
అలరించిన సంగీత కచేరీ
సత్యసాయి మిరుపురి సంగీత కళాశాల, సత్యసాయి యూనివర్సిటీ యూజీ విద్యార్థులు నిర్వహించిన సంగీత కచేరీ భక్తులను అలరించింది. గురువారం సాయంత్రం సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత విద్యార్థులు సంగీత కచేరీ నిర్వహించారు. విద్యార్థులు సత్యసాయిని కీర్తిస్తూ చక్కటి భక్తిగీతాలు ఆలపించారు. సుమారు గంటపాటు కొనసాగిన సంగీత కచేరీతో సాయికుల్వంత్ సభా మందిరం మార్మోగింది. - పుట్టపర్తి టౌన్