‘క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రం.. డైనమిక్‌ లీడర్‌ కావాలి’ | State Is In A Difficult situation Dynamic Leader Is Required Said By YSRCP Leader Kadapala Srikanth Reddy | Sakshi
Sakshi News home page

‘క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రం.. డైనమిక్‌ లీడర్‌ కావాలి’

Published Fri, May 25 2018 6:38 PM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM

State Is In A Difficult situation Dynamic Leader Is Required Said By YSRCP Leader Kadapala Srikanth Reddy - Sakshi

వైఎస్సార్‌ సీపీ జాతీయ కార్యదర్శి కడపల శ్రీకాంత్‌ రెడ్డి

సాక్షి, అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం క్లిష్టమైన పరిస్థితిలో ఉందని, ఇలాంటి సమయంలో వైఎస్ జగన్ లాంటి డైనమిక్ లీడర్ నాయకత్వం అవసరమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ కార్యదర్శి కడపల శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పుట్టపర్తిలోని సాయి ఆరామం హోటల్లో కార్యకర్తలతో కలసి ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పదవులు, టిక్కెట్ల కోసం వైఎస్సార్‌ సీపీలోకి రాలేదని అన్నారు. పార్టీ ఆదేశాలు, అవసరాల మేరకు తన అనుభవంతో సేవ చేస్తానని తెలిపారు.

వైఎస్‌ రాజశేఖరరెడ్డి అమలు చేసిన జనరంజక పథకాలు రూపు మాపి రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి, దౌర్జన్యం మితిమీరాయని ధ్వజమెత్తారు. చంద్రబాబు చివరకు దేవాలయాలను కూడా వదలడం లేదని విమర్శించారు. టీటీడీలో స్వామి వారి నగలు, వజ్రాలు మాయమైన వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement