Finfluencer PR Sundar To Keep Away From Market One Year Rs 6 Cr To Be Disgorged, See Details - Sakshi
Sakshi News home page

చేసిన పాపం ఎక్కడికి పోతుంది సుందరా! అనుభవించు: నెటిజన్లు ఫైర్‌

Published Sat, May 27 2023 11:11 AM | Last Updated on Sat, May 27 2023 12:27 PM

Finfluencer PR Sundar - Sakshi

సాక్షి,ముంబై: ఫైనాన్షియల్ ఇన్‌ఫ్లుయెన్సర్ (ఫిన్‌ఫ్లుయెన్సర్) పీఆర్‌ సుందర్‌కు సెబీ భారీ షాకిచ్చింది. మార్కెట్ రెగ్యులేటరీ సెబీనుంచి అవసరమైన రిజిస్ట్రేషన్ లేకుండానే ఇన్వెస్ట్‌మెంట్‌ సలహాలపై ఫిర్యాదులు, భారీగా ఫీజు దండుకున్న ఆరోపణలపై సెబీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై రూ.6 కోట్ల పెనాల్టీ విధించింది. దీంతో పాటు ఒక సంవత్సంపాటు సెక్యూరిటీల లావాదేవీలు నిర్వహించకుండా నిషేధం విధించింది.

దీంతో కర్మ ఊరికే పోదు..ఏదో ఒక రోజు అనుభవించాల్సిందే అంటూ నెటిజన్లు  కమెంట్‌ చేశారు. పీఆర్‌ సుందర్‌  తప్పుడు  ట్రేడింగ్ కాల్స్ ఇస్తారని, దీనికి  ఫీజులు  కూడా బాగానే దండుకున్నారంటూ కొంతమంది ట్విటర్‌ వినియోగదారులు  మండిపడ్డారు. అతని ఇంటి విలువ 30 కోట్లు రోల్స్ రాయిస్ , ల్యాండ్ రోవర్ కూడా ఉన్నాయంటూ మరొక యూజర్‌ కమెంట్‌ చేశారు. ఇది అతనికి పెద్ద లెక్కకాదని, ఇప్పటికే భారీగానే సంపాదించేశాడని, ఇపుడిక మరోదారి వెతుక్కుంటాడు అని ఇంకొందరు వ్యాఖ్యానించడం విశేషం. 

సుందర్‌ నిర్వహణలో అడ్వైజరీతోపాటు,  టెలిగ్రామ్‌లో, యూట్యూబ్‌, ట్విటర్‌ ద్వారా రోజువారీ కాల్స్‌, లావాదేవీలపై సూచనలు సలహాలిస్తారనీ,  దీనికి రేజర్‌పే లింక్‌తో సహా చెల్లింపు లింక్‌ను అందించింది. రేజర్‌పే, డైరెక్ట్ క్రెడిట్ ద్వారా మాన్సన్ బ్యాంక్ ఖాతాలో రూ. 4.36 కోట్లు ,రూ. 23.5 లక్షలకు పైగా వసూలు చేసిందని సెబీ సెటిల్‌మెంట్ ఆర్డర్‌లో పేర్కొంది. దీనికి రూ. 6 కోట్లు చెల్లించడంతోపాటు, సెటిల్‌మెంట్ ఆర్డర్ పాస్ అయినప్పటి నుండి ఒక సంవత్సరం పాటు సెక్యూరిటీలను కొనడం, విక్రయించడం లేదా ఇతరత్రా లావాదేవీలు చేయకుండా  కట్టడి చేసింది.

ఆరోపణలపై నోటీసులు జారీ తరువాత సెబీ హై-పవర్డ్ అడ్వైజరీ కమిటీ ఫిబ్రవరి 22, 2023న జరిగిన సమావేశం జరిగింది. అనంతరం ఏప్రిల్ 3, 2023న సెటిల్‌మెంట్ రెగ్యులేషన్స్‌లోని రెగ్యులేషన్ 15 ప్రకారం,  హోల్ టైమ్ మెంబర్స్ ప్యానెల్   సిఫార్సును ఆమోదించి,  ఏప్రిల్ 06 దరఖాస్తుదారులకు తెలియజేసినట్టు సెబీ పేర్కొంది.
దీని ప్రకారం సెటిల్‌మెంట్ మొత్తాన్ని చెల్లించి, ఆర్జించిన లాభంతో సహా రూ. 6 కోట్లకు పైగా  సొమ్మును జమ చేసేందుకు అంగీకరించారు. మూడు సంస్థలు ఒక్కొక్కటి రూ. 15.60 చొప్పున మొత్తం రూ.46.80 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. జూన్ 1, 2020 నుండి ఫిబ్రవరి 2023లో చేరిన సవరించిన సెటిల్‌మెంట్ నిబంధనలను (RST) సమర్పించే తేదీ వరకు సంవత్సరానికి 12 శాతం వడ్డీతో సహా రూ. 6,07,69,863 డిస్‌గోర్జ్‌మెంట్ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

కాగా పీఆర్‌ సుందర్‌, అతని  కంపెనీ మన్సన్ కన్సల్టింగ్, కంపెనీ కో-ప్రమోటర్ మంగయార్‌కరసి సుందర్‌కు సెబీ గతంలో షోకాజ్ నోటీసులు పంపింది. దీనిపై తాజాగా చర్యను చేపట్టింది.  ప్రధానంగా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, మ్యూచువల్ ఫండ్స్,ఇన్సూరెన్స్‌పై, ప్రధానంగా ఫేస్‌బుక్ ,ట్విటర్‌, టెలిగ్రాం లాంటి వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌లో పెట్టుబడిదారులకు సలహాలిచ్చే వారినే ఫిన్‌ఫ్లూయన్సర్ అంటారు.  దీనికి  ఫీజును కూడా వసూలు చేస్తారు. అయితే ఇలాంటి సేవలకు గాను  సంబంధిత వ్యక్తులకు సెబీ రిజిస్ట్రేషన్‌, అనుమతి తప్పనిసరి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement