ముగిసిన సత్యసాయి జయంతి వేడుకలు
పుట్టపర్తి టౌన్ : వారం రోజుల పాటు సాగిన సత్యసాయి 91వ జయంతి వేడుకలు బుధవారంతో ముగిశాయి. వేడుకల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈనెల 18 నుంచి 23వ తేదీ వరకూ వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చివరి రోజు భక్తులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకుని నివాళులర్పించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన వేలాది మంది సత్యసాయి సేవాదల్ సైతం తరలివచ్చి వేడుకల్లో సేవలను అందించారు. వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలతో సందడిగా మారిన పుట్టపర్తి బోసిపోయింది. భక్తులు గురువారం స్వస్థలాలకు బయలుదేరడంతో పుట్టపర్తి ఆర్టీసీ బస్టాండ్, ప్రశాంతి రైల్వేస్టేషన్ కిటకిటలాడింది. ఈ సందర్భంగా ఆటోలు, టాటాఏస్ వాహనాలు, కార్లకు గిరాకీ ఏర్పడింది. వివిధ క్యాంపస్‌లకు చెందిన సత్యసాయి విద్యార్థుల కోసం ఆర్టీసీ ముద్దనహళ్లి, అనంతపురం, బృందావన్‌కు ప్రత్యేక బస్సు సర్వీసులు కేటాయించారు. -
ప్రేమమూర్తికి హృదయాంజలి
-
వైభవం..స్నాతకోత్సవ సంబరం
పుట్టపర్తి టౌన్ : నీలి,ఎరుపు వస్త్రధారులైన విద్యాకుసుమాలు సాయి నామాన్ని స్మరించగా.. వక్తల సందేశాత్మక ప్రసంగాల నడుమ సాయి కుల్వంత్ సభా మందిరంలో జరిగిన సత్యసాయి విద్యా సంబరం వైభవంగా సాగింది. సత్యసాయి డీమ్డ్ యూనివర్శిటీ 35వ స్నాతకోత్సవం మంగళవారం ప్రశాంతి నిలయంలో ఘనంగా జరిగింది. వేడుకల్లో చాన్సలర్ హోదాలో సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ వెంకటాచలయ్య పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా కేంద్ర సాంకేతిక ప్రధాన సలహాదారు రాజగోపాల చిదంబరం హాజరయ్యారు.చాన్స్‌లర్ వెంకటాచలయ్య యూనివర్శిటీ పరిధిలోని నాలుగు క్యాంపస్‌లలో ఉత్తమ ప్రతిభ కనబరచిన 24 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, విభిన్న రంగాలలో నిబద్ధతతో కృషి చేసినందుకు నలుగురు విద్యార్థులకు ఆల్‌రౌండర్ గోల్డ్ మెడల్స్, 10 మంది పరిశోధన విద్యార్థులకు పీహెచ్‌డీలను ప్రదానం చేశారు. -
జనహితం .. సత్యసాయి అభిమతం!
నేడు బాబా జయంతి పుట్టపర్తి టౌన్ : సమత..మమత..మానవత్వం ఈ మూడు కలగలిపిన స్వరూపమే సత్యసాయి బాబా. సత్యం, ధర్మం, శాంతి ప్రేమ..అనే విలువలను బోధిస్తూ మనిషిలో దాగి ఉన్న మానవత్వాన్ని నిద్రలేపిన సత్యసాయి.. ధీనులకు నిస్వార్థ సేవలు అందించి సేవకు ప్రతి రూపంగా నిలిచారు. ఆధ్యాత్మిక బోధనలతో తన భక్త కోటిని ముక్తిమార్గం వైపు పయనింపజేసి, భగవత్ స్వరూపుడయ్యారు.దాహం కేకలు పెడుతున్న కరువు సీమ ప్రజల దాహార్తి తీర్చి అపరభగీరథుడయ్యారు. పేదరికం ఓ వైపు.. రోగాలు మరోవైపు.. చుట్టుముట్టి పేదలు వైద్యానికీ నోచుకోని వారికి ఖరీదైన వైద్యం అందిస్తూ ‘వైద్యో నారాయణుడు’ అయ్యారు. ప్రకృతి విలయం ధాటికి ‘గూడు’ చెదిరిన ఎందరో నిరాశ్రయులను చేరదీసి అను‘గృహం’ కల్పించి, వారిపాలిట ఆపద్బాంధవుడిగా నిలిచారు. విలువలతో కూడిన విలువైన విద్యను కేజీ టు పీజీ వరకు ఉచితంగా అందిస్తూ వేలాది కుటుంబాల్లో అక్షరజ్యోతులు వెలిగించారు. ‘మానవ సేవయే ..మాధవ సేవ’ అన్న నినాదంతో మానవాళి శ్రేయస్సు కోసం సత్యసాయి అందించిన సేవలు అజరామరం.. అజేయం. అభాగ్యుల ఆరోగ్య ప్ర‘దాత’ : వైద్యసేవలకు నోచుకోని పుట్టపర్తి ప్రాంత ప్రజలకు ‘వైద్యం’ అందించే లక్ష్యంతో సత్యసాయి తన 30వ ఏట 1956 ఆక్టోబర్ 4న ఉచితంగా వైద్యం అందించే జనరల్ ఆస్పత్రిని నిర్మించారు. ఇందులో 94 పడకలు, 2 అపరేషన్ థియేటర్లు, 8 వార్డులు, జనరల్ మెడిసిన్, సర్జన్‌కు సంబంధించి చిన్నిపిల్లల విభాగం, కన్ను, ముక్కు, చెవి, దంతవైద్యం, స్త్రీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందిస్తున్నారు. సిమ్స్ ద్వారా ఖరీదైన వైద్యసేవలు వైద్యం వ్యాపార వస్తువుగా మారిన ఈ రోజుల్లో నయాపైసా తీసుకోకుండా అన్ని వైద్యసేవలు అందించే ఆసుపత్రి ఉందంటే సంభ్రమాశ్చర్యాలకు గురికాకతప్పదు. ఇంతటి గొప్ప ఖ్యాతిని పుట్టపర్తి సమీపంలోని ప్రశాంతి గ్రాం వద్ద నిర్మించిన సత్యసాయి సూపర్‌స్పెషాలిటీ సత్యసాయి 91వ జయంత్యుత్సవాల్లో సిమ్స్ రజతోత్సవం వైభవంగా జరుపుకుంది. - సత్యసాయి 1991 నవంబర్ 22న ప్రశాంతి గ్రాం వద్ద ఉచితంగా ఆధునిక సౌకర్యాలతో వైద్యసేవలు అందించే లక్ష్యంతో సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్‌ను నిర్మించారు. దీన్ని అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు చేతులు మీదుగా ప్రారంభింపజేశారు. - 300 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఆస్పత్రిలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన 8 అపరేషన్ థియేటర్లు, ఆధునిక వైద్యపరికరాలు అందుబాటులో ఉన్నాయి. గెండె, కిడ్నీలు, కంటి జబ్బులు, ఎముకల శస్త్ర చికిత్సలు, అత్యవసర వైద్యం , ప్లాస్టిక్ సర్జరీ, రేడియాలజీ తదితర విభాగాల్లో శస్త్ర చికిత్సలు అందిస్తున్నారు. - ఈ ఆస్పత్రి ద్వారా ఇప్పటికి 43 లక్షల మందికి వైద్య చికిత్సలు అందించారు. ఇందులో 3.2 లక్షల మందికి శస్త్ర చికిత్సలు చేశారు. - బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్ పేరిట 306 పడకల సూపర్స్సెషాలిటీ ఆస్పత్రి నెలకొల్పారు. 2001లో అప్పటి ప్రధాని వాజ్‌పేయి ఆస్పత్రిని ప్రారంభించారు. - బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లో మహిళలు, పిల్లలకు సేవలు అందించేందుకు మరో జనరల్ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. తొలుత 30 పడకలు ఉండగా ప్రస్తుతం 50 పడకలుగా అభివృద్ధి చేశారు. సత్యసాయి ‘సంచార’ వైద్యం : మారుమూల ప్రాంతాలకు సరైన రోడ్డు సౌకర్యాలు లేక ఆస్పత్రులకు రాలేక వైద్యసేవలు పొందలేకపోతున్న విషయాన్ని గ్రహించిన సత్యసాయి.. సత్యసాయి సంచార వైద్యసేవల పేరిట వైద్యసేవలు అందిస్తున్నారు. 2006 మార్చి 30న సత్యసాయి సంచార వైద్య సేవలను సత్యసాయి ప్రారంభించారు. ఆధునిక వసతులున్న మొబైల్ వాహనం పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్తచెరువు, ఓడీసీ, చెన్నేకొత్తపల్లి, నల్లమాడ మండలాల్లో 12 నోడల్ పాయింట్ల ద్వారా 63 గ్రామాల ప్రజలకు ఉచిత వైద్యసేవలను అందిస్తున్నారు. అదేవిధంగా మరో 400 గ్రామాల ప్రజలు వైద్యసేవలు పొందుతున్నారు. ప్రతి నెలా 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు 12 నోడల్ పాయింట్లకు వెళ్లి మొబైల్ వాహనం వెళ్తుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు 16 జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సైతం సంచార వైద్యసేవలు అందిస్తున్నారు. అపర భగీరథుడు సత్యసాయి : వరుస కరువు, ఫ్లోరైడ్ రక్కసి వెరసి గుక్కెడు నీళ్లు దొరక్క గొంతెండిన అనంతపురం జిల్లా వాసుల దాహం తీర్చేందుకు రూ.500 కోట్ల వ్యయంతో సత్యసాయి తాగునీటి పథకాన్ని ప్రారంభించారు. సత్యసాయి తాగునీటి పథకం ద్వారా జిల్లాలోని 1447 గ్రామాలకు తాగునీరు అందిస్తున్నారు. ఈ పథకం ద్వారా సుమారు 3,200 కిలో మీటర్లు మేర పైప్‌లైన్ వేయించారు. బాబా తన 75వ జన్మదినం కానుకగా అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతులమీదుగా పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంలో 18 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు,136 గ్రౌండ్ లెవెల్ రిజర్వాయర్లు, 2350 ఓవర్‌హెడ్ ట్యాంకులను నిర్మించారు. అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లాలో సైతం 141 గ్రామాలకు, మెదక్ జిల్లాలో 179 గ్రామాలకు, తూర్పుగోదావరిలో 220, పశ్చిమగోదావరి జిల్లాలో 230 గ్రామాలకు రక్షిత మంచినీరు అందిస్తున్నారు. పొరుగు రాష్ట్రమైన తమిళనాడు రాజధాని చెన్నై నగరం దాహార్తి తీర్చేందుకు ప్రభుత్వం చేపట్టిన తెలుగుగంగ, కండలేరు కాలువల నిర్మాణానికి సత్యసాయి రూ.250 కోట్ల సహాయం అందించారు. ‘పర్తి’ ప్రాంతానికి ‘వరం’ సత్యసాయి తాగునీటి పథకం : పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్తచెరువు గ్రామాలకు వరం సత్యసాయి తాగునీటి పథకం సత్యసాయి నిర్యాణం అనంతరం సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఆయన ఆశయాలను కొనసాగింపుగా పుట్టపర్తి, కొత్తచెరవు, బుక్కపట్నం మండలాల పరిధిలో మరో 126 గ్రామాలకు తాగునీరు అందించేందుకు రూ.90 కోట్ల పైబడి వ్యయంతో తాగునీటి పథకాన్ని ప్రారంభించారు. వేలాది కుటుంబాల్లో ‘విద్యాజ్యోతులు’ : సత్యసాయి వేలాది కుటుంబాల్లో విద్యాజ్యోతులు వెలిగిస్తున్నారు. కేజీ నుంచి పీజీ వరకు విలువలతో కూడిన ఉచిత విద్యను అందించాలన్న లక్ష్యంతో సత్యసాయి 1981లో సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లర్నింగ్ను ఏర్పాటు చేశారు.ఈ విశ్వవిద్యాలయం పరిధిలో ప్రశాంతి నిలయం క్యాంపస్, అనంతపురంలో సత్యసాయి మహిళా క్యాంపస్, బెంగళూరులోని బృందావన్ క్యాంపస్, మద్దనహళ్లి క్యాంపస్‌ల ద్వారా తరగతులు నిర్వహిస్తున్నారు. ఏడు విభాగాల్లో అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ), ఐదు విభాగాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ), మూడు ప్రొఫెషనల్ కోర్సులు యూనివర్శిటీ ద్వారా అందిస్తున్నారు. మానవతా విలువలు, భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను, జీవనోపాధులు మెరుగు పరిచేందుకు ప్రాచీన గురుకుల విద్యావిధానంలో విద్యాబుద్ధులు నేర్పుతున్నారు. సత్యసాయి యునివర్శిటీకి 1986లో ఇండియన్ యూనివర్శిటీ అసోసియేషన్‌లో శాశ్వత సభ్యత్వం లభించింది. 2008లో సత్యసాయి డీమ్డ్ యునివర్శిటీ సత్యసాయి యునివర్శిటీగా అవతరించింది. ఆధునిక ఆలయాలను పోలిన నిర్మాణంలో సత్యసాయి యునివర్శిటీ భవనం పుట్టపర్తిలో ఎద్దుల కొండపై దర్శనమిస్తుంది. నిరాశ్రయులకు ఆపన్న హస్తం : ప్రపంచంలో ఏ మూల ప్రకృతి విపత్తులు సంభవించినా అక్కడ సత్యసాయి సేవాసంస్థలు వాలిపోయి సేవా కార్యక్రమాలను చేపడుతున్నాయి. సత్యసాయి ట్రస్ట్ ద్వారా వరద బాధితులకు ఆపన్నహస్తం అందించారు. 2008లో ఒడిశాలో భారీ వరదలు రావటంతో పలువురు నిరాశ్రయులుగా మిగిలారు. ఆపదలో చిక్కుకున్న వారికి అండగా నిలుస్తూ సత్యసాయి ట్రస్ట్ నాలుగు జిల్లాల్లో 750 మందికి పక్కాగృహాలను నిర్మించింది. సుమారు ఒక్కో గృహానికి రూ.1.30 లక్షలు చొప్పున ఆర్థిక సాయం అందించారు. దేశంలో జరిగిన గుజరాత్ భూకంప, ఉత్తరాఖండ్ వరదలతోపాటు, ఇటీవల రాష్ట్రంలో సంభవించిన హుదూద్ తుఫాను విలయం సమయంలనూ సత్యసాయి సేవాదళ్ సేవలను అందించారు. దేశంలోనే కాకుండా ఇండోనేషియా, జపాన్లలో సునామీలు సంభవించిన సమయంలో సత్యసాయి సేవాదళ్ బాధితులకు సేవలను అందించారు. గ్రామసేసే.. రామ సేవ : సామాజిక అవసరాలైన కూడు, గుడ్డకు నోచుకోలేని వారికి ఒక్క పూటైనా ‘అన్నం’ పెట్టాలన్న మానవతాహృదయంతో ‘ సత్యసాయి గ్రామసేవ’ 2000లో ప్రారంభించారు. ప్రతి ఏటా దసరా పర్వధిన వేడుకలను పురస్కరించుకుని పుట్టపర్తి, కొత్తచెరువు, బుక్కపట్నం మండలాలకు చెందిన 150 గ్రామాల్లో సుమారు 55 వేల కుటుంబాలకు అన్నప్రసాదాలు , నూతన వస్త్రాలను అందిస్తున్నారు. సత్యసాయి విద్యాసంస్థల విద్యార్థులలో సేవాభావాన్ని పెంపొందించే విధంగా ఈ కార్యక్రమంలో వారిని భాగం చేస్తూ నిర్వహించడం విశేషం. 16 ఏళ్లుగా ఈ కార్యక్రమం నిర్విగ్నంగా సాగుతోంది. సత్యసాయి విద్యాసంస్థల విద్యార్థులు 50 వాహనాల్లో వెళ్లి గ్రామీణులకు అన్నప్రసాదాలు అందజేస్తారు. -
సత్యసాయి జయంతి వేడుకలు
-
నేటి నుంచి సత్యసాయి జయంతి వేడుకలు
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు, భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక వైద్య శిబిరాలు, తాగునీటి కేంద్రాలు పుట్టపర్తి టౌన్ : సత్యసాయి బాబా 91వ జయంతి వేడుకలు శుక్రవారం నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్‌లు ఇప్పటికే భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేపట్టాయి. దేశ, విదేశాల నుంచి వేడుకల్లో పాల్గొనేందుకు భక్తులు తరలిరానుండడంతో ఎటువంటి అసౌకర్యం కలుగ కుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, ప్రత్యేక వైద్యశిబిరాలు, తాగునీటి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేపడుతున్నారు. ప్రత్యేక నిఘా.. జయంతి వేడుకల కోసం పోలీసు శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతోపాటు, పుట్టపర్తి పరిసర ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. పుట్టపర్తి పట్టణ డీఎస్పీ ముక్కా శివరామిరెడ్డి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. వేడుకల జరిగే రోజుల్లో నిరంతర పర్యవేక్షించేందుకు గోకులంలోని డీఎస్పీ గెస్ట్ హౌస్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి 400 మంది పోలీస్ అధికారులు, సిబ్బందిని భద్రతా ఏర్పాట్లకు కేటాయించారు. భద్రతా ఏర్పాట్ల కోసం విచ్చేసిన సిబ్బందికి గురువారం సాయంత్రం గోకులంలోని డ్వాక్రా బజార్ వద్ద డీఎస్సీ ముక్కాశివరామిరెడ్డి సమీక్ష నిర్వహించి, భద్రతా ఏర్పాట్లపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేడుకల కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టామన్నారు. ఇద్దరు డీఎస్పీలు, ఆరుగురు సీఐలు, 25 మంది ఎస్ఐలు, 350 మంది సిబ్బందిని నియమించామన్నారు.ఇందులో రద్దీ నియంత్రణకు రోప్‌పార్టీలు, ట్రాఫిక్ కంట్రోల్ పార్టీలు, సెక్యురిటీ, పెట్రోలింగ్, డాగ్‌స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ స్వాడ్లు విధులు నిర్వహిస్తున్నారన్నారు. అలాగే సత్యసాయి సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి, కర్ణాటక నాగేపల్లి, పుట్టపర్తి బస్ డిపో వద్ద చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశాన్నారు. ప్రత్యేక వైద్య సౌకర్యాలు వైద్య ఆరోగ్య శాఖ అధ్వర్యంలో పలు ప్రాంతాల్లో భక్తుల కోసం ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాట్లు చేపట్టారు. ఈ ఏర్పాట్లు శుక్రవారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం 17 మంది వైద్యులు, 63 మంది సిబ్బందిని నియమించారు.ఒక 104, రెండు 108 వాహనాలతోపాటు మొబైల్ టీంను సిద్దంగా ఉంచారు. పారిశుద్ధ్య చర్యలు భక్తుల సౌకర్యార్థం నగర పంచాయతీ అధికారులు, కమిషనర్ విజయభాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. ఎనుములపల్లి మార్కెట్ వద్ద సత్యసాయి మైదానం, కమ్మవారిపల్లి చింతతోపుల వద్ద, కర్ణాటక నాగేపల్లి వద్ద వాహనదారుల కోసం పార్కింగ్ స్థలాలను సిద్ధం చేస్తున్నారు.పట్టణంలోని హనుమాన్ సర్కిల్, విద్యాగిరి, గోకులం, చిత్రావతి రోడ్డు, సంగీత కళాశాల, చిత్రావతి ఘాట్, వెస్ట్గేట్, తహశీల్దార్ కార్యాలయం, ఆర్టీసీ బస్టాండ్ తదితర ప్రాంతాల్లో ప్రత్యేక తాగునీటి కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేక బస్సులు.. భక్తుల కోసం ఆర్టీసీ వివిధ ప్రధాన నగరాల నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేసిందని పుట్టపర్తి డీఎం రమణయ్య తెలిపారు. ప్రధానంగా చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, చెన్నై నగరాల నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతున్నామన్నారు.ధర్మవరం, పుట్టపర్తి రైల్వేష్టేషన్ల నుంచి ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నామన్నారు. వేడుకల కోసం ప్రత్యేకకంగా 135 ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేశాన్నారు. వేణుగోపాల్ స్వామి రథోత్సవంతో వేడుకలు ప్రారంభం సత్యసాయి 91వ జయంతి వేడుకలు శుక్రవారం వేణుగోపాల స్వామి రథోత్సవంతో ఘనంగా ప్రారంభం కానున్నాయి.వేడుకల కోసం సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సత్యసాయి మహాసమాధిని, సాయికుల్వంత్ సభా మందిరాన్ని సర్వం సిద్దం చేశారు. ప్రశాంతి నిలయం ఉత్తర గోపురాన్ని ప్రత్యేకంగా అలకంరించారు. ఉదయం 8 గంటలకు ఉత్తర గోపురం వద్ద రథోత్సవాన్ని సత్యసాయి ట్రస్ట్ సభ్యులు ప్రారంభించనున్నారు. తొలుత పెదవెంకమరాజు కల్యాణమండపం వద్ద ప్రత్యేకంగా అలంకరింపబడిన రథాన్ని ప్రశాంతి నిలయం ఉత్తర గోపురం వద్దకు తీసుకువచ్చి, సాయికుల్వంత్ సభా మందిరంలోని సత్యసాయి మహాసమాధి చెంత ఉత్సవమూర్తులైన వేణుగోపాల్ స్వామి, సీతారామలక్ష్మణుల విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువచ్చి రథోత్సవాన్ని ప్రారంభించనున్నారు. -
అనుమానాస్పద స్థితిలో వివాహిత ఆత్మహత్య
పుట్టపర్తి టౌన్ : సత్యసాయి సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి తూర్పుగేట్ వద్ద సాయిబాలాజీ లాడ్జిలో యశోద(35)అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి తెలిపిన మేరకు.. పుట్టపర్తి రూరల్ మండలంలోని చిన్ననిడిమామిడప్ప కుమార్తె యశోదను 15 సంవత్సరాల క్రితం పుట్టపర్తికి చెందిన శేఖర్ అనే వ్యక్తికి ఇచ్చి వివాహం చేశా రు. వీరికి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నా రు. యశోద అమడగూరు మండలం తంగేడుకుంట కు చెందిన రామాంజనేయులుతో వివాహేతర సం బంధం కొనసాగిస్తున్న విషయం ఎనిమిది నెలల క్రి తం బయటపడడంతో భర్త ఆమెకు దురమయ్యా డు. అప్పటి నుంచి ఆమె నిడిమామిడిలోని తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. శనివారం ప్రియుడు రామాంజనేయులుతో కలసి మధ్యాహ్నం 12 గం టల ప్రాంతంలో సాయిబాలాజీ లాడ్జిలోని గది అ ద్దెకు తీసుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాం తంలో రామాంజనేయులు బయటికి వెళ్లిపోయాడు. సాయంత్రం 5.30కు గదులు శుభ్రం చేసే సిబ్బంది అనుమానం వచ్చి కిటికీలో నుంచి గదిలోకి తొంగి చూడగా యశోద ఫ్యా¯ŒSకు ఉరివేసుకుని ఉండడం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సీఐ తన సిబ్బందితో కలసి సంఘటనా స్థలాన్ని పరిశీలించి బంధువులకు సమాచారం అందించారు. కే సు నమోదు చేసుకుని విచారణ చేపడతావ సీఐ తెలిపారు. ప్రియుడితో విబేధాల కారణంగా ఆమె ఆత్మహత్యకు పాల్పడిందా, లేదా ఇతరత్రా కారణాలేవైనా ఉన్నాయా అన్నది విచారణలో తేలనుందని సీఐ తెలిపారు. -
అలరించిన సంగీత కచేరి
పుట్టపర్తి టౌన్ : సత్యసాయిని కీర్తిస్తూ చెన్నై మెట్రోకు చెందిన సత్యసాయి యువత నిర్వహించిన సంగీత కచేరి భక్తులను అలరించింది. రెండు రోజుల పర్తియాత్రలో భాగంగా చెన్నైకి చెందిన వేలాది మంది భక్తులు పుట్టపర్తికి విచ్చేశారు. శనివారం సాయంత్రం చెన్నై మెట్రో సౌత్‌కు చెందిన సర్వస్త్రీ సాయిరక్షిత్ బృందం స్వర వాయిద్య కచేరి నిర్వహించారు. సుమధుర స్వరాలోలికిస్తూ వారు నిర్వహించిన సంగీత కచేరితో భక్తులు మైమరచిపోయారు.భక్తులు సత్యసాయి మహాసమాధని దర్శించుకున్నారు. -
నేత్రపర్వం
పుట్టపర్తి టౌన్ : కుచేలుని నిస్వార్థ భక్తి ప్రపత్తులను వివరిస్తూ చిన్నారులు ‘త్వమేవ శరణం సాయి’ అన్న పేరుతో నిర్వహించిన నృత్యరూపకం నేత్రపర్వంగా సాగింది. పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తికి విచ్చేసిన పశ్చిమ గోదావరి జిల్లా సత్యసాయి భక్తులు రెండవ రోజు బుధవారం ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీకృష్ణుని బాల్య మిత్రుడైన కుచేలుడు ప్రదర్శించిన నిస్వార్థ భక్తిని వివరించడం ప్రధాన అంశంగా నృత్యరూపకం సాగింది. శ్రీకృష్ణుడు, కుచేలుని భక్తి ప్రపత్తుల గురించి అర్జునుడికి వివరించే ఘట్టంతో నృత్యప్రదర్శన ప్రారంభమైంది. నృత్యప్రదర్శనను తిలకించిన భక్తులు పరవశించిపోయారు. -
నేడు సత్యసాయి గిరిప్రదక్షిణ
