అలరించిన సంగీత కచేరి
అలరించిన సంగీత కచేరి
Published Sat, Dec 31 2016 1:01 AM | Last Updated on Mon, Sep 4 2017 11:58 PM
పుట్టపర్తి టౌన్ : సత్యసాయి మిరుపురి సంగీత కళాశాలకు చెందిన పూర్వ విద్యార్థులు నిర్వహించిన సంగీత కచేరి భక్తులను అలరించింది. శుక్రవారం సత్యసాయి మహాసమాధి చెంత సంగీత సంగమం పేరుతో కచేరి నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు భక్తిగీతాలను చక్కటి స్వరాలతో ఆలపించారు. విద్యార్థుల కచేరీతో సాయికుల్వంత్ సభా మందిరంలో ఆశీనులైన భక్తులు తన్మయభరితులయ్యారు. అనంతరం విద్యార్థులు సత్యసాయి మహాసమాధి చెంత ప్రణమిల్లారు.
Advertisement
Advertisement