Onam festival
-
ఓనం ముగ్గును చెరిపి హంగామా
దొడ్డబళ్లాపురం: అపార్ట్మెంట్లో నివసించే కేరళీయులు ఓనం పండుగ కావడంతో పూలతో సుందరంగా ముగ్గు వేశారు. ఇది గిట్టని మరో మహిళ ముగ్గును కాళ్లతో చెరిపివేసి వీరంగం సృష్టించింది. నా అనుమతి లేకుండా ఎవరు ముగ్గు వేసింది అని దూషించింది. బెంగళూరు సంపిగెహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని థణిసంద్ర మోనార్క్ సెరెనిటీ అపార్ట్మెంట్లో చోటుచేసుకుంది. రాకేశ్ క్రిష్ణన్సింహ అనే వ్యక్తి ఈ దృశ్యాలను ఎక్స్‌లో పోస్టు చేశాడు. తమ కేరళ సంస్కృతిని మహిళ అవమానించిందని ఆవేదన వ్యక్తం చేసాడు. ఈ సంఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనుషుల్లో పెరిగిపోతున్న అసహనానికి ఇది అద్దం పడుతోందని వాపోయారు. -
విశాఖపట్నంలో వైభవంగా ఓనం సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
ఓనం-దసరా కలిస్తే.. కీర్తి సురేశ్ క్రేజీ పోస్ట్ (ఫొటోలు)
-
ముద్దుగుమ్మ, ఉప్పెన బ్యూటీ ఓనం లుక్ మామూలుగా లేదుగా (ఫొటోలు)
-
‘ఓనం’ స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన సంజూ శాంసన్
-
ఓనం సెలబ్రేట్ చేసుకున్న టాలీవుడ్ యాంకర్.. ఫోటోలు వైరల్
-
మలయాళ కుట్టీ, కల్కి బ్యూటీ ఓనం స్పెషల్ లుక్ (ఫోటోలు)
-
ఓనం వేళ దరువుతో అలరించే పులికలి..! ఏకంగా 200 ఏళ్ల..
కేరళలో ఓనమ్ పది రోజుల పంట పండుగ. ఈ సందర్భంగా సద్య తాళిని ఆస్వాదించడానికి, పూల అలంకరణలు చేయడానికి, పడవ పందాలను చూడటానికి, ఆటలు ఆడటానికి, దయగల, ఎంతో ప్రియమైన రాక్షస రాజు మహాబలి స్వదేశానికి రావడాన్ని గౌరవించే వేడుక ఓనమ్. ఈ వేడుకలలో నాల్గవ రోజున కేరళలోని అత్యంత అద్భుతమైన దేశీయ కళారూపాలలో పులికలిను ప్రదర్శించారు. కొన్ని ప్రదేశాలలో దీనిని కడువాకలి అని కూడా పిలుస్తారు. ఇక్కడ కళాకారులు పులి వేషం ఓనం రోజుల్లో పులికొట్టు లేదా డ్యాన్స్ తోపాటు వేసే దరువులు త్రిస్సూర్‌లో ప్రతిధ్వనిస్తాయి. త్రిస్సూర్‌లోని పులికలి తప్ప మరే ఇతర ప్రదేశంలోనూ ఈ ప్రత్యేక లయ లేదని చెప్పుకోవచ్చు. పులికలిక్కర్లు వారి నడుముకు గంటలు జోడించి ప్రత్యేకంగా ఆకర్షణీయంగా ఉండే ఈ అసుర లయకు అనుగుణంగా నృత్యం చేస్తారు. వందల ఏళ్ళ నృత్యంపులికలి 200 ఏళ్లనాటిది. అప్పటి కొచ్చిన్ మహారాజా రామవర్మ శక్తన్ థంపురాన్ దీనిని ప్రవేశపెట్టినట్లు చెబుతారు. సహజసిద్ధమైన రంగులను శరీరానికి పూసుకుని, కదులుతున్న పులుల వలె అలంకరింపబడిన పులికెత్తికళి ప్రదర్శనను స్థానికులు ఎంతగానో ఆస్వాదిస్తారు. త్రిస్సూర్‌లో ఈనాటికీ పురాతనమైన నృత్య శైలి మనుగడలో ఉంది. పులి వేషంలో నృత్యం చేసే కళాకారులను పులికలిక్కర్ అంటారు. వాద్యమేళం (కేరళకు చెందిన ఆర్కెస్ట్రా) లయకు అనుగుణంగా నృత్యం చేస్తారు. పులికలిక్కర్ పెయింటింగ్‌లో చారలు ముదురు పసుపు, నలుపు రంగులో ఉంటాయి. పులినిపోలి ఉండేలా శరీరం మొత్తం పెద్ద మచ్చలతో ఈ ఆర్ట్ వేస్తారు. అట్టముక్కలు, సైకిల్ ట్యూబ్‌లు‘కళాకారులు ఓనమ్‌కి రెండు లేదా మూడు నెలల ముందే పులికాలి సన్నాహాలు ప్రారంభిస్తారు. బాగా తిని, పొట్టను సిద్ధం చేసుకుంటారు. దీని వల్ల కళలో వారు మంచి ప్రదర్శనను ఇవ్వగలుగుతారు‘ అని చెబుతారు. ఆరు రకాల చారలతో శరీరం అంతా పెయింట్ చేస్తారు. నేడు కళాకారులు ఫేస్ మాస్క్‌లతో మరింత నూతనంగా డిజైన్ చేస్తున్నారు. ఫేస్ మాస్క్ కోసం కాగితపు అట్టలను కత్తిరించి, దంతాలగా అటాచ్ చేయడానికి జిగురును ఉపయోగిస్తారు. నాలుకను సైకిల్ ట్యూబ్‌ను కత్తిరించి తయారు చేస్తారు. చివరి టచ్–అప్ ముఖానికి సాంప్రదాయక రంగులతో తగిన షేడ్స్‌ను సృష్టిస్తారు. ప్రాచీన నృత్యాలురంగుల ముసుగు నృత్యం త్రిసూర్, పాలక్కాడ్ జిల్లా, దక్షిణ మలబార్‌లోని కొన్ని ప్రాంతాలలో జరుగుతుంది. మొదటి రోజు నుంచి ఓనమ్ నాల్గవ రోజు వరకు ప్రదర్శకులు ఇంటింటికీ వెళతారు. శరీరమంతా కప్పి ఉంచేలా పర్పటక గడ్డితో దుస్తులు సిద్ధం చేస్తారు. దేవతలు, మానవులు, జంతువులు కుమ్మట్టికలిలో కనిపిస్తాయి. కళాకారులు ధరించే పాత్రలు, ముఖాలలో శివుడు, బ్రహ్మ, రాముడు, కృష్ణుడు, గణేశుడు, కాళి మొదలైనవారు ఉంటారు. ముసుగు వేసుకున్న కుమ్మట్టి (మాతృమూర్తి) నటన కళ్లారా చూడాల్సిందే. ఇతర నృత్యాలుస్త్రీలు చిన్న చిన్న సమూహాలుగా ఏర్పడి చేసే ప్రత్యేకమైన నృత్యం. అలంకరించిన ముగ్గు, మధ్యన సంప్రదాయ దీపం.. దాని చుట్టూ మహిళలు చేరి నృత్యం చేస్తారు. నీటితో నిండిన పాత్ర , బియ్యం పాత్ర.. వంటివి కూడా ఉంచుతారు.(చదవండి: 30 కిలోల చాక్లెట్‌తో అర్థనారీశ్వర రూపంలో గణపతి..నిమజ్జనం ఏకంగా..!) -
ఓనమ్ స్పెషల్: కసావు చీర... కాటుక కళ్లు...
ఓనమ్ పండగకి కళకళలాడిపోయారు తారలు. పండగ ప్రత్యేకమైన కసావు చీర కట్టుకుని, సంప్రదాయ నగలు పెట్టుకుని, కళ్లకు కాటుక పెట్టుకుని మెరిసిపోయారు. ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. అమ్మ చీర కట్టుకుని, కొప్పున పువ్వులు పెట్టుకుని అందంగా ముస్తాబైన అనుపమా పరమేశ్వరన్ ‘ఇవాళ ఓనమ్ పెన్నే...’ అంటూ పలు ఫొటోలను షేర్ చేశారు.భర్త జగత్ దేశాయ్, కుమారుడు ఇలయ్తో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు అమలా పాల్. ‘ఇవాళ ఓనమ్ థీమ్ ఏంటంటే పాయసమ్’ అంటూ చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోను షేర్ చేశారు కల్యాణీ ప్రియదర్శన్. భర్త, హీరో గౌతమ్ కార్తీక్‌తో కలిసి పండగ చేసుకున్నారు మంజిమా మోహన్. ఓనమ్ పండగకి అంబారీ స్వారీ చేయకపోతే ఎలా అంటూ నటుడు కాళిదాస్ జయరాం సందడి చేశారు. చేతిలో కలువ పువ్వు పట్టుకుని అనిఖా సురేంద్రన్, మియా జార్జ్ కనువిందు చేశారు. జడకు తామర పువ్వు పెట్టుకుని ప్రెట్టీగా అన్నా బెన్, జుత్తుకి మల్లెలు చుట్టి బ్యూటిఫుల్‌గా మిర్నా మీనన్, అరిటాకులో పువ్వులు పెట్టి చిరునవ్వుతో అందంగా మహిమా నంబియార్, సింపుల్‌గా స్టిల్ ఇచ్చినా సూపర్‌గా కనిపించిన అతుల్యా రవి, అంతే అందంగా కనిపిం చిన అనంతికా సనీల్‌కుమార్, నవ్యా నాయర్... ఇలా ఎవరికి వారు చక్కగా రెడీ అయి, ‘ఓనమ్ శుభాకాంక్షలు’ తెలిపారు. -
Onam Festival: మలయాళ సెలబ్రిటీలు ఎంత బాగా ముస్తాబయ్యారో! (ఫోటోలు)
-
ఓనం అంటే సంబరం, సరదా, సాధ్య!
