విమానంలో అదిరే హోలీ స్టెప్పులు: ఇక జన్మలో స్పైస్‌జెట్‌ ఎక్కను! | Holi 2025 SpiceJet cabin crew dance ongoes viral; netizens Mocks | Sakshi
Sakshi News home page

Holi 2025 విమానంలో అదిరే హోలీ స్టెప్పులు : ఇక జన్మలో స్పైస్‌జెట్‌ ఎక్కను!

Published Sat, Mar 15 2025 1:18 PM | Last Updated on Sat, Mar 15 2025 1:18 PM

Holi 2025 SpiceJet cabin crew dance ongoes viral; netizens Mocks

హోలీ వేడుకలు దేశవ్యాప్తంగా  ఘనంగా జరిగాయి. సామాన్యమానవుల దగ్గర్నించీ, సెలబ్రిటీల దాకా రంగుల పండుగ ఉత్సవాల్లోఉత్సాహంగా గడిపారు. ఈ వేడుకలకు సంబంధించి అనేక వీడియోలు సోషల్‌మీడియాలో ఆకట్టుకంటున్నాయి. అయితే వీటన్నింటికంటే భిన్నంగా ఒకవీడియో నెట్టింట హల్‌ చల్‌ చేస్తోంది. హోలీ పండుగ సందర్భంగా స్పైస్‌‌‌‌‌‌‌‌ జెట్‌‌‌‌‌‌‌‌ (SpiceJet) సిబ్బంది తమ డ్యాన్స్‌‌‌‌‌‌‌‌తో ప్రయాణికులను అలరించారు.  అయితే విధి నిర్వహణ మర్చి గెంతులేశారు అంటూ  నెటిజన్లులు మండిపడ్డారు.

హోలీ (Holi202) స్పైస్‌జెట్ క్యాబిన్ సిబ్బంది వార్తల్లో నిలిచాయి. విమానంలో స్టెప్పులేసి  ప్రయాణీకులతో కలిసి హోలీని ఉత్సాహంగా జరుపుకున్నారు.  బాలీవుడ్‌ మూవీ యే జవానీ హై దీవానీ చిత్రంలోని పాటకు నృత్యం చేశారు. ఢిల్లీ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోర్ట్‌‌‌‌‌‌‌‌లో టేకాఫ్‌‌‌‌‌‌‌‌కు సిద్ధంగా విమానంలో స్పైస్‌జెట్‌ క్యాబిన్‌  క్రూ అంతా సంప్రదాయ దుస్తులు ధరించి, హోలీ ‘బలం పిచ్‌‌‌‌‌‌‌‌కారి’ పాటకు నృత్యంచేశారు ఎయిర్ హోస్టెస్‌లు, ఫ్లైట్ స్టీవార్డ్‌లు ఉత్సాహంగా మ్యూజిక్‌‌‌‌‌‌‌‌కు తగ్గట్లు  స్టెప్పులతో అదరగొట్టేశారు. వీరి సంతోషానికి ప్రయాణికులు చప్పట్లు కొట్టారు. పనిలో పనిగా వీడియోలను రికార్డు చేశారు. ఇదే ప్రస్తుతం సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియాలో  వైరల్‌గా మారింది.

ఈ వీడియోను గోవింద్ రాయ్ (@govindroyicai) అనే వినియోగదారు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. వీడియో 3 లక్షలకు పైగా వీక్షణలను సంపాదించినప్పటికీ, ఇది ఆన్‌లైన్‌లో చర్చకు దారితీసింది. చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు దీన్ని తప్పుబట్టారు.  సిబ్బంది మూలంగా విమానం 5 గంటలు ఆలస్యం అయింది అంటూ విమర్శించారు. విధి నిర్వహణ మానేసి ఇదేం పని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

మరో వినియోగదారుడైతే ఏకంగా స్పైస్‌ జెట్‌ విమానం  ఎక్కను అంటూ  అన్నాడు. “చాలా ఏళ్ల తరువాత నేను స్పైస్‌జెట్‌లో ప్రయాణిస్తున్నా..ఇక ఇదే  చివరిసారి. ఈ నిర్ణయం తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది.  ఎప్పటికీ ఈ ఎయిర్‌లైన్‌తో ప్రయాణించను”అంటూ  కమెంట్‌ చేశాడు.

కొంతమంది క్యాబిన్ క్రూ నిపుణులు కూడా  ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. “ ఒక క్యాబిన్ క్రూగా, నేను దీన్ని అభినందించను. ఇది అస్సలు ప్రొఫెషనల్ కాదు” అని వ్యాఖ్యానించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement