Onam celebrations
-
విశాఖపట్నంలో వైభవంగా ఓనం సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
ఓనం-దసరా కలిస్తే.. కీర్తి సురేశ్ క్రేజీ పోస్ట్ (ఫొటోలు)
-
ముద్దుగుమ్మ, ఉప్పెన బ్యూటీ ఓనం లుక్ మామూలుగా లేదుగా (ఫొటోలు)
-
‘ఓనం’ స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన సంజూ శాంసన్
-
ఓనం సెలబ్రేట్ చేసుకున్న టాలీవుడ్ యాంకర్.. ఫోటోలు వైరల్
-
మలయాళ కుట్టీ, కల్కి బ్యూటీ ఓనం స్పెషల్ లుక్ (ఫోటోలు)
-
ఓనం వేళ దరువుతో అలరించే పులికలి..! ఏకంగా 200 ఏళ్ల..
కేరళలో ఓనమ్ పది రోజుల పంట పండుగ. ఈ సందర్భంగా సద్య తాళిని ఆస్వాదించడానికి, పూల అలంకరణలు చేయడానికి, పడవ పందాలను చూడటానికి, ఆటలు ఆడటానికి, దయగల, ఎంతో ప్రియమైన రాక్షస రాజు మహాబలి స్వదేశానికి రావడాన్ని గౌరవించే వేడుక ఓనమ్. ఈ వేడుకలలో నాల్గవ రోజున కేరళలోని అత్యంత అద్భుతమైన దేశీయ కళారూపాలలో పులికలిను ప్రదర్శించారు. కొన్ని ప్రదేశాలలో దీనిని కడువాకలి అని కూడా పిలుస్తారు. ఇక్కడ కళాకారులు పులి వేషం ఓనం రోజుల్లో పులికొట్టు లేదా డ్యాన్స్ తోపాటు వేసే దరువులు త్రిస్సూర్‌లో ప్రతిధ్వనిస్తాయి. త్రిస్సూర్‌లోని పులికలి తప్ప మరే ఇతర ప్రదేశంలోనూ ఈ ప్రత్యేక లయ లేదని చెప్పుకోవచ్చు. పులికలిక్కర్లు వారి నడుముకు గంటలు జోడించి ప్రత్యేకంగా ఆకర్షణీయంగా ఉండే ఈ అసుర లయకు అనుగుణంగా నృత్యం చేస్తారు. వందల ఏళ్ళ నృత్యంపులికలి 200 ఏళ్లనాటిది. అప్పటి కొచ్చిన్ మహారాజా రామవర్మ శక్తన్ థంపురాన్ దీనిని ప్రవేశపెట్టినట్లు చెబుతారు. సహజసిద్ధమైన రంగులను శరీరానికి పూసుకుని, కదులుతున్న పులుల వలె అలంకరింపబడిన పులికెత్తికళి ప్రదర్శనను స్థానికులు ఎంతగానో ఆస్వాదిస్తారు. త్రిస్సూర్‌లో ఈనాటికీ పురాతనమైన నృత్య శైలి మనుగడలో ఉంది. పులి వేషంలో నృత్యం చేసే కళాకారులను పులికలిక్కర్ అంటారు. వాద్యమేళం (కేరళకు చెందిన ఆర్కెస్ట్రా) లయకు అనుగుణంగా నృత్యం చేస్తారు. పులికలిక్కర్ పెయింటింగ్‌లో చారలు ముదురు పసుపు, నలుపు రంగులో ఉంటాయి. పులినిపోలి ఉండేలా శరీరం మొత్తం పెద్ద మచ్చలతో ఈ ఆర్ట్ వేస్తారు. అట్టముక్కలు, సైకిల్ ట్యూబ్‌లు‘కళాకారులు ఓనమ్‌కి రెండు లేదా మూడు నెలల ముందే పులికాలి సన్నాహాలు ప్రారంభిస్తారు. బాగా తిని, పొట్టను సిద్ధం చేసుకుంటారు. దీని వల్ల కళలో వారు మంచి ప్రదర్శనను ఇవ్వగలుగుతారు‘ అని చెబుతారు. ఆరు రకాల చారలతో శరీరం అంతా పెయింట్ చేస్తారు. నేడు కళాకారులు ఫేస్ మాస్క్‌లతో మరింత నూతనంగా డిజైన్ చేస్తున్నారు. ఫేస్ మాస్క్ కోసం కాగితపు అట్టలను కత్తిరించి, దంతాలగా అటాచ్ చేయడానికి జిగురును ఉపయోగిస్తారు. నాలుకను సైకిల్ ట్యూబ్‌ను కత్తిరించి తయారు చేస్తారు. చివరి టచ్–అప్ ముఖానికి సాంప్రదాయక రంగులతో తగిన షేడ్స్‌ను సృష్టిస్తారు. ప్రాచీన నృత్యాలురంగుల ముసుగు నృత్యం త్రిసూర్, పాలక్కాడ్ జిల్లా, దక్షిణ మలబార్‌లోని కొన్ని ప్రాంతాలలో జరుగుతుంది. మొదటి