musical programme
-
అలరించిన సంగీత కచేరి
పుట్టపర్తి అర్బన్: శరన్నవరాత్రుల సందర్భంగా శుక్రవారం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి మిర్పురీ సంగీత కళాశాల విద్యార్థులు నిర్వహించిన సంగీత కచేరి భక్తులను పరవశింపజేసింది. ‘అచింత్య రూపిణి సాయిమా’ అంటూ సత్యసాయిని కీర్తిస్తూ విద్యార్థులు కచేరీ చేశారు. కార్యక్రమంలో భాగంగా త్యాగరాజు రచించి హిందోళరాగంలో ఆలపించిన పాటలతో భక్తులు మైమరిపోయారు. ఇందులో మాతేశ్వరి పరమేశ్వరి, తుకారాం భైరవీ రాగంలో పాడిన ‘స్వామికృపాకరి కరణ’ పాట అందరినీ మంత్రముగ్ధులను చేసింది. -
అలరించిన సంగీత కచేరీ
సత్యసాయి మిరుపురి సంగీత కళాశాల, సత్యసాయి యూనివర్సిటీ యూజీ విద్యార్థులు నిర్వహించిన సంగీత కచేరీ భక్తులను అలరించింది. గురువారం సాయంత్రం సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత విద్యార్థులు సంగీత కచేరీ నిర్వహించారు. విద్యార్థులు సత్యసాయిని కీర్తిస్తూ చక్కటి భక్తిగీతాలు ఆలపించారు. సుమారు గంటపాటు కొనసాగిన సంగీత కచేరీతో సాయికుల్వంత్ సభా మందిరం మార్మోగింది. - పుట్టపర్తి టౌన్ -
అలరించిన సంగీత నృత్యరూపకం
పుట్టపర్తి టౌన్ : శివరాత్రి పర్వదిన వేడుకలను పురస్కరించుకుని సత్యసాయి సన్నిధిలో విద్యార్థులు నిర్వహించిన ‘జగతే పితర వందే’ సంగీత నృత్యరూపకం భక్తులను అలరించింది. గురువారం సాయంత్రం సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత ప్రశాంతి డ్యాన్స్ ట్రూప్ సభ్యులు సంగీత నృత్యరూపకం ప్రదర్శించారు. ఇందులో భాగంగా పరమశివుని వైభవాన్ని, వినాయకుడు తన మాతృమూర్తులపై ప్రదర్శించిన భక్తిభావనను చక్కగా వివరించారు. నేడు ప్రశాంతి నిలయంలో అఖండ భజన శివరాత్రి పర్వదిన వేడుకల్లో భాగంగా ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత శుక్రవారం సాయంత్రం 6 గంటలకు అఖండ భజన ప్రారంభం కానుంది. -
అలరించిన సంగీత కచేరి
పుట్టపర్తి టౌన్ : సత్యసాయి సన్నిధిలో ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసుడు శ్రీరాం పార్థసారథి బృందం నిర్వహించిన సంగీత కచేరి అలరించింది. శుక్రవారం సాయంత్రం సాయికుల్వంత్ సభా మందిరంలో కర్నాటక సంగీత రీతులలో చక్కటి స్వరాలు ఒలికిస్తూ సత్యసాయిని, సర్వదేవతలను కీర్తిస్తూ శ్రీరాం బృందం సాగిన కచేరి భక్తులను మైమరపించింది. పిదప కళాకారులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. -
అలరించిన సంగీత కచేరి
పుట్టపర్తి టౌన్ : సత్యసాయి మిరుపురి సంగీత కళాశాలకు చెందిన పూర్వ విద్యార్థులు నిర్వహించిన సంగీత కచేరి భక్తులను అలరించింది. శుక్రవారం సత్యసాయి మహాసమాధి చెంత సంగీత సంగమం పేరుతో కచేరి నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు భక్తిగీతాలను చక్కటి స్వరాలతో ఆలపించారు. విద్యార్థుల కచేరీతో సాయికుల్వంత్ సభా మందిరంలో ఆశీనులైన భక్తులు తన్మయభరితులయ్యారు. అనంతరం విద్యార్థులు సత్యసాయి మహాసమాధి చెంత ప్రణమిల్లారు. -
అలరించిన సంగీత కచేరి
పుట్టపర్తి టౌన్ : సత్యసాయిని కీర్తిస్తూ చెన్నై మెట్రోకు చెందిన సత్యసాయి యువత నిర్వహించిన సంగీత కచేరి భక్తులను అలరించింది. రెండు రోజుల పర్తియాత్రలో భాగంగా చెన్నైకి చెందిన వేలాది మంది భక్తులు పుట్టపర్తికి విచ్చేశారు. శనివారం సాయంత్రం చెన్నై మెట్రో సౌత్‌కు చెందిన సర్వస్త్రీ సాయిరక్షిత్ బృందం స్వర వాయిద్య కచేరి నిర్వహించారు. సుమధుర స్వరాలోలికిస్తూ వారు నిర్వహించిన సంగీత కచేరితో భక్తులు మైమరచిపోయారు.భక్తులు సత్యసాయి మహాసమాధని దర్శించుకున్నారు. -
అలరించిన సంగీత కచేరి
పుట్టపర్తి టౌన్ : ప్రశాంతి నిలయంలో ఓనం పర్వదిన వేడుకలు కొనసాగుతున్నాయి. మూడో రోజు వేడుకల్లో భాగంగా ఆదివారం సాయంత్రం పలువురు వక్తలు ప్రసంగాలతో పాటు, కళాకారులు సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించారు. కేరళ భక్తులు వేదపఠనంతో సాయంత్రం వేడుకలు ప్రారంభమయ్యాయి. కేరళ సెంట్రల్ యూనివర్శిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ గోపకుమార్, ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు చైర్మన్ ప్రయర్ గోపాలకష్ణ తదితరులు సత్యసాయి వైభవాన్ని, ఓనం వేడుకల విశిష్టతను వివరిస్తూ ప్రసంగించారు. అనంతరం ప్రసిద్ధ కేరళ సంగీత విద్వాంసురాలు అంభ్లి బందం సంగీత కచేరి నిర్వహించారు. -
అలరించిన సంగీత కచేరి
పుట్టపర్తి టౌన్ : సత్యసాయిని కీర్తిస్తూ బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల సత్యసాయి భక్తులు నిర్వహించిన సంగీత కచేరి భక్తులను అలరించింది. పర్తి యాత్రలో భాగంగా పుట్టపర్తికి విచ్చేసిన బీహార్, జార్ఖండ్ భక్తు లు ప్రశాంతి నిలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిం చారు. ఈ సందర్భంగా వారు సత్యసాయిపై భక్తితో సుమారు గంట పాటు నిర్వహించిన కచేరితో సాయికుల్వంత్ సభా మందిరం మా ర్మోగింది. అనంతరం భక్తులు సత్యసాయి సమాధిని దర్శించుకున్నారు.