అలరించిన సంగీత కచేరి | musical programme in prasanthi nilayam | Sakshi
Sakshi News home page

అలరించిన సంగీత కచేరి

Published Fri, Sep 22 2017 10:53 PM | Last Updated on Sat, Sep 23 2017 12:39 AM

అలరించిన సంగీత కచేరి

పుట్టపర్తి అర్బన్‌: శరన్నవరాత్రుల సందర్భంగా శుక్రవారం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి మిర్‌పురీ సంగీత కళాశాల విద్యార్థులు నిర్వహించిన సంగీత కచేరి భక్తులను పరవశింపజేసింది. ‘అచింత్య రూపిణి సాయిమా’ అంటూ సత్యసాయిని కీర్తిస్తూ విద్యార్థులు కచేరీ చేశారు. కార్యక్రమంలో భాగంగా త్యాగరాజు రచించి హిందోళరాగంలో ఆలపించిన పాటలతో భక్తులు మైమరిపోయారు. ఇందులో మాతేశ్వరి పరమేశ్వరి, తుకారాం భైరవీ రాగంలో పాడిన ‘స్వామికృపాకరి కరణ’ పాట అందరినీ మంత్రముగ్ధులను చేసింది.

Advertisement
Advertisement
Advertisement