రోజు నుంచి ఓనమ్ నాల్గవ రోజు వరకు ప్రదర్శకులు ఇంటింటికీ వెళతారు. శరీరమంతా కప్పి ఉంచేలా పర్పటక గడ్డితో దుస్తులు సిద్ధం చేస్తారు. దేవతలు, మానవులు, జంతువులు కుమ్మట్టికలిలో కనిపిస్తాయి. కళాకారులు ధరించే పాత్రలు, ముఖాలలో శివుడు, బ్రహ్మ, రాముడు, కృష్ణుడు, గణేశుడు, కాళి మొదలైనవారు ఉంటారు. ముసుగు వేసుకున్న కుమ్మట్టి (మాతృమూర్తి) నటన కళ్లారా చూడాల్సిందే. ఇతర నృత్యాలుస్త్రీలు చిన్న చిన్న సమూహాలుగా ఏర్పడి చేసే ప్రత్యేకమైన నృత్యం. అలంకరించిన ముగ్గు, మధ్యన సంప్రదాయ దీపం.. దాని చుట్టూ మహిళలు చేరి నృత్యం చేస్తారు. నీటితో నిండిన పాత్ర , బియ్యం పాత్ర.. వంటివి కూడా ఉంచుతారు.(చదవండి: 30 కిలోల చాక్లెట్‌తో అర్థనారీశ్వర రూపంలో గణపతి..నిమజ్జనం ఏకంగా..!) -
Onam Festival: మలయాళ సెలబ్రిటీలు ఎంత బాగా ముస్తాబయ్యారో! (ఫోటోలు)
-
ఓనం అంటే సంబరం, సరదా, సాధ్య!
దక్షిణ రాష్ట్రమైన కేరళలో అతి ముఖ్యమైన పండుగ ఓనం. మరో విధంగా చెప్పాలంటే తెలుగువారికి సంక్రాంతి అంత సంబరం. రుతుపవనాల ముగింపుకు గుర్తుగా రాక్షసరాజు బలిచక్రవర్తిని ఆహ్వానిస్తూ ఘనంగా మలయాళీలు జరుపుకునే పండుగ. సంప్రదాయం,రుచులు కలగలిసిన ఓనం అనగానే రకరకాల వంటలు, వైవిధ్యభరితమైన రుచులు గుర్తొస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏ ప్రదేశంలోఉన్నా కేరళ ప్రజలు ఓనంని ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. సెప్టెంబరు 6 న మొదలైన ఈ ఏడాది ఓనం పండుగ సంబరాలుఆఖరిరోజు సెప్టెంబరు 15న ముగుస్తాయిఓనం అంటే పువ్వులతో అందమైన అలంకరణ, చూడముచ్చటగొలిపే ముస్తాబు. పసందైన విందు భోజనం సాధ్య. ఎర్రబియ్యంతో చేసిన అన్నం, ఇంకా ఉప్పేరి, పసుపు , ఆవాలు మ్యారినేట్ చేసిన పనీర్ కర్రీ, క్లాసిక్ పరిప్పు, గుమ్మడి, కొబ్బరితో చేసే అనేక రకాల వంటకాలు ఉంటాయి. ఇంకా తోరన్, శర్కరవరట్టి, ఉల్లి వడ అవియల్, సాంబారు, తదితర 20కి పైగా వంటకాలతో అరిటాకు బోజనం మరీ స్పెషల్. పరిప్పు కర్రీపెసరపప్పు, కొబ్బరితో చేసి పరిప్పు కర్రీ. కొబ్బరి, జీలకర్ర, పచ్చిమిర్చి, వెల్లుల్లి (ఇష్టమున్నవారు)వేసి మిక్సీలో వేసుకుని కొబ్బరి పేస్ట్ తయారు చేసుకోవాలి. తరువాత పెసరపప్పును బాగా మెత్తగా ఉడికించాలి. ఇపుడు ఉడికిన పప్పులో పసుపు, కొబ్బరి ముద్ద వేసి బాగా కలపి, దీంట్లో కొద్దిగా నీళ్లుపోసుకుని సన్నని మంట మీద ఉడికించాలి. తగినంత ఉప్పు, చిటికెడు, నల్ల మిరియాల కలపాలి. (కాకరకాయ ఆయిల్‌తో ఎన్ని లాభాలో : చుండ్రుకు చెక్, జుట్టు పట్టుకుచ్చే!)తాలింపు: నెయ్యి లేదా కొబ్బరి నూనెను వేడి చేసి ఆవాలు వేసి అవి చిటపడలాడాక, ఎండు మిర్చి ముక్కలు, కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసి పోపు పెట్టుకోవాలి. ఇది సాధారణంగా ఓనం సాధ్యలో బియ్యంతో కలిపి వడ్డిస్తారు. దీంతోపాటు, అప్పడం, పచ్చడి ఉంటుంది. అన్నట్టు ఓనంలో మరో స్పెషల్ పచ్చడి.