దక్షిణ రాష్ట్రమైన కేరళలో అతి ముఖ్యమైన పండుగ ఓనం. మరో విధంగా చెప్పాలంటే తెలుగువారికి సంక్రాంతి అంత సంబరం. రుతుపవనాల ముగింపుకు గుర్తుగా రాక్షసరాజు బలిచక్రవర్తిని ఆహ్వానిస్తూ ఘనంగా మలయాళీలు జరుపుకునే పండుగ. సంప్రదాయం,రుచులు కలగలిసిన ఓనం అనగానే రకరకాల వంటలు, వైవిధ్యభరితమైన రుచులు గుర్తొస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏ ప్రదేశంలోఉన్నా కేరళ ప్రజలు ఓనంని ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. సెప్టెంబరు 6 న మొదలైన ఈ ఏడాది ఓనం పండుగ సంబరాలుఆఖరిరోజు సెప్టెంబరు 15న ముగుస్తాయిఓనం అంటే పువ్వులతో అందమైన అలంకరణ, చూడముచ్చటగొలిపే ముస్తాబు. పసందైన విందు భోజనం సాధ్య. ఎర్రబియ్యంతో చేసిన అన్నం, ఇంకా ఉప్పేరి, పసుపు , ఆవాలు మ్యారినేట్ చేసిన పనీర్ కర్రీ, క్లాసిక్ పరిప్పు, గుమ్మడి, కొబ్బరితో చేసే అనేక రకాల వంటకాలు ఉంటాయి. ఇంకా తోరన్, శర్కరవరట్టి, ఉల్లి వడ అవియల్, సాంబారు, తదితర 20కి పైగా వంటకాలతో అరిటాకు బోజనం మరీ స్పెషల్. పరిప్పు కర్రీపెసరపప్పు, కొబ్బరితో చేసి పరిప్పు కర్రీ. కొబ్బరి, జీలకర్ర, పచ్చిమిర్చి, వెల్లుల్లి (ఇష్టమున్నవారు)వేసి మిక్సీలో వేసుకుని కొబ్బరి పేస్ట్ తయారు చేసుకోవాలి. తరువాత పెసరపప్పును బాగా మెత్తగా ఉడికించాలి. ఇపుడు ఉడికిన పప్పులో పసుపు, కొబ్బరి ముద్ద వేసి బాగా కలపి, దీంట్లో కొద్దిగా నీళ్లుపోసుకుని సన్నని మంట మీద ఉడికించాలి. తగినంత ఉప్పు, చిటికెడు, నల్ల మిరియాల కలపాలి. (కాకరకాయ ఆయిల్‌తో ఎన్ని లాభాలో : చుండ్రుకు చెక్, జుట్టు పట్టుకుచ్చే!)తాలింపు: నెయ్యి లేదా కొబ్బరి నూనెను వేడి చేసి ఆవాలు వేసి అవి చిటపడలాడాక, ఎండు మిర్చి ముక్కలు, కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసి పోపు పెట్టుకోవాలి. ఇది సాధారణంగా ఓనం సాధ్యలో బియ్యంతో కలిపి వడ్డిస్తారు. దీంతోపాటు, అప్పడం, పచ్చడి ఉంటుంది. అన్నట్టు ఓనంలో మరో స్పెషల్ పచ్చడి.పచ్చడిసాధ్యలో ఎన్నో రకాల పచ్చళ్లను వడ్డిస్తారు. బీట్రూట్, దోసకాయ, గుమ్మడి, పైనాపిల్ ఇలా ఏ కూరగాయచ పండుతోనైనా రుచికరంగా తయారు చేసుకుని ఎంతో ఇష్టంగా భుజిస్తారు.సాంబారుమన విందుభోజనాల్లోఉన్నట్టే కేరళీయులు సాంబారును బాగా ఇష్టపడతారు. అన్ని రకాల కూరగాయల ముక్కలతో సాంబారును తయారు చేస్తారు. చివరిగా పాయసం లాంటి ఇతర అనేక తీపి పదార్థాలతో నోరును తీపి చేసుకుంటారు. ఇదీ చదవండి : మల్టీ కలర్ చీరలో నీతా అంబానీ స్పెషల్ అండ్ సింపుల్ లుక్ -
కలర్‌ఫుల్ ఓనమ్
పంటలు ఇంటికి వచ్చిన వేళ..వంటలు ఘుమఘుమలాడిన వేళ..ఇంట్లో పండగ వేళ... ఇలా ఓనమ్ పండగను ఘనంగా జరుపుకున్నారు కొందరు తారలు.కేరళప్రాంతంలో పంటలు వచ్చే ఈ మాసంలో ఓనమ్ పండగ జరుపుకుంటారు. మంగళవారం పండగ సందర్భంగా పలువురు కథానాయికలు అందంగా ముస్తాబై, మెరిసిపోయారు. ఓనమ్ సాద్య పేరుతో దాదాపు 26 రకాల వంటకాలను అరిటాకులో వడ్డించుకుని, ఆరగించారు. పండగ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ∙మిర్నా మీనన్ ∙మాళవికా మోహనన్ ∙కల్యాణి ∙అపర్ణా దాస్ అదా శర్మ -
ఓనం స్పెషల్.. చీరకట్టులో మలయాళ బ్యూటీస్!
కేరళలో 'ఓనం' పండగ సెలబ్రేషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తెలుగులో సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న చాలామంది మలయాళ హీరోయిన్లు.. చీరకట్టులో కనువిందు చేశారు. కల్యాణి ప్రియదర్శన్, హనీరోజ్, మమతా మోహన్ దాస్, అనికా సురేంద్రన్, గౌరి కిషన్, మిర్నా మేనన్ ఇలా అందరూ సోషల్ మీడియాలో పద్ధతిగా కనిపిస్తూ సందడి చేస్తున్నారు. ఆ ఫొటోలని మీరు ఓసారి చూసేయండి. View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Mirnaa (@mirnaaofficial) Wishing everyone a vibrant, joyful, and absolutely magical #Onam ❤️ May your homes be filled with love, laughter, and the mouthwatering aroma of a grand Sadya!#HappyOnam #OnamAshamsakal pic.twitter.com/TGlrBqPdso — Parvati (@paro_nair) August 29, 2023 Happy Onam 🤗♥️🤓 pic.twitter.com/wdHoH4ZX7q — Varsha Bollamma (@VarshaBollamma) August 29, 2023 View this post on Instagram A post shared by Madonna B Sebastian (@madonnasebastianofficial) View this post on Instagram A post shared by Mamta Mohandas (@mamtamohan) View this post on Instagram A post shared by Thanvi Ram (@tanviram) View this post on Instagram A post shared by Manju Warrier (@manju.warrier) View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) View this post on Instagram A post shared by Gouri G Kishan (@gourigkofficial) View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) -
Keerthy Suresh: సొంత ఊరు వెళ్లలేక.. ఉదయనిధితో ఓనం
మలయాళీల పండుగ పర్వదినాలలో ఓనం ముఖ్యమైనది. అందరూ సంప్రదాయ వస్త్రధారణతో విశేషంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారు కూడా ఈ పండుగ జరుపుకోవడం కోసమే స్వగ్రామాలకు చేరుకుంటారు. ఇందుకు సినిమా నటీమణులు అతీతం కాదు. నయనతార వంటి అగ్రతారలు కూడా చెన్నై నుంచి కేరళలోని తమ స్వగ్రామానికి చేరుకుంటారు. అదే విధంగా గత ఏడాది నయనతార, విఘ్నేష్ శివన్‌తో కలిసి తన ఇంటిలో ఓనం పండుగ జరుపుకున్నారు. నటి కీర్తి సురేష్ కూడా అదే విధంగా ఈ వేడుకలను తన కుటుంబ సభ్యులతో జరుపుకున్నారు. మలయాళం, తెలుగు, తమిళ భాషలలో నటిస్తూ బిజీగా వున్నా ఈ బ్యూటీ ఈ ఏడాది కూడా ఓనం పండుగను తన కుటుంబ సభ్యులతో కలిపి జరుపుకోవాలని ఆశించిందట. అనుకున్నవన్నీ జరిగితే అది జీవితం ఎలా అవుతుంది. ప్రస్తుతం తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌కు జంటగా మామన్నన్ చిత్రంలో నటిస్తోంది. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. మే నెలలో షూటింగ్ ప్రారంభించుకున్న ఈ చిత్రం నిర్విరామంగా షూటింగ్ జరుపుకుంటోంది. దీంతో కీర్తి సురేష్ ఓనం పండుగకు సొంత ఊరు వెళ్లలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఉదయనిధి స్టాలిన్‌తో కలిసి ఈ పండుగను చెన్నైలోనే జరుపుకుంది. ఆ పండుగ కళను ఇక్కడికే తీసుకొచ్చింది. చక్కని సంప్రదాయ దుస్తులు ధరించి రంగు రంగుల ముగ్గులతో స్వయంగా రంగవల్లితో ఓనం పండుగను జరుపుకుంది. దీంతో ఉదయనిధి స్టాలిన్ ఆమెతో పాటు చిత్ర యూనిట్‌కు విందును ఏర్పాటు చేశారు. మామన్నన్ చిత్ర యూనిట్ ఈమెకు ఓనం పండుగ శుభాకాంక్షలు అందించారు. కాగా ఈ అమ్మడు త్వరలో విజయ్ కథానాయకుడు నటించనున్న తన 67వ చిత్రంలో ఆయనకు జంటగా నటించడానికి సిద్ధమవుతున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. -
'ఓనమ్' స్పెషల్.. హీరోయిన్ల చీరకట్టు అదిరిందిగా
