Netizens Mocks
-
కెప్టెన్ అన్షుమన్ సతీమణిపై వివాదాస్పద పోస్టు.. నెటిజన్‌పై కేసు
న్యూఢిల్లీ: కీర్తి చక్ర అవార్డు గ్రహీత దివంగత కెప్టెన్ అన్షుమన్‌సింగ్ సతీమణి స్మృతిసింగ్‌పై వివాదాస్పద పోస్టు పెట్టినందుకుగాను ఢిల్లీ పోలీసులు ఓ నెటిజన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) ఫిర్యాదు మేరకు నిందితునిపై ఇటీవలే అమలులోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్ 2024)సెక్షన్ 79, ఐటీ చట్టం సెక్షన్ 67 కింద కేసులు పెట్టారు. స్మృతిసింగ్‌పై సోషల్‌మీడియాలో వివాదాస్పద పోస్టు పెట్టిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలని ఎన్సీడబ్ల్యూ ఢిల్లీ పోలీసు కమిషనర్‌కు ఒక లేఖ కూడా రాసింది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.గతేడాది సైన్యంలో విధి నిర్వహణలో ఉండగా సియాచిన్‌లో జరిగిన ఒక అగ్నిప్రమాదంలో అన్షుమన్ ప్రాణాలు కోల్పోయారు. చనిపోయే ముందు తన సహచరులను కాపాడినందుకుగాను అన్షుమన్‌కు కేంద్ర ప్రభుత్వం కీర్తి చక్ర పతకం ప్రకటించింది. ఈ పతకాన్ని ఈ మధ్యే జులై 5న రాష్ట్రపతి చేతుల మీదుగా అన్షుమన్ సతీమణి, మాతృమూర్తులు అందుకున్నారు. కాగా అన్షుమన్‌కు వివాహం జరిగిన తర్వాత కేవలం 5 నెలలకే ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలిచివేసింది. -
Anant-Radhika జుకర్‌బర్గ్ భార్య నగ మిస్..? నెటిజనుల కామెంట్స్ వైరల్
రిలయన్స్ అధినేత, బిలియనీర్ ముఖేష్ ,నీతా అంబానీ చిన్నకుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ బాష్‌లో ఒక ఆశ్యర్యకరమైన విషయం నెట్టింట చక్కర్లు కొడుతోంది. అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లో మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ భార్య పెండెంట్‌ను కోల్పోయిందట. దీంతో సోషల్ మీడియా సంస్థలు ఎఫ్బీ, ఇన్స్టాగ్రామ్ డౌన్‌కి ఇదే కారణమంటున్న నెటిజన్లు ఛలోక్తులు వైరల్‌గా మారాయి. గుజరాత్‌లోని జామ్ నగర్లో మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించిన వేడుకలకు బాలీవుడ్, క్రీడారంగ సెలబ్రిటీలతోపాటు, మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ , భార్య న్, బిల్ గేట్స్ ఆయన భార్య, గ్లోబల్ పాప్ ఐకాన్, రిహన్నా సందడి చేసిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం మార్క్ భార్యప్రిస్సిల్లా చాన్ లాకెట్ మిస్ అయింది. దీంతో భారీ గందరగోళం ఏర్పడి, జుకర్‌బర్గ్ దంపతులతో పాటు అతిథులంతా మూడున్నర గంటలపాటు లాకెట్టు కోసం వెతికినా ఫలితం లేక పోయింది. ఈ ఘటనపై రెడిట్యూజర్ వెల్లడించడంతో నెటిజన్లు ఫన్నీ కమెంట్లతో సందడి చేశారు. అందుకే ఫేస్బుక్, ఇన్‌స్టా పనిచేయ లేదంటూ కమెంట్ చేశారు. ఈ సంఘటన దురదృష్టకరం అంటూ మరికొందరు వ్యాఖ్యానించారు. అయితే చాన్ లాకెట్టు నిజంగానే పోయిందా? ఒక వేళ పోతే మళ్లీ దొరికిందా లేదా అనే దానిపై స్పష్టత లేదు. కాగా మెటా యాజమాన్యంలోని యాప్‌లు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, మెసెంజర్, థ్రెడ్లు నాలుగు రోజుల క్రితం భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా డౌన్ అయిన సంగతి తెలిసిందే. -
చేసిన పాపం ఎక్కడికి పోతుంది సుందరా! అనుభవించు: నెటిజన్లు ఫైర్
