‘కేంద్ర మంత్రి పర్యటనలో ప్రోటోకాల్‌ విస్మరించారు’ | protocal mis in union minister tour | Sakshi
Sakshi News home page

‘కేంద్ర మంత్రి పర్యటనలో ప్రోటోకాల్‌ విస్మరించారు’

Published Fri, Jun 9 2017 10:47 PM | Last Updated on Tue, Sep 5 2017 1:12 PM

protocal mis in union minister tour

పుట్టపర్తి టౌన్‌ : ప్రజా  సమస్యలు తెలుసుకోవడానికి  కేంద్ర మంత్రి అనంతకుమార్‌ జిల్లాలో పర్యటించిన సందర్భంగా అధికారులు ప్రొటోకాల్‌ నిబంధనలను విస్మరించడంపై బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి,  బీజేపీ జిల్లా అద్యక్షుడు అంకాల్‌రెడ్డి తదితరులు సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం జిల్లా పర్యటనలో భాగంగా పుట్టపర్తి విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రికి పార్టీ జిల్లా నాయకులతో కలసి ఫిర్యాదు చేశారు. తీవ్ర దుర్బిక్ష పరిస్థితులు నెలకొన్న కదిరి ప్రాంతంలో గురువారం కేంద్ర మంత్రి అనంతకుమార్‌ పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారని, ఈ సందర్భంగా ప్రొటోకాల్‌ మేరకు ఆయనకు స్వాగతం పలకాల్సిన ఆర్డీఓ, స్థానిక తహసీల్దార్‌ పట్టించుకోలేదన్నారు. అందుకు స్పందించిన సీఎం వెంటనే ప్రొటోకాల్‌ అంశంపై విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు కత్తిరాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement