
కేరళలో ఓనమ్ పది రోజుల పంట పండుగ. ఈ సందర్భంగా సద్య తాళిని ఆస్వాదించడానికి, పూల అలంకరణలు చేయడానికి, పడవ పందాలను చూడటానికి, ఆటలు ఆడటానికి, దయగల, ఎంతో ప్రియమైన రాక్షస రాజు మహాబలి స్వదేశానికి రావడాన్ని గౌరవించే వేడుక ఓనమ్. ఈ వేడుకలలో నాల్గవ రోజున కేరళలోని అత్యంత అద్భుతమైన దేశీయ కళారూపాలలో పులికలిను ప్రదర్శించారు. కొన్ని ప్రదేశాలలో దీనిని కడువాకలి అని కూడా పిలుస్తారు. ఇక్కడ కళాకారులు పులి వేషం
ఓనం రోజుల్లో పులికొట్టు లేదా డ్యాన్స్ తోపాటు వేసే దరువులు త్రిస్సూర్‌లో ప్రతిధ్వనిస్తాయి. త్రిస్సూర్‌లోని పులికలి తప్ప మరే ఇతర ప్రదేశంలోనూ ఈ ప్రత్యేక లయ లేదని చెప్పుకోవచ్చు. పులికలిక్కర్లు వారి నడుముకు గంటలు జోడించి ప్రత్యేకంగా ఆకర్షణీయంగా ఉండే ఈ అసుర లయకు అనుగుణంగా నృత్యం చేస్తారు.
వందల ఏళ్ళ నృత్యం
పులికలి 200 ఏళ్లనాటిది. అప్పటి కొచ్చిన్ మహారాజా రామవర్మ శక్తన్ థంపురాన్ దీనిని ప్రవేశపెట్టినట్లు చెబుతారు. సహజసిద్ధమైన రంగులను శరీరానికి పూసుకుని, కదులుతున్న పులుల వలె అలంకరింపబడిన పులికెత్తికళి ప్రదర్శనను స్థానికులు ఎంతగానో ఆస్వాదిస్తారు. త్రిస్సూర్‌లో ఈనాటికీ పురాతనమైన నృత్య శైలి మనుగడలో ఉంది.
పులి వేషంలో నృత్యం చేసే కళాకారులను పులికలిక్కర్ అంటారు. వాద్యమేళం (కేరళకు చెందిన ఆర్కెస్ట్రా) లయకు అనుగుణంగా నృత్యం చేస్తారు. పులికలిక్కర్ పెయింటింగ్‌లో చారలు ముదురు పసుపు, నలుపు రంగులో ఉంటాయి. పులినిపోలి ఉండేలా శరీరం మొత్తం పెద్ద మచ్చలతో ఈ ఆర్ట్ వేస్తారు.

అట్టముక్కలు, సైకిల్ ట్యూబ్‌లు
‘కళాకారులు ఓనమ్‌కి రెండు లేదా మూడు నెలల ముందే పులికాలి సన్నాహాలు ప్రారంభిస్తారు. బాగా తిని, పొట్టను సిద్ధం చేసుకుంటారు. దీని వల్ల కళలో వారు మంచి ప్రదర్శనను ఇవ్వగలుగుతారు‘ అని చెబుతారు. ఆరు రకాల చారలతో శరీరం అంతా పెయింట్ చేస్తారు. నేడు కళాకారులు ఫేస్ మాస్క్‌లతో మరింత నూతనంగా డిజైన్ చేస్తున్నారు.
ఫేస్ మాస్క్ కోసం కాగితపు అట్టలను కత్తిరించి, దంతాలగా అటాచ్ చేయడానికి జిగురును ఉపయోగిస్తారు. నాలుకను సైకిల్ ట్యూబ్‌ను కత్తిరించి తయారు చేస్తారు. చివరి టచ్–అప్ ముఖానికి సాంప్రదాయక రంగులతో తగిన షేడ్స్‌ను సృష్టిస్తారు.
ప్రాచీన నృత్యాలు
రంగుల ముసుగు నృత్యం త్రిసూర్, పాలక్కాడ్ జిల్లా, దక్షిణ మలబార్‌లోని కొన్ని ప్రాంతాలలో జరుగుతుంది. మొదటి రోజు నుంచి ఓనమ్ నాల్గవ రోజు వరకు ప్రదర్శకులు ఇంటింటికీ వెళతారు. శరీరమంతా కప్పి ఉంచేలా పర్పటక గడ్డితో దుస్తులు సిద్ధం చేస్తారు. దేవతలు, మానవులు, జంతువులు కుమ్మట్టికలిలో కనిపిస్తాయి. కళాకారులు ధరించే పాత్రలు, ముఖాలలో శివుడు, బ్రహ్మ, రాముడు, కృష్ణుడు, గణేశుడు, కాళి మొదలైనవారు ఉంటారు. ముసుగు వేసుకున్న కుమ్మట్టి
(మాతృమూర్తి) నటన కళ్లారా చూడాల్సిందే.
ఇతర నృత్యాలు
స్త్రీలు చిన్న చిన్న సమూహాలుగా ఏర్పడి చేసే ప్రత్యేకమైన నృత్యం. అలంకరించిన ముగ్గు, మధ్యన సంప్రదాయ దీపం.. దాని చుట్టూ మహిళలు చేరి నృత్యం చేస్తారు. నీటితో నిండిన పాత్ర , బియ్యం పాత్ర.. వంటివి కూడా ఉంచుతారు.
(చదవండి: 30 కిలోల చాక్లెట్‌తో అర్థనారీశ్వర రూపంలో గణపతి..నిమజ్జనం ఏకంగా..!)
Comments
Please login to add a commentAdd a comment