సాక్షి,ముంబై: ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్ (ఫిన్‌ఫ్లుయెన్సర్) పీఆర్ సుందర్‌కు సెబీ భారీ షాకిచ్చింది. మార్కెట్ రెగ్యులేటరీ సెబీనుంచి అవసరమైన రిజిస్ట్రేషన్ లేకుండానే ఇన్వెస్ట్మెంట్ సలహాలపై ఫిర్యాదులు, భారీగా ఫీజు దండుకున్న ఆరోపణలపై సెబీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై రూ.6 కోట్ల పెనాల్టీ విధించింది. దీంతో పాటు ఒక సంవత్సంపాటు సెక్యూరిటీల లావాదేవీలు నిర్వహించకుండా నిషేధం విధించింది. దీంతో కర్మ ఊరికే పోదు..ఏదో ఒక రోజు అనుభవించాల్సిందే అంటూ నెటిజన్లు కమెంట్ చేశారు. పీఆర్ సుందర్ తప్పుడు ట్రేడింగ్ కాల్స్ ఇస్తారని, దీనికి ఫీజులు కూడా బాగానే దండుకున్నారంటూ కొంతమంది ట్విటర్ వినియోగదారులు మండిపడ్డారు. అతని ఇంటి విలువ 30 కోట్లు రోల్స్ రాయిస్ , ల్యాండ్ రోవర్ కూడా ఉన్నాయంటూ మరొక యూజర్ కమెంట్ చేశారు. ఇది అతనికి పెద్ద లెక్కకాదని, ఇప్పటికే భారీగానే సంపాదించేశాడని, ఇపుడిక మరోదారి వెతుక్కుంటాడు అని ఇంకొందరు వ్యాఖ్యానించడం విశేషం. సుందర్ నిర్వహణలో అడ్వైజరీతోపాటు, టెలిగ్రామ్‌లో, యూట్యూబ్, ట్విటర్ ద్వారా రోజువారీ కాల్స్, లావాదేవీలపై సూచనలు సలహాలిస్తారనీ, దీనికి రేజర్‌పే లింక్‌తో సహా చెల్లింపు లింక్‌ను అందించింది. రేజర్‌పే, డైరెక్ట్ క్రెడిట్ ద్వారా మాన్సన్ బ్యాంక్ ఖాతాలో రూ. 4.36 కోట్లు ,రూ. 23.5 లక్షలకు పైగా వసూలు చేసిందని సెబీ సెటిల్మెంట్ ఆర్డర్లో పేర్కొంది. దీనికి రూ. 6 కోట్లు చెల్లించడంతోపాటు, సెటిల్మెంట్ ఆర్డర్ పాస్ అయినప్పటి నుండి ఒక సంవత్సరం పాటు సెక్యూరిటీలను కొనడం, విక్రయించడం లేదా ఇతరత్రా లావాదేవీలు చేయకుండా కట్టడి చేసింది. ఆరోపణలపై నోటీసులు జారీ తరువాత సెబీ హై-పవర్డ్ అడ్వైజరీ కమిటీ ఫిబ్రవరి 22, 2023న జరిగిన సమావేశం జరిగింది. అనంతరం ఏప్రిల్ 3, 2023న సెటిల్మెంట్ రెగ్యులేషన్స్‌లోని రెగ్యులేషన్ 15 ప్రకారం, హోల్ టైమ్ మెంబర్స్ ప్యానెల్ సిఫార్సును ఆమోదించి, ఏప్రిల్ 06 దరఖాస్తుదారులకు తెలియజేసినట్టు సెబీ పేర్కొంది. దీని ప్రకారం సెటిల్మెంట్ మొత్తాన్ని చెల్లించి, ఆర్జించిన లాభంతో సహా రూ. 6 కోట్లకు పైగా సొమ్మును జమ చేసేందుకు అంగీకరించారు. మూడు సంస్థలు ఒక్కొక్కటి రూ. 15.60 చొప్పున మొత్తం రూ.46.80 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. జూన్ 1, 2020 నుండి ఫిబ్రవరి 2023లో చేరిన సవరించిన సెటిల్మెంట్ నిబంధనలను (RST) సమర్పించే తేదీ వరకు సంవత్సరానికి 12 శాతం వడ్డీతో సహా రూ. 6,07,69,863 డిస్‌గోర్జ్‌మెంట్ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. కాగా పీఆర్ సుందర్, అతని కంపెనీ మన్సన్ కన్సల్టింగ్, కంపెనీ కో-ప్రమోటర్ మంగయార్కరసి సుందర్‌కు సెబీ గతంలో షోకాజ్ నోటీసులు పంపింది. దీనిపై తాజాగా చర్యను చేపట్టింది. ప్రధానంగా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, మ్యూచువల్ ఫండ్స్,ఇన్సూరెన్స్‌పై, ప్రధానంగా ఫేస్బుక్ ,ట్విటర్, టెలిగ్రాం లాంటి వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌లో పెట్టుబడిదారులకు సలహాలిచ్చే వారినే ఫిన్ఫ్లూయన్సర్ అంటారు. దీనికి ఫీజును కూడా వసూలు చేస్తారు. అయితే ఇలాంటి సేవలకు గాను సంబంధిత వ్యక్తులకు సెబీ రిజిస్ట్రేషన్, అనుమతి తప్పనిసరి. He jumped to crypto 🤣 crypto bois watch out for this man, he has entered ur territory in rented Rolls Royce 🫢#Crypto #prsundar pic.twitter.com/scWAvmRdzU — Priyanka Gowda (@Priyankagowda22) May 26, 2023 Got to give it to this man. Working hard by trying to teach Crypto options the very evening he was imposed 4cr fine by SEBI 😂 Never give up even at 60? #PRSundar #StockMarket #Nifty pic.twitter.com/S94aOXFQac — kipaii (@kipai09) May 26, 2023 -
