Ananthakumar
-
ఆ ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవాలు: ఫడ్నవీస్
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో తన మూడు రోజులపాలనకు సంబంధించి వస్తున్న ఆరోపణలపై మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. సోమవారం రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇదంతా పూర్తిగా అసత్య ఆరోపణ అని ఫడ్నవీస్ అన్నారు. తన మూడు రోజుల పాలనలో ఎలాంటి నిధులను కేంద్రానికి తిప్పి పంపలేదని ఆయన చెప్పారు. బుల్లెట్ రైలు విషయంలో భూసేకరణ చేయడం మినహా మహారాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో మరేమీ లేదని తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం నిధులను కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం కానీ.. అలాంటి హామీని మహారాష్ట్ర ప్రభుత్వం స్వీకరించడం కానీ జరగలేదన్నారు. కాగా, గతంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ హడావిడిగా ప్రమాణం చేయడం వెనుక పెద్ద డ్రామా దాగి ఉందని.. '80 గంటలు ముఖ్యమంత్రిగా ఉండి.. మహారాష్ట్ర ప్రభుత్వ ఖజానాలోని రూ. 40 వేల కోట్ల నిధులను కాపాడి.. తిరిగి కేంద్రానికి అప్పగించారని అనంతకుమార్ హెగ్డే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో పెనుదుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. చదవండి: అలాంటి పనులు మహారాష్ట్రకు ద్రోహం చేయడమే! -
అలాంటి పనులు మహారాష్ట్రకు ద్రోహం చేయడమే!
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో తలెత్తిన అనూహ్య పరిణామాలపై బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే చేసిన సంచలన వ్యాఖ్యలపై సంజయ్‌రౌత్ స్పందించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ హడావిడిగా ప్రమాణం చేయడం వెనుక పెద్ద డ్రామా దాగి ఉందని.. '80 గంటలు ముఖ్యమంత్రిగా ఉండి.. మహారాష్ట్ర ప్రభుత్వ ఖజానాలోని రూ. 40వేల కోట్ల కేంద్ర నిధులను కాపాడి.. తిరిగి కేంద్రానికి అప్పగించారని అనంతకుమార్ హెగ్డే వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా చేయడం అనేది మహారాష్ట్రకు ద్రోహం చేయడమే అవుతుంది' అంటూ సంజయ్‌రౌత్ ట్వీట్ చేశారు. దీనిపై ఇప్పడు పెద్ద దుమారమే రేగుతోంది. ఇదిలా ఉంటే ఆదివారం రోజున అనంతకుమార్ హెగ్డే మాట్లాడుతూ.. మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమయ్యాయని తమకు తెలిసిన వెంటనే అప్పటికే రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన రూ.40 వేల కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని, వాటిని కాపాడాలనే ఉద్దేశ్యంతోనే ఫడ్నవీస్‌తో హడావిడిగా ప్రమాణస్వీకారం చేయించారన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆ నిధులను తిరిగి కేంద్రానికి బదలాయించారని వ్యాఖ్యానించారు. చదవండి: సీఎంగా ఫడ్నవిస్ ప్రమాణం పెద్ద డ్రామా..! -
వేతనం వదులుకోనున్న ఎన్డీయే ఎంపీలు
న్యూఢిల్లీ: నిరసనలు, ఆందోళనల కారణంగా పార్లమెంటు బడ్జెట్ మలిదశ సమావేశాలు సజావుగా సాగకపోవటంతో.. ఈ 23 రోజుల వేతనాన్ని వదులుకునేందుకు అధికార ఎన్డీయే ఎంపీలు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ బుధవారం వెల్లడించారు. కాంగ్రెస్, ఇతర విపక్షాల అప్రజాస్వామిక తీరు కారణంగానే పార్లమెంటు ఉభయసభలు వాయిదా పడుతున్నాయని విమర్శించారు. ప్రజలు చెల్లిస్తున్న పన్ను వృధా అవుతోందన్నారు. ‘ఈ విషయాన్ని ప్రధాని, బీజేపీ అధ్యక్షుడు, ఎన్డీయే పక్షాల అధ్యక్షులతో చర్చించాం. రెండోవిడత బడ్జెట్ సమావేశాలు జరిగిన 23 రోజుల వేతనాన్ని వదులుకోవాలని నిర్ణయించాం’ అని ఆయన పేర్కొన్నారు. అవిశ్వాసం సహా పలు అంశాలపై చర్చకు సిద్ధమని ప్రకటించినా విపక్షాలు ఆందోళన చేయటం సరికాదని అనంత్ కుమార్ పేర్కొన్నారు. -
‘కేంద్ర మంత్రి పర్యటనలో ప్రోటోకాల్ విస్మరించారు’
పుట్టపర్తి టౌన్ : ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి కేంద్ర మంత్రి అనంతకుమార్ జిల్లాలో పర్యటించిన సందర్భంగా అధికారులు ప్రొటోకాల్ నిబంధనలను విస్మరించడంపై బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, బీజేపీ జిల్లా అద్యక్షుడు అంకాల్‌రెడ్డి తదితరులు సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం జిల్లా పర్యటనలో భాగంగా పుట్టపర్తి విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రికి పార్టీ జిల్లా నాయకులతో కలసి ఫిర్యాదు చేశారు. తీవ్ర దుర్బిక్ష పరిస్థితులు నెలకొన్న కదిరి ప్రాంతంలో గురువారం కేంద్ర మంత్రి అనంతకుమార్ పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారని, ఈ సందర్భంగా ప్రొటోకాల్ మేరకు ఆయనకు స్వాగతం పలకాల్సిన ఆర్డీఓ, స్థానిక తహసీల్దార్ పట్టించుకోలేదన్నారు. అందుకు స్పందించిన సీఎం వెంటనే ప్రొటోకాల్ అంశంపై విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కత్తిరాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఏపీలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు
విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్‌లో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తామని కేంద్ర ఎరువుల, రసాయనాల శాఖ మంత్రి అనంతకుమార్ వెల్లడించారు. అలాగే విశాఖపట్నంలోని హెచ్‌పీసీఎల్‌ని విస్తరిస్తామని చెప్పారు. మంగళవారం విశాఖపట్నంలో జరుగుతున్న భాగస్వామ్య సదస్సులో అనంతకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనంతకుమారు మాట్లాడుతూ... దేశంలో యూరియా కొరత లేకుండా చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రాంతంలో పూర్వం శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించారని... ఈ నేపథ్యంలో ఇరుప్రాంతాల అనుబంధాన్ని అనంతకుమార్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో మెడికల్ డివైస్ పార్కులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అలాగే విశాఖలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మా ఎడ్యూకేషన్ రీసర్చ్ ఏర్పాటు చేస్తామని అనంతకుమార్ చెప్పారు.