
ప్రశాంతి నిలయంలో నేడు ఓనం
పుట్టపర్తి టౌన్ : కేరళీయుల పవిత్ర ఓనం పర్వదిన వేడుకలు బుధవారం ప్రశాంతి నిలయంలో ఘనంగా జరగనున్నాయి. వేడుకలను పురస్కరించుకుని సత్యసాయి మహాసమాధిని, సాయికుల్వంత్ సభా మందిరాన్ని కేరళ సంప్రదాయ రీతితో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కేరళ రాష్ట్రంతోపాటు వివిధ ప్రాంతాల నుంచి వేడుకల్లో పాల్గొనేందుకు ప్రశాంతి నిలయం చేరుకున్నారు. ఉదయం 8 గంటలకు సాయికుల్వంత్ సభా మందిరంలోని సత్యసాయి మహాసమాధి వద్ద కేరళ భక్తులు వేదమంత్రోచ్చారణతో వేడుకలు ప్రారంభం కానున్నాయి.
కేరళలోని కోజీకోడ్ జిల్లాకు చెందిన బాలవికాస్ విద్యార్థులు ‘యూనిటీ ఆఫ్ ఫెయిత్స్’ అన్న పేరుతో నత్య ప్రదర్శన, భజనలు నిర్వహించనున్నారు. సాయంత్రం వేడుకల్లో భాగంగా ఇండియన్ యునియన్ ముస్లిం లీగ్ సెక్రెటరీ కెఎన్‌ఎ.ఖాదిర్ వేడుకలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం సత్యసాయి సేవా సంస్థలు కేరళలో నిర్వహించిన వ్యాసరచన పోటీలు–2016 విజేతలకు బంగారు పతకాలను ప్రదానం చేస్తారు. టి.ఎస్.రాధాక్రిష్ణణ్ బందం సంగీత కచేరీతో వేడుకలు ముగియనున్నాయి.
ఘనంగా సత్యసాయి గాయత్రీ హోమ యజ్ఞం
ఓనం వేడుకల్లో భాగంగా కేరళ సత్యసాయి భక్తులు మంగళవారం ప్రశాంతి నిలయంలో సత్యసాయి గాయత్రీ హోమ యజ్ఞం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పూర్ణచంద్ర ఆడిటోరియం వేదికగా పండితుల వేదమంత్రోచ్చారణ నడుమ యజ్ఞం ఘనంగా జరిగింది. అనంతరం కేరళ రాష్ట్రానికి చెందిన చిన్నారులు సాంస్కతిక కార్యక్రమాలతో అలరించారు. ఉదయం సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత విద్యార్థులు ‘హిస్ మాస్టర్స్ వాయిస్’అన్న పేరుతో సంగీత విభావరి నిర్వహించారు.
సాయంత్రం కేరళ రాష్ట్ర మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మలయాళ యూనివర్శిటీ వైస్‌చాన్సలర్ కె.జయకుమార్, కేరళ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి జ్యోతిలాల్ ఓనం పర్వధిన వేడుకలను విశిష్టతను,వామన చరిత్రను వివరిస్తూ ప్రసంగించారు. కేరళలోని అలువకు చెందిన సత్యసాయి విద్యావిహార్ విద్యార్థులు‘ ఓనం విత్ మదర్ సాయి’అన్న పేరుతో నత్యనాటిక ప్రదర్శించారు.