పుట్టపర్తి టౌన్ : పట్టణంలో శనివారం సత్యసాయి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. శుక్రవారం నిర్వాహకులు మాట్లాడుతూ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం 6.30 గం టలకు ప్రశాంతి నిలయం గణేష్ గేట్ వద్ద గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుందన్నారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని సత్యసాయి ఆశీస్సులు పొందాలని వారు కోరారు. -
ముగిసిన విశ్వశాంతి యజ్ఞం
పుట్టపర్తి టౌన్ : ప్రశాంతి నిలయంలో విజయదశమి పర్వదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. దేశవిదేశాలకు చెందిన మంది భక్తులు పాల్గొన్నారు. విశ్వశాంతి యజ్ఞ వేదిక వద్ద నుంచి రుత్వికులు వేదమంత్రోచ్చారణ నడుమ పూర్ణాహుతి సామగ్రి భరణిని చేతబూని ఊరేగింపుగా సత్యసాయి మహాసమాధి చెంతకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కందుకూరి కొండావధాని నేతత్వంలోని రుత్వికుల బందం పూర్ణాహుతితో విశ్వశాంతి యజ్ఞాన్ని పూర్తి చేశారు. దుర్గాదేవిని కీర్తిస్తూ భక్తులు భక్తిగీతాలతో పూర్ణచంద్ర ఆడిటోరియం మార్మోగింది. సాయంత్రం ప్రశాంతి విద్వాన్ మహాసభ నిర్వహించారు. పలువురు వక్తలు సత్యసాయి వైభవాన్ని, దసరా పర్వదిన విశిష్టతను, అమ్మవారి వైభవాన్ని వివరించారు. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు సవితా నరసింహన్, కుమారి స్వర్ణలతా, గణపతిరామన్లతో కలసి నిర్వహించిన సంగీత కచేరి అందరినీ ఆకట్టుకుంది. ³#ట్టపర్తి,బుక్కపట్నం,కొత్తచెరువు మండలాల్లోని 126 గ్రామాలలో సత్యసాయి విద్యార్థులు చేపట్టిన గ్రామ సేవ కార్యక్రమం ముగిసింది. -
అలరించిన సంగీత కచేరి
పుట్టపర్తి టౌన్ : సత్యసాయిని కొనియాడుతూ సత్యసాయి విద్యార్థినులు నిర్వహించిన సంగీత కచేరి భక్తులను అలరించింది. దసరా వేడుకల్లో భాగంగా శని వారం సాయంత్రం సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత ప్రశాంతి విద్వాన్ మహాసభ నిర్వహించారు. సత్యసాయి విద్యాసంస్థల అసోసియేట్ ప్రోఫెసర్ రుచిర్ దేశాయ్ ప్రసంగించారు. షిరిడీ సాయి , సత్యసాయి జీవిత చరిత్రలను వివరిస్తూ ప్రసంగించారు. సత్యసాయి విద్యాసంస్థల అనంతపురం క్యాంపస్‌కు చెందిన విద్యార్థినులు సంగీత కచేరి నిర్వహించారు. -
ప్రశాంతి నిలయంలో దసరా వేడుకలు
– కలశ స్థాపనతో ప్రారంభం – సోమవారం నుంచి గ్రామసేవలు పుట్టపర్తి టౌన్ : ప్రశాంతి నిలయంలో దసరా పర్వదిన వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పండితుల వేదమంత్రాల నడుమ శనివారం ఉదయం సత్యసాయి మహాసమాధి వద్ద విజయదశమి కలశ స్థాపనతో సత్యసాయి ట్రస్ట్ సభ్యులు వేడుకలు ప్రారంభించారు. ప్రతి ఏటా విజయదశమి వేడుకలను పురష్కరించుకుని ప్రశాంతి నిలయంలో వేదపురుషసప్తాహ జ్ఞానయజ్ఞం నిర్వహించడం అనవాయితీగా వస్తోంది. ఈ సారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సాయికుల్వంత్ సభా మందిరాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. వేడుకలలో భాగంగా 3వ తేదీ నుంచి సత్యసాయి గ్రామ సేవ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ట్రస్ట్ శ్రీకారం చుట్టింది. ఇప్పటికే వేలాది మంది సత్యసాయి భక్తులు దేశవిదేశాల నుంచి పుట్టపర్తి చేరుకున్నారు. సోమవారం నుంచి తొమ్మిది రోజులు పాటు పుట్టపర్తి, కొత్తచెరువు, బుక్కపట్నం మండలాల పరిధిలోని 126 గ్రామాలకు చెందిన 60 వేల కుటుంబాలకు సత్యసాయి అన్నప్రసాదాలు, నూతన వస్త్రాలు అందజేయనున్నారు. తొమ్మిది రోజులపాటు ఆధ్యాత్మిక, సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆయా గ్రామాల్లో సత్యసాయి గ్రామసేవలు చేపట్టే వారికి ప్రజలు సహకరించాలని ట్రస్ట్ సభ్యుడు ఆర్జే రత్నాకర్రాజు కోరారు. అలరించిన అంబరీష్ విజయం నాటిక వేడుకల్లో భాగంగా ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి వద్ద రాజమండ్రికి చెందిన శ్రీ సత్యసాయి గురుకులం విద్యార్థులు నిర్వహించిన ‘అంబరీష్ విజయం’ నాటిక భక్తులను అలరించింది. నాటికలో నారాయణుడు, నారద మహర్షి మధ్య సంభాషణా ఘట్టాన్ని విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు. భక్తులకు చక్కటి సందేశాన్నిస్తూ సుమధుర స్వరాలొలికిస్తూ నిర్వహించిన నాటికతో భక్తులు పరవశించిపోయారు. -
ఘనంగా ఓనం వేడుకలు
పుట్టపర్తి టౌన్ : పట్టణంలోని పర్తిసాయి ధర్మశాలలో సాయికేరళ అసోషియేషన్ ఆధ్వర్యంలో కేరళీయులకు ప్రీతి పాత్రమైన ఓనం పర్వదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసినా రక్తదాన శిభిరాన్ని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు ఆర్జే రత్నాకర్రాజు ప్రారంభించారు. జిల్లా అదనపు జడ్జి రాములు హాజరై ఓనం సందేశాన్ని కేరళీయులకు వినిపించారు. అనంతరం వేడుకల్లో పాల్గొన్న మంత్రి పల్లె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అహాన్ని వీడి సమాజ శ్రేయస్సుకు పాటుపడాలన్నారు. కేరళ నుంచి ప్రశాంతి నిలయానికి వచ్చి ఇక్కడ సమాఖ్య ఏర్పాటు చేసుకోవడం సంతోషదాయకమన్నారు. సత్యసాయి బోధనలను విశ్వవ్యాప్తం చేయాల్సిన అవసరం ప్రతి మనిషిపై ఉందన్నారు. పుట్టపర్తిలో కేరళీయుల సమస్యలను పరిష్కరించేందుకు కషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా సంగీత విద్వాంసుడు పి.శ్రీనివాస్ నిర్వహించిన కర్ణాటక శాస్త్రీయ సంగీత కచేరీ అలరించింది. అలాగే అఖిల్ యశ్వంత్ సోపానం సంగీతకచేరి నిర్వహించారు. కేరళ మహిళలు తిరువాతిరికలి, యురియాది, మ్యూజికల్‌ఛైర్ నిర్వహించారు. వేలాది మందికి అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కరణ్, సభ్యులు అనిల్‌కుమార్‌నాయర్, సత్యప్రకాష్, విజయ్, సత్యన్, మణిదాస్, రఘు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
సాయిమార్గంతోనే నవ సమాజస్థాపన