రిషి సునాక్ ‘తప్పు’: ఆడేసుకుంటున్న నెటిజన్లు, ఏం జరిగిందంటే
లండన్: బ్రిటన్ ప్రధానమంత్రి రేసులో దూసుకుపోతున్న బ్రిటన్ మాజీ ఆర్థిక మంత్రి, భారత సంతతికి చెందిన రిషి సునాక్ సోషల్ మీడియాలోసంచలనంగా మారారు. అయితే రాజకీయంగా తన ప్రతిభను చాటుకోబోతున్నందుకు కాదు.. సోషల్ మీడియా పోస్ట్‌లో తప్పులో కాలేసిందుకు. అయితే ఈ సెటైర్లకు, విమర్శలకు కూల్‌గా సమాధానమిచ్చారు. ప్రధాని పదవికి సంబంధించిన పోటీ రెండో రౌండ్లో అత్యధిక ఓట్లను గెలుచుకుని టాప్‌లో ఉన్న రిషి తన ప్రచార బ్యానర్లో స్పెల్లింగ్ తప్పుగా రాయడంతో నెటిజన్లు సునాక్‌ను ఒక ఆట ఆడేసుకుంటున్నారు. తన మొదటి టెలివిజన్ డిబేట్ సందర్భంగా నిర్వహించిన ప్రచారంలో ట్విటర్లో ‘క్యాంపెయిన్’ స్పెల్లింగ్‌ను తప్పుగా రాయడంతో ఆయన నెటిజన్లుకు దొరికియారు. పలు కామెంట్లు, వ్యంగ్యాస్త్రాలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా గూగుల్ ట్రెండింగ్‌లో కూడా సునాక్ పేరు నిలిచింది. అవ్వడానికి బిలియనీర్..కానీ క్యాంపెయిన్ అనే పదాన్ని సరిగ్గా రాయలేకపోయారని ఒక యూజర్ కమెంట్ చేశారు. మరోవైపు వీటిపి రిషి సునాక్ స్పందించారు..తన స్లోగన్ రడీ ఫర్ రిషిలా...రడీ ఫర్స్పెల్ చెక్ అంటూ హుందాగా సమాధామిచ్చారు. కాగా బ్రిటన్ ప్రధాని పదవి కోసం రిషి సునాక్, పెన్నీ మార్డౌట్‌తో సహా మరో ఐదుగురి మధ్య పోటీ సాగుతోంది. మొదటి రౌండ్లో నాలుగింట ఒక వంతు ఓట్లను సాధించి, రెండో రౌండ్లో మూడు అంకెలకు పైగా సాధించిన ఏకైక వ్యక్తిగా నిలిచారు. ప్రచారంలో భాగంగా మిగిలిన ప్రత్యర్థులు వాణిజ్య మంత్రి పెన్నీ మోర్డాంట్, విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రస్, మాజీ మంత్రి కెమీ బాడెనోచ్, టోరీ బ్యాక్ బెంచర్ టామ్ తుగెన్ధాట్లతో వారాంతపు టెలివిజన్ డిబేట్లలో పాల్గొననున్నారు రిషి. Slick https://t.co/OXNLfiwNul — Guido Fawkes (@GuidoFawkes) July 15, 2022 When people ask me why I'm supporting @RishiSunak for leader, here's why: Not only does he have the right skills and experience to be our next PM, but the right character, too. He's a thoroughly decent person - as this clip from last night's debate shows...#Ready4Rishi pic.twitter.com/oP8F15tJOg — Nigel Huddleston MP (@HuddlestonNigel) July 16, 2022 -
కలకలం రేపిన చంద్రబాబు వ్యాఖ్యలు