పండగలప్పుడు పెద్ద హీరోల సినిమాలు విడుదల కావడం కామన్. అయితే ఈసారి ఓనమ్ పండగకి మలయాళంలో పెద్ద చిత్రాలేవీ విడుదల కాలేదు. ఆ రకంగా వెండితెర పండగ మిస్సయింది. అయితే లేట్ అయినా లేటెస్ట్గా వస్తామంటూ.. మలయాళ అగ్రహీరోలు మమ్ముట్టి, మోహన్‌లాల్, పృథ్వీరాజ్, దుల్కర్ సల్మాన్ తదితరులు తమ చిత్రాలను రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు. ఫ్యాన్స్‌కు ‘ఓనమ్’ శుభాకాంక్షలు తెలిపారు. ఇక కొందరు కథానాయికలు గురువారం ‘అంగన్నె ఓనమ్ వన్ను’ (అలా ఓనమ్ వచ్చింది) అంటూ ఓనమ్ స్పెషల్ శారీ కట్టుకుని, ట్రెడిషనల్ జ్యువెలరీ పెట్టుకుని ఫొటోలు షేర్ చేశారు. బంగారు రంగు చారలున్న ఐవరీ కలర్ చీర, మల్లెపువ్వులు, ముత్యాల నెక్లెస్‌కి బంగారు లాకెట్, చెవి దుద్దులతో అందంగా ముస్తాబయ్యారు అనుపమా పరమేశ్వరన్. ‘ఓనమ్ చిరునవ్వు ఇదిగో’ అంటూ ఆ ఫొటోలు షేర్ చేశారు. మరో మలయాళ కుట్టి కల్యాణీ ప్రియదర్శన్ కూడా జరీ అంచు ఉన్న తెలుపు రంగు చీర, గ్రాండ్‌గా ఉన్న చెవి దుద్దులు, చేతినిండా గాజులు, జడకు మల్లెపువ్వులు పెట్టుకుని తళతళలాడారు. ‘అందరికీ హ్యాపీ ఓనమ్’ చెప్పి, ఫొటో షేర్ చేశారు కల్యాణీ ప్రియదర్శన్. ఇంకో మలయాళ భామ రమ్యా నంబీసన్ కూడా తెలుపు రంగు చీర, చక్కని నగలతో పాటు నుదుట బొట్టుతో కళకళలాడారు. ‘అంగన్నె ఓనమ్ వన్ను’ అంటూ ఫొటో షేర్ చేశారు రమ్య. ఇక పండగ సందర్భంగా మంజు వారియర్ కూడా ప్రత్యేకంగా రెడీ అయ్యారు. ‘హ్యాపీ ఓనమ్’ అంటూ ఫొటో షేర్ చేశారు. ఇంకా ప్రియమణి, సంయుక్తా మీనన్, భావన తదితర తారలు తళుకులీనారు. ఇలా మలయాళ పరిశ్రమలో ఓనమ్ సందడి బాగా కనిపించింది. -
బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో ఓనం వేడుకలు (ఫొటోలు)
-
ఓనమ్ పండుగకు ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: ఓనమ్ పర్వదినం సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్–త్రివేండ్రమ్ (07119/07120) స్పెషల్ ట్రైన్ ఈనెల 5న సాయంత్రం 6.15 గంటలకు బయల్దేరి మరుసటి రోజు రాత్రి 11.45 గంటలకు త్రివేండ్రమ్ చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో సెప్టెంబర్ 10న రాత్రి 10 గంటలకు బయల్దేరి రెండో రోజు తెల్లవారు జామున 3 గంటలకు హైదరాబాద్ చేరుకోనుంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కాచిగూడ–యశ్వంత్‌పూర్ (07159/07160) స్పెషల్ ట్రైన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ రైలు ఈనెల 5న రాత్రి 8.25 గంటలకు కాచిగూడ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు యశ్వంత్‌పూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 6వ తేదీ సాయంత్రం 5.20గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 7గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. -
అనంతలో ఓనం వైభవం
సాక్షి, అనంతపురం : అనంతలో కేరళ సాంప్రదాయం ఉట్టిపడింది. ఆదివారం స్థానిక కృష్ణ కళామందిరంలో ‘ఓనం’ వేడుకలు వైభవంగా జరిగాయి. జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాలలో స్థిరపడిన కేరళవాసులు పిల్లాపాపలతో కలిసి సంప్రదాయ దుస్తుల్లో ఓనం వేడుకల్లో పాల్గొన్నారు. మలయాళీ సంప్రదాయ నృత్యాలు, ఇతర కార్యక్రమాలను నగరవాసులు ఆసక్తిగా తిలకించారు. ఆకట్టుకున్న ఆటపాటలు మహిళలు ప్రత్యేక పూలతో వివిధ రకాల రంగవల్లులను కేరళ సంప్రదాయం ఉట్టిపడేలా అందంగా తీర్చిదిద్దారు. చుట్టూ చేరి పాటలతో అమ్మవారిని ఆరాధించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. పురుషులకు టగ్ ఆఫ్ వార్, స్త్రీలకు మ్యూజికల్ చైర్స్, అంత్యాక్షరి నిర్వహించారు. తెలుగు, మలయాళ సినీ పాటలకు యువతీ యువకులు, చిన్నారులు చేసిన డ్యాన్సులు హుషారెత్తించాయి. బాల బలిచక్రవర్తి వేషధారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అనంతరం అనంతలో స్థిరపడిన సీనియర్ సిటిజెన్లను ఘనంగా సన్మానించారు. ఆటపాటలతో అలరించిన వారికి జ్ఞాపికలను అందించారు. అన్ని పండుగలూ ఆనందంగానే.. కార్యక్రమంలో అనంతపురం మలయాళీ సమాజం అధ్యక్షుడు నందకుమార్ మాట్లాడుతూ ఎక్కడెక్కడి నుండో వచ్చి జిల్లాలో స్థిరపడిన మలయాళీలు తమ సంప్రదాయాలను మరచిపోకూడదనే ఉద్దేశంతో ఓనం వేడుకలను ఏటా ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. దాదాపు 80 ఏళ్ల కిందట ఇక్కడికొచ్చేసిన తమకు జిల్లాతో ప్రత్యేక అనుబంధం ఏర్పడిందన్నారు. తెలుగు వారితో మమేకమైపోవడం వల్ల అన్ని పండుగలనూ ఆనందంగా జరుపుకొంటామన్నారు. కార్యక్రమంలో పుట్టపర్తి, బత్తలపల్లి నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చిన మలయాళీలతోపాటు అనంత మలయాళీ సమాజం నిర్వాహకులు బాలాజీ నాయర్, షణ్ముక రాజా, సూర్యనారాయణ, శేషాద్రి, సునీల్, విశ్వనాథన్ తదితరులు పాల్గొన్నారు. -
ఓనమ్ వచ్చెను చూడు
కేరళలో సెప్టెంబర్ 10 నుంచి ‘ఓనమ్’పండుగ వేడుకలు జరుగుతున్నాయి. తెలుగువారికి సంక్రాంతి ఎలాగోమలయాళీలకు ఓనమ్ అలాగ. పూలు,ఫలాలు, పంటలు, పిండి వంటలు,పాటలు, ఆటలు, పోటీలు...ఇవన్నీ ఓనమ్ పండుగ సమయంలోకేరళ అంతటినీ కళకళలాడిస్తాయి.ఆ సినిమా తారలను కూడా. కేరళను ‘దేవుని సొంత భూమి’గా చెప్తారు. అయితే ఇది ఒకప్పుడు దేవుని వద్ద లేదు. దీని పాలకుడు అసురుడు. బలి చక్రవర్తి. అయితే అందమైన ఈ భూమి మీద దేవుడు మనసుపడ్డాడు. అందుకే వామనుడి రూపంలో బలి చక్రవర్తి దగ్గరకు వచ్చి ‘మూడు అడుగుల నేల’ అడిగాడు. మొదటి రెండు అడుగులకే మూల్లోకాలు ఆక్రమితమయ్యాయి. ఇక మిగిలింది బలి చక్రవర్తి శిరస్సే. అమిత విష్ణుభక్తుడైన బలి వామనుడి మూడవ పాదాన్ని తన శిరస్సు మీదే పెట్టమని అంటాడు. ఆ తర్వాతి కథ ఏమైనా కేరళ వాసుల విశ్వాసం ప్రకారం బలి చక్రవర్తి భక్తికి విష్ణువు మెచ్చాడని, అందువల్ల ఒక వరం ప్రసాదించాడని, ఆ వరం ప్రకారం సంవత్సరానికి ఒకసారి బలి చక్రవర్తి సజీవుడైన తాను పాలించిన నేలకు (కేరళ) వచ్చి ఆ ప్రాంతాన్ని చూసుకుంటాడనీ. బలి వచ్చేవేళనే ఓనమ్ పండుగ వేళ. ఇది పురాణ కథ అయితే సాంస్కృతికంగా కేరళలో ఇది పంటలు ఇంటికి చేరే వేళ కనుక దీనిని విశేషంగా జరుపుకుంటారని విశ్లేషకులు అంటారు. కేరళ ప్రకృతి సౌందర్యానికే కాదు స్త్రీ సౌందర్యానికి కూడా పెట్టింది పేరు. అందుకే అక్కడి నుంచి కె.ఆర్.విజయ, పద్మినిలతో మొదలుపెట్టి నేటి అనుపమా పరమేశ్వరన్ వరకు ఎందరో హీరోయిన్లు దక్షణాది ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా తెలుగువారి హృదయాలను దోచారు. అక్కడి నుంచి వచ్చిన శోభన, వాణి విశ్వనాథ్ దాదాపు తెలుగు హీరోయిన్ల వలే లెక్కకు మించిన సినిమాల్లో పని చేశారు. రేవతి, ఊర్వశి, పూర్ణిమా భాగ్యరాజ్, లిజి, సితార, మీరా జాస్మిన్, అసిన్, నయన తార, ప్రియమణి, శ్వేతా మీనన్, కీర్తి సురేశ్, సాయి పల్లవి, నివేదా థామస్, అమలా పాల్... వీరంతా దాదాపు తెలుగవారి ఆడపడుచులు అయ్యారు. ఇక కేరళ మూలాలు ఉన్న సమంతా ఏకంగా అక్కినేని వారి ఇంటి కోడలు అయ్యింది.పండుగల్లో పురుషుల పాత్ర ఎలా ఉన్నా స్త్రీల వల్లే వాటికి అందం వస్తుంది. ఓనమ్ పండుగ నాడు సంప్రదాయ ఓనమ్ చీరను కట్టడం తప్పనిసరి అని భావిస్తారు కేరళ స్త్రీలు. అందుకు మన హీరోయిన్లు కూడా భిన్నం కాదు. ఓనం చీరకే అందం తెచ్చిన ఆ సౌందర్యాన్ని చూడండి. ఇరుగు పొరుగున మలయాళీలు ఉంటే ఓనమ్ శుభాకాంక్షలు తెలపండి. -
