
అలరించిన సంగీత కచేరి
పుట్టపర్తి టౌన్ : సత్యసాయిని కీర్తిస్తూ చెన్నై మెట్రోకు చెందిన సత్యసాయి యువత నిర్వహించిన సంగీత కచేరి భక్తులను అలరించింది. రెండు రోజుల పర్తియాత్రలో భాగంగా చెన్నైకి చెందిన వేలాది మంది భక్తులు పుట్టపర్తికి విచ్చేశారు. శనివారం సాయంత్రం చెన్నై మెట్రో సౌత్‌కు చెందిన సర్వస్త్రీ సాయిరక్షిత్ బృందం స్వర వాయిద్య కచేరి నిర్వహించారు. సుమధుర స్వరాలోలికిస్తూ వారు నిర్వహించిన సంగీత కచేరితో భక్తులు మైమరచిపోయారు.భక్తులు సత్యసాయి మహాసమాధని దర్శించుకున్నారు.