పుట్టపర్తి టౌన్ : సత్యసాయి చూపిన మార్గంలో పయనిస్తూ విలువలతో కూడిన సమాజ స్థాపన, సాధికారిత కోసం అధునిక మహిళ నడుంబిగించాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి వందితా శర్మ, సత్యసాయి సేవా సంస్థల మహిళా విభాగం దేశీయ కోఆర్డినేటర్ కమలా పాండ్య పిలుపునిచ్చారు. ప్రశాంతి నిలయంలో తొలి అఖిల భారత మహిళా సదస్సు శనివారం ప్రారంభమైంది. ఈసందర్భంగా వందితా శర్మ,కమలా పాండ్య మాట్లాడుతూ పురాణ కాలం నుంచి మహిళలు సమాజ నిర్వహణలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారన్నారు. సమాజంలో మహిళల పాత్రను సత్యసాయి గుర్తించి, మహిళా సాధికారితకు పాటుపడ్డారన్నారు. ఆయన చూపిన ఆదర్శమార్గంలో నడుస్తూ మహిళలు నవసమాజ స్థాపనకు కషి చేయాలన్నారు. దేశీయంగా వివిధ ప్రాంతాల్లో మహిళా విద్య, సాధికారితకు వివిధ రంగాల్లో పాటుపడిన మహిళామూర్తులను ఈశ్వరాంబ ట్రస్ట్ సభ్యురాలు చేతనారాజు సన్మానించారు. అంతకు మునుపు ఉదయం ప్రశాంతి నిలయంలోని సత్సంగ్ భవన్లో ‘శ్రీ సత్యసాయి అర్పణం’అన్న పేరుతో దేశీయ సత్యసాయి మహిళా విభాగం ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ట్రస్ట్ సభ్యుడు మద్రాస్ శ్రీనివాస్ ప్రారంభించారు. ఎగ్జిబిషన్లో సత్యసాయి సేవా దళ్ సభ్యులు భారతీయ సంస్కతీ సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ తయారు చేసిన కళా ఉత్పత్తులు, ఆయా ప్రాంతాల్లో చేపడుతున్న సేవా కార్యక్రమాలను, బాలవికాస్ విద్య ప్రాధాన్యతను, సత్యసాయి బోధనలను వివరిస్తూ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కర్ణాటక రాష్ట్రానికి చెందిన సత్యసాయి సేవా సంస్థల మహిళా విభాగం సభ్యులు, ముంబాయికి చెందిన చిన్నారులు సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించారు. సత్యసాయి ట్రస్ట్ సభ్యులు మద్రాస్ శ్రీనివాస్, ఆర్జే రత్నాకర్రాజు, నాగానంద, కార్యదర్శి ప్రసాద్‌రావు,ఈశ్వరాంబ ట్రస్ట్ సభ్యులు మాధురీనాగానంద్, సేవా సంస్థల దేశీయ అధ్యక్షుడు నిమిష్‌పాండ్య పాల్గొన్నారు. -
నేటి నుంచి మహిళా సదస్సు
పుట్టపర్తి టౌన్ : సామాజిక, ఆర్థిక రంగాల్లో మహిళలను భాగస్వామ్యం చేయడం కోసం సత్యసాయి దేశీయ సేవా సంస్థల ఆధ్వర్యంలో శనివారం నుంచి ప్రశాంతి నిలయంలోని పూర్ణచంద్ర ఆడిటోరియంలో అఖిలభారత మహిళా సదస్సు జరగనుందని మీడియా కో–ఆర్డినేటర్ శుక్రవారం తెలిపారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు వివిధ రాష్ట్రాల నుంచి 4 వేల మంది మహిళా ప్రతినిధులు హాజరుకానున్నారని చెప్పారు. సదస్సును ప్రముఖ పారిశ్రామికవేత్త, భోపాల్ మహిళా న్యాయ కళాశాల డైరెక్టర్ మీనా ప్రారంభించనున్నారు. ప్రధానంగా సత్యసాయి బోధనలకు అనుగుణంగా మహిళా లోకానికి మార్గనిర్దేశనం చేసే లక్ష్యంతో సదస్సును నిర్వహిస్తున్నామని తెలిపారు. సత్యసాయి సేవా సంస్థల మహిళా విభాగం జాతీయ కోఆర్డినేటర్ కమలాపాండ్యతో పాటు నీతా ఖన్నా మహిళా ప్రతినిధులనుద్దేశించి ప్రసంగించనున్నారు. -
విదేశీ మహిళపై భర్త వేధింపులు
పుట్టపర్తి టౌన్ : అదనపు కట్నం కోసం భర్త వేధిస్తున్నాడంటూ విదేశీ మహిళ ఫిర్యాదు చేయడంతో పుట్టపర్తి పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. జపాన్ దేశానికి చెందిన సత్యసాయి భక్తురాలు 37 ఏళ్ల నిమిషాహీ మదా తరచూ పుట్టపర్తికి వస్తుండేది. ఈక్రమంలో పుట్టపర్తిలో గణేష్ గేట్‌కు సమీపంలో పాదరక్షల దుకాణం నిర్వహిస్తోన్న జాకీర్‌హుస్సేన్‌తో ఐదేళ్లుగా పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వీరిరువురూ రెండేళ్ల క్రితం కదిరిలో ముస్లిం సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ఆరు నెలలుగా వారి మధ్య విబేధాలు మొదలయ్యాయి. ఇటీవల ఆమె కలెక్టరేట్‌కు వెళ్లి భర్త నిత్యం వేధిస్తున్నాడని, సుమారు రూ.60 లక్షల పైబడి డబ్బు తీసుకున్నాడని, ఇంకా అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన కలెక్టర్ ఆమెకు న్యాయపరమైన సహాయం అందించాలని ఐసీడీఎస్ పీడీ జుబేదాబేగంను ఆదేశించారు. ఐసీడీఎస్ అధికారులు జిల్లా ఎస్పీ దష్టికి తీసుకుని పోయి ఆయన ఆదేశాల మేరకు స్థానిక పుట్టపర్తి పోలీస్ష్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి వారిని సోమవారం రాత్రి విచారణ చేశారు. అనంతరం నిందితుడు జాకీర్‌హుస్సేన్‌పై వేధింపుల కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. -
ఐదు తులాల బంగారం చోరీ
పుట్టపర్తి టౌన్ : వృద్దురాలి మెడలో ఐదు తులాల బంగారు చైనును చోరీ చేసిన ఘటన శుక్రవారం రాత్రి పుట్టపర్తి పట్టణంలో చోటు చేసుకుంది. వివరాలు.. సత్యసాయి భక్తురాలైన పుష్ప మూడు దశాబ్దాల కిందట పుట్టపర్తికి వచ్చి స్థిరపడ్డారు.ప్రశాంతి నిలయంలో సేవ కార్యక్రమాలలో పాలుపంచుకుంటూ పట్టణంలోని మాధవసాయి ఆపార్ట్‌మెంట్‌లో ఉంటోంది. శుక్రవారం సాయంత్రం 8.45 గంటల సమయంలో ప్రశాంతి నిలయంలో సేవలు ముగించుకుని ఇంటికి వెళుతుండగా వెనుకనుంచి వచ్చిన ఆగంతకుడు ఒక చేత్తో ఆమె కళ్లను అదిమిపట్టుకుని, మరో చేత్తో మెడలోని ఐదుతులాల బంగారు చైన్‌ను లాక్కుని పారిపోయాడు. ఆమె తేరుకుని చుట్టపక్కల వారిని పిలిచే లోపు దండగుడు పరారయ్యాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ వెంకటేష్ నాయక్ సంఘటనా స్థలాలను చేరుకుని వివరాలు ఆరా తీశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. -
ఘనంగా సత్యసాయి గిరిప్రదక్షిణ
పుట్టపర్తి టౌన్ : సత్యసాయి గిరి ప్రదక్షిణను భక్తులు ఘనంగా నిర్వహించారు. పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం భక్తులు గిరిప్రదక్షిణ చేపట్టారు. సాయంత్రం ప్రశాంతి నిలయం గణేష్ గేట్ వద్ద సత్యసాయి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.సత్యసాయిని కీర్తిస్తూ భక్తిగీతాలాపనతో గిరిరథాన్ని లాగుతూ భక్తులు ముందుకు సాగారు. గోకులం, ఎనుములపల్లి గణేష్ సర్కిల్, ఆర్వీజేæ పెట్రోల్ బంక్, చింతతోపుల మీదుగా పట్టణంలో ప్రవేశించి తిరిగి గణేష్ గేట్ వద్ద మంగళహారతితో ముగించారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ నిర్వహించారు. -
ప్రశాంతి నిలయంలో నేడు ఓనం
పుట్టపర్తి టౌన్ : కేరళీయుల పవిత్ర ఓనం పర్వదిన వేడుకలు బుధవారం ప్రశాంతి నిలయంలో ఘనంగా జరగనున్నాయి. వేడుకలను పురస్కరించుకుని సత్యసాయి మహాసమాధిని, సాయికుల్వంత్ సభా మందిరాన్ని కేరళ సంప్రదాయ రీతితో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కేరళ రాష్ట్రంతోపాటు వివిధ ప్రాంతాల నుంచి వేడుకల్లో పాల్గొనేందుకు ప్రశాంతి నిలయం చేరుకున్నారు. ఉదయం 8 గంటలకు సాయికుల్వంత్ సభా మందిరంలోని సత్యసాయి మహాసమాధి వద్ద కేరళ భక్తులు వేదమంత్రోచ్చారణతో వేడుకలు ప్రారంభం కానున్నాయి. కేరళలోని కోజీకోడ్ జిల్లాకు చెందిన బాలవికాస్ విద్యార్థులు ‘యూనిటీ ఆఫ్ ఫెయిత్స్’ అన్న పేరుతో నత్య ప్రదర్శన, భజనలు నిర్వహించనున్నారు. సాయంత్రం వేడుకల్లో భాగంగా ఇండియన్ యునియన్ ముస్లిం లీగ్ సెక్రెటరీ కెఎన్ఎ.ఖాదిర్ వేడుకలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం సత్యసాయి సేవా సంస్థలు కేరళలో నిర్వహించిన వ్యాసరచన పోటీలు–2016 విజేతలకు బంగారు పతకాలను ప్రదానం చేస్తారు. టి.ఎస్.