కళ తప్పిన ఓనం
తిరువనంతపురం: అంతా సవ్యంగా ఉంటే ఈపాటికి ఓనం వేడుకలతో కేరళ సందడిగా ఉండేది. తీవ్ర వరద విపత్తు కారణంగా శనివారం జరిగిన రాష్ట్ర సంప్రదాయ పండగ పూర్తిగా కళ తప్పింది. ఇంకా చాలా మంది బాధితులు సహాయక శిబిరాల్లోనే ఉండటం, వేలల్లో ఇళ్లు ధ్వంసం కావడంతో పండుగ శోభ కనిపించలేదు. ప్రకృతి ప్రకోపంతో గాయపడిన మనసులకు సాంత్వన చేకూర్చేందుకు పునరావాస కేంద్రాలుగా ఉన్న పాఠశాలలు, మసీదులు, చర్చీల్లోనే కొందరు ఓనం విందులను ఏర్పాటుచేశారు. సంప్రదాయ పూల తివాచీలు పరచి బాధితుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. కష్టకాలాన్ని అధిగమించేలా కేరళ ప్రజలకు ఓనం కొత్త శక్తినిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ఇలాంటి ఓనం ఊహించలేదు ‘కొత్తగా కట్టుకున్న మా ఇంట్లో మరోసారి ఓనం జరుపుకోలేమని అసలు ఊహించలేదు. ఈరోజు(శనివారం) తిరు ఓనం. కానీ మేము ఇంకా సహాయక శిబిరంలోనే ఉన్నాం. వర్షాలు, వరదలు మా ఇంటిని నేలమట్టం చేశాయి’ అని 82 ఏళ్ల కుమారి అనే మహిళ తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఒక్క కుమారే కాదు హఠాత్తు వరదలకు సర్వం కోల్పోయి నిరాశ్రయులైన సుమారు 8 లక్షల మందిదీ ఇదే బాధ, ఇదే వ్యధ. అలప్పుజాలోని ఓ మసీదులో సాదాసీదాగా నిర్వహించిన ఓనం వేడుకల్లో సంప్రదాయ మలయాళ వంటకాలు అవియాల్, పాయసం, సాంబార్లను తయారుచేసి అక్కడ బాధితులకు వడ్డించారు. మృతుల సంఖ్య 293: ఈ నెల 8 నుంచి కేరళ వరదల్లో 293 మంది మృతిచెందగా, 36 మంది జాడతెలియకుండా పోయారని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నిరాశ్రయుల కోసం పునరావాస కార్యక్రమాలు చురుగ్గా కొనసాగుతున్నాయని తెలిపింది. 26 ఏళ్ల తరువాత తొలిసారి గేట్లు ఎత్తి నీటిని విడుదలచేసిన ఇడుక్కి డ్యాం సమీప ప్రాంతాల్లో అత్యధికంగా 51 మంది చనిపోగా, 10 మంది గల్లంతయ్యారు. త్రిసూర్‌లో 43 మంది, ఎర్నాకులంలో 38 మంది, అలప్పుజాలో 34 మంది చనిపోయారు. మలప్పురంలో 30 మంది మరణించారు. 2,287 సహాయక కేంద్రాల్లో తలదాచుకుంటున్న సుమారు 8.69 లక్షల మంది ఇప్పుడిప్పుడే సొంతిళ్లకు చేరుకుంటున్నారు. సీఆర్పీఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పునరావాస కార్యకలాపాల్లో పాల్గొంటున్నాయి. సహాయక చర్యల నిమిత్తం ముఖ్యమంత్రి విజయన్‌కు వైమానిక దళం రూ.20 కోట్ల చెక్కు అందించింది. -
కేరళ పండుగ కళ తప్పింది
మొన్న నిఫాతో బెంబేలెత్తిన స్వర్గసీమ కేరళ నిన్న వరదబీభత్సానికి చివురుటాకులా వణికిపోయింది. చిన్నా చితకా వ్యాపారాలు మొదలుకొని రియల్ ఎస్టేట్ బిజినెస్ వరకూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కేరళ అనగానే గుర్తొచ్చే పూల పండుగ పది రోజులపాటు ప్రతిఇంటా ఆనందాలు వెల్లవిరిసేవి. బంతులు, చామంతులూ, మల్లెలూ ఒకటేమిటి అన్ని పూలూ కేరళని ముంచెత్తేవి. ఓనమ్ పండుగ పదిరోజులూ ప్రతి ఇంటా పూల తివాచీలే పరిచేవారు. కానీ ఈసారి వరదలు సృష్టించిన బీభత్సం కేరళ ప్రజల జీవితాలను చిందరవందరచేసింది. వ్యాపారుల దగ్గర్నుంచి పూలుకొనేవాళ్ళే కరువయ్యారు. ప్రతియేటా ఇదే సీజన్లో జరిగే కేరళ ప్రసిద్ధ ఓనమ్ పండుగకు దాదాపు 800 టన్నుల పూల వ్యాపారం జరిగేది. కేరళ సరిహద్దు రాష్ట్రమైన తమిళనాడులోని తిరునాల్వేలి నుంచి తరలివచ్చే పూల వ్యాపారులకు ఈ ఏడాది నిరాశే ఎదురయ్యింది. ఒక్క తిరునాల్వేలి నుంచే కాకుండా హోసూర్, కోయంబత్తూర్, కన్యాకుమారి, బెంగుళూరుల నుంచి వచ్చే పూల వ్యాపారులకు తీవ్రమైన నష్టం వాటిల్లింది. మతాలకతీతంగా కేరళ ప్రజలు జరుపుకునే ఓనమ్ పండుగ సందర్భంగా కేరళలో జరిగే మొత్తం వ్యాపారమే కీలకం. ఎలక్ట్రానిక్స్, బట్టల వ్యాపారంలో 15 శాతం బిజినెస్ ఈ పండుగ రెండు వారాల్లోనే జరుగుతుంది. మాల్స్, సూపర్ మార్కెట్స్, బట్టల షాపులు పండుగ ఆఫర్లతో వ్యాపారం మరింత జోరుగా సాగేది. అయితే ఈసారి అటువంటి పరిస్థితికి ఆస్కారమే లేదని త్రిస్సూర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు టిఆర్ విజయ్‌కుమార్ తెలిపారు. కేరళ రాష్ట్రానికి అధికాదాయ వనరు అయిన పర్యాటకరంగం వరదలతో తీవ్రంగా దెబ్బతిన్నది. కేరళ లోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం మూతపడటంతో చాలా మంది టూరిస్టులు తమ పర్యటనను రద్దుచేసుకున్నారు. అలప్పుజా, మున్నార్, కుమరకమ్, పెరియార్ లాంటి ప్రధాన పర్యాటకప్రాంతాల్లో దాదాపు 95 శాతం పర్యాటకులు తమ పర్యటనను రద్దుచేసుకున్నారు. ’’రోడ్లు పునర్నిర్మించాలి. పర్యాటక ప్రాంతాలను ప్రజల సందర్శనార్థం పునః ప్రారంభించాలంటే కొంత సమయం పడుతుంది. ఇదంతా సజావుగా సాగడానికి ఒకటి రెండు నెలలు పడుతుంది. సహజంగానే స్థానిక ప్రజలు అవస్థల్లో ఉన్నప్పుడు ఆయా ప్రాంతాలకు వెళ్ళేందుకు ప్రజలు ఇష్టపడరు’’ అని ఎయిర్ ట్రావెల్స్ ఎంటర్ప్రైజెస్ మేనేజింగ్ డైరెక్టర్ ఇఎం నజీబ్ తెలిపారు. కేరళలో పర్యాటకుల తాకిడి అక్టోబర్ నుంచి ప్రారంభం అవుతుంది. ఈసారి మాత్రం 70 నుంచి 80 శాతం రెవెన్యూకి గండిపడుతుందని భావిస్తున్నారు. ప్రకృతి వైద్యం కోసం, ఇతర ఆరోగ్య అవసరాలకోసం ప్రతియేటా చాలా మంది వివిధ ప్రాంతాలనుంచి కేరళకి వెళుతుంటారు. అయితే ఈసారి మెడికల్ టూరిజం కూడా 50 శాతం నష్టపోయిందని ధాత్రి ఆయుర్వేద ఎండి, సిఐఐ కేరళ అధ్యక్షుడు డాక్టర్ సాజికుమార్ తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి ఒక్క పేషెంట్ కూడా రావడం లేదనీ మరో రెండు మూడు నెలలు ఇదే పరిస్థితి ఉంటుందనీ ఆయన వివరించారు. కేరళ ప్రభుత్వం రాష్ట్రానికి 20,000 కోట్ల రూపాయల ఆస్తినష్టం వాటిల్లినట్టు ప్రధాని నరేంద్రమోదీకి విన్నవించింది. పనిదినాలు, పర్యాటకుల పర్యటనల రద్దు, ఇతరత్రా అన్నీ కలుపుకొని 25,000 కోట్ల రూపాయల వరకూ రాష్ట్రం నష్టపోయినట్టు అంచనా వేసారు. అయితే ఇంత నష్టం జరిగినా కేరళల ప్రజలు, అధికారులు, సాధారణపౌరులూ, వైద్యులూ తమకు తోచిన విధంగా కేరళ పునర్నిర్మాణంలో తమవంతు బాధ్యతను నెరవేరుస్తున్నారు. కొచ్చిలోని అస్తర్ హాస్పిటల్స్ అండ్ క్లినిక్స్ సిఇఓ డాక్టర్ హరిప్రసాద్ పిళ్ళై మాట్లాడుతూ గత నాలుగు రోజులుగా తమ ఆసుపత్రిలో పనిచేసే 80 మంది డాక్టర్లు, 150 మంది నర్సులు 20 పునరావాస కేంద్రాల్లోనూ, కొచ్చీ, కలమస్సేరిలోని ప్రభుత్వాసుపత్రుల్లోనూ ప్రజాసేవలో మునిగి ఉన్నారని తెలిపారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, అధికారుల తోడ్పాటుతోనే ఇది సాధ్యమైందని ఆయన వివరించారు. వైద్య పరంగా ఈ యేడాదిలో నిఫా వైరస్ తర్వాత కేరళ ప్రజలెదుర్కొన్న రెండవ ఛాలెంజ్ ఇదేనని ఆయన అన్నారు. -
ఈ వీడియోసాంగ్‌కి కోటి వ్యూస్..
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ ట్రెండింగ్ అవుతోంది. వెలిపాడింతే పుస్తకం అనే మలయాళ చిత్రంలోని ‘జిమ్మికి కమ్మల్’ పాట. మలయాళుల సుప్రసిద్ధ పండుగ ఓనంకు ఇండియన్ స్కూల్ ఆఫ్ కామర్స్ కళాశాల, విద్యార్థులు, ఉపాధ్యాయులు డాన్స్ చేసిన ఈవీడియో ఆన్లైన్లో విపరీతమైన వైరల్‌గా మారింది. ఎంతలా అంటే ఏకంగా కోటి 18 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది. విద్యార్థుల డ్యాన్స్ నెట్‌జన్లను ఎంతగానో ఆకట్టుకుంది. ఓనం సంప్రదాయ దుస్తుల్లో వారు చేసిన డ్యాన్స్ యువతకు విపరీతంగా నచ్చేసింది. ముఖ్యంగా 'సెరిల్' అనే అమ్మాయి డ్యాన్స్‌కి బాగా పేరొచ్చింది. రెండు వారాలకు ముందే ఆఅమ్మాయి ఆ కళాశాలలో చేరింది. పండుగ సందర్భంగా ఏదైనా భిన్నమైన వీడియోను రూపొందించాలని భావించి అధ్యాపకులు, విద్యార్థులు కలిసి ‘జిమ్మికి కమ్మల్’ వీడియోకు శ్రీకారం చుట్టారు. దీంతో సెరిల్ సహా ఆ పాటలో నటించిన వారందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈసందర్భంగా సెరిల్ సంతోషం వ్యక్తం చేసింది. తన డాన్స్‌కు ఇంత మంచి స్సందన వస్తుందని ఊహించలేదని తెలిపింది. సినిమాల్లో నటించాలనే కోరిక ఉందని పేర్కొంది. తమిళంలో తనకు అజిత్ అంటే చాలా ఇష్టమని సెరిల్ చెప్పింది. కాగా, హాలీవుడ్లో జిమ్మీ కిమ్మల్ అనే నటుడు ఈ వీడియో చూసి ట్వీట్ చేయడం విశేషం. not until now, but I love it! https://t.co/6Qv9StTdpY — Jimmy Kimmel (@jimmykimmel) September 8, 2017 -
ఓనం మనోహరం
-
ఓ నమో
కాజీపేటలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో బుధవారం ఓనం పండుగను ఘనంగా నిర్వహించారు. నిట్ లో చదువుతున్న కేరళ విద్యార్థులు ఓనం ఉత్సవాల్లో పాల్గొని సందడి చేశారు. ఈ మేరకు ఆడిటోరియం ఎదుట ముగ్గు వేసి వివిధ రకాల పూలతో అలంకరించి తమ సంస్కృతిని ప్రతిబింబింపజేశారు. అలాగే వివిధ వేషధారణల్లో అలరిం చారు. ఆటపాటలతో కేరింతలు కొట్టారు. –కాజీపేట రూరల్ -
ప్రశాంతి నిలయంలో నేడు ఓనం
పుట్టపర్తి టౌన్ : కేరళీయుల పవిత్ర ఓనం పర్వదిన వేడుకలు బుధవారం ప్రశాంతి నిలయంలో ఘనంగా జరగనున్నాయి. వేడుకలను పురస్కరించుకుని సత్యసాయి మహాసమాధిని, సాయికుల్వంత్ సభా మందిరాన్ని కేరళ సంప్రదాయ రీతితో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కేరళ రాష్ట్రంతోపాటు వివిధ ప్రాంతాల నుంచి వేడుకల్లో పాల్గొనేందుకు ప్రశాంతి నిలయం చేరుకున్నారు. ఉదయం 8 గంటలకు సాయికుల్వంత్ సభా మందిరంలోని సత్యసాయి మహాసమాధి వద్ద కేరళ భక్తులు వేదమంత్రోచ్చారణతో వేడుకలు ప్రారంభం కానున్నాయి. కేరళలోని కోజీకోడ్ జిల్లాకు చెందిన బాలవికాస్ విద్యార్థులు ‘యూనిటీ ఆఫ్ ఫెయిత్స్’ అన్న పేరుతో నత్య ప్రదర్శన, భజనలు నిర్వహించనున్నారు. సాయంత్రం వేడుకల్లో భాగంగా ఇండియన్ యునియన్ ముస్లిం లీగ్ సెక్రెటరీ కెఎన్ఎ.ఖాదిర్ వేడుకలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం సత్యసాయి సేవా సంస్థలు కేరళలో నిర్వహించిన వ్యాసరచన పోటీలు–2016 విజేతలకు బంగారు పతకాలను ప్రదానం చేస్తారు. టి.ఎస్.రాధాక్రిష్ణణ్ బందం సంగీత కచేరీతో వేడుకలు ముగియనున్నాయి. ఘనంగా సత్యసాయి గాయత్రీ హోమ యజ్ఞం ఓనం వేడుకల్లో భాగంగా కేరళ సత్యసాయి భక్తులు మంగళవారం ప్రశాంతి నిలయంలో సత్యసాయి గాయత్రీ హోమ యజ్ఞం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పూర్ణచంద్ర ఆడిటోరియం వేదికగా పండితుల వేదమంత్రోచ్చారణ నడుమ యజ్ఞం ఘనంగా జరిగింది. అనంతరం కేరళ రాష్ట్రానికి చెందిన చిన్నారులు సాంస్కతిక కార్యక్రమాలతో అలరించారు. ఉదయం సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత విద్యార్థులు ‘హిస్ మాస్టర్స్ వాయిస్’అన్న పేరుతో సంగీత విభావరి నిర్వహించారు. సాయంత్రం కేరళ రాష్ట్ర మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మలయాళ యూనివర్శిటీ వైస్‌చాన్సలర్ కె.జయకుమార్, కేరళ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి జ్యోతిలాల్ ఓనం పర్వధిన వేడుకలను విశిష్టతను,వామన చరిత్రను వివరిస్తూ ప్రసంగించారు. కేరళలోని అలువకు చెందిన సత్యసాయి విద్యావిహార్ విద్యార్థులు‘ ఓనం విత్ మదర్ సాయి’అన్న పేరుతో నత్యనాటిక ప్రదర్శించారు. -
ఓనం వేడుకలు ప్రారంభం
పుట్టపర్తి టౌన్ : కేరళీయులు పవిత్రంగా భావించే ఓనం పర్వదిన వేడుకలు ప్రశాంతి నిలయంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. వేలాదిమంది కేరళ భక్తులతోపాటు, దేశ విదేశాలకు చెందిన భక్తులు వేడుకల్లో పాల్గొన్నారు. శుక్రవారం సాయంత్రం కేరళ భక్తులు వేదపఠనంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే కేఎస్ శభరినాథన్ హాజరై ప్రసంగించారు. ప్రపంచ నలుమూలలా సత్యసాయి సేవాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్య, వైద్య, తాగునీటి సేవలు వెలకట్టలేనివన్నారు. అనంతరం కేరళకు చెందిన ప్రముఖ సంగీత విద్వాంసుడు విట్టల్ వినోద్ భాగవతార్ బృందం సంగీత కచేరి నిర్వహించారు. కేరళ సంగీత రీతులలో చక్కటి స్వరాలోలికిస్తూ భాగవతార్ బృందం నిర్వహించిన సంగీత కచేరీతో భక్తులు తన్మయభరితులయ్యారు. అనంతరం భక్తులు సత్యసాయి మహాసమాధి చెంత ప్రణమిల్లి దర్శించుకున్నారు. -
నర్సింగ్ కాలేజీలో ఓనమ్ ఉత్సవాలు
డిచ్పల్లి(నిజామాబాద్): నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తిరుమల నర్సింగ్ కళాశాలలో శుక్రవారం ఘనంగా ఓనమ్ ఉత్సవాలను నిర్వహించారు. స్థానిక కళాశాలలో కేరళ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ఎక్కువగా ఉండటంతో.. తోటి విద్యార్థులు, కళాశాల యాజమాన్యం ఓనమ్ పండగ కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. -
ఓనం.. మనోహరం!