పచ్చడిసాధ్యలో ఎన్నో రకాల పచ్చళ్లను వడ్డిస్తారు. బీట్రూట్, దోసకాయ, గుమ్మడి, పైనాపిల్ ఇలా ఏ కూరగాయచ పండుతోనైనా రుచికరంగా తయారు చేసుకుని ఎంతో ఇష్టంగా భుజిస్తారు.సాంబారుమన విందుభోజనాల్లోఉన్నట్టే కేరళీయులు సాంబారును బాగా ఇష్టపడతారు. అన్ని రకాల కూరగాయల ముక్కలతో సాంబారును తయారు చేస్తారు. చివరిగా పాయసం లాంటి ఇతర అనేక తీపి పదార్థాలతో నోరును తీపి చేసుకుంటారు. ఇదీ చదవండి : మల్టీ కలర్ చీరలో నీతా అంబానీ స్పెషల్ అండ్ సింపుల్ లుక్ -
లగ్జరీ కార్లకు పండుగ జోష్.. రికార్డ్ స్థాయిలో అమ్మకాల జోరు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఈ ఏడాది అత్యుత్తమ పనితీరును సాధించగలమని లగ్జరీ కార్ల పరిశ్రమ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఓనం నుండి దీపావళి వరకు ఈ పండుగ సీజన్ గత సంవత్సరాల కంటే మెరుగ్గా ఉంది. అనేక కొత్త మోడళ్లు, ఆకర్షణీయమైన పోర్ట్‌ఫోలియో, బలమైన కస్టమర్ సెంటిమెంట్ ఈ జోష్‌కు కారణమని మెర్సిడెస్–బెంజ్ ఇండియా ఎండీ సంతోష్ అయ్యర్ తెలిపారు. దసరా, ధన్తేరస్, దీపావళి సందర్భంగా రికార్డు స్థాయిలో డెలివరీలు జరగడం కస్టమర్ల ఉత్సాహాన్ని ప్రతిబింబిస్తోందని అన్నారు. సానుకూల పరిశ్రమ దృక్పథంతో కొనసాగుతున్నామని, ఈ ఏడాది రికార్డు స్థాయిలో అమ్మకాలు జరుగుతాయని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎస్‌యూవీల ఉత్పత్తి, లభ్యతను ప్రభావితం చేస్తూ సరఫరా సంబంధిత ఆటంకాలు కొనసాగే అవకాశం ఉందని వివరించారు. భారత్‌లో 2023 ఆగస్టు 17 నుంచి నవంబర్ 14 మధ్య మొత్తం ప్యాసింజర్ వాహనాల రిటైల్ అమ్మకాలు 10 లక్షల మార్కును దాటాయి. ఏడేళ్లలో గరిష్టం.. ఈ ఏడాది జనవరి–సెప్టెంబర్‌లో 5,530 యూనిట్ల అమ్మకాలతో కంపెనీ 88 శాతం వృద్ధిని సాధించిందని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ తెలిపారు. ఇటీవలి కాలంలో అత్యధిక ఆర్డర్ బుక్‌తో కొనసాగుతున్నట్టు వెల్లడించారు. ఈ పండుగ సీజన్ ఆడి ఇండియాకు పెద్ద వేడుకగా నిలిచిందన్నారు. గత ఏడు సంవత్సరాలతో పోలిస్తే అత్యధిక అమ్మకాలను ఈ సీజన్లో నమోదు చేశామన్నారు. ఏ4, క్యూ3, క్యూ3 స్పోర్ట్‌బ్యాక్, క్యూ5, ఎస్5 స్పోర్ట్బ్యాక్లతో సహా ఉత్తమ విక్రయాలతో నిరంతర డిమాండ్ కారణంగా వృద్ధి నమోదైందని ధిల్లాన్ చెప్పారు. పండుగల సీజన్లో కంపెనీ ఉత్పత్తులకు డిమాండ్‌లో ఢిల్లీ, ముంబై ముందంజలో ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్, కోల్‌కత, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్‌ల నుండి కూడా మంచి డిమాండ్‌ను చూస్తున్నామని వెల్లడించారు. ఈ ఏడాది భారత్‌లో లగ్జరీ కార్ల పరిశ్రమ 2018 స్థాయి అమ్మకాలను అధిగమిస్తుందని, 46,000–47,000 యూనిట్ల మార్కును చేరుకుంటుందని జోస్యం చెప్పారు. ఆడి ఇండియా అధిక రెండంకెల వృద్ధితో 2023ను ముగించాలని చూస్తోందని వివరించారు. 