రాధాక్రిష్ణణ్ బందం సంగీత కచేరీతో వేడుకలు ముగియనున్నాయి. ఘనంగా సత్యసాయి గాయత్రీ హోమ యజ్ఞం ఓనం వేడుకల్లో భాగంగా కేరళ సత్యసాయి భక్తులు మంగళవారం ప్రశాంతి నిలయంలో సత్యసాయి గాయత్రీ హోమ యజ్ఞం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పూర్ణచంద్ర ఆడిటోరియం వేదికగా పండితుల వేదమంత్రోచ్చారణ నడుమ యజ్ఞం ఘనంగా జరిగింది. అనంతరం కేరళ రాష్ట్రానికి చెందిన చిన్నారులు సాంస్కతిక కార్యక్రమాలతో అలరించారు. ఉదయం సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత విద్యార్థులు ‘హిస్ మాస్టర్స్ వాయిస్’అన్న పేరుతో సంగీత విభావరి నిర్వహించారు. సాయంత్రం కేరళ రాష్ట్ర మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మలయాళ యూనివర్శిటీ వైస్‌చాన్సలర్ కె.జయకుమార్, కేరళ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి జ్యోతిలాల్ ఓనం పర్వధిన వేడుకలను విశిష్టతను,వామన చరిత్రను వివరిస్తూ ప్రసంగించారు. కేరళలోని అలువకు చెందిన సత్యసాయి విద్యావిహార్ విద్యార్థులు‘ ఓనం విత్ మదర్ సాయి’అన్న పేరుతో నత్యనాటిక ప్రదర్శించారు. -
అలరించిన సంగీత కచేరి
పుట్టపర్తి టౌన్ : ప్రశాంతి నిలయంలో ఓనం పర్వదిన వేడుకలు కొనసాగుతున్నాయి. మూడో రోజు వేడుకల్లో భాగంగా ఆదివారం సాయంత్రం పలువురు వక్తలు ప్రసంగాలతో పాటు, కళాకారులు సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించారు. కేరళ భక్తులు వేదపఠనంతో సాయంత్రం వేడుకలు ప్రారంభమయ్యాయి. కేరళ సెంట్రల్ యూనివర్శిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ గోపకుమార్, ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు చైర్మన్ ప్రయర్ గోపాలకష్ణ తదితరులు సత్యసాయి వైభవాన్ని, ఓనం వేడుకల విశిష్టతను వివరిస్తూ ప్రసంగించారు. అనంతరం ప్రసిద్ధ కేరళ సంగీత విద్వాంసురాలు అంభ్లి బందం సంగీత కచేరి నిర్వహించారు. -
విశ్వశాంతి కోసం చండీయాగం
పుట్టపర్తి టౌన్ : విశ్వశాంతిని కాంక్షిస్తూ ఏపీ బ్రాహ్మణ సేవాసంఘం ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో చండీయాగం నిర్వహించారు. ఈసందర్భంగా హోమగుండం వద్ద వేదమంత్రాలు పఠిస్తూ యజ్ఞ కతువులను, విశేషపూజలను ఘనంగా నిర్వహించారు. గణపతిపూజ, కుంకుమార్చన,లలితా సహస్రనామం, కలశ పూజ నిర్వహించి పూర్ణాహుతితో చండీయాగాన్ని ముగించారు. బ్రాహ్మణ సేవాసంఘం జిల్లా కార్యదర్శి యోగానందశర్మ, నియోజకవర్గ అధ్యక్షుడు కరణం చంద్రశేఖర్‌రావు, ఉపాధ్యక్షుడు ఓడీసీ సుబ్బరావు, కార్యదర్శి సుబ్బక్రిష్ణ, నాగరాజరావు, సుబ్రహ్మణ్యం శర్మ తదితరులు పాల్గొన్నారు. -
ఓనం వేడుకలు ప్రారంభం
పుట్టపర్తి టౌన్ : కేరళీయులు పవిత్రంగా భావించే ఓనం పర్వదిన వేడుకలు ప్రశాంతి నిలయంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. వేలాదిమంది కేరళ భక్తులతోపాటు, దేశ విదేశాలకు చెందిన భక్తులు వేడుకల్లో పాల్గొన్నారు. శుక్రవారం సాయంత్రం కేరళ భక్తులు వేదపఠనంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే కేఎస్ శభరినాథన్ హాజరై ప్రసంగించారు. ప్రపంచ నలుమూలలా సత్యసాయి సేవాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్య, వైద్య, తాగునీటి సేవలు వెలకట్టలేనివన్నారు. అనంతరం కేరళకు చెందిన ప్రముఖ సంగీత విద్వాంసుడు విట్టల్ వినోద్ భాగవతార్ బృందం సంగీత కచేరి నిర్వహించారు. కేరళ సంగీత రీతులలో చక్కటి స్వరాలోలికిస్తూ భాగవతార్ బృందం నిర్వహించిన సంగీత కచేరీతో భక్తులు తన్మయభరితులయ్యారు. అనంతరం భక్తులు సత్యసాయి మహాసమాధి చెంత ప్రణమిల్లి దర్శించుకున్నారు. -
ఇష్టపడి చదవండి
పుట్టపర్తి టౌన్ : ఇష్టపడి చదివితే లక్ష్యం ఎంత పెద్దదైనా సులభంగా సాధించవచ్చని సంస్కృతీ విద్యాసంస్థల చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి సంస్కృతీ స్కూల్స్ ఆఫ్ బిజినెస్‌లో ఫ్రెషర్స్‌డే వేడుకలను విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా జూనియర్, సీనియర్స్ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయ వేషధారణలో విద్యార్థినులు ర్యాంప్ వాక్ నిర్వహించారు. కళాశాల చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ కష్టపడేతత్వంతోపాటు నెపుణ్యాలను పెం పొందించుకోవడంపై విద్యార్థులు దృష్టిసారిస్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చునన్నారు. ప్రిన్సిపల్ శ్రీనివాసన్, సిబ్బంది,విద్యార్థులు పాల్గొన్నారు. -
విదేశీయుల చండీయాగం
పుట్టపర్తి టౌన్ : లోక కళ్యానార్థం విదేశీయులు భారతీయ సంస్కృతీ సంప్రదాయాల మేరకు చండీయాగం నిర్వహించారు. బుధవారం నగర పంచాయతీ పరిధిలోని ఎనుములపల్లి మార్కెట్ వద్ద గల ఆంజనేయస్వామి ఆలయంలో వేద మంత్రోచ్చారణ నడుమ చండీయాగం నిర్వహించారు. అమావాస్య ముందురోజు చతుర్దసి రోజున అమ్మవారికి ప్రీతిపాత్రమైన రోజు. ఇదే రోజు చండీయాగం చేస్తే అమ్మవారు కరుణించి లోకకళ్యాణం ప్రాప్తిస్తుందన్న విశ్వాçÜంతో వారు యాగం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్యసాయి మార్గంలో మానవాళి నడవాలని, ఆయన బోధించిన మేరకు లోకాసమస్త సుఖినోభవంతు అన్న సందేశాన్ని నమ్ముతూ లోకకళ్యాణం కోసం చండీయాగం చేపట్టినట్లు తెలిపారు. -
తన్మయభరితం ‘శుభోదయం’
పుట్టపర్తి టౌన్: విశాఖ జిల్లా బాలవికాస్ చిన్నారులు శ్రీకృష్ణుని లీ లలను,సత్యసాయి వైభవాన్ని వివరిస్తూ నిర్వహించిన నృత్యప్రదర్శ న తన్మయభరితంగా సాగింది. గురువారం సాయంత్రం ప్రశాంతి నిలయంలో జరిగిన కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా విశాఖపట్నం జిల్లాకు చెందిన సత్యసాయి భక్తులు సాంస్కృతిక కార్యక్రమాలు ని ర్వహించారు. తొలుత విశాఖపట్నం జిల్లా సత్యసాయి సేవాసంస్థల అధ్యక్షుడు నాగేశ్వర్రావు భక్తులనుద్దేశించి ప్రసంగించారు. సత్యసా యి ఆదర్శాలకు అనుగుణంగా ప్రతిఒక్కరూ మార్గాన్ని రూపొం దించుకోవాలన్నారు. సత్యసాయి సేవా కార్యక్రమాల మూలంగా వి శాఖపట్నం జిల్లాలోని మారుమాల గ్రామాలకు చెందిన పేదలు ఎం తో లబ్ధి పొందారన్నారు. సత్యసాయి సేవా సంస్థల ద్వారా అంది స్తున్న విద్య, వైద్యం, తాగునీరు ఎందరో పేదల జీవితాలలో వెలుగులు నింపుతున్నాయన్నారు. అనంతరం బాలవికాస్ విద్యార్థులు, సత్యసాయి యూత్ సభ్యులు విశాఖ సంస్కృతినిప్రతిబింబిస్తూ, కృష్ణుని వైభవాన్ని వివరిస్తూ నృత్యప్రదర్శన నిర్వహించారు. చిన్నారులకు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు ఆర్జే రత్నాకర్రాజు దంపతులు జ్ఞాపికలను అందజేశారు. చివరగా విద్యార్థులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. -
కంకికో కవరు