-
కేరళీయుల ఓనం సంబురాలు
బర్థిపూర్(డిచ్పల్లి): దేశంలోని వివిధ ప్రాంతా ల నుంచి వచ్చిన ప్రజలతో జిల్లా మినీభారతంగా పేరొందుతోంది. జిల్లాలో స్థిరపడిన, విద్యాఉద్యోగాలరీత్యా వచ్చిన కేరళీయులు ఓనం పండుగను వైభవంగా జరుపుకుంటున్నారు. కేరళ రాష్ట్ర ప్రజలకు అత్యంత ఇష్టమైన ఈ పండుగను జిల్లాలో ఘనంగా నిర్వహించుకున్నారు. తిరుమల కళాశాలలో డిచ్పల్లి మండలం బర్థిపూర్ శివారులోని తిరుమల గ్రూప్ ఆఫ్ ఇన్సిస్టిట్యూట్స్‌లో శనివారం కేరళకు చెందిన విద్యార్థులు తమ సంప్రదాయ ఓనం పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్థానిక విద్యార్థులతో కలిసి ఆద్యంతం ఆనందోత్సవాలతో పండుగను జరుపుకున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు చదువుతున్న కళాశాలలో ప్రతిఏటా ఓనం పర్వదినాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఓనం సందర్భంగా కళాశాల ఆవరణలో ఉన్న విష్ణుమూర్తి విగ్రహం ఎదుట రకరకాల పూలతో అందంగా అలంకరించారు. ఇన్సిస్టిట్యూట్స్ కరస్పాండెం ట్ పద్మావతి జ్యోతిప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. విద్యార్థినులు ప్రదర్శించిన వామనుడు, బలిచక్రవర్తి కథారూపకం అందరినీ ఆకట్టుకుంది. అనంతరం కేరళ సంప్రదాయ నృత్యాలు, మణిపురి విద్యార్థినుల నృత్యప్రదర్శనలు అలరించాయి. నేడు అయ్యప్ప ఆలయంలో.. నిజామాబాద్‌కల్చరల్ : కేరళలోని శబరిమలైలో కొలువైన అయ్యప్పస్వామిని కొలుస్తూ ఆదివా రం జిల్లాకేంద్రంలోని కంఠేశ్వర్‌లోగల అయ్య ప్ప దేవాలయంలో ఓనం వేడుకను నిర్వహించనున్నట్లు గురుస్వాములు తెలిపారు. భక్తులు అధికసంఖ్యలో హాజరుకావాలని కోరారు. -
నేడు ఓనమ్
ఆదిలాబాద్(మామడ) : ఓనమ్.. కేరళ వాసులకు ఇష్టమైన పండుగ. పేద, ధనిక వర్గాల వారు సమానత్వానికి గుర్తుగా ప్రతి ఒక్కరూ ఓనమ్ పండుగ జరుపుకుంటారు. ఈ పండుగ ప్రతి సంవత్సరం ఆగస్టు, సెప్టెంబర్ మాసాలలో వస్తుంది. మళయాళం క్యాలెండర్ ప్రకారం మొదటి నెల చింగంలో వస్తుంది. నూతన సంవత్సరం ఆరంభమవుతుంది. కేరళలో పంటలు చేతికందే సమయంలో ఈ పండుగ నిర్వహిస్తారు. జిల్లాలోని చాలా పట్టణాల్లో కేరళవాసులు ఉన్నారు. ఈ పండుగను ఏటా వైభవంగా నిర్వహిస్తుంటారు. ఆదివారం పండుగ నేపథ్యంలో ఇప్పటికే చాలా చోట్ల ఏర్పాట్లు పూర్తయ్యాయి. పది రోజులపాటు పండుగను వైభవంగా నిర్వహిస్తారు. మొదటి రోజు పూలతో ఒక వరుస, రెండో రోజు రెండు వరుసులు ఇలా పదో పది వరుసల పూలతో ముగ్గులు వేస్తారు. ఈ పది రోజుల్లో మొదటి రోజు ఆథంతోపాటు చివరి రోజు తిరువోనమ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. తిరువోనమ్ చివరి రోజు విందు భోజనాలను అరటి ఆకుల్లో ఏర్పాటు చేస్తారు. పాయసంతోపాటు 16 రకాల వంటలు వండుతారు. ఈ కార్యక్రమాన్ని ఓన సద్యగా పిలుస్తారు. మామడ మండలం పొన్కల్తోపాటు ఆదిలాబాద్, మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్‌నగర్, నిర్మల్ పట్టణాల్లో మళయాళీలు ఆదివారం ఓనమ్ పండుగకు ఏర్పాట్లు చేసుకున్నారు. -
ఓనం వేడుకలకు ‘మినీ కేరళ’ సిద్ధం
న్యూఢిల్లీ: తమ స్వరాష్ట్రానికి దూరంగా ఢిల్లీలో నివసిస్తున్న కేరళవాసులను తమ సొంతవారితో కలిసి ఆనందంగా గడిపేందుకు ‘ఓనం’ పండుగ ఒక వేది కగా మారింది. మహాబలి చక్రవర్తి ఓనం రోజు తన ప్రజలను కలుసుకునేందుకు ఆత్మ రూపంలో వస్తాడని కేరళవాసుల నమ్మకం. అతడిని తమ ఇళ్లకు ఆహ్వానించడానికే ఈ పండుగను జరుపుకుంటారు.ఈ నెలలోనే అక్కడ పంటలు ఇంటికి చేరతా యి.. కాబట్టి దీన్ని పంటల పండుగగా కూడా జరుపుకుంటారు. మహాబలిని ఇంట్లోకి ఆహ్వానిం చేందుకు ఇంటిముందు అందమైన ముగ్గులు వేసి వాటి ని ఆకర్షణీయంగా తీర్చుదిద్దుతారు. వీటిని పూగళమ్ అని అంటారు. ఢిల్లీ, ఎన్సీఆర్ పరిధిలో ఉన్న పలు కేరళ అసోసియేషన్లు ఇప్పటికే ఈ ఉత్సవాల ను గత నెల 29వ తేదీ నుంచి ప్రారంభించాయి. స్థానిక కేరళీయులందరూ ప్రతిరోజూ తమ ఇళ్ల ముందు అందమైన ముగ్గులు వేసి వాటిని పువ్వుల తో అలంకరిస్తున్నారు. వాటి మధ్యలో త్రికక్కర అప్పన్ను ఉంచుతారని స్మిత అనే మళయాళీ తెలి పింది. జనసంస్కృతీ అనే సంస్థ అధ్యక్షుడు పి.కె.మోహన్‌దాస్ మాట్లాడుతూ.. తమ సంస్థ తరఫున ఓనమ్ (పూగళమ్ ఉత్సవాలు)ను ఆదివారం నుంచి ప్రారంభించినట్లు తెలిపారు. ఈ పండుగ సందర్భంగా పచ్చటి ఆకులో 20 రకాల వంటకాలు, పాయసంతో ‘ఓన సధ్య’ను స్వీకరిస్తామన్నారు. కేరళ హౌస్, ఇతర మళయాళీ ఆర్గనైజేషన్లు గోల్ మార్కెట్, జవహర్లాల్ నెహ్రూ స్టేడియం తదితర ప్రాంతాల్లో ఓనసధ్యను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. వసంత్ కుంజ్‌లో ఉన్న ఒక స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి నిర్మల్ జ్యోతి మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో ఆగస్టులో పలు వినోద కార్యక్రమాలు, సంప్రదాయ నృత్యాలను నిర్వహించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, వసంత్‌కుంజ్ మళయాళీ అసోసియేషన్, అయ్యప్ప సేవా సంఘం కూడా ఓనమ్ సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించాయి. తిరుఓనమ్ సందర్భంగా వచ్చే ఆదివారం పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయనున్నట్లు అయ్యప్ప సేవా సంఘం కార్యదర్శి ఎం.జి.