120 ఏళ్ల చరిత్ర కలిగిన సీఐఐని ఉద్దేశించి సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వెల్లువెత్తుతున్న విమర్శలు విస్మయం వ్యక్తం చేస్తున్న పారిశ్రామికవేత్తలు సోషల్ మీడియాలో వ్యంగ్యచిత్రాలతో ఎద్దేవా చేస్తున్న నెటిజన్లు తనను తాను పొగుడుకోవడం కోసం సీఐఐని తక్కువ చేయడం సరికాదంటూ హితవు సాక్షి, అమరావతి: దేశ పారిశ్రామికాభివృద్ధి కోసం 120 ఏళ్లుగా విశేష కృషి చేస్తున్న కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్(సీఐఐ)పై సీఎం చంద్రబాబు ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. 1991లో దేశంలో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల్లో కీలకపాత్ర పోషించిన సీఐఐని పట్టుకొని.. తాను గతంలో సీఎంగా పనిచేసినప్పుడు సీఐఐ చిన్న సంస్థ అని, దాన్ని తానే ప్రమోట్ చేశానని చంద్రబాబు వ్యాఖ్యానించడంపై పారిశ్రామిక వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. తనను తాను పొగుడుకోవడం కోసం ఇతర సంస్థల స్థాయిని తగ్గిస్తూ మాట్లాడటం తగదని సీఐఐ ఏపీ చాప్టర్‌కి చెందిన ఉన్నతస్థాయి ప్రతినిధి ఒకరు ముఖ్యమంత్రికి హితవు పలికారు. మరోవైపు సీఎం వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు వ్యంగ్య చిత్రాలతో విరుచుకుపడుతున్నారు. త్వరలో ఐక్యరాజ్యసమితి ప్రధానకార్యాలయాన్ని సైతం అమరావతికి తీసుకొచ్చేస్తారంటూ సోషల్‌మీడియాలో పలువురు చేస్తున్న పోస్టులు వైరల్ అయ్యాయి. విశాఖలో ఈనెల 27, 28 తేదీల్లో జరిగిన భాగస్వామ్య సదస్సు ముగింపు సందర్భంగా సీఎం చంద్రబాబు విలేకరులతో మాట్లాడుతూ.. దేశంలో సంస్కరణలకు తాను ఆద్యుడినని, సీఐఐని తానే ప్రమోట్ చేశానని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా దావోస్‌ను అమరావతికే తీసుకొస్తానని సీఎం చెప్పడంతో పారిశ్రామికవేత్తలు నోరెళ్లబెట్టారు. ఒక ముఖ్యమంత్రి ఈవిధంగా మాట్లాడుతుంటే.. ఏమనాలో అర్థం కావడం లేదన్నారు. సీఐఐ అనేది కేవలం కంపెనీలు, కార్పొరేట్ సంస్థల సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి కోసం పనిచేసే స్వతంత్ర సంస్థ. అటువంటి సంస్థకు కూడా ఇప్పుడు సీఎం రాజకీయరంగు పులిమారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే సీఐఐ ప్రతినిధులను పక్కన పెట్టుకొని రాజకీయ విమర్శలు చేశారు. దీంతో వేదికపై ఉన్న సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ సదరన్ రీజియన్ చైర్మన్ రమేష్ దాట్ల ఇబ్బందికి గురయ్యారు. దీన్ని గమనించిన సీఎం వారిని వెళ్లిపొమ్మని చెప్పారే గానీ.. రాజకీయ విమర్శలు మాత్రం ఆపలేదు. సీఐఐది 120 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర.. ఐదు ఇంజనీరింగ్ తయారీ సంస్థలతో 1895లో ఇంజనీరింగ్ అండ్ ఐరన్ ట్రేడ్స్ అసోసియేషన్‌గా సీఐఐ ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత 1912లో ఇండియన్ ఇంజనీరింగ్ అసోసి యేషన్, 1942లో ఇంజనీరింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాగా పేర్లు మార్చుకుంది. అప్పటివరకు కేవలం బ్రిటిష్ కంపెనీల కోసమే పనిచేసిన ఈ సంస్థ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1947లో అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్‌గా రూపాంతరం చెందింది. ఆ తర్వాత 1986లో కాన్ఫడరేషన్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీ (సీఈఐ)గా జాతీయ స్థాయిలో సేవలందించింది. 1991 వరకు ఇంజనీరింగ్ రంగానికే పరిమితమైన ఈ సంస్థ.. 1992లో కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ)గా మారింది. ప్రస్తుతం సీఐఐలో 8,000 మందికి ప్రత్యక్ష సభ్యత్వముండగా, పరోక్షంగా 2 లక్షల సంస్థలకు సభ్యత్వముంది. అలాగే సీఐఐ మొత్తం 64 కార్యాలయాలను కలిగి ఉండగా ఇందులో తొమ్మిది సెంటర్ ఫర్ ఎక్సలెన్సీలు, విదేశాల్లో 8 చోట్ల కార్యాలయాలున్నాయి.