పుట్టపర్తి అర్బన్ : పక్షుల దాడి నుంచి రక్షించుకోవడానికి రైతులు సజ్జ కంకులకు కవర్లు కట్టారు. పుట్టపర్తి మండలంలోని అటవీ గ్రామాల్లో అధికంగా సజ్జ పంటను సాగు చేశారు. సీడ్ కోసం ప్రత్యేకంగా మండలంలోని గంగిరెడ్డిపల్లి, దిగువచెర్లోపల్లి, సాతార్లపల్లి, గంగంపల్లి, గోపిదేవరపల్లి గ్రామాల్లో సజ్జ పంటను సాగు వేశారు. అయితే కాకులు, గువ్వలు, పిచ్చుకలు పంటకు తీవ్ర నష్టం కలిగిస్తుండడంతో కవర్లు, దుస్తులు, టేపులు, శబ్దం కలిగించే వస్తువులు కట్టి పంటను రక్షంచుకుంటున్నామని రైతులు తెలిపారు. ఆ నాలుగు గ్రామాల్లో సుమారు 80 ఎకరాల్లో సజ్జ పంటను సాగు చేసినట్లు వారు చెప్పారు. -
అలరించిన సంగీత కచేరి
పుట్టపర్తి టౌన్ : సత్యసాయిని కీర్తిస్తూ బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల సత్యసాయి భక్తులు నిర్వహించిన సంగీత కచేరి భక్తులను అలరించింది. పర్తి యాత్రలో భాగంగా పుట్టపర్తికి విచ్చేసిన బీహార్, జార్ఖండ్ భక్తు లు ప్రశాంతి నిలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిం చారు. ఈ సందర్భంగా వారు సత్యసాయిపై భక్తితో సుమారు గంట పాటు నిర్వహించిన కచేరితో సాయికుల్వంత్ సభా మందిరం మా ర్మోగింది. అనంతరం భక్తులు సత్యసాయి సమాధిని దర్శించుకున్నారు. -
ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం
పుట్టపర్తి అర్బన్: జాతీయ చేనేత దినోత్సవాన్ని చేనేతలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఆదివారం నగర పంచాయతీ పరిధిలోని ఎనుములపలిలో చేనేత సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చరఖాకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ చేనేతలు ఐక్యతతో ముందుకు సాగుతూ సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన మరమగ్గాలు నేత కార్మికుల పొట్ట కొడుతున్నాయన్నారు.ప్రభుత్వాలు చర్యలు తీసుకుని వీటిని నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో సాగునీటి సంఘం అధ్యక్షుడు సుధాకర్, బీజేఎంఎం జిల్లా ఉపాధ్యక్షుడు జ్యోతిప్రసాద్, చేనేత సంఘం మండల అధ్యక్షుడు శ్రీనివాసులు, ఊట్ల సోము, ఆశ్వర్థప్ప తదితరులు పాల్గొన్నారు. -
పోలీస్ కావాలనుకున్నా
పుట్టపర్తి అర్బన్ : పోలీస్ శాఖలో ఉద్యోగం సంపాదించాలనుకున్నాను..అనుకోకుండా సినీ పరిశ్రమవైపు వచ్చి దర్శకుడిగా మారానని ప్రముఖ దర్శకుడు చంద్రమహేష్ పేర్కొన్నారు. శనివారం పుట్టపర్తికి విచ్చేసిన ఆయన ప్రశాంతి నిలయంలోని సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వస్థలం కాకినాడ సమీపంలోని శంఖవరం గ్రామమన్నారు.తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులని, తాను ఇంటర్లో ఉండగా నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి కళాశాలకు వచ్చారని, అతన్ని చూసిన తరువాత సినీరంగంపై మక్కువ ఏర్పడిందన్నారు. 1994లో డాక్టర్ రామానాయుడు నిర్మించిన సూపర్‌పోలీస్ చిత్రానికి సహాయ దర్శకునిగా సినీ రంగప్రవేశం చేశానన్నారు. ఇప్పటి వరకు తెలుగు, తమిళ, మళయాల, కన్నడ భాషల్లో 12 చిత్రాలకు దర్శకత్వం వహించానన్నారు. ప్రేయసిరావే, హనుమంతు చిత్రాలకు ఉత్తమ దర్శకుడిగా ప్రభుత్వం నంది అవార్డులు ప్రదానం చేసిందన్నారు. త్వరలో రెండు చిత్రాలకు దర్శకత్వం వహిస్తానన్నారు. 2009లో మొదటిసారి సత్యసాయిని దర్శించుకున్నానని, అప్పటి నుంచి తరచూ ప్రశాంతి నిలయానికి వస్తున్నాన్నారు. డాక్టర్ వరప్రసాద్, జెన్ రాజు,యూఎస్ రాజు తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాదంలో ప్రజారోగ్యం
పుట్టపర్తి అర్బన్: ప్రజల ఆరోగ్యాన్ని అధికారులు విస్మరించారు. మండలంలోని పలు గ్రామాల్లో ఇళ్ల మధ్య ఉన్న పాడుబడిన బావుల్లో నీళ్లు నిల్వ ఉండి విషం చిమ్ముతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఎటువంటి పారిశుద్ధ్య చర్యలు తీసుకోకపోవడంతో దోమలు పెరిగి వ్యాధులు ప్రబలుతున్నాయని వాపోతున్నారు. వర్షాకాలంలో వాన నీటితో నిండిన పాడుబావులు చెత్తాచెదారంతో కుళ్లి దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి. ముఖ్యంగా అటవీ గ్రామాలైన సాతార్లపల్లి, దిగువచెర్లోపల్లి, వెంగళమ్మచెరువు, వెంకటగారిపల్లి కాలనీలలో పాడుబడిన బావులతో పాటు గతంలో తాగునీళ్లు అందించిన చేదబావులు సైతం చెత్తాచెదారం నిండి దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి. దీంతో అనారోగ్యాలతో ఒళ్లు గుల్లవుతోందని ఆర్థిక పరిస్థితి దిగజారుతోందని వారు వాపోతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నీరు–చెట్టు కార్యక్రమంలో చెరువుల్లోని మట్టి తోలి పలు బావులు, గుంతలను మూసివేసింది. దీంతో ఆయా స్థలాలు అందుబాటులోకి వచ్చాయి. పాడుబడిన బావులతో అనారోగ్యమే గాక చిన్న పిల్లలకు ప్రమాదకరంగా మారాయి. ఇళ్ల మధ్య ఉండడంతో ఆడుకుంటూ వెళ్లి ఎక్కడ పడిపోతారోనన్న ఆందోళన కూడా ప్రజల్లో నెలకొని ఉంది. ఇటీవల దిగువచెర్లోపల్లి గ్రామంలో రోడ్డు పక్కనే పాడుబావి ఉండడంతో ట్రాక్టర్ అదుపుతప్పి బావిలో పడి దెబ్బతింది. అదృష్టవశాత్తు డ్రైవర్ తప్పించుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అధికారులు స్పందించి గ్రామాల్లో ఇళ్ల మధ్య ఉన్న పాడుబడిన బావులను గుర్తించి మట్టితో మూసి వేయాలని గ్రామీణులు కోరుతున్నారు. గ్రామస్తులు ముందుకు రావాలి పాడుబడిన బావులు, నిరుపయోగంగా ఉన్న గుంతలు గ్రామాల్లో ఉంటే గ్రామస్తులు రాత పూర్వకంగా ఇస్తే పూడ్చి వేయడానికి చర్యలు తీసుకుంటాం. చాలా గ్రామాల్లో అటువంటివి ప్రమాదకరంగా ఉన్నాయి. – జమునాబాయి, ఇరిగేషన్ జేఈ -
ఆటోమేటిక్ దంతితో లాభాలు
పుట్టపర్తి అర్బన్ : ఖరీప్ సీజన్లో సాగుచేసిన వివిధ పంటల్లో కలుపు తొలగించడానికి వినియోగించే ఆటోమేటిక్ దంతి (కలుపు తీసే పనిముట్టు) తో లాభాలు ఉన్నాయని రైతులు పేర్కొంటున్నారు. సుమారు వెయ్యి రూపాయల ఖర్చుతో సైకిల్ చక్రంతో తయారు చేసిన దంతితో ఖర్చు లేకుండా కలుపు తొలగించవచ్చని గంగిరెడ్డిపల్లి రైతు కుళ్లాయప్ప చెప్పారు. ఒక యంత్రంతో ఒక మనిషి అలుపు లేకుండా రోజుకు ఎకరా పైన కలుపు తీయవచ్చన్నారు. ప్రస్తుతం వేరుశనగ, కంది,పంటల్లో కలుపు తీయడానికి ఎద్దులు దొరకడం కష్టంగా ఉండడం, కూలీలు దొరకక పోవడంతో కలుపు తొలగించే యంత్రాన్ని తయారు చేయించినట్లు ఆయన చెప్పారు. -
సంక్షేమానికి ప్రాధాన్యంత దక్కడం లేదు
