ప్రశాంతి నిలయంలో పంద్రాగస్టు సంగీత కచేరీ | independance celebrations in prasanthi nilayam | Sakshi
Sakshi News home page

ప్రశాంతి నిలయంలో పంద్రాగస్టు సంగీత కచేరీ

Published Tue, Aug 15 2017 11:01 PM | Last Updated on Sun, Sep 17 2017 5:33 PM

ప్రశాంతి నిలయంలో పంద్రాగస్టు సంగీత కచేరీ

ప్రశాంతి నిలయంలో పంద్రాగస్టు సంగీత కచేరీ

పుట్టపర్తి అర్బన్‌: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సంగీత కచేరీ నిర్వహించారు. సత్యసాయి మిర్‌పురి సంగీత కళాశాల విద్యార్థులు మంగళవారం సాయంత్రం నిర్వహించిన సంగీత కచేరీ భక్తులను తన్మయత్వంలో ముంచెత్తింది. కర్ణాటక, మలయాలీ,హిందూస్థానీ సంగీతంతో భక్తులను మంత్రముగ్దుల్ని చేశారు. జగదోద్ధారణ,  చందన చర్చిత, దేశ్‌ హమారా యా దేశ్‌ హమారా, తదితర స్వాతంత్య్ర దేశ భక్తుల జీవిత గాథలతో ముడిపడిన పాటలు ఆలపించారు. సత్యసాయి మహా సమాధిని అందంగా అలంకరించారు. సత్యసాయి విద్యాసంస్థల విద్యార్థులు మహాసమాధి దర్శనం తర్వాత సంగీత కచేరీ నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement