
అలరించిన సంగీత కచేరి
పుట్టపర్తి టౌన్ : సత్యసాయి సన్నిధిలో ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసుడు శ్రీరాం పార్థసారథి బృందం నిర్వహించిన సంగీత కచేరి అలరించింది. శుక్రవారం సాయంత్రం సాయికుల్వంత్ సభా మందిరంలో కర్నాటక సంగీత రీతులలో చక్కటి స్వరాలు ఒలికిస్తూ సత్యసాయిని, సర్వదేవతలను కీర్తిస్తూ శ్రీరాం బృందం సాగిన కచేరి భక్తులను మైమరపించింది. పిదప కళాకారులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.