2027 నాటికి 1.54 బిలియన్ డాలర్లు.. పండుగ సందర్భంగా కొన్ని శక్తివంతమైన కార్లు, మోటార్‌సైకిళ్లను విడుదల చేశామని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పావా తెలిపారు. ఈ వేగాన్ని కంపెనీ కొనసాగిస్తుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో భారత్ ఒకటి. అలాగే మిలియనీర్ల సంఖ్య పరంగా 3వ అతిపెద్ద దేశమని లంబోర్గీని ఇండియా హెడ్ శరద్ అగర్వాల్ తెలిపారు. ‘2021లో భారతీయ లగ్జరీ కార్ మార్కెట్ విలువ 1.06 బిలియన్ డాలర్లు. 2027 నాటికి 1.54 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. 2022–2027 అంచనా కాలంలో 6.4 శాతం కంటే ఎక్కువ సగటు వార్షిక వృద్ధి నమోదవుతుంది’ అని పేర్కొన్నారు. కస్టమర్ అభిరుచి, ప్రాధాన్యతలు ఈ వృద్ధిని నడిపిస్తాయని చెప్పారు. దీంతో అధునాతన సాంకేతికత, భద్రతా ఫీచర్లతో లగ్జరీ కార్లకు పెరుగుతున్న డిమాండ్‌తో ఆటోమొబైల్ రంగం గణనీయంగా విస్తరణను చూస్తోంది’ అని అగర్వాల్ తెలిపారు. మెరుగైన రోడ్లు వృద్ధికి మరింత మద్దతునిస్తోంది. నగరాలు ఎక్స్‌ప్రెస్‌వేల ద్వారా అనుసంధానం అవుతున్నాయి. దీంతో అధిక ఆకాంక్షలతో పాటు ద్వితీయ శ్రేణి, చిన్న నగరాల్లో డిమాండ్‌ను పెంచుతున్నాయని చెప్పారు. లంబోర్గీని మొత్తం అమ్మకాల్లో 25 శాతానికి పైగా మెట్రోయేతర నగరాల నుండి జరుగుతున్నాయని అన్నారు. -
కేరళ కకావికలం : ఓనం ఉత్సవాలు రద్దు
తిరువనంతపురం : అందమైన ఉద్యానవనాలు, పర్యాటక రంగానికి మారుపేరైన కేరళ రాష్ట్రాన్ని భారీ వర్షాలు కకావికలం చేశాయి. వరుణుడి ఉగ్రరూపానికి కేరళ అల్లకల్లోలమవుతోంది. సుమారు ఒక శతాబ్దంలో ఇంతటి ప్రకృతి కోపాన్ని కేరళ రుచిచూడటం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో కేరళ ప్రతేడాది ఎంతో ఘనంగా నిర్వహించే ఓనం ఉత్సవాలను రద్దు చేసింది. కేరళలో ఓనం ఉత్సవాలను రద్దు చేస్తున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. ఓనం పండుగ పంటల పండుగగా ఎంతో సుప్రసిద్ధమైంది. ఆ రాష్ట్ర ప్రభుత్వమే ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ ఉంటుంది. కానీ ఈసారి ఓనం ఉత్సవాలను రద్దు చేసింది. ఓనం కోసం గతంలో కేటాయించిన రూ.30 కోట్లను తాజాగా ముఖ్యమంత్రి సహాయనిధికి మళ్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఓనం కోసం పక్కకు తీసి పెట్టిన నగదును సహాయనిధి కోసం వాడనున్నామని విజయన్ మంత్రివర్గ సమావేశం అనంతరం మీడియాకు చెప్పారు. ఈ పండుగను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ఉత్సవాల నిర్వహణ కోసం ప్రభుత్వం ఇటీవల రూ.30 కోట్లు కేటాయించింది. ఆగస్టులో ఓ వారమంతా ఈ వేడుకలను నిర్వహిస్తారు. ఆగస్టు 25న తిరు ఓనం పండుగ. కాగ, ఆగస్టు 8 నుంచి కేరళ వరదల్లో కొట్టుమిట్టాడుతోంది.