పుట్టపర్తి అర్బన్: అమరావతికి దక్కిన ప్రాధాన్యం అభివృద్ధి, సంక్షేమానికి దక్కలేదని ప్రముఖ గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం పుట్టపర్తికి విచ్చేసిన ఆయన సత్యసాయి మహాసమాధిని కు టుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ఆయన స్థానిక సాయి ఆరామంలో విలేకరులతో మాట్లాడారు. గత యూపీఏ ప్రభుత్వం తెలుగుతల్లిని రెండుగా విడదీసి, తెలుగు ప్రజల్లో తీరని గుండెకోతను మిగి ల్చిందన్నారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లవుతున్నా వ్యవసాయం, పారిశ్రామిక, సాంస్కృతిక రంగాలపై ప్రత్యేక పాలసీలు లేకపోవడం బాధాకరమన్నారు. వైఎస్ఆర్ మర ణం తర్వాత రాష్ట్రంలో అధ్వాన పాలన సాగు తోందన్నారు. రాష్ట్రంలోని ప్రతి గడపకూ వైఎస్సార్ సంక్షేమ పథకాలు చేరాయన్నారు. గోదావరి జిల్లాలో రూ.10 కోట్ల వ్యయంతో గజల్ శ్రీనివాస్ మ్యూజియం, గజల్ డిజిటల్ లైబ్రరీ, ఫర్మార్మింగ్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ పాఠశాల నిర్మిస్తామన్నారు. అనంతరం గజల్ శ్రీని వాస్‌ను వినియోగదారుల సమాఖ్య రాష్ట్ర నా యకుడు సురేష్, చంద్రశేఖర్‌గుప్తా దుశ్శాలు వ, సత్యసాయి చిత్రపటంతో సన్మానించారు. -
మానసిక వికలాంగురాలికి విదేశీయుల చేయూత
చండ్రాయనిపల్లి(బుక్కపట్నం): మండలంలోని చండ్రాయనిపల్లికి చెందిన ఓ మానసిక వికలాంగురాలికి విదేశీయులు చేయూతనిందించారు. గ్రామానికి చెందిన రామాంజనమ్మ పుట్టుకతోనే వికలాంగురాలు. ఈమెకు తల్లి లేదు. తండ్రి ఉన్నారు. పుట్టపర్తి మండలం చెర్లోపల్లి ప్రాథమికోన్నత పాఠశాల హెచ్ఎం చెన్నకృష్ణారెడ్డి పక్కనే ఉన్న తరుగువాండ్లపల్లికి చెందిన వ్యక్తి కావటంతో విషయం తెలుసుకొని తన వంతుగా చేయూతనిందిస్తూ గ్రీసు దేశానికి చెందిన సత్యసాయి భక్తుడు డిబిలీయస్ సహకారంతో సుమారు లక్ష రూపాయలతో షెడ్డు నిర్మాణం పనులు చేపట్టారు. ఇందులో రూ.10 వేలు చెన్నకృష్ణారెడ్డి వాటాగా విరాళం అందించారు. ఆదివారం గ్రీసు దేశస్తుడు గ్రామానికి వచ్చారు. ఆయనకు ప్రధానోపాధ్యాయుడు, గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. విదేశీయులు చేయూతనిందించేందుకు కృషి చేసిన చెన్నకృష్ణారెడ్డికి రామాం జనమ్మ తండ్రి,గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. -
సమస్యల పరిష్కారంలో బాబు విఫలం
నల్లమాడ: సమస్యల పరిష్కారంలో ముఖ్య మంత్రి చంద్రబాబు విఫలమయ్యారని రైతులు, మహిళలు, వృద్ధులు ధ్వజమెత్తారు. ఆదివారం మండలంలోని మీసాలవాండ్లపల్లి, కొండకిందతండా, వేళ్లమద్ది, కొత్తపల్లితండాలో గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమం నిర్వహించారు. గడప గడపకూ కార్యక్రమంలో భాగంగా పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయకర్త ఇళ్లిళ్లూ తిరుగుతూ కరపత్రం పంచుతూ పలు సమస్యలు ప్రస్తావించారు. ఈ సందర్భంగా సీసీ రోడ్లు, డ్రైనేజీ, రేషన్‌కార్డులు, పింఛన్లు, ఇళ్లు తదితర సమస్యలను శ్రీధర్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. రాబోయే ఎన్నికల్లో జగనన్న సీఎం అయితే మన సమస్యలు అన్నీ పరిష్కారం అవుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అనంతరం కొత్తపల్లితండాలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజధాని హైదరాబాదులో 10 సంవత్సరాల వరకూ హక్కు ఉన్నా.. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు ఇరుక్కుపోయి కేసీఆర్ భయంతో అమరావతిలో తూతూ మంత్రంగా బ్లాకులు నిర్మిస్తున్నారన్నారు. అత్యంత వెనుకబడి కరువు బారిన పడ్డ అనంతపురం జిల్లాను మంత్రులు, ఎమ్మెల్యేలు ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. హంద్రీనీవా పనులు పూర్తి చేసి జిల్లాలో ప్రతి నీటి కుంటలకు నీరు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పుట్టపర్తి నియోజకవర్గంలో అభివృద్ధిని విస్మరించారన్నారు. సమస్యలు పరిష్కరించలేని మంత్రిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి డీఎస్ కేశవరెడ్డి, కార్యదర్శి దుద్దుకుంట సుధాకర్‌రెడ్డి, సేవాదళ్ సభ్యుడు ఏఎన్ చంద్రశేఖర్‌రెడ్డి, చారుపల్లి, రెడ్డిపల్లి సర్పంచులు ప్రతాపరెడ్డి, కె.సూర్యనారాయణ, బుక్కపట్నం సింగల్‌విండో అధ్యక్షుడు విజయరెడ్డి, కర్వీనర్ సుధాకర్‌రెడ్డి, సర్పంచ్ గంగమనాయుడు, గ్రామ కమిటీ అధ్యక్షులు పురుషోత్తంయాదవ్, అశోక్‌కుమార్‌యాదవ్, రజనీకాంతరెడ్డి, ఆనంద్, మోహన్‌దాస్, జయమ్మ, సింగల్‌విండో మాజీ డైరెక్టర్ బొజ్జేనాయక్, నాయకులు న్యాయవాది రామచంద్రారెడ్డి, విజయభాస్కరరెడ్డి, సీతారాం, కె. సురేష్, నాగార్జున, పక్కీర్‌నాయక్, గిరినాయక్, ఎర్ర సూరి, గంగిరెడ్డి, సుధాకర్ పాల్గొన్నారు. -
గడప గడపలో సమస్యల వెల్లువ
పుట్టపర్తి అర్బన్: గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో సమస్యలు వెల్లువెత్తుతున్నాయి. సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందకుండా అడ్డుకుంటున్న జన్మభూమి కమిటీ సభ్యులపై తమ ప్రభుత్వం రాగానే క్రిమినల్ కేసులు బనాయించనున్నట్లు పుట్టపర్తి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం మండలంలోని కంబాలపర్తి, చెర్లోపల్లి, వెంగళమ్మచెరువు గ్రామాల్లో గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఇంటింటికీ తిరిగిన ఆయన పలువురు వృద్ధులు, యువకులు, వికలాంగులు చేసిన ఫిర్యాదులను చూసి చలించిపోయారు. టీడీపీ ప్రభుత్వం రాగానే ఉన్నఫలంగా పింఛన్లు, రేషన్ కార్డులు తొలగించి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఇళ్లు మంజూరులో సైతం సొంత పార్టీ వారికే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు చేతులు లేని వారికి సైతం పింఛన్ ఇవ్వలేదన్నారు. రుణ మాఫీ ఒక మాయ అని ఇలాంటి కల్లబొల్లి మాటలతో ప్రభుత్వం పబ్బం గడుపుతోందన్నారు. తమ ప్రభుత్వం రాగానే అన్ని సమస్యలు పరిష్కరించనున్నట్లు దుద్దుకుంట భరోసా ఇచ్చారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం బడుగు, బలహీన వర్గాలపై దాడులు ఎక్కువయ్యాయని చాకలి లక్ష్మమ్మ అనే వృద్ధురాలు కన్నీటి పర్యంతమైంది. కార్యక్రమంలో భాగంగా శనివారం సుమారు 1,350 ఇళ్లు తిరిగారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు డీఎస్ కేశవరెడ్డి, లోచర్ల విజయభాస్కరరెడ్డి, గంపల రమణారెడ్డి, సర్పంచ్ ఆదినారాయణ, ఎంపీటీసీ సుశీల,కంబాలపర్తి రమణ, నాయుడు, శేఖర, చెర్లోపల్లిలో బయపరెడ్డి, శివారెడ్డి, నాగరాజు, ఓబిరెడ్డి, తిప్పారెడ్డి, వేమారెడ్డి, చిన్నకుళ్లాయప్ప, లోకనాథరెడ్డి, వెంగళమ్మచెరువులో ప్రతాప్‌రెడ్డి, సహకార సంఘం అద్యక్షుడు నరసారెడ్డి, ఈశ్వరరెడ్డి, హనుమంతరెడ్డి, మహేష్, రమణ,నమస్తే రామాంజనేయులు, దారా శంకర్, ఆంజనేయులు పాల్గొన్నారు.