కృష్ణన్ తెలిపారు. ఆ రోజు మహిళలు సంప్రదాయ ఆఫ్‌వైట్ కాటన్ చీర, పురుషులు ఆఫ్‌వైట్ కాటన్ ధోతీలు ధరిస్తారని తెలిపారు. నగరంలో ఉన్న అన్ని మళయాళీ అసోసియేషన్లతో సం బంధాలున్న ఓంచూరీ ఎంఎం పిళ్లై మాట్లాడుతూ.. ఓనమ్ పండుగ అనేది రెండు నెలలు పాటు నడుస్తుందని తెలిపారు. ఒక్కోసారి అది ఇంకా ఎక్కువ రోజులు కొనసాగే అవకాశం ఉందని చెప్పారు. ఈ పండుగను ఢిల్లీలో స్థిరపడిన కేరళవాసులు ప్రతి ఆదివారం ఆనందంగా జరుపుకుంటారన్నారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారన్నారు. ఓనమ్ పండుగ కేరళ బయట ఉన్న కేరళీయులందరినీ ఒకే వేదిక మీదకు తెచ్చే పండుగ అని కేరళ హౌస్ సభ్యులన్నారు. మళయాళ నెల అయిన చింగమ్లో మహాబలిని తమ ఇళ్లకు ఆహ్వానిస్తారన్నారు. ‘పూగళమ్(పూలముగ్గు) తో మా ఉత్సవాలు ప్రారంభమవుతాయి. నేను మొదట పూగళమ్ వేసి అనంత రం సంప్రదాయబద్ధమైన చీరను ధ రిస్తా.. సాయంత్రం జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటా.. మేం మొదట నిర్ణయించుకున్నట్లు గుర్గావ్లో గాని, ఢిల్లీలోని గాని ఒక వేదికపై కలుసుకుంటాం..’ అని గుర్గావ్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న మిని శామ్ తెలిపింది. ఈ పండుగ సందర్భంగా పలు రకాల నాటకాలు, డ్యాన్స్ కార్యక్రమాలు ఉంటాయి. పులి కలి లేదా కదువకళి అనే ఒక రకమైన జానపద కళ లో పులివేషం వేసుకున్న కళాకారులు మేకలను ఎలా వేటాడేది..అలాగే మానవులతో తాము ఎలా వేటాడబడేది.. అనుకరించి చూపిస్తారు. మహిళలు పోగళమ్ చుట్టూ తిరుగుతూ, మహాబలిని పాట లతో స్తుతిస్తూ సంప్రదాయ నృత్యమైన తుంబి లేదా కైకోత్తికలిని ప్రదర్శిస్తారు..’ అని జియో జాక బ్ తెలిపారు. జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో 200 మంది కళాకారులతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కాగా ఢిల్లీలో అఖిల భారత మళయాళీ అసోసియేషన్‌కు సంబంధించిన 26 శాఖలున్నాయి. ఓనమ్ సందర్భంగా ప్రతి శాఖ సంప్రదాయ నృత్య కార్యక్రమాన్ని ప్రదర్శిస్తుందని పిళ్లై చెప్పారు. అలా గే సభ్యులందరి మధ్య సత్సంబంధాలను నెలకొల్పేందుకు కేరళ సంప్రదాయ క్రీడలైన కుటుకుటు, తలప్పంతుకళి, కయ్యన్కళి,అట్టకళమ్, విలువిద్య వంటి వాటిని కూడా నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. -
పండుగ అమ్మకాలు బాగున్నాయ్..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పండుగ సీజన్ అమ్మకాలు ఆశించిన స్థాయిలో నమోదు అవుతుండడంతో ఎలక్ట్రానిక్, గృహోపకరణాల తయారీ కంపెనీలు ఆనందంలో ఉన్నాయి. ఓనమ్ పండుగ సందర్భంగా జరిగిన అమ్మకాలతో కంపెనీల ఆశలు రెట్టింపయ్యాయి. రానున్న పండుగలకు కూడా ఇదే జోష్ ఉంటుందని విశ్వసిస్తున్నాయి. దీనికితోడు వినియోగ వస్తువుల కొనుగోళ్ల కోసం ఇచ్చే రుణాలపై బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించడం పరిశ్రమ పెద్ద ఊరటగా భావిస్తోంది. సీజన్‌ను మరింత రంగుల మయం చేసేందుకు కంపెనీలు కొత్త కొత్త మోడళ్లను ప్రవేశపెడుతున్నాయి. ఇక టీఎంసీ, ఆదీశ్వర్, బజాజ్, సోనోవిజన్ వంటి విక్రయ సంస్థలు ప్రకటించిన భారీ ఆఫర్లు కస్టమర్లను ఇట్టే ఆకర్శిస్తున్నాయి. అమ్మకాలు ఓకే.. పండుగల సీజన్లో తాము 17-18 శాతం వృద్ధి ఆశిస్తున్నట్టు ఒనిడా బ్రాండ్‌తో ఉపకరణాలను విక్రయిస్తున్న మిర్క్ ఎలక్ట్రానిక్స్ సీఎండీ జీఎల్ మిర్చందానీ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. రూపాయి పతనం కారణంగా ఉపకరణాల ధర పెరగడం, ఈఎంఐలు తగ్గకపోవడం కొంచెం ఇబ్బందికర పరిణామమని ఆయన అభిప్రాయపడ్డారు. బ్యాంకుల కొత్త వడ్డీ రేట్ల ప్రభావం రానున్న రోజుల్లో అమ్మకాలు పెరిగేందుకు దోహదం చేస్తుందని అన్నారు. గతేడాది గృహోపకరణాల అమ్మకాలు ఎక్కువగా ఉంటే, ఈ ఏడాది ఎల్ఈడీ, 3డీ టీవీలకు డిమాండ్ ఉందని ప్యానాసోనిక్ ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ మేనేజర్ బొమ్మారెడ్డి ప్రసాదరెడ్డి అన్నారు. సీజన్లో 12-15 శాతం వృద్ధి ఆశిస్తున్నట్టు తెలిపారు. ఓనమ్ ఊపుతో.. ఓనమ్ పండుగ సందర్భంగా శాంసంగ్, సోని, ప్యానాసోనిక్, ఎల్జి తదితర కంపెనీలు రెండంకెల వృద్ధి నమోదు చేశాయి. వినాయక చవితి సమయంలోనూ మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో ఉపకరణాల విక్రయ దుకాణాలు కిటకిటలాడాయి. ఓనమ్ అమ్మకాలు రూ.250 కోట్లు జరిగాయని శాంసంగ్ వెల్లడించింది. మొత్తంగా పండుగల సీజన్లో ఎలక్ట్రానిక్స్ ద్వారా రూ.3,500 కోట్ల ఆదాయం ల క్ష్యంగా చేసుకున్నామని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ జైన్ ఇటీవల తెలిపారు. సోని ఇండియా గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది జూలై-సెప్టెంబరులో 34 శాతం వృద్ధితో రూ.170 కోట్ల వ్యాపారం చేసింది. ఉత్పత్తులనుబట్టి 30-47 శాతం వృద్ధి నమోదు చేసినట్టు ఎల్జీ తెలిపింది. అమ్మకాలు పుంజుకోవడం ఖాయమని హాయర్ అప్లయాన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాంజా అన్నారు. ఓనమ్ సమయంలో రూ.200 కోట్ల వ్యాపారం చేశామని వివరించారు. కొత్త మోడళ్లతో.. సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని కంపెనీలు కొత్త కొత్త మోడళ్లను ప్రవేశపెడుతున్నాయి. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా 55, 65 అంగుళాల అల్ట్రా హెచ్డీ టీవీలను బుధవారం విడుదల చేసింది. వీటి ధర రూ.3.30-4.50 లక్షలుంది. ప్యానాసోనిక్ ఆధునిక ఫీచర్లతో ఎల్ఈడీ, 3డీ టీవీలను అందుబాటులోకి తెచ్చింది. శాంసంగ్ గత నెలలోనే 55, 65 అంగుళాల అల్ట్రా హెచ్డీ టీవీలను ప్రవేశపెట్టింది. రూ.500-5000 క్యాష్‌బ్యాక్‌తోపాటు రూ.2 లక్షల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకునే అవకాశాన్ని సీమెన్స్ హోం అప్లయాన్సెస్ కల్పిస్తోంది -
ఓనమ్ము... భోజనమ్ము..!