గత వారం 39 మంది మరణించగా.. నలుగురు గల్లంతయ్యారు. సుమారు లక్ష మంది ఈ వరదలకు ప్రభావితమైనట్టు తెలిసింది. ఈ క్రమంలో ఈసారి ఉత్సవాలను నిర్వహించుకోబోవడం లేదని ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. ఉపశమనం, పునరావాస కార్యక్రమాలను వెంటనే చేపట్టేందుకు కేబినెట్ సబ్-కమిటీని నియమించాలని నిర్ణయించినట్టు విజయన్ చెప్పారు. సెప్టెంబర్ 3 నుంచి 15 వరకు ఎవరైతే విలువైన రికార్డులను కోల్పోయారో, వారికి డూప్లికేట్లు జారీ చేసేందుకు స్పెషల్ కోర్టులు నిర్వహించబోతున్నారు. ఈ రికార్డులను ఉచితంగానే జారీ చేయబోతుంది. పరిహార మొత్తాలను ఎప్పుడు బదిలీ చేస్తుందో కూడా రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీని కోరామని, వాటిపై ఎలాంటి ఛార్జీలను విధించకూడదని కోరామని చెప్పారు. -
ఓనమ్.. అదిరెన్
విజయవాడ (లబ్బీపేట) : ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలోనే అక్షరాస్యతలో ముందున్న కేరళ రాష్ట్ర సంప్రదాయ ఓనమ్ వేడుకలను నగరంలోని ఇన్నర్‌వీల్ క్లబ్ సభ్యులు ఉత్సాహంగా నిర్వహించారు. కేరళ సంప్రదాయ వస్త్రాలను ధరించి ప్రత్యేకంగా నిర్వహించిన క్యాట్‌వాక్ ఆకట్టుకుంది. కేరళ వస్త్రాలతో నృత్యాలు, దీపాలు, పూల అలంకరణలతో హోటల్ మినర్వా గ్రాండ్లో గురువారం పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఇన్నర్‌వీల్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు కె.శ్రీదేవి రంగ, సుచిత్ర మాట్లాడుతూ అక్షరాస్యతలో మన దేశంలో ప్రథమ స్థానంలో నిలిచిన కేరళను స్ఫూర్తిగా తీసుకుని వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నగరంలోని ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలనే ఉద్దేశంతో నగరపాలక సంస్థ పాఠశాలలను దత్తత తీసుకున్నట్లు చెప్పారు. వాటిని హ్యాపీ స్కూల్స్‌గా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ పాస్ట్ ప్రెసిడెంట్ సావిత్రితోపాటు 300 మంది సభ్యులు పాల్గొన్నారు. మహిళా టీచర్లకు సన్మానం గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని ఇన్నర్‌వీల్ క్లబ్ ఆధ్వర్యాన మున్సిపల్ పాఠశాలల్లో పనిచేస్తున్న 21 మంది మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ముఖ్య అతిథిగా పారిశ్రామికవేత్త చుక్కపల్లి సుధ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవం రోజు ఉపాధ్యాయులను సన్మానించడం అభినందనీయమన్నారు. -
వేడుకగా ఓనం
-
ఓనం.. మనోహరం
-
ఇడ్లీ ప్రాణం తీసింది
పాలక్కడ్: కేరళ రాష్ట్రంలో జరిగిన ఓనమ్ ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. ఓనమ్ ఉత్సవాల సందర్భంగా జరిగిన నిర్వహించిన ఇడ్లీ పోటీలలో పాల్గొన్న 55 ఏళ్ల వ్యక్తి చనిపోయారు. పోటీల్లో పాల్గొన్న కందముతన్ అనే వ్యక్తి గొంతులో ఇడ్లీ ఇరికి ప్రాణం వదిలారు. ఓనం సందర్భంగా స్థానిక క్లబ్ నిర్వహించిన ఇడ్లీ పోటీల్లో కుదముతన్ వేగంగా తినడానికి ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో ఇడ్లీ గొంతులో ఇరికిందని, దాంతో ఊపిరి ఆడకపోవడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారని.. అయితే అప్పటికే కుదముతన్ మరణించారని వైద్యులు ధృవీకరించారని పోలీసులు తెలిపారు.