పుస్తెలు అమ్ముకునైనా పులసల్ని వండుకుతినాలని మన దగ్గర సామెత. కేరళలో కూడా ఇలాంటిదే ఒక సామెత ఉంది! ‘కనం విట్టుం ఓనమ్ ఉన్ననం’ అంటారు వాళ్లు. ఆస్తుల్ని అమ్ముకునైనా ‘తిరుఓనం’ విందును ఆరగించాల్సిందేనట!! ఎల్లుండే కేరళీయుల ఓనం పండుగ! పదో రోజు వచ్చేది తిరు ఓనమ్ పండుగ. అప్పుడు చూడాలి... అదో ఫుడ్ ఫెస్టివల్‌లా ఉంటుంది. అవియల్, అడై ప్రదమన్, ఇడియప్పమ్... పరిప్పు, వళైక్కళ్ తోరణ్... ఏతక్కప్పమ్... ఒకటా రెండా! పక్కన తెలుగువాళ్లుంటే... ఇరుగుదేవోభవ, పొరుగుదేవోభవ అనుకుంటూ... క్యారేజీలు కూడా వచ్చేస్తాయి! అందరి ఇళ్లూ కేరళ వాళ్ల పక్కన ఉండవు కదా... మరెలా? అందుకే కదా... ఈ రుచుల మేళా! పుస్తెలు, ఆస్తులు ఏవీ అమ్ముకోకుండానే... తృప్తిగా తిని త్రేన్చండి! హ్యాపీ ఓనం. హ్యాపీ తిరు ఓనం. అవియల్ కావలసినవి: కూరగాయ ముక్కలు - మూడు కప్పులు (క్యారట్, బీన్స్, ఆలు, మునగకాడలు, పొట్లకాయ, అరటికాయ, తీపి గుమ్మడికాయ, సొరకాయ, కంద...); గట్టి పెరుగు - అర కప్పు; పసుపు - పావు టీ స్పూను; ఉప్పు - రుచికి తగినంత; కొబ్బరి తురుము - కప్పు; పచ్చిమిర్చి - 10; కొత్తిమీర - కప్పు; ఉల్లితరుగు - పావు కప్పు; కొబ్బరినూనె - చిన్నగిన్నెడు; కరివేపాకు - చిన్న కట్ట; జీలకర్ర - అర టీ స్పూను; ఆవాలు - అర టీ స్పూను; ఎండుమిర్చి - 2 (చిన్నగా ముక్కలు చేయాలి) తయారి: ఒక పాన్‌లో తరిగి ఉంచుకున్న కూరముక్కలు, పసుపు, తగినంత నీరు వేసి ముక్కలు బాగా మెత్తబడేవరకు ఉడికించాలి మిక్సీలో కొబ్బరితురుము, ఉల్లితరుగు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పెరుగు, ఉప్పు వేసి పేస్ట్‌లా చేయాలి చిలకరించిన పెరుగు వేసి మరోమారు కలిపి దించేయాలి బాణలిలో టేబుల్ స్పూను కొబ్బరినూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి కరివేపాకు వేసి ఒకసారి కలిపి దించేయాలి కూరలో ఈ పోపు వేసి కలపాలి చివరగా కొబ్బరినూనె వేసి బాగా కలిపి దించేయాలి ఇది రోటీలలోకి, అన్నంలోకి బాగుంటుంది. ఏతక్క అప్పం కావలసినవి: అరటిపళ్లు - 5; మైదా - కప్పు; బియ్యప్పిండి - 2 టేబుల్ స్పూన్లు; పంచదార - 3 టేబుల్ స్పూన్లు; పసుపు - చిటికెడు; నీరు - కప్పు కంటె కొద్దిగా ఎక్కువ; వంటసోడా - చిటికెడు; ఉప్పు - చిటికెడు; నూనె - డీప్ ఫ్రైకి సరిపడా తయారి: అరటిపండు తొక్క తీసి పండును పొడవు (నిలువు)గా కట్ చేయాలి ఒక గిన్నెలో మైదాపిండి, బియ్యప్పిండి, పంచదార, పసుపు, ఉప్పు, వంటసోడా వేసి కలపాలి కొద్దికొద్దిగా నీరు జత చేస్తూ, పిండిని బజ్జీలపిండి మాదిరిగా చేసుకోవాలి బాణలిలో నూనెపోసి కాగాక, కట్ చేసి ఉంచుకున్న అరటిపండు ముక్కలను పిండిలో ముంచి బజ్జీలు వేసుకోవాలి గోధుమవర్ణంలోకి వచ్చేవరకు వేయించి పేపర్ టవల్ మీదికి తీసుకోవాలి వేడివేడి టీతో స్నాక్‌గా సర్వ్ చేయాలి. అడై ప్రదమన్ కావలసినవి: శనగపప్పు - కప్పు (ఉడికించి మెత్తగా చేయాలి); కొబ్బరితురుము - ఒకటిన్నర కప్పులు; బెల్లంతురుము - కప్పు; ఏలకులపొడి - టీ స్పూను; నెయ్యి - పావు కప్పు; జీడిపప్పు పలుకులు - 10; కిస్మిస్ - టేబుల్ స్పూన్; కొబ్బరి ముక్కలు - రెండు టేబుల్ స్పూన్లు తయారి: బాణలిలో నెయ్యి వేసి కరిగాక జీడిపప్పు పలుకులు, కిస్మిస్, కొబ్బరిముక్కలు వేసి బంగారు వర్ణంలోకి వచ్చేవరకు వేయించి పక్కన ఉంచాలి చల్లటి నీటిలో కొబ్బరితురుము వేసి రెండుమూడు నిముషాలు ఉంచి, ఆ తరవాత మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి కొబ్బరిని గట్టిగా పిండితే కొబ్బరి పాలు వస్తాయి. వాటిని పక్కన ఉంచాలి (మొదటిసారి తీసినప్పుడు చిక్కటిపాలు వస్తాయి. మళ్లీ నీరుపోసి బాగా కలిపితే వచ్చేవి పల్చగా ఉంటాయి. రెండిటినీ విడివిడిగా ఉంచాలి) ఒక పెద్ద పాత్రలో చిక్కటి కొబ్బరిపాలు, నీరు, మెత్తగా చేసిన శనగపప్పు, సగం నెయ్యి వేసి బాగా కలిపి పొయ్యి మీద ఉంచి ఐదు నిముషాలు ఉడికించాలి కొబ్బరితురుము జత చేసి ఆపకుండా కలుపుతుండాలి మిగిలిన నెయ్యి, ఏలకుల పొడి వేసి కలపాలి చివరగా పల్చటి కొబ్బరిపాలు వేసి రెండు నిముషాలు ఉడికించి దించాలి డ్రైఫ్రూట్స్‌తో గార్నిష్ చేయాలి. వజైక్కల్ తోరణ్ కావలసినవి: అరటికాయలు - 2; కొబ్బరితురుము - అర కప్పు; పచ్చిమిర్చి - 4; సాంబారు ఉల్లిపాయలు - 6; జీలకర్ర - అర టీ స్పూను; ఆవాలు - అర టీ స్పూను; పసుపు - చిటికెడు; కరివేపాకు - రెండు రెమ్మలు; ఎండుమిర్చి - 1; ఉప్పు - తగినంత; కొబ్బరినూనె - టేబుల్ స్పూను తయారి: అరటికాయలను శుభ్రంగా కడిగి, తొక్క తీసి, ముక్కలు కట్ చేయాలి బాణలిలో అరటికాయముక్కలు, పసుపు, ఉప్పు, తగినంత నీరు వేసి ముక్కలు మెత్తబడేవరకు ఉడికించి నీరు ఒంపేయాలి ఉల్లిపాయలు, జీలకర్ర, పచ్చిమిర్చి మిక్సీలో వేసి మిక్సీ పట్టి పక్కన ఉంచాలి (మరీ మెత్తగా ఉండకూడదు) బాణలిలో కొబ్బరినూనె వేసి కాగాక, ఆవాలు కరివేపాకు, ఎండుమిర్చి వేసి రెండు నిముషాలు వేయించాలి కొబ్బరితురుము జత చేసి బాగా కలపాలి ఉడికించిన అరటికాయ ముక్కలు వేసి కలిపి రెండు నిముషాలు ఉంచి దించేయాలి వేడివేడి అన్నంతో సర్వ్ చేయాలి. ఇడియప్పమ్ కావలసినవి: బియ్యప్పిండి - 2 కప్పులు; నీరు - రెండు కప్పులు (అవసరమనుకుంటే మరికాస్త నీరు కలుపుకోవచ్చు); కొబ్బరితురుము - అర కప్పు; ఉప్పు - తగినంత: నూనె - అర టీ స్పూను తయారి: బియ్యప్పిండి పాన్‌లో వేసి రెండు నిముషాలు వేయించాలి (నూనె వాడకూడదు) పెద్దపాత్రలో నీరు పోసి మరిగించాలి ఉప్పు జత చేసి బాగా కలిపి దించేయాలి వేయించి ఉంచిన బియ్యప్పిండిని వేడినీటిలో కొద్దికొద్దిగా వేస్తూ కలపాలి చల్లారాక జంతికల పిండి మాదిరిగా కలపాలి ఇడ్లీ రేకులకు నూనె లేదా నెయ్యి రాయాలి అన్ని గుంటలలోనూ కొబ్బరితురుము చల్లాలి పిండిని తీసుకుని జంతికల గొట్టంలో వేసి (కారప్పూస ప్లేట్ ఉపయోగించాలి) ఇడ్లీ రేకుల మీద జంతికల మాదిరిగా చుట్టాలి అన్ని ప్లేట్లను కుకర్‌లో ఉంచి మూతపెట్టి,పదిహేను నిముషాలు ఉడికించాలి (విజిల్ పెట్టకూడదు) సాంబార్‌తో సర్వ్ చేయాలి. పరిప్పు కర్రీ కావలసినవి: పెసరపప్పు - అరకప్పు; పసుపు - చిటికెడు; నీరు - రెండు కప్పులు; ఉప్పు - తగినంత; కొబ్బరితురుము - అరకప్పు; ఉల్లి తరుగు - పావుకప్పు; పచ్చిమిర్చి - 4; జీలకర్ర - అర టీ స్పూను; కొబ్బరినూనె - 2 టీ స్పూన్లు; ఆవాలు - పావు టీ స్పూను; ఉల్లితరుగు - టేబుల్ స్పూను; ఎండుమిర్చి - 2 తయారి: బాణలిలో పెసరపప్పు వేసి వేయించాలి (నూనె వేయకూడదు) ఒక గిన్నెలో పెసరపప్పు, పసుపు, రెండు కప్పుల నీరు వేసి కుకర్‌లో ఉంచి మూడు విజిల్స్ వచ్చాక దించేయాలి కొబ్బరి తురుము, జీలకర్ర, ఎండుమిర్చి, కొద్దిగా నీరు కలిపి మిక్సీలో వేసి పేస్ట్ చేసి పక్కన ఉంచుకోవాలి విజిల్ తీసి పెసరపప్పును ఒక గిన్నెలోకి తీసుకుని మాష్ చేసి, కొబ్బరి మిశ్రమం, ఉప్పు జత చేయాలి ఐదు నిముషాలు స్టౌ మీద ఉంచాలి బాణలిలో కొబ్బరినూనె కాగాక ఆవాలు వేసి చిటపటలాడాక, కరివేపాకు, ఉల్లితరుగు, ఎండుమిర్చి వేసి వేయించి దించేయాలి పెసరపప్పు మిశ్రమంలో పోపు వేసి కలపాలి వేడివేడి అన్నం, నేతితో సర్వ్ చేయాలి. సేకరణ : డా. వైజయంతి కర్టెసీ : ఇండియన్ క్విజైన్